ఆరోసారి భారత్‌కు ప్రపంచకప్.. ప్రధాని మోదీ ప్రశంసలు | Pm Modi Congratulate Team India Under 19 World Cup Won | Sakshi
Sakshi News home page

Team India Pm Modi: యువ టీమిండియాని ప్రశంసిస్తూ ప్రధాని మోదీ ట్వీట్

Feb 6 2026 11:03 PM | Updated on Feb 6 2026 11:03 PM

Pm Modi Congratulate Team India Under 19 World Cup Won

కుర్రాళ్లు కుమ్మేశారు. ఏకంగా ఆరోసారి అండర్-19 ప్రపంచకప్ విజేతగా టీమిండియా నిలిచింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శుక్రవారం జరిగిన ఫైన‌ల్‌లో ఇంగ్లండ్‌ని 100 ప‌రుగుల తేడాతో యువ భార‌త్ ఓడించింది. అలా ఆరో వ‌ర‌ల్డ్‌క‌ప్‌ని టైటిల్‌ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ.. యువ జట్టుని అభినందిస్తూ ట్వీట్ చేశారు.

'భారత క్రికెట్ ప్రతిభ మెరిసింది. మన అండర్-19 జట్టు ప్రపంచకప్ సాధించినందుకు గర్వంగా ఉంది. టోర్నీ ఆసాంతం అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలానే ఆకట్టుకునే ప్రతిభ చూపించింది. ఈ విజయం చాలామంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. గెలిచిన ఆటగాళ్లకు నా అభినందనలు' అని మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా యువ టీమిండియాని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ఇంగ్లండ్ కష్టపడినప్పటికీ 311 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. గతంలో 2000, 2008, 2012, 2018, 2022లో వరల్డ్‌కప్ సొంతం చేసుకుంది.

టీమిండియా యువ క్రికెటర్ వైభ‌వ్ సూర్య‌వంశీ.. ఈ టోర్నీ చ‌రిత్ర‌లో చిర‌స్మ‌ర‌ణీయంగా నిలిచిపోయే ఇన్నింగ్స్.. ఫైనల్‌లో ఆడాడు. 14 ఏళ్ల వైభ‌వ్.. త‌న బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు (15 ఫోర్లు, 15 సిక్సర్లు) చేసి ఫైనల్ మ్యాచ్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 

Advertisement
 
Advertisement
Advertisement