వైభవ్ విశ్వరూపం.. వ‌ర‌ల్డ్ రికార్డులు బ‌ద్ద‌లు | Vaibhav Suryavanshi shatters records enroute epic 175 | Sakshi
Sakshi News home page

వైభవ్ విశ్వరూపం.. వ‌ర‌ల్డ్ రికార్డులు బ‌ద్ద‌లు

Feb 6 2026 9:30 PM | Updated on Feb 7 2026 7:36 AM

Vaibhav Suryavanshi shatters records enroute epic 175

అండర్-19 ప్రపంచకప్ 2026 విజేత‌గా భార‌త్ నిలిచింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జ‌రిగిన ఫైన‌ల్లో 100 ప‌రుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా.. రికార్డుస్దాయిలో ఆరోసారి వ‌ర‌ల్డ్‌క‌ప్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ విజ‌యంలో యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్యవంశీది కీల‌క పాత్ర. తుది పోరులో వైభ‌వ్ త‌న విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించాడు.

ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన సూర్య‌వంశీ.. క్రీజులో కుదుర్కొన్నాక ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. కేవ‌లం 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 175 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 150 పరుగులు కేవలం ఫోర్లు, సిక్సర్ల రూపంలోనే రావడం విశేషం. అత‌డి విధ్వంసం ఫ‌లితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల న‌ష్టానికి 411 ప‌రుగుల భారీ స్కోరు సాధించింది. అనంత‌రం 412 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో ఇంగ్లండ్ 311 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో తుపాన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్య‌వంశీ ప‌లు వ‌ర‌ల్డ్ రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

వ‌ర‌ల్డ్ రికార్డులు బ‌ద్ద‌లు
👉అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో అత్య‌ధిక‌ వ్య‌క్తిగ‌త స్కోరు(175) సాధించిన ప్లేయ‌ర్‌గా వైభ‌వ్ నిలిచాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు ఉన్మక్త్ చంద్(111*) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో చంద్‌ను వైభ‌వ్ అధిగ‌మించాడు.

👉అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 55 బంతుల్లోనే వైభ‌వ్ సెంచ‌రీ సాధించాడు.

👉అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ బాదిన అతని పిన్న వయస్కుడు కూడా సూర్య‌వంశీనే కావ‌డం విశేషం.

👉అండర్-19 ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆట‌గాడు మైఖేల్ హిల్(12) పేరిట ఉండేది.

👉అండర్-19 వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీలో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ప్లేయ‌ర్‌గా వైభ‌వ్ (30) నిలిచాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement