వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో వైభవ్ విధ్వంసం.. జ‌స్ట్ డ‌బుల్ సెంచ‌రీ మిస్‌ | Vaibhav Suryavanshi races to 55-ball century in U19 World Cup 2026 final | Sakshi
Sakshi News home page

Vaibhav Suryavanshi: వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో వైభవ్ విధ్వంసం.. జ‌స్ట్ డ‌బుల్ సెంచ‌రీ మిస్‌

Feb 6 2026 3:31 PM | Updated on Feb 6 2026 3:59 PM

Vaibhav Suryavanshi races to 55-ball century in U19 World Cup 2026 final

అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తుది పోరులో వైభ‌వ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్ర‌త్యర్ధి బౌల‌ర్లను ఉతికారేశాడు. అత‌డి బ్యాటింగ్ తుఫాను ముందు బౌండ‌రీలు చిన్న‌బోయాయి.

ఈ క్రమంలో కేవ‌లం 55 బంతుల్లోనే వంద పరుగుల మార్కును వైభవ్ అందుకున్నాడు. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన ప్లేయ‌ర్‌గా వైభవ్ రికార్డులకెక్కాడు. తొలి స్దానంలో ఆస్ట్రేలియాకు చెందిన విల్ మలాజ్జుక్(51) ఉన్నాడు. అయ‌తే ఈ ఫైన‌ల్ మ్యాచ్‌లో వైభ‌వ్ సునాయసంగా డ‌బుల్ సెంచ‌రీ సాధిస్తాడ‌ని అంతా భావించారు. 

కానీ ద్విశ‌తకానికి 25 పరుగుల దూరంలో అత‌డు నిలిచిపోయాడు. ఓ భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి సూర్య‌వంశీ త‌న వికెట్‌ను కోల్పోయాడు. ఓవ‌రాల్‌గా 80 బంతులు ఎదుర్కొన్న వైభ‌వ్‌..15 ఫోర్లు,  15 సిక్స్‌ల‌తో 175 పరుగులు చేశాడు. అత‌డి విధ్వంసం ఫ‌లితంగా భార‌త్ స్కోర్‌ 25 ఓవ‌ర్ల‌కే 250 ప‌రుగుల మార్క్ దాటిపోయింది.

కెప్టెన్ ఆయుష్ మాత్రేతో క‌లిసి  వైభవ్ సూర్యవంశీ రెండో వికెట్‌కు 142 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కాగా ఈ మ్యాచ్‌లో తుపాన్ ఇన్నింగ్స్ ఈ బిహార్ ఆట‌గాడు ప‌లు వ‌ర‌ల్డ్ రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.

చ‌రిత్ర సృష్టించిన వైభ‌వ్‌
అండర్-19 ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆట‌గాడు మైఖేల్ హిల్(12) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మైఖేల్ హిల్ రికార్డును వైభ‌వ్(15) బ్రేక్ చేశాడు. అదేవిధంగా అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భార‌త ఆట‌గాడిగా 14 ఏళ్ల వైభ‌వ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు రాజ్ అంగద్ బావా పేరిట ఉండేది. అత‌డు 2022లో ఉగాండాపై 69 బంతుల్లో సెంచరీ సాధించాడు.



 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement