WC: చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ.. వరల్డ్‌ రికార్డు | U19 WC 2026 Final Ind vs Eng: Vaibhav Suryavanshi History World Record | Sakshi
Sakshi News home page

WC: చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ.. వరల్డ్‌ రికార్డు

Feb 6 2026 2:28 PM | Updated on Feb 6 2026 3:35 PM

U19 WC 2026 Final Ind vs Eng: Vaibhav Suryavanshi History World Record

భారత యువ క్రికెట్‌ తరంగం వైభవ్‌ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తన ఖాతాలో మరో ప్రపంచ రికార్డును జమ చేసుకున్నాడు. ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నమెంట్లో ఇప్పటి వరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, యూత్‌ వన్డేల్లో అతి పిన్న వయసులోనే ఫాస్టెస్ట్‌ సెంచరీలు నమోదు చేసిన వైభవ్‌ సూర్యవంశీ ప్రస్తుతం అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీతో బిజీగా ఉన్నాడు. ఈ ఐసీసీ ఈవెంట్లో ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత్‌ ఫైనల్‌కు చేరింది.

55 బంతుల్లో సెంచరీ
ఇందులో భాగంగా శుక్రవారం నాటి టైటిల్‌ పోరులో ఇంగ్లండ్‌తో తలపడుతున్న ఆయుశ్‌ మాత్రే బృందం.. హరారే వేదికగా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లలో ఆరోన్‌ జార్జ్‌ (9) విఫలం కాగా.. 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ నెమ్మదిగా ఆరంభించినా వేగం పెంచాడు. ఫలితంగా 32 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న పద్నాలుగేళ్ల ఈ చిచ్చర పిడుగు..  55 బంతుల్లో సెంచరీ సాధించాడు.

ఈ క్రమంలో ఐదు సిక్సర్లు బాదిన వైభవ్‌ సూర్యవంశీ.. ఈ ఎడిషన్‌లో ఇరవై సిక్స్‌లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ చరిత్రకెక్కాడు. మొత్తంగా 80 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌ సూర్యవంశీ 15 ఫోర్లు, 15 సిక్సర్లు బాది ఏకంగాఇ 175 పరుగులు సాధించాడు. అయితే, లమ్స్‌డన్‌ బౌలింగ్‌లో థామస్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో వైభవ్‌ డబుల్‌ సెంచరీ చేయకుండానే నిష్క్రమించాడు.

అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు
🏏వైభవ్‌ సూర్యవంశీ- 2026లో 20*
🏏డెవాల్డ్‌ బ్రెవిస్‌- 2022లో 18
🏏ఫిన్‌ అలెన్‌- 2016, 2018లో కలిపి 18
🏏జాక్‌ బర్న్‌హామ్‌- 2016లో 15
🏏మైకేల్‌ హిల్‌-2008లో 14
🏏నికోలస్‌ పూరన్‌- 2014లో 14.

వరల్డ్‌కప్‌-2026 ఫైనల్‌ భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ తుదిజట్లు
భారత్‌
ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (కెప్టెన్‌), విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(వికెట్‌ కీపర్‌), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్

ఇంగ్లండ్‌
బెన్ డాకిన్స్, జోసెఫ్ మూర్స్, బెన్ మేయెస్, థామస్ రూ (వికెట్‌ కీపర్‌/కెప్టెన్‌), కాలేబ్ ఫాల్కనర్, రాల్ఫీ ఆల్బర్ట్, ఫర్హాన్ అహ్మద్, సెబాస్టియన్ మోర్గాన్, జేమ్స్ మింటో, మానీ లమ్స్‌డెన్, అలెక్స్ గ్రీన్

చదవండి: మాపై ఉగ్రదాడి జరిగింది: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగేలా శ్రీలంక లేఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement