breaking news
India u19 vs England U19
-
సునామీ శతకంతో విరుచుకుపడ్డ వైభవ్.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్
భారత యువ క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. నాలుగో యూత్ వన్డేలో ఇంగ్లండ్ అండర్-19 జట్టును చిత్తు చేసింది. ఏకంగా 55 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.వోర్సెస్టర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ అండర్-19 జట్టు.. తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఆయుశ్ మాత్రే విఫలం కాగా.. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi), వన్‌డౌన్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా (Vihaan Malhotra) దుమ్ములేపారు. వైభవ్ సునామీ శతక ఇన్నింగ్స్‌వైభవ్ కేవలం 52 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మొత్తంగా 78 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 143 పరుగులు సాధించాడు. అయితే, బెన్ మేయ్స్ బౌలింగ్‌లో జోసెఫ్ మూర్స్‌కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ సునామీ శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఇక విహాన్ 121 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 129 పరుగులు సాధించాడు. మిగతా వారిలో కెప్టెన్ అభిజ్ఞాన్ ముకుంద్.. 23 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. రాహుల్ కుమార్, హర్వన్ష్ పంగాలియా డకౌట్ అయ్యారు. కనిష్క్ చౌహాన్ (2), ఆర్ఎస్ అంబరీష్ (9), దీపేశ్ దేవేంద్రన్ (3) విఫలం కాగా.. యుధాజిత్ గుహ 15, నమన్ పుష్పక్ 2 పరుగులతో అజేయంగా నిలిచారు.ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది.రాకీ ఫ్లింటాఫ్ అద్భుత సెంచరీ వృథాఇంగ్లండ్ బౌలర్లలో జాక్ హోమ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. సెబాస్టియన్ మోర్గాన్ మూడు వికెట్లు తీశాడు. బెన్ మేయ్స్, జేమ్స్ మింటో చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఇక భారత్ విధించిన 364 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 308 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు బెన్ డాకిన్స్ (67), జోసెఫ్ మూర్స్ (52) అర్ధ శతకాలు బాదగా.. రాకీ ఫ్లింటాఫ్ అద్భుత సెంచరీ (91 బంతుల్లో 107) వృథాగా పోయింది. భారత బౌలర్లలో నమన్ పుష్పక్ మూడు వికెట్లు, ఆర్ అంబరీష్ రెండు వికెట్లు కూల్చి ప్రత్యర్థిని దెబ్బకొట్టగా.. దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇరుజట్ల మధ్య నామమాత్రపు ఐదో యూత్ వన్డే సోమవారం వోర్సెస్టర్లోనే జరుగనుంది.ఇక ఐదు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లింది భారత జట్టు. మొదటి, మూడు, నాలుగో యూత్ వన్డేల్లో గెలిచిన 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. చదవండి: వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు.. -
వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు.. విహాన్ శతకం.. భారత్ భారీ స్కోరు
ఇంగ్లండ్ గడ్డ మీద భారత యువ జట్టు అదరగొడుతోంది. ఆతిథ్య అండర్-19 జట్టుతో ఐదు యూత్ వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్.. నాలుగో మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించింది.వోర్సెస్టర్ వేదికగా శనివారం యూత్ వన్డేలో టాస్ ఓడిన భారత అండర్-19 జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే, ఆదిలోనే భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఆయుశ్ మాత్రే 14 బంతులు ఎదుర్కొన్ని కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.దీంతో ఆదిలోనే వికెట్ తీసినందుకు ఇంగ్లండ్ సంబరాలు చేసుకోగా.. ఆ ఆనందాన్ని భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కాసేపట్లోనే ఆవిరి చేశాడు. మరోసారి బ్యాట్‌తో వీర విహారం చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.ఆ తర్వాత కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. 52 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా యూత్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీని తన పేరిట నమోదు చేసుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 78 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ బౌలింగ్‌ను చితక్కొడుతూ 143 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్ బౌలింగ్‌లో పదమూడు ఫోర్లతో పాటు ఏకంగా పది సిక్సర్లు ఉండటం విశేషం.ఇక వైభవ్ వరుసగా ఇలా నాలుగో మ్యాచ్‌లో సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడితే.. వన్‌డౌన్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా కూడా శతకంతో చెలరేగాడు. 121 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 129 పరుగులు సాధించాడు. అయితే, వీరిద్దరు అవుటైన తర్వాత భారత ఇన్నింగ్స్ నెమ్మదించింది.మిగతా వారిలో కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు 23 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. రాహుల్ కుమార్ (0), హర్వన్ష్ పంగాలియా (0), కనిష్క్ చౌహాన్ (2) పూర్తిగా విఫలమయ్యారు. ఇక ఆర్ఎస్ అంబరీష్ (9), దీపేశ్ దేవేంద్రన్ (3) కూడా చేతులెత్తేయగా.. యుధాజిత్ గుహ 15, నమన్ పుష్పక్ రెండు పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు.ఫలితంగా భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 363 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ అండర్-19 బౌలర్లలో జాక్ హోమ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. సెబాస్టియన్ మోర్గాన్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇతరులలో బెన్ మేయ్స్, జేమ్స్ మింటో ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇదిలా ఉంటే.. తొలి యూత్ వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలవగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఒక వికెట్ తేడాతో గట్టెక్కింది. ఈ క్రమంలో మూడో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించి సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉంది. కీలకమైన నాలుగో మ్యాచ్‌లో గెలిచి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. కాగా భారత్ విజయాల్లో వైభవ్ సూర్యవంశీ ( 48 (19) - 45 (34)- 86 (31))దే కీలక పాత్ర.వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు..యూత్ వన్డే చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. 14 ఏళ్ల 100 రోజుల వయసులోనే ఈ ఘనత సాధించాడు. ప్రపంచంలో ఈ ఫీట్ అందుకున్న తొలి ఆటగాడు వైభవ్. అంతేకాదు.. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ నజ్ముల్ షాంటో (2009లో 14 ఏళ్ల 241 రోజుల వయసులో శతకం) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కూడా ఈ సందర్భంగా బద్దలు కొట్టాడు. -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. మరోసారి సునామీ ఇన్నింగ్స్
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అద్భుత ఫామ్ కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో యూత్ వన్డేల్లో పద్నాలుగేళ్ల ఈ చిచ్చరపిడుగు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. హోవ్ వేదికగా ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో తొలి వన్డేలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ దుమ్ములేపిన విషయం తెలిసిందే. కేవలం 19 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో.. 252కు పైగా స్ట్రైక్‌రేటుతో 48 పరుగులు సాధించాడు.వరుసగా నాలుగో మ్యాచ్‌లో..ఇక రెండో యూత్ వన్డేలో 34 బంతుల్లో 45 పరుగులతో ఫర్వాలేదనిపించిన వైభవ్.. మూడో మ్యాచ్‌లో మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. నార్తాంప్టన్ వేదికగా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 31 బంతుల్లో ఆరు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు బాది 86 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.వైభవ్ వీరబాదుడుతాజాగా వోర్సెస్టర్ వేదికగా నాలుగో యూత్ వన్డేలో వైభవ్ సూర్యవంశీ మరోసారి బ్యాట్ ఝులిపించాడు. ఇంగ్లండ్ బౌలింగ్‌ను చితక్కొడుతూ కేవలం 24 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. ఇందులో 46 పరుగులు బౌండరీల ద్వారానే రావడం విశేషం. దీనిని బట్టి వైభవ్ వీరబాదుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.ఫాస్టెస్ట్ సెంచరీఅంతటితో వైభవ్ పరుగుల దాహం తీరలేదు. అర్ధ శతకాన్ని సెంచరీగా మార్చేశాడు యువ సంచలనం. కేవలం 52 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని.. తన వీరవిహారాన్ని కొనసాగిస్తున్నాడు. కాగా యూత్ వన్డేలలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ అని తెలుస్తోంది.కాగా ఐదు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలి మూడు యూత్ వన్డేల్లో రెండు గెలిచిన ఆయుశ్ మాత్రే సేన.. శనివారం నాలుగో మ్యాచ్‌లోనూ దుమ్ములేపుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్.. సగం ఆట అంటే 25 ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్ నష్టానికి 216 పరుగులు సాధించింది. ఓపెనర్ ఆయుశ్ మాత్రే (5) మరోసారి నిరాశపరచగా.. వైభవ్ 74 బంతుల్లో 140, విహాన్ మల్హోత్రా 62 బంతుల్లో 47 పరుగులతో ఆడుతున్నారు.143 పరుగులు చేసి అవుట్..ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 78 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ.. 143 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లతో పాటు 10 సిక్సర్లు ఉన్నాయి. అయితే, బెన్ మాయెస్ బౌలింగ్‌లో జోసెఫ్ మూరేస్కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ విధ్వంసకర శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది. చదవండి: కోహ్లి, రోహిత్ కాదు!.. వైభవ్ సూర్యవంశీ రోల్‌మోడల్ ఆ సూపర్‌స్టారే!