వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే హాట్‌టాపిక్. ఫార్మాట్ ఏదైనా ఈ పాలబుగ్గల పిల్లాడికి బంతిని బౌండరీకి తరలించడమే తెలుసు.. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు పీడకలను మిగల్చడం ఈ యువ బ్యాటర్‌కు అలవాటుగా మారింది..
ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీ-2026లో వైభవ్ ప్రదర్శనే ఇందుకు నిదర్శనం. పద్నాలుగేళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఈ ఈవెంట్లో ఏడు మ్యాచ్‌లలో కలిపి మూడు అర్ధ శతకాలు.. ఓ సెంచరీ సాధించాడు. ఆ శతకం కూడా ఫైనల్లో.. అదీ ఇంగ్లండ్ జట్టుపై ఏకంగా 175 పరుగులు సాధించడం విశేషం.
Carnage continues as Vaibhav Sooryavanshi brings up 150 in style! 🔥🤩
The English bowlers have no answers as the Boss Baby is going all guns blazing with towering sixes! 🙌🏻😮💨
ICC Men's #U19WorldCup | FINAL | #INDvENG | LIVE NOW 👉 https://t.co/ZFk8pN9tv3 pic.twitter.com/Dkh4YCXOEC— Star Sports (@StarSportsIndia) February 6, 2026
55 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్
వరల్డ్‌కప్ ఫైనల్లో 55 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్.. పలు చిరస్మరణీయ రికార్డులు నెలకొల్పాడు. పద్నాలుగేళ్ల వయసులోనే ఈ బిహారీ కుర్రాడు.. వరల్డ్‌కప్ టోర్నీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవడంతో పాటు.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా అందుకున్నాడు.
Team India be like: Top karne ki aadat ho gayeli hai apun ko 🏆😎
The 6th trophy for Team India in the ICC Men’s #U19WorldCup 🇮🇳
Watch the highlights 👉 https://t.co/nXMmxDoivS pic.twitter.com/VDeA2PH3Gh— Star Sports (@StarSportsIndia) February 6, 2026
పుత్రోత్సాహం
ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్లో ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా సాగిన అతడి విధ్వంసం గురించే ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఇక వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. పుత్రోత్సాహంతో ఆయన ఉప్పొంగిపోతున్నారు.
అప్పటిదాకా బిగ్ క్రికెటర్ అని ఒప్పుకోను
ఈ క్రమంలో సంజీవ్ సూర్యవంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘ఇది కేవలం ఆరంభం మాత్రమే. తను సాధించాల్సింది ఇంకెంతో ఉంది. వైభవ్ టెస్టు మ్యాచ్ ఆడేదాకా తననొక స్టార్ క్రికెటర్‌గా నేను పరిగణించను’’ అని సంజీవ్ సూర్యవంశీ టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు.
అదే విధంగా.. ‘‘నువ్వెంత గొప్పగా ఆడితే అంత హుందాగా, ఒద్దికగా ఉండాలని తనకు చెబుతూ ఉంటాను. సీనియర్లు, కోచ్‌లతో చర్చిస్తూ లోపాలు సరిచేసుకోవాలని చెప్తాను. ‘అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ చేశావు.. భేష్.. అయితే, ఇప్పుడు అది ముగిసిన అధ్యాయం.
టెస్టు క్రికెట్ ఆడటమే లక్ష్యం
టీమిండియా తరఫున టెస్టు క్రికెట్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకోవాలి’ అని తనకు చెప్పాను. సచిన్ టెండుల్కర్‌ను చూసి ఓ క్రికెటర్ ఎలా ఉండాలో నేర్చుకోవాలని తనకి బోధించాను. టన్నుల కొద్దీ పరుగులు సాధించినా.. ఆయన ఎప్పుడూ ఒక్క వివాదంలోనూ చిక్కుకోలేదు.
క్రికెట్ ప్రపంచం మొత్తం ఆయనను ఆరాధిస్తున్న తీరు గురించి తరచూ చెబుతూ ఉంటాను’’ అని సంజీవ్ సూర్యవంశీ పేర్కొన్నారు. తద్వారా తన కుమారుడు కెరీర్‌లోనే కాదు వ్యక్తిత్వంలోనూ మిన్నగా ఉండేలా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పకనే చెప్పారు సంజీవ్.
చదవండి: IND vs PAK: శ్రీలంక లేఖ.. దిగొచ్చిన పాక్ బోర్డు? యూటర్న్?


