IND vs USA: టీమిండియా శుభారంభం.. అమెరికాపై గెలుపు | T20 WC 2026 IND vs USA Toss Playing XIs Updates Highlights | Sakshi
Sakshi News home page

T20 WC IND vs USA: టీమిండియా శుభారంభం.. అమెరికాపై గెలుపు

Feb 7 2026 6:35 PM | Updated on Feb 7 2026 10:44 PM

T20 WC 2026 IND vs USA Toss Playing XIs Updates Highlights

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో టీమిండియా ప్రయాణం మొదలైంది. గ్రూప్‌-‘ఎ’లో భాగంగా తొలుత యూఎస్‌ఏతో భారత్‌ తలపడుతోంది. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో టాస్‌ గెలిచిన యూఎస్‌ఏ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది.

సూర్య మెరుపు అర్ధ శతకం (49 బంతులలో 84) కారణంగా టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.  అమెరికా లక్ష్య ఛేదనకు దిగింది.

T20 World Cup 2026 India vs United States of America Updates
టీమిండియా శుభారంభం.. అమెరికాపై గెలుపు
ముంబై వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమిండియా.. 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.  తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ 84 పరుగులతో చేశాడు. ఛేదనలో అమెరికా జట్టు.. ఓవర్లన్నీ ఆడి 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగారు. సంజయ్ కృష్ణమూర్తి, శుభం రంజనే తలో 37 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పాటు అందించారు.

19 ఓవర్లకు స్కోరు 121-7
19 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 121-7 స్కోరుతో నిలిచింది. క్రీజులో శుభం 27, స్కాల్క్ 2 ఉన్నారు.

18 ఓవర్లకు స్కోరు 111-7
18 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 111-7 స్కోరుతో ఉంది. క్రీజులో శుభం 18, స్కాల్క్ 1 ఉన్నారు.

ఏడో వికెట్ కోల్పోయిన అమెరికా
అమెరికా ఏడో వికెట్ కోల్పోయింది. మహమ్మద్ మోసిన్ 8 పరుగులు చేసి అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

17 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 104-6
17 ఓవర్లు పూర్తయ్యేసరికి అమెరికా.. 6 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. శుభం 17, మోసిన్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.

16 ఓవర్లకు స్కోరు 100-6 
16 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 6 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. శుభం 15, మోసిన్ 1 క్రీజులో ఉన్నారు

ఆరో వికెట్ కోల్పోయిన అమెరికా
15.3: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో హర్మీత్ సింగ్ డకౌట్ అయ్యాడు. సిరాజ్ క్యాచ్ పట్టాడు.

ఐదో వికెట్ కోల్పోయిన యూఎస్ఏ
15.2: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సంజయ్ 37 పరుగుల దగ్గర క్యాచ్ ఔట్ అయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన అమెరికా

15 ఓవర్లకు స్కోరు 98-4
సంజయ్ 37, శుభం 14 పరుగులతో క్రీజులో ఉన్నారు

13 ఓవర్లలో అమెరికా స్కోరు: 78-4
సంజయ్‌ 26, శుభం 5 పరుగులతో ఉన్నారు.
నాలుగో వికెట్‌ డౌన్‌
11.6: వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో మిలింద్‌ కుమార్‌ (34) స్టంపౌట్‌. నాలుగో వికెట్‌ కోల్పోయిన అమెరికా. స్కోరు: 71-4. విజయానికి 48 బంతులో​ 91 పరుగులు కావాలి.

పది ఓవర్లలో అమెరికా స్కోరు: 49-3
పవర్‌ ప్లేలో అమెరికా స్కోరు: 31-3(6).
మిలింద్‌ 16, సంజయ్‌ 4 పరుగులతో ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన అమెరికా
3.2: సిరాజ్‌ బౌలింగ్‌లో సాయితేజ ముక్కామల (2) వరుణ్‌ చక్రవర్తికి క్యాచ్‌ ఇచ్చాడు. మిలింద్‌ రెండు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 13-3(3.2)

రెండో వికెట్‌ కోల్పోయిన అమెరికా
2.1: అర్ష్‌దీప్‌ బౌలింగ్లో అమెరికా కెప్టెన్‌ మోనాంక్‌ పటేల్‌ (0) శివం దూబేకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. స్కోరు: 11-2(2.1). సాయితేజ ముక్కామల రెండు పరుగులతో ఉండగా.. మిలింద్ కుమార్‌ క్రీజులోకి వచ్చాడు.

వికెట్‌ తీసిన సిరాజ్‌
1.4: అనూహ్యంగా వరల్డ్‌కప్‌ జట్టులోకి.. తుదిజట్టులోకి వచ్చిన సిరాజ్‌ టీమిండియా బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభించాడు. తొలి ఓవర్‌ నాలుగో బంతికే వికెట్‌ పడగొట్టాడు. సిరాజ్‌ బౌలింగ్లో తిలక్‌కు క్యాచ్‌ ఇచ్చి అమెరికా ఓపెనర్‌ ఆండ్రీ గౌస్‌ (6) వెనుదిరిగాడు.

టీమిండియా స్కోరు: 161-9(20)
తొమ్మిదో వికెట్‌ డౌన్‌
19.6: వరుణ్‌ చక్రవర్తి (0) రనౌట్‌.. తొమ్మిదో వికెట్‌ డౌన్‌

అర్ష్‌దీప్‌ అవుట్‌
18.6: షాల్‌విక్‌ బౌలింగ్‌లో... ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగిన అర్ష్‌దీప్‌ సింగ్‌ (4) 
సూర్యకుమార్‌ హాఫ్‌ సెంచరీ
36 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న సూర్యకుమార్‌

ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌
16.4: హర్మీత్‌ బౌలింగ్‌లో మొహ్సిన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగిన అక్షర్‌ పటేల్‌ (14). క్రీజులోకి  అర్ష్‌దీప్‌ సింగ్‌.  సూర్య 47 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 118-7(16.4)

అక్షర్‌, సూర్య ధనాధన్‌
15: నేత్రావల్కర్‌ బౌలింగ్లో అక్షర్‌ 4,4 బాదగా.. సూర్య 4, 6 బాదాడు. ఒకే ఓవరల్లో 21 పరుగులు. స్కోరు: 115-6 (16).

ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌
12.4: హర్మీత్‌ బౌలింగ్‌లో ఆరో వికెట్‌గా వెనుదిరిగిన హార్దిక్‌ పాండ్యా (5). క్రీజులోకి అక్షర్‌ పటేల్‌. స్కోరు: 85-6(13.5).
ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌
11.4: మొహ్సిన్‌ బౌలింగ్‌లో మిలింద్‌కు క్యాచ్‌ ఇచ్చి రింకూ సింగ్‌ అవుట్‌ (6). సూర్య 21 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 72-5(11.4) 
పది ఓవర్లలో టీమిండియా స్కోరు:  63-4 

శివం దూబే డకౌట్‌
5.6: వాన్‌ షాల్‌విక్‌ బౌలింగ్‌లో నేత్రావల్కర్‌కు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌ అయిన శివం దూబే. పవర్‌ప్లేలో టీమిండియా స్కోరు: 46-4(6)
తిలక్‌ వర్మ అవుట్‌
5.5: మూడో వికెట్‌గా వెనుదిరిగిన తిలక్‌ వర్మ (16 బంతుల్లో 25; మూడు ఫోర్లు, ఒక సిక్స్‌). వాన్‌ షాల్‌విక్‌ బౌలింగ్‌ మోనాంక్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన తిలక్‌. శివం దూబే క్రీజులోకి రాగా.. సూర్య 1 పరుగుతో ఉన్నాడు. స్కోరు: 46-3(5.5)
రెండో వికెట్‌ డౌన్‌
5.2: వాన్‌ షాల్‌విక్‌ బౌలింగ్‌లో మిలింద్‌ కుమార్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటైన ఇషాన్‌ కిషన్‌ (16 బంతుల్లో 20; 1 ఫోర్‌, రెండు సిక్స్‌లు). క్రీజులోకి సూర్యకుమార్‌ యాదవ్‌. తిలక్‌ 25 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 45-2(5.2).

నాలుగు ఓవర్లలో టీమిండియా స్కోరు: 33-1
తిలక్‌ 13 బంతుల్లో 23, ఇషాన్‌ 10 బంతుల్లో 10 పరుగులతో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌
1.2: అలీ ఖాన్‌ బౌలింగ్‌లో సంజయ్‌ కృష్ణమూర్తికి క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగిన అభిషేక్‌ శర్మ

 

తొలి ఓవర్లో ఏడు పరుగులు
కట్టుదిట్టంగా నేత్రావల్కర్‌ బౌలింగ్‌... ఇషాన్‌ 7, అభిషేక్‌ 0 పరుగులతో ఉన్నారు.

 

సంజూపై వేటు
ఇక ఊహించినట్లుగానే తుదిజట్టులో ఇషాన్‌ కిషన్‌కు చోటు దక్కగా.. సంజూ శాంసన్‌ (Sanju Samson)పై వేటు పడింది. ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌గా సంజూ స్థానాన్ని ఇషాన్‌ (Ishan Kishan) భర్తీ చేశాడు. కాగా గత కొంతకాలంగా సంజూ ఫామ్‌లేమితో సతమతమవుతున్న విషయం తెలిసిందే.

సిరాజ్‌కు లక్కీ ఛాన్స్‌
అదే విధంగా.. ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar) కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడని టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తెలిపాడు. ఇక పేస్‌ దళ నాయకుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. అతడి స్థానంలో మొహమ్మద్‌ సిరాజ్‌ను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు.

కాగా హర్షిత్‌ రాణా గాయపడటంతో సిరాజ్‌కు అదృష్టం కలిసి వచ్చింది. రాణా స్థానంలో ఈ హైదరాబాదీ పేసర్‌ను తీసుకున్నట్లు శుక్రవారం బీసీసీఐ ప్రకటించగా.. బుమ్రా అనారోగ్యం వల్ల ఏకంగా తుదిజట్టులోనూ సిరాజ్‌కు స్థానం దక్కడం విశేషం.

మరోవైపు.. యూఎస్‌ఏ కెప్టెన్‌ మోనాంక్‌ పటేల్‌ మాట్లాడుతూ.. పిచ్‌ బాగుందని.. ఇక్కడ భారీ స్కోరు నమోదుకు ఆస్కారం ఉందని పేర్కొన్నాడు. తమ తుదిజట్టులో ఆరుగురు బ్యాటర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లు, ముగ్గురు బౌలర్లు ఉన్నట్లు తెలిపాడు.

టీ20 ప్రపంచకప్‌-2026: భారత్‌ వర్సెస్‌ యూఎస్‌ఏ తుదిజట్లు
భారత్‌
ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్‌ సిరాజ్, వరుణ్ చక్రవర్తి

యూఎస్‌ఏ
ఆండ్రీస్ గౌస్(వికెట్‌ కీపర్‌), సాయితేజ ముక్కామల, మోనాంక్ పటేల్(కెప్టెన్‌), మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజానే, హర్మీత్ సింగ్, మహ్మద్ మొహ్సిన్, షాడ్లీ వాన్ షాల్‌విక్‌, అలీ ఖాన్, సౌరభ్ నేత్రావల్కర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement