India vs USA
-
అభిషేక్ శర్మ ఫెయిల్.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
భారీ అంచనాల నడుమ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అడుగుపెట్టిన భారత ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. విధ్వంసకర బ్యాటర్‌గా పేరొందిన అభిషేక్.. వరల్డ్‌కప్ టోర్నీలో ఇప్పటికి ఆడిన రెండు మ్యాచ్‌లలో పరుగుల ఖాతా తెరవనే లేదు.అగ్రస్థానంలో అభిషేక్పసికూన అమెరికాతో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన అభిషేక్ శర్మ (Abhishek Sharma).. తాజాగా పాకిస్తాన్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో నాలుగు బంతులు ఎదుర్కొని సున్నా చుట్టాడు. పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) బౌలింగ్‌లో షాహిన్ ఆఫ్రిదికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న అభిషేక్ శర్మ ఇలా విఫలం కావడం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.అయితే, టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కు దూసుకెళ్లడంతో అభిషేక్ వైఫల్యాలపై పెద్దగా చర్చ జరగడం లేదు. లేదంటే అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తేవి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి అభిషేక్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.రవిశాస్త్రి సూచనలు‘‘అతడి నుంచి స్థాయికి తగ్గ ప్రదర్శన రావాల్సి ఉంది. అందుకు ఇంకొంత సమయం పట్టవచ్చు. ఆటగాడి కెరీర్లో ఇలాంటివి సహజమే. అయితే, ఇందుకోసం ముందుగా అతడు తన పొరపాట్లు సరిచేసుకోవాలి.క్రీజులో నిలదొక్కుకునేందుకు కాస్త సమయం తీసుకోవాలి. వ్యూహాలను పక్కాగా అమలు చేయాలి. ఎందుకంటే.. డాట్ బాల్స్‌ను బౌండరీలు, సిక్సర్లుగా మలచడం అతడికి కొత్తేమీ కాదు. ఇందుకు అతడు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు.ఏదేమైనా క్రీజులో కుదురుకున్న తర్వాతే పని మొదలుపెట్టాలి’’ అని రవిశాస్త్రి అభిషేక్ శర్మకు సూచనలు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. పాక్‌పై టీమిండియా 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. సూపర్-8లో అడుగుపెట్టింది.అంతకు ముందు తొలుత అమెరికా.. అనంతరం నమీబియా జట్లపై టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు అభిషేక్ శర్మ దూరమయ్యాడు. పాక్‌తో మ్యాచ్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చి డకౌట్ అయి నిరాశపరిచాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. కాగా అభిషేక్ శర్మ కెరీర్లో ఇదే తొలి వరల్డ్‌కప్ అన్న సంగతి తెలిసిందే.చదవండి: IND vs PAK: అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణం వాళ్లే: పాక్ కెప్టెన్ -
ముకేశ్ అంబానీకి నో చెప్పిన రోహిత్ శర్మ!
టీమిండియా దిగ్గజ కెప్టెన్‌గా పేరొందాడు రోహిత్ శర్మ. భారత్‌కు 2024లో టీ20 ప్రపంచకప్ అందించిన హిట్‌మ్యాన్.. 2025లో చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచాడు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ కేవలం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. 2007లో టీ20 ప్రపంచకప్ టోర్నీ మొదలుకాగా ఇప్పటి వరకు అన్ని ఎడిషన్లలోనూ రోహిత్ భాగమయ్యాడు. అయితే, రిటైర్మెంట్ నేపథ్యంలో తొలిసారి టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో హిట్‌మ్యాన్ ప్రేక్షకుడిగా మిగిలిపోయాడు. ఇక పొట్టి ఫార్మాట్లో సత్తా చాటి తానేంటో నిరూపించుకున్న రోహిత్ శర్మను ఐసీసీ ఈసారి వరల్డ్‌కప్ అంబాసిడర్‌గా నియమించింది.వాంఖడేలో వరల్డ్‌కప్ ట్రోఫీతో ఎంట్రీఈ నేపథ్యంలో శనివారం ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవగా.. సొంత మైదానం ముంబైలోని వాంఖడేలో వరల్డ్‌కప్ ట్రోఫీతో ఎంట్రీ ఇచ్చాడు రోహిత్ శర్మ. అమెరికాతో మ్యాచ్ నేపథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పి.. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాడు.అంబానీ కుటుంబం ఆప్యాయతఇక భారత వ్యాపార దిగ్గజం, కుబేరుడు ముకేశ్ అంబానీ కుటుంబం కూడా ఈ మ్యాచ్‌కు హాజరైంది. భార్య నీతా, కుమారుడు ఆకాశ్ అంబానీ తదితరులతో కలిసి ముకేశ్ మ్యాచ్‌కు విచ్చేశారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పక్కకు వెళ్లాలని చూడగా.. ముకేశ్ అంబానీ మాత్రం అతడి చేయి పట్టుకుని ఆపి మరీ ఆకాశ్‌కు- తనకు మధ్య కూర్చోబెట్టుకున్నారు.ముకేశ్ అంబానీ స్వయంగా ఛాయ్ ఇవ్వగాఅంతేకాదు.. మధ్యలో టీతో పాటు స్నాక్స్‌తో కూడిన సాసర్ను ముకేశ్ అంబానీ రోహిత్ శర్మకు అందించారు. అయితే, రోహిత్ మాత్రం సున్నితంగా తిరస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Last night, Rohit Sharma was going to sit beside Ritika, but Mukesh Ambani asked him to sit next to him instead 🤍 pic.twitter.com/d9YEMXajlv— Kusha Sharma (@Kushacritic) February 8, 2026కాగా 2011 నుంచి రోహిత్‌కు అంబానీ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉంది. అంబానీల యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హిట్‌మ్యాన్ ఐదుసార్లు ట్రోఫీ అందించాడు. 2013 నుంచి పదేళ్లపాటు సారథిగా కొనసాగిన రోహిత్ శర్మను తప్పించి.. 2023లో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది ముంబై ఇండియన్స్. అయితే, రోహిత్ మాత్రం ఆటగాడిగా అదే జట్టుతో కొనసాగుతుండటం విశేషం.చదవండి: Gautam Gambhir: సతీసమేతంగా టీమిండియాకు ఘన స్వాగతం.. వీడియో వైరల్ -
టీమిండియా స్టార్ ఆటగాడికి అస్వస్థత
టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటున్న టీమిండియాను జ్వరాల పీడ వేధిస్తుంది. తొలుత బుమ్రా.. తాజాగా అభిషేక్ శర్మ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. జ్వరం కారణంగా బుమ్రా యూఎస్ఏతో మ్యాచ్‌కు దూరం కాగా.. అభిషేక్ నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యేలా ఉన్నాడు. అభిషేక్‌కు జ్వరంతో పాటు కడుపు నొప్పి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. నమీబియాతో మ్యాచ్ ఫిబ్రవరి 12న జరగాల్సి ఉంది. ఆ సమయానికి అభిషేక్ కోలుకుంటాడో లేదో చూడాలి.కాగా, నిన్న యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ జ్వరంతోనే బాధపడుతూనే బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో అతను దారుణంగా విఫలమయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే డకౌటయ్యాడు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (84 నాటౌట్) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. స్కై మినహా భారత ఇన్నింగ్స్‌లో మిగతా వారంతా విఫలమయ్యారు. తిలక్ వర్మ (25), ఇషాన్ కిషన్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అభిషేక్ శర్మ, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి డకౌట్లు అయ్యారు. రింకూ సింగ్ 6, హార్దిక్ పాండ్యా 5,అక్షర్ పటేల్ 14చ, అర్షదీప్ సింగ్ 4 పరుగులు చేశారు. యూఎస్ఏ బౌలర్లలో వాన్ స్కాల్విక్ 4, హర్మీత్ సింగ్ 2, మొహమ్మద్ మొహిసిన్, అలీ ఖాన్ తలో వికెట్ తీశారు.అనంతరం 162 పరుగుల లక్ష్య ఛేదనలో యూఎస్ఏ తడబడింది. సిరాజ్ (4-0-29-3), అర్షదీప్ సింగ్ (4-0-18-2), అక్షర్ పటేల్ (4-0-24-2), వరుణ్ చక్రవర్తి (4-0-24-1) ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమై, 24 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజనే తలో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిలింద్ కుమార్ 34 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లలో అండ్రియస్ గౌస్ 6, సాయితేజ ముక్కామల 2, మొహిసిన్ ఖాన్ 8, స్కాల్విక్ 2 (నాటౌట్) పరుగులు చేయగా.. మోనాంక్ పటేల్, హర్మీత్ సింగ్ డకౌట్లయ్యారు. -
చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. నిన్న (ఫిబ్రవరి 7) యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైన అతను.. భారత టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌లు గెలిచిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టాడు. విరాట్ 125 మ్యాచ్‌ల్లో 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిస్తే.. స్కై కేవలం 105 మ్యాచ్‌ల్లోనే 17 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచాడు. ఈ జాబితాలో స్కై, విరాట్ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ (159 మ్యాచ్‌ల్లో 14) ఉన్నాడు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచిన ఘనత మలేషియాకు చెందిన విరన్‌దీప్ సింగ్‌కు (22) దక్కుతుంది. విరన్‌దీప్ తర్వాతి స్థానాల్లో సికందర్ రజా (19), సూర్యకుమార్ (17) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 84 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్కై మినహా భారత ఇన్నింగ్స్‌లో మిగతా వారంతా విఫలమయ్యారు. తిలక్ వర్మ (25), ఇషాన్ కిషన్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అభిషేక్ శర్మ, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి డకౌట్లు అయ్యారు. రింకూ సింగ్ 6, హార్దిక్ పాండ్యా 5,అక్షర్ పటేల్ 14చ, అర్షదీప్ సింగ్ 4 పరుగులు చేశారు. యూఎస్ఏ బౌలర్లలో వాన్ స్కాల్విక్ 4, హర్మీత్ సింగ్ 2, మొహమ్మద్ మొహిసిన్, అలీ ఖాన్ తలో వికెట్ తీశారు.అనంతరం 162 పరుగుల లక్ష్య ఛేదనలో యూఎస్ఏ తడబడింది. సిరాజ్ (4-0-29-3), అర్షదీప్ సింగ్ (4-0-18-2), అక్షర్ పటేల్ (4-0-24-2), వరుణ్ చక్రవర్తి (4-0-24-1) ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజనే తలో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిలింద్ కుమార్ 34 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లలో అండ్రియస్ గౌస్ 6, సాయితేజ ముక్కామల 2, మొహిసిన్ ఖాన్ 8, స్కాల్విక్ 2 (నాటౌట్) పరుగులు చేయగా.. మోనాంక్ పటేల్, హర్మీత్ సింగ్ డకౌట్లయ్యారు. -
IND vs USA: సూర్యకుమార్ విధ్వంసం
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే టీమిండియా బ్యాటర్లు కఠిన పరీక్ష ఎదుర్కొన్నారు. ముంబై వేదికగా అమెరికా బౌలర్లు ఆది నుంచే చెలరేగుతూ భారత బ్యాటింగ్ విభాగంపై ఒత్తిడి పెంచారు. రెండో ఓవర్ రెండో బంతికే అలీ ఖాన్ అభిషేక్ శర్మ (0) డకౌట్‌గా వెనక్కి పంపాడు.ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి..ఆ తర్వాత వాన్ షాల్విక్ ఆరో ఓవర్లో రెండో బంతికి ఇషాన్ కిషన్ (20), ఐదో బంతికి తిలక్ వర్మ (25), ఆఖరి బంతికి శివం దూబే (0)ను అవుట్ చేసి.. భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. ఫలితంగా పవర్ ప్లేలో కేవలం 44 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా.సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌మిగిలిన వారిలో రింకూ సింగ్ (6), హార్దిక్ పాండ్యా (5) ఎక్కువ సేపు నిలవలేకపోయారు. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ కాసేపు అలరించి (11 బంతుల్లో 14) పెవిలియన్ చేరాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు.A fine innings from the man in top form! 👏@surya_14kumar brings up his 25th T20I fifty, just when the team needed it the most! 💙PS. India win 88% of matches when captain SKY scores 50+ ICC Men’s #T20WorldCup | #INDvUSA | LIVE NOW 👉 https://t.co/GSioxLqv9R pic.twitter.com/GQYypRHKDJ— Star Sports (@StarSportsIndia) February 7, 2026మెరుపు అర్ధ శతకంధనాధన్ దంచికొట్టిన సూర్య 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక సూర్య మెరుపు అర్ధ శతకం కారణంగా టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.అమెరికా బౌలర్లలో వాన్ షాల్విక్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. హర్మీత్ సింగ్ రెండు, అలీ ఖాన్, మొహమ్మద్ మొహ్సిన్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా గ్రూప్-‘ఎ’లోచదవండి: అప్పటిదాకా బిగ్ క్రికెటర్ అని ఒప్పుకోను: వైభవ్ సూర్యవంశీ తండ్రి -
గంభీర్ బాటలో అభిషేక్ శర్మ.. ఇలా చేశావేంటి బ్రో?
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌లో ఈ పంజాబీ బ్యాటర్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. తద్వారా ఓ చెత్త రికార్డును అభిషేక్ శర్మ తన పేరిట లిఖించుకున్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత టీ20 జట్టు ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ ధనాధన్ బ్యాటింగ్‌తో విధ్వంసకర ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు.గత కొన్నాళ్లుగా మంచి ఫామ్‌లో ఉన్న అభిషేక్.. కెరీర్లో తొలి ప్రపంచకప్ టోర్నీకి సిద్ధమయ్యాడు. ముంబైలోని వాంఖడే వేదికగా వరల్డ్‌కప్‌లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌లో అమెరికాతో తలపడునుండటంతో ఈ ఓపెనింగ్ బ్యాటర్ అదరగొడతాడని అంతా భావించారు.అయితే, ఊహించని రీతిలో అభిషేక్ శర్మ ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు. అమెరికా పేసర్ అలీ ఖాన్ బౌలింగ్‌లో సంజయ్ కృష్ణమూర్తికి క్యాచ్ ఇచ్చిన ఈ లెఫ్టాండర్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. తద్వారా టీ20 ప్రపంచకప్ టోర్నీలో అరంగేట్ర మ్యాచ్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగిన ఐదో భారత బ్యాటర్‌గా నిలిచాడు. కాగా టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సైతం ఇలాగే అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు.ఇక అభిషేక్ శర్మ కూడా ఇప్పుడు అదే తరహాలో అవుట్‌కావడంతో.. “గంభీర్ బాటలో నడిచిన అభిషేక్ శర్మ.. నీపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాం.. ఇలా చేశావేంటి బ్రో’’ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండగా.. పవర్ ప్లేలోనే 44 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది టీమిండియా.టీ20 వరల్డ్‌కప్ అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్ అయిన భారత ఆటగాళ్లు వీరే👉గౌతం గంభీర్👉ఆశిష్ నెహ్రా (గోల్డెన్ డక్)👉శార్దూల్ ఠాకూర్👉దీపక్ హుడా👉అభిషేక్ శర్మ (గోల్డెన్ డక్). -
IND vs USA: టీమిండియా శుభారంభం.. అమెరికాపై గెలుపు
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా ప్రయాణం మొదలైంది. గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత యూఎస్ఏతో భారత్ తలపడుతోంది. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన యూఎస్ఏ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది.సూర్య మెరుపు అర్ధ శతకం (49 బంతులలో 84) కారణంగా టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అమెరికా లక్ష్య ఛేదనకు దిగింది.T20 World Cup 2026 India vs United States of America Updatesటీమిండియా శుభారంభం.. అమెరికాపై గెలుపుముంబై వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమిండియా.. 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ 84 పరుగులతో చేశాడు. ఛేదనలో అమెరికా జట్టు.. ఓవర్లన్నీ ఆడి 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగారు. సంజయ్ కృష్ణమూర్తి, శుభం రంజనే తలో 37 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పాటు అందించారు.19 ఓవర్లకు స్కోరు 121-719 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 121-7 స్కోరుతో నిలిచింది. క్రీజులో శుభం 27, స్కాల్క్ 2 ఉన్నారు.18 ఓవర్లకు స్కోరు 111-718 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 111-7 స్కోరుతో ఉంది. క్రీజులో శుభం 18, స్కాల్క్ 1 ఉన్నారు.ఏడో వికెట్ కోల్పోయిన అమెరికాఅమెరికా ఏడో వికెట్ కోల్పోయింది. మహమ్మద్ మోసిన్ 8 పరుగులు చేసి అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.17 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 104-617 ఓవర్లు పూర్తయ్యేసరికి అమెరికా.. 6 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. శుభం 17, మోసిన్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.16 ఓవర్లకు స్కోరు 100-6 16 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 6 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. శుభం 15, మోసిన్ 1 క్రీజులో ఉన్నారుఆరో వికెట్ కోల్పోయిన అమెరికా15.3: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో హర్మీత్ సింగ్ డకౌట్ అయ్యాడు. సిరాజ్ క్యాచ్ పట్టాడు.ఐదో వికెట్ కోల్పోయిన యూఎస్ఏ15.2: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సంజయ్ 37 పరుగుల దగ్గర క్యాచ్ ఔట్ అయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన అమెరికా15 ఓవర్లకు స్కోరు 98-4సంజయ్ 37, శుభం 14 పరుగులతో క్రీజులో ఉన్నారు13 ఓవర్లలో అమెరికా స్కోరు: 78-4సంజయ్ 26, శుభం 5 పరుగులతో ఉన్నారు.నాలుగో వికెట్ డౌన్11.6: వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో మిలింద్ కుమార్ (34) స్టంపౌట్. నాలుగో వికెట్ కోల్పోయిన అమెరికా. స్కోరు: 71-4. విజయానికి 48 బంతులో 91 పరుగులు కావాలి.పది ఓవర్లలో అమెరికా స్కోరు: 49-3పవర్ ప్లేలో అమెరికా స్కోరు: 31-3(6).మిలింద్ 16, సంజయ్ 4 పరుగులతో ఉన్నారు.మూడో వికెట్ కోల్పోయిన అమెరికా3.2: సిరాజ్ బౌలింగ్‌లో సాయితేజ ముక్కామల (2) వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చాడు. మిలింద్ రెండు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 13-3(3.2)రెండో వికెట్ కోల్పోయిన అమెరికా2.1: అర్ష్‌దీప్ బౌలింగ్‌లో అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ (0) శివం దూబేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్కోరు: 11-2(2.1). సాయితేజ ముక్కామల రెండు పరుగులతో ఉండగా.. మిలింద్ కుమార్ క్రీజులోకి వచ్చాడు.వికెట్ తీసిన సిరాజ్1.4: అనూహ్యంగా వరల్డ్‌కప్ జట్టులోకి.. తుదిజట్టులోకి వచ్చిన సిరాజ్ టీమిండియా బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. తొలి ఓవర్ నాలుగో బంతికే వికెట్ పడగొట్టాడు. సిరాజ్ బౌలింగ్‌లో తిలక్‌కు క్యాచ్ ఇచ్చి అమెరికా ఓపెనర్ ఆండ్రీ గౌస్ (6) వెనుదిరిగాడు.టీమిండియా స్కోరు: 161-9(20)తొమ్మిదో వికెట్ డౌన్19.6: వరుణ్ చక్రవర్తి (0) రనౌట్.. తొమ్మిదో వికెట్ డౌన్అర్ష్దీప్ అవుట్18.6: షాల్విక్ బౌలింగ్‌లో... ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగిన అర్ష్‌దీప్ సింగ్ (4) సూర్యకుమార్ హాఫ్ సెంచరీ36 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న సూర్యకుమార్ఏడో వికెట్ కోల్పోయిన భారత్16.4: హర్మీత్ బౌలింగ్‌లో మొహ్సిన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన అక్షర్ పటేల్ (14). క్రీజులోకి అర్ష్‌దీప్ సింగ్. సూర్య 47 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 118-7(16.4)అక్షర్, సూర్య ధనాధన్15: నేత్రావల్కర్ బౌలింగ్‌లో అక్షర్ 4,4 బాదగా.. సూర్య 4, 6 బాదాడు. ఒకే ఓవరల్లో 21 పరుగులు. స్కోరు: 115-6 (16).ఆరో వికెట్ కోల్పోయిన భారత్12.4: హర్మీత్ బౌలింగ్‌లో ఆరో వికెట్‌గా వెనుదిరిగిన హార్దిక్ పాండ్యా (5). క్రీజులోకి అక్షర్ పటేల్. స్కోరు: 85-6(13.5).ఐదో వికెట్ కోల్పోయిన భారత్11.4: మొహ్సిన్ బౌలింగ్‌లో మిలింద్కు క్యాచ్ ఇచ్చి రింకూ సింగ్ అవుట్ (6). సూర్య 21 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 72-5(11.4) పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 63-4 శివం దూబే డకౌట్5.6: వాన్ షాల్విక్ బౌలింగ్‌లో నేత్రావల్కర్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయిన శివం దూబే. పవర్‌ప్లేలో టీమిండియా స్కోరు: 46-4(6)తిలక్ వర్మ అవుట్5.5: మూడో వికెట్‌గా వెనుదిరిగిన తిలక్ వర్మ (16 బంతుల్లో 25; మూడు ఫోర్లు, ఒక సిక్స్). వాన్ షాల్విక్ బౌలింగ్ మోనాంక్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన తిలక్. శివం దూబే క్రీజులోకి రాగా.. సూర్య 1 పరుగుతో ఉన్నాడు. స్కోరు: 46-3(5.5)రెండో వికెట్ డౌన్5.2: వాన్ షాల్విక్ బౌలింగ్‌లో మిలింద్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైన ఇషాన్ కిషన్ (16 బంతుల్లో 20; 1 ఫోర్, రెండు సిక్స్‌లు). క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్. తిలక్ 25 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 45-2(5.2).నాలుగు ఓవర్లలో టీమిండియా స్కోరు: 33-1తిలక్ 13 బంతుల్లో 23, ఇషాన్ 10 బంతుల్లో 10 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన భారత్1.2: అలీ ఖాన్ బౌలింగ్‌లో సంజయ్ కృష్ణమూర్తికి క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగిన అభిషేక్ శర్మ. ISHAN-DAAR SHURUAAT! 🔥He gets the scoreboard ticking with a maximum, and the crowd erupts at the Wankhede 😍ICC Men’s #T20WorldCup | #INDvUSA | LIVE NOW 👉 https://t.co/GSioxLqv9R pic.twitter.com/zmtTfy2q4Q— Star Sports (@StarSportsIndia) February 7, 2026తొలి ఓవర్లో ఏడు పరుగులుకట్టుదిట్టంగా నేత్రావల్కర్ బౌలింగ్... ఇషాన్ 7, అభిషేక్ 0 పరుగులతో ఉన్నారు. సంజూపై వేటుఇక ఊహించినట్లుగానే తుదిజట్టులో ఇషాన్ కిషన్‌కు చోటు దక్కగా.. సంజూ శాంసన్ (Sanju Samson)పై వేటు పడింది. ఓపెనర్, వికెట్ కీపర్‌గా సంజూ స్థానాన్ని ఇషాన్ (Ishan Kishan) భర్తీ చేశాడు. కాగా గత కొంతకాలంగా సంజూ ఫామ్‌లేమితో సతమతమవుతున్న విషయం తెలిసిందే.సిరాజ్‌కు లక్కీ ఛాన్స్‌అదే విధంగా.. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఇక పేస్ దళ నాయకుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. అతడి స్థానంలో మొహమ్మద్ సిరాజ్‌ను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు.కాగా హర్షిత్ రాణా గాయపడటంతో సిరాజ్‌కు అదృష్టం కలిసి వచ్చింది. రాణా స్థానంలో ఈ హైదరాబాదీ పేసర్‌ను తీసుకున్నట్లు శుక్రవారం బీసీసీఐ ప్రకటించగా.. బుమ్రా అనారోగ్యం వల్ల ఏకంగా తుదిజట్టులోనూ సిరాజ్‌కు స్థానం దక్కడం విశేషం.మరోవైపు.. యూఎస్ఏ కెప్టెన్ మోనాంక్ పటేల్ మాట్లాడుతూ.. పిచ్ బాగుందని.. ఇక్కడ భారీ స్కోరు నమోదుకు ఆస్కారం ఉందని పేర్కొన్నాడు. తమ తుదిజట్టులో ఆరుగురు బ్యాటర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లు, ముగ్గురు బౌలర్లు ఉన్నట్లు తెలిపాడు.టీ20 ప్రపంచకప్-2026: భారత్ వర్సెస్ యూఎస్ఏ తుదిజట్లుభారత్ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తియూఎస్ఏఆండ్రీస్ గౌస్(వికెట్ కీపర్), సాయితేజ ముక్కామల, మోనాంక్ పటేల్(కెప్టెన్), మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజానే, హర్మీత్ సింగ్, మహ్మద్ మొహ్సిన్, షాడ్లీ వాన్ షాల్విక్, అలీ ఖాన్, సౌరభ్ నేత్రావల్కర్ -
టీమిండియాకు ఊహించని షాక్
టీ20 ప్రపంచకప్ 2026 ఇవాల్టి నుంచి (ఫిబ్రవరి 7) ప్రారంభం కానుంది. ఇవాళే భారత్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్ఏ తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.కాగా, ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలిందని తెలుస్తుంది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. బుమ్రా వైరల్ ఫీవర్ బారిన పడినట్లు తెలుస్తుంది. ఈ కారణంగా అతను శుక్రవారం నాటి నెట్ ప్రాక్టీస్‌కి హాజరుకాలేదు. దీంతో నేటి మ్యాచ్‌కు బుమ్రా దూరమవుతాడని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ.. భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే.. ప్రత్యర్ది (యూఎస్ఏ) చిన్నదే అయినా, ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. గత ప్రపంచకప్‌లో ఇదే జట్టు పాక్‌కు షాకిచ్చింది. కాబట్టి, బుమ్రా అందుబాటులో లేకపోయినా టీమిండియా మరో పేస్ బౌలింగ్ ఆప్షన్‌తో సిద్దంగా ఉండక తప్పదు.ఒకవేళ బుమ్రా నిజంగా యూఎస్ఏ మ్యాచ్‌కు దూరమైతే కొత్తగా జట్టులోకి వచ్చిన సిరాజ్‌కు తుది జట్టులో అవకాశం ఉండవచ్చు. హార్దిక్ పాండ్యా కొత్త బంతితో బౌలింగ్ ప్రారంభించే అవకాశం ఉండగా, సిరాజ్ ఫస్ట్-చేంజ్ బౌలర్‌గా ఉపయోగపడతాడు. యూఎస్ఏతో మ్యాచ్ తర్వాత భారత్ ఫిబ్రవరి 12న నమీబియాతో తలపడనుంది. ఆతర్వాత ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో మ్యాచ్ షెడ్యూలైంది. అయితే ఈ మ్యాచ్‌పై అనిశ్చితి ఇంకా కొనసాగుతుంది. పాక్ ప్రభుత్వం ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పాక్ ఆడినా ఆడకపోయినా, భారత్ అయితే ఈ మ్యాచ్ కోసం కొలొలంబోకు వెళ్తుంది. ఒకవేళ పాక్ నిజంగా బరిలోకి దిగకపోతే భారత్‌కు మ్యాచ్ ఆడకుండానే పాయింట్లు లభిస్తాయి. దీని తర్వాత టీమిండియా ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్‌తో తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడనుంది.యూఎస్ఏతో మ్యాచ్‌కు భారత జట్టు (అంచనా)..ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, మొహమ్మద్ సిరాజ్ -
T20 WC 2026: సిరాజ్‌కు గోల్డెన్ ఛాన్స్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యే దుస్థితి నెలకొంది. ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ధ్రువీకరించాడు.కాగా శనివారం (ఫిబ్రవరి 7) నుంచి వరల్డ్‌కప్ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. భారత్- శ్రీలంక ఆతిథ్యమిస్తున్న ఈ ఐసీసీ టోర్నీలో టీమిండియా శనివారం నాటి మ్యాచ్‌లో యూఎస్ఏతో తలపడుతుంది. ఇందుకు ముంబైలోని వాంఖడే మైదానం వేదిక. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) శుక్రవారం మీడియాతో మాట్లాడాడు.భారీ ఎదురుదెబ్బేఈ సందర్భంగా హర్షిత్ రాణా గాయం గురించి అప్డేట్ అందిస్తూ. ‘‘హర్షిత్ టోర్నీ నుంచి తప్పుకొన్నాడని ఇప్పుడే చెప్పలేను. అయితే, అతడి పరిస్థితి ఏమాత్రం బాలేదు. గాయంపై స్పష్టమైన సమాచారం అందాల్సి ఉంది.ఒకవేళ హర్షిత్ రాణా టోర్నీకి దూరమైతే నిజంగా మాకు అది భారీ ఎదురుదెబ్బే. కాంబినేషన్లను దృష్టిలో పెట్టుకునే మేము పదిహేను మందిని ఎంపిక చేసుకున్నాం. అయితే, కావాల్సినంత బెంచ్ స్ట్రెంత్ ఉంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఆల్‌రౌండరే అక్కర్లేదుఅతడి స్థానంలో ఆల్‌రౌండర్‌నే తీసుకురావాలనే నిబంధన ఏమీ లేదు’’ అని ప్రి-మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో సూర్య పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో హర్షిత్ రాణా స్థానంలో హైదరాబాదీ స్టార్ మొహమ్మద్ సిరాజ్ ప్రపంచకప్ జట్టులోకి రానున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.సిరాజ్‌కు గోల్డెన్ ఛాన్స్!కాగా 2024 జూలైలో సిరాజ్ చివరగా టీమిండియా తరఫున టీ20 బరిలో దిగాడు. అయితే, గతేడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున సిరాజ్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. పదిహేను మ్యాచ్‌లలో కలిపి 16 వికెట్లు తీశాడు. కాగా సిరాజ్ ఇప్పటికి టీమిండియా తరఫున మొత్తంగా 16 మ్యాచ్‌లు ఆడి పద్నాలుగు వికెట్లు తీశాడు.ఇదిలా ఉంటే.. హర్షిత్ రాణా స్థానంలో సిరాజ్‌కు బదులు ప్రసిద్ కృష్ణను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది ఐపీఎల్లో 25 వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు ప్రసిద్. ఈ కర్ణాటక బౌలర్ చివరగా 2023లో టీమిండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు. చదవండి: ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందు ఆసీస్‌కు మరో భారీ షాక్ -
T20 WC: జట్లు, మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య షెడ్యూల్ ఖరారైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ ఈ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ తమ మ్యాచ్‌లను శ్రీలంక వేదికగా ఆడేలా షెడ్యూల్ రూపొందించారు.ఈ వరల్డ్‌కప్ టోర్నీలో ఇరవై జట్లు పాల్గొంటుండగా.. వాటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ పోటీ పడుతుండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే ఉన్నాయి.గ్రూప్-సిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ ఉండగా.. గ్రూప్-డి నుంచి న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, యూఏఈ, కెనడా పోటీలో పడుతున్నాయి. మరి టోర్నీకి ఖరారైన ఇరవై జట్లలో ఎవరెవరు ఉన్నారు? మ్యాచ్ టైమింగ్స్... ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడ? తదితర విషయాలు తెలుసుకుందామా?!గ్రూప్-ఎభారత్సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్.యూఎస్ఏమోనాంక్ పటేల్ (కెప్టెన్), జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, షెహన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయాన్ జహంగీర్, సాయితేజ ముక్కామల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెంజిగే, షాడ్లీ వాన్ షాల్విక్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్, మహ్మద్ మొహ్సిన్, శుభం రంజానే.నమీబియాగెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేన్ గ్రీన్, బెర్నార్డ్ షాల్, రూబెన్ ట్రంపెల్మన్, జెజె స్మిత్, జాన్ ఫ్రైలింక్, లౌరెన్ స్టీన్‌క్యాంప్, మలన్ క్రుగర్, నికోల్ లాఫ్టీ-ఈటన్, జాక్ బ్రసెల్, బెన్ షికోంగో, జెసి బాల్ట్, డైలాన్ లీచర్, డబ్ల్యుపి మైబర్, మాక్స్ హీంగోరిజర్వు ప్లేయర్: అలెగ్జాండర్ వోల్షెంక్నెదర్లాండ్స్స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), కోలిన్ అకెర్మాన్, నోహ్ క్రోస్, బాస్ డి లీడ్, ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్, కైల్ క్లైన్, మైఖేల్ లెవిట్, జాచ్ లయన్-కాచెట్, మాక్స్ ఓ'డౌడ్, లోగాన్ వాన్ బీక్, టిమ్మ్ వాన్ డెర్ గుగ్టెన్, రోల్ఫ్ వాన్‌డెర్ మెర్వే, పాల్ వాన్ మెకరెన్, సకీబ్ జుల్ఫికర్పాకిస్తాన్సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా నఫే, మొహమ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, షాహీన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారీక్.గ్రూప్-బిఆస్ట్రేలియామిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపాశ్రీలంకదసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, కుశాల్ మెండిస్, కమిందు మెండిస్, కుశాల్ జనిత్ పెరీరా, చరిత్ అసలంక, జనిత్ లియానాగే, పవన్ రత్నాయకే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, మతీషా పతిరణ, ఇషాన్ మలింగజింబాబ్వేసికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రీమెర్, బ్రాడ్లీ ఎవాన్స్, క్లైవ్ మడాండే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, టోనీ మున్యోంగా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజరబానీ, డియాన్ మేయర్స, రిచర్డ్ ఎంగరవ, బ్రెండన్ టేలర్ఐర్లాండ్పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.ఒమన్జతీందర్ సింగ్ (కెప్టెన్), వినాయక్ శుక్లా, మహ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, హమ్మద్ మీర్జా, వసీం అలీ, కరణ్ సోనావాలే, షా ఫైసల్, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మెహమూద్, జే ఒడెద్రా, షఫీక్ జాన్, ఆశిష్ ఒడెదర, జితేన్ రామనంది, అమీర్ కలీమ్గ్రూప్-సిఇంగ్లండ్హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కుర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్వెస్టిండీస్షాయ్ హోప్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డే, జేసన్ హోల్డర్, అకీల్ హోసేన్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడకేష్ మోటీ, రోవ్‌మన్ పావెల్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, క్వెంటిన్ సాంప్సన్, జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్.ఇటలీవేన్ మాడ్సెన్ (కెప్టెన్), మార్కస్ కాంపోపియానో, జియాన్ పియరో మీడే, జైన్ అలీ, అలీ హసన్, క్రిషన్ జార్జ్ కలుగమాగే, హ్యారీ మానెంటి, ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా, సయ్యద్ నఖ్వీ, బెంజమిన్ మానెంటి, జస్ప్రీత్ సింగ్, జెజె స్మట్స్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకానేపాల్రోహిత్ పౌడెల్ (కెప్టెన్), దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లమిచానే, కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బసీర్ అహమద్, సోంపాల్ కమీ, కరణ్ కెసి, నందన్ యాదవ్, గుల్షన్ ఝా, లలిత్ రాజ్‌బన్షి, షేర్ మల్లా, లోకేష్ బామ్స్కాట్లాండ్రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ క్యూరీ, ఒలివర్ డేవిడ్సన్, క్రిస్ గ్రీవ్స్, జైనుల్లా ఇహ్సాన్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, ఫిన్లే మెక్‌క్రీత్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్.ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లు: జాస్పర్ డేవిడ్సన్, జాక్ జార్విస్నాన్-ట్రావెలింగ్ రిజర్వ్స్: మెకెంజీ జోన్స్, క్రిస్ మెక్‌బ్రైడ్, చార్లీ టియర్గ్రూప్-డిసౌతాఫ్రికాఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, మార్కో యాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, జాసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్న్యూజిలాండ్మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.అఫ్గనిస్తాన్రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్జాయ్, సెదీఖుల్లా అటల్, ఫజల్హాక్ ఫరూఖీ, రహ్మానుల్లా గుర్బాజ్, మహ్మద్ ఇషాక్ రహీమి, షాహిదుల్లా కమల్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, డార్విష్ రసూలీ, ఇబ్రహీం జద్రాన్, జియా ఉర్ రెహమాన్ షరీఫీరిజర్వ్స్: AM గజన్ఫర్, ఇజాజ్ అహ్మద్జాయ్, ఫరీద్ అహ్మద్ మాలిక్కెనడాదిల్ప్రీత్ బజ్వా (కెప్టెన్), అజయ్‌వీర్ హుందాల్, అన్ష్ పటేల్, దిలోన్ హేలిగర్, హర్ష్ థాకర్, జస్కరన్‌దీప్ సింగ్, కలీమ్ సనా, కన్వర్పాల్ తత్గూర్, నవనీత్ ధలీవాల్, నికోలస్ కిర్టన్, రవీందర్‌పాల్ సింగ్, సాద్ బిన్ జాఫర్, శివమ్ శర్మ, శ్రేయాస్ మొవ్వా, యువ్‌రాజ్ సమ్రాయూఏఈముహమ్మద్ వసీమ్ (కెప్టెన్), అలీషాన్ షరాఫు, ఆర్యన్ష్ శర్మ, ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్ధిక్, మయాంక్ కుమార్, ముహమ్మద్ అర్ఫాన్, ముహమ్మద్ ఫరూక్, ముహమ్మద్ జవదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రోహిద్ ఖాన్, సోహైబ్ ఖాన్, సిమ్రంజీత్ సింగ్.వేదికలు👉భారత్- కోల్‌కతా, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ 👉శ్రీలంక- కొలంబో, పల్లకెలె👉ఫైనల్- అహ్మదాబాద్మ్యాచ్ ఆరంభ సమయం👉ఉదయం మ్యాచ్‌లు: 11 గంటలకు ఆరంభం👉మధ్యాహ్నం మ్యాచ్‌లు: 3 గంటలకు ఆరంభం👉రాత్రి మ్యాచ్‌లు: 7 గంటలకు ఆరంభంలైవ్ స్ట్రీమింగ్ వివరాలు👉టీవీలో స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం👉డిజిటల్ మీడియాలో జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం👉తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లిష్, కన్నడ భాషల్లో జియో స్టార్ టీవీలో కామెంట్రీ👉జియోహాట్‌స్టార్‌లో పై భాషలతో పాటు బెంగాలీ, భోజ్‌పురి, హర్యాన్వీ భాషల్లోనూ వ్యాఖ్యానం.చదవండి: IND vs PAK: పాక్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్ -
సభలో రచ్చరచ్చ
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందం, మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవణే పుస్తకంపై లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు బుధవారం సైతం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలకు నిజాలు బహిర్గతం చేయాలని పట్టుబట్టారు. సభలో బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించాల్సి ఉండగా, ఆయన సభకు హాజరు కాలేదు. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు ప్రారంభించారు. శాంతించాలంటూ స్పీకర్ విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోలేదు. దాంతో స్పీకర్ సభను ఉదయం 11 గంటల దాకా వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యుల ఆందోళన ఆగలేదు. ప్రభుత్వం సమాధానం చెప్పేదాకా విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. విపక్ష ఎంపీలు తొలుత వెల్‌లో బైఠాయించారు. అనంతరం బ్యానర్లు ప్రదర్శిస్తూ అధికార పక్ష సభ్యులవైపు దూసుకొచ్చారు. నరవణే పుస్తకంపై సభలో రాహుల్ గాం«దీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వారి తీరును కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, అమిత్ షా తప్పుపట్టారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ మధ్యాహ్నం 12 గంటల దాకా, తర్వాత 2 గంటల దాకా వాయిదా వేశారు. మరో వాయిదా తర్వాత 5 గంటలకు సభ మళ్లీ ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ సమయంలోనే ప్రధాని ప్రసంగించాల్సి ఉంది. కాంగ్రెస్ మహిళా ఎంపీ వర్షా గైక్వాడ్ సహా మరికొందరు మహిళా సభ్యులు ప్రధాని కూర్చొనే స్థానం వద్దకొచ్చి ఘోరావ్ చేశారు. అప్పుడు మోదీ సభలో లేరు. వెనక్కి రావాలంటూ కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కోరినా విపక్ష సభ్యులు పట్టించుకోలేదు. పరిస్థితి సద్దుమణగకపోవడంతో స్పీకర్ స్థానంలో ఉన్న సంధ్యా రాయ్ సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. పరిస్థితి అదుపులో లేకపోవడం వల్లనే మోదీ సభకు రాలేదని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ చెప్పారు. రాహుల్‌కు పోటీగా దూబే పుస్తక ప్రదర్శన..మధ్యాహ్నం 2 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ‘ఎడ్వినా అండ్ నెహ్రూ’, ‘మిత్రోఖిన్ ఆర్కైవ్’ అనే పుస్తకాలను సభలో ప్రదర్శిస్తూ వాటి గురించి ప్రస్తావించడంతో వివాదం మొదలైంది. దివంగత ప్రధానమంత్రులు నెహ్రూ, ఇందిరా గాం«దీ, రాజీవ్ గాంధీపై ఆయన విమర్శలు చేశారు. వారు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అయితే, సభలో పుస్తకాల గురించి ప్రస్తావించడానికి వీల్లేదని సభాపతి స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెన్నేటి స్పష్టంచేశారు. నిషికాంత్ దూబ్ తీరుపై మండిపడుతూ కాంగ్రెస్ సహా ఇతర విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో సభాపతి లోక్‌సభను సాయంత్రం 5 గంటల దాకా వాయిదా వేశారు. తర్వాత కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. నిషికాంత్ దూబేపై సస్పెన్షన్ వేటు వేయాలని డిమాండ్ చేశారు. -
IND vs USA: భారత తుదిజట్టు ఇదే.. ఇషాన్‌కు నో ఛాన్స్!
పొట్టి క్రికెట్ సమరానికి రంగం సిద్ధమైంది. భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు శనివారం (ఫిబ్రవరి 7)న తెరలేవనుంది. ఈ ఐసీసీ ఈవెంట్లో తొలి రోజు మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. తొలుత కొలంబో వేదికగా పాకిస్తాన్- నెదర్లాండ్స్.. ఆ తర్వాత కోల్‌కతాలో వెస్టిండీస్- స్కాట్లాండ్.. అనంతరం ముంబై వేదికగా టీమిండియా- అమెరికా (IND vs USA) జట్లు తలపడతాయి.ఇందుకోసం ఇప్పటికే జట్లన్నీ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాయి. ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సంజూ శాంసన్ (Sanju Samson)ను ఓపెనర్‌గా కొనసాగిస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది.వరుస వైఫల్యాలుగత కొన్నాళ్లుగా సంజూ ఫామ్‌లేమి (10, 6, 0, 24, 6)తో సతమతమవుతుండటం ఇందుకు కారణం. అదే సమయంలో.. చాన్నాళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన మరో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దుమ్ములేపుతున్నాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో వన్‌డౌన్‌లో వచ్చి ఆఖరి మ్యాచ్‌లో సెంచరీ (103)తో అదరగొట్టాడు.తిలక్ వర్మ పునరాగమనంకాగా తిలక్ వర్మ గాయం కారణంగా జట్టుకు దూరమైనంద వల్ల ఇషాన్ అతడి స్థానంలో వన్‌డౌన్‌లో వచ్చాడు. అయితే, వరల్డ్‌కప్ టోర్నీతో తిలక్ వర్మ పునరాగమనం చేయనున్నాడు. దీంతో ఇషాన్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేసి.. సంజూపై మేనేజ్మెంట్ వేటు వేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇషాన్‌కు నో ఛాన్స్ఇలాంటి తరుణంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఆసక్తికర అంచనాతో ముందుకు వచ్చాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. అమెరికాతో తలపడే భారత తుదిజట్టును ఎంచుకున్న చహల్.. ఇషాన్ కిషన్‌ను పక్కనపెట్టడం విశేషం. అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఓపెనింగ్ చేయాలని అతడు అభిప్రాయపడ్డాడు.ఇక మూడో స్థానంలోకి తిలక్ వర్మ తిరిగివస్తాడన్న చహల్.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ యథావిధిగా నాలుగో నంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగుతాడని పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్.. మిడిలార్డర్, ఫినిషర్ పాత్రలు పోషిస్తారని తెలిపాడు.కుల్దీప్‌నకు కూడా మొండిచేయితన జట్టులో ఇద్దరు స్పిన్నర్లు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తికి చోటిచ్చిన చహల్.. ఇద్దరు స్పెషలిస్టు సీమర్లుగా జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లను ఎంచుకున్నాడు. ఈ క్రమంలో టాపార్డర్‌లో ఇషాన్ కిషన్‌తో పాటు.. స్పిన్ దళంలో కుల్దీప్ యాదవ్‌కు చహల్ మొండిచేయి చూపాడు. కాగా వరల్డ్‌కప్ టోర్నీలో ఇరవై జట్లు పాల్గొంటుండగా డిఫెండింగ్ చాంపియన్ భారత్.. పాకిస్తాన్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియాలతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది.టీ20 వరల్డ్‌కప్-2026లో అమెరికాతో మ్యాచ్‌కు చహల్ ఎంచుకున్న భారత తుదిజట్టుఅభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: ఇషాన్ కిషన్‌కు అండగా విరాట్ కోహ్లి.@yuzi_chahal picks his playing XI for India’s opening fixture! 👀 💪🏻Just 4 days to go before the defending champions begin their journey on T20 cricket’s biggest stage with one clear mission: 𝗥𝗘𝗣𝗘𝗔𝗧 & 𝗗𝗘𝗙𝗘𝗔𝗧 history 🔥🤩ICC Men’s #T20WorldCup 2026 👉 #INDvUSA |… pic.twitter.com/X9KsBx2CjQ— Star Sports (@StarSportsIndia) February 3, 2026


