టీమిండియా దిగ్గజ కెప్టెన్‌గా పేరొందాడు రోహిత్ శర్మ. భారత్‌కు 2024లో టీ20 ప్రపంచకప్ అందించిన హిట్‌మ్యాన్.. 2025లో చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచాడు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ కేవలం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. 2007లో టీ20 ప్రపంచకప్ టోర్నీ మొదలుకాగా ఇప్పటి వరకు అన్ని ఎడిషన్లలోనూ రోహిత్ భాగమయ్యాడు. అయితే, రిటైర్మెంట్ నేపథ్యంలో తొలిసారి టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో హిట్‌మ్యాన్ ప్రేక్షకుడిగా మిగిలిపోయాడు. ఇక పొట్టి ఫార్మాట్లో సత్తా చాటి తానేంటో నిరూపించుకున్న రోహిత్ శర్మను ఐసీసీ ఈసారి వరల్డ్‌కప్ అంబాసిడర్‌గా నియమించింది.
వాంఖడేలో వరల్డ్‌కప్ ట్రోఫీతో ఎంట్రీ
ఈ నేపథ్యంలో శనివారం ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవగా.. సొంత మైదానం ముంబైలోని వాంఖడేలో వరల్డ్‌కప్ ట్రోఫీతో ఎంట్రీ ఇచ్చాడు రోహిత్ శర్మ. అమెరికాతో మ్యాచ్ నేపథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పి.. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాడు.
అంబానీ కుటుంబం ఆప్యాయత
ఇక భారత వ్యాపార దిగ్గజం, కుబేరుడు ముకేశ్ అంబానీ కుటుంబం కూడా ఈ మ్యాచ్‌కు హాజరైంది. భార్య నీతా, కుమారుడు ఆకాశ్ అంబానీ తదితరులతో కలిసి ముకేశ్ మ్యాచ్‌కు విచ్చేశారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పక్కకు వెళ్లాలని చూడగా.. ముకేశ్ అంబానీ మాత్రం అతడి చేయి పట్టుకుని ఆపి మరీ ఆకాశ్‌కు- తనకు మధ్య కూర్చోబెట్టుకున్నారు.
ముకేశ్ అంబానీ స్వయంగా ఛాయ్ ఇవ్వగా
అంతేకాదు.. మధ్యలో టీతో పాటు స్నాక్స్‌తో కూడిన సాసర్‌ను ముకేశ్ అంబానీ రోహిత్ శర్మకు అందించారు. అయితే, రోహిత్ మాత్రం సున్నితంగా తిరస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Last night, Rohit Sharma was going to sit beside Ritika, but Mukesh Ambani asked him to sit next to him instead 🤍 pic.twitter.com/d9YEMXajlv
— Kusha Sharma (@Kushacritic) February 8, 2026
కాగా 2011 నుంచి రోహిత్‌కు అంబానీ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉంది. అంబానీల యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హిట్‌మ్యాన్ ఐదుసార్లు ట్రోఫీ అందించాడు. 2013 నుంచి పదేళ్లపాటు సారథిగా కొనసాగిన రోహిత్ శర్మను తప్పించి.. 2023లో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది ముంబై ఇండియన్స్. అయితే, రోహిత్ మాత్రం ఆటగాడిగా అదే జట్టుతో కొనసాగుతుండటం విశేషం.
చదవండి: Gautam Gambhir: సతీసమేతంగా టీమిండియాకు ఘన స్వాగతం.. వీడియో వైరల్


