T20 WC 2026 Feb 9: ఈరోజు జరిగే మ్యాచ్‌లు ఇవే | Thrilling Wins For India, Pakistan, And West Indies, T20 World Cup 2026 February 9th Full Schedule And Venues Details | Sakshi
Sakshi News home page

T20 WC 2026 Feb 9: ఈరోజు జరిగే మ్యాచ్‌ల వివరాలు

Feb 9 2026 10:25 AM | Updated on Feb 9 2026 10:57 AM

T20 World Cup 2026 February 9 Schedule Venues Timings Details

భారత్‌- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు శనివారం (ఫిబ్రవరి 7) తెరలేచింది. శ్రీలంకలోని కొలంబోలో తొలుత గ్రూప్‌-‘ఎ’ నుంచి పాకిస్తాన్‌- నెదర్లాండ్స్‌ తలపడ్డాయి. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పాక్‌ మూడు వికెట్ల తేడాతో గట్టెక్కి పాక్‌ ఊపిరి పీల్చుకుంది.

ఇప్పటి వరకు గెలిచిన జట్లు ఇవే
అనంతరం మధ్యాహ్నం మ్యాచ్‌లో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్‌- స్కాట్లాండ్‌ పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో విండీస్‌ 35 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌ను ఓడించింది. ఇక సాయంత్రం మ్యాచ్‌లో గ్రూప్‌-ఎ నుంచి టీమిండియా- అమెరికా తలపడగా.. భారత జట్టు 29 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఇక ఆదివారం (ఫిబ్రవరి 8) నాటి మ్యాచ్‌లో చెన్నైలో అఫ్గనిస్తాన్‌పై న్యూజిలాండ్‌.. ముంబైలో నేపాల్‌పై ఇంగ్లండ్‌.. ఐర్లాండ్‌పై శ్రీలంక విజయం సాధించాయి. మరి సోమవారం నాటి షెడ్యూల్‌ ఎలా ఉందంటే..

టీ20 ప్రపంచకప్‌-2026: ఫిబ్రవరి 9 షెడ్యూల్‌ ఇదే
గ్రూప్‌-సి: స్కాట్లాండ్‌ వర్సెస్‌ ఇటలీ- ఈడెన్‌ గార్డెన్స్‌, కోల్‌కతా- ఉదయం 11 గంటలకు ఆరంభం
గ్రూప్‌-బి: జింబాబ్వే వర్సెస్‌ ఒమన్‌- సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌, కొలంబో- మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం
గ్రూప్‌-డి: సౌతాఫ్రికా వర్సెస్‌ కెనడా- నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్‌- రాత్రి ఏడు గంటలకు ఆరంభం

కాగా వరల్డ్‌కప్‌ టోర్నీలో మొత్తం ఇరవై జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, పాకిస్తాన్‌, నమీబియా, నెదర్లాండ్స్‌, అమెరికా.. గ్రూప్‌- బి నుంచి శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఒమన్‌, ఐర్లాండ్‌ పోటీపడుతున్నాయి.

ఇక గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, ఇటలీ, నేపాల్‌, స్కాట్లాండ్‌.. గ్రూప్‌-డి నుంచి న్యూజిలాండ్‌, కెనడా, సౌతాఫ్రికా, యూఏఈ, అఫ్గనిస్తాన్‌ రేసులో ఉన్నాయి. స్టార్‌ స్పోర్ట్స్‌, జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం.

చదవండి: T20 WC 2026: టీమిండియాతో ఆడతాం కానీ..: బుద్ధి చూపించిన పాకిస్తాన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement