breaking news
T20 World Cup 2026
-
Asia Cup 2025: ‘తిలక్ వద్దు.. సంజూ శాంసన్‌ను ఆడించండి’
టీమిండియా స్టార్ సంజూ శాంసన్ (Sanju Samson)కు భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ (Mohammed Kaif) మద్దతుగా నిలిచాడు. ఈ కేరళ బ్యాటర్‌ను టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో తప్పక ఆడించాలని భారత జట్టు యాజమాన్యానికి సూచించాడు. అది జరగాలంటే.. ముందుగా ఆసియా కప్-2025 (Asia Cup) ఈవెంట్లో సంజూకు తుదిజట్టులో ఛాన్స్ ఇవ్వాలని పేర్కొన్నాడు.ఎనిమిది జట్లుఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్ టోర్నీ నిర్వహణకు సెప్టెంబరు 9- 28 వరకు షెడ్యూల్ ఖరారైంది. యూఏఈ వేదికగా జరిగే ఈ ఖండాంతర టోర్నీలో.. భారత్, పాకిస్తాన్, యూఈఏ, ఒమన్.. బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ జట్లు పాల్గొంటున్నాయి.వైస్ కెప్టెన్గాఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గత నెలలోనే తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలను వెల్లడించింది. ఇక దాదాపు ఏడాది విరామం తర్వాత అంతర్జాతీయ టీ20లలోకి రీఎంట్రీ ఇచ్చిన శుబ్‌మన్ గిల్.. వైస్ కెప్టెన్‌గా తిరిగి నియమితుడయ్యాడు.ఓపెనర్‌గానూ ఫిక్స్అభిషేక్ శర్మతో కలిసి గిల్ ఓపెనర్‌గా రావడం దాదాపుగా ఖాయమైంది. ఈ క్రమంలో.. గిల్ గైర్హాజరీలో అభిషేక్‌కు జోడీగా ఉన్న సంజూ శాంసన్‌కు తుదిజట్టులో చోటుపై సందేహాలు నెలకొన్నాయి. వికెట్ కీపర్‌గా వద్దామన్నా.. జితేశ్ శర్మ రూపంలో సంజూకు గట్టి పోటీ ఉంది. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ సంజూను మూడో స్థానంలో ఆడించాలంటూ కొత్త వాదన తీసుకువచ్చాడు.తిలక్ వద్దు.. సంజూను ఆడించండి‘‘ఆసియా కప్ టోర్నీలో అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్ ఓపెనర్లుగా వస్తారు. అయితే, మూడో స్థానం కోసం తిలక్ వర్మ కంటే సంజూ బెటర్. తిలక్.. ఇంకా యువకుడే. అతడికి మున్ముందు ఎన్నో అవకాశాలు వస్తాయి. కానీ సంజూ శాంసన్ లాంటి సీనియర్, అనుభవశాలి అయిన బ్యాటర్ ఇప్పుడు జట్టుకు అవసరం.ఇంకో ఆర్నెళ్ల తర్వాత టీమిండియా టీ20 ప్రపంచకప్ ఆడబోతోంది. కాబట్టి సంజూకు వరుస అవకాశాలు ఇవ్వాల్సి ఉంది. అందుకు అతడు అర్హుడు కూడా’’ అని మహ్మద్ కైఫ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా సంజూ శాంసన్ ఇప్పటి వరకు కేవలం మూడు అంతర్జాతీయ టీ20లలో మాత్రమే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే, పొట్టి ఫార్మాట్లో (వివిధ లీగ్‌లలో) వన్‌డౌన్‌లో వచ్చి భారీగా పరుగులు రాబట్టిన ఘనత సంజూకు ఉంది.ఏకైక బ్యాటర్‌గా సంజూ చరిత్రఇప్పటి వరకు ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. మొత్తంగా 291 ఇన్నింగ్స్‌లో 133 సార్లు మూడో స్థానంలో వచ్చి.. 4136 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలు, 31 ఫిఫ్టీలు కూడా ఉండటం విశేషం. ఇక గతేడాది తిలక్ వర్మ, సంజూ శాంసన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో గొప్పగా రాణించారు. సౌతాఫ్రికా గడ్డ మీద సెంచరీలతో ఇరగదీశారు.ఈ క్రమంలో ఒకే ఏడాదిలో టీమిండియా తరఫున మూడు శతకాలు బాదిన ఏకైక బ్యాటర్‌గా సంజూ చరిత్ర సృష్టించగా.. తిలక్ వర్మ వరుసగా రెండు సెంచరీలు సాధించడం గమనార్హం. చదవండి: ధృవ్ జురెల్‌ను తప్పించిన సెలెక్టర్లు -
T20 WC 2026: టీమిండియా ఓపెనర్లుగా ఊహించని పేర్లు!
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న ఘనత టీమిండియా సొంతం. మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సారథ్యంలో 2007లో పొట్టి క్రికెట్ వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత దాదాపు పదిహేడేళ్లకు అంటే.. 2024లో మరోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది భారత్.రో- కో గుడ్‌బై చెప్పిన తర్వాతఅమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా గతేడాది ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా టోర్నీలో రోహిత్ సేన.. ఆఖరి వరకు అజేయంగా నిలిచి చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి కప్‌ను గెలుచుకుంది. ఈ ఐసీసీ ఈవెంట్లో ఓపెనర్లుగా వచ్చిన విరాట్ కోహ్లి (Virat Kohli)- రోహిత్ శర్మ (Rohit Sharma).. టీమిండియా విజయం తర్వాత అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.అభి- సంజూ జోడీ హిట్ఇక కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానాన్ని సూర్యకుమార్ యాదవ్ భర్తీ చేయగా.. భారత టీ20 జట్టు ఓపెనర్లుగా అభిషేక్ శర్మ- సంజూ శాంసన్ నిలదొక్కుకున్నారు. శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ టెస్టులతో బిజీ కావడంతో ఈ జోడీకి వరుస అవకాశాలు వచ్చాయి.అయితే, ఆసియా కప్-2025 టోర్నీ సందర్భంగా టీమిండియా ఓపెనర్లు మారే అవకాశం ఉంది. ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఈ ఖండాంతర టోర్నీకి ప్రకటించిన జట్టులో గిల్ స్థానం దక్కించుకున్నాడు. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ టెస్టు కెప్టెన్.. టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గానూ ఎంపికయ్యాడు.స్టాండ్ బై ప్లేయర్‌గా మాత్రమేజట్టు ప్రకటన సందర్భంగా టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యలను బట్టి.. ఒక ఓపెనర్‌గా అభిషేక్ శర్మ ఖరారు అయినట్లే. అతడికి జోడీగా సంజూను కాదని గిల్‌ను పంపే అవకాశాలే ఎక్కువ. ఇక ఈ మెగా ఈవెంట్‌కు ప్రకటించిన ప్రధాన జట్టులో యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కనే లేదు. అతడు స్టాండ్ బై ప్లేయర్‌గా మాత్రమే ఎంపికయ్యాడు.ఓపెనర్ల రేసులో ఊహించని పేర్లుఇక టీ20 ప్రపంచకప్-2026కు సన్నాహకంగా భావిస్తున్న ఆసియా కప్-2025 టోర్నీతో అభిషేక్- గిల్ టీమిండియా ఓపెనింగ్ జోడీగా దాదాపు ఖరారైనట్లే. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ సురేశ్ రైనా మాత్రం భిన్నంగా స్పందించాడు. వచ్చే ఏడాది జరిగే పొట్టి ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా ఓపెనర్ల రేసులో ఊహించని పేర్లు చెప్పాడు.ప్రియాన్ష్ ఆర్య కూడా ఓ ఆప్షన్!శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి యశస్వి ఓ ఓపెనర్‌గా ఉండొచ్చు. అంతేకాదు ప్రియాన్ష్ ఆర్యపై కూడా సెలక్టర్లు దృష్టి సారించవచ్చు. ఇక అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఉండనే ఉన్నారు.ఇప్పటికే తమను తాము నిరూపించుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్ కూడా రేసులో ఉండవచ్చు. అయితే, నా మొదటి ప్రాధాన్యం మాత్రం అభిషేక్ శర్మకే. ఇక కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ నియమితుడుకాడని చెప్పేందుకు పెద్ద కారణాలు లేవు’’ అని రైనా పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ తరఫున అరంగేట్రం చేసిన ప్రియాన్ష్ ఆర్య 17 మ్యాచ్‌లలో కలిపి 475 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉండటం విశేషం. చదవండి: వైభవ్? ఆయుశ్ మాత్రే?.. అతడే ముందుగా టీమిండియాలోకి వస్తాడు! -
ధోనీకి బీసీసీఐ స్పెషల్ ఆఫర్..! తలా మళ్లీ తిరిగొస్తాడా?
టీ20 ప్రపంచకప్-2026కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీమిండియా మెంటార్‌గా లెజెండర్ కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ధోనిని భారత క్రికెట్ బోర్డు సంప్రదించినట్లు ఒక నివేదిక పేర్కొంది.కాగా మిస్టర్ కూల్ టీ20 ప్రపంచకప్-2021లో అప్పటి హెడ్‌కోచ్ రవిశాస్త్రితో కలిసి భారత జట్టు మెంటార్‌గా ధోని పనిచేశాడు. కానీ ఆ ఏడాది పొట్టి ప్రపంచకప్‌లో భారత జట్టు ఆశించినంత మేర రాణించలేకపోయింది. లీగ్ స్టేజిలోనే ఇంటుముఖం పట్టింది. ఆ తర్వాత ధోని భారత కోచింగ్ సెటాప్‌లో ఎప్పుడూ భాగం కాలేదు.అయితే ఇప్పుడు మరోమారు ధోని సేవలను ఉపయోగించుకోవాలని బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నరంట. క్రిక్‌బ్లాగర్ రిపోర్ట్ ప్రకారం.. యువ క్రికెటర్లను తీర్చిదిద్దడంలో ధోని కీలక పాత్ర పోషిస్తాడని బోర్డు విశ్వసిస్తన్నట్లు సమాచారం. అతడి సేవలను సుదీర్ఘంగా వాడుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.కానీ బీసీసీఐ ఆఫర్‌ను ధోని అంగీకరించే అవకాశం లేదని సదరు నివేదిక పేర్కొంది. అందుకు కారణం ధోని, గంభీర్ మధ్య ఉన్న వైర్యమే. ఒకవేళ ధోని ఒప్పుకొన్న గంభీర్ అందుకే ఓకే అంటాడన్నది అనుమానమే. ఈ ఇద్దరి లెజెండరీ క్రికెటర్లకు భారత జట్టుకు కలిసి ఆడినప్పటి నుంచి విభేదాలు ఉన్నాయి.ధోని కెప్టెన్సీలో గెలిచిన టీ20 ప్రపంచకప్, వన్డే వరల్డ్‌కప్ జట్లలో గంభీర్ సభ్యునిగా ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్-2011 ఫైనల్లోనూ గౌతీ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ క్రెడిట్ అంతా కెప్టెన్‌గా ధోని ఇచ్చారని, అది సరికాదంటూ చాలా సందర్భాల్లో గంభీర్ వ్యాఖ్యానించాడు. అయితే ఇటీవల కాలంలో వీరిద్దరూ కలిసి పోయారని, కచ్చితంగా ధోని రాకను గంభీర్ స్వాగతిస్తాడని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై మరి కొద్ది రోజుల్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్ భారత్, శ్రీలంక వేదికలగా జరగనుంది.చదవండి: DPL 2025: దిగ్వేష్-రాణా మధ్య వాగ్వాదం.. కొట్టుకునేంత వరకు వెళ్లారు! వీడియో -
ఇదే ఫైనల్ స్క్వాడ్ కాదు.. వారికి మరో ఛాన్స్: అగార్కర్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో పాల్గొనే టీమిండియా గురించి భారత క్రికెట్ వర్గాల్లో ప్రధానంగా చర్చ నడుస్తోంది. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను పక్కనపెట్టడంతో సెలక్టర్లపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.విమర్శలకు కారణం?అదే విధంగా.. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), వాషింగ్టన్ సుందర్‌లను స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేయడం.. రీఎంట్రీలో వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు ప్రమోషన్ ఇవ్వడం చర్చకు దారితీశాయి. అంతేకాదు.. ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోని హర్షిత్ రాణా, రింకూ సింగ్, శివం దూబేలను ఆసియా కప్ జుట్టుకు ఎంపిక చేయడం కూడా విమర్శలకు తావిచ్చాయి.ఈ జట్టునే గనుక టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగిస్తే టీమిండియా టైటిల్ గెలవలేదంటూ మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు విమర్శలే చేశాడు. ఈ నేపథ్యంలో జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.వరల్డ్‌కప్ టోర్నీకి ఇదే ఫైనల్ స్క్వాడ్ కాదువాషింగ్టన్ సుందర్ గురించి మీడియా సమావేశంలో ప్రస్తావన రాగా.. ‘‘మా ప్రణాళికల్లో సుందర్ ఎల్లప్పుడూ ఉంటాడు. అయినా.. వరల్డ్‌కప్ టోర్నీకి ఇదే ఫైనల్ స్క్వాడ్ కాదు. ప్రస్తుతం మా జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. నలుగురు గనుక అవసరం ఉంటే.. సుందర్ కచ్చితంగా టీమ్‌లోకి వచ్చేవాడు.అయితే, ప్రస్తుత సమీకరణల దృష్ట్యా రింకూ సింగ్‌ను అదనపు బ్యాటర్‌గా ఎంపిక చేసుకున్నాం. జితేశ్, సంజూ వికెట్ కీపర్లుగా సేవలు అందిస్తారు. ప్రస్తుతం మాకు 15 మందిని మాత్రమే ఎంపిక చేసే అవకాశం ఉంది. ఒకవేళ 16 మందిని ఎంపిక చేయాలంటే సుందర్ ఉండేవాడు.వారికి తలుపులు తెరిచే ఉన్నాయిఇక ముందు.. వరల్డ్‌కప్ వరకు టీమిండియా 20 టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కాబట్టి ఎవరు జట్టులో ఉంటారో.. ఎవరు వెళ్లిపోతారో వారి ప్రదర్శనలపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచకప్ టోర్నీ ముగిసిన వెంటనే.. తదుపరి వరల్డ్‌కప్‌నకు జట్టును సిద్ధం చేసుకోవడం సహజం.గాయాలు, ఫామ్.. ప్రధానంగా జట్టు ఎంపికను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ జట్టులో మార్పులు ఉండవచ్చు. జట్టులో ఎవరూ శాశ్వతం కాదు. 18 లేదంటే 20 మంది ఆటగాళ్లను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటాం. వారి నుంచి అత్యుత్తమ, అవసరమైన జట్టునే ఎంపిక చేస్తాం’’ అని అగార్కర్ పేర్కొన్నాడు. తద్వారా ఆసియా కప్ టోర్నీకి ఎంపిక కాని ఆటగాళ్లకు కూడా ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని సంకేతాలు ఇచ్చాడు. ఎనిమిది జట్లుకాగా భారత్ ఆతిథ్యంలో యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకంగా ఈసారి ఈ ఖండాంతర టోర్నీని టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, యూఏఈ, ఒమన్, హాంకాంగ్ జట్లు ఇందులో పాల్గొంటున్నాయి.ఆసియా కప్ టీ20-2025 టోర్నీకి టీమిండియా సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.చదవండి: నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు.. నేనేంటో నాకు తెలుసు: పృథ్వీ షా -
టీ20 వరల్డ్‌కప్-2026లో ఆసీస్ ఓపెనర్లు వీరే.. విధ్వంసకర లైనప్
వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్-2026 (T20 WC 2026) టోర్నమెంట్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా తమ ఓపెనింగ్ జోడీని ఖరారు చేసింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh)తో పాటు ట్రవిస్ హెడ్ (Travis Head) వరల్డ్‌కప్ దాకా ఓపెనర్లుగానే కొనసాగుతారని స్పష్టం చేసింది. సీఏ తరఫున కెప్టెన్ మిచెల్ మార్ష్ ఈ విషయాన్ని వెల్లడించాడు.గొప్ప అనుబంధం ‘‘నేను, హెడీ (ట్రవిస్ హెడ్) సుదీర్ఘకాలం పాటు ఓపెనర్లుగానే ఉంటాము. మేమిద్దరం కలిసి ఎన్నో మ్యాచ్‌లు ఆడాము. మా మధ్య గొప్ప అనుబంధం ఉంది’’ అని మిచెల్ మార్ష్ తెలిపాడు. సౌతాఫ్రికాతో సొంతగడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా వన్డేల్లో ఓపెనింగ్ జోడీగా ట్రవిస్ హెడ్- మిచెల్ మార్ష్‌కు మంచి రికార్డే ఉంది. ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 70.50 సగటుతో వీరిద్దరు కలిసి 282 పరుగులు రాబట్టారు. ఇక అన్ని ఫార్మాట్లలో కలిపి 504 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.ఇదిలా ఉంటే.. 2021 టీ20 ప్రపంచకప్ టోర్నీలో మార్ష్ మూడో స్థానంలో బరిలోకి దిగి అదరగొట్టాడు. న్యూజిలాండ్‌తో ఫైనల్లో 50 బంతుల్లో 77 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టును విజేతగా నిలిపాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.ఆ తర్వాత.. డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ నేపథ్యంలో మార్ష్ ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యాడు. అయితే, ఇటీవల వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బ్యాటర్ (81 పరుగులు)గా విఫలమైనా కెప్టెన్‌గా మాత్రం రాణించాడు. మార్ష్ సారథ్యంలో ఆసీస్ 5-0తో వెస్టిండీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.కాగా గతేడాది వార్నర్ రిటైర్ అయిన తర్వాత.. మ్యాట్ షార్ట్,గ్లెన్ మాక్స్వెల్, జేక్ ఫ్రేజర్-మెగర్క్.. ఇలా చాలా మందిని ఓపెనర్లుగా ట్రై చేసింది ఆస్ట్రేలియా. అయితే, చివరకు మార్ష్- హెడ్ జోడీని ఫైనల్ చేసింది.ప్రమాదకరంగా ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్భారత్- శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి మార్ష్- హెడ్ ఆసీస్ ఓపెనర్లుగా ఖరారు కాగా.. డేంజరస్ బ్యాటర్లతో జట్టు మొత్తం పటిష్టంగానే కనిపిస్తోంది.ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో 37 బంతుల్లోనే శతకం బాదిన టిమ్ డేవిడ్.. ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ టీ20లలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మరోవైపు.. 23 ఏళ్ల మిచెల్ ఓవెన్ అరంగేట్రంలోనే 26 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. వీరితో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కామెరాన్ గ్రీన్ ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ఇక గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏదేమైనా ఈసారి ఆసీస్ ప్రపంచకప్ టోర్నీలో ప్రత్యర్థులకు గట్టిపోటీనివ్వడం ఖాయం అనిపిస్తోంది.చదవండి: సిరాజ్ నాపై కోపంగా ఉండేవాడు.. ఇప్పటికీ అంతే: అజింక్య రహానే -
ICC: కీలక సమావేశం.. ఐసీసీ కొత్త ప్రణాళికలు
టీ20 ప్రపంచకప్-2026 (T20 WC 2026) టోర్నమెంట్లో ఆడేందుకు ఇటీవలే ఇటలీ దేశపు జట్టు అర్హత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు పెరుగుతున్న ఆసక్తి, యూరోప్ దేశాల్లోనూ ఆట విస్తరిస్తున్న తీరుకు ఇది సరైన ఉదాహరణ. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఇప్పుడు సరిగ్గా దీనిపైనే మరింత దృష్టి పెట్టనుంది. కొత్త దేశాల్లో క్రికెట్‌ను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కొత్త ప్రణాళికలు రూపొందించాలని ఐసీసీ భావిస్తోంది.24 జట్లకు పెంచే ప్రతిపాదనఈ నేపథ్యంలో ఇదే అంశంపై మరింత సమగ్ర చర్చ, భవిష్యత్తు కార్యాచరణ విషయంలో ఐసీసీ చర్చించనుంది. గురువారం (జూలై 17) నుంచి నాలుగు రోజుల పాటు జరిగే ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో ప్రధాన ఎజెండాల్లో ఇది కూడా ఒకటి. వచ్చే టీ20 వరల్డ్ కప్ 20 జట్లతో జరగనుంది. దీనిని ఆ తర్వాత 24 జట్లకు పెంచే ప్రతిపాదనపై కూడా సమావేశంలో చర్చిస్తారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డుల మద్దతుఅమెరికా–వెస్టిండీస్‌లలో జరిగిన 2024 టీ20 వరల్డ్ కప్ నిర్వహణలో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ కొనసాగుతుండగా... విచారణలో వెల్లడైన అంశాలతో ఏజీఎంలో నివేదిక ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. టెస్టు క్రికెట్‌ను పెద్ద, చిన్న జట్లతో రెండు వేర్వేరు స్థాయిల్లో నిర్వహించే అంశంపై కూడా చర్చించనున్నారు. ఇలా టెస్టులను వర్గీకరించే అంశానికి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డులు గట్టిగా మద్దతు పలుకుతున్నాయి.జాంబియా రీ ఎంట్రీతాజాగా ఆసీస్‌పై విండీస్ 27 ఆలౌట్ ప్రదర్శనను బట్టి చూస్తే దీనిపై గట్టిగానే చర్చ సాగనుంది. అయితే 2025–27 డబ్ల్యూటీసీ టెస్టుల షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఏదైనా మార్పుపై నిర్ణయం తీసుకుంటే 2027 తర్వాతే సాధ్యమవుతుంది. మరో వైపు నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా 2019లో సస్పెన్షన్‌కు గురైన జాంబియా జట్టుకు ఐసీసీ అసోసియేట్ టీమ్‌గా మళ్లీ అవకాశం కల్పించనుండగా...తొలిసారి ఈస్ట్ తైమూర్ టీమ్ కూడా ఐసీసీలో భాగం కానుంది. ఐసీసీ కొత్త సీఈఓ హోదాలో సంజోగ్ గుప్తా తొలిసారి ఈ సమావేశంలో కీలక పాత్ర పోషించనున్నారు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీ20 యోధుడు -
ICC T20 WC 2026: ఇరవైలో అర్హత సాధించిన 15 జట్లు ఇవే
ఇటలీ క్రికెట్ జట్టు (Italy Cricket Team) చరిత్ర సృష్టించింది. తొలిసారి ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. యూరప్ జోన్ నుంచి నెదర్లాండ్స్‌తో పాటు ఇటలీ మెగా ఈవెంట్లో తమ బెర్తును ఖరారు చేసుకుంది. యూరప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఇటలీ నెదర్లాండ్స్‌తో తలపడింది.భారత్- శ్రీలంక వేదికగా..అయితే, ఈ మ్యాచ్‌లో ఇటలీ ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయినప్పటికీ.. పట్టికలో రెండో స్థానంలో నిలవడం ద్వారా నెదర్లాండ్స్‌తో పాటు టీ20 ప్రపంచకప్-2026 (T20 WC 2026) టోర్నీలో పోటీపడే అవకాశం దక్కించుకుంది. కాగా భారత్- శ్రీలంక (India- Sri Lanka) వచ్చే ఏడాది సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే.ఆ ఏడు జట్లు కూడా..ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్ల హోదాలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా, శ్రీలంక నేరుగా ప్రపంచకప్-2026కు అర్హత సాధించాయి. ఇక వీటితో పాటు టీ20 ప్రపంచకప్-2024లో టాప్-7లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, యూఎస్ఏ, వెస్టిండీస్ కూడా క్వాలిఫై అయ్యాయి.మరోవైపు.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ కూడా ఈ టోర్నీలో పోటీపడేందుకు బెర్తును ఖరారు చేసుకున్నాయి. ఇక అమెరికా క్వాలిఫయర్స్ నుంచి కెనడా.. తాజాగా యూరప్ క్వాలిఫయర్ నుంచి నెదర్లాండ్, ఇటలీ కూడా వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్ ఆడే అవకాశం దక్కించుకున్నాయి.20 జట్లలో 15 ఖరారుకాగా ఈ మెగా టోర్నీలో మొత్తంగా 20 జట్లు పాల్గొననుండగా.. ఇప్పటికి పదిహేను జట్లు ఈ మేర అర్హత సాధించగా.. ఇంకో ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో రెండు స్థానాల కోసం సౌతాఫ్రికా క్వాలిఫయర్స్‌లో భాగంగా నమీబియా, ఉగాండా, టాంజానియా, కెన్యా, జింబాబ్వే, బోత్స్వానా, నైజీరియా పోటీపడుతున్నాయి.ఇక మిగిలిన మరో మూడు స్థానాల కోసం ఆసియా- ఈఏపీ క్వాలిఫయర్స్ (అక్టోబరు 1-17) నుంచి నేపాల్, ఒమన్, పపువా న్యూగినియా, సమోవా, కువైట్, మలేషియా, జపాన్, కతార్, యూఏఈ అమీతుమీ తేల్చుకోనున్నాయి.ఇదిలా ఉంటే.. 2024లో అమెరికా- వెస్టిండీస్ వేదికగా సాగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. లీగ్ దశలో అజేయంగా నిలిచిన రోహిత్ సేన.. ఫైనల్లో సౌతాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా రెండోసారి పొట్టి ప్రపంచకప్ భారత్ సొంతమైంది. కాగా 2007లో తొలిసారి టీ20 వరల్డ్‌కప్ పోటీ ప్రవేశపెట్టగా ధోని సారథ్యంలో నాడు భారత్ ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే.టీ20 ప్రపంచకప్-2026లో ఇప్పటికి అర్హత సాధించిన జట్లు ఇవే..టీమిండియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, యూఎస్ఏ, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, కెనడా, నెదర్లాండ్స్, ఇటలీ.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. కపిల్ దేవ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్