చ‌రిత్ర సృష్టించిన హెట్‌మైర్‌.. ఫాస్టెస్ట్ ఫిప్టీ | Shimron Hetmyer sets new record for West Indies with half-century against Zimbabwe in T20 WC 2026 | Sakshi
Sakshi News home page

T20 WC 2026: చ‌రిత్ర సృష్టించిన హెట్‌మైర్‌.. ఫాస్టెస్ట్ ఫిప్టీ

Feb 23 2026 8:44 PM | Updated on Feb 23 2026 9:31 PM

Shimron Hetmyer sets new record for West Indies with half-century against Zimbabwe in T20 WC 2026

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో వాంఖడే స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్ పవర్ హిట్టర్ షిమ్రాన్ హెట్‌మైర్ విధ్వంసం సృష్టించాడు. విండీస్  ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన హెట్‌మైర్ తన ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌండరీలు బాదడం మొదలు పెట్టాడు.

జింబాబ్వే బౌలర్లను ఉతికారేశాడు. ముఖ్యంగా కెప్టెన్ సికిందర్ రజాకు అయితే చుక్కలు చూపించాడు. 8వ ఓవర్ వేసిన రజా బౌలింగ్‌లో హెట్‌మైర్ ఏకంగా మూడు సిక్స్‌లతో 20 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో హెట్‌మైర్ కేవలం 19 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా హెట్‌మైర్ టీ20 ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన విండీస్‌ ఆటగాడిగా తన రికార్డును తానే మళ్లీ తిరగరాశాడు.

వెస్టిండీస్ తరపున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా తన రికార్డును తానే మళ్లీ తిరగరాశాడు. ఇదే టోర్నీలోహెట్‌మైర్‌ స్కాట్లాండ్‌పై 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇప్పుడు కేవలం 19 బంతుల్లోనే ఆర్ధం శతకం బాదేశాడు.

ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కేవలం 34 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హెట్‌మైర్‌.. 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సార్లు హెట్‌మైర్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రెండు సులువైన క్యాచ్‌లను జింబాబ్వే ఫీల్డర్లు జారవిడిచారు. ఇందుకు జింబా‍బ్వే భారీ మూల్యం చెల్లించుకోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement