సఫారీ బ్యాటర్‌తో సుందర్ ఫైట్.. కార‌ణ‌మిదే? | Why David Miller-Washington Sundar Fought In IND vs SA Super 8 Clash | Sakshi
Sakshi News home page

T20 WC 2026: సఫారీ బ్యాటర్‌తో సుందర్ ఫైట్.. కార‌ణ‌మిదే?

Feb 23 2026 5:58 PM | Updated on Feb 23 2026 6:02 PM

Why David Miller-Washington Sundar Fought In IND vs SA Super 8 Clash

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో భాగంగా సౌతాఫ్రికాతో జ‌రిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో 76 ప‌రుగుల తేడాతో భార‌త్ ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. 188 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేధించ‌లేక టీమిండియా చ‌తిక‌ల ప‌డింది. ల‌క్ష్య చేధ‌న‌లో మెన్ ఇన్ బ్లూ 111 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. అయితే ఈ మ్యాచ్‌లో భార‌త్ ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్, స‌ఫారీ సూప‌ర్ స్టార్ డేవిడ్ మిల్ల‌ర్ మ‌ధ్య వాగ్వ‌దం చోటు చేసుకుంది.

అసలేమి జ‌రిగిందంటే?
సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 14 ఓవ‌ర్ వేసేందుకు కెప్టెన్ సూర్య‌కుమార్ స్పిన్న‌ర్ సుంద‌ర్‌ను ఎటాక్‌లోకి తీసుకొచ్చాడు. అయితే నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న డేవిడ్ మిల్లర్ క్రీజు వదిలి ముందుకు రావడంపై సుందర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అవుట్‌ఫీల్డ్ గ్రాస్ కాస్త త‌డిగా ఉండ‌డంతో, పరుగు తీసేటప్పుడు జారిపోకుండా ఉండేందుకు మిల్ల‌ర్ క్రీజు లైన్ అంచున నిల‌బ‌డ్డాడు.

దీంతో బౌలింగ్ వేసే క్రమంలో సుందర్ మధ్యలోనే ఆగిపోయి, మిల్లర్ క్రీజు దాటుతున్నాడంటూ అంపైర్ క్రిస్ గఫానీకి ఫిర్యాదు చేశాడు. ఇది 'మన్‌కడింగ్' (రనౌట్)లా అన్పించింది. దీంతో మిల్ల‌ర్ అస‌హనం వ్య‌క్తం చేస్తూ ఏదో ఉన్నాడు. ఓవ‌ర్ ముగిసిన త‌ర్వాత కూడా వారిద్ద‌రి మధ్య మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది.


 

 

మిల్లర్ నేరుగా సుందర్ వద్దకు వెళ్లి సీరియ‌స్‌గా మాట్లాడు. అంపైర్లు వెంటనే జోక్యం చేసుకోవ‌డంతో గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో సుంద‌ర్ బంతితో పాటు బ్యాట్‌తో కూడా విఫ‌ల‌మ‌య్యాడు. ఈ ఓట‌మితో భార‌త్ త‌మ సెమీస్ ఆశ‌ల‌ను సంక్లిష్టం చేసుకుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement