breaking news
India Vs South Africa
-
T20 WC: ‘అతడిపై వేటు నా నిర్ణయమే.. నాపై కోప్పడ్డాడు’
సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా టీమిండియా ఆదివారం సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. ఓవరాల్‌గా మూడోసారి, వరుసగా రెండోసారి పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్ ట్రోఫీ ముద్దాడిన ఏకైక జట్టుగా రికార్డు సాధించింది.లీగ్ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లను ఓడించిన భారత్.. సూపర్-8 దశలో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో మాత్రం 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. తద్వారా టీ20 వరల్డ్‌కప్‌లో పరుగుల పరంగా అతిపెద్ద పరాజయం నమోదు చేసింది.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో తుదిజట్టు కూర్పుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా అక్షర్ పటేల్ (Axar Patel) స్థానంలో వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)ను ఆడించడాన్ని మాజీ క్రికెటర్లు సైతం తప్పుబట్టారు. ఈ విషయంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా స్పందించాడు.అతడి కోపం చల్లారలేదు‘‘అక్షర్ పటేల్ ఆరోజు చాలా చాలా కోపంగా ఉన్నాడు. ఆ స్థానంలో ఏ ఆటగాడు ఉన్నా అలాగే ప్రవర్తిస్తారు. అతడొక అనుభవజ్ఞుడైన ప్లేయర్. ఐపీఎల్లో ఓ జట్టు కెప్టెన్‌గానూ ఉన్నాడు. కాబట్టి అతడి కోపంలో అర్థం ఉంది.నా వల్లే తప్పు జరిగిందని.. నన్ను క్షమించమని కోరాను. జట్టు ప్రయోజనాల దృష్ట్యానే నిర్ణయం తీసుకున్నానని అతడికి వివరించాను. కానీ అతడి కోపం చల్లారలేదు. మరుసటి రోజు వరకు కూడా అతడు నాపై కోపంగానే ఉన్నాడు’’ అని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు. అక్షర్‌ను తప్పించి..కాగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు అక్షర్ స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే, సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు అతడి పరిస్థితి మెరుగ్గానే ఉన్నా వాషీని తుదిజట్టుకు ఎంపిక చేయడంతో అక్షర్ పటేల్ తీవ్ర నిరాశకు గురైనట్లు సూర్య మాటల ద్వారా తెలుస్తోంది. అక్షర్‌ను తప్పించి.. వాషీని ఆడించాలనేది తన నిర్ణయమేనని సూర్య స్పష్టం చేయడం గమనార్హం.ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత జింబాబ్వే, వెస్టిండీస్‌లపై గెలిచి సెమీస్ చేరింది టీమిండియా. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లోనూ విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్ఈ టోర్నీలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి పదకొండు వికెట్లు తీశాడు. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో ఫైనల్లో కేవలం 27 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో అక్షర్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌ల వల్లే ఉత్కంఠ పోరులో టీమిండియాకు విజయం సాధ్యమైందని చెప్పవచ్చు.చదవండి: T20 WC: 'వరల్డ్‌కప్ కంటే.. నాన్నతో గడిపిన క్షణాలే విలువైనవి' -
T20 WC 2026: ఆరోపణలపై స్పందించిన ఐసీసీ
ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆదివారం ముగిసింది. శ్రీలంకతో కలిసి ఈ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చిన భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి జగజ్జేతగా అవతరించింది. ఇదిలా ఉంటే.. సూపర్–8 దశలోనే నిష్క్రమించిన వెస్టిండీస్ మ్యాచ్‌లు అయిపోయి పది రోజులు దాటిపోయింది. సెమీస్‌లో వెనుదిరిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసి వారం రోజులకు పైనే.పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితులుకానీ ఇన్ని రోజులైనా ఈ రెండు జట్లు భారత్‌లోనే గడపాల్సి వచ్చింది. ఇరాన్‌పై యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా వ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. గల్ఫ్ గగన తలం మూసివేయగా, వందల సంఖ్యలో భారత్ నుంచి రోజువారీ విమాన సర్వీసులు రద్దయ్యాయి. చార్టర్ విమానాల్ని ఏర్పాటు చేయాలనుకున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రయత్నాలు కూడా విఫలమవడంతో గల్ఫ్ మీదుగా వెళ్లాల్సిన కరీబియన్, సఫారీ జట్లు ఇక్కడే చిక్కుకుపోయాయి.చివరకు మంగళవారం కూడా ప్రత్యామ్నాయ ఆకాశ మార్గాల్లో ప్రత్యేక విమానాల్లో ఆటగాళ్లను స్వదేశాలకు చేర్చాలనుకున్నా... వీలుపడలేదు. ఎట్టకేలకు రెగ్యులర్ కమర్షియల్ ఫ్లయిట్లలో పంపించడంతో క్రికెటర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇంగ్లండ్‌కు ప్రాధాన్యం ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ సెమీస్‌లోనే వెనుదిరగగా.. మరుసటి రోజే స్వదేశానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో తాము భారత్‌లోనే చిక్కుకుపోవడం పట్ల విండీస్ హెడ్‌కోచ్ డారెన్ సామీ, ప్లేయర్ ఆకీల్ హొసేన్ తదితరులు ఐసీసీ తీరును విమర్శించారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సైతం ఇంగ్లండ్‌కు ఇచ్చిన ప్రాధాన్యత.. విండీస్, సౌతాఫ్రికా జట్లకు ఇవ్వలేదని.. ఇది వివక్షే అంటూ ఐసీసీపై ఆరోపణలు చేశాడు.మేము అర్థం చేసుకోగలంఈ నేపథ్యంలో ఐసీసీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, వారి కుటుంబాలు వరల్డ్‌కప్‌లో ఆయా జట్ల ప్రయాణం ముగిసిన తర్వాత కూడా స్వదేశానికి చేరుకోకపోవడం పట్ల అసంతృప్తి చెందిన తీరును మేము అర్థం చేసుకోగలం.వారి కోపంలో అర్థం ఉంది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం వల్లే ఈ పరిస్థితి. అంతర్జాతీయ గగనతల ప్రయాణాలకు ఇబ్బంది కలిగింది. క్షిపణుల ప్రయోగాలు, ప్రతీకార చర్యల వల్ల పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. అందుకే చార్టర్ ఫ్లైట్లు ఏర్పాటు చేయడంలోనూ ఆలస్యం జరిగింది.మా ఆధీనంలో లేవుఈ పరిస్థితులన్నీ ఐసీసీ ఆధీనంలో లేనివి. యుద్ధం వల్లే పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. అయినప్పటికీ ఎప్పటికప్పుడు చార్టర్ ఆపరేటర్లు, ఎయిర్‌పోర్టు అధికారులు, ప్రభుత్వాలతో మేము సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాము. ఆటగాళ్లను సురక్షితంగా స్వదేశాలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేశాము. సౌతాఫ్రికా జట్టు ఇప్పటికే బయల్దేరగా.. వెస్టిండీస్ బృందంలోని చాలా మంది సభ్యులు ఇంటికి చేరుకున్నారు’’ అని ఐసీసీ పేర్కొంది.ఇక ఐసీసీ వర్గాలు మైకేల్ వాన్ (Michael Vaughan) విమర్శలపై స్పందిస్తూ.. గగనతలంలో ఉన్న పరిస్థితులను బట్టే ఇంగ్లండ్ జట్టును ముందుగా స్వదేశానికి పంపించామని పేర్కొన్నాయి. మిగతా జట్ల ప్రయాణం గల్ఫ్ ప్రాంతం గుండా సాగాల్సినందునే ఆలస్యం అయిందని స్పష్టం చేశాయి.వారు మాత్రం ఇక్కడేఇదిలా ఉంటే.. ఐపీఎల్ సీజన్ కోసం పలువురు వెస్టిండీస్ క్రికెటర్లు భారత్‌లోనే ఉండిపోయారు. రావ్మన్ పావెల్ (కోల్‌కతా నైట్‌రైడర్స్), రూథర్‌ఫర్డ్ (ముంబై ఇండియన్స్), హెట్‌మైర్ (రాజస్తాన్ రాయల్స్), రొమారియో షెఫర్డ్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)లు మాత్రం జట్టు వెంట బయలుదేరలేదు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు త్వరలోనే తమ శిబిరాలను ప్రారంభించేందుకు సిద్ధమవడంతో ఆటగాళ్లు ఆయా జట్లతో చేరనున్నారు.చదవండి: T20 WC 2026: 'భారత్ ఒక ఛాంపియన్ జట్టు.. తప్పులు వెతకడం ఆపండి' -
డిఫెన్స్ ఆఫీసర్ కాబోయి.. క్రికెటర్‌గా: టీమిండియా స్టార్
టీమిండియా స్టార్ జితేశ్ శర్మ ఆసక్తికర విషయం వెల్లడించాడు. అసలు తాను క్రికెటర్ కావాలని ఎప్పుడూ అనుకోలేదన్నాడు. ఊహించని రీతిలో తన ప్రయాణం అంతర్జాతీయ స్థాయి వరకు చేరిందన్నాడు.భారత టీ20 జట్టులోమహారాష్ట్రకు చెందిన జితేశ్ శర్మ (Jitesh Sharma) దేశీ క్రికెట్, ఐపీఎల్లో సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు. నేపాల్‌తో మ్యాచ్ సందర్భంగా 2023లో అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 16 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 162 పరుగులు చేశాడు.చివరగా సౌతాఫ్రికా (IND vs SA)తో గతేడాది జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియాకు ఆడిన 32 ఏళ్ల జితేశ్ శర్మ.. టీ20 ప్రపంచకప్-2026 జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఆర్సీబీ స్టార్‌ఇక ఐపీఎల్లో గతేడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన జితేశ్.. తొలిసారి ట్రోఫీ ముద్దాడిన జట్టులో సభ్యుడు. రెగ్యులర్ కెప్టెన్ రజత్ పాటిదార్ గైర్హాజరీలో పలు మ్యాచ్‌లకు సారథిగానూ జితేశ్ వ్యవహరించడం విశేషం.డిఫెన్స్ ఆఫీసర్ కావాలని కలలు కనేవాడినిఇదిలా ఉంటే.. ఆర్సీబీ మాజీ స్టార్, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ పాడ్‌కాస్ట్‌లో జితేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘నా కెరీర్లో క్రికెట్ అనే ప్రణాళికే అస్సలు లేదు. నేను ఎల్లప్పుడూ డిఫెన్స్ ఆఫీసర్ కావాలని కలలు కనేవాడిని. రక్షణ రంగంలో సేవలు అందించాలని కోరుకునేవాడిని.మార్కుల కోసమే క్రికెట్‌లోకిఅది కుదరకపోతే ఆర్మీ లేదంటే ఎయిర్ ఫోర్స్‌లో చేరాలనుకున్నాను. ఇందుకోసం నిర్వహించే పరీక్షలో రాష్ట్రం తరఫున ఏదేని క్రీడలో రాణిస్తే అదనంగా 25 మార్కులు వేస్తారనే నిబంధన ఉండేది. అందుకే నేను పాఠశాల స్థాయిలో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను.అప్పుడు వికెట్ కీపర్ కోటాలో నాకు అవకాశం వచ్చింది. అప్పుడే తొలిసారి గ్లోవ్స్ తొడుక్కున్నా. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. మా చిన్నప్పటి కోచ్ ప్రీతం గాంధీ నాలోని ప్రతిభను గుర్తించారు. ఆయనే నన్ను ప్రోత్సహించారు.ఆ ఇద్దరిది కీలక పాత్రఆ తర్వాత ఓసారి నేను దినేశ్ కార్తిక్‌ను కలిశాను. వీరిద్దరే నా క్రికెట్ ప్రయాణంలో కీలక పాత్ర పోషించారు. నేను మొండివాడిని. ఏదైనా సాధించాలని అనుకుంటే అందుకోసం ఎంత కష్టమైనా భరిస్తాను. అయితే, ఆ మొండితనమే ఒక్కోసారి నా బలహీనతగానూ మారుతుంది.ఏదేమైనా ఆర్సీబీలో చేరకముందు నా ప్రతిభను అంతగా ఎవరూ నమ్మేవారు కాదు. అయితే, ఆర్సీబీ యాజమాన్యం మాత్రం నాపై నమ్మకం ఉంచి వరస అవకాశాలు ఇచ్చింది. అదే నా కెరీర్లో గొప్ప టర్నింగ్ పాయింట్ అని చెప్పగలను’’ అని జితేశ్ శర్మ ఆర్సీబీ పట్ల ప్రేమను చాటుకున్నాడు. చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్ -
సౌతాఫ్రికా, విండీస్ ముందున్నాయి.. భారత్ సెమీస్ చేరాలంటే!
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా లీగ్ దశలో అజేయంగా నిలిచింది. గ్రూప్-‘ఎ’లో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లను ఓడించి టాపర్‌గా సూపర్-8లో అడుగుపెట్టింది. అయితే, కీలక సమయంలో సమిష్టి వైఫల్యంతో సూర్యకుమార్ సేన చేతులెత్తేసింది.అతిపెద్ద పరాజయంసూపర్-8 గ్రూప్-1లో భాగంగా సౌతాఫ్రికా (IND vs SA)తో మ్యాచ్‌లో మరీ దారుణంగా 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా. తద్వారా తమ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద పరాజయాన్ని నమోదు చేసింది.అందనంత ఎత్తులో విండీస్మరోవైపు.. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా టీమిండియాను 76, వెస్టిండీస్ జింబాబ్వే (WI vs ZIM)ను 107 పరుగుల తేడాతో చిత్తు చేసి భారీ విజయాలు సాధించాయి. చెరో విజయంతో రెండేసి పాయింట్లు సంపాదించాయి. అయితే, సఫారీల (+3.800)తో పోలిస్తే విండీస్ (+5.350)నెట్‌రన్‌రేటు పరంగా అత్యంత పటిష్ట స్థితిలో నిలిచి టాపర్‌గా ఉంది.మరోవైపు భారత్ (-3.800) ఘోర పరాజయంతో వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో చెన్నై వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో.. అదే విధంగా ఆదివారం విండీస్‌తో మ్యాచ్‌లో తప్పక భారీ తేడాతో గెలవాలి. లేదంటే సెమీస్ చేరకుండానే నిష్క్రమించాల్సి వస్తుంది. గెలుపు ముఖ్యం.. ఆ తర్వాతే ఏదైనాఅయితే, జింబాబ్వేతో మ్యాచ్‌లో నెట్‌రన్‌రేటు కంటే కూడా గెలుపే ముఖ్యంగా ఆడాలని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అంటున్నాడు. ‘‘జింబాబ్వేతో మ్యాచ్‌లో మొదట విజయం గురించి మాత్రమే ఆలోచించాలి. గెలిస్తేనే కదా నెట్‌రన్‌రేటు లెక్కలోకి వచ్చేది. ఇప్పుడు మనకు గెలుపు పాయింట్లు అత్యంత ముఖ్యం.ఏదేమైనా ఇప్పుడు నెట్‌రన్‌రేటు పరంగా వెస్టిండీస్‌ను మనం ఓడించడం అసాధ్యం. టీ20 క్రికెట్లో జింబాబ్వే, వెస్టిండీస్ వంటి జట్లపై 100 పరుగుల తేడాతో విజయాలు సాధించడం కష్టం. కాబట్టి తదుపరి రెండు మ్యాచ్‌లలో గెలుపు ఒక్కటే మనకు ముఖ్యం. ఆ తర్వాతే నెట్‌రన్‌రేటు గురించి ఆలోచించాలి.ఇంత చెత్తగా ఆడతారా?సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో మూడు విభాగాల్లో భారత్ విఫలమైంది. కనీసం ఒక్క బ్యాటర్ కూడా మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేయలేదు. అందువల్లే భారీ తేడాతో ఓడి సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్నాం. ఏదేమైనా ప్రస్తుతం వెస్టిండీస్, సౌతాఫ్రికా నెట్‌రన్‌రేటు పరంగా మనకు అందనంత ఎత్తులో ఉన్నాయి. మనం మూడు విభాగాల్లో రాణిస్తేనే ముందడుగు వేయగలం’’ అని ఇర్ఫాన్ పఠాన్ టీమిండియాకు హెచ్చరికలు జారీ చేశాడు.చదవండి: IND vs ZIM: తుదిజట్టులో సంజూ.. ఆ ముగ్గురిలో ఒకరిపై వేటు! -
T20 WC 2026: మిల్లర్‌తో రీల్ చేసిన అమ్మాయికి రేప్ బెదిరింపులు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లో 63 పరుగులు చేసి సౌతాఫ్రికా గెలుపుకు ప్రధాన కారకుడయ్యాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.ఈ అవార్డు ప్రధానోత్సవం తర్వాత ఐసీసీ ఆహ్వానిత సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ప్రిన్సీ పారిఖ్ మిల్లర్‌తో ఓ రీల్ చేసింది. మిల్లర్ చుట్టూ తిరుగుతూ వ్యంగ్యంగా చప్పట్లు కొట్టింది. ఈ రీల్‌ను ఆమె తన సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయగా మిశ్రమ స్పందన వచ్చింది. చాలామందికి ఈ రీల్ సరదాగా అనిపించగా.. కొందరికి మాత్రం నచ్చలేదు. ఫలితంగా పారిఖ్‌పై ఆన్లైన్ దాడులు జరిగాయి. ఫేస్బుక్లో రేప్ బెదిరింపులు, బాడీ షేమింగ్ కామెంట్లు వచ్చాయి.She posted this Instagram story after receiving backlash for her cringe reel. https://t.co/3cMjx42HK3 pic.twitter.com/0YUVM4RXRl— Bewda babloo 🧉 (@babloobhaiya3) February 24, 2026దీన్ని సీరియస్‌గా తీసుకున్న పారిఖ్.. ఇన్‌స్టాలో ఓ స్టోరీ పోస్ట్ చేస్తూ.. డేవిడ్ మిల్లర్‌తో చేసిన వీడియోని ఫేస్బుక్ నుంచి తొలగించాను. ఎందుకంటే వందలాది అసభ్యకరమైన కామెంట్లు, రేప్ బెదిరింపులు రావడం భరించలేకపోయానని పేర్కొన్నారు. అసభ్య కామెంట్లు పెట్టిన వారి అకౌంట్ల యూజర్‌నేమ్‌లు, మెసేజ్‌లు బయట పెడతానని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మున్ముందు ఎవరికీ ఇలాంటి బెదిరింపులు రాకూడదని రాసుకొచ్చారు. ప్రిన్సీ పారిఖ్ ఐసీసీ ఆహ్వానించిన ఇన్‌ఫ్లూయెన్సర్లలో ఒకరు. ఆమెకు ఇన్‌స్టాలో 1.7 మిలియన్లు, ఫేస్బుక్లో 30 వేల ఫాలోవర్లు ఉన్నారు. ఆమె గతంలో హార్దిక్ పాండ్యా, కేన్ విలియమ్సన్, స్మృతి మంధానతో కూడా రీల్స్ చేశారు.ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా సెమీస్‌కు చేరుతుందని చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే వెస్టిండీస్, సౌతాఫ్రికా తమతమ తొలి మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించి సెమీస్ రేసులో దూసుకుపోతున్నాయి. -
'వాళ్లేం మాల్కం మార్షల్ కాదు'.. హార్దిక్, దూబేపై అక్తర్ సంచలన వ్యాఖ్యలు
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా సెమీఫైనల్‌కు చేరుతుందా? లేదా? అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో భారత్ ఘోరంగా ఓడిపోవడంతో పరిస్థితి అంతా తారుమారైంది. గ్రూపు-1 పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్ధానంలో ఉంది. నెట్రన్ రేట్(-3.800) భారీగా పడిపోయింది.దీంతో భారత్ సెమీస్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో భారీ విజయాలతో పాటు, ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ భారత్ విఫలమైంది.21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన సఫారీలను భారత బౌలర్లు ఆపలేకపోయారు. మిడిల్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకుంటూ ఓటమిలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో భారత బౌలింగ్‌పై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత వద్ద సరైన ఫాస్ట్ బౌలర్లు లేరని అక్తర్ అన్నాడు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు ఏమి మాల్కమ్ మార్షల్ వంటి బౌలర్లు కాదని అక్తర్ ఎద్దేవా చేశాడు."సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో భారత బౌలింగ్ పూర్తిగా తేలిపోయింది. సాధారణంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 97 నుంచి 98 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తాడు. కానీ ఈ మ్యాచ్‌లో 94 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. అతడిని డెవాల్డ్ బ్రెవిస్ టార్గెట్ చేశాడు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నారు.వారిద్దరూ ఏమి ప్రత్యర్ధి బ్యాటర్లను భయపెట్టే మాల్కమ్ మార్షల్లు కారు. డెత్ ఓవర్లలో అటువంటి వారితో బౌలింగ్ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రోటీస్‌తో మ్యాచ్‌లో అదే జరిగింది. ఈ మ్యాచ్‌లో పాండ్యా 45 పరుగులు సమర్పించుకున్నాడు" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ పేర్కొన్నాడు. -
'గంభీర్ రాజకీయాలు చేస్తున్నాడు.. సూర్యతో కుల్దీప్కు గొడవ'
టీ20 ప్రపంచకప్-2026లో భారత జట్టు పరిస్థితి గందరగోళంగా మారింది. లీగ్ స్టేజిలో వరుస విజయాలతో అదరగొట్టిన మెన్ ఇన్ బ్లూ, కీలకమైన సూపర్-8 స్టేజిలో మాత్రం తేలిపోయింది. సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో ఘోర ఓటమి చవిచూసిన భారత్ .. తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.సెమీస్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ భారత్ కచ్చితంగా గెలవాల్సిందే. అంతేకాకుండా ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన ఓ ప్రయోగం బెడిసి కొట్టింది.అద్బుతమైన ఫామ్‌లో ఉన్న అక్షర్ పటేల్‌కు కాదని వాషింగ్టన్ సుందర్‌కు తుది జట్టులో ఛాన్స్ వచ్చారు. సుందర్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ విఫలమయ్యాడు. దీంతో గంభీర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంభీర్‌పై పాకిస్తాన్ మాజీ ఓపెనర్ అహ్మద్ షెహజాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గౌతమ్ గంభీర్ వ్యవహారశైలి జట్టును దెబ్బతీస్తోందని అతడు అన్నాడు."గంభీర్ వ్యూహత్మక నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యాడు. తుది జట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం బ్యాటర్లను ఆడించాల్సిన అవసరం ఏముంది? గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రత్యర్థికి కలిసొచ్చింది. ఐడైన్ మార్క్రామ్ వంటి పార్ట్ టైమ్ బౌలర్ వచ్చి వికెట్ తీస్తే, అది జట్టుపై అనవసరమైన ఒత్తిడిని కచ్చితంగా పెంచుతోంది.భారత జట్టు వద్ద చాలా అప్షన్స్ ఉన్నాయి. అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. కానీ గంభీర్ ఆటగాళ్లను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి మ్యాచ్ విన్నర్లను భారత్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది. పాకిస్తాన్‌తో మ్యాచ్ అనంతరం కుల్దీప్ యాదవ్‌ను సూర్య వెనక్కి నెట్టివేసిన వీడియో ఒకటి వైరలైంది.బహుశా సూర్యకుమార్‌తో ఉన్న గొడవ వల్లే కులదీప్‌ను తప్పించారని అందరూ అనుకుంటున్నారు. లేదంటే కుల్దీప్ లాంటి స్టార్ స్పిన్నర్ పక్కన పెట్టే ఛాన్సే లేదు. ఏదైనా రంగంలో రాణించాలంటే పూర్తి ఏకాగ్రత అవసరం. కానీ గంభీర్ రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల అతడి ఆలోచనా దృక్పథం పూర్తిగా మారిపోయింది.గంభీర్ రాజకీయాల్లో పెద్దగా రాణించలేక తిరిగి వెనక్కి వచ్చేశాడు. ఇప్పుడు అదే తరహా రాజకీయాలను టీమిండియాలో చేస్తున్నాడు. గంభీర్ తన సొంతప్రయోగాలతో భారత జట్టు ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాడు" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షెహజాద్ పేర్కొన్నాడు. -
'వరల్డ్‌కప్ ఒక ఫారెస్ట్ లాంటిది.. వారిద్దరి ఆట తీరు మారాలి'
టీ20 వరల్డ్‌కప్-2026లో టీమిండియా యువ బ్యాటర్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మలు దారుణ ప్రదర్శన కనబరుస్తున్నారు. అభిషేక్ శర్మ వరుసగా మూడు డకౌట్లు కాగా.. తిలక్ కూడా తన జిడ్డు బ్యాటింగ్‌తో తీవ్ర నిరాశపరుస్తున్నాడు.ఆదివారం అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. అభిషేక్ 13 పరుగులు చేయగా, తిలక్ డకౌటయ్యాడు. ఇప్పటివరకు తిలక్ ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో 21.40 సగటుతో కేవలం 107 పరుగులు మాత్రమే చేశాడు.అతని స్ట్రైక్ రేట్ 119 కంటే తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై భారత మాజీ క్రికెటర్ సదాగోపన్ రమేష్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో ఒత్తిడిని తట్టుకోలేకపోతే ఇటువంటి ఫలితాలే ఎదురవతాయని అతడు హెచ్చరించాడు."అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు వారు చూసింది కేవలం గార్డెన్ మాత్రమే, కానీ ప్రపంచకప్ అనేది ఒక అడవి లాంటిది. ఇక్కడ వేటాడాలి, లేదంటే మీరే బలి అవుతారు. ఇటువంటి ఐసీసీ టోర్నీల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దానిని తట్టుకుని ఆడడం నేర్చుకోవాలి" అని రమేష్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.ఇక డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ తమ తొలి సూపర్-8 మ్యాచ్‌లోనే ఓడిపోవడంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. భారత్ సెమీస్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో భారీ తేడాతో విజయం సాధించాలి. -
అతడొక అద్భుతం.. కానీ: పాక్ మాజీ క్రికెటర్ యూటర్న్
టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్ శర్మ.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో మాత్రం తేలిపోతున్నాడు. కెరీర్లో తొలిసారి వరల్డ్‌కప్ ఈవెంట్లో ఆడుతున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.హ్యాట్రిక్ డకౌట్లులీగ్ దశలో అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లతో ఆడిన మ్యాచ్‌లలో అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ అభిషేక్ బ్యాటింగ్ శైలిని విమర్శించాడు. కేవలం పవర్ హిట్టింగ్‌పైనే ఆధారపడతాడని.. అతడి టెక్నిక్ సరిగ్గా లేదని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా అతడిని ‘స్లాగర్’గా అభివర్ణించాడు.పరుగులు చేయాలనే తొందరలో వికెట్ పారేసుకుంటున్నాడని.. టెక్నిక్‌తో ఆడటం అతడికి చేతకాదని ఆమిర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీంతో టీమిండియా అభిమానులు అతడిపై ఫైర్ అయ్యారు. అభిషేక్ శర్మ టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్ అని.. ఆటగాడి కెరీర్లో ఎత్తుపల్లాలు సహజమంటూ భారత ఆటగాడికి మద్దతుగా నిలిచారు.మరోసారి విఫలంఇక సూపర్-8 దశలో తొలి మ్యాచ్‌లోనూ అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో ఆదివారం నాటి పోరులో ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 12 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాది 15 పరుగులు చేశాడు. మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో కార్బిన్ బాష్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ఆమిర్ యూటర్న్!ఈ నేపథ్యంలో మహ్మద్ ఆమిర్ మరోసారి అభిషేక్ శర్మ గురించి వ్యాఖ్యలు చేశాడు. తన మాటలను అందరూ అపార్థం చేసుకున్నారంటూ యూటర్న్ తీసుకున్నాడు. ‘‘బౌలర్ వైపు నుంచి నేను అభిషేక్ శర్మ ఆటను విమర్శించాను. అతడి టెక్నిక్ గురించి మాత్రమే నేను మాట్లాడాను.కానీ నేను స్లాగర్ అన్న పదం వాడటం చాలా మందికి నచ్చలేదు. పటిష్ట జట్టు, బౌలర్లను ఎదుర్కోవాల్సి వచ్చినపుడు కాస్త ఓపికగా ఉండాలని చెప్పాను. ఎందుకంటే అభిషేక్ శర్మ బలహీనత ఏమిటో అందరికీ తెలిసిపోయింది. వాళ్లు అతడిని ఈజీగా ట్రాప్ చేయగలరు.అద్భుతమైన నైపుణ్యాలు.. కానీతాజా మ్యాచ్‌లో అతడు పద్నాలుగు పరుగులను ఒకే వైపు నుంచి రాబట్టాడు. అవి కూడా చెత్త బంతుల ద్వారా వచ్చిన పరుగులే. రబడ బౌలింగ్ మొదలుపెట్టాగానే.. అభిషేక్ శర్మ తెల్లముఖం వేశాడు.సీనియర్ ఆటగాడిగా నేను అభిషేక్ శర్మకు ఓ సలహా ఇస్తున్నా. నీ టెక్నిక్ గురించి ప్రత్యర్థులకు తెలిసిపోయింది. కాస్త ఓపికగా ఉండి.. బంతి ఎలా వస్తుందో అర్థం చేసుకుని ఆడితే నువ్వు మళ్లీ మునుపటిలా విజృంభించగలవు.అతడికి అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. అయితే, వాటిని అతడు ఎలా ఉపయోగించుకుంటాడన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. నేను చెప్పాలనుకుంది ఇదే. కానీ చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు’’ అని మహ్మద్ ఆమిర్ చెప్పుకొచ్చాడు. చదవండి: కెప్టెన్, హెడ్‌కోచ్ ఏం చేస్తున్నారు?.. భారత మాజీ క్రికెటర్ ఆగ్రహం -
సఫారీ బ్యాటర్‌తో సుందర్ ఫైట్.. కారణమిదే?
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 188 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా చతికల పడింది. లక్ష్య చేధనలో మెన్ ఇన్ బ్లూ 111 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, సఫారీ సూపర్ స్టార్ డేవిడ్ మిల్లర్ మధ్య వాగ్వదం చోటు చేసుకుంది.అసలేమి జరిగిందంటే?సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసేందుకు కెప్టెన్ సూర్యకుమార్ స్పిన్నర్ సుందర్‌ను ఎటాక్‌లోకి తీసుకొచ్చాడు. అయితే నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న డేవిడ్ మిల్లర్ క్రీజు వదిలి ముందుకు రావడంపై సుందర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అవుట్‌ఫీల్డ్ గ్రాస్ కాస్త తడిగా ఉండడంతో, పరుగు తీసేటప్పుడు జారిపోకుండా ఉండేందుకు మిల్లర్ క్రీజు లైన్ అంచున నిలబడ్డాడు.దీంతో బౌలింగ్ వేసే క్రమంలో సుందర్ మధ్యలోనే ఆగిపోయి, మిల్లర్ క్రీజు దాటుతున్నాడంటూ అంపైర్ క్రిస్ గఫానీకి ఫిర్యాదు చేశాడు. ఇది 'మన్కడింగ్' (రనౌట్)లా అన్పించింది. దీంతో మిల్లర్ అసహనం వ్యక్తం చేస్తూ ఏదో ఉన్నాడు. ఓవర్ ముగిసిన తర్వాత కూడా వారిద్దరి మధ్య మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది.The zen masters lost it! Miller vs Sundar explodes 🤬Both are usually the calmest on the field, but this time even they couldn’t keep their cool 🔥 Backing up too far?#INDvsSA #CricketFever #T20WorldCup2026 #Cricket pic.twitter.com/OWStXaB1PY— Cricket Update (@sportshourly) February 23, 2026 మిల్లర్ నేరుగా సుందర్ వద్దకు వెళ్లి సీరియస్‌గా మాట్లాడు. అంపైర్లు వెంటనే జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో సుందర్ బంతితో పాటు బ్యాట్‌తో కూడా విఫలమయ్యాడు. ఈ ఓటమితో భారత్ తమ సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. -
మీ వల్లే ఈ ఓటమి: భారత మాజీ క్రికెటర్ ఆగ్రహం
పొట్టి క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో భారత్‌కు కనీవినీ ఎరుగని పరాజయం ఎదురైంది. టీ20 వరల్డ్‌కప్-2026 ఈవెంట్లో టీమిండియా అవమానకర రీతిలో సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది. సూపర్-8 కీలక మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓటమిపాలై.. పరుగుల పరంగా అతిపెద్ద పరాజయం నమోదు చేసింది.ఊహించని షాక్ఈ నేపథ్యంలో టీమిండియా నాయకత్వ బృందంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆల్‌రౌండర్, వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను తుదిజట్టులో ఆడించకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ విషయంపై భారత మాజీ బ్యాటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ కూడా స్పందించాడు.తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఇది ఊహించని షాక్. తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇది సాధారణ ఓటమి కాదు. వాళ్లు మనల్ని చిత్తు చిత్తుగా ఓడించారు. సౌతాఫ్రికా టీమిండియాపై భారీ విజయం సాధించింది.కెప్టెన్, హెడ్‌కోచ్ ఏం చేస్తున్నారు?ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌ను సఫారీ బ్యాటర్లు అటాక్ చేసిన తీరు మరీ ఘోరం. ఇందుకు కెప్టెన్, హెడ్‌కోచ్ జవాబుదారులుగా ఉండాలి. యాజమాన్యంతో పాటు ఆటగాళ్లు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టారు.అహంకారం వద్దునెట్ రన్ రేటు గురించి ఆలోచనే లేదు. సెలక్షన్ విషయంలోనూ తప్పులు. మనవాళ్ల బ్యాటింగ్ శైలి ఏమాత్రం సరిగ్గాలేదు. వీటన్నిటికీ యాజమాన్యం సమాధానం చెప్పాలి. జింబాబ్వేతో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి మధ్య సన్నని రేఖ మాత్రమే ఉంటుంది. టీమిండియా దానిని తుడిచివేసేలా కనిపిస్తోంది’’ అంటూ తీవ్ర స్థాయిలో బద్రీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా సమిష్టిగా విఫలమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి.. 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 187 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. చదవండి: T20 WC 2026: టీమిండియాలో కలకలం -
భారత్‌పై సౌతాఫ్రికా పేసర్ అరుదైన రికార్డు
టీ20 ప్రపంచకప్-2026లో సౌతాఫ్రికా తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో భారత్‌ను ప్రోటీస్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది.తొలుత బ్యాటింగ్‌లో 187 పరుగులు భారీ స్కోర్ చేసిన దక్షిణాఫ్రికా, అనంతరం బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. మార్కో జాన్సెన్ నాలుగు, కేశవ్ మహారాజ్ మూడు వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించారు. లుంగీ ఎంగిడీ కూడా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.ఎంగిడీ తన 4 ఓవర్ల కోటాలో వికెట్లేమీ తీయకపోయినా, కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి భారత బ్యాటర్లను కట్టడి చేశాడు. ఈ మ్యాచ్‌లో ఎంగిడీ ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. తద్వారా ఈ సఫారీ స్పీడ్ స్టార్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌పై టీ20ల్లో ఒక పేసర్ బౌండరీ ఇవ్వకుండా నాలుగు ఓవర్లు వేయడం 2019 తర్వాత ఇదే మొదటిసారి. 2019లో బెంగళూరు వేదికగా భారత్ జరిగిన టీ20 మ్యాచ్‌లో సఫారీ ఫాస్ట్ బౌలర్ బ్యూరాన్ హెండ్రిక్స్ బౌండరీ ఏమీ ఇవ్వకుండా తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేశాడు. అయితే అప్పుడు హెండ్రిక్స్ 14 పరుగులు ఇవ్వగా.. ఎంగిడీ ఇప్పుడు 15 పరుగులు ఇవ్వడం గమనార్హం. -
మా వాళ్లు అద్భుతం.. విండీస్ ప్రమాదకర జట్టు: మార్క్రమ్
టీమిండియాపై సౌతాఫ్రికా ప్రతీకారం తీర్చుకుంది. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో తమను ఓడించి ట్రోఫీ గెలుచుకున్న భారత్‌కు.. తాజా ఎడిషన్‌లో మర్చిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చింది. టీ20 వరల్డ్‌కప్-2026 సూపర్-8లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లో సూర్యకుమార్ సేనను 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.మా వాళ్లు అద్భుతంపొట్టి క్రికెట్ ప్రపంచకప్ టోర్నీల్లో టీమిండియాకు పరుగులపరంగా ఇదే అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram) హర్షం వ్యక్తం చేశాడు. టీమిండియాతో మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు అద్భుత రీతిలో రాణించారని ప్రశంసలు కురిపించాడు. గొప్ప ప్రదర్శనతో టీమిండియాను చిత్తు చేశామని సంతోషం వ్యక్తం చేశాడు.‘‘ఈ వికెట్ భిన్నంగా ఉంది. అయినప్పటికీ మా వాళ్లు పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా తమను తాము మార్చుకుని.. అద్భుతమైన నైపుణ్యాలతో వారి ప్రణాళికలను పక్కాగా అమలు చేశారు. ముఖ్యంగా మా బౌలర్లు అద్భుతం చేశారు.ఆ భాగస్వామ్యం అత్యంత కీలకంఇక మిల్లర్, బ్రెవిస్ నెలకొల్పిన భాగస్వామ్యం అత్యంత కీలకం. మ్యాచ్‌ను మా వైపు తిప్పేసింది వాళ్లే. లుంగి ఎంగిడి వంటి ప్రమాదకర బౌలర్ మా జట్టులో ఉన్నాడు. మధ్య ఓవర్లలో అతడు మాకు కీలకం. జట్టు ప్రయోజనాల కోసం ఎప్పుడు బౌలింగ్ చేయడానికైనా అతడు సిద్ధంగా ఉంటాడు.టీ20 ఫార్మాట్లో అత్యంత ప్రమాదకారితదుపరి మేము వెస్టిండీస్‌తో తలపడాల్సి ఉంటుంది. ఆ జట్టు టీ20 ఫార్మాట్లో అత్యంత ప్రమాదకారి. కాబట్టి టీమిండియాపై విజయాన్ని ఆస్వాదిస్తూనే తదుపరి మ్యాచ్‌కు పూర్తి స్థాయిలో సిద్దమవుతాము. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అనుకున్న ఫలితం రాబడతాము’’ అని మార్క్రమ్ పేర్కొన్నాడు.కాగా టీమిండియాతో సూపర్-8 మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి.. 187 పరుగులు సాధించింది. డెవాల్డ్ బ్రెవిస్ (29 బంతుల్లో 45), డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 63) యాభై బంతుల్లోనే 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.కుప్పకూలిన టీమిండియాఇక లక్ష్య ఛేదనలో భారత్‌ను కట్టడి చేయడంలో సఫారీ బౌలర్లు విజయవంతమయ్యారు. మార్కో యాన్సెన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కేశవ్ మహరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. కార్బిన్ బాష్ రెండు, మార్క్రమ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఎంగిడి నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులే ఇచ్చి అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు.ఈ క్రమంలో 18.5 ఓవర్లలో కేవలం 111 పరుగులు చేసి టీమిండియా కుప్పకూలింది. ఫలితంగా సౌతాఫ్రికా 76 పరుగుల తేడాతో జయభేరి మోగించి సెమీస్ దిశగా తొలి అడుగు వేసింది. ఇక భారత్ తదుపరి గురువారం జింబాబ్వేతో.. సౌతాఫ్రికా వెస్టిండీస్‌తో తలపడతాయి.చదవండి: అతడిని పక్కనపెట్టి తప్పు చేశారు.. రింకూ ఎందుకసలు?: మాజీ క్రికెటర్ ఫైర్ -
టీమిండియా ఘోర ఓటమి.. పగలబడి నవ్విన పాక్ మాజీ ప్లేయర్
టీ20 ప్రపంచకప్-2026 లీగ్ స్టేజీలో అజేయంగా నిలిచిన టీమిండియా.. కీలకమైన సూపర్-8లో మాత్రం తమ జోరును కొనసాగించలేకపోయింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసింది.సూర్యకుమార్ నాయకత్వంలోని భారత జట్టు బౌలింగ్‌లో కాస్త ఫర్వాలేదన్పించినప్పటికి బ్యాటింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 111 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికా బౌలర్ మార్కో జాన్సెన్ 4 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బ తీశాడు.భారత బ్యాటర్లలో శివమే దూబే(42) ఒక్కడే రాణించాడు. ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనే భారీ విజయం సాధిస్తేనే టీమిండియా సెమీస్ రేసులో ఉంటుంది. ఈ ఘోర ఓటమితో టీమిండియా రన్‌రేట్(-3.800) భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రదర్శనపై పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు."ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ అసలు రూపం బట్టబయలైంది. ఈ టోర్నీలో భారత్ ఛేజింగ్‌కు దిగడం ఇదే మొదటిసారి. లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా ఒత్తిడి తట్టుకోలేక చిత్తైంది. ఛేజింగ్‌లో భారత్ తడబడుతుందని నాకు ముందే తెలుసు. ముఖ్యంగా విరాట్ కోహ్లి వంటి సీనియర్ ఆటగాడు లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది"అని జియో న్యూస్‌కు వచ్చిన ఇంటర్వ్యూలో అమీర్ పేర్కొన్నాడు. కాగా టోర్నీకి ముందే భారత్ సెమీఫైనల్ చేరడం కష్టమని అమీర్ జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఈ టోర్నీలో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా అట్టర్ ప్లాప్ అవుతాడని అమీర్ ఇటీవల చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. అందుకు తగ్గట్టే అభిషేక్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పుడు మ్యాచ్ ఫలితం కూడా అతడు అంచనా వేసినట్లే రావడం అతడు టౌక్ ఆఫ్‌ది టౌన్‌గా మారాడు. భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ అనంతరం అమీర్ జియో న్యూస్ చానల్లో జరిగిన చర్చలో పాల్గొన్నాడు. యాంకర్ అతడిని జ్యోతిష్యుడు అంటూ పరిచయం చేయగానే అమీర్ పగలబడి నవ్వుతూ “దేవుడా నన్న క్షమించు, నాకు ఏంటి ఇది” అంటూ స్పందించాడు. దీంతో అతడికి భారత్ అభిమానులు గట్టిగా కౌంటరిస్తున్నారు. టీమిండియా వరుసగా రెండు మ్యాచ్‌లలో గెలిచి సెమీస్‌కు కచ్చితంగా వస్తుందని పోస్టులు పెడుతున్నారు. కాగా టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో గురువారం జింబాబ్వేతో తలపడనుంది. -
వాళ్లిద్దరు సూపర్.. తిలక్ వర్మ విఫలం: భారత దిగ్గజం
సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. చెత్త ప్రదర్శనతో భారీ మూల్యమే చెల్లించారంటూ భారత మాజీ క్రికెటర్లు సూర్యకుమార్ సేనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తుదిజట్టు కూర్పు విషయంలో తప్పు జరిగిందంటూ హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ను సైతం విమర్శిస్తున్నారు.ఇదే అతిపెద్ద పరాజయంకాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో తలపడ్డ టీమిండియా.. ఏకంగా 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో భారత్‌కు పరుగుల పరంగా ఇదే అతిపెద్ద పరాజయం. ఈ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు బదులు వాషింగ్టన్ సుందర్‌ను ఆడించడం విమర్శలకు దారి తీసింది.ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) తనదైన శైలిలో స్పందించాడు. భారత బ్యాటర్లలో ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఆడలేదని విమర్శించాడు. ముఖ్యంగా వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ ఆడిన తీరు తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని పేర్కొన్నాడు.వారిద్దరు సూపర్‘‘సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis), డేవిడ్ మిల్లర్ అద్భుత రీతిలో భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గట్టెక్కించారు. అయితే, టీమిండియా బ్యాటర్లు మాత్రం వారి నుంచి ఏమీ నేర్చుకోలేకపోయారు. వచ్చీ రాగానే బౌండరీ కొట్టాలనే తలంపుతో వికెట్ పారేసుకున్నారు.టీ20 క్రికెట్లో ఇలా ఆడటం సరికాదు. ప్రత్యర్థి జట్టు ఏం చేసిందో చూసిన తర్వాత కూడా ఇలాగే చేస్తారా? వికెట్ అంతగా అనుకూలించకపోయినా వాళ్లు మెరుగ్గా ఆడారు. కానీ మనం.. ఇగోకు పోయాము. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వికెట్లు పోగొట్టుకున్నాం. సౌతాఫ్రికా అద్భుత ప్రదర్శనతో టీమిండియాను చిత్తు చేసింది.తిలక్ వర్మ నిరాశపరిచాడుఈ విజయానికి వారు పూర్తిగా అర్హులు. ఇక తిలక్ వర్మ (Tilak varma) విషయానికొస్తే.. అతడు తెలివైన బ్యాటర్. కానీ ఈ మ్యాచ్‌లో అతడు ఆడిన తీరు నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఓవర్‌కు 9.5 పరుగులు రాబట్టాల్సింది. కానీ మనోళ్లు 15 పరుగులు చేయాలి అన్నట్లుగా తొందరపడ్డారు.తిలక్ ఇంకాసేపు సమయం తీసుకుని క్రీజులో నిలదొక్కుకోవాల్సింది. అభిషేక్ శర్మ వరుస వైఫల్యాల నేపథ్యంలో తిలక్ కాస్తైనా బాధ్యతాయుతంగా ఆడాల్సింది. కానీ అతడు పూర్తిగా విఫలమయ్యాడు’’ అని గావస్కర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.దూబే ఒక్కడేకాగా అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికా విధించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 111 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్‌లో ఇషాన్ కిషన్ డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ 15 పరుగులు చేయగలిగాడు. తిలక్ వర్మ రెండు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగే చేసి పెవిలియన్ చేరాడు. మిగిలిన వారంతా కూడా విఫలం కాగా.. శివం దూబే 42 పరుగులతో రాణించడంతో భారత్ వంద పరుగుల మార్కు దాటగలిగింది.చదవండి: అతడిని పక్కనపెట్టి తప్పు చేశారు.. రింకూ ఎందుకసలు?: మాజీ క్రికెటర్ ఫైర్ -
హార్దిక్ పాండ్యా ఫెయిల్.. గర్ల్‌ఫ్రెండ్ రియాక్షన్ వైరల్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా తొలి పరాజయం నమోదు చేసింది. కీలక సూపర్-8 దశలో మొదటి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది. తద్వారా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.అహ్మదాబాద్ వేదికగా సఫారీలతో ఆదివారం తలపడ్డ సూర్యకుమార్ సేన.. 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది.ధనాధన్ దంచికొట్టి..డెవాల్డ్ బ్రెవిస్ (29 బంతుల్లో 45), డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 63), ట్రిస్టన్ స్టబ్స్ (24 బంతుల్లో 44 నాటౌట్) ధనాధన్ దంచికొట్టి ప్రొటిస్ జట్టును ఈ మేరకు పటిష్ట స్థితిలో నిలిపారు. భారత బౌలర్లలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు, అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి, శివం దూబే తలా ఒక వికెట్ పడగొట్టారు.𝘿𝙚𝙖𝙩𝙝, 𝙩𝙖𝙭𝙚𝙨, 𝙖𝙣𝙙 𝙑𝙖𝙧𝙪𝙣 𝙥𝙞𝙘𝙠𝙞𝙣𝙜 𝙬𝙞𝙘𝙠𝙚𝙩𝙨! 😌1️⃣8️⃣ consecutive innings with a wicket for Varun Chakravarthy in T20Is (Most by an Indian).ICC Men's #T20WorldCup | SUPER 8 | #INDvSA | LIVE NOW 👉 https://t.co/dZWPZfqfbO pic.twitter.com/AmgTPxI3tU— Star Sports (@StarSportsIndia) February 22, 2026దారుణంగా విఫలమైన హార్దిక్ పాండ్యాఇక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి ఏకంగా 45 పరుగులు సమర్పించుకుని.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అదే విధంగా లక్ష్య ఛేదనలోనూ హార్దిక్ బ్యాట్‌తో విఫలమయ్యాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన హార్దిక్.. 17 బంతులు ఎదుర్కొని కేవలం 18 పరుగులే చేశాడు.చప్పట్లు కొట్టిన మహీకసఫారీ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో.. భారీ షాట్‌కు యత్నించి స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చిన హర్దిక్ పాండ్యా పెవిలియన్ చేరాడు. ఈ సందర్భంగా హార్దిక్ ప్రేయసి మహీక శర్మ వ్యవహరించిన తీరు వైరల్‌గా మారింది. హార్దిక్ అవుట్ కాగానే లేచి నిలబడిన మహీక చప్పట్లు కొడుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.Hardik Pandya's girlfriend Mahieka Sharma was clapping when Hardik got out 😭 pic.twitter.com/GFJvy5NA23— Tejash (@Tejashyyyyy) February 22, 2026గర్ల్‌ఫ్రెండ్ బర్త్‌డే వేడుకలలో..ఈ నేపథ్యంలో మహీకకు అసలు క్రికెట్ గురించి తెలుసా? అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. అయితే, హార్దిక్ అభిమానులు మాత్రం.. అతడిని నిరాశ చెందవద్దని చెప్పేందుకే ఆమె క్లాప్ చేసిందని అంటున్నారు. కాగా భార్య నటాషా స్టాంకోవిక్‌తో విడాకులు తీసుకున్న కొన్నాళ్లకే మహీకతో తాను ప్రేమలో ఉన్నట్లు హార్దిక్ పాండ్యా వెల్లడించాడు.ఆమె వల్లే గొప్పగా ఆడుతున్నాఇక అప్పటి నుంచి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది ఈ జంట. ఈ క్రమంలో మహీక వల్లే తాను గొప్పగా ఆడుతున్నానని.. ఆమె రాకతో జీవితం మారిందని హార్దిక్ ప్రశంసలు కురిపించడం విశేషం. అయితే, తాజా మ్యాచ్‌లో మాత్రం అతడు దారుణంగా విఫలం కావడం గమనార్హం.ఈ మ్యాచ్‌కు ముందు మహీక బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తూ వేడుకల్లో మునిగిపోయాడు హార్దిక్. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో భారత్ 18.5 ఓవర్లలో కేవలం 111 పరుగులు చేసి ఆలౌట్ అయింది.చదవండి: T20 WC 2026: టీమిండియా కొంపముంచిన గంభీర్.. నెటిజన్లు ఫైర్ -
అతడు MVP.. రింకూ జట్టులో ఎందుకసలు?: మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా గ్రూప్ దశలో అజేయంగా నిలిచినా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిందన్నది వాస్తవం. తొలుత అమెరికా.. ఆఖర్లో నెదర్లాండ్స్ రూపంలో పసికూనలు.. పటిష్ట సూర్యకుమార్ సేనకు సవాలు విసిరాయి. నమీబియా, పాకిస్తాన్‌లపై మాత్రమే భారత్ ఏకపక్ష విజయం సాధించింది.76 పరుగుల తేడాతో సఫారీల చేతిలో చిత్తుగాఈ నేపథ్యంలో సూపర్-8లో జాగ్రత్తగా ఆడి సమిష్టిగా రాణించకపోతే కష్టాలు తప్పవని టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandra Ashwin) ముందుగానే హెచ్చరించాడు. అందుకు తగ్గట్లుగానే భారత్ సూపర్-8లో తమ తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైంది. సమిష్టి వైఫల్యంతో 76 పరుగుల తేడాతో సఫారీల చేతిలో చిత్తుగా ఓడిపోయింది. తద్వారా సెమీ ఫైనల్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో నిలిచింది.తప్పు చేశారుఅయితే, సౌతాఫ్రికా చేతిలో ఓటమికి ప్రధాన కారణం భారత తుదిజట్టు కూర్పేనని మెజారిటీ మంది విశ్లేషకుల అభిప్రాయం. అశ్విన్ కూడా ఇదే మాట అంటున్నాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) నిర్ణయాలను అశూ తప్పుబట్టాడు. అక్షర్ పటేల్‌ను కాదని.. వాషింగ్టన్ సుందర్‌ని ఆడించి పెద్ద తప్పే చేశారని విమర్శించాడు.‘‘ఐపీఎల్లో మ్యాచ్-అప్‌లకు అవకాశం ఉంటుంది. ప్రత్యర్థి జట్టు బ్యాటర్ల కోసం పర్టికులర్‌గా ఓ బౌలర్‌తో వ్యూహాలు అమలు చేసే వీలు ఉంటుంది. అక్కడ మనకు పద్నాలుగు మ్యాచ్‌లు ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రయోగాలు చేయవచ్చు.కానీ ఐసీసీ ఈవెంట్లలో జట్టు ఎంత స్థిరంగా ఉంటే అంత మంచిది. తరచూ మార్పులు చేయడం తగదు. ఎడమచేతి వాటం బ్యాటర్లకు బౌలింగ్ చేయించాలని వాషింగ్టన్ సుందర్‌ను తీసుకురావడాన్ని నేను వంద శాతం సమర్థిస్తాను.అతడు MVP.. అలాంటి వాడినే పక్కనపెడతారా?అదే సమయంలో అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టడాన్ని మాత్రం ఎంతమాత్రం అంగీకరించను. టీ20 క్రికెట్లో అక్షర్ అత్యంత విలువైన ఆటగాడు (MVP). ఇప్పటికే ఎన్నోసార్లు ఈ విషయాన్ని నిరూపించాడు. ముఖ్యంగా 2024 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లితో కలిసి అక్షర్ మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు.ఫలితంగా టీమిండియా 170 పరుగుల మార్కు దాటింది. అనుభవజ్ఞుడైన కోహ్లికి అక్షర్ అక్కడ సాయంగా నిలిచాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అలాంటి ఆటగాడిని పక్కన పెట్టి ఇప్పుడు భారీ మూల్యమే చెల్లించారు.చక్కటి గుణపాఠంఇక రింకూ సింగ్ విషయానికొస్తే.. మీకు ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నారు. అలాంటపుడు రింకూను ఎనిమిదో స్థానంలోనే పంపడం ఎందుకు?.. ఏదేమైనా వాషీని నేను అగౌరవపరచడం లేదు. కానీ సౌతాఫ్రికా టీమిండియాకు చక్కటి గుణపాఠం నేర్పింది. సన్నద్ధం కాకుండా మ్యాచ్‌కు వస్తే ఇలాగే జరుగుతుంది అని చాటిచెప్పింది’’ అంటూ అశ్విన్ తీవ్ర స్థాయిలో టీమిండియా నాయకత్వ బృందం తీరుపై మండిపడ్డాడు.కాగా సౌతాఫ్రికాతో ఆదివారం నాటి సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో టీమిండియా 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది.ఈ మ్యాచ్‌లో అక్షర్‌కు బదులు తుదిజట్టులో ఆడిన వాషీ.. రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యాడు. కేవలం 11 పరుగులే చేయగలిగాడు. ఇక రింకూ సింగ్ డకౌట్ అయ్యాడు. శివం దూబే 42 పరుగులతో టీమిండియా టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: T20 WC 2026: టీమిండియా కొంపముంచిన గంభీర్.. నెటిజన్లు ఫైర్ -
సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. అయినా, టీమిండియాదే వరల్డ్‌కప్..!
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 22) సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే భారత్‌కు ఇది అతి పెద్ద ఓటమి. ఈ ఓటమితో ఐసీసీ టోర్నీల్లో టీమిండియా జైత్రయాత్రకు కూడా బ్రేక్ పడింది. 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత భారత్ ఈ మ్యాచ్‌లోనే (ఐసీసీ టోర్నీల్లో) ఓటమిపాలైంది. ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలను సైతం కఠినం చేసుకుంది. మిగతా రెండు సూపర్-8 మ్యాచ్‌ల్లో జింబాబ్వే, వెస్టిండీస్‌పై విజయం సాధించినా.. భారత్ సెమీస్‌కు చేరుతుందన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే, సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత నెట్ రన్‌రేట్ -3.80కు పడిపోయింది. ఇది మెరుగుపడాలంటే భారత్ తదుపరి 2 మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించాలి. అలాగే విండీస్, జింబాబ్వే.. సౌతాఫ్రికా చేతిలోనూ ఓడాలి. ఇలా జరిగినప్పుడే భారత్ సెమీస్‌కు చేరుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా జరగడం కాస్త కష్టమే అయినా అసాధ్యమైతే కాదు.ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనూ టీమిండియాను ఓ సెంటిమెంట్ ఏకంగా టైటిల్‌నే ఊరిస్తుంది. అదేంటంటే.. స్వదేశంలో జరిగిన 2011 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ గ్రూప్ దశలో సౌతాఫ్రికా చేతిలో ఓడినా, టైటిల్ గెలిచింది. అలాగే స్వదేశంలోనే జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లోనూ భారత్ సూపర్-8లో సౌతాఫ్రికా చేతిలో ఓడినా, టైటిల్ గెలుస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ సెంటిమెంట్ సోషల్‌మీడియాలో భారత అభిమానులకు సౌతాఫ్రికా చేతిలో పరాభవాన్ని మరిచిపోయేలా చేస్తుంది. మరి ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.కాగా, సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో భారత్ బౌలింగ్ విభాగంలో పర్వాలేదనిపించినా, బ్యాటర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. ఛేదించగలిగే లక్ష్యమే అయినా ఒత్తిడికి చిత్తై చేతులెత్తేశారు.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా (4-0-15-3), అర్షదీప్ సింగ్ (4-0-28-2) 20 పరుగులకే 3 వికెట్లు తీసి ఇబ్బంది పెట్టినా, ఆతర్వాత డెవాల్డ్ బ్రెవిస్ (29 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 63; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (24 బంతుల్లో 44 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) మెరుపు విన్యాసాలతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు ఆదిలోనే చేతులెత్తేశారు. ఇన్నింగ్స్ నాలుగో బంతికే ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ డకౌటయ్యాడు. ఆతర్వాత రెండు బంతులకే ఫామ్‌లో లేని తిలక్ వర్మ (1) కూడా పెవిలియన్‌కు చేరాడు. గత మూడు మ్యాచ్‌ల్లో డకౌటై ఒత్తిడిలో ఉన్న అభిషేక్ శర్మ (15) మరోసారి అదే ఒత్తిడికి చిత్తయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ (18) బంతులు వృధా చేశాక నిస్సహాయ స్థితిలో ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్‌కు (11) ప్రమోషన్ ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. శివమ్ దూబే (42) తన సహజ శైలిలో వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. హార్దిక్ (18), రింకూ (0) కూడా నిరాశపరిచారు.మొత్తంగా భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా బౌలర్లు జన్సెన్ (3.5-0-22-4), కేశవ్ మహారాజ్ (3-0-24-3), కార్బిన్ బాష్ (3-0-12-2), మార్క్రమ్ (1-0-5-1) భారత పతనాన్ని శాశించారు. ఎంగిడి (4-0-15-0), రబాడ (4-0-32-0) వికెట్లు తీయలేకపోయినా అద్భుతంగా బౌలింగ్ చేశారు. -
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. టీమిండియాలో కీలక మార్పు
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో టీమిండియాలో కీలక మార్పు జరుగనుందని తెలుస్తుంది. జింబాబ్వేతో ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు (ఫిబ్రవరి 26) స్టార్ ఆటగాడు సంజూ శాంసన్ జట్టులోకి వస్తాడని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే హింట్ ఇచ్చాడు. రాబోయే రోజుల్లో సంజూ టాకింగ్ పాయింట్ అవుతాడని డస్కటే సౌతాఫ్రికా మ్యాచ్ పూర్తయిన అనంతరం మీడియా సమావేశంలో అన్నాడు. దీన్ని బట్టి చూస్తే జింబాబ్వే మ్యాచ్‌లో సంజూ బరిలోకి దిగడం ఖాయమని తెలుస్తుంది.సంజూ జట్టులోకి వస్తే ఎవరిపై వేటు వేస్తారన్నదే, ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హ్యాట్రిక్ డకౌట్లు సహా వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ విఫలమైన అభిషేక్ శర్మను తప్పిస్తారా లేక చెత్త ఫామ్‌లో ఉన్న తిలక్ వర్మపై వేటు వేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. డస్కటే వ్యాఖ్యలను అంచనా వేస్తే.. అభిషేక్‌పైనే వేటు పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి.ఎందుకంటే డస్కటే లెఫ్ట్ అండ్ రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ల గురించి ప్రస్తావించాడు. అతని మాటల్లో.. టాపార్డర్‌లో ఉన్న ముగ్గురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ప్రతి మ్యాచ్‌లో ఆఫ్ స్పిన్ బౌలర్లకు బలవుతున్నారు. పాకిస్తాన్ మ్యాచ్‌లో సల్మాన్ ఆఘా, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో మార్క్రమ్ పవర్‌ప్లేలోనే వికెట్లు తీశారు. దీంతో తక్కువ స్కోర్లకే భారత్ వికెట్లు కోల్పోయింది. ఇది ఆందోళన కలిగించే అంశం. గత 18 నెలల్లో బాగా ఆడిన ఆటగాళ్లను కొనసాగించాలా లేక సంజూని జట్టులోకి తీసుకురావాలా అన్నదే ప్రస్తుతం చర్చనీయాంశమని డస్కటే అన్నారు.డస్కటే వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ప్రత్యర్ది ఆఫ్ స్పిన్ ప్రయోగాలను విజయవంతంగా ఎదుర్కొని, పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా ఉండాలంటే టాపార్డర్‌లో రైట్ హ్యాండ్ బ్యాటర్ అవశ్యకత ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఆప్షన్ సంజూ మాత్రమే. సంజూను ఓపెనర్‌గా జట్టులోకి తీసుకుంటే.. ఇషాన్ కిషన్‌తో కలిసి కుడి-ఎడమ కాంబినేషన్ అవుతుంది. ఈ కాంబినేషన్‌తో ఆఫ్ స్పిన్నర్ల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడంతో పాటు మిగతా బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్‌కు కూడా భంగం కలిగించవచ్చు. జింబాబ్వే మ్యాచ్‌లో భారత మేనేజ్మెంట్ ఈ ప్రయోగాన్ని అమలు చేస్తుందో లేదో చూడాలి.ఇషాన్‌కు డిమోషన్..?ఒకవేళ భారత మేనేజ్మెంట్ తదుపరి మ్యాచ్‌ల్లో సంజూను జట్టులోకి తీసుకొని, అభిషేక్‌ను కూడా కొనసాగించాలనుకుంటే గత కొంతకాలంగా చెత్త ఫామ్‌లో తిలక్ వర్మపై వేటు వేయక తప్పదు. అప్పుడు అభిషేక్, సంజూతో ఓపెనింగ్ చేయించి, ఇషాన్‌ను వన్‌డౌన్‌లో పంపవచ్చు. అయితే ఈ అడుగు పడటం అంత సులువు కాకపోవచ్చు. ఎందుకంటే, ఓపెనర్‌గా ఇషాన్ మంచి లయలో ఉన్నాడు. అతన్ని ఆ స్థానం నుంచి తప్పించడమంటే చాలా పెద్ద సాహసం అవుతుంది. సెమీస్ అవకాశాలు కఠినమైన తరుణంలో భారత మేనేజ్మెంట్ ఇలాంటి సాహసాల జోలికి పోకపోవచ్చు. -
T20 WC 2026: టీమిండియా ఓటమికి అసలు కారణం ఇదే..!
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 22) సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ విభాగంలో పర్వాలేదనిపించినా, బ్యాటర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. ఛేదించగలిగే లక్ష్యమే అయినా ఒత్తిడికి చిత్తై చేతులెత్తేశారు. భారత బ్యాటర్లలో ఓ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. అదే ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ఒకట్రెండు డాట్ బాల్స్ పడంగానే భారత బ్యాటర్లు సహనాన్ని కోల్పోయారు. మూడో బంతికి కచ్చితంగా బౌండరీనో, సిక్సరో బాదాలనే ఆత్రంలో వికెట్ పారేసుకున్నారు. భారత ఇన్నింగ్స్ మొత్తం ఇదే జరిగింది. ముందుగా క్రీజ్‌లో కుదురుకోవాలన్న బేసిక్ సెన్స్ ఏ ఒక్కరిలో కనపడలేదు. స్ట్రయిక్ రొటేట్ అవుతుంటే ఒత్తిడి కాస్త తగ్గుతుంది. కానీ భారత బ్యాటర్లు దీనిపై దృష్టి పెట్టలేదు. ప్రతి బంతిని బాధడమే పరమావధిగా పెట్టుకున్నారు. ఇలా జరగడం చాలా కష్టం. సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ, మధ్యలో చెత్త బంతులపై ఎదురుదాడి చేసుంటే బాగుండేది, కానీ భారత బ్యాటర్లు అలా చేయలేదు.ఓ పక్క వికెట్లు పడుతున్నా, ఒక్కరు కూడా క్రీజ్‌లో కుదురుకుందామని అలోచించలేదు. అయితే సిక్సర్ లేకపోతే ఔట్ అన్నట్లు వ్యవహరించారు. ఇదే భారత్ కొంపముంచింది. సౌతాఫ్రికా కెప్టెన్ వూహాత్మకంగా ఓ వైపు నుంచి స్పిన్నర్లు, మరోవైపు నుంచి పేసర్లతో అటాక్ చేస్తున్నా, భారత బ్యాటర్లు మొండిగా ముందుకు వెళ్లారు. అందుకు తగిన మూల్యం చెల్లంచుకున్నారు. ఇదే ఆటతీరును జింబాబ్వే, విండీస్ మ్యాచ్‌ల్లో కూడా కొనసాగిస్తే.. టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలవాలన్న కల సాకారం కాకపోవచ్చు. కాబట్టి భారత బ్యాటర్లు సౌతాఫ్రికా మ్యాచ్‌తో గుణపాఠం నేర్చుకుంటే మంచిదన్నది అభిమానులందరి అభిప్రాయం.కాగా, నిన్నటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా (4-0-15-3), అర్షదీప్ సింగ్ (4-0-28-2) 20 పరుగులకే 3 వికెట్లు తీసి ఇబ్బంది పెట్టినా, ఆతర్వాత డెవాల్డ్ బ్రెవిస్ (29 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 63; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (24 బంతుల్లో 44 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) మెరుపు విన్యాసాలతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. బ్రెవిస్-మిల్లర్-స్టబ్స్ త్రయం బుమ్రా, అర్షదీప్ మినహా మిగతా భారత బౌలర్లందరిపైనా విరుచుకుపడ్డారు.వరుణ్ చక్రవర్తి (4-0-47-1), హార్దిక్ పాండ్యా (4-0-45-0), శివమ్ దూబే (2-0-32-1), వాషింగ్టన్ సుందర్ (2-0-17-0)పై ఎదురుదాడి చేశారు.అనంతరం ఓ మోస్తరుకు మించిన లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు సైతం ఆదిలోనే తడబడ్డారు. అయితే సౌతాఫ్రికన్లలా కాకుండా మిడిలార్డర్ పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో భారత ఓటమి ఛేదన ప్రారంభమైన కొద్ది సమయంలోనే ఖరారైపోయింది. నాలుగో బంతికే ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ డకౌటయ్యాడు. ఆతర్వాత రెండు బంతులకే ఫామ్‌లో లేని తిలక్ వర్మ (1) కూడా పెవిలియన్‌కు చేరాడు. గత మూడు మ్యాచ్‌ల్లో డకౌటై ఒత్తిడిలో ఉన్న అభిషేక్ శర్మ (15) మరోసారి అదే ఒత్తిడికి చిత్తయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ (18) క్రీజ్‌లోకి వచ్చిన వెంటనే పలు చూడముచ్చటైన షాట్లు ఆడినా, బంతులు వృధా కావడంతో ఒత్తిడిలో పడి వికెట్ సమర్పించుకున్నాడు. వాషింగ్టన్ సుందర్‌కు (11) ప్రమోషన్ ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. శివమ్ దూబే (42) తన సహజ శైలిలో వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. హార్దిక్ (18), రింకూ (0) కూడా నిరాశపరిచారు.మొత్తంగా భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా బౌలర్లు జన్సెన్ (3.5-0-22-4), కేశవ్ మహారాజ్ (3-0-24-3), కార్బిన్ బాష్ (3-0-12-2), మార్క్రమ్ (1-0-5-1) భారత పతనాన్ని శాశించారు. ఎంగిడి (4-0-15-0), రబాడ (4-0-32-0) వికెట్లు తీయలేకపోయినా అద్భుతంగా బౌలింగ్ చేశారు. -
T20 WC 2026: ముందుకు పోవాలంటే అన్నీ గెలవాల్సిందే..!
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్ నిన్న (ఫిబ్రవరి 22) తమ తొలి సూపర్-8 మ్యాచ్ ఆడింది. అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఊహించని పరాభవం ఎదుర్కొంది. తద్వారా సెమీస్ అవకాశాలను కఠినం చేసుకుంది. సెమీస్‌కు చేరాలంటే టీమిండియా ఇకపై ఆడే రెండు మ్యాచ్‌లు (వెస్టిండీస్, జింబాబ్వే) గెలవాల్సిందే. ఏ ఒక్క మ్యాచ్‌లో తడబడినా ఇతర జట్ల ఫలితాలు, నెట్ రన్‌రేట్‌పై ఆధార పడాల్సిన పరిస్థితి వస్తుంది. టీమిండియా ఈ స్థితికి రాకుండా ఉండాలంటే జింబాబ్వే, వెస్టిండీస్‌లను చిన్న జట్లని తక్కువ అంచనా వేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.విండీస్, జింబాబ్వే పేరుకే చిన్న జట్లైనా, ఈ ప్రపంచకప్‌లో వారు ఏం చేశారో చూశాం. టీమిండియా లాగే ఆ జట్లు కూడా గ్రూప్ దశలో అన్ని మ్యాచ్‌లు గెలిచి టాపర్లుగా సూపర్-8లోకి అడుగుపెట్టాయి. పైగా ఆ జట్లు గ్రూప్ దశలో తమకంటే చాలా మెరుగైన జట్లపై విజయాలు సాధించాయి. జింబాబ్వే అయితే ఏకంగా ఆస్ట్రేలియా లాంటి అత్యుత్తమ జట్టుకే షాకిచ్చింది. శ్రీలంకను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించింది. విండీస్ విషయానికొస్తే.. ఈ జట్టులో ఇటీవలికాలంలో ఎప్పుడూ కనపడని జోష్ కనిపిస్తుంది. పటిష్టమైన ఇంగ్లండ్‌కు షాకివ్వడంతో పాటు చిన్న జట్లపై పెద్దగా కష్టపడకుండానే విజయాలు సాధించింది.భారత్ ఫిబ్రవరి 26న జింబాబ్వేతో.. మార్చి 1న వెస్టిండీస్‌తో తలపడాల్సి ఉంది. జింబాబ్వే మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో.. విండీస్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సి ఉన్నాయి. ఆయా వేదికలు భారత్‌కు అనుకూలమే అయినప్పటికీ.. ఏమరపాటుగా ఉంటే మాత్రం సౌతాఫ్రికా చేతిలో ఎదురైన పరాభవమే పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి చిన్న జట్లని తేలికగా తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. -
టీమిండియా కొంపముంచిన గంభీర్.. నెటిజన్లు ఫైర్
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 74 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమైంది.188 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా చతికలపడింది. అయితే టీమ్‌మెనెజ్‌మెంట్ చేసిన కొన్ని తప్పిదాలు కూడా మెన్ ఇన్ బ్లూ ఓటమికి కారణమమ్యాయి. ముఖ్యంగా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్ధానంలో వాషింగ్టన్ సుందర్‌ని ఆడించి భారత మెనెజ్‌మెంట్ ఘోర తప్పిదం చేసింది.అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అక్షర్‌కు నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. అతడి స్దానంలో సుందర్‌ను తుది జట్టులో ఆడించారు. అయితే సఫారీలతో సూపర్-8 మ్యాచ్‌కు అక్షర్ తిరిగి అందుబాటులోకి వస్తాడని అంతా భావించారు. కానీ అక్షర్‌ను బెంచ్‌కే పరిమితం చేస్తూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఇది కేవలంవ్యూహాత్మక నిర్ణయం మాత్రమేని చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికా టాప్-5లో ముగ్గురు ఎడమచేతి బ్యాటర్లు ఉండడంతో, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ కంటే ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ వుంటే బాగుంటుందని మేనేజ్మెంట్ భావించింది. కానీ మెనెజ్‌మెంట్ వ్యూహం బెడిసికొట్టింది. పవర్‌ప్లేలో సుందర్‌తో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయింలేదు.కెప్టెన్ అతడిని ఏడో ఓవర్లో ఎటాక్‌లోకి తీసుకొచ్చాడు. అలా అనీ నాలుగు ఓవర్ల కోటా కూడా పూర్తి చేయించలేదు. సుందర్ రెండు ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్‌లో కూడా సుందర్ అట్టర్ ప్లాప్ అయ్యాడు. 11 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో గంభీర్‌పై నెటిజన్లు ఫైరవతున్నారు. "కేవలం 'మ్యాచ్-అప్'ల కోసం ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ను తప్పించడం ఎంతవరకు సమంజసం?" అని గంభీర్‌ను ప్రశ్నిస్తున్నారు. -
మా ఓటమికి కారణమదే.. మళ్లీ బలంగా తిరిగొస్తాం: సూర్యకుమార్
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. ఈ మెగా టోర్నీలో బాగంగా అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఈ ఓటమికి బౌలర్ల కంటే బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణమని సూర్య చెప్పుకొచ్చా డు."మ్యాచ్ ఆరంభంలో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. 20 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి జట్టును బ్యాక్‌ఫుట్‌లో ఉంచాం. కానీ ఆ తర్వాత వారు ఆడిన తీరు నిజంగా అద్బుతం. పవర్‌ప్లే ముగిసిన తర్వాత దాదాపు 15 ఓవర్లకు మాపై పైచేయి సాధించారు.తర్వాత మళ్లీ వరుసగా వికెట్లు పడగొట్టి మేము తిరిగి గేమ్‌లోకి వచ్చాము. చివరి ఓవర్లో మళ్లీ పరుగులు వచ్చాయి. ఓవరాల్‌గా బౌలింగ్ పరంగా ఫర్వాదేన్పించాము. బుమ్రా, అర్ష్‌దీప్ జోడీ అద్బుతంగా బౌలింగ్ చేసింది. ఇద్దరూ కలిసి 5 వికెట్లు పడగొట్టారు.అయితే బ్యాటింగ్ కాస్త మెరుగ్గా చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. 180 పరుగులు పైగా లక్ష్యాన్ని చేధిస్తున్నప్పుడు పవర్‌ప్లే అనేది చాలా ముఖ్యం. కానీ దురదృష్టవశాత్తూ పవర్‌ప్లేలో మేము రాణించలేకపోయాం. వరుసగా వికెట్లు కోల్పోవడంతో చిన్న చిన్న భాగస్వామ్యాలు కూడా నెలకొల్పలేకపోయాం. కచ్చితంగా ఈ ఓటమిని నుంచి పాఠాలు నేర్చుకుంటాము. మళ్లీ బలంగా తిరిగి వస్తామన్న నమ్మకం నాకుంది. చెన్నైలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కొనసాగిస్తాము . సరైన ప్రణాళికతో బరిలోకి దిగి మళ్ళీ గెలుపు బాట పడతాము" అని పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో సూర్య పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. శివమ్ దూబే మినహా మిగితా ప్లేయర్లంతా ఘోరంగా విఫలమయ్యారు. -
టీమిండియా జోరుకు బ్రేక్.. సౌతాఫ్రికా చేతిలో ఘోర ఓటమి
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా జోరుకు సౌతాఫ్రికా బ్రేక్‌లు వేసింది. అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో భారత్ ఘోర పరాజయం పాలైంది. 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా, సఫారీ బౌలర్ల ధాటికి విల్లవిల్లాడింది.లక్ష్య చేధనలో సూర్య కుమార్ సేన 18.5 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో శివమ్ దూబే(42) టాప్ స్కోరర్‌గా నిలవగా, మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లోనూ తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కేశవ్ మహారాజ్ మూడు, బాష్ రెండు వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్‌లో సఫారీలు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింటిలోనూ అదరగొట్టారు.మిల్లర్ అదుర్స్..ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను మిడిలార్డర్ బ్యాటర్లు ఆదుకున్నారు. ప్రోటీస్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్(63) టాప్ స్కోరర్ నిలవగా.. బ్రెవిస్(45), స్టబ్స్(44) రాణించారు.భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు. ఇక భారత్ సెమీఫైనల్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ తప్పనిసరిగా విజయం సాధించాలి. టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో ఫిబ్రవరి 26న జింబాబ్వేతో తలపడనుంది. ఆ తర్వాత వెస్టిండీస్‌తో భారత్ ఆడనుంది. -
అభిషేక్ మరో 'సారీ'.. సౌతాఫ్రికాపై అట్టర్ ప్లాప్
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. లీగ్ స్టేజ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో డకౌటైన అభిషేక్ ఇప్పుడు సూపర్-8 దశలోనూ అదే తీరును కనబరుస్తున్నాడు.అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. 12 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ అవుట్‌గా అభిషేక్ వెనుదిరిగాడు. టీ20ల్లో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న అభిషేక్‌పై భారత అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అభిషేక్ మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తూ అందరిని నిరాశపరిచాడు. దీంతో అభిషేక్‌ను పక్కన పెట్టి సంజూ శాంసన్‌కు అవకాశమివ్వాలని క్రికెట్ నిపుణులు టీమ్‌మెనెజ్‌మెంట్‌ను సూచిస్తున్నారు.అదరగొట్టిన మిల్లర్, బ్రెవిస్ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను మిడిలార్డర్ బ్యాటర్లు ఆదుకున్నారు. డేవిడ్ మిల్లర్(63) టాప్ స్కోరర్ నిలవగా.. బ్రెవిస్(45), స్టబ్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు -
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. తొలి భారత బౌలర్‌గా
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సత్తాచాటాడు. తన సూపర్ బౌలింగ్‌తో ఇన్నింగ్స్ ఆరంభంలోనే దక్షిణాఫ్రికాను బుమ్రా దెబ్బ తీశాడు. ఇన్ఫామ్ బ్యాటర్లు క్వింటన్ డికాక్, రికెల్టన్ను బుమ్రా ఔట్ చేశాడు.మొత్తంగా తన నాలుగు ఓవర్ల కోటాలో జస్ప్రీత్ కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుత ప్రదర్శనతో బుమ్రా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. బుమ్రా ఇప్పటివరకు పొట్టి ప్రపంచకప్ హిస్టరీలో 33 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(32), అర్ష్‌దీప్ సింగ్(32) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో వీరిద్దిరిని బుమ్రా అధిగమించాడు.టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరేజస్ప్రీత్ బుమ్రా-33 రవిచంద్రన్ అశ్విన్- 32అర్ష్‌దీప్ సింగ్- 32హార్దిక్ పాండ్యా-29రవీంద్ర జడేజా-22 -
వారెవ్వా బుమ్రా.. లెగ్ స్టంప్ ఎగిరిపోయిందిగా? వీడియో
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ముఖ్యంగా ప్రోటీస్ ఓపెనర్ క్వింటన్ డికాక్‌ను బుమ్రా ఔట్ చేసిన తీరు గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే.జస్ప్రీత్ అద్భుతమైన బంతితో డికాన్‌ను బోల్తా కొట్టించాడు. బుమ్రా వేసిన బంతికి డికాక్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 2 ఓవర్ వేసిన బుమ్రా.. ఐదో బంతిని నిప్-బ్యాకర్ డెలివరీగా సంధించాడు. అయితే ఆ బంతిని డి కాక్ ఎటువంటి ఫుట్ వర్క్ లేకుండా స్లాగ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి కాస్త లో-బౌన్స్‌గా వచ్చి బ్యాట్‌ను మిస్స్ అయ్యి లెగ్ స్టంప్‌ను గిరాటేసింది. ఇది చూసిన డికాక్ ఒక్కసారిగా షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. జస్ప్రీత్ దెబ్బకు డికాక్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత స్టార్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ను కూడా బుమ్రా పెవిలియన్‌కు పంపాడు.తుది జట్లుభారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిదక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడిJasprit Bumrah wastes no time and removes the danger man, Quinton de Kock, in this all-important Super 8 clash. 🔥ICC Men's #T20WorldCup | SUPER 8 | #INDvSA | LIVE NOW 👉 https://t.co/dZWPZfqfbO pic.twitter.com/23RqtAxaoq— Star Sports (@StarSportsIndia) February 22, 2026 -
భారత్‌పై సౌతాఫ్రికా ఘన విజయం
India vs South Africa Super 8 live updates: అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. సఫారీ బౌలర్ల దాటికి 111 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో శివమ్ దూబే(42) టాప్ స్కోరర్‌గా నిలవగా, మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కేశవ్ మహారాజ్ మూడు, బాష్ రెండు వికెట్లు సాధించారు.ఓటమికి చేరువలో భారత్15 ఓవర్ వేసిన కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్ ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి భారత్ 8వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది.భారత్ ఆరో వికెట్ డౌన్86 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత విజయానికి 34 బంతుల్లో 102 పరుగులు కావాలి.పీకల్లోతు కష్టాల్లో భారత్.. కెప్టెన్ సూర్య ఔట్టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. కార్భిన్ బాష్ బౌలింగ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(18) ఔటయ్యాడు. క్రీజులోకి హార్దిక్ పాండ్యా వచ్చాడు. భారత్ విజయానికి 64 బంతుల్లో 134 పరుగులు కావాలి.భారత్ నాలుగో వికెట్ డౌన్43 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. బాష్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.అభిషేక్ శర్మ ఔట్‌అభిషేక్ శర్మ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. జాన్సెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. 7 ఓవర్లకు భారత్ స్కోర్: 42/3తిలక్ వర్మ ఔట్5 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన తిలక్ వర్మ.. జాన్సెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు.భారత్ తొలి వికెట్ డౌన్188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఐడైన్ మార్క్రమ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ డౌకటయ్యాడు. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు. అదేవిధంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫోరుతో తన ఖాతా తెరిచాడు.భారత్ టార్గెంట్ ఎంతంటే?అహ్మదాబాద్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను మిడిలార్డర్ బ్యాటర్లు ఆదుకున్నారు.డేవిడ్ మిల్లర్(63) టాప్ స్కోరర్ నిలవగా.. బ్రెవిస్(45), స్టబ్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు.సౌతాఫ్రికా ఆరో వికెట్ డౌన్157 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన మార్కో జాన్సెన్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.సౌతాఫ్రికా ఐదో వికెట్ డౌన్.. మిల్లర్ ఔట్డేవిడ్ మిల్లర్ రూపంలో సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. 63 పరుగులు చేసిన మిల్లర్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు.సౌతాఫ్రికా నాలుగో వికెట్ డౌన్డెవాల్డ్ బ్రెవిస్ రూపంలో సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. 15 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.నిలకడగా ఆడుతున్న మిల్లర్, బ్రెవిస్30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికాను మిడిలార్డర్ బ్యాటర్లు మిల్లర్, బ్రెవిస్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 64 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. 10 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది.సౌతాఫ్రికా మూడో వికెట్ డౌన్రికెల్టన్ రూపంలో సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రికెల్టన్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 6 ఓవర్లకు ప్రోటీస్ స్కోర్: 41/3సౌతాఫ్రికా రెండో వికెట్ డౌన్12 పరుగుల వద్ద సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్(4).. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.సౌతాఫ్రికా తొలి వికెట్ డౌన్టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్‌ను జస్ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 2 ఓవర్లకు ప్రోటీస్ స్కోర్: 10/1టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సూపర్-8 పోరులో ప్రోటీస్ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది.గత మ్యాచ్‌కు దూరమైన లుంగీ ఎంగిడి, జాన్సెన్, కేశవ్ మహారాజ్ జట్టులోకి వచ్చారు. భారత్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. వాషింగ్టన్ సుందర్‌ను జట్టులో కొనసాగించారు. దీంతో అక్షర్ పటేల్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యాడు.తుది జట్లుభారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిదక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి -
వాళ్ల గురించే నా బాధంతా!: ఇచ్చిపడేసిన సూర్యకుమార్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు తాము సిద్ధంగా ఉన్నట్లు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. పరిస్థితులకు అనుగుణంగా తమ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసుకుంటామని పేర్కొన్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్ ఎలా ఉన్నా వ్యూహాలకు తగినట్లు ఆడటంలో తమ బ్యాటర్లు దిట్ట అని సూర్య అన్నాడు.కాగా వరల్డ్‌కప్ టోర్నీలో సూపర్-8 దశలో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడేందుకు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. కాగా గ్రూప్ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచ్‌లను గెలిచాయి భారత్, సౌతాఫ్రికా.ప్రతికూల అంశాలు ఇవేఅయితే, గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) డకౌట్ కావడం.. భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్‌లో తడబడటం వంటివి ప్రతికూలాంశాలుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా ఐడెన్ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్‌లతో కూడిన స్పిన్ దళంతో అటాక్ చేసే అవకాశం ఉంది.వాళ్ల గురించే నా బాధంతా!ఈ విషయాల గురించి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తాజాగా స్పందించాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ శర్మ సరిగ్గా ఆడటం లేదని ఎవరైతే బాధపడుతున్నారో.. ఆ వ్యక్తుల గురించే నేను ఎక్కువగా వర్రీ అవుతున్నా.అతడిని ఎదుర్కొనే ప్రత్యర్థుల గురించే నా బాధంతా!.. గతేడాది అతడు అదరగొట్టాడు. తిరిగి ఫామ్ అందుకుంటాడు. ఇక మా జట్టులో ఓపెనర్లు తప్ప 3-8 మధ్య ప్రతీ బ్యాటర్ ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఒకవేళ 8-9 ఓవర్ల వరకు వికెట్ పడకపోతే.. శివం దూబే లేదంటే హార్దిక్ పాండ్యా టాప్‌నకు ప్రమోట్ అవుతారు.సమస్య లేదునాతో సహా జట్టులో ప్రతి ఒక్కరి బ్యాటింగ్ ఆర్డర్ మారుతూనే ఉంటుంది. రైటార్మ్ ఆఫ్ స్పిన్నర్ లేదంటే ఇంకెవరైనా బౌలింగ్ చేసినా వారిని ఎదుర్కోగల సత్తా మా వాళ్లకు ఉంది. కాబట్టి బౌలర్లు ఎవరన్న అంశంతో మాకు సంబంధం లేదు. మా జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు తనకంటూ ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉన్నాడు. ఎవరి గేమ్‌ప్లాన్ వారికి స్పష్టత ఉంది. కాబట్టి సమస్య లేదు’’ అని సూర్యకుమార్ యాదవ్ తన జట్టు పట్ల ఆత్మవిశ్వాసం కనబరిచాడు.చదవండి: T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్! -
ఒత్తిడిలో టీమిండియా.. పైచేయి మాదే: సౌతాఫ్రికా కోచ్
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ షుక్రి కన్రాడ్ టీమిండియాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ సేన ఒత్తిడిలో ఉందని.. ఇదే అదునుగా తాము ఆ జట్టు బలహీనతలను ఉపయోగించుకుంటామని పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి భారత జట్టు విజేతగా అవతరించిన విషయం తెలిసిందే.అజేయంగా సూపర్-8కుఆ తర్వాత కూడా ద్వైపాక్షిక సిరీస్‌లలో వరుస విజయాలతో సత్తా చాటి.. సొంతగడ్డపై వరల్డ్‌కప్-2026లో హాట్ ఫేవరెట్‌గా టీమిండియా బరిలోకి దిగింది. అందుకు తగ్గట్లుగానే గ్రూప్ దశలో అజేయంగా నిలిచి సూపర్-8కు అర్హత సాధించింది. మరోవైపు.. సౌతాఫ్రికా సైతం వరుస విజయాలతో సూపర్-8కు దూసుకువచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య (IND vs SA) ఆదివారం అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరుగనుంది.ఒత్తిడిలో టీమిండియా.. పైచేయి మాదేఈ నేపథ్యంలో సౌతాఫ్రికా హెడ్‌కోచ్ షుక్రి కన్రాడ్ మాట్లాడుతూ.. ‘‘టీమిండియా వంటి జట్టు గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఆ జట్టుపై అంచనాలు భారీగా ఉంటాయి. స్క్రూటినీ కూడా ఎక్కువే. అందుకే వాళ్లు తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోతారు.సెమీ ఫైనల్.. ఆపై ఫైనల్ చేరాలనే ఒత్తిడి మిగతావారితో పోలిస్తే వారిపై ఒకింత ఎక్కువగానే ఉంటుంది. దానిని మేము సద్వినియోగం చేసుకుంటాము. ఒత్తిడిలో బలహీనపడే ఆ జట్టుపై పైచేయి సాధించి.. వారి బలహీనతలను ప్రపంచానికి చూపిస్తాం’’ అని పేర్కొన్నాడు. అయితే, పటిష్ట టీమిండియాతో తలపడినపుడు తమపై కూడా అదే స్థాయిలో ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నాడు. భారత్‌దే ఆధిపత్యంకాగా ఇటీవల సౌతాఫ్రికా భారత్‌లో పర్యటించింది. టీ20 సిరీస్‌లో టీమిండియా చేతిలో 3-1తో ఓడిపోయింది. అయితే, వరల్డ్‌కప్ వంటి టోర్నీలలో ఇలాంటి గత రికార్డుల ప్రభావం ఎక్కువగా ఉండదని కన్రాడ్ పేర్కొనడం గమనార్హం. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్- సౌతాఫ్రికా ఇప్పటి వరకు ఏడుసార్లు పోటీ పడగా.. టీమిండియా ఐదు, సౌతాఫ్రికా రెండుసార్లు గెలిచాయి.చదవండి: T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్! -
T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్!
సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ టోర్నీ-2026లో టీమిండియా సత్తా చాటుతోంది. లీగ్ దశలో భాగంగా గ్రూప్-ఎ నుంచి టాపర్‌గా సూర్యకుమార్ సేన సూపర్-8కు చేరుకుంది. వరుసగా అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లను ఓడించి అజేయంగా తదుపరి దశలో అడుగుపెట్టింది.తొలుత దక్షిణాఫ్రికాతో..ఇక ఇక్కడి నుంచే అసలు సమరం మొదలుకానుంది. గ్రూప్-1లో ఉన్న టీమిండియా.. సూపర్-8లో తొలుత దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకు ఇరుజట్ల మధ్య మ్యాచ్ మొదలుకానుంది.ప్రాక్టీస్‌లో తలమునకలుఈ నేపథ్యంలో ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో తలమునకలైంది. ఈ క్రమంలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) బాదిన షాట్ కారణంగా భారత స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) గాయపడినట్లు సమాచారం. హార్దిక్ బాదిన బంతి సిరాజ్ ఎడమ మోకాలికి బలంగా తగిలినట్లు తెలుస్తోంది.గాయపడిన పేసర్దీంతో నొప్పితో విలవిల్లాడిన సిరాజ్ మధ్యలోనే నెట్ సెషన్ నుంచి నిష్క్రమించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రెవ్‌స్పోర్ట్స్ షేర్ చేసిన ఈ ఫొటోలలో సిరాజ్ కుంటుతూ మైదానం వీడిన తీరు టీమిండియా అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.గాయాల బెడదకాగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభానికి ముందు నుంచీ టీమిండియాను గాయాల బెడద వేధిస్తున్న సంగతి తెలిసిందే. యువ పేసర్, బ్యాట్‌తోనూ అదరగొడుతున్న హర్షిత్ రాణా గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో ప్రపంచకప్ జట్టులోకి వచ్చిన సిరాజ్.. గ్రూప్ దశలో తొలుత అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు.ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా జ్వరం వల్ల తుదిజట్టు నుంచి తప్పుకోగా.. సిరాజ్‌కు ఈ అవకాశం వచ్చింది. అమెరికాతో మ్యాచ్‌లో ఈ హైదరాబాదీ పేసర్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. అయితే, తదుపరి మ్యాచ్‌లకు బుమ్రా అందుబాటులోకి రావడంతో సిరాజ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.ఇప్పుడిలా..మరోవైపు.. ఓపెనర్ అభిషేక్ శర్మ సైతం కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇక ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సైతం గాయం నుంచి కోలుకుని ఫిట్నెస్ సాధించినప్పటికీ.. తొలి మూడు మ్యాచ్‌లకు దూరంగానే ఉన్నాడు. ఆఖరిగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో మాత్రం అతడు బరిలోకి దిగాడు.ఇదిలా ఉంటే.. పటిష్ట సౌతాఫ్రికాతో పోరుకు ముందు సిరాజ్ కూడా గాయపడటం గమనార్హం. కాగా సూపర్-8లో భారత్.. సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఎదుర్కొంటుంది. ఈ దశలో సత్తా చాటితేనే సెమీ ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది.UPDATE: T20 WC 2026: టీమిండియా కొంపముంచిన గంభీర్.. నెటిజన్లు ఫైర్చదవండి: T20 WC 2028: నేరుగా అర్హత సాధించిన బంగ్లాదేశ్ -
ముగ్గురూ లెఫ్టాండర్లే.. మాకు కష్టమే: టీమిండియా కోచ్
టీమిండియా అజేయంగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో సూపర్-8 దశకు చేరుకుంది. గ్రూప్-ఎలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లను ఓడించి టాపర్‌గా తదుపరి దశకు అర్హత సాధించింది.అయితే, నమీబియా, పాకిస్తాన్‌లపై అలవోకగా విజయం సాధించిన సూర్యకుమార్ సేనకు.. పసికూనలు అమెరికా, నెదర్లాండ్స్ మాత్రం గట్టి సవాలు విసిరాయి. కష్టమ్మీద అమెరికాను 29 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. నెదర్లాండ్స్‌పై 17 పరుగుల తేడాతో గట్టెక్కింది. నిజానికి ఏకపక్ష విజయాలు సాధిస్తుందనుకున్న మ్యాచ్‌లలోనే టీమిండియా తడబడటం గమనార్హం.ముగ్గురూ లెఫ్టాండర్లేఇక ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడిన మూడు మ్యాచ్‌లలో డకౌట్ అయ్యాడు. అతడికి తోడుగా ఉన్న మరో లెఫ్టాండర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అదరగొడుతుండటం సానుకూలాంశం కాగా.. మరో ఎడమ చేతి వాటం బ్యాటర్, వన్‌డౌన్‌లో వచ్చే తిలక్ వర్మ మాత్రం క్రీజులో కుదురుకునేందుకు చాలా సమయం తీసుకుంటున్నాడు.ఈ నేపథ్యంలో సూపర్-8లో టీమిండియా కఠిన సవాళ్లు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డష్కాటే సైతం అంగీకరించాడు. టీమిండియా ప్రధానంగా రెండు సమస్యలు ఎదుర్కోంటోందని తెలిపాడు.ప్రధానంగా రెండు సమస్యలుటాపార్డర్లో ముగ్గురూ లెఫ్టాండర్ బ్యాటర్లే ఉండటం ఒక సమస్య అయితే.. ఫింగర్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబాటు మరో సమస్య అని డష్కాటే పేర్కొన్నాడు. ‘‘టాప్-3లో మాకు ఎక్కువగా ఆప్షన్లు లేవు. సంజూ బెంచ్ మీద ఉన్నాడు. కాబట్టి ముగ్గురూ ఎడమచేతి వాటం బ్యాటర్లే కొనసాగుతున్నారు.అయితే, మా బ్యాటర్లలో చాలా మంది ఫింగర్ స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సూపర్-8లో వెస్టిండీస్, సౌతాఫ్రికా మాపై ఇలాంటి బౌలర్లను ప్రయోగించడం ఖాయమే. అయితే, మాకు అత్యుత్తమ బ్యాటర్లు ఉండటం కలిసి వచ్చే అంశం.14 ఓవర్ల పాటు ఫింగర్ స్పిన్పాకిస్తాన్ కూడా గత మ్యాచ్‌లో 14 ఓవర్ల పాటు ఫింగర్ స్పిన్ వేయించింది. ఆఫ్ స్పిన్ కంటే ఫింగర్ స్పిన్నే ఎక్కువగా వాళ్లు నమ్ముకున్నారని నేను అంటాను. కొలంబో వంటి స్లో పిచ్‌లపై ఇలాంటివి వర్కౌట్ అవుతాయి.అయితే, మా వాళ్లు అలాంటి చోట సమస్యను అధిగమించారు. కాబట్టి మరీ అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదు’’ అని డష్కాటే చెప్పుకొచ్చాడు.కాగా ఆఫ్ స్పిన్నర్లు బంతిని టర్న్ చేసే క్రమంలో మణికట్టు కదలికల (కుడి నుంచి ఎడమకు)పై ఆధారపడితే.. ఫింగర్ స్పిన్నర్లు చూపుడు లేదంటే మధ్యవేలును ఉపయోగించి బంతి దిశను మార్చేందుకు ప్రయత్నిస్తారు. ఈ చిన్న తేడా తప్ప రెండు దాదాపుగా ఒకే విధమైన బౌలింగ్ శైలి అని చెప్పవచ్చు. కాగా సూపర్-8లో భారత్ వరుసగా సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్‌లతో తలపడుతుంది.చదవండి: T20 WC 2028: నేరుగా అర్హత సాధించిన బంగ్లాదేశ్ -
T20 WC: సూపర్-8 షెడ్యూల్ ఇదే.. ఎవరు ఎవరితో ఢీ?
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో లీగ్ దశ తుది అంకానికి చేరుకుంది. ఇరవై జట్లతో మొదలైన ఈ ఐసీసీ ఈవెంట్లో ఆస్ట్రేలియా మినహా అగ్రశ్రేణి జట్లన్నీ సూపర్-8కు చేరుకున్నాయి.సూపర్-8 చేరిన జట్లు ఇవేగ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్... గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్-8 బెర్తులు ఖరారు చేసుకున్నాయి. కాగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ వరల్డ్‌కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 7న భారత్- శ్రీలంక వేదికగా మొదలైన టీ20 ప్రపంచకప్ పదో ఎడిషన్ లీగ్ దశ గురువారంతో ముగియనుంది.ఎవరు ఎవరితో ఢీ?అయితే, అంతకంటే ముందే అంటే బుధవారమే పాకిస్తాన్ నమీబియాపై గెలవడంతో సూపర్-8 బెర్తులు ఖరారైపోయాయి. గ్రూప్ దశలో నామమాత్రపు మ్యాచ్‌లలో వెస్టిండీస్- ఇటలీ.. శ్రీలంక- జింబాబ్వే.. అఫ్గనిస్తాన్- కెనడా గురువారం తలపడతాయి. మరి సూపర్-8 దశలో ఏ జట్టుకు ఏ జట్టుతో పోటీ? షెడ్యూల్, వేదికలు.. తదితర వివరాలు తెలుసుకుందామా?8️⃣ TEAMS 4️⃣ SEMI-FINAL SPOTSThe race intensifies and the stakes are higher than ever as we enter the Super 8 phase! 🤩 🔥Which four teams will move one step closer to their World Cup dream? Drop your predictions 👇ICC Men's #T20WorldCup SUPER 8 👉 Starts SAT, 21st FEB pic.twitter.com/wsgnCWEXmx— Star Sports (@StarSportsIndia) February 19, 2026 -
T20 WC 2026: సూపర్-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే..!
టీ20 ప్రపంచకప్ 2026 నుంచి ఆస్ట్రేలియా వైదొలగడంతో సూపర్-8 దశలో టీమిండియా ప్రత్యర్దులు ఖరారయ్యారు. సూపర్-8 గ్రూప్-1లో భారత్‌తో పాటు జింబాబ్వే, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. గ్రూప్-1 మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరుగుతాయి.భారత్ తమ తొలి సూపర్-8 మ్యాచ్‌ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.భారత రెండో సూపర్-8 మ్యాచ్ ఫిబ్రవరి 26న జరుగనుంది. చెన్నైలోని చిదంబరంలో స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌లో భారత్ జింబాబ్వేను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కూడా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.భారత్ తమ మూడో సూపర్-8 మ్యాచ్‌ను మార్చి 1న ఆడుతుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో భారత్ వెస్టిండీస్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్ కూడా రాత్రి 7 గంటలకే ప్రారంభమవుతుంది.గ్రూప్-1లో మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్ ఇలా..-ఫిబ్రవరి 23- జింబాబ్వే వర్సెస్ వెస్టిండీస్ (ముంబై, రాత్రి 7 గంటలకు)-ఫిబ్రవరి 26- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (అహ్మదాబాద్, మధ్యాహ్నం 3 గంటలకు)-మార్చి 1- జింబాబ్వే వర్సెస్ సౌతాఫ్రికా (ఢిల్లీ, మధ్యాహ్నం 3 గంటలకు)మరోవైపు సూపర్-8 గ్రూప్-2 బెర్త్‌ల్లో ప్రస్తుతానికి మూడు ఖరారయ్యాయి. రేపు (ఫిబ్రవరి 18) జరుగబోయే మ్యాచ్‌లో నమీబియాపై గెలిస్తే.. పాక్ నాలుగో బెర్త్ దక్కించుకుంటుంది. సూపర్-8 గ్రూప్-2లో న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక జట్లు ఉన్నాయి. గ్రూప్-2 మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. గ్రూప్-2కు సంబంధించి కూడా పలు సూపర్-8 మ్యాచ్‌లు ఖరారయ్యాయి.-ఫిబ్రవరి 22న ఇంగ్లండ్-శ్రీలంక (పల్లెకెలె, మధ్యాహ్నం 3 గంటలకు)-ఫిబ్రవరి 25న న్యూజిలాండ్-శ్రీలంక (కొలొంబో, రాత్రి 7 గంటలకు)-ఫిబ్రవరి 27న ఇంగ్లండ్-న్యూజిలాండ్ (కొలొంబో, రాత్రి 7 గంటలకు)గ్రూప్-1, గ్రూప్-2లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్ మ్యాచ్‌లు మార్చి 4, 5 తేదీల్లో జరుగుతాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు మార్చి 8న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. సెమీస్, ఫైనల్‌కు వేదికలు ఇంకా ఖరారు కాలేదు. -
వరల్డ్‌కప్ టోర్నీకి ముందు టీమిండియాకు మరో షాక్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ గాయం వల్ల న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ మొత్తానికి దూరం కాగా.. ఇటీవల యూఎస్‌తో వార్మప్ మ్యాచ్ సందర్భంగా పునరాగమనం చేశాడు. భారత- ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి సత్తా చాటాడు. తాజాగా సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్‌లోనూ టీమిండియా తరఫున అదరగొట్టాడు.ఇక తిలక్ వర్మ (Tilak Varma) కోలుకోవడం టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించగా.. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. లీగ్ దశ మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా స్టార్ పేసర్ హర్షిత్ రాణా కూడా గాయం వల్ల బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు బుధవారం సౌతాఫ్రికాతో తలపడిన విషయం తెలిసిందే.దంచికొట్టిన ఇషాన్, తిలక్నవీ ముంబై వేదికగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ (20 బంతుల్లో 53; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీతో కదంతొక్కగా... హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ (19 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచి కొట్టాడు.ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (23 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా (10 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ షాట్లతో ఆకట్టుకున్నారు. క్రీజులో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ చూడచక్కటి షాట్లతో చెలరేగారు.మరోవైపు.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో విఫలమైన వికెట్‌కీపర్ సంజూ శాంసన్ ఈమ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగలేదు. అతడి స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్ మెరుపు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో ప్రపంచకప్ ప్రారంభపోరులో శనివారం అమెరికాపై అభిషేక్‌తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్ ఆరంభించడం దాదాపు ఖాయమే.210 పరుగులుఅనంతరం భారీ లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు చేసింది. కెప్టెన్ మార్క్రమ్ (19 బంతుల్లో 38; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), రికెల్టన్ (21 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), జాసన్ స్మిత్ (23 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్), స్టబ్స్ (21 బంతుల్లో 45 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు) తలాకొన్ని పరుగులు చేశారు. 9 మంది భారత బౌలర్లు బౌలింగ్ చేయగా... అభిషేక్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి.మోకాలి నొప్పి?అయితే, ఈ మ్యాచ్‌లో హర్షిత్ రాణా ఒక్క ఓవర్ మాత్రమే వేసి నిష్క్రమించాడు. తన ఓవర్లో పదహారు పరుగులు సమర్పించుకున్న ఈ రైటార్మ్ పేసర్.. బౌలింగ్ చేసే సమయంలో అసౌకర్యానికి గురయ్యాడు. మోకాలి నొప్పితో అతడు బాధపడినట్లు కనిపించింది. తన ఓవర్ పూర్తి చేసుకున్న వెంటనే హర్షిత్ రాణా మైదానం వీడాడు. అతడు కోలుకోవడానికి ఇంకో రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే, హర్షిత్ గాయం గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. కాగా లోయర్ ఆర్డర్లో ఎనిమిదో స్థానంలో చక్కగా బ్యాటింగ్ చేయడంతో పాటు.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చిన సమయంలో హర్షిత్ రాణా సేవలు అందిస్తున్నాడు. ప్రధాన మ్యాచ్‌లలో బుమ్రాకు తోడుగా అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా రొటేషన్ పద్ధతిలో తుదిజట్టులోకి వస్తున్నారు. చదవండి: భారత్‌ను పదోసారి ఫైనల్‌కు చేర్చిన ఈ 'ఆరోన్ జార్జ్' ఎవరు..? -
ఇషాన్, తిలక్ వర్మ విధ్వంసం.. టీమిండియా భారీ స్కోరు
టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌గా ప్రమోట్ అయిన ఇషాన్ కిషన్‌తో పాటు.. రీఎంట్రీ ఇచ్చిన వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో దుమ్ములేపారు.ఇషాన్, తిలక్ వర్మ విధ్వంసంనవీ ముంబై వేదికగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఇషాన్ కిషన్ 20 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది 53 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (18 బంతుల్లో 24) స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. వీరిద్దరు ధనాధన్ దంచికొట్టి రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగారు.ఇక మూడో స్థానంలో వచ్చిన తిలక్ వర్మ 19 బంతుల్లోనే మూడు ఫోర్లు, మూడు సిక్స్‌లు బాది 45 పరుగులు సాధించాడు. అయితే, ప్రొటిస్ పేసర్ మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన తిలక్ హాఫ్ సెంచరీ చేయకుండానే పెవిలియన్ చేరాడు.CRUNCHING STROKE! 💥In the slot, and Tilak Varma deposits it deep into the stands! 🙌🏻ICC Men's #T20WorldCup | Warm-Up Match | 👉 #INDvSA | LIVE NOW ➡️ https://t.co/KpRezrTaFe pic.twitter.com/htSk1AxhpZ— Star Sports (@StarSportsIndia) February 4, 2026రాణించిన సూర్య, అక్షర్, హార్దిక్‌మరోవైపు.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 30) వేగంగా ఆడే ప్రయత్నంలో.. క్వెనా మఫాకా బౌలింగ్‌లో జార్జ్ లిండేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మిగిలిన వారిలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ (23 బంతుల్లో 35 నాటౌట్), హార్దిక్ పాండ్యా (10 బంతుల్లో 30) రాణించారు. రింకూ సింగ్ 13 బంతుల్లో 16 పరుగులు చేశాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన టీమిండియా 240 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్జే, క్వెనా మఫాకా తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. ఇందులో భాగంగా టీమిండియా తొలి రోజు పసికూన అమెరికాతో తలపడుతుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి టీమిండియా జగజ్జేతగా అవతరించిన సంగతి తెలిసిందే.చదవండి: T20 WC 2026: ‘భారత్- పాక్ మ్యాచ్ జరుగుతుంది’ -
T20 WC: ఓపెనర్‌గా వచ్చి.. దంచికొట్టిన ఇషాన్ కిషన్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు టీమిండియా సిద్ధమైంది. సన్నాహకాల్లో భాగంగా బుధవారం సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్‌తో బరిలో దిగింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా వచ్చాడు.6, 6, 4, 6విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు జోడీగా వచ్చిన ఇషాన్.. ధనాధన్ దంచికొట్టాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముఖ్యంగా ఐదో ఓవర్లో ప్రొటిస్ పేసర్ అన్రిచ్ నోర్జే రంగంలోకి దిగగా.. ఇషాన్ అతడి బౌలింగ్‌ను చితక్కొట్టాడు. మూడు, నాలుగు బంతుల్లో సిక్సర్ బాదిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఐదో బంతిని బౌండరీకి తరలించాడు. ఆరో బంతిని మళ్లీ సిక్సర్‌గా మలిచాడు. అలా నాలుగు బంతుల్లోనే 22 పరుగులు పిండుకున్నాడు.20 బంతుల్లోనేఈ క్రమంలో 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (53) పూర్తి చేసుకున్నాడు ఇషాన్ కిషన్. సిక్సర్‌తో యాభై పరుగుల మార్కు దాటిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఇషాన్ ఇన్నింగ్స్‌లో ఏడు సిక్స్‌లు, రెండు ఫోర్లు ఉన్నాయి.కాగా టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌లో భాగంగా నవీ ముంబైలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (18 బంతుల్లో 24), ఇషాన్ కిషన్ (20 బంతుల్లో 53) రిటైర్డ్ అవుట్‌గా నిష్క్రమించారు. టీ20 వరల్డ్‌కప్-2026 జట్లు భారత్‌అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ,సంజు శాంసన్,హార్దిక్ పాండ్యా,రింకూ సింగ్,శివం దూబే,అక్షర్ పటేల్,అర్ష్‌దీప్ సింగ్,వరుణ్ చక్రవర్తి,జస్ప్రీత్ బుమ్రా,వాషింగ్టన్ సుందర్,హర్షిత్ రాణా,కుల్దీప్ యాదవ్.సౌతాఫ్రికాఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్),క్వింటన్ డి కాక్,ర్యాన్ రికెల్టన్ (వారం),డెవాల్డ్ బ్రెవిస్,ట్రిస్టన్ స్టబ్స్,జాసన్ స్మిత్,డేవిడ్ మిల్లర్,మార్కో యాన్సెన్,జార్జ్ లిండే,కార్బిన్ బాష్,కేశవ్ మహారాజ్,క్వేనా మఫాకా,లుంగీ ఎన్గిడి,అన్రిచ్ నోర్ట్జే,కగిసో రబడ.చదవండి: WC 2026: వరల్డ్‌కప్ సెమీస్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసంT20 WC IND vs USA: భారత తుదిజట్టు ఇదే.. ఇషాన్‌కు నో ఛాన్స్!When you’re in form, everything goes your way!😮💨ICC Men's #T20WorldCup | Warm-Up Match | 👉 #INDvSA | LIVE NOW ➡️ https://t.co/KpRezrTaFe pic.twitter.com/51Mr18qE1g— Star Sports (@StarSportsIndia) February 4, 2026 -
T20 WC 2026: తోపు జట్టు ఇదే.. వివరాలు, విశ్లేషణ
టీ20 ప్రపంచ కప్-2026 టోర్నీకి శనివారం (ఫిబ్రవరి 7) తెరలేవనుంది. పొట్టి ఫార్మాట్ క్రికెట్లో మెరుపు వేగంతో పరుగుల వరద మొదలవ్వనుంది. ఈ పరుగుల సునామీలో టాప్‌లో ఉండేదెవరు? తోపుగా నిలిచేదెవరు? ఈ సారి కొత్త రికార్డులు నమోదవుతాయా? ఆటగాళ్లు తమ రికార్డులను తిరిగి బ్రేక్ చేస్తారా? ఈసారీ టీమిండియా హాట్ ఫేవరెట్‌గా ఉన్నా.. భారత్ ఎదుర్కొనే సవాళ్లు ఏమిటి?టీమిండియా బలాలు, బలహీనతలుఏమిటి?? గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? క్రికెట్ అభిమానుల్లో నెలకొన్న ప్రశ్నలివి. ఈ ప్రశ్నలకు సమాధానంగా సాక్షి స్పోర్ట్స్ పలు పారామితులతో, అల్గారిథమ్‌లతో ఓ విశ్లేషణను రూపొందించింది. టీ20 ప్రపంచకప్ పోటీలు 2007లో ప్రారంభమయ్యాయి. 2010 నుంచి ప్రతీ రెండేళ్లకోసారి ఈ టోర్నీలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్లో జరిగిన ప్రపంచకప్‌ను మూడు జట్లు రెండేసి మార్లు గెలుచుకున్నాయి. అవే.. భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్. పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా తలోసారి ట్రోఫీ సాధించాయి. ఇక టీమ్ ఇండియా ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్. 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి.. టైటిల్‌ను చేజిక్కించుకుంది. ప్రస్తుతం భారత జట్టు బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్.. ఇలా అన్ని విభాగాల్లో ముందంజలో ఉండడం కలిసి వచ్చే అంశం..!ఒక్క ఫైనల్ కూడా ఓడిపోని ఏకైక జట్టు ఇదేఅయితే.. ఇప్పటి వరకు ఈ టైటిల్ గెలిచిన ఆరు జట్లలో ఒక్క ఫైనల్ కూడా ఓడిపోని ఏకైక జట్టుగా వెస్టిండీస్ నిలిచింది. భారత్, ఇంగ్లండ్ జట్లు చెరోసారి తో రన్నరప్‌గా.. పాకిస్థాన్, శ్రీలంక రెండేసిసార్లు ఫైనల్లో ఓటమిపాలయ్యాయి. అయితే.. తాజా ప్రదర్శనలను బట్టి మాజీ చాంపియన్లు టీమిండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నాయి. ఇందులోనూ డిఫెండింగ్ చాంపియన్ టీమిండియానే టాప్ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది టీ-20 ప్రపంచ కప్‌లలో ప్రతీ జట్టు 45 నుంచి 55 మ్యాచులు ఆడింది. వీటిలో టీమిండియా విజయ శాతం అత్యద్భుతంగా ఉంది. ఆడిన 52 మ్యాచుల్లో.. 35 విజయాలను నమోదు చేసుకుంది. అంటే.. టీమిండియాకు 63శాతం విజయం రేటు ఉందన్నమాట. ఇప్పుడు దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియా జట్లకు కూడా ఇదే రేట్ ఉండడం గమనార్హం..! అయినా.. ఈ పారామితిలో టీమిండియానే నంబర్-1 అని చెప్పవచ్చు.60 శాతానికి పైగా గెలుపు రేటుకేవలం ప్రపంచకప్ టోర్నీలోనే కాకుండా.. పొట్టి ఫార్మాట్ ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ టీమిండియా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. అగ్రశ్రేణి జట్లు 200కు పైగా టీ-20 మ్యాచులు ఆడాయి. వీటిలో 60 శాతానికి పైగా గెలుపు రేటును సాధించిన ఏకైక జట్టు టీమిండియా మాత్రమే..! 268 మ్యాచుల్లో భారత్ 67 శాతం విన్నింగ్ రేట్‌తో ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా వరుసగా ఉన్నాయి. ఈ పారామితిలోనూ టీమిండియానే హాట్ ఫేవరేట్..!ఇక సొంత దేశంలో మ్యాచులు ఆడడానికి, విదేశాల్లోని మైదానాలకు తేడా ఉంటుంది. పలు జట్లు విదేశాల్లో పెద్దగా రాణించవు. కానీ, టీమిండియా మాత్రం ఈ పారామితిలోనూ ముందంజలో ఉంది. భారత్ విదేశాల్లో 165 మ్యాచులు ఆడగా.. విజయ శాతం 66గా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. అయితే.. ఈ రెండు జట్ల విజయ శాతం 55 మాత్రమే..!విదేశాల్లోని మైదానాల్లో పరిస్థితిని పక్కనపెడితే.. సొంత గడ్డపైనా భారత్ ముందంజలో ఉండడం గమనార్హం..! సంప్రదాయ క్రికెట్ టెస్టుల్లో, వన్డేలలో పరిస్థితి వేరు. కానీ, టీ-20 శకంలో మాత్రం పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉంటాయి. ఆటగాళ్ల ఊపు.. ధనాధన్ బాదుడే విజయాన్ని నిర్దేశిస్తాయి. భారతే హాట్ ఫేవరేట్..!అయితే.. ఈ సారి టీ-20 ప్రపంచకప్ భారత్‌తోపాటు.. శ్రీలంకలో జరగనుంది. ఈ రెండు దేశాల్లోని మైదానాలు భారత్‌కు కొట్టిన పిండి అని చెప్పవచ్చు.ఇక స్వదేశాల్లో విజయాల విషయానికి వస్తే.. భారత్ ఆడిన 103 టీ-20 ఫార్మాట్లలో 70 విజయాలను సాధించింది. అంటే.. గెలుపు శాతం 68గా ఉంటుంది. ఈ విషయంలో భారత్‌కు పాకిస్థాన్ 0.10శాతం వెనుకంజలో ఉంది. అంటే.. ఈ పారామితిలోనూ భారతే హాట్ ఫేవరేట్..!టీ20 మ్యాచులు సంప్రదాయ వన్డేలకు పూర్తిగా భిన్నమైనవి. ఇక్కడ స్కోరు అత్యంత కీలకం. సిక్సర్లు, ఫోర్లతో.. బంతిబంతికీ బౌండరీ ఉంటేనే విజయలక్ష్మి వరించే అవకాశాలుంటాయి. ఈ విషయంలోనూ టీమిండియాదే ఆధిపత్యం..! ఇప్పటి వరకు టీమిండియా ఆడిన టీ-20 మ్యాచుల్లో 46 సార్లు 200కు పైగా స్కోర్ చేసింది. అంతేకాదు.. నాలుగుసార్లు 250+ స్కోరును తన ఖాతాలో వేసుకుంది. మరే ఇతర జట్టు కూడా 200+ స్కోరును 30 సార్లు కూడా అందుకోలేకపోయింది.అయితే.. భారత్ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. ఈ రెండు జట్లు 28 సార్లు చొప్పున 200+ స్కోరును సాధించడం గమనార్హం..! ఇక 250+ స్కోరు విషయానికి వస్తే.. కేవలం ఇంగ్లండ్, వెస్టిండీస్ మాత్రమే.. భారత్ తర్వాత ఈ స్కోరును సాధించాయి. ఇప్పటి వరకు 20 సెంచరీలుభారత్ నాలుగు సార్లు ఈ ఘనతను సాధిస్తే.. ఈ రెండు జట్లు రెండేసి సార్లు మాత్రమే ఆ స్కోరును దాటగలిగాయి. అన్నింటికీ మించి.. 200+ టార్గెట్‌ను సులభంగా ఛేదించగలమని భారత జట్టు పలుమార్లు రుజువు చేసింది. ఈ పారామితిలోనూ భారతే తోపు అని చెప్పవచ్చు..!టీ20 ఫార్మాట్లో జట్టు విజయాన్ని బౌండరీలే శాసిస్తాయి. అందుకే దీన్ని బ్యాటర్ల ఆట అంటారు. ఇలాంటి ఫార్మాట్లోనూ సెంచరీలు చేయడం అంత ఆశామాషీ కాదు. అయితే.. భారత బ్యాటర్లు టీ-20ల్లో ఇప్పటి వరకు 20 సెంచరీలు చేసి.. జట్టును ముందంజలో నిలిపారు. ఆ తర్వాతి స్థానాల్లో చెరో 13 సెంచరీలతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆటగాళ్లు ఉన్నారు. ఈ పారామితిలోనూ భారతే తోపు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..! సాక్షి డిజిటల్ స్పోర్ట్స్ బృందం పరిశీలించిన అల్గారిథమ్‌లు, పారామితుల్లో భారత్ మాత్రమే టీ-20లో ముందంజలో ఉండే అవకాశాలున్నట్లు స్పష్టమైంది. -
గిల్‌కు బాగానే అర్థమైంది: రాహుల్ ద్రవిడ్
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి భారత జట్టు మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మూడు ఫార్మాట్లు ఆడుతున్న ప్లేయర్‌గా ఇప్పటికైనా గిల్‌కు అందులోని కష్టం అర్థమైందని పేర్కొన్నాడు. టెస్టు ప్రాధాన్యత ఏమిటో అతడికి తెలిసివచ్చిందని.. అందుకే ఆ దిశగా మార్పుల కోసం గొంతు విప్పాడని ద్రవిడ్ అన్నాడు.ఘోర పరాభవాలుగత రెండేళ్ల కాలంలో సొంతగడ్డపై టీమిండియాకు రెండు ఘోర పరాభవాలు ఎదురయ్యాయి. న్యూజిలాండ్ చేతిలో తొలిసారి 3-0తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన భారత్.. ఇటీవల సౌతాఫ్రికా చేతిలోనూ పాతికేళ్ల విరామం తర్వాత తొలిసారి 2-0తో క్లీన్‌స్వీప్ అయింది.అందుకే ఈ చేదు అనుభవాలుఈ పరిణామాల నేపథ్యంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. మరోవైపు.. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన గిల్ (Shubman Gill)కు సైతం సఫారీల చేతిలో వైట్‌వాష్ రూపంలో పీడకల మిగిలింది. విరామం లేకుండా వరుస సిరీస్‌లు ఆడటం.. సరైన విధంగా సన్నద్ధం కాకపోవడం వల్లే టెస్టుల్లో చేదు అనుభవం మిగిలిందని గిల్ భావించాడు.బీసీసీఐకి ఓ విజ్ఞప్తిఈ నేపథ్యంలోనే టెస్టు సిరీస్‌కు ముందు కనీసం పదిహేను రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని గిల్.. బీసీసీఐని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తాజాగా స్పందించాడు. బెంగళూరులో ఓ ఈవెంట్‌కు హాజరైన సందర్భంగా ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ..గిల్‌కు బాగానే అర్థమైంది‘‘టెస్టు సన్నద్ధత గురించి శుబ్‌మన్ ఇటీవలే ఓ కీలక సలహా ఇచ్చినట్లు తెలిసింది. అనుభవజ్ఞుడైన ఆటగాడిగా అతడికి ఈ విషయంలో అవగాహన ఉంది. ఇటీవల కాలంలో అతడు మూడు ఫార్మాట్లు ఆడుతూ బిజీగా గడిపాడు.ఈ క్రమంలోనే టెస్టు ఫార్మాట్‌కు ఎలా సన్నద్ధం కావాలన్న అంశం అతడికి ఇప్పటికి బాగా అర్థమై ఉంటుంది. సంప్రదాయ క్రికెట్లో ఉన్న కష్టం ఏమిటో అతడికి తెలుసు. ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు.మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లు.. వెనువెంటనే ఒక ఫార్మాట్ నుంచి మరొకదానికి మారటం కాస్త కష్టంగానే ఉంటుంది. టెస్టు సిరీస్‌కు నాలుగు రోజుల ముందు కూడా మ్యాచ్ ఆడాల్సి ఉంటే పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. అసలు టెస్టు మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే సమయమే దొరకదు.ప్రాక్టీస్‌తో పాటు నైపుణ్యం అవసరంగత నాలుగైదు నెలల క్రితం జరిగిన రెడ్‌బాల్ మ్యాచ్‌ల ఆధారంగా జట్టులోని కొంతమంది ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి వచ్చిన విషయాన్ని గమనించాలి. ఇదే అతిపెద్ద సవాలు. టర్నింగ్ ట్రాక్స్, లేదంటే సీమింగ్ పిచ్‌ల మీద గంటల తరబడి బ్యాటింగ్ చేయడం అంత సులువేమీ కాదు. ఇందుకు ప్రాక్టీస్‌తో పాటు నైపుణ్యం అవసరం’’ అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు.చదవండి: టీ20 వరల్డ్‌కప్-2026: సెమీ ఫైనల్ చేరే జట్లు ఇవే! -
T20 WC 2026: సెమీ ఫైనల్ చేరే జట్లు ఇవే!
పొట్టి క్రికెట్ మహా సంగ్రామానికి ఇప్పటికే ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 7న ఈ ఐసీసీ ఈవెంట్‌కు తెరలేవనుంది. భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్-2026 ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్లో ఇరవై దేశాలు పాల్గొంటున్నాయి.నాలుగు గ్రూపులుగ్రూప్-ఎ నుంచి డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా (India), పాకిస్తాన్ (Pakistan), అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ పోటీ పడుతుండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా (Australia), ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే ఉన్నాయి. గ్రూప్-సిలో ఇంగ్లండ్ (England), వెస్టిండీస్, నేపాల్, ఇటలీ, స్కాట్లాండ్ ఉన్నాయి. బంగ్లాదేశ్ నిష్క్రమణతో ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ వచ్చి చేరింది.ఇక గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, యూఏఈ, కెనడా పోటీలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్ సెమీ ఫైనలిస్టులు, ఫైనలిస్టులు ఎవరన్న అంశంపై మాజీ క్రికెటర్లు తమ అంచనా తెలియజేస్తున్నారు.ఈసారి భారత్- ఆస్ట్రేలియా ఫైనల్ చేరతాయని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ జోస్యం చెప్పాడు. తాజాగా సెమీ ఫైనలిస్టుల గురించి భారత మాజీ క్రికెటర్లు స్టార్ స్పోర్ట్స్ షోలో భాగంగా తమ అంచనాలను తెలిపారు. సెమీ ఫైనల్ చేరే జట్లు ఇవే!ఇందులో భాగంగా 2007 టీ20 ప్రపంచకప్ విన్నర్ రాబిన్ ఊతప్ప మాట్లాడుతూ.. టీమిండియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ టాప్-4లో నిలుస్తాయని అభిప్రాయపడ్డాడు.పాకిస్తాన్ కూడా వస్తుందిఇక టీ20 వరల్డ్‌కప్-2007 విజేత ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. తన అభిప్రాయం ప్రకారం ఈసారి టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో పాటు పాకిస్తాన్ సెమీస్‌కు అర్హత సాధిస్తుందని పేర్కొన్నాడు. మరోవైపు.. భారత మాజీ టెస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా.. టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ చేరతాయని జోస్యం చెప్పాడు.గత ఎడిషన్ విజేత టీమిండియాఅదే విధంగా.. మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా పూజారా అభిప్రాయంతో ఏకీభవించాడు. కాగా గత వరల్డ్‌కప్ ఎడిషన్ (2024)లో భారత్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌లతో పాటు అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్ సెమీస్ చేరిన విషయం తెలిసిందే. అయితే తొలి సెమీ ఫైనల్లో అఫ్గన్‌ను సౌతాఫ్రికా.. రెండో సెమీస్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను భారత్ ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. ఇక టీమిండియా ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్! -
టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల
2026 టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ వైదొలగడం, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ ఎంట్రీ ఇవ్వడం వంటి గందరగోళాల మధ్య షెడ్యూల్ ప్రకటన ఆలస్యమైంది. వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఒకే ఒక మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 4న గత ఎడిషన్ రన్నరప్ సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదే వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా భారత-ఏ జట్టు కూడా రెండు మ్యాచ్‌లు ఆడనుండటం విశేషం. చిన్న జట్లు యూఎస్ఏ, నమీబియాకు ప్రాక్టీస్ కోసం ఈ మ్యాచ్‌లు షెడ్యూల్ చేయబడ్డాయి. ఫిబ్రవరి 2న భారత-ఏ జట్టు నవీ ముంబై వేదికగా యూఎస్ఏతో తలపడనుంది. 6న బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్లో నమీబియాను ఢీకొట్టనుంది. మొత్తంగా మెగా టోర్నీ ప్రారంభానికి ముందు 16 వార్మప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.ఫిబ్రవరి 2ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ స్కాట్లాండ్ (బీసీసీఐ గ్రౌండ్, బెంగళూరు, మధ్యాహ్నం 3 గంటలకు)భారత్-ఏ వర్సెస్ యూఎస్ఏ (డీవై పాటిల్ గ్రౌండ్, నవీ ముంబై, మధ్యాహ్నం 3 గంటలకు)కెనడా వర్సెస్ ఇటలీ (చెన్నై, రాత్రి 7 గంటలకు)ఫిబ్రవరి 3శ్రీలంక-ఏ వర్సెస్ ఒమన్ (కొలొంబో, మధ్యాహ్నం ఒంటి గంటకు)నెదర్లాండ్స్ వర్సెస్ జింబాబ్వే (కొలొంబో, మధ్యాహ్నం 3 గంటలకు)నేపాల్ వర్సెస్ యూఏఈ (చెన్నై, సాయంత్రం 5 గంటలకు)ఫిబ్రవరి 4నమీబియా వర్సెస్ స్కాట్లాండ్ (బీసీసీఐ గ్రౌండ్, బెంగళూరు, మధ్యాహ్నం ఒంటి గంటలకు)ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ (బీసీసీఐ గ్రౌండ్-1, బెంగళూరు, మధ్యాహ్నం 3 గంటలకు)ఐర్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ (కొలొంబో, సాయంత్రం 5 గంటలకు)భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (డీవై పాటిల్ గ్రౌండ్, నవీ ముంబై, రాత్రి 7 గంటలకు)ఫిబ్రవరి 5ఒమన్ వర్సెస్ జింబాబ్వే (కొలొంబో, మధ్యాహ్నం ఒంటి గంటకు)కెనడా వర్సెస్ నేపాల్ (చెన్నై, మధ్యాహ్నం 3 గంటలకు)ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ (కొలొంబో, సాయంత్రం 5 గంటలకు)న్యూజిలాండ్ వర్సెస్ యూఎస్ఏ (డీవై పాటిల్ గ్రౌండ్, నవీ ముంబై, రాత్రి 7 గంటలకు)ఫిబ్రవరి 6ఇటలీ వర్సెస్ యూఎస్ఏ (చెన్నై, మధ్యాహ్నం 3 గంటలకు)భారత్-ఏ వర్సెస్ నమీబియా (బీసీసీఐ గ్రౌండ్-1, బెంగళూరు, సాయంత్రం 5 గంటలకు)ఈ మ్యాచ్‌ల తర్వాత ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచకప్ మెయిన్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. టోర్నీ ఓపెనర్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ కొలొంబో వేదికగా తలపడతాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌ను అదే రోజు యూఎస్ఏతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడుతుంది. -
ప్రపంచకప్‌కు ముందే సౌతాఫ్రికాతో భారత్ 'ఢీ'
టీ20 ప్రపంచకప్‌కు ముందే డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా గతేడాది రన్నరప్ సౌతాఫ్రికాతో తలపడనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ పోరు రెగ్యులర్ మ్యాచ్‌లా కాకుండా వార్మప్ మ్యాచ్‌గా జరుగనుంది. ప్రపంచకప్‌కు ముందు ఇదొక్కటే వార్మప్ మ్యాచ్ అని సమాచారం.వాస్తవానికి ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలకు ముందు వార్మప్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అయితే బంగ్లాదేశ్ కిరికిరి ఉండటంతో ఫైనల్ షెడ్యూల్ ఆలస్యమైంది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ప్రపంచకప్‌లో ఆడనుండటంతో షెడ్యూల్ మార్చాల్సి వచ్చింది.భారత్-సౌతాఫ్రికా వార్మప్ మ్యాచ్‌కు సంబంధించి ఐసీసీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. బీసీసీఐ, క్రికెట్ సౌతాఫ్రికా ఈ విషయాన్ని ధృవీకరించినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, భారత జట్టు ప్రస్తుతం స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్ జనవరి 31న తిరువనంతపురంలో జరగనుంది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఫిబ్రవరి 3న ముంబైలో కలుస్తుంది. సౌతాఫ్రికాతో వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్ ఫిబ్రవరి 4న ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగనున్నట్లు సమాచారం.ప్రపంచకప్ మెయిన్ షెడ్యూల్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమవుతుంది. కొలొంబో వేదికగా జరిగే పాకిస్తాన్-నెదర్లాండ్స్ మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌ను అదే రోజు ముంబైలోని వాంఖడే వేదికగా యూఎస్ఏతో ఆడనుంది.భారత్.. యూఎస్ఏ, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియాతో పాటు గ్రూప్-ఏలో ఉంది. మిగతా గ్రూప్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 12 (నమీబియాతో ఢిల్లీలో), 15 (పాకిస్తాన్‌తో కొలొంబోలో), 18 (నెదర్లాండ్స్‌తో అహ్మదాబాద్‌లో) తేదీల్లో జరుగనున్నాయి.దక్షిణాఫ్రికా విషయానికొస్తే.. ఈ జట్టు కెనడా, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, యూఏఈలతో కలిసి గ్రూప్-డిలో ఉంది. దక్షిణాఫ్రికా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 9న అహ్మదాబాద్‌లో కెనడాతో ఆడనుంది. -
T20 WC 2026: ‘ఫైనల్లో టీమిండియాపై గెలుస్తాం’
డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు శ్రీలంకతో కలిసి ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధమైంది. ఈ ఐసీసీ ఈవెంట్‌ను ఫిబ్రవరి 7 -మార్చి 8 మధ్య నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.ఈసారి కూడా టీమిండియా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. సొంతగడ్డపై టోర్నీ జరుగనుండటం భారత జట్టుకు మరో సానుకూలాంశం. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.వరల్డ్‌కప్ ఫైనల్లో గెలుస్తాంఐడెన్ మార్క్రమ్ కెప్టెన్సీలోని సౌతాఫ్రికా ఈసారి తప్పకుండా చాంపియన్‌గా అవతరిస్తుందని అంచనా వేశాడు. వరల్డ్‌కప్ ఫైనల్లో సూర్యకుమార్ సేనను ఓడించి ఈసారి ట్రోఫీని ముద్దాడుతుందని గ్రేమ్ స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఇటీవల టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికా టీమిండియాను 2-0తో వైట్‌వాష్ చేయడాన్ని ప్రస్తావించాడు.‘‘భారత్‌లో ఆ టెస్టు సిరీస్ అద్భుతం. టీమిండియాను సొంతగడ్డపై ఓడించి.. మా జట్టు పూర్తి ఆధిపత్యం కొనసాగించడం నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. గత ఏడాదిన్నరకాలంగా మా టెస్టు జట్టు అద్భుతంగా ఆడుతోంది.సౌతాఫ్రికా క్రికెట్‌ను సరికొత్తగా మార్చింది. ఇక ఈసారి భారత్‌లో జరిగే వరల్డ్‌కప్ ఫైనల్లోనూ టీమిండియాను ఓడించి మేము టైటిల్ గెలుస్తాం’’ అని గ్రేమ్ స్మిత్ పీటీఐతో పేర్కొన్నాడు.మార్పు అవశ్యంఅదే విధంగా.. ‘‘ఈసారి కూడా టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది. వారి గెలుపు అవకాశాలను కొట్టివేయలేము. పైగా స్వదేశంలో టోర్నీ జరుగడం వారికి అదనపు బలం.ముఖ్యంగా సీనియర్ల నిష్క్రమణ (రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి), హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ రావడం వంటి పరిణామాలతో భారత క్రికెట్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పును కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.టీమిండియాదే పైచేయిఏదేమైనా ఈసారి టీమిండియా గనుక సెమీ ఫైనల్‌కు చేరకపోతే అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం మరొకటి ఉండదు’’ అని గ్రేమ్ స్మిత్ అన్నాడు. కాగా రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాను ఓడించి టైటిల్ గెలుచుకుంది.బార్బడోస్ వేదికగా ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో సఫారీ జట్టుపై ఏడు పరుగుల తేడాతో గెలిచి.. తన ఖాతాలో రెండో టీ20 ట్రోఫీని జమచేసుకుంది. ఇక ఈ టోర్నీ తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. సూర్యకుమార్ యాదవ్ పగ్గాలు చేపట్టాడు.గత పద్దెనిమిది నెలల కాలంలో సూర్య సారథ్యంలో ఆడిన టీమిండియా కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఓడిపోవడం.. జట్టు ఏ మేర పటిష్టంగా ఉందో చెప్పేందుకు నిదర్శనం. చివరగా ఇటీవల సొంతగడ్డపై సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-1తో గెలిచింది. మరోవైపు.. సౌతాఫ్రికాకు మాత్రం గతేడాది అంత గొప్పగా ఏమీ సాగలేదు. చదవండి: మేము నటిస్తున్నామని మాకూ తెలుసు: బీసీబీపై బంగ్లా కెప్టెన్ విమర్శలు -
గిల్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ల స్పందన ఇదే
గతేడాది కాలంలో టెస్టు క్రికెట్లో టీమిండియా ఘోర పరాభవాలు చవిచూసింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో న్యూజిలాండ్ చేతిలో చరిత్రలో లేనివిధంగా 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (BGT) కోల్పోయింది.ఇక ఇటీవల కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సారథ్యంలో.. పాతికేళ్ల తర్వాత తొలిసారి సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్ అయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈసారి కూడా టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2027 (WTC) ఫైనల్‌కు చేరడం కష్టమే.గిల్ ప్రతిపాదన ఇదేఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్ ఇటీవల బీసీసీఐ ముందు ఓ ప్రతిపాదన తీసుకువచ్చాడనే వార్త వైరల్ అయింది. టెస్టు సిరీస్‌కు ముందు కనీసం 15 రోజులు ప్రాక్టీస్ ఉండేలా షెడ్యూల్ చేయాలని గిల్ బోర్డు పెద్దలను కోరినట్లు తెలిసింది. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తాజాగా స్పందించాడు.వింతైన, విలువైన నిర్ణయంగిల్ నిర్ణయాన్ని సమర్థించిన ఊతప్ప... ‘‘ఓ నాయకుడి నుంచి వచ్చిన అత్యంత వింతైన, విలువైన నిర్ణయం ఇది. ఇంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. టెస్టు క్రికెట్‌ను గిల్ చూస్తున్న కోణం ఇది. నిజంగా ఇది చాలా చాలా మంచి విషయం.టెస్టు సిరీస్‌కు కనీసం రెండువారాల ముందు జట్టు సన్నాహకాలు మొదలుపెట్టడం మంచిది. కేవలం టెస్టు సిరీస్ గెలవడమే లక్ష్యం కాదు.. మన అంతిమ లక్ష్యం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ గెలవడం.అది జరగాలంటే.. మన ప్రణాళిక, సన్నాహకాలు నిర్మాణాత్మకంగా ఉండాలి. టెస్టు క్రికెట్ పట్ల భక్తితో కూడిన గౌరవం ఉండాలి. గిల్ తెచ్చిన ఈ ప్రతిపాదన నాకెంతో సంతోషాన్నిచ్చింది’’ అని పేర్కొన్నాడు. ఆకాశ్ చోప్రా సైతంఇక ఊతప్ప మాదిరే టీమిండియా మరో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సైతం టెస్టు క్రికెట్ విషయంలో గిల్ ప్రపోజల్‌ను సమర్థించాడు. సంప్రదాయ ఫార్మాట్లో భారత్ మళ్లీ మునుపటి స్థాయిలో రాణించాలంటే పూర్తిస్థాయి ప్రిపరేషన్ అవసరమని పేర్కొన్నాడు.చదవండి: ఇదీ మీ స్థాయి: పాక్ బోర్డును ఏకిపారేస్తున్న నెటిజన్లు -
కొనసాగుతున్న వైభవ్ సూర్యవంశీ విధ్వంసాల పర్వం
భారత యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసాల పర్వం కొనసాగుతోంది. ఈ ఫార్మాట్, ఆ ఫార్మాట్ అన్న తేడా లేకుండా చెలరేగిపోతున్నాడు. ప్రస్తుతం భారత అండర్-19 జట్టులో భాగంగా సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న అతను.. ఇవాళ (జనవరి 7) జరుగుతున్న మూడో యూత్ వన్డేలో మెరుపు అర్ద శతకం (24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) బాది ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 11 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోకుండా 114 పరుగులు చేసింది. వైభవ్ (29 బంతుల్లో 57), ఆరోన్ జార్జ్ (38 బంతుల్లో 53) అర్ద సెంచరీలు పూర్తి చేసుకుని ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 2-0తో కైవసం చేసుకుంది.గత మ్యాచ్‌లోనూ ఇంతే..!వైభవ్ గత మ్యాచ్‌లోనూ (రెండో వన్డే) ఇదే తరహాలో మెరుపు అర్ద సెంచరీ (68) చేశాడు. అంతకుముందు విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై ఉగ్రరూపం దాల్చి (190) తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. దానికి ముందు అండర్-19 ఆసియా కప్‌లో యూఏఈపై విధ్వంసకర శతకం (171) బాదాడు. అదే టోర్నీలో మలేషియాపై మెరుపు అర్ద సెంచరీ చేశాడు.ఇలా చెప్పుకుంటూ పోతే ఇటీవలికాలంలో వైభవ్ ప్రతి రెండు, మూడు ఇన్నింగ్స్‌లకు ఓ సుడిగాలి అర్ద శతకం కానీ మెరుపు శతకం కానీ చేశాడు. త్వరలో జరుగనున్న అండర్-19 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌కు వైభవే కెప్టెన్.అండర్-19 ప్రపంచకప్ జింబాబ్వే, నమీబియా వేదికలుగా జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో భారత్ ఆయుశ్ మాత్రే సారథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇటీవల భారత యువ జట్టు ఆసియా కప్ ఫైనల్లో పాక్ చేతిలో ఓడిపోయి కసితో రగిలిపోతుంది. -
వైభవ్ మెరుపులు.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్
అండర్ 19 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న యూత్ వన్డే సిరీస్‌లో యువ భారత జట్టు అదరగొడుతోంది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత అండర్-19 జట్టు.. ఇప్పడు రెండో వన్డేలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది.సౌతాఫ్రికా బ్యాటర్లలో జేసన్ రౌల్స్ సెంచరీతో కదం తొక్కాడు. రౌల్స్ 113 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114 పరుగులు చేశాడు. భారత యువ పేసర్ కిషన్ కుమార్ సింగ్ 4 వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు ఆర్ ఆర్ఎస్ అంబరీష్ రెండు, కన్షిక్, దీపేష్ తలా వికెట్ సాధించారు.వైభవ్ మెరుపులు..అనంతరం వర్షం కారణంగా భారత్ లక్ష్యాన్ని 27 ఓవర్లలో 174 పరుగులుగా కుదించారు. లక్ష్య చేధనలో కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. క్రీజులో ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 24 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్.. 10 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 68 పరుగులు చేశాడు. ఆ తర్వాత అభిజ్ఞాన్ కుందు (48 ), వేదాంత్ త్రివేది (31) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. భారత జట్టు 23.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదిపడేసింది.చదవండి: IND vs SA: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే
బెనోని వేదికగా సౌతాఫ్రికా అండర్-19తో జరుగుతున్న రెండో యూత్ వన్డేలో భారత్ అండర్ 19 కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. 246 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే సఫారీ బౌలర్లను ఉతికారేశాడు. ఈ యువ సంచలనం విల్లోమూర్ పార్క్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు.ఈ క్రమంలో కేవలం 19 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా కేవలం 24 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్.. 10 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 68 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి విధ్వంసం ధాటికి భారత్ స్కోర్ 10 ఓవర్లలోనే వంద పరుగుల మార్క్ దాటింది. టీమిండియా విజయానికి ఇంకా 115 పరుగులు కావాలి. అయితే వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది.ప్రస్తుతం క్రీజులో అభిజ్ఞాన్ కుండు(2), వేదాంత్ త్రివేది(9) ఉన్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. భారత యువ పేసర్ కిషన్ కుమార్ సింగ్ 4 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు ఆర్ ఆర్ఎస్ అంబరీష్ రెండు, కన్షిక్, దీపేష్ తలా వికెట్ సాధించారు.ప్రోటీస్ బ్యాటర్లలో జేసన్ రౌల్స్ సెంచరీ సాధించాడు. రౌల్స్ 113 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114 పరుగులు చేశాడు. కాగా ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ అయూష్ మాత్రే దూరం కావడంతో జట్టును వైభవ్ నడిపిస్తున్నాడు.చదవండి: 129 ఫోర్లు, 59 సిక్సర్లు.. 1009 రన్స్ బాదిన ఆ ‘కుర్రాడు’ ఎక్కడ?Vaibhav vikraal Suryavanshi pic.twitter.com/eqiMzYeYvI— Anuj (@A1iconic) January 5, 2026 -
చెలరేగిన భారత బౌలర్లు.. సౌతాఫ్రికా స్కోరెంతంటే?
బెనోని వేదికగా దక్షిణాఫ్రికా అండర్-19తో జరుగుతున్న రెండో యూత్ వన్డేలో భారత బౌలర్లు అదరగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. భారత యువ పేసర్ కిషన్ కుమార్ సింగ్ 4 వికెట్లు పడగొట్టి సఫారీల పతనాన్ని శాసించాడు.అతడితో పాటు ఆర్ ఆర్ఎస్ అంబరీష్ రెండు, కన్షిక్, దీపేష్ తలా వికెట్ సాధించారు. ప్రోటీస్ బ్యాటర్లలో జేసన్ రౌల్స్ (Jason Rowles) ఒక్కడో విరోచిత పోరాటం కనబరిచాడు. సహచరులు ఘోరంగా విఫలమైనా రౌల్స్ మాత్రం అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 113 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114 పరుగులు చేశాడు.దూకుడుగా ఆడుతున్న వైభవ్..అనంతరం లక్ష్య చేధనలో భారత్ దూకుడుగా ఆడుతోంది. ముఖ్యంగా కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్ధి బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. కేవలం 19 బంతుల్లోనే 8 సిక్స్‌ల సాయంతో తన హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. వైస్ కెప్టెన్ ఆరోన్ జార్జ్ 20 పరుగులు చేసి ఔటయ్యాడు.క్రీజులో సూర్యవంశీ, వేదాంత్ త్రివేది ఉన్నారు. కాగా ఇప్పటికే తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి కూడా సిరీస్‌ను సొంతం చేసుకోవాలని యంగ్ టీమిండియా పట్టుదలతో ఉంది.చదవండి: 129 ఫోర్లు, 59 సిక్సర్లు.. 1009 రన్స్ బాదిన ఆ ‘కుర్రాడు’ ఎక్కడ? -
వైభవ్ విఫలమైనా.. టీమిండియా భారీ స్కోర్
బెనోని వేదికగా దక్షిణాఫ్రికా అండర్-19తో జరుగుతున్న మొదటి యూత్ వన్డేలో భారత్ అండర్-19 జట్టు బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 300 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ(11), వైస్ కెప్టెన్ ఆరోన్ జార్జ్(11), త్రివేది(21) వంటి టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటికి.. మిడిలార్డర్, లోయార్డర్ బ్యాటర్లు మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.ముఖ్యంగా 19 ఏళ్ల హర్వంశ్ సింగ్ పంగాలియా అసాధరణ పోరాటం కనబరిచాడు. క్లిష్ట సమయంలో హర్వంశ్.. అంబరీష్‌తో కలిసిఐదో వికెట్‌కు 140 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. పంగాలియా 95 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు అంబరిష్(65), కన్షిక్ చౌహన్(32), ఖిలాన్ పటేల్(26) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో బాసన్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. సోనీ,బాసన్, మబాతా తలా వికెట్ సాధించారు. కాగా ఈ సిరీస్ అండర్-19 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతోంది. ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ అయూష్ మాత్రే దూరమయ్యాడు. ఈ క్రమంలోనే వైభవ్‌కు జట్టు పగ్గాలను అప్పగించారు. కానీ కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లో సూర్యవంశీ విఫలమయ్యాడు.తుది జట్లుభారత్ అండర్19: వైభవ్ సూర్యవంశీ (కెప్టెన్), ఆరోన్ వర్గీస్, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (కీపర్), హర్వంశ్ పంగాలియా, ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, మహమ్మద్ ఎనాన్, ఖిలన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, హెనిల్ పటేల్.దక్షిణాఫ్రికా అండర్ -19:మొహమ్మద్ బుల్బులియా (కెప్టెన్), జోరిచ్ వాన్ షాల్క్వైక్, అద్నాన్ లగాడియన్, జేసన్ రౌల్స్, అర్మాన్ మనక్, పాల్ జేమ్స్, బండిల్ మబాతా, లెతాబో పహ్లామోహ్లాకా (కీపర్), జెజె బాసన్, బయండా మజోలా, నితాండో సోని.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ వచ్చేశాడు -
నువ్వు అతడిని నమ్మాలి గిల్.. సిరీస్‌లు గెలవాలంటే..
బ్యాటింగ్‌తో మ్యాచ్‌లు గెలిస్తే.. పటిష్ట బౌలింగ్‌తో సిరీస్‌లు గెలవవచ్చని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో టీమిండియా బౌలర్ల సేవలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా భారత టెస్టు జట్టు సారథిగా ఇంగ్లండ్ పర్యటనతో శుబ్‌మన్ గిల్ తన ప్రయాణం మొదలుపెట్టాడు.ఇంగ్లండ్ గడ్డపై బ్యాటర్‌గా అదరగొట్టిన గిల్ (Shubman Gill).. కెప్టెన్‌గా 2-2తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సమం చేశాడు. ఆ తర్వాత స్వదేశంలో అతడి సారథ్యంలో వెస్టిండీస్‌తో సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. ఇటీవల సౌతాఫ్రికా చేతిలో మాత్రం ఘోర పరాభవం చవిచూసింది. రెండు టెస్టుల సిరీస్‌లో సఫారీలు టీమిండియాను 2-0తో వైట్‌వాష్ చేశారు.అయితే, ఈ సిరీస్‌లో టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)ను బ్యాటర్‌గానే ఎక్కువగా ఆడించింది మేనేజ్మెంట్. అతడికి పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. మరోవైపు.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) సేవలను వాడుకున్నప్పటికీ స్థాయికి తగ్గట్లు అతడిని ఉపయోగించుకోలేకపోయింది.నువ్వు అతడిని నమ్మాలి గిల్ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్.. వీరిద్దరిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. నువ్వు వాషింగ్టన్ సుందర్‌పై మరింతగా నమ్మకం ఉంచాలి. ఇలాంటి ఆటగాళ్లకు బౌలింగ్ కూడా మంచినీళ్లప్రాయమే.తాను అద్భుతంగా బౌలింగ్ చేయగలనని వాషీ భావించడం సహజం. అయితే, నువ్వు కూడా అదే నమ్మకంతో ఉండాలి. భారత క్రికెట్.. ముఖ్యంగా టెస్టుల్లో అభివృద్ధి చెందాలంటే వాషింగ్టన్, కుల్దీప్ యాదవ్‌లను వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లలో ఆడిస్తూ.. కుదిరినన్ని ఎక్కువ ఓవర్లు బౌలింగ్ వేయించాలి.బౌలింగ్ పటిష్టంగా ఉంటే..బ్యాటింగ్‌తో మనం మ్యాచ్‌లు గెలవగలం.. అయితే, బౌలింగ్ పటిష్టంగా ఉంటే సిరీస్‌ను కూడా కైవసం చేసుకోగలము. మన బౌలర్లకు తమను తాము నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి. కుల్దీప్ యాదవ్‌తో కనీసం 20-25 ఓవర్లు వేయించాలి. అతడి సేవలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి’’ అని ఊతప్ప.. వాషీ, కుల్దీప్ల ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. గిల్‌కు సలహాలు ఇచ్చాడు.కాగా ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్‌లో 0-2తో టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా.. అనంతరం 2-1తో వన్డే సిరీస్ గెలిచింది. ఆ తర్వాత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. తదుపరి న్యూజిలాండ్‌తో స్వదేశంలో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది.చదవండి: వారితో టీమిండియా సెలక్టర్లకు ‘తలనొప్పి’.. మరి పంత్, నితీశ్ రెడ్డి సంగతి? -
గంభీర్‌కు పదవీ గండం!.. అతడితో చర్చలు జరిపిన బీసీసీఐ?
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో విజయవంతమైనప్పటికి.. రెడ్ బాల్ క్రికెట్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. గంభీర్ పర్యవేక్షణలో సేనా(సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా) దేశాలపై భారత్ ఇప్పటివరకు 10 టెస్టుల్లో ఓటమి చవిచూసింది. ముఖ్యంగా గత నెలలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ ఘోర పరాజయం పాలవ్వడంతో గంభీర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.అతడిని వెంటనే ప్రధాన కోచ్‌గా తప్పించాలని చాలా మంది మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు. దీంతో బీసీసీఐ కూడా హెడ్ కోచ్ మార్పుపై ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. టెస్టు జట్టు కోసం ప్రత్యేకంగా కోచ్‌ను నియమించాలన్న యోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం.ఈ క్రమంలో హెడ్ కోచ్ పదవి కోసం లెజెండరీ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను బోర్డు ప్రతినిధులు సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బీసీసీఐ ఆఫర్‌ను లక్ష్మణ్‌ను తిరష్కరించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' (CoE) హెడ్‌గా ఉన్నాడు. అయితే ప్రస్తుత బాధ్యతలతోనే తను సంతోషంగా ఉన్నానని, సీనియర్ జట్టు కోచింగ్‌పై ఆసక్తి లేదని బోర్డుకు తెలియజేశాడంట. కానీ మరోసారి లక్ష్మణ్‌తో చర్చలు జరిపేందుకు బోర్డు పెద్దలు సిద్దమైనట్లు సమాచారం. గంభీర్ మెడపై కత్తి..కాగా వన్డే ప్రపంచకప్-2027 ముగిసే వరకు బీసీసీఐతో గంభీర్ కాంట్రాక్ట్ ఉంది. కానీ మరి కొద్ది రోజుల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత ప్రదర్శన బట్టి అతడి కాంట్రాక్ట్‌ను బోర్డు పునః సమీక్షించే అవకాశముంది. గంభీర్ కోచింగ్‌లో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియాకప్‌ను సొంతం చేసుకుంది.గంభీర్ ముందు పొట్టి ప్రపంచకప్‌తో పాటు చాలా సవాళ్లు ఉన్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ 2025-27లో టీమిండియా ఇంకా 9 టెస్టులు ఆడాల్సి ఉంది. శ్రీలంక, న్యూజిలాండ్ పర్యటనలతో పాటు ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అత్యంత కీలకం. మిగిలిన మ్యాచ్‌లలో గెలిస్తేనే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. భారత క్రికెట్ జట్టుకు మరో ఎనిమిది నెలల వరకు ఎటువంటి టెస్టు సిరీస్‌లు లేవు.చదవండి: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. శుభ్‌మన్ గిల్ కీలక నిర్ణయం -
'సెలక్టర్లు తప్పు చేశారు.. గిల్ స్ధానంలో అతడే సరైనోడు'
టీ20 వరల్డ్‌కప్-2026కు ఎంపిక చేసిన భారత జట్టులో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. బీసీసీఐ సెలక్షన్ కమిటీ అనుహ్యంగా గిల్ స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో కిషన్ రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చాడు. అయితే సడన్‌గా కిషన్‌ను వరల్డ్‌కప్ జట్టులోకి తీసుకోవడాన్ని చాలా మంది మాజీలు తప్పుబడుతున్నారు. ఈ జాబితాలోకి బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ చేరాడు. గిల్ స్ధానంలో ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ను ఎంపిక చేసి ఉండాల్సిందని వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డారు. కాగా సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల రిటైర్మెంట్ తర్వాత టీ20ల్లో జైశ్వాల్‌కు ఓపెనర్‌గా చోటు దక్కుతుందని అంతా భావించారు.కానీ అతడిని పూర్తిగా జట్టు నుంచే తప్పించారు. గౌతమ్ గంభీర్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక టీ20ల్లో భారత జట్టు ఓపెనింగ్ జోడీ సంజూ శాంసన్-అభిషేక్ శర్మలకు అవకాశం దక్కింది. ఆ తర్వాత గిల్ తిరిగి జట్టులోకి రావడంతో శాంసన్ బెంచ్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. అయితే తన పునరాగమనంలో గిల్ విఫలం కావడంతో సెలక్టర్లు వేటు వేశారు.మళ్లీ అభిషేక్-సంజూనే భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నారు. అయితే జైశ్వాల్‌కు కూడా ఓపెనర్‌గా మంచి రికార్డు ఉంది. ఐపీఎల్‌తో పాటు టెస్టు క్రికెట్లో కూడా ఓపెనర్‌గా తన మార్క్ చూపించాడు."టీ20 ప్రపంచకప్ టోర్నీకి సెలక్టర్లు అత్యుత్తమ జట్టును ఎంపిక చేశారు. కానీ ఈ జట్టులో యశస్వి జైశ్వాల్ లేకపోవడం తీవ్ర నిరాశపరిచింది. అతడు అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. అయినప్పటికి అతడిని జట్టులోకి తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం.జైశూ టీ20 జట్టులోకి తిరిగి రావాలంటే ఇంకా ఏమి చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్ను దృష్టిలో పెట్టుకుని వరల్డ్‌కప్ టోర్నీకి సెలక్టర్లు ఎంపిక చేశారు. గిల్ ఫామ్‌లో లేనందున పక్కన పెట్టడం సరైన నిర్ణయమే. ఈ విషయంలో నేను సెలక్షన్ కమిటీ నిర్ణయంతో ఏకీభవిస్తున్నాను. కానీ గిల్ స్ధానంలో జైశ్వాల్‌కు అవకాశమిచ్చి ఉంటే బాగుండేది. అతడికి ఓపెనర్‌గా అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. మెరుపు ఆరంభాలను అందించే సత్తా అతడికి ఉంది అని వెంగ్‌సర్కార్ పిటిఐతో పేర్కొన్నాడు.కాగా జైశ్వాల్ గత కొంత కాలంగా టెస్టు జట్టులో మాత్రం రెగ్యూలర్‌గా సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తన దక్కిన అవకాశాన్ని జైశ్వాల్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. గిల్ గైర్హజరీలో జట్టులోకి వచ్చిన జైశూ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు.చదవండి: 'అతడు సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.. వరల్డ్‌కప్ టోర్నీకి రెడీ' -
ఒకప్పుడు విలన్.. ఈసారి హీరో అవుతాడా?
టీ20 ప్రపంచకప్-2021లో ఆడింది మూడు మ్యాచ్‌లు.. పదకొండు ఓవర్ల బౌలింగ్‌లో 75 పరుగులు సమర్పించుకున్నాడు.. అయితే, కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఏకంగా 33 పరుగులు ఇచ్చుకున్న సదరు భారత బౌలర్.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 23, అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో 19 పరుగులు ఇచ్చాడు.మిస్టరీ స్పిన్నర్‌తో ఫలితాలు రాబట్టవచ్చని జట్టులోకి తీసుకుంటే అతడి వల్ల జట్టుకు పెద్దగా ప్రయోజనమేమీ చేకూరలేదు. అలా తొలి ప్రపంచకప్ టోర్నీయే అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. కీలక మ్యాచ్‌లలో వికెట్లు తీయకపోవడంతో కొందరు అభిమానులు సైతం అతడిని ఓ భారంగా, విలన్‌గా అభివర్ణించారు కూడా!ఇక అతడి పని అయిపోయినట్లేనని అంతా భావించారు. అనుకున్నట్లుగానే జాతీయ జట్టులో చోటు కరువైంది. కానీ అతడు ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. పట్టుదలగా శ్రమించాడు. ఐపీఎల్లో సత్తా చాటి తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు. అతడు ప్రాతినిథ్యం వహించిన జట్టుకు మెంటార్‌గా ఉన్న వ్యక్తి టీమిండియా హెడ్‌కోచ్‌గా రావడంతో అతడి పునరాగమనానికి బాటలు పడ్డాయి.ముఖ్యంగా టీ20 జట్టులో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈసారి 2.0 వర్షన్ చూపించాడు అతడు!.. ఈ ఏడాది టీమిండియా 20 టీ20లలో ఏకంగా 36 వికెట్లు కూల్చాడు. తద్వారా టెస్టు హోదా ఉన్న దేశాలపై ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వికెట్లు కూల్చిన రెండో బౌలర్‌గా నిలిచాడు.రీఎంట్రీలో సూపర్ హిట్అవును.. ఈ ఉపోద్ఘాతమంగా వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) గురించే!.. గత కొంతకాలంగా భారత టీ20 జట్టులో ఈ మిస్టరీ స్పిన్నర్‌దే కీలక పాత్ర. పరిస్థితులకు అనుగుణంగా ఆడుతూ... మ్యాచ్‌ను తమవైపు తిప్పగల సత్తా ఉందని నమ్మిన మేనేజ్మెంట్కు అందుకు తగ్గ ఫలితాలు చూపించాడు. మొత్తంగా రీఎంట్రీలో అతడు ఏకంగా 49 వికెట్లు కూల్చడం అతడి నిలకడైన ప్రదర్శనకు నిదర్శనం.తాజాగా సౌతాఫ్రికాతో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ వరుణ్ చక్రవర్తి అదరగొట్టాడు. తన వైవిధ్యభరితమైన బౌలింగ్‌తో గూగ్లీ, క్యారమ్ బాల్, స్లేడర్.. ఇలా వివిధ రీతుల్లో బంతులు సంధిస్తూ బ్యాటర్లను తిప్పలు పెడుతూ వికెట్లు పడగొట్టాడు. అతడి లైన్ అండ్ లెంగ్త్ కూడా ఓ పట్టాన బ్యాటర్‌కు అర్థం కాదు.అద్భుతమైన ఆట తీరుతో ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేసి.. భారీ భాగస్వామ్యాలను విడదీయడంలోనూ వరుణ్ దిట్ట. వికెట్లు తీయడం మీద మాత్రమే అతడి దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉంటుంది. 2025లో అతడి ఎకానమీ 6.7గా ఉంది.తాజాగా అహ్మదాబాద్‌లో ఐదో టీ20లోనూ వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లలో కలిపి పది వికెట్లు పడగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.ఒకప్పుడు విలన్.. ఇపుడు హీరోఇక ఈసారి టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్- శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఉపఖండ పిచ్‌లపై జరిగే ఈ మెగా టోర్నీలో టీమిండియాకు వరుణ్ చక్రవర్తి ‘ఎక్స్’ ఫ్యాక్టర్ కాబోతున్నాడు. ఆటలో నైపుణ్యమే కాదు.. ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న వరుణ్.. డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా మరోసారి విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించడం పక్కా. గత ఏడాది కాలంగా అతడి గణాంకాలు, నిలకడైన ఆటే ఇందుకు నిదర్శనం.అట్లు ఇటీవల ఆసియా కప్-2025 టీ20లో భారత్ చాంపియన్‌గా నిలవడంలో వరుణ్‌దే ముఖ్య పాత్ర. పవర్ ప్లే, మిడిల్ ఓవర్లలో ప్రభావం చూపిన ఈ రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ మొత్తంగా తొమ్మిది వికెట్లు కూల్చి.. టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఆ తర్వాత కూడా వరుసమ్యాచ్లలో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుని.. ఐసీసీ నంబర్ వన్ టీ20 బౌలర్‌గా ఈ ఏడాదిని ముగించాడు.కాగా 2021 టీ20 ప్రపంచకప్ టోర్నీలో కనీసం సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన టీమిండియా 2022లో సెమీ ఫైనల్ చేరినా ఆఖరి వరకు పోరాడలేకపోయింది. 2024లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి టైటిల్ గెలుచుకుంది. చదవండి: రోహిత్ శర్మ యూటర్న్! -
గిల్ గాయపడితే ఇతడిని ఆడిస్తారా?: రవిశాస్త్రి ఫైర్
గత ఏడాది కాలంగా భారత టీ20 జట్టులో సంజూ శాంసన్ కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. అభిషేక్ శర్మకు సరైన ఓపెనింగ్ జోడీగా వచ్చి వరుస శతకాలతో అలరించాడు. కానీ ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా వైస్ కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ రీఎంట్రీ ఇవ్వడంతో సంజూ స్థానం గల్లంతైంది.గిల్ వరుస వైఫల్యాలుగిల్ను ఆడించే క్రమంలో సంజూను తొలుత మూడో స్థానంలో.. ఆ తర్వాత మిడిలార్డర్లో ఒకటీ రెండు మ్యాచ్‌లలో ఆడించి.. అనంతరం తుదిజట్టు నుంచే తప్పించింది యాజమాన్యం. మరోవైపు.. గిల్ (Shubman Gill) పునరాగమనంలో దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.సంజూ ధనాధన్సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో కలిపి గిల్ కేవలం 33 పరుగులే చేశాడు. ఇందులో ఓ గోల్డెన్ డక్ కూడా ఉంది. ఇక పాదానికి గాయమైన కారణంగా గిల్ సౌతాఫ్రికా (IND vs SA)తో ఆఖరిదైన ఐదో టీ20కి దూరమయ్యాడు. దీంతో సంజూ (Sanju Samson)కు తుదిజట్టులో చోటు ఇచ్చిన మేనేజ్మెంట్ ప్రయోగాలకు వెళ్లకుండా ఈసారి అతడిని ఓపెనర్‌గానే పంపింది.వచ్చిన అవకాశాన్ని సంజూ సద్వినియోగం చేసుకున్నాడు. కేవలం 22 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 37 పరుగులు సాధించాడు. అయితే, జార్జ్ లిండే అద్భుత బంతితో సంజూను బౌల్డ్ చేశాడు. కాగా గిల్ మూడు మ్యాచ్‌లలో కలిపి చేసిన పరుగుల కంటే కూడా సంజూ ఈ ఒక్క ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులే ఎక్కువ కావడం గమనార్హం.గిల్ గాయపడితే ఇతడిని ఆడిస్తారా?ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి మేనేజ్మెంట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కామెంట్రీలో భాగంగా మాట్లాడుతూ.. ‘‘తుదిజట్టులో అతడు అసలు ఎందుకు లేడు? ఇలాంటి ఆటగాడిని పక్కనపెడతారా? ఓ ఆటగాడు గాయపడితే అతడి స్థానంలో ఇతడిని ఆడిస్తారా?టాపార్డర్‌లో సంజూ సహజమైన శైలిలో ఆడగలడు. సౌతాఫ్రికా గడ్డ మీద టీ20 క్రికెట్లో వరుస సెంచరీలు బాదాడు. అతడొక విధ్వంసకర బ్యాటర్, డేంజరస్ ప్లేయర్. అద్భుతమైన షాట్లు ఆడటంలో దిట్ట. అయినా సరే అతడిని పక్కనపెడతారా?’’ అంటూ రవిశాస్త్రి యాజమాన్యం విధానాలను తప్పుబట్టాడు.కాగా అహ్మదాబాద్‌తో సౌతాఫ్రికాతో ఐదో టీ20 సందర్భంగా సంజూ శాంసన్ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన పద్నాలుగో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్లో 8 వేల పరుగుల మార్కును అందుకుని.. ఈ ఫీట్ నమోదు చేసిన ఏడో భారత బ్యాటర్‌గా అరుదైన జాబితాలో చోటు సంపాదించాడు. చదవండి: రోహిత్ శర్మ యూటర్న్!1000 T20I runs ✅8000 T20 runs ✅@IamSanjuSamson crosses some big milestones in splendid style! 🤩#INDvSA 5th T20I | LIVE NOW 👉 https://t.co/adG06ykx8o pic.twitter.com/F8O8ZAUz19— Star Sports (@StarSportsIndia) December 19, 2025 -
అతడు ఎక్కడో తప్పిపోయాడు.. వీళ్లు అద్భుతం: సూర్యకుమార్
సౌతాఫ్రికాతో ఐదో టీ20లో గెలిచిన టీమిండియా ఈ ఏడాదిని విజయంతో ముగించింది. స్వదేశంలో సత్తా చాటి ప్రొటిస్ జట్టును 3-1తో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆసాంతం బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలతో విమర్శలు మూటగట్టుకున్న టీమిండియా విజయంతోనే సమాధానమిచ్చింది.అయితే, ఈ సిరీస్ మొత్తంలో బ్యాటర్‌గా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) విఫలమయ్యాడు. టీ20 సారథిగా పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 14 నెలలుగా అతడి ఫామ్ ఆందోళనకరంగా మారింది. సౌతాఫ్రికాతో తాజా సిరీస్‌లో మొత్తం కలిపి కేవలం 34 పరుగులు (నాలుగు ఇన్నింగ్స్) మాత్రమే చేయడం గమనార్హం.దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాంసౌతాఫ్రికాతో ఐదో టీ20లో విజయానంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తన ఫామ్‌పై స్పందించాడు. ‘‘ఈ సిరీస్‌లో ఎలా ఆడాలని అనుకున్నామో.. ఆది నుంచి అదే విధంగా ఆడి ఫలితాన్ని రాబట్టాము. మేమేమీ కొత్తగా ట్రై చేయలేదు. ప్రతి విభాగంలోనూ పటిష్టం కావాలని భావించాము. అందుకు తగ్గ ఫలితం మీ కళ్ల ముందే ఉంది.దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు అది అద్భుతమైన ఫలితం ఇచ్చింది. బుమ్రా (Jasprit Bumrah)తో పవర్ ప్లేలో ఒక్క ఓవర్ మాత్రమే వేయించి.. డెత్ ఓవర్లలోనూ వాడాలని అనుకున్నాము. ఈ సిరీస్‌లో మేము ప్రయత్నించాలనుకున్న ప్రతి ఒక్కటి ప్రయత్నించి చూశాము.అతడు ఎక్కడో తప్పిపోయాడుఅయితే, ‘సూర్య ది బ్యాటర్’ని మాత్రం మేము మిస్సయ్యాము. అతడు ఎక్కడో తప్పిపోయాడు. త్వరలోనే స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తాడు’’ అని సూర్యకుమార్ యాదవ్ బ్యాటర్‌గా తన వైఫల్యాన్ని అంగీకరించాడు. ఏదేమైనా జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నానని.. కష్టాల్లో ఉన్న ఎవరో ఒక ఆటగాడు ముందుకు వచ్చి బాధ్యత తీసుకోవడం గొప్ప విషయమని సహచర ఆటగాళ్లను ప్రశంసించాడు. కాగా ఐదో టీ20లో సూర్య ఐదు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.టెస్టులలో వైట్‌వాష్.. వైట్‌బాల్ సిరీస్‌లు కైవసంకాగా స్వదేశంలో సౌతాఫ్రికా చేతిలో టెస్టుల్లో 2-0తో వైట్‌వాష్‌కు గురైన టీమిండియా.. వన్డే సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. తాజాగా అహ్మదాబాద్‌లో శుక్రవారం నాటి ఐదో టీ20లో గెలిచి 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. తదుపరి న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ అనంతరం.. భారత టీ20 జట్టు సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్-2026 టోర్నమెంట్ బరిలో దిగనుంది. Team India seal it in style! 🇮🇳🏆 A 3–1 series win and their 8th straight bilateral T20I series triumph.#INDvSA 5th T20I Match Highlights 👉 https://t.co/Sp7QQIzWtp pic.twitter.com/MyM6LVIHTE— Star Sports (@StarSportsIndia) December 19, 2025చదవండి: రోహిత్ శర్మ యూటర్న్! -
#INDvsSA : టి20లో భారత్ గెలుపు ...సిరీస్ టీమిండియా సొంతం (ఫొటోలు)
-
హార్దిక్ పాండ్యా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. తిలక్ విధ్వంసం
సౌతాఫ్రికాతో ఐదో టీ20లో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా అదరగొట్టాడు. అహ్మదాబాద్ వేదికగా ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం పదహారు బంతుల్లోనే హార్దిక్ పాండ్యా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.ఫాస్టెస్ట్ ఫిఫ్టీతద్వారా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన రెండో ఆటగాడిగా హార్దిక్ పాండ్యా నిలిచాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మను అధిగమించి.. యువరాజ్ సింగ్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికాపై 2-1తో ఆధిక్యంలో ఉంది టీమిండియా.తిలక్ వర్మ విధ్వంసంఇక శుక్రవారం అహ్మదాబాద్‌లోనూ గెలిచి సిరీస్‌ను 3-1తో గెలుచుకోవాలనే సంకల్పంతో బరిలోకి దిగింది. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు సంజూ శాంసన్ (22 బంతుల్లో 37), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 34) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ విధ్వంసకర హాఫ్ సెంచరీతో దుమ్ములేపాడు..@TilakV9 is not holding back! Brings up a quick-fire half century! 💪#INDvSA 5th T20I | LIVE NOW 👉 https://t.co/adG06ykx8o pic.twitter.com/P4cz4TX7lc— Star Sports (@StarSportsIndia) December 19, 2025నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) మరోసారి తీవ్రంగా నిరాశపరచగా.. అతడు అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి, స్టాండ్స్‌లోకి తరలించి అభిమానులను ఉర్రూతలూగించాడు. నాలుగు ఫోర్లు, ఐదు సిక్స్‌లు బాది 16 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు దాటేశాడు. అనూహ్య రీతిలోమొత్తంగా 25 బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. 5 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 63 పరుగులు సాధించాడు. అయితే, ఒట్నీల్ బార్ట్‌మన్ బౌలంగ్‌లో షాట్ ఆడే క్రమంలో రీజా హెండ్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. Watch out! The ball is being powered across the ground today. ⚡️@hardikpandya7 starts his innings with a maximum! 🙌#INDvSA 5th T20I | LIVE NOW 👉 https://t.co/adG06ykx8o pic.twitter.com/NjCNUJh71c— Star Sports (@StarSportsIndia) December 19, 2025ఇక తిలక్ వర్మ (42 బంతుల్లో 73) అనూహ్య రీతిలో పందొమ్మిదో ఓవర్ ఐదో బంతికి రనౌట్ కాగా.. శివం దూబే మూడు బంతుల్లో పది పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్ 231 పరుగుల భారీ స్కోరు సాధించింది. సఫారీ బౌలర్లలో కార్బిన్ బాష్ రెండు వికెట్లు తీయగా.. జార్జ్ లిండే, ఒట్నీల్ బార్ట్‌మన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.భారత్ తరఫున ఫాస్టెస్ట్ టీ20 ఫిఫ్టీలు నమోదు చేసింది వీరే🏏యువరాజ్ సింగ్- 2007 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ మీద 12 బంతుల్లో ఫిఫ్టీ🏏హార్దిక్ పాండ్యా- 2025లో సౌతాఫ్రికా మీద 16 బంతుల్లో ఫిఫ్టీ🏏అభిషేక్ శర్మ- 2025లో ఇంగ్లండ్ మీద 17 బంతుల్లో ఫిఫ్టీ🏏కేఎల్ రాహుల్- 2021లో స్కాట్లాండ్ మీద 18 బంతుల్లో ఫిఫ్టీ🏏సూర్యకుమార్ యాదవ్- 2022లో సౌతాఫ్రికా మీద 18 బంతుల్లో ఫిఫ్టీ.చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ! -
కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు జస్ట్ మిస్!
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఒకే టీ20 క్యాలెండర్ ఇయర్లో పదహారు వందల మార్కు చేరుకున్న రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి ఈ ఘనత సాధించాడు.కాగా ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ తరఫున అదరగొట్టిన అభిషేక్ శర్మ 14 మ్యాచ్‌లలో కలిపి 439 పరుగులు సాధించాడు. అదే విధంగా.. దేశీ టీ20 టోర్నీలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో పంజాబ్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఆరు మ్యాచ్‌లలో కలిపి 304 పరుగులు సాధించాడు.ఇక టీమిండియా తరఫున ఈ ఏడాది అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లోనూ అభిషేక్ శర్మ దుమ్ములేపాడు. 21 మ్యాచ్‌లలో కలిపి 859 పరుగులు చేశాడు. ఈ క్రమంలో మొత్తంగా 2025లో టీ20లలో 1602 పరుగులు పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ.. కోహ్లి ఆల్‌టైమ్ రికార్డును సమం చేసేందుకు కేవలం పన్నెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.2016లో విరాట్ కోహ్లి ఐపీఎల్, టీమిండియా తరఫున కలిపి 1614 పరుగులు చేయగా.. అభిషేక్ ఈ ఏడాది 1602 పరుగులతో ముగించాడు. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ (2022లో 1503, 2023లో 1338 పరుగులు), యశస్వి జైస్వాల్ (2023లో 1297 పరుగులు) ఉన్నారు.కాగా సౌతాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం ఐదో టీ20లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఆదిలో ఆచితూచి ఆడిన అభిషేక్ శర్మ.. ఆ తర్వాత గేరు మార్చాడు. అయితే, ఆరో ఓవర్ నాలుగో బంతికి కార్బిన్ బాష్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ అవుటయ్యాడు. వికెట్ కీపర్ క్వింటన్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 21 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 34 పరుగులు సాధించి నిష్క్రమించాడు. -
IND vs SA: దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు
దక్షిణాఫ్రికాపై 30 పరుగుల తేడాతో భారత్ గెలుపు. స్కోర్లు: భారత్ 231/5(20), దక్షిణాఫ్రికా 201/8(20)దక్షిణాఫ్రికాకు 12 బంతుల్లో 47 పరుగులు అవసరం. విజయానికి చేరువగా భారత్.180 పరుగులకు 8 వికెట్లను కోల్పోయి దక్షిణాఫ్రికా ఓటమికి దగ్గర్లో ఉంది.వరుసగా మరో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా. 177 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా 8వ వికెట్‌ను కోల్పోయింది. దక్షిణాఫ్రికాకు 19 బంతుల్లో 55 పరుగులు అవసరం.దక్షిణాఫ్రికా ఏడోవ వికెట్ కోల్పోయింది. 15.2 ఓవర్లకు 163 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మరో వికెట్ కోల్పోయింది. దక్షిణాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 15 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాకు 33 బంతుల్లో 78 పరుగులు అవసరం.దక్షిణాఫ్రికా విజయానికి 38 బంతుల్లో 85 పరుగులు అవసరం.టీమిండియాతో ఐదో టీ20లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఆతిథ్య భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్ 231 పరుగులు చేసింది. భారత్ విధించిన 232 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా.. హైలైట్స్👉10 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 118-1విజయానికి 60 బంతుల్లో 114 కావాలి. బ్రెవిస్ 14 బంతుల్లో 29, డికాక్ 34 బంతుల్లో 65 పరుగులతో ఉన్నారు.👉6.3 తొలి వికెట్ డౌన్: వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో హెండ్రిక్స్ (13) అవుట్. స్కోరు: 70-1(7). డెవాల్డ్ బ్రెవిస్ క్రీజులోకి వచ్చాడు.👉ఐదు ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 60-0హెండ్రిక్స్ 10, డికాక్ 42 పరుగులతో ఉన్నారు.భారత్ భారీ స్కోరు: 231-5(20)ఓపెనర్లు సంజూ శాంసన్ (37), అభిషేక్ శర్మ (34) రాణించగా.. తిలక్ వర్మ (42 బంతుల్లో 73), హార్దిక్ పాండ్యా (25 బంతుల్లో 63) మెరుపు అర్ధ శతకాలతో మెరిశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) మరోసారి విఫలం అయ్యాడు.ఆఖర్లో శివం దూబే 3 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బాష్ రెండు వికెట్లు తీయగా.. జార్జ్ లిండే, ఒట్నీల్ బార్ట్‌మన్ చెరొక వికెట్ పడగొట్టారు. ప్రొటిస్ జట్టు లక్ష్యం 232 పరుగులు.భారత్ బ్యాటింగ్.. హైలైట్స్👉19.3 నాలుగో వికెట్ డౌన్: బార్ట్‌మన్ బౌలింగ్‌లో రీజా హెండ్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన హార్దిక్ పాండ్యా (25 బంతుల్లో 63). క్రీజులోకి వచ్చిన శివం దూబే. స్కోరు: 226-4(19.4)19.3 నాలుగో వికెట్ డౌన్: బార్ట్‌మన్ బౌలింగ్‌లో రీజా హెండ్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన హార్దిక్ పాండ్యా (25 బంతుల్లో 63). క్రీజులోకి వచ్చిన శివం దూబే. స్కోరు: 226-4(19.4)👉16 బంతుల్లో హార్దిక్ పాండ్యా అర్ధ శతకంబాష్ బౌలింగ్‌లో సిక్స్ బాది 50 పరుగులు పూర్తి చేసుకున్న హార్దిక్👉15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 170-3తిలక్ 57, హార్దిక్ 8 బంతుల్లో 32 పరుగులతో ఉన్నారు.👉14.4 తిలక్ వర్మ హాఫ్ సెంచరీ: ఎంగిడి బౌలింగ్‌లో ఫోర్ బాది.. ఆరో టీ20 హాఫ్ సెంచరీ నమోదు చేసిన తిలక్ వర్మ (30 బంతుల్లో).👉12.1 మూడో వికెట్ డౌన్: బాష్ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి సూర్య (5) అవుట్. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా. స్కోరు: 115-3(12.1)👉పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 101-2తిలక్ 24, సూర్య 2 పరుగులతో ఉన్నారు.👉9.1 రెండో వికెట్ డౌన్: లిండే బౌలింగ్‌లో శాంసన్ బౌల్డ్ (22 బంతుల్లో 37; 4ఫోర్లు, 2 సిక్సర్లు). రెండో వికెట్ డౌన్. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్. 👉8.4: సంజూ బాదిన షాట్‌తో అంపైర్‌కు గాయంఫెరీరా బౌలింగ్‌లో స్ట్రెయిట్ షాట్ ఆడేందుకు సంజూ ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు ఇచ్చిన క్యాచ్‌ను ఫెరీరా డ్రాప్ చేయగా.. అంపైర్ రోహన్ పండిట్ మోకాలికి తలిగింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో కుప్పకూలిపోగా.. ఫిజియోలు వచ్చి చెక్ చేశారు.👉పవర్ ప్లేలో భారత్ స్కోరు: 67-1(6)సంజూ 27, తిలక్ వర్మ 4 పరుగులతో ఉన్నారు.👉5.4- తొలి వికెట్ డౌన్: కార్బిన్ బాష్ బౌలింగ్‌లో కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైన అభిషేక్ శర్మ (21 బంతుల్లో 34; ఆరు ఫోర్లు, ఒక సిక్స్) అవుట్. తొలి వికెట్ డౌన్. క్రీజులోకి తిలక్ వర్మ. స్కోరు: 63-1(5.4)👉ఐదు ఓవర్లలో భారత్ స్కోరు: 56-0👉అభిషేక్ శర్మ 17 బంతుల్లో 28, సంజూ శాంసన్ 13 బంతుల్లో 27 పరుగులతో క్రీజులో ఉన్నారు.తుదిజట్లలో మార్పులు ఇవేఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తమ తుదిజట్టులో ఒక మార్పు చేసింది. అన్రిచ్ నోర్జే స్థానంలో జార్జ్ లిండేను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చింది. మరోవైపు.. టీమిండియా ఏకంగా మూడు మార్పులతో బరిలోకి దిగింది. జస్ప్రీత్ బుమ్రా తిరిగి రాగా.. హర్షిత్ రాణా బెంచ్‌కే పరిమితమయ్యాడు. మరోవైపు.. కుల్దీప్ యాదవ్, శుబ్‌మన్ గిల్ గాయాల బెడదతో దూరం కాగా.. వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్ వారి స్థానాలను భర్తీ చేశారు.కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. కటక్‌లో భారత్, ముల్లన్‌పూర్‌లో సౌతాఫ్రికా గెలవగా.. ధర్మశాలలో భారత్ మరోసారి జయకేతనం ఎగురవేసింది. లక్నోలో నాలుగో టీ20 పొగమంచు వల్ల రద్దైపోగా.. అహ్మదాబాద్‌లో గెలిచి 3-1తో సిరీస్ గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా ఐదో టీ20 తుదిజట్లుటీమిండియాఅభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్సౌతాఫ్రికాక్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవాన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్. -
డబ్బు తిరిగి ఇచ్చేయండి.. బీసీసీఐ స్పందన ఇదే
భారత్- దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 రద్దైన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై విమర్శల వర్షం కురుస్తోంది. లక్నోలో పొగమంచు కారణంగా టాస్ పడకుండానే మ్యాచ్‌ను ముగించాల్సి వచ్చింది. ఆరుసార్లు మైదానంలోకి వచ్చి.. పరిస్థితిని సమీక్షించిన అంపైర్లు ఆఖరికి 9.30 నిమిషాల సమయంలో.. ప్రతికూల వాతావరణం వల్ల మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.అయితే, ఉత్తర భారతంలో పరిస్థితులు తెలిసి కూడా బీసీసీఐ (BCCI) ఇలా మ్యాచ్‌ను షెడ్యూల్ చేయడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి. నవంబరు, డిసెంబరు నెలల్లో అక్కడ కాలుష్యం, పొగమంచు ఏ స్థాయిలో ఉంటుందో తెలిసినా లక్నోలో మ్యాచ్ ఎలా షెడ్యూల్ చేశారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. స్పందించిన బీసీసీఐమరోవైపు.. లక్నో మ్యాచ్ కోసం టికెట్ల రూపంలో డబ్బులు ఖర్చుచేసిన ప్రేక్షకులు తమ డబ్బు తిరిగి ఇచ్చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఈ మ్యాచ్ నిర్వహణకు ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) బాధ్యత వహిస్తుందని తెలిపారు.‘‘ఈ మ్యాచ్ టికెట్ల విక్రయాన్ని రాష్ట్ర అసోసియేషన్ చూసుకుంది. బీసీసీఐ మ్యాచ్ నిర్వహణ హక్కులను మాత్రమే వారికి ఇచ్చింది. మిగతా విషయాలన్ని యూపీసీఏ పరిధిలోనే ఉంటాయి’’ అని IANSకు గురువారం దేవజిత్ సైకియా తెలిపారు. తద్వారా ప్రేక్షకులకు టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో యూపీసీఏదే పూర్తి బాధ్యత అని చెప్పకనే చెప్పారు. రీఫండ్ నిబంధనల ప్రకారం.. కాగా బీసీసీఐ రీఫండ్ నిబంధనల ప్రకారం.. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దైతే టికెట్లు కొనుక్కున్న వారు.. ఆ మొత్తాన్ని తిరిగి పొందేందుకు అర్హులు అవుతారు. ఇప్పుడు బంతి యూపీసీఏ కోర్టులో ఉందన్నమాట! కాగా సొంతగడ్డపై టీమిండియా సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత కటక్‌లో భారత్ 101 పరుగులతో గెలవగా.. ముల్లన్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లో ప్రొటిస్ జట్టు 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ధర్మశాలలో మూడో టీ20లో భారత్ గెలిచి.. 2-1తో ఆధిక్యం సంపాదించింది. లక్నోలోని ఏకనా స్టేడియంలో నాలుగో టీ20 జరగాల్సి ఉండగా.. పొగమంచు వల్ల రద్దైపోయింది. ఇరుజట్ల మధ్య ఆఖరి, ఐదో టీ20కి అహ్మదాబాద్ వేదిక.చదవండి: తల్లి నగలు, ప్లాట్లు, పొలం అమ్మేశారు.. ఇప్పుడిలా! -
గిల్‌కు గాయం.. అతడికి వరం! భారత తుది జట్టు ఇదే
అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం దక్షిణాఫ్రికాతో ఐదో టీ20లో తలపడేందుకు భారత జట్టు సిద్దమవుతోంది. లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20.. పొగమంచు కారణంగా రద్దు కావడంతో చివరిదైన ఐదో టీ20 టీమిండియాకు కీలకంగా మారింది.ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. మరోవైపు సఫారీలు కూడా ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును ఓడించి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయాత్మక పోరులో టీమిండియా కొన్ని కీలక మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.సంజూకు లక్కీ ఛాన్స్!ఈ మ్యాచ్‌కు భారత వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా దూరమయ్యాడు. నాలుగో టీ20కు ముందు ప్రాక్టీస్ చేస్తుండగా గిల్ పాదానికి గాయమైంది. దీంతో చివరి రెండు టీ20లకు అతడు దూరంగా ఉండనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.గిల్ గైర్హజరీలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను సంజూ ప్రారంభించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు బెంచ్‌కే పరిమితమైన శాంసన్.. 2026 టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో తన ఫామ్‌ను నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశం.బుమ్రా రీఎంట్రీ!మరోవైపు ఈ కీలక మ్యాచ్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా అందుబాటులో ఉండవచ్చు. వ్యక్తిగత కారణాల వల్ల మూడో మ్యాచ్‌కు దూరమైన అతను.. నాలుగో మ్యాచ్ సందర్భంగా జట్టుతో కలిసి కనిపించాడు. కాబట్టి ఇప్పుడు ఐదో టీ20లో అతడు ఆడే సూచనలు కన్పిస్తున్నాయి.ఒకవేళ అతడు జట్టుతో కలిస్తే హర్షిత్ రాణా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండకపోవచ్చు. అదేవిధంగా అక్షర్ పటేల్ స్ధానంలో ప్రధాన జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవచ్చు.భారత తుది జట్టు (అంచనా):అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా/ హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.చదవండి: IND vs SA: క్రికెట్ వర్సెస్ కాలుష్యం.. నిజంగా ఇది సిగ్గు చేటు! -
'ఇంతకంటే దారుణ పరిస్థితుల్లో ఆడాను.. అంపైర్ల నిర్ణయంతో షాకయ్యాను'
లక్నో వేదికగా బుధవారం జరగాల్సిన భారత్-దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 భారీ పొగమంచు కారణంగా రద్దయింది. కనీసం టాస్ వేసేందుకు వీలు పడలేదు. సాయంత్రం 6:30 గంటలకు పడాల్సిన టాస్.. పొగమంచు కారణంగా పదేపదే వాయిదా పడుతూ వచ్చింది. పొగ మంచు దుప్పటిలా కప్పేయడంతో విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోయింది. సాయత్రం 6:50 నుండి 9:25 గంటల వరకు అంపైర్లు దాదాపు ఆరుసార్లు పిచ్‌ను పరిశీలించారు. చివరకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో రాత్రి 9:25 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గాలి నాణ్యత సూచీ 400 దాటిపోవడంతో ఆటగాళ్ల ఆరోగ్య భద్రతా దృష్ట్యా అంపైర్లు ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు కామెంటేటర్ ఉన్న భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అంపైర్ల నిర్ణయంపై మండిపడ్డాడు."అంపైర్ల నిర్ణయం నన్ను షాక్‌కు గురిచేసింది. సమయం గడిచేకొద్దీ పొగమంచు తగ్గుతుందని అనుకోవడం పొరపాటు. నేను దీనికంటే దారుణమైన పరిస్థితుల్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాను. ఇక్కడ పరిస్థితులు కాస్త మెరుగ్గానే ఉన్నాయి" అని ఉతప్ప పేర్కొన్నాడు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే 3-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకోనుంది. ఒకవేళ సౌతాఫ్రికా గెలిస్తే సిరీస్ సమం కానుంది. అయితే ఈ సిరీస్‌కు భారత స్టార్ ప్లేయర్లు అక్షర్ పటేల్, శుభ్‌మన్ గిల్ దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా అక్షర్ పటేల్ మూడో టీ20కే ముందు జట్టు నుంచి తప్పుకోగా.. తాజాగా గిల్ కాలికి గాయమైంది. దీంతో అతడు ఐదో టీ20కు అందుబాటులో లేడు. అతడి స్ధానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి రానున్నారు.చదవండి: IND vs SA: క్రికెట్ వర్సెస్ కాలుష్యం.. నిజంగా ఇది సిగ్గు చేటు! -
క్రికెట్ వర్సెస్ కాలుష్యం.. నిజంగా ఇది సిగ్గు చేటు!
లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా బుధవారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 ప్రతికూల వాతావరణం కారణంగా రద్దయ్యింది. పొగమంచు కమ్మేయడంతో కనీసం టాస్ పడకుండానే మ్యాచ్‌ను ముగించాల్సి వచ్చింది. లక్నోలో గాలి నాణ్యత సూచీ (AQI) 400 దాటి 'హానికర' స్థాయికి చేరుకుంది.దీంతో మొత్తంగా ఆరు సార్లు మైదానంలోకి వచ్చి పరిస్థితిని సమీక్షించిన అంపైర్లు.. చివరిసారిగా రాత్రి 9.25 సమయంలో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో బీసీసీఐ షెడ్యూల్ తీవ్రస్ధాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.ప్రణాళిక లోపం..!వాతావరణంపై పూర్తి నియంత్రణ ఎవరి చేతిలోనూ ఉండదు. కానీ ఉత్తర భారతదేశంలో నవంబర్, డిసెంబర్ నెలల్లో కాలుష్యం, పొగమంచు తీవ్రత ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇది కొత్త విషయం ఏమీ కాదు. గతంలో దీపావళి తర్వాత ఢిల్లీలో జరగాల్సిన టెస్ట్ మ్యాచ్‌ను కాలుష్యంగా కారణంగా బీసీసీఐ కోల్‌కతాకు మార్చింది. అంటే బోర్డుకు అక్కడి పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉంది. కానీ ఈసారి మాత్రం ముందస్తు జాగ్రత్త తీసుకోవడంలో బీసీసీఐ విఫలమైంది. దేశవ్యాప్తంగా ఇంకా ఎన్నో వేదికలు ఉన్నప్పటికి లక్నోలోనే షెడ్యూల్ చేయాల్సిన అవసరం ఏముందని బీసీసీఐపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంతటి కాలుష్యంలో ఆడటం ఆటగాళ్లకు ప్రేక్షకులకు, అధికారులకు ప్రాణసంకటమే. ఈ మైదానంలో హార్డిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు మాస్కులు ధరించి తిరగాల్సి వచ్చింది. ఈ సిరీస్‌లో ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20లోనూ భారత ఆటగాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఇంతటి చలిలో ఆడడం ఇదే తొలిసారి అని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చెప్పుకొచ్చాడు.ఇప్పటికైనా మారాల్సిందే..భారత్‌లో క్రికెట్ కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు.. కోట్లాది మంది భావోద్వేగం. తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు టిక్కెట్లు తీసుకుని మరి మైదానంకు వచ్చిన అభిమానులకు నిరాశ ఎదురవ్వడం చాలా బాధాకారం. ఇకనైనా బీసీసీఐ షెడ్యూలింగ్ చేసేటప్పుడు.. వాతావరణ పరిస్థితులు, కాలుష్య స్థాయిలను పరిగణనలోకి తీసుకుని వేదికలను ఎంపిక చేయాలని క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు.అయితే వచ్చే ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగే వైట్‌బాల్ సిరీస్‌లకు దక్షిణ, పశ్చిమ భారత నగరాలు వేదికలగా ఉన్నాయి. ఒక్క మూడో టీ20 నార్త్ ఈస్ట్(అస్సాం)లో జరగనుంది. ఈ మ్యాచ్ వేదికను బీసీసీఐ మార్చే అవకాశముంది. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. ఐదో టీ20 శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.ఇది రెండోసారి..అంతర్జాతీయ క్రికెట్లో పొగమంచు కారణంగా మ్యాచ్ రద్దు కావడం ఇది రెండోసారి. 1998లో ఫైసలాబాద్‌లో పాకిస్తాన్, జింబాబ్వే మధ్య జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దు అయింది. ఆశ్చర్యకరంగా ఐదు రోజులూ ఆట సాధ్యం కాలేదు.చదవండి: అంధుల మహిళల క్రికెట్ జట్టుకు సచిన్ అభినందన -
ఎట్టకేలకు!.. టాస్ పడకుండానే మ్యాచ్ రద్దు
టీమిండియా- సౌతాఫ్రికా మధ్య టీ20 సిరీస్ విజేత తదుపరి మ్యాచ్‌లో తేలనుంది. లక్నో వేదికగా బుధవారం జరగాల్సిన నాలుగో టీ20 టాస్ పడకుండానే రద్దై పోయింది. అయితే, ఎప్పటిలా వర్షం వల్ల కాకుండా.. ఈసారి పొగమంచు కారణంగా మ్యాచ్ మొదలుకాకుండానే ముగిసిపోయింది.స్టేడియాన్ని పొగమంచు కమ్మేయడంతో వరుస విరామాల్లో మైదానానికి వచ్చిన అంపైర్లు.. పరిస్థితిని పర్యవేక్షించారు. భారత కాలమానం ప్రకారం.. బుధవారం 6.30 నిమిషాలకు టాస్ పడాల్సి ఉండగా.. ఈ కారణం వల్లే తొలుత ఆలస్యమైంది. ఈ క్రమంలో వరుస విరామాల్లో అంపైర్లు వచ్చి సమీక్ష నిర్వహించారు. మైదానమంతా కలియదిరుగుతూ బ్యాటర్, బౌలర్, ఫీల్డర్ల స్థానాల నుంచి బంతి స్పష్టంగా కనబడుతుందా? లేదా? అని పరిశీలించారు.పదే.. పదేఇందులో భాగంగా 6.50 నిమిషాలకు ఓసారి.. 7.30 నిమిషాలకు మరోసారి.. ఆపై.. 8 గంటలకు.. అనంతరం 8.30 నిమిషాలకు.. మైదానంలోకి వచ్చిన అంపైర్లు పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో పిచ్‌పై కవర్లు కప్పి ఉంచాలని సూచించారు. ఈసారి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాతోనూ వారు మాట్లాడటం గమనార్హం.అనంతరం 9 గంటలకు మరోసారి రివ్యూ చేసిన అంపైర్లు.. ప్రేక్షకుల సహనానికి మరోసారి పరీక్ష పెట్టారు. ఈసారి 9.25 నిమిషాలకు మరోసారి రివ్యూ చేస్తామని చెప్పి మైదానం వీడారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్టేడియంలోని ప్రేక్షకులు కంగుతిన్నారు. మ్యాచ్ సాగుతుందా? లేదా? అన్న అంశంపై త్వరగా తేల్చకుండా ఇదేం తీరు అనేలా రియాక్షన్స్ ఇచ్చారు.మరోవైపు.. లక్నోలో పొగమంచు కమ్ముకున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ సాగదని తెలిసినా ఎందుకు సాగదీస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇక కామెంటేటర్లు కూడా దాదాపుగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.ఎట్టకేలకుఈ క్రమంలో... 9.25 నిమిషాలకు మరోసారి మైదానంలోకి వచ్చి పరిస్థితి పరిశీలించిన తర్వాత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో అభిమానులు నిరాశగా వెనుదిరిగారు.కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. తొలుత కటక్‌లో భారత్ 101 పరుగుల తేడాతో జయభేరి మోగించగా.. ముల్లన్‌పూర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో సిరీస్ 1-1తో సమం కాగా.. ధర్మశాల వేదికగా మూడో టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది.. 2-1తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య బుధవారం లక్నోలోని ఏకనా స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ టాస్ పడకుండానే ఇలా ముగిసిపోయింది. ఇక సిరీస్ విజేతను తేల్చే శుక్రవారం నాటి మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.చదవండి: నాలుగో టీ20 నుంచి గిల్ అవుట్! -
నాలుగో టీ20 నుంచి గిల్ అవుట్!
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు పొగమంచు అంతరాయం కలిగించింది. ఫలితంగా ఇరుజట్ల మధ్య నాలుగో టీ20కి టాస్ ఆలస్యంగా పడనుంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌కు టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ దూరమైనట్లు సమాచారం.పేలవ ప్రదర్శనకాగా ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్ సందర్భంగా భారత టీ20 జట్టులో పునరాగమనం చేసిన గిల్.. నాటి నుంచి ఓపెనర్‌గా పేలవ ప్రదర్శనలతో తేలిపోతున్నాడు. అంతకు ముందు కూడా అంత గొప్పగా ఏమీ ఆడలేదు. గత ఇరవై ఇన్నింగ్స్‌లో అతడు సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).తాజాగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో తీవ్రంగా నిరాశపరిచిన గిల్ (4(2), 0(1)).. చివరగా ధర్మశాలలో ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్‌గా వచ్చి 28 బంతుల్లో 28 పరుగులు చేసి.. మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. కాగా గిల్ కోసం.... విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్న అభిషేక్ శర్మ- సంజూ శాంసన్‌లను యాజమాన్యం విడదీసింది.సంజూను పక్కనపెట్టేసి మరీ..అభిషేక్‌ను ఓపెనర్‌గా కొనసాగిస్తూ అతడికి గిల్‌ను జతచేసి.. సంజూను పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో గిల్ వరుస వైఫల్యాలు, అయినా అతడినే కొనసాగిస్తున్న మేనేజ్మెంట్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా నాలుగో టీ20కి మాత్రం గిల్ దూరమైనట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. అయితే, పాదానికి గాయమైన కారణంగానే అతడు తప్పుకొన్నట్లు పేర్కొంది.కాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా గాయపడ్డ గిల్.. రెండో టెస్టుతో పాటు మూడు వన్డేల సిరీస్‌కూ దూరమయ్యాడు. టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చిన అతడు మరోసారి గాయపడటం గమనార్హం. ఇక టీమిండియా టెస్టు, వన్డేలకు గిల్ కెప్టెన్ కాగా.. టీ20లలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: నంబర్ 1: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి -
IND vs SA: టాస్ పడలేదు.. మ్యాచ్ రద్దు
టీమిండియా- సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20లో టాస్ పడకుండానే మ్యాచ్ ముగిసిపోయింది. లక్నోలో పొగమంచు అధికంగా ఉన్న నేపథ్యంలో అంపైర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం.. సాయంత్రం 6.30 నిమిషాలకు టాస్ వేయాల్సి ఉండగా పొగమంచు కమ్ముకుంది. దీంతో 6.50 నిమిషాలకు మరోసారి పరిస్థితిని సమీక్షించగా ఎలాంటి మార్పూ లేదు. దీంతో 7.30 నిమిషాలకు మరోసారి రివ్యూ చేయగా.. అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. రాత్రి 8 గంటలకు మరోసారి పరిస్థితిని పర్యవేక్షించి అందుకు అనుగుణంగా అంపైర్లు మ్యాచ్ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.వీడిన సస్పెన్స్ఈసారి అంపైర్లు మైదానం కలియదిరుగుతూ పొగమంచు ప్రభావం ఎలా ఉందో గమనించారు. బ్యాటర్, బౌలర్, ఫీల్డర్ల పొజిషన్ల నుంచి బంతి స్పష్టంగా కనబడుతుందా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో చర్చల అనంతరం 8.30 నిమిషాలకు మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అప్పుడూ అంపైర్లు ఓ నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో 9 గంటలకు మరోసారి రివ్యూ జరుగగా.. ఈసారీ స్పష్టత రాలేదు. 9.25 నిమిషాలకు మరోసారి పరిస్థితిని పర్యవేక్షించిన అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించి సస్పెన్స్‌కు తెరదించారు.రీప్లేస్‌మెంట్‌గా షాబాజ్ అహ్మద్‌కాగా ఈ మ్యాచ్‌కు ముందు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ టీమిండియాకు దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా మిగిలిన రెండు టీ20ల నుంచి అతడు తప్పుకోగా.. బీసీసీఐ షాబాజ్ అహ్మద్‌ను రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించింది. అదే విధంగా వ్యక్తిగత కారణాలతో మూడో టీ20కి దూరమైన పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా తిరిగి వచ్చాడు. నాలుగో టీ20లో అతడు బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు.ఇదిలా ఉంటే.. ఐదు టీ20 సిరీస్‌ల భాగంగా కటక్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ 101 పరుగులతో గెలవగా.. ముల్లన్‌పూర్‌లో సౌతాఫ్రికా 51 పరుగులతో గెలిచింది. తద్వారా 1-1తో సిరీస్ సమం చేసింది. అయితే, ధర్మశాలలో మరోసారి జయభేరి మోగించిన టీమిండియా 2-1తో ఆధిక్యంలోకి దూసుకువచ్చింది. లక్నో వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లోనూ గెలిచి.. మరో టీ20 మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని సూర్య సేన పట్టుదలగా ఉంది. అంతకు ముందు టెస్టుల్లో సఫారీలు టీమిండియాను 2-0తో వైట్‌వాష్ చేయగా.. వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకుంది.చదవండి: నంబర్ 1: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి -
సౌతాఫ్రికాతో నాలుగో టీ20.. భారత తుది జట్టు ఇదే! అతడికి మరో ఛాన్స్
లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో నాలుగో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20కు ముందు తన సన్నిహితుడొకరు ఆస్పత్రిపాలవడంతో వెంటనే అతడు ముంబైకి తిరిగి వెళ్లిపోయాడు. ఈ నాలుగో టీ20కు బుమ్రా అందుబాటులో ఉండవచ్చని దూబే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పినప్పటికి.. టీమ్ మెనెజ్‌మెంట్ మాత్రం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ బుమ్రా ఆడకపోతే హర్షిత్ రాణాను ప్లేయింగ్ ఎలెవన్‌లో కొనసాగించనున్నారు. గత మ్యాచ్‌లో బుమ్రా స్థానంలో వచ్చిన హర్షిత్ రాణా అద్భుతంగా రాణించాడు. క్వింటన్ డి కాక్, డెవాల్డ్ బ్రెవిస్ వంటి కీలక వికెట్లు తీసి సఫారీలను దెబ్బ తీశాడు. టీమిండియా ఎటువంటి ప్రయోగాలు చేయకుండా గత మ్యాచ్ ఆడినే జట్టునే లక్నోలోనూ కొనసాగించనుంది. లక్నో వంటి పరిస్థితుల్లో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి జోడీ మరోసారి కీలకంగా మారనున్నారు. బుమ్రా అందుబాటులోకి వస్తే రాణాపై వేటు పడే అవకాశముంది. మరోవైపు సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌కూ బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. సౌతాఫ్రికా జట్టులో మరోసారి మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. డేవిడ్ మిల్లర్ తిరిగి జట్టులోకి రానున్నాడు.తుది జట్లుదక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్ ), డికాక్, రిజా హెండ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరిరా, యాన్సెన్, బాష్, జార్జ్ లిండే/కేశవ్, ఎంగిడీ, బార్ట్‌మన్.భారత్సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, శుభ్‌మన్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి. చదవండి: Prithvi Shaw: ఒకప్పుడు రూ.8 కోట్లు.. ఇప్పుడు ధర తెలిస్తే షాక్! -
BCCI: అక్షర్ పటేల్ స్థానంలో అతడే
సౌతాఫ్రికాతో జరిగే చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా అతడు ఈ సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ధ్రువీకరించింది.సఫారీ జట్టుతో నాలుగో టీ20 కోసం జట్టు సహచరులతో పాటు లక్నోకు వచ్చినా... వైద్యుల సూచనల మేరకు తర్వాతి మ్యాచ్‌లు ఆడరాదని అక్షర్ (Axar Patel) నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన అక్షర్ ధర్మశాలలో జరిగిన మూడో టీ20లో కూడా బరిలోకి దిగలేదన్న సంగతి తెలిసిందే.అక్షర్ స్థానంలోమరోవైపు.. అక్షర్ స్థానంలో మరో లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ షహబాజ్ అహ్మద్ (Shahbaz Ahmed)ను సెలక్టర్లు ఎంపిక చేశారు. బెంగాల్‌కు చెందిన 31 ఏళ్ల షహబాజ్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 3 వన్డేలు, 2 టీ20లు ఆడి మొత్తం 5 వికెట్లు పడగొట్టాడు. హాంగ్జూలో జరిగిన 2023 ఆసియా క్రీడల్లో అతను చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఇదిలా ఉంటే.. స్వదేశంలో సౌతాఫ్రికాతో ఆల్ ఫార్మాట్ల సిరీస్‌తో బిజీగా ఉన్న టీమిండియా.. టెస్టుల్లో 2-0తో వైట్‌వాష్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుచుకుని ఊరట పొందింది. 2-1తో ఆధిక్యం ఈ క్రమంలో కటక్ వేదికగా తొలి టీ20లో సఫారీలను 101 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన భారత జట్టు.. ముల్లన్‌పూర్‌లో మాత్రం 51 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఇక ధర్మశాలలో ఆదివారం నాటి మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విజయం బాట పట్టిన టీమిండియా.. 2-1తో ఆధిక్యం సంపాదించింది. ఇక లక్నోలో బుధవారం నాటి మ్యాచ్‌లోనూ గెలుపొంది మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. కాగా మూడో టీ20లో అక్షర్ పటేల్‌తో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలను కూడా టీమిండియా కోల్పోయింది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా బుమ్రా ఇంటికి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అతడి రీఎంట్రీ గురించి మాత్రం బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు అప్డేట్ లేదు.చదవండి: మాక్ వేలంలో రూ. 30.50 కోట్లకు అమ్ముడుపోయిన గ్రీన్.. ఎవరు కొన్నారంటే? -
టీమిండియాకు మరో భారీ షాక్.. స్టార్ ప్లేయర్ అవుట్!
సౌతాఫ్రికాతో మూడో టీ20లో గెలిచి జోరు మీదున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ ఒకరు.. మిగిలిన రెండు టీ20లకు కూడా అందుబాటులో ఉండటం లేదని సమాచారం. ఇంతకీ ఎవరా ఆటగాడు?స్వదేశంలో సౌతాఫ్రికా చేతిలో టెస్టుల్లో 2-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. వన్డే సిరీస్ (IND vs SA)ను 2-1తో గెలిచింది. ఇదే జోరులో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కటక్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఏకంగా 101 పరుగులతో సఫారీలను చిత్తు చేసిన టీమిండియా.. ముల్లన్‌పూర్‌లో 51 పరుగుల తేడాతో ఓడిపోయింది.గెలుపుబాట పట్టిన సూర్య సేన..ఈ క్రమంలో ధర్మశాలలో ఆదివారం నాటి మూడో టీ20లో సత్తా చాటి తిరిగి గెలుపుబాట పట్టిన సూర్య సేన.. 2-1తో ఆధిక్యంలోకి వచ్చింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ తమ తుదిజట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో దూరం కాగా.. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు విశ్రాంతినిచ్చారు.అక్షర్ పటేల్ అవుట్!అయితే, తాజా సమాచారం ప్రకారం అక్షర్ పటేల్ (Axar Patel) అనారోగ్యం బారిన పడ్డాడని.. మిగిలిన రెండు మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఇప్పటికే బుమ్రా రూపంలో కీలక బౌలర్ దూరం కాగా.. అక్షర్ కూడా అందుబాటులో లేకుంటే తుదిజట్టు కూర్పు విషయంలో కాస్త గందరగోళం నెలకొనవచ్చు.కాగా కటక్‌లో 23, ముల్లన్‌పూర్‌లో 21 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. ఆయా మ్యాచ్‌లలో రెండు (2/7), ఒక వికెట్ (1/27) పడగొట్టాడు. మరోవైపు.. అక్షర్ స్థానంలో మూడో టీ20లో ఆడిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లతో మెరిశాడు. ఇదిలా ఉంటే.. భారత్- సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20 లక్నోలో బుధవారం జరుగనుండగా.. శుక్రవారి నాటి ఆఖరి మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన ప్రాథమిక జట్టుఅభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా. -
ముచ్చటైన ‘మూడు’ కోసం ఇప్పటికే ఏడుగురు.. ఎవరు బెస్ట్?
టీ20 ప్రపంచకప్-2024 టైటిల్ గెలిచిన తర్వాత టీమిండియాలో చోటు చేసుకున్న ప్రధాన మార్పు.. దిగ్గజాలు రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిలేని జట్టు. ఈ మెగా టోర్నీలో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత వీరిద్దరు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.హార్దిక్ పాండ్యాకు బదులుఇక అప్పటి నుంచి జట్టు పునర్నిర్మాణంలో భాగంగా భిన్న పరిణామాలు చోటుచేసుకున్నాయి. హార్దిక్ పాండ్యాకు బదులు సూర్యకుమార్ యాదవ్‌కు బీసీసీఐ పగ్గాలు అప్పగించింది. అతడు సారథిగా విజయాలు సాధిస్తున్నా.. బ్యాటర్‌గా మాత్రం అప్పటి నుంచి విఫలమవుతూనే ఉన్నాడు.మరోవైపు.. బ్యాటింగ్ ఆర్డర్లో కీలకమైన మూడో స్థానంలో ఎవరిని ఆడించాలన్న విషయం ఇప్పటికీ స్పష్టత రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. టీ20 ఫార్మాట్లో మరో వరల్డ్‌కప్ టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న వేళ.. టీమిండియాలో ఇంత వరకు ఈ కన్ఫ్యూజన్కు మాత్రం తెరపడటం లేదు.మూడో స్థానంలోఒకప్పుడు మూడో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ బ్యాటింగ్‌కు వచ్చేవాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత కూడా సత్తా చాటి ప్రపంచకప్‌లో పాల్గొన్నాడు పంత్. అయితే, ఆ తర్వాత పంత్‌తో పాటు చాలా మంది సీనియర్లకు టెస్టుల్లో ప్రాధాన్యం ఇస్తూ టీ20 జట్టును యువ ఆటగాళ్లతో నింపేసింది యాజమాన్యం.అభిషేక్ శర్మకు తోడుగా.. సంజూ శాంసన్‌ను ఓపెనర్‌గా పంపగా.. వీరు సక్సెస్ఫుల్ జోడీగా నిరూపించుకున్నారు. ఇక మూడో స్థానంలో యువ ఆటగాడు తిలక్ వర్మ.. కెప్టెన్ సూర్యతో పోటీపడ్డాడు. వన్‌డౌన్‌లో తాను సరైన వాడినేనని నిరూపించుకున్నాడు కూడా!పక్కనపెట్టేశారుఅయితే, గత కొంతకాలంగా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలతో విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే. గిల్ కోసం ఓపెనర్‌గా సంజూను తప్పించి.. మిడిలార్డర్లో ఓసారి, వన్‌డౌన్‌లో ఓసారి ఆడించారు. ఇప్పుడిక ఏకంగా వికెట్ కీపర్ కోటాలోనూ ఆడించకుండా పక్కనపెట్టేశారు. మరోవైపు.. కీపర్‌గా, ఫినిషర్‌గా జితేశ్ శర్మ రాణిస్తుండటంతో సంజూ ప్రపంచకప్ ఆశలు దాదాపు ఆవిరిఅయ్యినట్టే!ముచ్చటైన ‘మూడు’ కోసం ఇప్పటికే ఏడుగురుఇక మూడో స్థానం విషయానికొస్తే.. 2024 వరల్డ్‌కప్ తర్వాత ఇప్పటి వరకు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, శివం దూబే, అక్షర్ పటేల్.. ఇలా చాలా మంది ఆడారు. వీరిలో సూర్య 26.92 సగటుతో 157కు పైగా స్ట్రైక్‌రేటుతో 377 పరుగులు సాధించగా.. తిలక్ వర్మ 185కు పైగా స్ట్రైక్‌రేటుతో.. 161కి పైగా సగటుతో ఏకంగా 323 పరుగులు సాధించాడు.మిగిలిన వారిలో రుతురాజ్, సంజూ, అభిషేక్, శివం, అక్షర్.. ప్రయోగాత్మకంగా వచ్చి వరుసగా 84, 58, 24, 24, 21 పరుగులు చేశారు. అయితే, ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్‌కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తమ జట్టులో కేవలం ఓపెనింగ్ జోడీ మాత్రమే స్థిరంగా ఉంటుందని స్పష్టం చేశాడు. మిగతా ఆటగాళ్లు బ్యాటింగ్ ఆర్డర్లో ఏ స్థానంలో రావడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని.. ఉంటారనీ పేర్కొన్నాడు. వారధినిజానికి టీ20 క్రికెట్లో నంబర్ 3 అనేది ఫిల్లర్ పొజిషన్ కానేకాదు. ఓపెనర్లు వేసిన పునాదిని బలపరుస్తూ.. మిడిలార్డర్‌కు సహకరించేలా వన్‌డౌన్ బ్యాటర్ వారధిని నిర్మించాల్సి ఉంటుంది. పరిస్థితిని బట్టి ఒక్కోసారి పవర్‌ప్లేలోనే రావాల్సి ఉంటుంది. మరికొన్నిసార్లు బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించాల్సి ఉంటుంది.మిగతా వారితో పోలిస్తే వన్‌డౌన్‌లో ఆడే ఆటగాడికి ఫిక్స్డ్ పొజిషన్ ఉండటం అత్యంత ముఖ్యం. అందుకు తగ్గట్టుగా అతడు నైపుణ్యాలు కనబరచగలడు. కానీ టీమిండియా నాయకత్వ బృందం దీనిని ఒక ట్రయల్ రూమ్‌గా మార్చేసి ఇష్టారీతిన ప్రయోగాలు చేస్తోంది. సమస్యను ఫిక్స్ చేసుకోవాలిఅయితే, ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. మన జట్టులో ప్రతిభకు కొదవలేదు. కానీ దానిని ఉపయోగించుకునే విధానంలో స్పష్టత లోపించింది. ఏదేమైనా వరల్డ్‌కప్ నాటికి టీమిండియా నంబర్ 3 సమస్యను ఫిక్స్ చేసుకోవాలి. అనుభవజ్ఞుడైన సూర్యను లేదంటే.. మూడో స్థానంలో ఇప్పటికే నిరూపించుకున్న తిలక్ వర్మను పంపాలి. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలు గెలవాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు. అందుకు తగ్గ ప్రణాళికలు, జట్టు కూర్పులో స్పష్టత అవసరం.చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే ‘బెస్ట్’ ప్లేయర్‌గా.. -
గిల్, సూర్య కలిసి వరల్డ్‌కప్ గెలిపిస్తారు: అభిషేక్ శర్మ
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో టీమిండియా నాయకుడు సూర్యకుమార్ యాదవ్ బ్యాటర్‌గా విఫలమవుతూనే ఉన్నాడు. ఒకప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్‌గా ఉన్న అతడు.. ఇప్పుడు కనీసం పట్టుమని పది పరుగులు చేసేందుకు కూడా శ్రమించాల్సి వస్తోంది.కెప్టెన్, వైస్ కెప్టెన్ ఫెయిల్సూర్య సంగతి ఇలా ఉంటే.. వైస్ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill) కూడా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. దాదాపు గత ఇరవైకి పైగా ఇన్నింగ్స్‌లో అతడు కనీసం హాఫ్ సెంచరీ కూడా బాదకపోవడం ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో నాయకత్వ బృందమే ఇలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026 (T20 WC 2026) నాటికి టీమిండియా పరిస్థితి ఏమిటన్న సందేహాలు వస్తున్నాయి. కెప్టెన్‌గా విజయవంతమవుతున్నందున సూర్యకుమార్ (Suryakumar Yadav)పై విమర్శల పదును కాస్త తక్కువగా ఉండగా.. సంజూ శాంసన్‌ను బలి చేసి గిల్‌కు వరుస అవకాశాలు ఇస్తున్నారన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సూర్య, గిల్‌పై నమ్మకం ఉందిఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో మూడో టీ20లో విజయానంతరం భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ‘‘మీడియా ముఖంగా మీ అందరికీ నేనొక మాట చెబుతా.. గుర్తుపెట్టుకోండి. సూర్య, గిల్‌పై నాకు నమ్మకం ఉంది. వీరిద్దరు కలిసి టీ20 ప్రపంచకప్ టోర్నీలో మ్యాచ్‌లు గెలిపించబోతున్నారు. అంతకంటే ముందు ఈ సిరీస్‌లో జట్టును గెలిపిస్తారు.వీళ్లిద్దరితో కలిసి నేను చాలా కాలంగా ఆడుతున్నా. ముఖ్యంగా.. శుబ్మన్తో ఆడిన అనుభవం నాకుంది. ఎలాంటి పరిస్థితుల్లో.. అతడు ఎలా ఆడతాడో నాకు తెలుసు. ప్రత్యర్థి ఎవరైనా తన సమయం వచ్చినపుడు అతడు చెలరేగి ఆడతాడు.త్వరలోనే మీరు కూడా చూస్తారుసూర్య, గిల్ గురించి నాకు తెలుసు. అందుకే వారిపై నాకు అంత నమ్మకం. త్వరలోనే మీరు కూడా ఇది చూస్తారు. ముఖ్యంగా గిల్‌ను విమర్శిస్తున్న వారు.. త్వరలోనే అతడి నైపుణ్యాలను కళ్లారా చూస్తారు’’ అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు. అతడి వ్యాఖ్యలపై టీమిండియా అభిమానుల నుంచి సైతం మిశ్రమ స్పందన వస్తోంది.వరుస వైఫల్యాలుకాగా అభిషేక్ శర్మకు జోడీగా ఓపెనర్‌గా వస్తున్న గిల్.. సౌతాఫ్రికాతో ఇప్పటి వరు జరిగిన మ్యాచ్‌లలో చేసిన స్కోర్లు వరుసగా.. 4(2), 0(1), 28 (28). మరోవైపు.. సూర్య చేసిన పరుగులు 12(11), 5(4), 12(11). ఇక అభిషేక్ శర్మ తొలి టీ20లో (17), రెండో టీ20లో (17) తడబడ్డా.. మూడో టీ20లో 35(18) మెరుగ్గా రాణించాడు.ఇదిలా ఉంటే.. కటక్‌లో తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. ముల్లన్‌పూర్‌లో మాత్రం సఫారీల చేతిలో ఓడిపోయింది. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో ధర్మశాలలో జయభేరి మోగించి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా ఫిబ్రవరి 7న టీ20 ప్రపంచకప్-2026 మొదలుకానుంది. ఈ మెగా టోర్నీకి భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తాయి.చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే ‘బెస్ట్’ ప్లేయర్‌గా.. -
కోహ్లి ‘ప్రపంచ రికార్డు’ బ్రేక్ చేసిన తిలక్ వర్మ
టీమిండియా టీ20 స్టార్ తిలక్ వర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్ ఛేదనలో అత్యుత్తమ సగటుతో పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. తద్వారా ఇన్నాళ్లుగా భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఈ ప్రపంచ రికార్డును తిలక్ బద్దలు కొట్టాడు.తొలి రెండు టీ20లలో అలాస్వదేశంలో సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్నాడు తిలక్ వర్మ (Tilak Varma). బ్యాటింగ్ ఆర్డర్లో తరచూ మార్పుల నేపథ్యంలో కటక్ వేదికగా తొలి టీ20లో నాలుగో స్థానంలో వచ్చిన ఈ హైదరాబాదీ 32 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే.ఇక ముల్లన్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లోనూ ఇదే స్థానంలో ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఈసారి మాత్రం దుమ్ములేపాడు. కేవలం 34 బంతుల్లోనే 62 పరుగులు సాధించాడు తిలక్. అయితే, ఈ మ్యాచ్‌లో అతడి పోరాటం వృథాగా పోయింది.అత్యుత్తమ సగటు కలిగిన బ్యాటర్తాజాగా ఆదివారం నాటి మూడో టీ20లో మాత్రం తిలక్ తనదైన మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ధర్మశాలలో మూడో టీ20లో సౌతాఫ్రికా విధించిన 118 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనను టీమిండియా 15.5 ఓవర్లలోనే పూర్తి చేసింది.ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ 34 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. జట్టు గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే తిలక్ వర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 లక్ష్య ఛేదనలో.. కనీసం 500 పరుగులు సాధించిన ఆటగాళ్ల (టెస్టు హోదా కలిగిన దేశాలు) జాబితాలో అత్యుత్తమ సగటు కలిగిన బ్యాటర్‌గా నిలిచాడు.అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో లక్ష్య ఛేదనలో అత్యుత్తమ సగటు కలిగిన బ్యాటర్లు (కనీసం 500 పరుగులు)🏏తిలక్ వర్మ (ఇండియా)- 68.0 సగటుతో🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 67.1 సగటుతో🏏ఎంఎస్ ధోని (ఇండియా)- 47.71 సగటుతో🏏జేపీ డుమిని (సౌతాఫ్రికా)- 45.55 సగటుతో🏏సంగక్కర (శ్రీలంక)- 44.93 సగటుతో.చదవండి: ‘గోట్ టూర్’ చీఫ్ ఆర్గనైజర్ జైలుకు! -
నేను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నా.. కానీ: సూర్యకుమార్
సౌతాఫ్రికాతో మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ధర్మశాల వేదికగా సఫారీలను ఏడు వికెట్ల తేడాతో ఓడించి 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో.. గత మ్యాచ్ వైఫల్యాలను అధిగమించి తాజా టీ20లో గెలవడం పట్ల కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశాడు.విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘క్రీడలు మనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతాయి. ఈ సిరీస్‌లో తిరిగి పుంజుకుని ఆధిక్యంలోకి రావడం అత్యంత ముఖ్యమైన విషయం. మేము ప్రస్తుతానికి ఆ పనిని పూర్తి చేశాము.మా బౌలర్లు సూపర్కటక్లో జరిగిన తొలి టీ20లో మాదిరి ప్రాథమిక స్థాయి అంశాల మీద కూడా దృష్టి పెట్టాము. అందుకు తగ్గ ఫలితాన్ని పొందాము కూడా!.. చండీగఢ్ (ముల్లన్పూర్)లో జరిగిన రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా మేము చాలా విషయాలు నేర్చుకున్నాము. ముఖ్యంగా ఈసారి మా బౌలర్లంతా సమిష్టిగా రాణించడం కలిసి వచ్చింది.నెట్స్‌లో నేను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాఆ మ్యాచ్‌లో ఓటమి తర్వాతి సమావేశంలో మా తప్పొప్పుల గురించి లోతుగా చర్చించుకున్నాము. కఠినంగా సాధన చేశాము. ఈ మ్యాచ్‌లో మేము ప్రయోగాలకు పోలేదు. ఇక నా బ్యాటింగ్ విషయానికొస్తే.. నెట్స్‌లో నేను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాను.కానీ మ్యాచ్‌లో విఫలమవుతున్నాను. నా ఆధీనంలో ఉన్న ప్రతి పనిని విజయవంతంగా నిర్వహించేందుకు నేను శాయశక్తులా ప్రయత్నిస్తాను. సరైన సమయంలో సరైన విధంగా ఆడితే పరుగులు వాటంతట అవే వస్తాయి. నేను ఫామ్‌లో లేనని అనుకోను.అయితే, వీలైనన్ని ఎక్కువ పరుగులు మాత్రం రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఈ గెలుపును ఆస్వాదిస్తున్నాం. తదుపరి లక్నో మ్యాచ్‌పై దృష్టి సారిస్తాం’’ అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. కాగా ధర్మశాల వేదికగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది.117 పరుగులే చేసి ఆలౌట్భారత బౌలర్ల విజృంభణకు సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 117 పరుగులే చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (46 బంతుల్లో 61) ఒక్కడే మెరుగైన ఇన్నింగ్స్ ఆడగా.. మిగతా వారిలో ఫెరీరా(20) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. టీమిండియా పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో రెండు వికెట్లు కూల్చగా.. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే తలా ఒక వికెట్ తీశారు.స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 15.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (18 బంతుల్లో 35) ధనాధన్ దంచికొట్టగా.. శుబ్‌మన్ గిల్ (28 బంతుల్లో 28) ఫర్వాలేదనిపించాడు.మరోసారి సూర్య విఫలంవన్డౌన్లో వచ్చిన తిలక్ వర్మ 34 బంతుల్లో 25 పరుగులతో అజేయంగా నిలవగా.. కెప్టెన్ సూర్య (12) మరోసారి విఫలమయ్యాడు. తిలక్‌తో కలిసి శివం దూబే (4 బంతుల్లో 10 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చాడు.కాగా సూర్యకుమార్ యాదవ్ భారత టీ20 జట్టు పూర్తి స్థాయి కెప్టెన్ అయిన తర్వాత బ్యాటర్‌గా దారుణంగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా పేసర్లను ఎదుర్కోవడంలో తడబడుతున్నాడు. ఈ ఏడాది 18 ఇన్నింగ్స్‌లో పేసర్ల బౌలింగ్‌లో 14సార్లు అతడు అవుట్ అయ్యాడు. మొత్తంగా 106 బంతులు ఎదుర్కొని 8.71 సగటుతో కేవలం 122 పరుగులు చేశాడు. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య బుధవారం నాలుగో టీ20 జరుగుతుంది. ఇందుకు వేదిక లక్నో.చదవండి: Messi: ‘గోట్ టూర్’ చీఫ్ ఆర్గనైజర్ జైలుకు!#ShivamDube finishes things off in style and Team India go 2–1 up in the series.🔥#INDvSA, 4th T20I 👉 WED, DEC 17, 6 PM pic.twitter.com/OjhdlpHs7G— Star Sports (@StarSportsIndia) December 14, 2025 -
విజృంభించిన బౌలర్లు.. మూడో టీ20లో టీమిండియా గెలుపు
ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 14) జరిగిన మూడో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలర్లు కలిసికట్టుగా విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను భారత్ 117 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి మ్యాచ్‌లో భారత్, రెండో టీ20లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే.పూర్తి వివరాల్లోకి వెళితే.. టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకొని సౌతాఫ్రికాను గడగడలాడించింది. అర్షదీప్ సింగ్ (4-0-13-2), వరుణ్ చక్రవర్తి (4-0-11-2), హర్షిత్ రాణా (4-0-34-2), కుల్దీప్ యాదవ్ (2-0-12-2), హార్దిక్ పాండ్యా (3-0-23-1), శివమ్ దూబే (3-0-21-1) చెలరేగడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. మార్క్రమ్ (61) ఒంటరిపోరాటం చేయడంతో సౌతాఫ్రికా కనీసం మూడంకెల స్కోర్‌నైనా చేయగలిగింది.మిగతా ఆటగాళ్లలో ఫెరియెరా (20), నోర్జే (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. డికాక్ (1), బ్రెవిస్ (2), స్టబ్స్ (9), కార్బిన్ బాష్ (4), జన్సెన్ (2), బార్ట్‌మన్ (1), ఎంగిడి (2 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. హెండ్రిక్స్ ఖాతా కూడా తెరవలేకపోయాడు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను భారత్ ధాటిగా ప్రారంభించినప్పటికీ.. ఆతర్వాత కాస్త నిదానించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (18 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తన సహజ శైలిలో మెరుపులు మెరిపించి ఔటయ్యాక శుభ్‌మన్ గిల్ (28 బంతుల్లో 28; 5 ఫోర్లు), తిలక్ వర్మ (34 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (11 బంతుల్లో 12; 2 ఫోర్లు) ఆచితూచి ఆడారు. శివమ్ దూబే (4 బంతుల్లో 10 నాటౌట్; ఫోర్, సిక్స్) వచ్చీ రాగానే బ్యాట్ ఝులిపించడంతో భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, జన్సెన్, బాష్‌కు తలో వికెట్ దక్కింది. నాలుగో టీ20 లక్నో వేదికగా డిసెంబర్ 17న జరుగనుంది. -
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. తొలి భారత ప్లేయర్‌గా
ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో వంద వికెట్ల మైలు రాయిని పాండ్యా అందుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 1000 పరుగులతో పాటు వంద వికెట్లు సాధించిన తొలి భారత ప్లేయర్‌గా హార్దిక్ చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన ఐదో ప్లేయర్‌గా పాండ్యా నిలిచాడు. అతడు ఇప్పటివరకు టీ20ల్లో 1939 పరుగులతో పాటు వంద వికెట్లను సాధించాడు. పాండ్యా దారిదాపుల్లో ఏ భారత ప్లేయర్ లేరు.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ తలా రెండు వికెట్లతో సఫారీలను దెబ్బతీశారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్(46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.టీ20ల్లో 1000+ పరుగులు & 100+ వికెట్లు తీసిన ఆటగాళ్ళు:మహమ్మద్ నబీ (అఫ్గానిస్తాన్) - 2417 పరుగులు & 104 వికెట్లుషకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) - 2551 పరుగులు & 149 వికెట్లుసికందర్ రజా (జింబాబ్వే) - 2883 పరుగులు & 102 వికెట్లువిరణ్దీప్ సింగ్ (మలేషియా) - 3180 పరుగులు & 109 వికెట్లుహార్దిక్ పాండ్యా (భారత్) - 1939 పరుగులు & 100* వికెట్లు -
టీమిండియాకు ఊహించని షాక్.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్
సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల వల్ల జట్టును వీడాడు. దీంతో ధర్మశాల వేదికగా సఫారీలతో జరుగుతున్న కీలకమైన మూడో టీ20కు బుమ్రా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా వెల్లడించింది. "జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల చేత ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతడు మూడో టీ20కు అందుబాటులో లేడు. బుమ్రా తదుపరి మ్యాచ్‌లకు జట్టులో చేరే విషయంపై అప్డేట్ ఇస్తామని" బీసీసీఐ పేర్కొంది. ఇదే విషయాన్ని టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చెప్పుకొచ్చాడు. ఇక జస్ప్రీత్ స్ధానంలో యువ పేసర్ హర్షిత్ రాణా తుది జట్టులో వచ్చాడు. బుమ్రాతో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా ధర్మశాల టీ20కు దూరమయ్యాడు. దీంతో కుల్దీప్ యాదవ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది. అయితే బుమ్రా తిరిగి జట్టులో చేరుతాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఈ సిరీస్‌లో భాగంగా నాలుగో టీ20 డిసెంబర్ 17న లక్నో వేదికగా జరగనుంది. రెండు రోజుల సమయం లభించడంతో అతడు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముందని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు తడబడుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. హర్షిత్ రాణా రెండు , అర్ష్‌దీప్, హార్దిక్ పాండ్యా తలా వికెట్ సాధించారు.తుది జట్లుదక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్‌కీపర్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిచదవండి: Asia Cup 2025: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా.. -
మూడో టీ20లో టీమిండియా గెలుపు
ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 14) జరిగిన మూడో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలర్లు కలిసికట్టుగా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను టీమిండియా 117 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు ఛేదించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి మ్యాచ్‌లో భారత్, రెండో టీ20లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. మూడో వికెట్ డౌన్గెలుపు ఖరారయ్యాక టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (12) ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 109/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే 30 బంతుల్లో మరో 9 పరుగులు చేస్తే చాలు. తిలక్ వర్మ (24), దూబే క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా రెండో వికెట్ డౌన్..92 పరుగుల వద్ద సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన గిల్.. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత్ విజయానికి ఇంకా 26 పరుగులు కావాలి. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు.10 ఓవర్లకు భారత్ స్కోరెంతంటే?10 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్(28), తిలక్ వర్మ(17) ఉన్నారు. భారత్ తొలి వికెట్ డౌన్60 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 35 పరుగులతో దూకుడుగా ఆడిన అభిషేక్.. బాష్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత విజయానికి ఇంకా 58 పరుగులు కావాలి.👉5 ఓవర్లకు భారత్ స్కోర్: 60/0. క్రీజులో అభిషేక్ శర్మ(35), గిల్(20) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న అభిషేక్118 పరుగుల లక్ష్య చేధనలో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. 2 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ (9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 22), గిల్(5) ఉన్నారు.117 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ప్రోటీస్.. నిర్ణీత 20 ఓవర్లలో117 పరుగులకే ఆలౌటైంది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టి సఫారీల పతనాన్ని శాసించారు. సౌతాఫ్రికా కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్ (46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61) ఒక్కడే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మిగితా ప్రోటీస్ బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.వరుణ్ మ్యాజిక్.. ఆలౌట్ దిశగా ప్రోటీస్స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బంతితో మ్యాజిక్ చేస్తున్నాడు. వరుణ్ దెబ్బకు ప్రోటీస్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. ఆరో వికెట్‌గా ఫెరీరా, ఏడో వికెట్‌గా జాన్సెన్ క్లీన్ బౌల్డయ్యాడు. 15.1 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్: 77/7ఐదో వికెట్ డౌన్..33 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కార్బిన్ బాష్(4).. శివమ్ దూబే బౌలింగ్‌లో ఔటయ్యాడు.పది ఓవర్లకు ప్రోటీస్ స్కోరెంతంటే?10 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రమ్(28), బాష్(4) ఉన్నారు.సౌతాఫ్రికా నాలుగో వికెట్ డౌన్30 పరుగుల వద్ద సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన ట్రిస్టన్ స్టబ్స్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.మూడో వికెట్ డౌన్.. బ్రెవిస్ ఔట్బ్రెవిస్(2) రూపంలో సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో బ్రెవిస్ బౌల్డయ్యాడు. క్రీజులోకి ట్రిస్టన్ స్టబ్స్ వచ్చాడు.సౌతాఫ్రికాకు భారీ షాక్..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్ వేసిన అర్ష్‌దీప్ బౌలింగ్‌లో హెండ్రిక్స్ వికెట్ల ముందు దొరికిపోగా.. రెండో ఓవర్లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో క్వింటన్ డికాక్(1) ఎల్బీగా వెనుదిరిగాడు. 3 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 7 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్క్రమ్(4), బ్రెవిస్)2) ఉన్నారు.ధర్మశాల వేదికగా మూడో టీ20లో సౌతాఫ్రికా-భారత్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల చేత దూరమయ్యాడు.ఈ విషయాన్ని టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. అదేవిధంగా అక్షర్ పటేల్‌కు కూడా విశ్రాంతి ఇచ్చారు. వీరిద్దరూ స్ధానంలో హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ వచ్చారు. సంజూ శాంసన్‌కు మరోసారి మొండిచేయి చూపించారు. సౌతాఫ్రికా కూడా మూడు మార్పులు చేసింది. మిల్లర్, లిండే, సిప్లామ దూరం కాగా.. బాష్, నోర్జే, స్టబ్స్ జట్టులోకి వచ్చారు.తుది జట్లుదక్షిణాఫ్రికా : రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్భారత్ : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్‌కీపర్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి -
ఏదో మొక్కుబడిగా చేయను.. క్లారిటీ ఉంది: సౌతాఫ్రికా కోచ్
టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా టీ20 జట్టులో తరచూ ఇలా జరగడం విమర్శలకు తావిచ్చింది. ఇటీవల సౌతాఫ్రికా (IND vs SA)తో రెండో టీ20లోనూ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను వన్‌డౌన్‌లో పంపడం.. అందుకు తగ్గ మూల్యం చెల్లించడం జరిగాయి.ఏదో మొక్కుబడిగా చేయనుమరోవైపు.. ఈ మ్యాచ్‌లో తుదిజట్టులో మూడు మార్పులతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 51 పరుగుల తేడాతో గెలిచి.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి మూడో టీ20కి ధర్మశాల వేదిక. ఈ మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికా హెడ్‌కోచ్ షుక్రి కన్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము కూడా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తామని.. అయితే, అదేదో మొక్కుబడిగా చేసే పనికాదని పేర్కొన్నాడు.స్పష్టమైన అవగాహన ఉందిటీ20 ప్రపంచకప్-2026 ప్రణాళికలకు అనుగుణంగానే తాము ముందుకు సాగుతున్నట్లు కన్రాడ్ వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘ప్రతీ మ్యాచ్‌లోనూ మేము బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చబోము. తప్పక ఆర్డర్‌ను మార్చాలన్న నియమేమీ లేదు. ప్రపంచకప్ జట్టు ఎలా ఉండాలో మాకు స్పష్టమైన అవగాహన ఉంది.ఇందుకు అనుగుణంగానే ప్లేయర్లను మారుస్తూ ఉన్నాము. టెస్టు సిరీస్ నుంచి కొంతమంది ఆటగాళ్లు ఇక్కడే ఉన్నా.. వారికి అవకాశం రాలేదు. ఈ సిరీస్ తర్వాత SA20 లీగ్ కూడా ఉంది. కాబట్టి అక్కడ కూడా మా వాళ్ల ప్రదర్శనను చూస్తాము. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాము.ఇక్కడ ఏది వర్కౌట్ అయింది.. ఏది వర్కౌట్ కాలేదు అన్న విషయాలను విశ్లేషిస్తాం. ఏదేమైనా మా ప్రణాళికలు, వ్యూహాలకు అనుగుణంగా మాకేం కావాలో పూర్తి స్పష్టతతోనే ఉన్నాము’’ అని షుక్రి కన్రాడ్ చెప్పుకొచ్చాడు. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు సౌతాఫ్రికా క్రికెట్ జట్టు భారత పర్యటనకు వచ్చింది.1-1తో సమంఇందులో భాగంగా తొలుత టెస్టులు జరుగగా.. 2-0తో సఫారీలు టీమిండియాను వైట్‌వాష్ చేశారు. అనంతరం.. వన్డే సిరీస్‌లో భారత్.. సౌతాఫ్రికాను 2-1తో ఓడించి సిరీస్ గెలిచింది. ఇక కటక్ వేదికగా తొలి టీ20లో టీమిండియా 101 పరుగులతో జయభేరి మోగించగా.. ముల్లన్‌పూర్‌లో ప్రొటిస్ జట్టు 51 పరుగుల తేడాతో గెలిచింది.ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా మూడు మార్పులలతో బరిలోకి దిగింది. ట్రిస్టన్ స్టబ్స్, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జే స్థానాల్లో రీజా హెండ్రిక్స్, జార్జ్ లిండే, ఓట్నీల్ బార్ట్‌మన్‌లను బరిలోకి దించింది. బార్ట్‌మన్ నాలుగు వికెట్లు కూల్చి సత్తా చాటాడు.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టీ20లో ఆడిన తుదిజట్లుభారత్‌అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.సౌతాఫ్రికారీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, లూథో సిపమ్లా, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్‌మాన్.చదవండి: భారత్ X పాకిస్తాన్ -
'టాస్ వేయడం ఒక్కటే అతడి పనికాదు'
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌తో నానా తంటాలు పడుతున్నాడు. దాదాపు రెండేళ్లగా వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కొనసాగిన సూర్య.. 2025లో మాత్రం ఘోరంగా విఫలయ్యాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఈ ముంబై ఆటగాడు తీవ్ర నిరాశపరుస్తున్నాడు.తొలి టీ20లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసిన సూర్య.. రెండో టీ20లో ఐదు పరుగులే చూసి పెవిలియన్‌కు చేరాడు. టీ20 ప్రపంచకప్-2026కు ముందు అతడి పూర్ ఫామ్ టీమ్‌మెనెజ్‌మెంట్‌ను తెగ కలవరపడుతోంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా విమర్శలు గుప్పించాడు. కెప్టెన్ అంటే టాస్‌లు వేయడం, ఫీల్డ్‌ను సెట్ చేయడం కాదని పరుగులు కూడా చోప్రా అన్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 18 అంతర్జాతీయ టీ20లు ఆడిన స్కై.. 15.07 సగటుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు."సూర్య.. భారత జట్టుకు కెప్టెన్ అన్న విషయం మర్చిపోకూడదు. కెప్టెన్ పని కేవలం టాస్ వేయడం, బౌలర్లను రోటేట్ చేయడం, వ్యూహాలు రచించడమే కాదు. బ్యాట్‌తో కూడా రాణించాలి. టాప్ ఫోర్లో బ్యాటింగ్‌కు వస్తుందున ఖచ్చింగా పరుగులు చేయాలి. ఈ ఏడాది అతడు చాలా మ్యాచ్‌లు ఆడాడు.అయినా అతడి ఆట తీరు మారలేదు. ఇప్పటివరకు ఈ ఏడాదిలో 18 మ్యాచ్‌లు ఆడి కేవలం 15 సగటు మాత్రమే కలిగి ఉన్నాడు. స్ట్రైక్ రేట్ కూడా మరీ ఘోరంగా ఉంది. ఒక్క అర్థ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ఐపీఎల్‌కు ముందు, తర్వాత కూడా అతడి ఫామ్‌లో ఎటువంటి మార్పు కన్పించలేదు. మూడు లేదా నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి పరుగులు సాధించకపోతే జట్టుకు ఎల్లప్పుడూ అదే భారంగానే ఉంటుంది. ఇదే ఫామ్‌తో టీ20 ప్రపంచకప్‌లో ఎలా రాణిస్తారు. కాబట్టి కెప్టెన్‌తో పాటు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా తన ఫామ్‌ను అందుకోవాల్సిన అవసరముందని చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IND vs SA: గంభీర్ సంచలన నిర్ణయం..? గిల్‌కు ఊహించని షాక్! -
గంభీర్ సంచలన నిర్ణయం..? గిల్‌కు ఊహించని షాక్!
ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య మూడో టీ20 ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ముల్లాన్‌పూర్‌లో ఎదురైన ఘోర పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే ధర్మశాలకు చేరుకున్న భారత జట్టు శనివారం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గోనుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1 సమంగా ఉంది. సిరీస్ ఆధిక్యం పెంచుకునేందుకు మూడో టీ20ల్లో భారత్ తమ తుది జట్టులో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు టీ20ల్లో ఘోరంగా విఫలమైన వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై వేటు పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.సంజూకు చోటు!గిల్ స్దానంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తుది జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది గిల్ టీ20 జట్టులోకి తిరిగి వచ్చేంతవరకు భారత ఇన్నింగ్స్‌ను అభిషేక్ శర్మ, శాంసన్‌లు ఆరంభించేవారు. ఓపెనర్‌గా సంజూ మూడు సెంచరీలు కూడా బాదాడు.అయితే గిల్ రీ ఎంట్రీతో శాంసన్ ఏకంగా జట్టులోనే చోటు కోల్పోయాడు. ప్రధాన జట్టులో ఉన్నప్పటికి చాలా మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమవుతున్నాడు. దీంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర స్ధాయిలో విమర్శలు వస్తున్నాయి. గిల్ కోసం సంజూను బలి చేస్తారా? అని మాజీలు సైతం మండిపడుతున్నారు. ఈ క్రమంలో శాంసన్‌ను మళ్లీ తుది జట్టులోకి తీసుకు రావాలని గంభీర్ నిర్ణయించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ టీ20ల్లో గిల్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఈ ఏడాది గిల్ 14 ఇన్నింగ్స్‌లలో 23.90 సగటుతో కేవలం 263 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో అతడిని టీ20ల నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. మరి నిజంగానే గంభీర్.. మూడో టీ20 నుంచి గిల్‌ను తప్పిస్తాడా? అని తెలియాలంటే ఆదివారం వరకు వేచి ఉండాల్సిందే.మూడో టీ20 కోసం భారత తుది జట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రాచదవండి: GOAT Tour India 2025: 70 అడుగుల విగ్రహం.. మెస్సీ తొలి రియాక్షన్ ఇదే! -
గంభీర్, సూర్య చేసిన అతిపెద్ద తప్పు అదే!
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ను ఘనంగా ఆరంభించిన టీమిండియా.. అదే జోరును కొనసాగించలేకపోయింది. ముల్లన్పూర్ వేదికగా రెండో టీ20లో 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగం చేయగా.. అది కాస్తా బెడిసికొట్టింది.ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (0) గోల్డెన్ డకౌట్ కాగా.. వన్‌డౌన్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పంపించింది మేనేజ్మెంట్. సఫారీలు విధించిన 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అక్షర్ 21 బంతుల్లో 21 పరుగులు చేసి నిష్క్రమించాడు.మరోవైపు.. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (17)తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) దారుణంగా విఫలమయ్యాడు. మిగిలిన వారిలో హార్దిక్ పాండ్యా (20), జితేశ్ శర్మ (17 బంతుల్లో 27) ఫర్వాలేదనిపించగా.. తిలక్ వర్మ (34 బంతుల్లో 62) ఒంటరి పోరాటం చేశాడు. అయితే, సఫారీ బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 162 పరుగులకే టీమిండియా కుప్పకూలడంతో పరాజయం ఖరారైంది.ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పుల గురించి ప్రస్తావిస్తూ సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్.. టీమిండియా నాయకత్వ బృందాన్ని విమర్శించాడు. ‘‘అక్షర్ మీ జట్టులోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడై ఉండవచ్చు. కానీ ఇలాటి భారీ ఛేదన సమయంలో మీరు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు?నా అభిప్రాయం ప్రకారం ఈ మ్యాచ్‌లో మీరు చేసిన అతి పెద్ద తప్పు ఇదే. అక్షర్ బ్యాటింగ్ చేయగలడు. కానీ అతడిని ముందు తోసి చిక్కుల్లో పడేయడం సరికాదు. ఒకవేళ గిల్ కంటే ముందు అభిషేక్ శర్మ అవుటై ఉంటే.. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం అక్షర్‌ను పంపించారనుకోవచ్చు.కానీ ఇక్కడ అలా జరుగలేదు. అభిషేక్‌తో పాటు మరో లెఫ్టాండర్ అక్షర్‌ను పంపారు. ఏం చేస్తున్నారో అర్థమే కాలేదు. ప్రయోగాలు చేయడం మంచిదే. అయితే, ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదు’’ అని హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్‌ల తీరును స్టెయిన్ తప్పుబట్టాడు.కాగా సిరీస్ ఆరంభానికి ముందు సూర్య మాట్లాడుతూ.. తమ జట్టులో ఓపెనింగ్ జోడీ మాత్రమే ఫిక్స్‌డ్‌గా ఉంటుందని పేర్కొన్నాడు. మిగతా వారంతా ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని.. తమ వ్యూహాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.అయితే, టీ20 ఓపెనర్‌గా గిల్‌ను పంపడం కోసం.. ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌పై వేటు వేశారు. కానీ టీ20 జట్టులో పునరాగమనం చేసిన నాటి నుంచి గిల్ పేలవ ప్రదర్శన కనబరుస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే.. కటక్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి టీ20లో టీమిండియా 101 పరుగులతో భారీ విజయం సాధించింది. తాజా మ్యాచ్‌లో సఫారీలు గెలిచి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేశారు. -
‘సూర్య’ గ్రహణం వీడేది ఎప్పుడు?
టీ20 వరల్డ్‌కప్-2026కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 55 రోజుల్లో భారత్, శ్రీలంక వేదిలకగా ఈ మెగా టోర్నమెంట్ షూరూ కానుంది. ఈ పొట్టి ప్రపంచకప్‌లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. అయితే ఈ మెగా టోర్నీకి ముందు ఇద్దరు ప్లేయర్ల పేలవ ఫామ్ భారత జట్టు మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. అందులో ఒకరు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాగా.. మరొకరు అతడి డిప్యూటీ శుభ్‌మన్ గిల్.టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వీరిద్దరూ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నారు.సూర్యకు ఏమైంది..?ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బ్యాటర్‌గా పేరున్న సూర్యకుమార్.. 2025లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. ఐపీఎల్-2025లో రాణించినప్పటికి అంతర్జాతీయ క్రికెట్లో పూర్తిగా తేలిపోయాడు. కెప్టెన్‌గా జట్టును విజయపథంలో నడిపిస్తున్నప్పటికి వ్యక్తిగత ప్రదర్శనల పరంగా మాత్రం తీవ్ర నిరాశపరుస్తున్నాడు.ఈ ఏడాది ఇప్పటివరకు 18 అంతర్జాతీయ టీ20లు ఆడిన స్కై.. 15.07 సగటుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సంవత్సరం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అతడి టాప్ స్కోర్ 38 పరుగులగా ఉంది. కీలకమైన మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తున్న సూర్య తన చెత్త ప్రదర్శనలతో జట్టుకు భారంగా మారుతున్నాడు. తనపై తనకే నమ్మకం లేక ఒక మ్యాచ్‌లో మూడో స్ధానంలో.. మరో మ్యాచ్‌లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఒకప్పుడు సూర్య క్రీజులో ఉంటే బౌలింగ్ చేయాలంటే ప్రత్యర్ధి బౌలర్లు భయపడేవారు. కానీ ఇప్పుడు అతడి వీక్నెస్ను పసిగట్టిన బౌలర్లు.. అతడిని చాలా ఈజీగా ట్రాప్ చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్ ఇంకా 8 మ్యాచ్‌లు ఆడనుంది. సౌతాఫ్రికాతో మూడు, న్యూజిలాండ్‌తో ఐదు టీ20లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లలో సూర్య తిరిగి తన ఫామ్‌ను అందుకోవాల్సి ఉంది. లేదంటే భారత్‌కు బ్యాటింగ్ కష్టాలు తప్పవు. ఈ సిరీస్‌లో తొలి టీ20లో కేవలం 12 పరుగులు చేసిన సూర్యకుమార్.. రెండో టీ20లో 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. మూడో మ్యాచ్‌లోనైనా ఈ ముంబై ఆటగాడు తన బ్యాట్‌కు పనిచెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు.గిల్ ఢమాల్..ఇక మొన్నటివరకు టీ20 ప్రపంచకప్ ప్రణాళికలలో అస్సలు శుభ్‌మన్ గిల్ లేడు. టీ20ల్లో భారత జట్టు ఓపెనర్లగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఉండేవారు. కానీ ఆసియాకప్ 2025కు ముందు గిల్‌ను టీ20ల్లో అనూహ్యంగా తీసుకొచ్చారు. అంతేకాకుండా అప్పటివరకు వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్ పటేల్‌ను తప్పించి ఆ బాధ్యతలను గిల్‌కు బీసీసీఐ అప్పగించింది.అయితే ఆల్‌ఫార్మాట్‌గా గిల్‌కు పేరు ఉన్నప్పటికి.. తన టీ20 రీ ఎంట్రీలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఆసియాకప్, ఆస్ట్రేలియా సిరీస్‌తో పాటు ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20ల్లోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి టీ20లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన గిల్.. రెండో టీ20ల కనీసం తన పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌ను తప్పించి మరి అతడికి ఓపెనర్‌గా అవకాశమిచ్చారు. కానీ అతడు మాత్రం చెత్త ప్రదర్శనతో నిరాపరుస్తున్నాడు. ఈ ఏడాది గిల్ 14 ఇన్నింగ్స్‌లలో 23.90 సగటుతో కేవలం 263 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రాబోయో మ్యాచ్‌లలోనైనా కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దరూ తమ ఫామ్‌ను అందుకుంటారో లేదో చూడాలి.చదవండి: IND Vs SA: అర్ష్‌దీప్ 13 బంతుల ఓవర్.. గంభీర్ రియాక్షన్ వైరల్ -
అర్ష్‌దీప్ 13 బంతుల ఓవర్.. గంభీర్ రియాక్షన్ వైరల్
ముల్లాన్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో 51 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు అయింది. ముఖ్యంగా బౌలింగ్‌లో అయితే మెన్ ఇన్ బ్లూ పూర్తిగా తేలిపోయింది. ఒక్క వరుణ్ చక్రవర్తి తప్ప మిగితా బౌలర్లు అందరూ అట్టర్‌ప్లాప్ అయ్యారు. స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అయితే దారుణ ప్రదర్శన కనబరిచాడు. పదేపదే షార్ట్ పిచ్ బంతులను సంధిస్తూ సఫారీ బ్యాటర్లకు టార్గెట్‌గా మారాడు. అస్సలు ఏ మాత్రం రిథమ్‌లో కన్పించలేదు.ఒక ఓవర్లో 13 బంతులుప్రోటీస్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ తన చెత్త బౌలింగ్‌తో అందరికి చిరాకు తెప్పించాడు. 6, వైడ్, వైడ్, 0, వైడ్, వైడ్, వైడ్, వైడ్, 1, 2, 1, వైడ్, 1.. ఆ ఓవర్లో అర్ష్‌దీప్ వేసిన బంతుల వరుస ఇది. ఈ పంజాబీ పేసర్ తన ఓవర్‌ను పూర్తిచేసేందుకు ఏకంగా 13 బంతులు వేయాల్సి వచ్చింది. తొలి బంతిని డికాక్ లాంగాఫ్ మీదుగా భారీ సిక్సర్ బాదగా... మిగతా 5 లీగల్ బంతులను కూడా చక్కగా వేసిన అతను 5 పరుగులే ఇచ్చాడు. అయితే మంచు కారణంగా బంతిపై పట్టుతప్పి అతను వేసిన వైడ్లు భారత శిబిరంలో అసహనాన్ని పెంచాయి. డగౌట్లో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం అర్ష్‌దీప్‌పై సీరియస్ అయ్యాడు. ఇదేమి బౌలింగ్ అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.చెత్త రికార్డు..అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఒకే ఓవర్లో అత్యధిక బంతులు వేసిన ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్-ఉల్-హక్ రికార్డును అర్ష్‌దీప్ సమం చేశాడు. నవీన్ గత ఏడాది హరారేలో జింబాబ్వేపై ఈ చెత్త రికార్డును నమోదు చేశాడు. అయితే భారత్ తరపున ఈ చెత్త ఫీట్ సాధించిన తొలి బౌలర్ మాత్రం అర్ష్‌దీపే కావడం గమనార్హం.Gautam Gambhir angry at Arshdeep as he bowled 7 wide bowls in an over 💀 pic.twitter.com/EqUa7nFqW5— ••TAUKIR•• (@iitaukir) December 11, 2025చదవండి: నాతో పాటు అతడి వల్లే ఈ ఓటమి: సూర్యకుమార్ -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికా జట్టు అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. బుధవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో 51 పరుగుల తేడాతో భారత్‌ను దక్షిణాఫ్రికా చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో సఫారీలు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు.తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్((46 బంతుల్లో 7 సిక్స్‌లు, 5 ఫోర్లతో 90) విధ్వంసం సృష్టించగా.. డొనవాన్ ఫెరీరా(16 బంతుల్లో 30), మిల్లర్(12 బంతుల్లో 20) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో సౌతాఫ్రికా బౌలర్ల దాటికి భారత్ 19.1 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. సఫారీ పేసర్ బార్ట్‌మన్ 4 వికెట్లతో టీమిండియాను దెబ్బతీయగా.. ఎంగిడీ, సిప్లమా, జాన్సెన్ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సౌతాఫ్రికా సమం చేసింది.ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్..ఇక ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన సౌతాఫ్రికా ఓ అరుదైన ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత్‌పై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. టీ20ల్లో టీమిండియాపై సఫారీలకు ఇది పదమూడో విజయం.ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల పేరిట సంయుక్తంగా ఉండేది. ఈ రెండు జట్లు భారత్‌పై ఇప్పటివరకు 12 సార్లు టీ20 విజయాలు నమోదు చేశాయి. తాజా గెలుపుతో ఈ రెండు జట్లను సౌతాఫ్రికా అధిగమించింది.భారత్‌పై అత్యధిక టీ20 విజయాలు సాధించిన జట్లుదక్షిణాఫ్రికా-13ఆస్ట్రేలియా-12ఇంగ్లాండ్-12న్యూజిలాండ్-10వెస్టిండీస్10చదవండి: నేను.. అతడే ఈ ఓటమికి కారణం! ప్రతీసారి కూడా: సూర్యకుమార్ -
నాతో పాటు అతడి వల్లే ఈ ఓటమి: సూర్యకుమార్
ముల్లాన్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 51 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ భారత్ పూర్తిగా తేలిపోయింది. 214 పరుగుల లక్ష్య చేధనలో 19.1 ఓవర్లలో 162 రన్స్‌కే టీమిండియా కుప్పకూలింది.భారత బ్యాటర్లలో తిలక్ వర్మ(34 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(5), శుభ్‌మన్ గిల్(0), అభిషేక్ శర్మ(17) వంటి కీలక ఆటగాళ్లు విఫలమయ్యారు. సఫారీ పేసర్ బార్ట్‌మాన్ 4 వికెట్లు పడగొట్టగా.. ఎంగిడి, జాన్సెన్, సిప్లమా తలా రెండు వికెట్లు సాధించారు.అంతకుముందు క్వింటన్ డికాక్(90) చెలరేగడంతో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో ప్రోటీస్ సమం చేసింది. ఇక ఈ ఓటమిపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంలో విఫలమయ్యామని అతడు చెప్పుకొచ్చాడు.అభిషేక్ ఒక్కడే కాదు.."ఈ మ్యాచ్‌లో టాస్ గెలవడం మినహా ఏదీ మాకు అనుకూలించలేదు. టాస్ గెలిచిన తర్వాత తొలుత బ్యాటింగ్ తీసుకుని ఉండాల్సింది. రెండో ఇన్నింగ్స్ సమయానికి మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందనే తొలుత బౌలింగ్ తీసుకున్నాము. కానీ ఆరంభంలోనే ఈ వికెట్‌పై ఏ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలో సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం. ఆ తర్వాత ఏ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలో మా బౌలర్లు గ్రహించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇది నేర్చుకునే ప్రక్రియ. మేము ఈ ఓటమి నుంచి మేము పాఠాలు నేర్చుకుంటాము. తప్పిదాలను సరిదిద్దుకొని ముందుకు సాగుతాం. మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. మా మొదటి ప్లాన్ విఫలమైనప్పుడు.. వెంటనే మా సెకెండ్ ప్లాన్‌ను అమలు చేయలేకపోయాము. కానీ సౌతాఫ్రికా బౌలర్లు మాత్రం రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ ఉన్నప్పటికి ఎలా బౌలింగ్ చేయాలో మాకు చూపించారు. మా తదుపరి మ్యాచ్‌లో వారిని మేము అనుసరిస్తాము.బ్యాటింగ్‌లో నేను, శుభ్‌మన్ ఇంకొంచెం బాధ్యత తీసుకోవాల్సింది. అభిషేక్ అద్భుతంగా ఆడుతున్నాడు, కానీ ప్రతిసారీ అతనిపైనే ఆధారపడలేము. శుభ్‌మన్ తొలి బంతికే అవుటయ్యాడు. ఆ సమయంలో నేను ఎక్కువ క్రీజులో ఉండి, ఛేజింగ్ బాధ్యతను నా భుజాలపై వేసుకోవాల్సింది. ఇక అన్ని ఫార్మాట్లలోనూ అక్షర్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అందుకే ఈ మ్యాచ్‌లో అతడిని ప్రమోట్ చేశాము. దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌లో మా ప్లాన్ విజయవంతం కాలేదు. ఈ ఓటమిని మేము జీర్ణించుకోలేకపోతున్నాము. అయినప్పటికి మా తదుపరి మ్యాచ్‌లో గట్టిగా కమ్‌బ్యాక్ ఇస్తాం. ధర్మశాలలో కలుద్దాం" అని సూర్య పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: యువ భారత్‌కు ఎదురుందా! -
డికాక్ విధ్వంసం.. రెండో టీ20లో టీమిండియా చిత్తు
ముల్లాన్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. తొలి టీ20లో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే.రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (46 బంతుల్లో 90; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో డొనోవన్ ఫెరియెరా (16 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (12 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రీజా హెండ్రిక్స్ 8, కెప్టెన్ మార్క్రమ్ 29, బ్రెవిస్ 14 పరుగులకు ఔటయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్ ఓ వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఆది నుంచి తడబడింది. సఫారీ బౌలర్లు తలో చేయి వేయడంతో 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓట్నీల్ బార్ట్‌మన్ 4, ఎంగిడి, జన్సెన్, సిపాంమ్లా తలో 2 వికెట్లు తీసి టీమిండియాను కుప్పకూల్చారు. భారత ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ (62) ఒంటరిపోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లలో జితేశ్ శర్మ 27, అక్షర్ పటేల్ 21, హార్దిక్ 20, అభిషేక్ శర్మ 17, సూర్యకుమార్ 5, అర్షదీప్ 4, దూబే ఒక పరుగు చేశారు. శుభ్‌మన్ గిల్, వరుణ్ చక్రవర్తి డకౌటయ్యారు.ఛేదనలో ఆదిలోనే చేతులెత్తేసిన టీమిండియా 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటై పరాజయంపాలైంది. సౌతాఫ్రికా తరఫున బ్యాటింగ్‌లో డికాక్ (90), బౌలింగ్‌లో ఓట్నీల్ బార్ట్‌మన్ (4-0-24-4) చెలరేగారు. భారత ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ (62) ఒంటరిపోరాటం చేశాడు. ఈ సిరీస్‌లోని మూడో టీ20 ధర్మశాల వేదికగా డిసెంబర్ 14న జరుగనుంది.చదవండి: చరిత్ర సృష్టించిన క్వింటన్ డికాక్.. తొందరపాటు చర్యతో.. -
ఈసారి గోల్డెన్ డకౌట్.. అతడిని ఎందుకు బలి చేస్తున్నారు?
భారత టీ20 జట్టు ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్ మరోసారి విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో రెండో టీ20లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో గిల్‌తో పాటు టీమిండియా యాజమాన్యంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సంజూకు ఓపెనర్‌గా మొండిచేయిఆసియా కప్-2025 టీ20 టోర్నీతో భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చాడు గిల్ (Shubman Gill). దీంతో అభిషేక్ శర్మ (Abhishek Sharma)కు విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్న సంజూ శాంసన్ (Sanju Samson)ను మేనేజ్మెంట్ పక్కనపెట్టింది. వరుస మ్యాచ్‌లలో గిల్ విఫలమవుతున్నా.. భవిష్య కెప్టెన్ అనే ఒక్క కారణంతో అతడిని కొనసాగిస్తోంది.ఈసారి గోల్డెన్ డక్తాజాగా స్వదేశంలో టీ20 సిరీస్‌లోనూ సంజూకు ఓపెనర్‌గా మొండిచేయి చూపి.. యథావిధిగా గిల్‌కు పెద్దపీట వేసింది. అయితే, కటక్ వేదికగా తొలి టీ20లో రెండు బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులకే నిష్క్రమించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లో ముల్లన్‌పూర్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు.వరుసగా వైఫల్యాలుసఫారీలు విధించిన 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్లోనే గిల్ మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. లుంగి ఎంగిడి బౌలింగ్‌లో ఐదో బంతికి రీజా హెండ్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక టీమిండియా తరఫున గత ఇరవై ఇన్నింగ్స్‌లో గిల్ సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).ఈ స్థాయిలో గిల్ విఫలమవుతున్నా.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్, మేనేజ్మెంట్ మాత్రం అతడికి వరుస అవకాశాలు ఇవ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఓపెనర్‌గా గిల్‌ను ఆడించేందుకు సంజూను బలిచేయడాన్ని మాజీ క్రికెటర్లు సైతం ప్రశ్నిస్తున్నారు. సంజూను ఎందుకు బలి చేస్తున్నారు?టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌గా, బ్యాటర్‌గా మెరుగ్గా ఆడుతున్న గిల్‌ను రెండు ఫార్మాట్లకే పరిమితం చేయాలని.. టీ20లలో సంజూకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. టీ20 ప్రపంచకప్-2026 నాటికి తప్పు సరిదిద్దుకోకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. గిల్ కోసం సంజూను ఎందుకు బలి చేస్తున్నారని అతడి అభిమానులు మండిపడుతున్నారు.ఇదిలా ఉంటే.. ముల్లన్పూర్ మ్యాచ్‌లో టీమిండియా పవర్ ప్లేలో ఏకంగా మూడు వికెట్లు కోల్పోయి 51 పరుగులే చేసింది. గిల్‌తో పాటు.. అభిషేక్ శర్మ (17), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) విఫలమయ్యారు. అన్నట్లు ఈ మ్యాచ్‌లో టీమిండియా మరో ప్రయోగం చేసింది. వన్‌డౌన్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పంపింది.చదవండి: విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం! -
డికాక్ విధ్వంసం.. సౌతాఫ్రికా భారీ స్కోరు
టీమిండియాతో రెండో టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో.. నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏకంగా 213 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు సౌతాఫ్రికా బ్యాటింగ్‌కు దిగగా.. ఆదిలోనే రీజా హెండ్రిక్స్ (8) అవుటయ్యాడు. వరుణ్ చక్రవర్తి తన తొలి ఓవర్ తొలి బంతికే అతడిని బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ బాధ్యతాయుతంగా ఆడాడు. కేవలం 26 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.అయితే, 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ కావడంతో డికాక్ సెంచరీ మిస్సయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో లేని పరుగుకు యత్నించి మూల్యం చెల్లించాడు. వికెట్ కీపర్ జితేశ్ శర్మ వేగంగా స్పందించి డికాక్‌ను రనౌట్ చేశాడు. ఈ క్రమంలో మొత్తంగా 46 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 90 పరుగులు సాధించాడు.ఇక డికాక్‌కు తోడుగా కెప్టెన్, వన్‌డౌన్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ (26 బంతుల్లో 29) ఓ మోస్తరుగా రాణించాడు. రెండో వికెట్‌కు డికాక్‌తో కలిసి 83 పరుగులు జోడించాడు. చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ (14)విఫలం కాగా.. ఆఖర్లో డొనోవాన్ ఫెరీరా (16 బంతుల్లో 30), డేవిడ్ మిల్లర్ (12 బంతుల్లో 20) ధనాధన్ దంచికొట్టి అజేయంగా నిలిచారు.ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో సౌతాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది. భారత్‌కు 214 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇదిలా ఉంటే.. భారత బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నారు. డికాక్‌ను వికెట్ కీపర్ జితేశ్ శర్మ రనౌట్ చేశాడు. ఎక్స్‌ట్రాల రూపంలో సౌతాఫ్రికాకు భారత్ 22 పరుగులు సమర్పించుకుంది.ఇక భారత పేసర్లలో అర్ష్‌దీప్ సింగ్ అత్యధికంగా నాలుగు ఓవర్ల కోటాలో 54 పరుగులు ఇచ్చుకోగా.. పేస్‌దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా 45 పరుగులు సమర్పించుకున్నాడు. హార్దిక్ పాండ్యా మూడు ఓవర్లలో 34, శివం దూబే రెండు ఓవర్లలో 18 పరుగులు ఇవ్వగా.. వరుణ్ పూర్తి కోటాలో 29 రన్స్ మాత్రమే ఇచ్చి రెండు.. అక్షర్ మూడు ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టారు. -
చరిత్ర సృష్టించిన క్వింటన్ డికాక్.. కానీ
సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో భారత జట్టుపై అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే.. అత్యధికసార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. టీమిండియాతో తాజా టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ సందర్భంగా డికాక్ ఈ ఫీట్ నమోదు చేశాడు.ముల్లన్పూర్ వేదికగారెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు సౌతాఫ్రికా క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టెస్టుల్లో సఫారీలు 2-0తో వైట్‌వాష్ చేయగా.. వన్డేల్లో టీమిండియా 2-1తో గెలిచింది. అనంతరం కటక్‌లో జరిగిన తొలి టీ20లో భారత్ గెలవగా.. తాజాగా గురువారం నాటి రెండో టీ20కి ముల్లన్పూర్ ఆతిథ్యమిస్తోంది.పురుషుల అంతర్జాతీయ క్రికెట్లో ఈ స్టేడియంలో ఇదే తొలి మ్యాచ్ కాగా.. టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే, ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (8) వేగంగా ఆడే ప్రయత్నంలో వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.క్వింటన్ డికాక్ జోరుఫలితంగా సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోగా.. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ మాత్రం జోరు కొనసాగించాడు. సఫారీ ఇన్నింగ్స్‌లో తొమ్మిదో ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో మూడో బంతికి ఫోర్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 26 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆ తర్వాత కూడా తగ్గేదేలే అన్నట్లు ముందుకుసాగాడు.12 ఇన్నింగ్స్లోనేఈ క్రమంలో అంతర్జాతీయ టీ20లలో టీమిండియాపై అత్యధికసార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. డికాక్ కంటే ముందు వెస్టిండీస్ స్టార్ నికోలస్ పూరన్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ ఈ ఘనత సాధించారు. అయితే, ఇందుకు పూరన్‌కు 20 ఇన్నింగ్స్.. బట్లర్‌కు 24 ఇన్నింగ్స్ అవసరం కాగా.. డికాక్ 12 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ అందుకున్నాడు. తొందరపాటు చర్యతోకానీ 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అనవసరపు పరుగుకు యత్నించి డికాక్ రనౌట్ అయ్యాడు. పదహారో ఓవర్ తొలి బంతికి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో షాట్ బాదేందుకు ప్రయత్నించి అతడు విఫలం కాగా.. బంతిని అందుకున్న కీపర్ జితేశ్ శర్మ స్టంప్స్‌కు గిరాటేశాడు. దీంతో డికాక్ రనౌట్ అయ్యాడు. కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్ రీఎంట్రీలో డికాక్ చేసిన స్కోర్లు వరుసగా.. 1, 23, 7, 0, 0, 90 (46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు). వరుస వైఫల్యాల తర్వాత ఫామ్‌లోకి వచ్చిన డికాక్.. ఇలా తొందరపాటు చర్యతో భారీ మూల్యమే చెల్లించాడు. సెంచరీకి పది పరుగుల దూరంలో నిలిచిపోయాడు.చదవండి: ICC: అనూహ్యం.. రేసులోకి ప్రసార్ భారతి! -
దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా ఓటమి
దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా ఓటమిముల్లాన్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేయగా.. ఛేదనలో ఆదిలోనే చేతులెత్తేసిన టీమిండియా 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటై పరాజయంపాలైంది. సౌతాఫ్రికా తరఫున బ్యాటింగ్‌లో డికాక్ (90), బౌలింగ్‌లో ఓట్నీల్ బార్ట్‌మన్ (4-0-24-4) చెలరేగారు. భారత ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ (62) ఒంటరిపోరాటం చేశాడు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. ఓటమి అంచుల్లో టీమిండియా19వ ఓవర్లో టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. తొలుత శివమ్ దూబే (1), ఆతర్వాత అర్షదీప్ సింగ్‌ను (4), వరుణ్ చక్రవర్తి (0) ఔటయ్యారు. 214 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 162 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో ఉంది. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా14.2వ ఓవర్- 118 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. సిపాంమ్లా బౌలింగ్‌లో బ్రెవిస్‌కు క్యాచ్ ఇచ్చి హార్దిక్ పాండ్యా (20) ఔటయ్యాడు. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 👉పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 81-4తిలక్ వర్మ 18 బంతులలో 32, హార్దిక్ పాండ్యా 4 పరుగులు.. విజయానికి 60 బంతుల్లో 133 పరుగులు అవసరం👉7.3: బార్ట్‌మాన్ బౌలింగ్‌లో హెండ్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగిన అక్షర్ పటేల్ (21). స్కోరు: 67-4 (7.4)👉పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 51-3 (6)👉 3.5: మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో మూడో వికెట్‌గా వెనుదిరిగిన సూర్య (5). స్కోరు: 32-3 (4).👉1.6: మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగిన అభిషేక్ శర్మ (8 బంతుల్లో 17). స్కోరు: 19-2 (2).👉మరో ప్రయోగం.. వన్‌డౌన్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్👉0.5: మరోసారి శుబ్‌మన్ గిల్ విఫలం.. ఎంగిడి బౌలింగ్‌లో హెండ్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్. గత మ్యాచ్‌లో నాలుగు పరుగులు చేసిన గిల్... భారత్ స్కోరు: 9-1 (1)సౌతాఫ్రికా భారీ స్కోరు.. టీమిండియా లక్ష్యం ఎంతంటే?👉డికాక్ మెరుపులు (46 బంతుల్లో 90- 5 ఫోర్లు, 7 సిక్సర్లు).. రాణించిన డొనోవాన్ (16 బంతుల్లో 30 నాటౌట్), మిల్లర్ (12 బంతుల్లో 20 నాటౌట్)👉భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తికి రెండు, అక్షర్ పటేల్‌కు ఒక వికెట్👉సౌతాఫ్రికా స్కోరు: 213-4.. టీమిండియా లక్ష్యం 214 టాస్ గెలిచిన టీమిండియా.. తొలుత సౌతాఫ్రికా బ్యాటింగ్👉ఓపెనర్ క్వింటన్ డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్.. సౌతాఫ్రికా భారీస్కోరు: 213-4👉16.1: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరిన డెవాల్డ్ బ్రెవిస్ (14)👉15.1: వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డికాక్ రనౌట్. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా👉15 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 156-2 👉11.6: వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగిన మార్క్రమ్ (29) 👉10.3: వంద పరుగుల మార్కు అందుకున్న సౌతాఫ్రికా👉పది ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 90-1 👉8.3: హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫోర్ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్న క్వింటన్ డికాక్.👉పవర్ ప్లేలో సౌతాఫ్రికా స్కోరు: 53-1👉4.1: వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో సఫారీ ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (8) అవుట్👉ముల్లన్పూర్ స్టేడియంలో టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్టాండ్ ఆవిష్కరణఎలాంటి మార్పులూ లేవుటాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) మాట్లాడుతూ.. ‘‘ఈ మైదానం అద్భుతమైనది. ఇక్కడ మేము ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడాము. పురుషుల క్రికెట్లో ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న తొలి మ్యాచ్ ఇదేనని తెలిసి సంతోషంగా ఉంది.ప్రేక్షకులు కూడా ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఇక్కడ మేము తొలుత బౌలింగ్ చేస్తాం. వికెట్ బాగుంది. తొలి టీ20లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం. మా తుదిజట్టులో ఎలాంటి మార్పులూ లేవు’’ అని తెలిపాడు.సంజూకు మరోసారి మొండిచేయికాగా సౌతాఫ్రికాతో తొలి టీ20లో ఓపెనర్‌గా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (4) విఫలమైనా యాజమాన్యం అతడికి మరో అవకాశం ఇచ్చింది. గిల్ రాకతో ఓపెనింగ్ స్థానం కోల్పోయిన సంజూ శాంసన్ (Sanju Samson).. వికెట్ కీపర్‌గానూ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రాలేకపోయాడు. అతడి స్థానంలో తొలి టీ20లో ఆడిన జితేశ్ శర్మ (Jitesh Sharma)నే మేనేజ్మెంట్ కొనసాగింది. దీంతో సంజూకు మరోసారి మొండిచేయి ఎదురైంది.మూడు మార్పులతో బరిలోకిమరోవైపు.. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తుదిజట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నట్లు కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ తెలిపాడు. ట్రిస్టన్ స్టబ్స్, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జే స్థానాల్లో రీజా హెండ్రిక్స్, జార్జ్ లిండే, బార్ట్‌మన్‌లను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు. మరోసారి తేమ ప్రభావం చూపనుందని.. ఒకవేళ తాము టాస్ గెలిచినా తొలుత బౌలింగే చేసేవాళ్లమని పేర్కొన్నాడు. ఆల్ ఫార్మాట్ సిరీస్లుకాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు సౌతాఫ్రికా భారత పర్యటనకు వచ్చింది. ఈ ఆల్ ఫార్మాట్ సిరీస్‌లలో భాగంగా తొలుత టెస్టు సిరీస్‌లో సఫారీలు దుమ్ములేపారు. అనూహ్య రీతిలో పాతికేళ్ల తర్వాత టీమిండియాను సొంతగడ్డపై 2-0తో వైట్‌వాష్ చేశారు. అయితే, వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచి భారత్ ఇందుకు ధీటుగా బదులిచ్చింది. ఇక కటక్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి టీ20 గెలుపొందిన టీమిండియా.. 1-0తో ఆధిక్యంలో నిలిచింది.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టీ20 తుదిజట్లుభారత్‌అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.సౌతాఫ్రికారీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, లూథో సిపమ్లా, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్‌మాన్.చదవండి: వరల్డ్‌కప్ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. భారత సంతతి ఆటగాళ్లకు చోటు -
దక్షిణాఫ్రికాతో రెండో టీ20.. శాంసన్‌కు మరోసారి నో ఛాన్స్!
ముల్లాన్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో రెండో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈమ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్ ఆధిక్యాన్ని పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే కటక్‌లో ఆడిన జట్టునే రెండో టీ20కు కూడా భారత్ కొనసాగించే అవకాశముంది.స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. తొలి టీ20లో ఆడిన జితీశ్ శర్మను వికెట్ కీపర్‌గా కొనసాగించాలని టీమ్ మెనెజ్‌మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. కటక్ టీ20లో ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చిన జితీశ్.. కేవలం 5 బంతుల్లో పది పరుగులు చేశాడు. అతడిని ఫినిషర్‌గా ఉపయోగించుకోవాలని హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒకవేళ టాపర్డర్‌లో ఎవరికైనా విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే తప్ప సంజూకు తుది జట్టులో చోటు దక్కడం కష్టం. ఇక తొలి టీ20లో విఫలమైన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. ఈ మ్యాచ్‌లో రాణించాల్సిన అవసరముంది. సూర్య గత కొంతకాలంగా మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. టీ20 వరల్డ్‌కప్-2026కు ముందు అతడి ఫామ్ టీమ్ మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. కనీసం ఈ సిరీస్‌లో నైనా సూర్య తన రిథమ్‌ను తిరిగి అందుకోవాలని ఆశిస్తున్నారు. ఇక తొలి టీ20లో ఘోర ఓటమి చవిచూసిన పలు మార్పులు చేసే అవకాశముంది.తుది జట్లు(అంచనా)భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, ఎన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి, కేశవ్ మహారాజ్/జార్జ్ లిండే, లుథో సిపమ్లా. -
సెంచరీ పూర్తి చేసుకున్న హార్దిక్ పాండ్యా
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా, ఓవరాల్‌గా 33వ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు.హార్దిక్‌కు ముందు రోహిత్ శర్మ (205), సూర్యకుమార్ యాదవ్ (155), విరాట్ కోహ్లి (124) భారత్ తరఫున సిక్సర్ల సెంచరీ పూర్తి చేశారు. వీరిలో రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చలామణి అవుతున్నాడు. రోహిత్ మినహా అంతర్జాతీయ టీ20ల చరిత్రలో ఒక్కరు కూడా సిక్సర్ల డబుల్ సెంచరీ చేయలేదు.హార్దిక్ విషయానికొస్తే.. నిన్న (డిసెంబర్) కటక్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన హార్దిక్, కేవలం 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ గౌరవప్రదమైన స్కోర్ (175/6) చేయగలిగింది.అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా ఒత్తిడికిలోనై చిత్తైంది. టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌటైంది. తద్వారా భారత్ 101 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీయగా.. హార్దిక్, దూబే చెరో వికెట్ సాధించి సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించిన హార్దిక్ పాండ్యాకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 డిసెంబర్ 11న ముల్లాన్‌పూర్‌లో జరుగనుంది. -
చరిత్ర సృష్టించిన బుమ్రా.. అంపైర్ తప్పు చేశాడా?
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20 సందర్భంగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో వంద వికెట్ల క్లబ్లో చేరాడు. తద్వారా భారత్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ వంద వికెట్లు పూర్తి చేసుకున్న తొలి బౌలర్‌గా రికార్డు సాధించాడు.175 పరుగులుకటక్ వేదికగా సౌతాఫ్రికా (IND vs SA T20Is)తో మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. టాపార్డర్ కుప్పకూలినా హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 59 నాటౌట్)కు తోడు తిలక్ వర్మ (26), అక్షర్ పటేల్ (23) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు స్కోరు చేయగలిగింది.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 74 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 101 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. రాణించిన బౌలర్లుభారత బౌలర్లలో పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh), జస్ప్రీత్ బుమ్రా చెరో రెండు.. పేస్‌బౌలింగ్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే తలా ఒక వికెట్ పడగొట్టారు. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి.. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.ఈ మ్యాచ్‌లో సఫారీ స్టార్, టాప్ రన్ స్కోరర్ డెవాల్డ్ బ్రెవిస్ (22)ను అవుట్ చేయడం ద్వారా.. బుమ్రా వంద వికెట్ల క్లబ్లో చేరాడు. అదే విధంగా.. కేశవ్ మహరాజ్ (0)ను కూడా పెవిలియన్‌కు పంపాడు.Boom boom, Bumrah! 🤩😎Wicket number 100 in T20Is for #JaspritBumrah! Simply inevitable 👏🇮🇳#INDvSA, 1st T20I, LIVE NOW 👉 https://t.co/tqu4j7Svcm pic.twitter.com/MuSZfrfh3L— Star Sports (@StarSportsIndia) December 9, 2025అంపైర్ తప్పు చేశాడా?సఫారీ జట్టు ఇన్నింగ్స్‌లో బుమ్రా పదకొండో ఓవర్లో బరిలోకి దిగగా.. రెండో బంతిని బ్రెవిస్ ఎదుర్కొన్నాడు. ఫుల్ స్వింగ్‌తో బంతిని వేసే క్రమంలో బుమ్రా క్రీజు లైన్ దాటేసినట్లుగా కనిపించింది. దీంతో ఫ్రంట్-ఫుట్ నోబాల్ కోసం చెక్ చేయగా.. బుమ్రా షూ భాగం క్రీజు లోపలే ఉన్నందున దానిని ఫెయిర్ డెలివరీగా ప్రకటించాడు. అయితే, ఈ విషయంలో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అన్ని కోణాల్లో పరిశీలించకుండానే బ్రెవిస్‌ను థర్డ్ అంపైర్ పెవిలియన్‌కు పంపి తప్పు చేశాడంటూ సౌతాఫ్రికా జట్టు అభిమానులు నెట్టింట కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే.. బుమ్రా కంటే ముందుగా.. అర్ష్‌దీప్ టీమిండియా తరఫున టీ20లలో వంద వికెట్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.టెస్టు, వన్డే, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన బౌలర్లు వీరేలసిత్ మలింగ (శ్రీలంక)టిమ్ సౌతీ (న్యూజిలాండ్)షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)షాహిన్ ఆఫ్రిది (పాకిస్తాన్)జస్ప్రీత్ బుమ్రా (ఇండియా).చదవండి: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్.. నమ్మశక్యంగా లేదు: సూర్యకుమార్At least show us another angle pic.twitter.com/NjDZ2lcxQT— Werner (@Werries_) December 9, 2025 -
సంజూ శాంసన్ పెద్దన్న లాంటోడు.. సై అంటే సై!
సంజూ శాంసన్.. భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఈ పేరు మీదే చర్చ నడుస్తోంది. టీమిండియా టీ20 ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్ తిరిగి రావడంతో సంజూ స్థానం గల్లంతైంది. ఒకవేళ తుదిజట్టులో ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు చోటు దక్కినా.. వన్‌డౌన్‌లో... ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపి యాజమాన్యం చేసిన ప్రయోగాలు బెడిసికొట్టాయి.ఫలితంగా.. వికెట్ కీపర్ కోటాలో సంజూ శాంసన్ స్థానాన్ని జితేశ్ శర్మ(Jitesh Sharma) భర్తీ చేశాడు. లోయర్ ఆర్డర్లో ఫినిషర్‌గానూ రాణించడం అతడికి అదనపు ప్రయోజనంగా మారింది. కాబట్టే సంజూ కంటే జితేశ్ వైపే తాము మొగ్గుచూపుతున్నట్లు టీమిండియా నాయకత్వ బృందం సంకేతాలు ఇచ్చింది కూడా!వికెట్ కీపర్‌గా జితేశ్‌కే పెద్ద పీటఇక సౌతాఫ్రికాతో తొలి టీ20లోనూ సంజూ (Sanju Samson)ను కాదని జితేశ్‌ను ఆడించింది యాజమాన్యం. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా వికెట్ కీపర్‌గా జితేశ్‌కే పెద్ద పీట వేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంపై జితేశ్ శర్మ స్పందించాడు.నాకు పెద్దన్న లాంటివాడు‘‘నిజం చెప్పాలంటే.. సంజూ నాకు పెద్దన్న లాంటివాడు. ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే మనలోని అత్యుత్తమ ప్రతిభ బయటకు వస్తుంది. జట్టుకు కూడా అదే మంచిది. భారత్‌లో టాలెంట్‌కు కొదవలేదు. అది అందరికీ తెలిసిన విషయమే.సంజూ భయ్యా గొప్ప ప్లేయర్. ఆయనతో నేను పోటీ పడాల్సి ఉంటుంది. అప్పుడే నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలుగుతాను. మేము ఇద్దరం టీమిండియాకు ఆడాలనే కోరుకుంటాం. మేము సోదరుల లాంటి వాళ్లం. మా అనుభవాలను పరస్పరం పంచుకుంటాం.టీమిండియాలో స్థానం కోసం సై అంటే సై!అతడు నాకు చాలా సాయం చేశాడు. సలహాలు ఇస్తాడు. ఒకవేళ అతడితోనే నాకు పోటీ అంటే.. బెస్ట్ ఇచ్చి ఢీకొట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాను’’ అని 32 ఏళ్ల జితేశ్ శర్మ.. 31 ఏళ్ల సంజూ గురించి చెప్పుకొచ్చాడు. 𝙄. 𝘾. 𝙔. 𝙈. 𝙄6⃣, 4⃣, 6⃣Hardik Pandya 🤝 Jitesh Sharma Updates ▶️ https://t.co/tiemfwcNPh#TeamIndia | #INDvSA | @hardikpandya7 | @jiteshsharma_ | @IDFCFIRSTBank pic.twitter.com/806L1KmQac— BCCI (@BCCI) December 9, 2025భారత్ ఘన విజయంకాగా కటక్ వేదికగా మంగళవారం తొలి టీ20లో టీమిండియా సౌతాఫ్రికాను 101 పరుగులతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో జితేశ్ ఎనిమిదో స్థానంలో వచ్చి 5 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతేకాదు నాలుగు డిస్మిసల్స్లో భాగమై కీపర్‌గానూ సత్తా చాటాడు.మరోవైపు.. ఓపెనర్ గిల్ (4) విఫలమయ్యాడు. కాగా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మెరుపు హాఫ్ సెంచరీ (28 బంతుల్లో 59 నాటౌట్)కి తోడు.. బౌలర్లు రాణించడంతో టీమిండియాకు విజయం సాధ్యమైంది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ముందంజ వేసింది. చదవండి: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్.. నమ్మశక్యంగా లేదు: సూర్యకుమార్Total dominance from Team India! 💥🇮🇳#SouthAfrica suffer their lowest T20I score as #India storm to a 101-run win their 3rd highest margin of victory against SA to go 1–0 up in the series! 💪#INDvSA 👉 2nd T20I 👉 11th DEC, 6 PM onwards pic.twitter.com/uwoZvWJa6Y— Star Sports (@StarSportsIndia) December 9, 2025 -
‘నిన్ను తప్పిస్తారన్న ఆలోచనే ఉండదు.. కానీ ఇక్కడ అలా కాదు’
టీమిండియా స్టార్ శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ బ్యాటర్‌గా మరోసారి విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20లో అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. రెండు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి నిష్క్రమించాడు. సఫారీ పేసర్ లుంగి ఎంగిడి బౌలింగ్‌లో మార్కో యాన్సెన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ఈ నేపథ్యంలో గిల్ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ20లలో ఓపెనర్‌గా గిల్ కంటే మెరుగైన రికార్డు ఉన్నా.. సంజూ శాంసన్ (Sanju Samson)ను కావాలనే బలి చేస్తున్నారనే ఆరోపణలు మరోసారి తెరమీదకు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ షాన్ పొలాక్ గిల్ (Shubman Gill)ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.నిన్ను తప్పిస్తారన్న ఊహే ఉండదుక్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో ఇలాంటి వాళ్లు ఎలా ఆడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. నిజానికి అక్కడ.. జట్టులో ప్రధాన ఆటగాడు అతడే. అతడిని జట్టు నుంచి తప్పిస్తారన్న ఊహ కూడా ఉండదు. కాబట్టి ఒత్తిడీ తక్కువే.కానీ ఇక్కడ అలా కాదుకానీ టీమిండియాకు వచ్చే సరికి కథ మారుతుంది. ఇక్కడ జట్టులో స్థానం కోసం పోటీ ఉంటుంది. కాబట్టి బ్యాటర్ మైండ్‌సెట్ మారిపోతుంది. కాస్త ఒత్తిడి కూడా పెరుగుతుంది. బాగా ఆడకుంటే జట్టులో స్థానం గల్లంతు అవుతుందనే ఆందోళన ఉంటుంది.కనీసం ఒక్క హాఫ్ సెంచరీఅయితే, శుబ్‌మన్ గిల్ విషయం మాత్రం ఇందుకు భిన్నం. అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20లలో మెరుగైన స్కోరు సాధించకపోవడం అతడిని నిరాశపరిచి ఉండవచ్చు. ప్రతి మూడు- నాలుగు మ్యాచ్‌లలో అతడు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ అయినా చేయాలి.లేదంటే విమర్శలు తప్పవు. ఐపీఎల్లో మాదిరి ఇక్కడా ఉంటుంది అనుకోవడం పొరపాటు. వరుసగా విఫలమైతే ఇక్కడ మళ్లీ ఆడే అవకాశం రాకపోవచ్చు’’ అని షాన్ పొలాక్ చెప్పుకొచ్చాడు. వరుస మ్యాచ్‌లలో ఫెయిలైనాకాగా టీమిండియా టెస్టు, వన్డే సారథి అయిన గిల్‌ను.. టీ20లలోనూ కెప్టెన్‌గా చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అందుకే వరుస మ్యాచ్‌లలో ఫెయిలైనా అవకాశాలు ఇస్తూనే ఉంది. అయితే, ఇందుకోసం సంజూ బలికావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో కటక్ వేదికగా తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తొలి టీ20 స్కోర్లు👉వేదిక: బారాబతి స్టేడియం, కటక్, ఒడిశా.👉టాస్: సౌతాఫ్రికా.. తొలుత బౌలింగ్👉భారత్ స్కోరు: 175/6(20)👉సౌతాఫ్రికా స్కోరు: 74(12.3)👉 ఫలితం: 101 పరుగుల తేడాతో సఫారీ జట్టుపై భారత్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 59 నాటౌట్, ఒక వికెట్).చదవండి: విరిగిన చెయ్యితోనే బ్యాటింగ్.. అతడి వల్లే టీమిండియా సెలక్ట్ అయ్యాను: సచిన్ -
అతడొక అద్భుతం.. నమ్మబుద్ధికాలేదు: సూర్యకుమార్
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో టీమిండియాకు శుభారంభం లభించింది. కటక్ వేదికగా మంగళవారం నాటి తొలి మ్యాచ్‌లో భారత జట్టు సఫారీలను ఏకంగా 101 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆరంభంలో తడబడినా.. హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన కనబరచడంతో మెరుగైన స్కోరు సాధించింది.50- 50 అనుకున్నాంఅనంతరం బౌలర్ల విజృంభణ కారణంగా లక్ష్యాన్ని కాపాడుకుని సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో విజయంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) స్పందించాడు. ‘‘టాస్ సమయంలో గెలుపు అవకాశాలు 50- 50 అనుకున్నాం. ఏదేమైనా తొలుత బ్యాటింగ్ చేయడం సంతోషంగా అనిపించింది.48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా.. ఆ తర్వాత తేరుకుని 175 పరుగులు చేయగలిగాము. హార్దిక్ పాండ్యా (Hardik Pandya), అక్షర్ పటేల్, తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. చివర్లో జితేశ్ శర్మ (Jitesh Sharma)కూడా తన వంతు పాత్ర పోషించాడు.నమ్మశక్యం కాని విషయంతొలుత మేము 160 పరుగుల వరకు చేయగలుగుతామని అనుకున్నాం. అయితే, 175 పరుగులు సాధించడం అన్నది నమ్మశక్యం కాని విషయం. 7-8 మంది బ్యాటర్లలో ఇద్దరు- ముగ్గురు పూర్తిగా విఫలమైనా.. మిగిలిన నలుగురు రాణించి దీనిని సుసాధ్యం చేశారు.టీ20 క్రికెట్లోని మజానే ఇది. తదుపరి మ్యాచ్‌లో మా బ్యాటర్లంతా మెరుగ్గా ఆడతారని ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరు ఫియర్లెస్ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాము. టీమిండియా టీ20 ప్రయాణం గొప్పగా సాగుతోంది.అర్ష్‌దీప్, బుమ్రా పరిపూర్ణమైన బౌలర్లు. మేము టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే వాళ్లిద్దరే బౌలింగ్ అటాక్ ఆరంభించేవారు. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత హార్దిక్ పాండ్యా తన స్థాయి ఏమిటో మరోసారి చూపించాడు. Hard-hit Pandya is back in business! 🙌💪Two mammoth maximums in the same over and the crowd in Cuttack begins to chant his name. 🤩#INDvSA, 1st T20I, LIVE NOW 👉 https://t.co/tqu4j7Svcm pic.twitter.com/VYKUx3OhVT— Star Sports (@StarSportsIndia) December 9, 2025అతడొక అద్భుతం.. నిజంగా అద్భుతం చేశాడు. ఏదేమైనా అతడిని జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యం. అతడి బౌలింగ్ పట్ల కూడా నేను సంతోషంగా ఉన్నాను’’ అంటూ సూర్యకుమార్ యాదవ్ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.టాపార్డర్ విఫలంకాగా సౌతాఫ్రికాతో తొలి టీ20లో టాస్ ఓడిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. టాపార్డర్‌లో ఓపెనర్లు అభిషేక్ శర్మ (17), శుబ్‌మన్ గిల్ (4) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12) కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు.ఆదుకున్న హార్దిక్ఇలాంటి దశలో తిలక్ వర్మ (32 బంతుల్లో 26), అక్షర్ పటేల్ (21 బంతుల్లో 23) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. హార్దిక్ పాండ్యా మెరుపు అర్ధ శతకం (28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59)తో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో శివం దూబే (9 బంతుల్లో 11), జితేశ్ శర్మ (5 బంతుల్లో 10 నాటౌట్) ఫర్వాలేదనిపించారు.అనంతరం లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 12.3 ఓవర్లలో కేవలం 74 పరుగులు చేసి కుప్పకూలింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, శివం దూబే చెరో వికెట్ దక్కించుకున్నారు. ప్రొటిస్ జట్టు బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్ (14 బంతుల్లో 22) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.చదవండి: విరిగిన చెయ్యితోనే బ్యాటింగ్.. అతడి వల్లే టీమిండియా సెలక్ట్ అయ్యాను: సచిన్ -
హార్దిక్ పాండ్యా సూపర్ షో...తొలి టి20లో భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
హార్దిక్ విధ్వంసం.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 9) జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఇన్నింగ్స్ మధ్య వరకు తడబడినప్పటికీ హార్దిక్ రాకతో పరిస్థితి ఒక్కసారిగా మారింది.తొలి బంతి నుంచే ఎదురుదాడి మొదలుపెట్టిన హార్దిక్ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది స్కోర్ వేగాన్ని పెంచాడు. అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లేనప్పటికీ ఒంటరి పోరాటం చేశాడు. 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు.ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ 17, శుభ్‌మన్ గిల్ 4, సూర్యకుమార్ యాదవ్ 12, తిలక్ వర్మ 26, అక్షర్ పటేల్ 23, శివమ్ దూబే 11, జితేశ్ శర్మ 10 (నాటౌట్) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. సిపాంమ్లా 2, ఫెరియెరా ఓ వికెట్ పడగొట్టాడు.తుది జట్లు..భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్),అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్), ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రీవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డొనొవన్ ఫెరియెరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, లుథో సిపంమ్లా, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే -
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. సంజూకు మొండిచెయ్యి
కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా ఇవాళ (డిసెంబర్ 9) భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 జరుగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగే ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.ఈ మ్యాచ్‌లో ముందుగా ఊహించినట్టుగానే శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగాడు. దీంతో సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. వికెట్‌కీపర్ బ్యాటర్ కోటాలో జితేశ్ శర్మ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాకు కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. సౌతాఫ్రికా తరఫున నోర్జే చాలాకాలం తర్వాత బరిలోకి దిగుతున్నాడు.తుది జట్లు..భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్),అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రాసౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్), ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రీవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, డొనొవన్ ఫెరియెరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, లుథో సిపంమ్లా, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే -
సంజూకు సరిపడా ఛాన్సులు.. ఇకపై: సూర్యకుమార్
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత సంజూ శాంసన్‌కు వరుస అవకాశాలు వచ్చాయి. అభిషేక్ శర్మతో కలిసి టీమిండియా టీ20 ఓపెనర్‌గా ఈ కేరళ బ్యాటర్ అదరగొట్టాడు. వికెట్ కీపర్‌గా సేవలు అందిస్తూ.. టాపార్డర్‌లో రాణించాడు. ఈ క్రమంలో మూడు శతకాలు బాది జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేశాడు.విఫలమైనా.. అయితే, ఆసియా టీ20 కప్-2025 టోర్నీతో వైస్ కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill) తిరిగి రావడంతో.. సంజూ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. అభిషేక్‌కు జోడీగా వస్తున్న గిల్ చాలాసార్లు విఫలమైనా.. యాజమాన్యం మాత్రం అతడికే మద్దతుగా నిలుస్తోంది. భవిష్య కెప్టెన్‌గా అతడికి పెద్ద పీట వేస్తూ ఒక్కోసారి భారీ మూల్యమే చెల్లిస్తోంది.మరోవైపు.. గిల్ రాకతో సంజూ (Sanju Samson)కు తుదిజట్టులో చోటు కష్టమైపోయింది. ఒకవేళ ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం దక్కినా.. బ్యాటింగ్ ఆర్డర్లో ఎప్పుడు రావాలో తెలియని పరిస్థితి. ఓసారి వన్‌డౌన్‌లో.. మరోసారి ఐదో స్థానంలో మేనేజ్మెంట్ అతడిని బ్యాటింగ్‌కు పంపిస్తోంది.సంజూపై వేటు వేసి.. జితేశ్‌కు చోటుఇక ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆఖరిగా ఐదో స్థానంలో వచ్చి విఫలమైన సంజూ (4 బంతుల్లో 2)ను.. ఆ తర్వాత మేనేజ్మెంట్ తప్పించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన తర్వాత సంజూపై వేటు వేసి.. వికెట్ కీపర్ కోటాలో జితేశ్ శర్మను ఆడించింది.ఈ క్రమంలో తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌లోనూ సంజూకు మొండిచేయి చూపిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కూడా బలం చేకూరుస్తున్నాయి. సంజూ కంటే తమకు గిల్ ఎక్కువని సూర్య చెప్పకనే చెప్పాడు.గిల్‌కే పెద్దపీట వేస్తామన్న సూర్యసౌతాఫ్రికాతో కటక్ వేదికగా తొలి టీ20కి ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సంజూ టాపార్డర్‌లో రాణిస్తాడు. అయితే, జట్టులో ఓపెనర్లు కాకుండా మిగిలిన ప్రతి ఒక్క ఆటగాడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధంగా ఉండాలి.నిజానికి సంజూ ఓపెనర్‌గా అదరగొట్టాడు. మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ గతేడాది శ్రీలంక పర్యటనలో గిల్ ఓపెనర్‌గా ఉన్నాడు. సంజూ కంటే ముందు అతడే జట్టుతో ఉన్నాడు. కాబట్టి గిల్ తన స్థానంలోకి తిరిగి వచ్చేందుకు వందశాతం అర్హుడు.కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చాముసంజూకు మేము కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చాము. అతడు కూడా ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాడు. జట్టుకు అదొక సానుకూలాంశం. మూడు- ఆరు వరకు ఏ స్థానంలో ఆడేందుకైనా మా ఆటగాళ్లు సిద్ధంగా ఉంటారు.టాపార్డర్‌లో ఆడుతూనే.. అవసరం వచ్చినపుడు మిడిల్ ఆర్డర్లోనూ రాణించగల ఆటగాళ్లు ఉండటం మా జట్టుకు అదృష్టం లాంటిదే. తుదిజట్టులో స్థానం ఇంత మంది ఆటగాళ్లు పోటీపడటం.. సెలక్షన్ విషయంలో మాకు ఇలాంటి తలనొప్పి ఉండటం ఎంతో బాగుంటుంది. వరల్డ్‌కప్ ఆశలు ఆవిరేనా?మా జట్టుకు ఉన్న వైవిధ్యమైన ఆప్షన్లను ఇది సూచిస్తుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న వేళ ప్రయోగాల పేరిట సంజూను పక్కనపెట్టడం చూస్తుంటే.. ఈసారి కూడా అతడికి వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశం ఇవ్వరనే అనిపిస్తోంది. చదవండి: వాళ్లిద్దరికి మొండిచేయి!.. తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే! -
ఛీ.. ఇదేం బుద్ధి?: హార్దిక్ పాండ్యా ఆగ్రహం
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు కోపమొచ్చింది. ‘‘మీకసలు బుద్ధి ఉందా?’’ అంటూ పాపరాజీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెత్త యాంగిల్స్‌లో ఫొటోలు తీసి.. దిగజారుడుతనాన్ని చాటుకున్నారంటూ మండిపడ్డాడు. అసలేం జరిగిందంటే..భార్య నటాషా స్టాంకోవిక్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మళ్లీ ప్రేమలో పడిన విషయం తెలిసిందే. మోడల్ మహీక శర్మతో అతడు కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. తన పుట్టినరోజు (అక్టోబరు 11) సందర్భంగా మహీక (Mahieka Sharma)తో అత్యంత సన్నిహితంగా దిగిన ఫొటోలను షేర్ చేస్తూ తమ బంధాన్ని ధ్రువీకరించాడు. ఇక అప్పటి నుంచి జిమ్ మొదలు బీచ్ వరకు ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని విహరిస్తున్నారు.కాగా పాపరాజీల వల్ల మహీక శర్మ ఇటీవల అసౌకర్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమె రెస్టారెంట్ నుంచి మెట్లు దిగి వస్తున్న క్రమంలో కింద ఉన్న పాపరాజీలు కెమెరాలు క్లిక్‌మనిపించినట్లు సమాచారం. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా వెల్లడిస్తూ హార్దిక్ పాండ్యా తీవ్ర స్థాయిలో పాపరాజీల తీరుపై మండిపడ్డాడు.తీయకూడని యాంగిల్లో ఫొటో..‘‘ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే జీవితాన్ని నేను ఎంచుకున్నాను. అందువల్ల అందరూ నన్ను గమనిస్తూ ఉంటారని తెలుసు. కానీ రోజు కొంతమంది హద్దులు దాటేశారు. మహీక బాంద్రా రెస్టారెంట్లో మెట్లు దిగి వస్తున్నపుడు తీయకూడని యాంగిల్లో ఫొటో తీశారు. అసలు ఇలాంటి వాటికి ఏ మహిళా అర్హురాలు కాదు.ప్రైవేట్ మూమెంట్అంత ఘోరంగా తనను ఫొటో తీశారు. ప్రైవేట్ మూమెంట్‌ను ఫొటో తీసి.. దిగజారుడుతనాన్ని చాటుకున్నారు. మీ చెత్త సంచనాల కోసం తనని ఇబ్బంది పెట్టారు. మీ హెడ్‌లైన్స్ కోసం ఇతరుల గౌరవ, మర్యాదలు పణంగా పెడతారా? ప్రతి మహిళ తనదైన శైలిలో జీవించేందుకు అర్హురాలు.అలాగే ప్రతి ఒక్కరికి తాము చేసే పనుల్లో కొన్ని హద్దులు, పరిమితులు ఉంటాయి. మీడియా సోదరులకు నా విజ్ఞప్తి. మీ వృత్తిని నేను గౌరవిస్తాను. మీకు ఎల్లవేళలా సహకారం అందిస్తాను. కానీ మీరు కొంచెం పద్ధతైన పనులు చేయండి.కాస్త మానవత్వం చూపండిప్రతీ విషయాన్ని క్యాప్చర్ చేయాల్సిన పనిలేదు. ప్రతీ యాంగిల్లోనూ ఫొటో తీయాల్సిన అవసరం లేదు. ఈ ఆటలో కాస్త మానవత్వం చూపండి. థాంక్యూ’’ అంటూ పాపరాజీల తీరును హార్దిక్ పాండ్యా ఏకిపారేశాడు. ఇకనైనా బుద్ధిగా వ్యవహరించాలంటూ చురకలు అంటించాడు.కాగా గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యా... ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌తో బిజీ అయ్యాడు. ఇదిలా ఉంటే.. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని చిత్రీకరిస్తూ.. ఒక్కోసారి వారి అనుమతి లేకుండానే ఫొటోలు తీసి వివిధ మాధ్యమాలకు అమ్ముకునే ఫొటోగ్రాఫర్లను పాపరాజీలు అంటారు.చదవండి: చరిత్ర సృష్టించిన బరోడా క్రికెటర్ -
వాళ్లిద్దరికి మొండిచేయి!.. తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే!
భారత్- సౌతాఫ్రికా మధ్య మంగళవారం కటక్ వేదికగా తొలి టీ20 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా స్టార్లు శుబ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా పునరాగమనం చేయనున్నారు.టెస్టు సారథి గిల్ (Shubman Gill) మెడ నొప్పి కారణంగా సఫారీలతో రెండో టెస్టు, వన్డే సిరీస్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోలుకుని పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించిన గిల్.. నేరుగా తుదిజట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.మరోవైపు.. ఆసియా కప్-2025 టోర్నీ సందర్భంగా గాయపడిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)చాన్నాళ్ల తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. జితేశ్ శర్మకే ప్రాధాన్యంఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పుపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) తన అభిప్రాయాలు పంచుకున్నాడు. గిల్ రాకతో సంజూ శాంసన్‌పై వేటు తప్పదన్న పఠాన్.. వికెట్ కీపర్‌గా జితేశ్ శర్మకే తొలి ప్రాధాన్యం దక్కుతుందని పేర్కొన్నాడు.శివం దూబేకు నో ఛాన్స్‌అదే విధంగా.. హార్దిక్ వల్ల ఓ ఆల్‌రౌండర్‌కు మొండిచేయి తప్పదని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఇక ఓపెనింగ్ జోడీగా అభిషేక్ శర్మ- శుబ్‌మన్ గిల్ ఉంటారన్న అతడు.. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్‌తో పాటు.. వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటాడని పేర్కొన్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యాతో పాటు అక్షర్ పటేల్ తుదిజట్టులో ఉంటాడన్న ఇర్ఫాన్ పఠాన్.. శివం దూబేకు ఛాన్స్ ఉండదని అభిప్రాయపడ్డాడు.ఇర్ఫాన్ ఓటు అర్ష్కేఇక పేసర్ల కోటాలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు దక్కుతుందని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. అయితే, గత కొంతకాలంగా యువ పేసర్ హర్షిత్ రాణా కూడా మెరుగ్గా రాణిస్తున్నాడని.. అతడికి గనుక మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వాలని భావిస్తే అర్ష్పైనే వేటు పడుతుందని అంచనా వేశాడు.ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగలనని హర్షిత్ ఆస్ట్రేలియా గడ్డ మీద నిరూపించుకున్నాడని.. కాబట్టి యాజమాన్యం అతడి వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదని పేర్కొన్నాడు. ఏదేమైనా తాను మాత్రం అర్ష్‌దీప్‌కే ఓటు వేస్తానని ఇర్ఫాన్ పఠాన్ ఈ సందర్భంగా వెల్లడించాడు.సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌కు ఇర్ఫాన్ పఠాన్ ఎంచుకున్న భారత తుదిజట్టుఅభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! -
చరిత్రకు అడుగు దూరంలో జస్ప్రీత్ బుమ్రా..
భారత్-సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రంగం సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మంగళవారం(డిసెంబర్ 9) జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. సఫారీలతో వన్డే సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఇప్పుడు టీ20ల్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. తొలి టీ20కు ముందు బుమ్రాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్ల క్లబ్లో చేరేందుకు బుమ్రా ఒకే ఒక వికెట్ దూరంలో ఉన్నాడు.అరుదైన రికార్డుపై కన్ను..కటక్ టీ20లో బుమ్రా వికెట్ సాధిస్తే వంద వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. తద్వారా మూడు ఫార్మాట్లలోనూ ఈ ఫీట్ సాధించిన తొలి భారత బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టిస్తాడు. ఈ పేస్ గుర్రం ఇప్పటికే వన్డే, టెస్టు ఫార్మాట్లలలో వంద వికెట్లను పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో ఇప్పటివరకు 80 మ్యాచ్‌లు ఆడి 99 వికెట్లు సాధించాడు. అయితే భారత తరపున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అర్ష్‌దీప్ సింగ్ 105 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ సిరీస్‌లో అర్ష్‌దీప్‌ను కూడా బుమ్రా అధిగమించే అవకాశముంది. అదేవిధంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 500 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి బుమ్రాకు 18 వికెట్లు మాత్రమే అవసరం. బుమ్రా ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో 221 మ్యాచ్‌లు ఆడి 482 వికెట్లు సాధించాడు.సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్షదీప్ సింగ్చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! -
టీమిండియాకు భారీ షాక్..!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీకి సిద్దమయ్యాడు. గాయం కారణంగా దాదాపు రెండు నెలల పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉన్న పాండ్యా.. తిరిగి మంగళవారం కటక్ వేదికగా సౌతాఫ్రికాతో జరగనున్న తొలి టీ20ల్లో ఆడనున్నాడు.పునరాగమనంలో తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే ముందు పాండ్యా దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగమయ్యాడు. ఈ టోర్నీలో బరోడా తరపున రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఈ రెండింటిలోనూ అతడు తన నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటాను పూర్తి చేశాడు.ఎడమ క్వాడ్రిసెప్స్(తొడ కండరాలు) గాయం నుంచి పాండ్యా పూర్తిగా కోలుకున్నట్లు కన్పిస్తున్నాడు. హార్దిక్ షెడ్యూల్ ప్రకారం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా బీసీసీఐ మాత్రం రెండు మ్యాచ్‌లు సరిపోతాయని నిర్ణయించింది. దీంతో పాండ్యా నేరుగా తొలి మ్యాచ్ జరిగే కటక్‌కు చేరుకున్నాడు.బారాబతి స్టేడియంలో ఈ ఆల్‌రౌండర్ ఒంటరిగా ట్రైనింగ్ పాల్గోన్నాడు. వార్మప్, స్ట్రెచింగ్, రన్నింగ్ డ్రిల్స్‌తో పాటు, త్రోడౌన్ స్పెషలిస్టులు నువాన్ సెనెవిరత్నే, దయానంద్ గారానితో కలిసి 20 నిమిషాలు బౌలింగ్ చేశాడు.ప్రాక్టీస్‌కు దూరం!ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికి.. సోమవారం జరిగిన భారత్ చివరి ప్రాక్టీస్ సెషన్‌కు హార్దిక్ గైర్హాజరయ్యాడు. దీంతో అతడు మళ్లీ గాయపడ్డాడా? అన్న ఆందోళన అభిమానులలో నెలకొంది. అయితే హార్దిక్‌కు ఎటువంటి గాయం లేదని, ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే శిక్షణకు దూరమయ్యాడని క్రిక్ బజ్ తెలిపింది. టీ20 ప్రపంచకప్-2026కు సమయం అసన్నమవుతుండడంతో హార్దిక్ లాంటి అద్భుతమైన ఆటగాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే బౌలింగ్ చేసే క్రమంలో పాండ్యా కాస్త ఆసౌకర్యంగా కన్పించడాని, అందుకే ట్రైనింగ్ సెషన్‌కు దూరంగా ఉన్నాడని మరి కొన్ని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కానీ బీసీసీఐ మాత్రం హార్దిక్ ట్రైనింగ్ స్కిప్పై ఎటువంటి ప్రకటన చేయలేదు.సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్షదీప్ సింగ్ -
ఇక ధనాధన్ షురూ...
టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత్ ఆ తర్వాత ఇప్పటి వరకు 32 టి20లు ఆడితే 26 గెలిచి, 4 మాత్రమే ఓడిపోయింది. ఇలాంటి అద్భుత ఫామ్ మాత్రమే కాదు జట్టులో అనూహ్య మార్పులేమీ లేకుండా చాలా కాలంగా ఒకే పటిష్టమైన బృందంతో సాగుతోంది. మరోవైపు భారత్ చేతిలో టి20 వరల్డ్‌కప్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత దక్షిణాఫ్రికా 9, గెలిచి 16 ఓడిపోయింది.పైగా నిలకడ లేని టీమ్‌తో పదే పదే మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. సొంతగడ్డపై తమ స్థాయిని ప్రదర్శించేందుకు టీమిండియా సిద్ధం కాగా... వచ్చే టి20 వరల్డ్ కప్‌కు ముందు ఇక్కడ ఐదు మ్యాచ్‌లు ఆడటం సన్నాహకంగా ఉపయోగపడుతుందని సఫారీలు భావిస్తున్నారు. కటక్: భారత గడ్డపై చాలా కాలం తర్వాత ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలో కూడా సిరీస్‌లు జరుగుతుండగా... టెస్టుల్లో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. వన్డే సిరీస్ నెగ్గిన టీమిండియా ఇప్పుడు టి20 సిరీస్ విజయంపై గురి పెట్టింది. డిఫెండింగ్ చాంపియన్‌గా వరల్డ్ కప్ బరిలోకి దిగడానికి ముందు భారత్ 10 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ తర్వాత న్యూజిలాండ్‌తో కూడా ఐదు టి20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పటికే సిద్ధమైన జట్టును అన్ని రకాలుగా పరీక్షించుకోవడంతో పాటు స్వల్ప లోపాలేమైనా ఉంటే సరిదిద్దుకునేందుకు ఈ మ్యాచ్‌లు అవకాశం కల్చిస్తాయి. మరోవైపు దక్షిణాఫ్రికా సిరీస్ ఫలితంకంటే కూడా తమ జట్టును పునరి్నరి్మంచుకోవటంపై దృష్టి పెట్టింది. ఇలాంటి సమీకరణాల మధ్య బారాబతి స్టేడియంలో నేడు తొలి టి20 మ్యాచ్ జరుగుతుంది. గిల్, పాండ్యా సిద్ధం... ఆ్రస్టేలియా గడ్డపై టి20 సిరీస్ గెలిచిన తర్వాత భారత్ ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతోంది. సంచలన ఎంపికలు ఏమీ లేవు కాబట్టి తుది కూర్పుపై కూడా స్పష్టత ఉంది. గాయాల నుంచి కోలుకున్న వైస్ కెప్టెన్ గిల్, హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నారని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. కాబట్టి వీరిద్దరు ఆడటం ఖాయం. అభిషేక్ శర్మతో పాటు గిల్ ఓపెనింగ్ చేయనుండగా సూర్య, తిలక్ వర్మ స్థానాలపై ఎలాంటి సందేహం లేదు. వికెట్ కీపర్‌గా సంజూ సామ్సన్, జితేశ్ శర్మలలో ఎవరికి అవకాశం ఇస్తారనేది చూడాలి. రెగ్యులర్ స్పిన్నర్లు కుల్దీప్, వరుణ్ చక్రవర్తి ఉంటారు. అక్షర్ పటేల్‌తో పాటు ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ పోటీలో ఉన్నాడు. పేస్ ఆల్‌రౌండర్ కావాలంటే హర్షిత్ రాణాకు కూడా అవకాశం దక్కవచ్చు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్ మాత్రమే కాస్త ఆందోళన కలిగిస్తోంది. పూర్తి స్థాయిలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాతి నుంచి సూర్య ఆడిన 15 ఇన్నింగ్స్‌లలో 15.33 సగటుతో కేవలం 184 పరుగులే చేశాడు. అంతకుముందు నుంచి కలిపి చూస్తే గత 20 ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు. ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఐదు ఇన్నింగ్స్‌లలో ఒక్క హాఫ్ సెంచరీ చేయకుండా పూర్తిగా విఫలయ్యాడు. ప్రస్తుత స్థితిలో అతని స్థానానికి వచ్చిన ముప్పేమీ లేకున్నా... ఈ సిరీస్‌లోనైనా స్థాయికి తగినట్లుగా చెలరేగాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. బ్రెవిస్‌పై దృష్టి... దక్షిణాఫ్రికా టీమ్ పరిస్థితి ఇటీవల అంతంత మాత్రంగానే ఉంది. ఆ్రస్టేలియా, పాకిస్తాన్ల చేతిలో సిరీస్‌లు ఓడటంతో పాటు నమీబియా చేతిలో మ్యాచ్ కూడా కోల్పోయింది. పైగా ఇంగ్లండ్‌తో జరిగిన టి20లో 300కు పైగా పరుగులిచ్చి ఇలాంటి చెత్త రికార్డు నమోదు చేసిన పెద్ద జట్టుగా నిలిచింది. దూకుడైన ఆటగాడు డేవిడ్ మిల్లర్, పేసర్ నోర్జే గాయాల నుంచి కోలుకొని పునరాగమనం చేయడం సానుకూలాంశం కాగా కెప్టెన్‌గా మళ్లీ బాధ్యతలు తీసుకున్న మార్క్రమ్ మెరుగైన ఫామ్‌లో ఉండటం కలిసి రావచ్చు. ఇప్పటికీ తుది జట్టు విషయంలో టీమ్‌లో గందరగోళమే ఉంది. అయితే ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని శాసించగల డెవాల్డ్ బ్రెవిస్‌పై మాత్రం అందరి దృష్టీ ఉంది. ఐపీఎల్‌తో పాటు ఇటీవల వన్డేల్లో కూడా అతని దూకుడు కనిపించింది. బ్రెవిస్ చెలరేగితే సఫారీలకు మంచి గెలుపు అవకాశం ఉంటుంది. యాన్సెన్ ఆల్‌రౌండ్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పిచ్, వాతావరణం అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌కు సమంగా అనుకూలించే అవకాశం ఉన్న స్పోరి్టంగ్ పిచ్. ప్రతీ ఆటగాడు సత్తా చూపించేందుకు సరైంది. అయితే ఇక్కడా మంచు ప్రభావం చాలా ఉంది కాబట్టి టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం. వర్ష సూచన ఉన్నా మ్యాచ్‌కు ఇబ్బంది లేకపోవచ్చు.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, గిల్, తిలక్, జితేశ్ శర్మ/సామ్సన్, పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, హర్షిత్/సుందర్. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), డికాక్, హెన్డ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, బాష్/లిండే, యాన్సెన్, మహరాజ్, ఎన్గిడి, మహరాజ్. -
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు ఝలక్
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు ఐసీసీ టీమిండియాకు ఝలక్ ఇచ్చింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 3న రాయపూర్‌లో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్‌రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ భారత ఆటగాళ్లకు జరిమానా విధించింది. ఆ మ్యాచ్‌లో భారత బౌలర్లు నిర్దేశిత సమయంలోగా 2 ఓవర్లు వెనుకపడ్డారు. దీంతో ఓవర్‌కు 5 శాతం చొప్పున, రెండు ఓవర్లకు 10 శాతం మ్యాచ్ ఫీజ్‌ను టీమిండియాకు జరిమానాగా విధించారు.ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఈ శిక్షను ఖరారు చేశారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఆర్టికల్ 2.22 ప్రకారం, ప్రతి ఓవర్ ఆలస్యానికి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధిస్తారు. ఈ జరిమానాను భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ స్వీకరించాడు. దీంతో ఫార్మల్ హియరింగ్ అవసరం లేకుండా కేసు ముగిసింది. ఆ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా విజయవంతంగా ఛేదించి, సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అనంతరం విశాఖపట్నంలో జరిగిన నిర్ణయాత్మక వన్డేలో భారత్ విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే, రేపటి నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లోని మిగతా టీ20లు డిసెంబర్ 11, 14, 17, 19 తేదీల్లో ముల్లాన్‌పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికలుగా జరుగనున్నాయి.సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ -
గిల్ వచ్చేశాడు.. సంజూ శాంసన్‌కు మళ్లీ నిరాశే..!
డిసెంబర్ 9 నుంచి కటక్ (ఒడిషా) వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోసం భారత జట్టు మొత్తం ఇప్పటికే భువనేశ్వర్‌కు (ఒడిషా రాజధాని) చేరుకుంది. గాయం కారణంగా టెస్ట్, వన్డే సిరీస్‌కు (సౌతాఫ్రికాతో) దూరమైన శుభ్‌మన్ గిల్ కూడా నిన్న రాత్రి భువనేశ్వర్ చేరుకున్నాడు.గిల్ మెడ్ గాయం నుంచి పూర్తిగా కోలుకోని రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. గిల్ రాకతో టీమిండియాకు ఓపెనింగ్ జోడీ సమస్య తిరగబెట్టింది. అభిషేక్‌కు జోడీగా గిల్ బరిలోకి దిగితే సంజూ శాంసన్‌కు మళ్లీ నిరాశ తప్పదు.మిడిలార్డర్లో ఆడించాల్సి వస్తే మేనేజ్మెంట్ జితేశ్ శర్మకు ఓటు వస్తుంది తప్ప సంజూకు అవకాశం ఇవ్వదు. సంజూ ఓపెనర్‌గా అయితేనే సక్సెస్ కాగలడని మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇది ఆసీస్ పర్యటనలో తొలి రెండు టీ20ల్లో నిరూపితమైంది. దీన్ని బట్టి చూస్తే సంజూ ఓపెనర్‌గా అవకాశం ఉంటేనే తుది జట్టులో ఉంటాడు. లేకపోతే జట్టులో చోటే ఉండదు.మేనేజ్మెంట్ దగ్గర మిడిలార్డర్ వికెట్ కీపర్ బ్యాటర్ కోసం జితేశ్ శర్మ రూపం మంచి ఆప్షన్ ఉంది. జితేశ్ మంచి ఫినిషర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. కాబట్టి సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లో అతడికే అవకాశాలు ఉంటాయి. ఓపెనర్లలో ఎవరో ఒకరికి గాయమైతే తప్ప సంజూ తుది జట్టులోకి వచ్చే పరిస్థితి లేదు.గిల్ ఆకలితో ఉన్నాడు: గంభీర్‌గిల్ గాయంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రెండు రోజుల ముందే అప్డేట్ ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిశాక గంభీర్ మాట్లాడుతూ.. అవును, గిల్ సిద్ధంగా ఉన్నాడు. అందుకే అతన్ని ఎంపిక చేశాం. అతను ఫిట్‌గా, ఫైన్‌గా, ఆడేందుకు ఆకలితో ఉన్నాడని అన్నాడు.కాగా, సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో మెడ గాయానికి గురైన గిల్.. గత కొద్ది రోజులుగా బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నాడు. అక్కడ పూర్తిగా కోలుకొని, వైద్య బృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందాడు. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న గిల్.. టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్షదీప్ సింగ్ -
సౌతాఫ్రికాతో తొలి టీ20.. టీమిండియా స్టార్ ప్లేయర్‌పై వేటు?
భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు టీ20ల సిరీస్ మంగళవారం(డిసెంబర్ 9) నుంచి ప్రారంభం కానుంది. తొలి వన్డే కటక్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే ఆతిథ్య వేదికకు చేరుకుని ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాయి. టెస్టు సిరీస్‌ను సౌతాఫ్రికా సొంతం చేసుకోగా.. వన్డే సిరీస్‌ను మాత్రం మెన్ ఇన్ బ్లూ తమ ఖాతాలో వేసుకుంది.ఇప్పుడు టీ20 సిరీస్‌ను కూడా సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. కటక్ టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని సూర్యకుమార్ నాయకత్వంలోని భారత్ భావిస్తోంది. టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. దీంతో తొలి మ్యాచ్ కోసం టీమిండియా ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు ఎలా ఉండబోతుందో అంచనా వేద్దాం.టైమ్స్ ఆఫ్ ఇండియా' నివేదిక ప్రకారం.. తొలి టీ20 కోసం బారాబాతి స్టేడియంలోని పిచ్‌ను ఎర్రమట్టితో తాయారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వికెట్ స్పిన్నర్ల కంటే పేసర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశముంది. ఇద్దరు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగే అవకాశముంది.సుందర్‌పై వేటు..గత కొన్ని మ్యాచ్‌లగా మూడో స్పిన్నర్‌గా ఉన్న వాషింగ్టన్ సుందర్‌పై వేటు పడనున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేకి చోటు దక్కనున్నట్లు ఛాన్స్ ఉంది. ఎలాగో మరో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తుది జట్టులో ఉంటాడు. గాయం నుంచి పాండ్యా కోలుకుని తిరిగొచ్చాడు.ఇక సీమర్లగా అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా ఉండే అవకాశముంది. ఒకవేళ అవసరమైతో దూబేతో బౌలింగ్ చేయిస్తారు లేదా స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఉపయోగించుకుంటారు. అయితే స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు చోటు దక్కకపోవచ్చు. భారత ఇన్నింగ్స్‌ను శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ప్రారంభించనుండగా.. మూడు నాలుగు స్ధానాలలో సూర్యకుమార్, తిలక్ వర్మ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది. ఇక వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌ను ఆడించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఒకట్రెండు మ్యాచ్‌లలో శాంసన్ విఫలమైతే.. జితీశ్ శర్మ వైపు టీమ్ మెనెజ్‌మెంట్ మొగ్గు చూపే ఛాన్స్ ఉంది.భారత తుది జట్టు(అంచనా)అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్చదవండి: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ ఊహించని ప్రకటన! -
భువనేశ్వర్‌కు చేరుకున్న టీమిండియా (వీడియో)
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను మాత్రం సొంతం చేసుకుంది. మెన్ ఇన్ బ్లూ ఇప్పుడు టీ20 సిరీస్‌పై కన్నేసింది. భారత్-సౌతాఫ్రికా మధ్య ఐదు టీ20ల సిరీస్ మంగళవారం(డిసెంబర్ 9) నుంచి ప్రారంభం కానుంది. తొలి టీ20 కటక్ వేదికగా జరగనుంది.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఆదివారం రాత్రి భువనేశ్వర్‌కు చేరుకున్నాయి. ప్రోటీస్, భారత్ జట్లకు ఒడిశా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ లోచన్ మహంతి స్వాగతం పలికారు. వైజాగ్ నుంచి అర్ష్‌దీప్, నితీశ్ కుమార్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు భువనేశ్వర్ చేరుకోగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బుమ్రా వంటి వారు ముంబై నుంచి నేరుగా జట్టులో కలిశారు. ఇరు జట్లు సోమవారం బారాబతి స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్స్‌కు హాజరు కానున్నారు. స్టేడియం, హోటల్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పంకజ్ లోచన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక గాయం కారణంగా టెస్టు, వన్డే సిరీస్‌కు దూరమైన స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అతడు టీ20ల్లో ఆడనుండడం ఖాయం. మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా రీ ఎంట్రీ ఇచ్చాడు. అతడు ఇప్పటికే ఫిట్నెస్ సాధించి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దుమ్ములేపాడు. ఇప్పుడు అదే జోరును సఫారీలపై కొనసాగించాలని ఈ బరోడా ఆటగాడు ఉవ్విళ్లూరుతున్నాడు. వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సైతం టీ20లకు అందుబాటులోకి వచ్చాడు.సఫారీలతో టీ20లకు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దుబే, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ. So Sanju Samson reached Cuttack. Today Kerala will be playing without Sanju Samson. This reminds me off 90s Indian team without Sachin. I don't think we will cross 100 without Sanju pic.twitter.com/tiuPi1TAj0— 𝗕𝗥𝗨𝗧𝗨 (@Brutu24) December 8, 2025 -
కోహ్లి, రోహిత్‌లకు షాకిచ్చిన గౌతమ్ గంభీర్!
వన్డే ప్రపంచకప్-2027లో టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆడుతురా? అంటే అవునానే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ సీనియర్ క్రికెటర్లు ఇద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో రో-కో అదరగొట్టారు.కోహ్లి రెండు సెంచరీలతో సత్తాచాటి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలవగా.. రోహిత్ కూడా పరుగులు వరద పారించాడు. ప్రస్తుతం ఒకే ఫార్మాట్లో ఆడుతున్నప్పటికి మిగితా క్రికెటర్ల కంటే చాలా యాక్టివ్‌గా, ఫిట్‌గా ఉన్నారు. వారి వయస్సు వారి జోరుకు అడ్డు కావడం లేదు.భారత క్రికెట్‌కే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. దీంతో రో-కో వన్డే ప్రపంచకప్‌లో కచ్చితంగా ఆడుతారని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే ప్రపంచకప్ ప్రణాళికలలో రోహిత్-కోహ్లి ఉన్నారా లేదా అన్నది భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు.వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డే అనంతరం రోహిత్, కోహ్లిల భవిష్యత్తుపై గంభీర్‌ను విలేకరులు ప్రశ్నించారు. "రోహిత్, కోహ్లిలు ప్రపంచ స్థాయి ఆటగాళ్లు. డ్రెస్సింగ్ రూమ్‌లో వారి అనుభవం చాలా ముఖ్యం. వారిద్దరూ భారత్ తరపున చాలా కాలంగా ఇలాంటి ప్రదర్శనలే చేస్తున్నారు.రాబోయో రోజుల్లో కూడా తమ ఫామ్‌ను కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. ఇది 50 ఓవర్ల ఫార్మాట్లో చాలా ముఖ్యం. అయితే వన్డే ప్రపంచకప్‌కు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది. మనం వర్తమానంలో ఉండటం ముఖ్యం. జట్టులోకి వచ్చే యువ ఆటగాళ్లు తమ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి" అని గంభీర్ పేర్కొన్నాడు.చదవండి: సూర్యను కెప్టెన్‌గా తీసేయండి..! అతడే సరైనోడు: గంగూలీ -
నితీష్ నిజంగా ఆల్‌రౌండరేనా..?
నితీశ్ కుమార్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ నుండి మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన ఏకైక క్రికెటర్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టెస్టు అరంగేట్రం చేసిన నితీశ్.. ఆస్ట్రేలియా గడ్డపై సత్తాచాటాడు. ప్రతిష్టాత్మక మెల్బోర్న్ మైదానంలో సెంచరీ చేసి ఆపై భారత జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా మారాడు. గతేడాది టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేసిన నితీశ్ రెడ్డి.. ఈ ఏడాది ఆస్ట్రేలియా టూర్లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అయితే అద్భుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్న నితీశ్‌ను టీమ్ మెనెజ్‌మెంట్ మాత్రం సరిగ్గా ఉపయోగించుకోవడంలో విఫలమైంది.నితీశ్ రోల్ ఏంటి?హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీరును చూస్తుంటే నితీశ్ నిజంగా ఆల్‌రౌండరేనా సందేహం వ్యక్తమవుతోంది. నితీశ్ ప్రధాన జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికి తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ నితీశ్ తిరిగి స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. అయితే ఈ సిరీస్‌లో నితీశ్‌తో కనీసం పది ఓవర్లు కూడా బౌలింగ్ చేయించలేదు.ఆ తర్వాత సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపికైనప్పటికి ఈడెన్ గార్డెన్స్ టెస్టు ముందు అతడిని జట్టు నుంచి రిలీజ్ చేశారు. అయితే కోల్‌కతా టెస్టులో భారత్ ఘోర ఓటమి పాలవ్వడం, శుభ్‌మన్ గిల్ గాయపడడంతో అతడికి మళ్లీ పిలుపు నిచ్చారు.అయితే గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్టు తుది జట్టులో నితీశ్‌కు చోటు దక్కింది. కానీ ఈ మ్యాచ్‌లో కూడా నితీశ్‌కు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లభించలేదు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం పది ఓవర్లు మాత్రమే నితీశ్ వేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 ఓవర్లు పైగా బౌలింగ్ చేస్తే.. నితీశ్‌కు కేవలం 6 ఓవర్లు దక్కాయి. నితీశ్ తన మీడియం పేస్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు.ఇంతకుముందు ఆసీస్, ఇంగ్లండ్ టూర్లలో బంతితో కూడా నితీశ్ సత్తాచాటాడు. కానీ స్వదేశంలో టీమ్ మేనేజ్మెంట్ ఎందుకు బౌలింగ్ చేయించడం లేదో ఆర్ధం కావడం లేదు. అదేవిధంగా ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ రెండు మ్యాచ్‌లు ఆడి కేవలం 5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు.దీంతో గంభీర్‌పై అశ్విన్, ఆకాష్ చోప్రా వంటి మాజీలు విమర్శలు వర్షం కురిపించారు. హార్దిక్ పాండ్యా స్ధానంలో అతడిని జట్టులోకి తీసుకున్నప్పుడు ఎందుకు బౌలింగ్ చేయించడం లేదని అశ్విన్ ప్రశ్నించాడు.నితీశ్‌కు నో ఛాన్స్సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌కు కూడా నితీశ్ ఎంపికయ్యాడు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. ప్రధాన ఆల్‌రౌండర్‌గా జట్టులోకి తీసుకుని అతడిని బెంచ్‌కే పరిమితం చేయడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. అదేవిధంగా మొన్నటివరకు టీ20ల్లో భాగంగా ఉన్న నితీశ్‌ను పాండ్యా రావడంతో జట్టు నుంచి తప్పించారు.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక భారత జట్టులో ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్‌కు చోటు దక్కలేదు. దీనిబట్టి నితీశ్ టీ20 ప్రపంచకప్ ప్రణాళికలలో లేనిట్లు తెలుస్తోంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో కూడా నితీశ్ ఆడే సూచనలు కన్పించడం లేదు. దీంతో ఆరు నెలల తర్వాత శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు నితీశ్ తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశముంది. ఈ సిరీస్ శ్రీలంకలో జరగనుందున నితీశ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో కచ్చితంగా చోటు దక్కుతుందో లేదో తెలియదు. ఉపఖండ పిచ్‌లు ఎక్కువ స్పిన్‌కు అనుకూలించనుందన అక్షర్, కుల్దీప్, జడేజాలతో భారత్ ఆడే ఛాన్స్ ఉంది.చదవండి: సూర్యను కెప్టెన్‌గా తీసేయండి..! అతడే సరైనోడు: గంగూలీ -
సూర్యను కెప్టెన్‌గా తీసేయండి..! అతడే సరైనోడు: గంగూలీ
భారత పురుషల క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండేవిధంగా బీసీసీఐ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో టీమిండియా సారథిగా శుభ్‌మన్ గిల్ ఉండగా.. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపిస్తున్నాడు. ఈ ఏడాది మేలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన భారత టెస్టు జట్గు పగ్గాలను గిల్ చేపట్టాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌కు ముందు వన్డే జట్టు బాధ్యతలను కూడా గిల్‌కే బీసీసీఐ అప్పగించింది. అంతేకాకుండా టీ20ల్లో సూర్యకు డిప్యూటీగా గిల్‌ను ఎంపిక చేశారు.దీంతో రాబోయో రోజుల్లో పొట్టి క్రికెట్లో కూడా గిల్‌ను సారథిగా నియమించే యోచనలో ఉన్నట్లు ఆర్ధమవుతోంది. అయితే టీ20 ప్రపంచకప్-2024 విజయం తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. అతడి స్ధానంలో కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా లేదా జస్ప్రీత్ బుమ్రా ఎంపిక అవుతారని అంతా భావించారు. కానీ బీసీసీఐ మాత్రం జట్టు బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించింది. అయితే సూర్యను కెప్టెన్‌గా ఎంపిక చేయడాన్ని చాలా మంది తప్పు బట్టారు. కానీ సూర్య మాత్రం తన అద్భుత కెప్టెన్సీతో జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. అతడి నాయకత్వంలో భారత్ ఆడిన 22 మ్యాచ్‌లలో కేవలం రెండింట మాత్రమే ఓడిపోయింది.అయినప్పటికి టీ20ల్లో కూడా గిల్‌ను కెప్టెన్‌గా చేయాలని చాలా మంది బీసీసీఐని సూచిస్తున్నారు. ఈ జాబితాలోకి తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేరాడు. అన్ని ఫార్మాట్లలో గిల్‌ను కెప్టెన్‌గా నియమించాలని గంగూలీ అభిప్రాయపడ్డాడు."సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా ఈడెన్ గార్డెన్స్‌లో ఒకరితో నాకు ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. శుభ్‌మన్ గిల్ టీ20ల్లో కూడా కెప్టెన్‌గా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఒకరు నన్ను అడిగారు. వెంటనే నేను అవునాని సమాధానమిచ్చాను. అతడికి అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి.శుభ్‌మన్ ఏ ఫార్మాట్లో నైనా జట్టును నడిపించగలడు అని చెప్పా. మూడు నెలల క్రితం అతడు ఇంగ్లండ్‌లో ఏమి చేశాడో మనమందరం చూశాము. బ్యాటింగ్, కెప్టెన్సీతో అదరగొట్టాడు. రోహిత్ శర్మ, కోహ్లి వంటి సీనియర్లు లేనప్పటికి అతడు తన కెప్టెన్సీతో అద్భుతం చేశాడు" అని 'కెప్టెన్'స్ కామ్' పోడ్కాస్ట్లో దాదా పేర్కొన్నాడు.చదవండి: మంధానతో పెళ్లి క్యాన్సిల్.. పలాష్ ముచ్చల్ ఏమన్నాడంటే? -
సూపర్ సెంచరీ తర్వాత యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం
దక్షిణాఫ్రికాపై మూడో వన్డేలో సూపర్ సెంచరీ అనంతరం టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన దేశవాలీ జట్టు ముంబై తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు.జైస్వాల్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో చివరిగా 2023-24 ఎడిషన్‌లో కనిపించాడు. ఈ టోర్నీలో అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. 26 ఇన్నింగ్స్‌ల్లో 136.42 స్ట్రయిక్‌రేట్‌తో 648 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. త్వరలో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో జైస్వాల్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. జైస్వాల్‌కు గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్లో (టీమిండియా) అవకాశాలు రావడం లేదు. అభిషేక్ శర్మ విధ్వంసకర ప్రదర్శనలతో జైస్వాల్ స్థానాన్ని ఆక్రమించాడు.ఇదిలా ఉంటే, భారత వన్డే వెటరన్ స్టార్ రోహిత్ శర్మ కూడా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఆడతాడని ప్రచారం జరుగుతుంది. టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్‌మ్యాన్ ఈ దేశవాలీ టీ20 టోర్నీ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశాడని సమాచారం. రోహిత్ కానీ జైస్వాల్ కానీ ముంబై జట్టుకు ఎప్పుడు అందుబాటులోకి వస్తారనే దానిపై అధికారిక సమాచారం లేదు.ప్రస్తుతం ఎడిషన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో ఉన్న ముంబై ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి ఎలైట్ గ్రూప్-ఏలో టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. ఈ జట్టుకు నాకౌట్ బెర్త్ ఇదివరకే ఖరారైంది. ఈ ఎడిషన్‌లో శార్దూల్ ఠాకూర్ నేతృత్వంలోని ముంబై జట్టు అదిరిపోయే ప్రదర్శనలు చేస్తుంది. యువ ఓపెనర్ ఆయుశ్ మాత్రే వరుసగా రెండు సెంచరీలతో సత్తా చాటాడు. శార్దూల్ ఠాకూర్ స్వయంగా ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబై తమ చివరి గ్రూప్ మ్యాచ్‌ను డిసెంబర్ 8న ఒడిషాతో ఆడనుంది. -
తెలివిగా ఆడలేకపోయాం.. టీమిండియా నాణ్యత చూపించింది: బవుమా
విశాఖ వేదికగా భారత్‌తో నిన్న (డిసెంబర్ 6) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. కీలకమైన టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌లో తడబడిన ఆ జట్టు.. ఆ తర్వాత బౌలింగ్‌లో పూర్తిగా చేతులెత్తేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సిరీస్‌లో తొలిసారి టాస్ గెలిచిన భారత్ పరిస్థితులను అద్భుతంగా సద్వినియోగం చేసుకొని సునాయాస విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో.. ఆతర్వాత బ్యాటింగ్‌లో భారత ఆటగాళ్లు చెలరేగిపోయారు. బౌలింగ్‌లో కుల్దీప్, ప్రసిద్ద్ కృష్ణ సత్తా చాటగా.. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీతో.. రోహిత్, కోహ్లి బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో రాణించారు. ఈ గెలుపుతో భారత్ 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ మ్యాచ్‌ను మరింత ఉత్కంఠభరితంగా చేయాలని అనుకున్నాం. కానీ బోర్డుపై సరిపడా పరుగులు పెట్టలేకపోయాం. ఇన్నింగ్స్ మధ్యలో వికెట్లు బహుమతిగా ఇచ్చేయడం వల్ల ఒత్తిడి పెరిగింది. 50 ఓవర్ల మ్యాచ్‌లో ఆలౌట్ కావడం ఎప్పుడూ కష్టమే. డికాక్ అద్భుతంగా ఆడినా, ఇతర బ్యాటర్ల నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. కీలక సమయాల్లో భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యాం. అందువల్లే జట్టు కష్టాల్లో పడింది. వ్యక్తిగతంగా నా ఇన్నింగ్స్‌కు శుభారంభం లభించినా, ఆతర్వాత దారి తప్పాను. మొదటి రెండు వన్డేల్లో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ధైర్యం చూపాము. కానీ ఈ మ్యాచ్‌లో పరిస్థితులు భిన్నంగా ఉండటంతో వికెట్లు కోల్పోయాము. తొలుత బంతితో బాగా పోరాడాం. మొదటి స్పెల్‌లో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ బోర్డుపై సరిపడా స్కోర్ లేకపోవడంతో భారత బ్యాటర్లు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. మొత్తంగా భారత జట్టు తమ నాణ్యతను చూపించింది. మేము తెలివిగా ఆడలేకపోయాముం. ఈ సిరీస్‌లో చాలా పాఠాలు నేర్చుకున్నాము. జట్టుగా ఎదిగాము. మేము ఎప్పుడూ ప్రత్యర్థిపై దాడి చేయాలని మాట్లాడుకుంటాం. భారత్‌కి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నా, వారిపై ఒత్తిడి పెట్టగలిగాం. పరిస్థితులను గుర్తించి మరింత తెలివిగా ఆడటం నేర్చుకోవాలి. పది బాక్సుల్లో ఆరు లేదా ఏడు టిక్ చేశామని అనుకుంటున్నానని బవుమా అన్నాడు. -
సిరీస్ మొత్తంలో గర్వపడిన సందర్భం అదే: కేఎల్ రాహుల్
విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో నిన్న (డిసెంబర్ 6) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా అలవోకగా విజయం సాధించింది. తద్వారా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటింది. తొలుత బౌలర్లు.. ఆతర్వాత బ్యాటర్లు అద్భుతంగా రాణించి ఏకపక్ష విజయాన్నందించారు.మ్యాచ్ అనంతరం కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందిస్తూ ఇలా అన్నాడు. అతని మాటల్లో.. టాస్ గెలుపు చాలా కీలకం. టాస్ తప్ప ఈ మ్యాచ్ గెలుపులో నా పాత్ర ఏమీ లేదు. ఈ సిరీస్ మొత్తంలో గర్వపడిన సందర్భం టాస్ గెలిచినప్పుడే.తొలి రెండు వన్డేల్లో టాస్ ఓడటం వల్ల సెకెండ్ ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేయవల్సి వచ్చింది. మంచు కురిసే వేళల్లో అది బౌలర్లకు విషమ పరీక్ష. ఈ రోజు టాస్ గెలిచి బౌలర్లను ఇబ్బందులకు గురి కాకుండా కాపాడాను.పిచ్ బ్యాటింగ్‌కు చాలా బాగుంది. అయినా మా బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి వికెట్లు సాధించారు. ప్రసిద్ద్ తొలుత ఇబ్బంది పడినా, ఆతర్వాతి స్పెల్‌లో మ్యాచ్ గతినే మార్చేశాడు. ఆతర్వాత కుల్దీప్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వారి తరఫున డికాక్ అద్భుతంగా ఆడాడు. అతడి వికెట్ చాలా కీలకం. సిరీస్ గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒత్తిడిని బాగా హ్యాండిల్ చేశాం. సిరీస్ ఆధ్యాంతం సౌతాఫ్రికా ఆటగాళ్లు అద్బుతంగా బ్యాటింగ్ చేశారు. మా బౌలర్లపై అధికమైన ఒత్తిడి ఉండింది. రెండో వన్డేలో అదృష్టం మా పక్షాన లేదు. అందుకే ఓడాం.కాగా, నిన్నటి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది. ప్రసిద్ద్ కృష్ణ (9.5-0-66-4), కుల్దీప్ యాదవ్ (10-1-41-4) అద్భుతంగా బౌలింగ్ చేసి సౌతాఫ్రికాను 270 పరుగులకే పరిమితం చేశారు. డికాక్ (106) ఒక్కడే సెంచరీతో పోరాటం చేశాడు. బవుమా (48) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. యశస్వి జైస్వాల్ (116 నాటౌట్) సూపర్ సెంచరీతో.. రోహిత్ (75), కోహ్లి (65 నాటౌట్) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో చెలరేగారు. ఫలితంగా భారత్ 39.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. -
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat kohli) ఖాతాలో మరో రికార్డు చేరింది. సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలవడంతో పురుషుల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలిచిన ఆటగాడిగా అవతరించాడు. ఈ క్రమంలో మరో దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టాడు. సచిన్ ఖాతాలో 19 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఉండగా.. విరాట్ ఖాతాలో 20వ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు చేరింది. ఈ విభాగంలో విరాట్, సచిన్ తర్వాతి స్థానాల్లో షకీబ్ అల్ హసన్ (17), జాక్ కల్లిస్ (14), సనత్ జయసూర్య (13), డేవిడ్ వార్నర్ (13) ఉన్నారు.జయసూర్య రికార్డు సమంప్రత్యేకించి వన్డే క్రికెట్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ రెండో స్థానానికి ఎగబాకాడు. విరాట్‌కు వన్డేల్లో ఇది 11వ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు. ఈ అవార్డుతో విరాట్ సనత్ జయసూర్య రికార్డును సమం చేశాడు. జయసూర్య ఖాతాలోనూ 11 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలిచిన ఆటగాడిగా సచిన్ చలామణి అవుతున్నాడు.కాగా, సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లి అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా రెండు శతకాలు (135, 102) సహా చివరి మ్యాచ్‌లో అజేయమైన అర్ద సెంచరీ (65) చేశాడు. ఈ ప్రదర్శనలకు గానూ అతనికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. టీ20లకు, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతూ, ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.జైస్వాల్ సూపర్ సెంచరీ.. సిరీస్ కైవసం చేసుకున్న భారత్విశాఖ వేదికగా నిన్న (డిసెంబర్ 6) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. డికాక్ (106) సెంచరీ సాయంతో 270 పరుగులు చేయగా.. యశస్వి జైస్వాల్ (116 నాటౌట్) సూపర్ సెంచరీ.. రోహిత్ (75), కోహ్లి (65 నాటౌట్) అర్ద సెంచరీలతో చెలరేగడంతో భారత్ 39.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. -
వైజాగ్ వన్డేలో టీమిండియా జయభేరి.. ఫ్యాన్స్ సందడి (ఫొటోలు)
-
మూడో వన్డేలో దక్షిణాఫ్రికా చిత్తు.. సిరీస్ భారత్‌దే
వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. పర్యాటక ప్రోటీస్ జట్టును 9 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో రాహుల్ సేన సొంతం చేసుకుంది. 271 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 39.5 ఓవర్లలో ఛేదించింది.జైశ్వాల్ సెంచరీ..లక్ష్య చేధనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ తొలి వికెట్‌కు 155 పరుగుల అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 75 పరుగులు చేసి సెంచరీ దిశగా వెళ్తున్న రోహిత్‌ను స్పిన్నర్ కేశవ్ మహారాజ్ పెవిలియన్‌కు పంపాడు. కానీ జైశ్వాల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రత్యర్ధి బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ తన తొలి వన్డే సెంచరీ మార్క్‌ను జైశ్వాల్ అందుకున్నాడు. ఈ ముంబై ఆటగాడు 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక రోహిత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు.సఫారీ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65 పరుగులు చేసి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మహారాజ్‌ఒక్కడే వికెట్ సాధించాడు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.Look at what it means to him! 🥳What a special knock this has been from Yashasvi Jaiswal 🙌Updates ▶️ https://t.co/HM6zm9o7bm#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/BHyNjwOGWY— BCCI (@BCCI) December 6, 2025డికాక్ సెంచరీ వృథా..అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రోటీస్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు 106 పరుగులు) సెంచరీతో సత్తాచాటగా.. కెప్టెన్ బవుమా(48) రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా నాలుగు వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించాడు. ఈ ఓటమితో డికాక్ సెంచరీ వృథా అయిపోయింది.Virat Kohli in this series :Innings -3 Runs - 302Avg. - 151SR - 117.05100s- 250s-1Should get Man of the Series.#ViratKohli𓃵 pic.twitter.com/NVeNDgTqU2— Pedriverse (@Cules651) December 6, 2025చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బ్రేక్ -
యశస్వి జైశ్వాల్ సూపర్ సెంచరీ
సౌతాఫ్రికాతో తొలి రెండు వన్డేల్లో విఫలమైన టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఎట్టకేలకు తన ఫామ్‌ను అందుకున్నాడు. వైజాగ్ వేదికగా జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో జైశ్వాల్ సెంచరీతో చెలరేగాడు.271 పరుగుల లక్ష్య చేధనలో జైశ్వాల్ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తొలుత ఆచితూచి ఆడిన యశస్వి.. క్రీజులో సెటిల్ అయ్యాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకు పడ్డాడు. వైజాగ్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. జైశూ 111 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో తన వన్డే సెంచరీ మార్క్ అందుకున్నాడు. శతక్కొట్టగానే జైశ్వాల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గాల్లోకి జంప్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.కాగా మొదటి రెండు వన్డేల్లో ఈ ముంబై ఆటగాడు విఫలం కావడంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని చాలా మంది డిమాండ్ చేశారు. కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం జైశ్వాల్‌పై నమ్మకం ఉంచాడు. దీంతో తనకు లభించిన అవకాశాన్ని జైశ్వాల్ అందిపుచ్చుకున్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడడంతో జైశ్వాల్‌కు జట్టులో చోటుదక్కింది. మళ్లీ గిల్ తిరిగొస్తే జైశ్వాల్ బ్యాకప్ ఓపెనర్‌గానే కొనసాగనున్నాడు. ఇక వైజాగ్ వన్డేలో టీమిండియా విజయానికి చేరువైంది. సిరీస్ విజయానికి భారత్‌కు ఇంకా 29 పరుగులు కావాలి. క్రీజులో కోహ్లి(46), జైశ్వాల్(107) ఉన్నారు.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బ్రేక్ -
ముఖం మాడ్చుకున్న కుల్దీప్!.. రోహిత్ ఇలా చేశావేంటి?
సౌతాఫ్రికాతో మూడో వన్డేలో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొట్టాడు. విశాఖపట్నం వేదికగా నిర్ణయాత్మక మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. తద్వారా సౌతాఫ్రికా మీద ఏకంగా ఐదుసార్లు.. నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఏకైక భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు.మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రాంచిలో భారత్ గెలవగా.. రాయ్‌పూర్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఈ క్రమంలో 1-1తో సమం కాగా.. శనివారం నాటి విశాఖపట్నం మ్యాచ్‌తో సిరీస్ ఫలితం తేలనుంది. వైజాగ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.270 పరుగులకు ఆలౌట్కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) నిర్ణయాన్ని సమర్థించేలా భారత బౌలర్లు మెరుగ్గా రాణించి.. సఫారీలను 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ చేశారు. పేసర్లలో ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. అర్ష్‌దీప్ సింగ్ ఒక వికెట్ తీశాడు. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో దుమ్ములేపగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు.ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా పది ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన కుల్దీప్ యాదవ్.. కేవలం 41 పరుగులు ఇచ్చాడు. డెవాల్డ్ బ్రెవిస్ (29), మార్కో యాన్సెన్ (17), కార్బిన్ బాష్ (9) రూపంలో ముగ్గురు డేంజరస్ ప్లేయర్లను వెనక్కి పంపిన కుల్దీప్.. లుంగి ఎంగిడి (1)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. పదే పదే అప్పీలు చేస్తూ.. అయితే, ఎంగిడి ఎల్బీడబ్ల్యూ చేసే క్రమంలో కుల్దీప్ యాదవ్ రివ్యూ కోసం ప్రయత్నించిన తీరు.. అందుకు రోహిత్ శర్మ స్పందించిన విధానం నవ్వులు పూయించింది. ఎంగిడి అవుట్ అయ్యాడంటూ కుల్దీప్ పదే పదే అప్పీలు చేస్తూ.. రివ్యూ తీసుకోవాల్సిందిగా కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను కోరాడు. అయితే, అందుకు అతడు నిరాకరించాడు.ముఖం మాడ్చుకున్న కుల్దీప్ఇంతలో రోహిత్ శర్మ జోక్యం చేసుకుంటూ.. ‘‘అబే.. రివ్యూ అవసరం లేదు’’ అంటూ నవ్వుతూ కుల్దీప్ను టీజ్ చేశాడు. దీంతో ఓవైపు రాహుల్.. మరోవైపు విరాట్ కోహ్లి కూడా నవ్వులు చిందించారు. అప్పటికే ముఖం మాడ్చుకున్న కుల్దీప్ నవ్వలేక నవ్వుతూ తన స్థానంలోకి వెళ్లాడు. అయితే, కొద్దిసేపటికే అతడు అనుకున్నట్లుగా ఎంగిడిని పెవిలియన్‌కు పంపడం విశేషం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.చదవండి: దుమ్ములేపిన మహ్మద్ షమీ.. అయినా ఘోర పరాభవంThese are the moments we pay our internet bills for! 😉😁😍#INDvSA 3rd ODI, LIVE NOW 👉 https://t.co/Es5XpUmR5v pic.twitter.com/hPZJFPlJ0G— Star Sports (@StarSportsIndia) December 6, 2025 -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన మైలు రాయిని చేరుకున్నాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) కలిపి 20,000 పరుగులను రోహిత్ పూర్తి చేసుకున్నాడు. వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్‌ను హిట్‌మ్యాన్ అందుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన నాలుగో ఆటగాడిగా రోహిత్ రికార్డులెక్కాడు.రోహిత్ కంటే ముందు సచిన్ టెండూల్కర్( (34357), విరాట్ కోహ్లీ (27910), రాహుల్ ద్రవిడ్ (24208) ఈ ఘనత సాధించారు. రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో 11486, టెస్టుల్లో 4301, టీ20ల్లో 4231 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా తన అంతర్జాతీయ కెరీర్లో ఈ ముంబైకర్ 50 సెంచరీలు నమోదు చేశాడు.వన్డే ఇంటర్నేషనల్స్ చరిత్రలో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ కొనసాగుతున్నాడు. అదేవిధంగా వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రికార్డు కూడా రోహిత్(264) పేరిటే ఉంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75 పరుగులు చేశాడు. హిట్‌మ్యాన్ ఈ హాఫ్ సెంచరీతో మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ రికార్డు బ్రేక్👉సౌతాఫ్రికాపై అత్యధిక అంతర్జాతీయ పరుగులు సాధించిన భారత ఓపెనర్‌గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ ఇప్పటివరకు ఓపెనర్‌గా సఫారీలపై మూడు ఫార్మాట్లు కలిపి 1758 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(1734) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సచిన్ రికార్డును హిట్‌మ్యాన్ బ్రేక్ చేశాడు.👉అదేవిధంగా వన్డేల్లో ఓపెనర్‌గా అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన మూడో ఓపెనర్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు 79 సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు. ఈ క్రమంలో విండీస్ లెజెండ్ క్రిస్ గేల్(78)ను అధిగమించాడు.డికాక్ సెంచరీ..ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రోటీస్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు 106 పరుగులు) సెంచరీతో సత్తాచాటగా.. కెప్టెన్ బవుమా(48) రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా నాలుగు వికెట్లతో సఫారీలను దెబ్బతీశారు. అనంతరం లక్ష్య చేధనలో భారత్ నిలకడగా ఆడుతోంది. 29 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 178 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైశ్వాల్(83), విరాట్ కోహ్లి(7) ఉన్నారు.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన డికాక్.. ప్రపంచ క్రికెట్లోనే! -
టీమిండియాకు శుభవార్త.. స్టార్ ప్లేయర్ వచ్చేస్తున్నాడు
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. సఫారీ జట్టుతో తొలి టీ20 నుంచే అతడు అందుబాటులోకి రానున్నాడు.ఫిట్నెస్ సాధించాడుభారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) వర్గాలు ఈ విషయాన్ని శనివారం ధ్రువీకరించాయి. గిల్ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించినట్లు తెలిపాయి. ఈ మేరకు.. ‘‘CoEలో శుబ్‌మన్ గిల్ తన పునరావాసం పూర్తి చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లు ఆడేందుకు ఫిట్నెస్ సాధించాడు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబరు 9న కటక్ వేదికగా భారత్- సౌతాఫ్రికా (IND vs SA T20Is) మధ్య మొదలయ్యే టీ20 సిరీస్‌కు గిల్ అందుబాటులోకి రానున్నాడు. కాగా స్వదేశంలో టీమిండియా సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా తొలుత టెస్టు సిరీస్ జరుగగా.. సఫారీల చేతిలో భారత జట్టు 2-0తో వైట్‌వాష్‌కు గురైంది.మెడనొప్పి కారణంగా..ఇదిలా ఉంటే.. తొలి టెస్టు సందర్భంగానే గిల్ గాయపడి జట్టుకు దూరమయ్యాడు. మెడనొప్పి కారణంగా బ్యాటింగ్ మధ్యలోనే నిష్క్రమించిన గిల్.. ఆ తర్వాత ఆస్పత్రిలో చేరాడు. ఐసీయూలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన తర్వాత.. అతడు రెండో టెస్టుతో పాటు.. వన్డే సిరీస్ మొత్తానికి దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది.ఈ క్రమంలో గిల్ టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో ఉంటాడో.. లేదోనన్న సందేహాలు నెలకొన్నాయి. అయితే, ప్రొటిస్ టీమ్‌తో పొట్టి సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో అతడికి చోటిచ్చిన యాజమాన్యం ఫిట్నెస్ ఆధారంగా జట్టుతో కొనసాగేది.. లేనిది తేలుతుందని పేర్కొంది. తాజాగా గిల్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించినట్లు వెల్లడించింది.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్, ఫిట్‌నెస్‌కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్👉మొదటి టీ20: డిసెంబరు 9- కటక్, ఒడిశా👉రెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్పూర్, చండీగఢ్👉మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్👉నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్👉ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్, గుజరాత్.చదవండి: టెస్టుల్లో వెస్టిండీస్ క్రికెటర్ ప్రపంచ రికార్డు -
సౌతాఫ్రికా ఆలౌట్.. టీమిండియా లక్ష్యం ఎంతంటే?
సౌతాఫ్రికాతో మూడో వన్డేలో భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ప్రత్యర్థి జట్టును 270 పరుగులకు పరిమితం చేశారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాంచిలో టీమిండియా.. రాయ్‌పూర్‌లో సౌతాఫ్రికా గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం నాటి మూడో వన్డే (IND vs SA 3rd ODI) ద్వారా సిరీస్ ఫలితం తేలనుంది. విశాఖపట్నం వేదికగా టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఫలితంగా తొలుత బ్యాటింగ్‌కు దిగిన ప్రొటిస్ జట్టుకు భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) ఆదిలోనే షాకిచ్చాడు. టీమిండియా బౌలింగ్ అటాక్‌ను ఆరంభించిన ఈ లెఫ్టార్మ్ బౌలర్.. ఐదో బంతికే ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (0)ను పెవిలియన్‌కు పంపాడు. అయితే, మరో ఓపెనర్ క్వింటన్ డికాక్, వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ టెంబా బవుమాతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.శతక్కొట్టిన డికాక్ఈ క్రమంలో డికాక్ సెంచరీ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు- 106 పరుగులు) పూర్తి చేసుకుని జోరు కనబరచగా ప్రసిద్ కృష్ణ అతడిని బౌల్డ్ చేశాడు. మరోవైపు.. బవుమా అర్ధ శతకం దిశగా సాగుతున్న వేళ.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో విరాట్ కోహ్లి (Virat Kohli)కి క్యాచ్ ఇచ్చి 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.మార్క్రమ్ విఫలంమిగతా వారిలో మాథ్యూ బ్రీట్జ్కే (24), డెవాల్డ్ బ్రెవిస్ (29) మాత్రమే చెప్పుకోగదగ్గ స్కోర్లు చేశారు. ప్రధాన బ్యాటర్లలో ఐడెన్ మార్క్రమ్ (1) దారుణంగా విఫలం కాగా.. ఆల్రౌండర్లలో మార్కో యాన్సెన్ (17), కార్బిన్ బాష్ (9) తేలిపోయారు. లుంగి ఎంగిడి ఒక్క పరుగుకే అవుట్ కాగా.. ఆఖర్లో కేశవ్ మహరాజ్ మెరుగైన (20 నాటౌట్) బ్యాటింగ్‌తో అలరించాడు. ప్రసిద్ బౌలింగ్ ఒట్నీల్ బార్ట్‌మన్ పదో వికెట్‌గా వెనుదిరగడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసిపోయింది.చెరో నాలుగు పంచుకున్న ప్రసిద్, కుల్దీప్ఈ క్రమంలో 47.5 ఓవర్లలో సౌతాఫ్రికా 270 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో పేసర్ ప్రసిద్ కృష్ణ డికాక్, బ్రీట్జ్కే, మార్క్రమ్ రూపంలో మూడు కీలక వికెట్లు కూల్చడంతో పాటు బార్ట్‌మన్‌ను అవుట్ చేశాడు. మరోవైపు.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బ్రెవిస్, యాన్సెన్. బాష్, ఎంగిడిలను పెవిలియన్‌కు పంపాడు. మిగిలిన వారిలో అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ దక్కించుకున్నారు. సౌతాఫ్రికా విధించిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.చదవండి: టెస్టుల్లో వెస్టిండీస్ క్రికెటర్ ప్రపంచ రికార్డు -
చరిత్ర సృష్టించిన డికాక్.. ప్రపంచ క్రికెట్లోనే!
టీమిండియాతో వన్డే సిరీస్‌లో సౌతాఫ్రికా స్టార్ వికెట్ బ్యాటర్ క్వింటన్ డికాక్ ఎట్టకేలకు తన ఫామ్‌ను అందుకున్నాడు. వైజాగ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో డికాక్ సెంచరీతో చెలరేగాడు. తొలి రెండు వన్డేల్లో తడబడిన డికాక్.. ఈ మ్యాచ్‌లో మాత్రం భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. వైజాగ్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు అని తేడా లేకుండా ఈ వెటరన్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో 80 బంతుల్లో డికాక్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 89 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 8 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్డేల్లో అతడికి ఇది 23వ సెంచరీ కావడం గమనార్హం. అదేవిధంగా భారత్‌పై 7వ వన్డే సెంచరీ. తద్వారా డికాక్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన డికాక్..ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన వికెట్ కీపర్‌గా క్వింటన్ డికాక్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్, శ్రీలంక లెజెండ్ సంగర్కర పేరిట ఉండేది. గిల్లీ శ్రీలంకపై 6 సెంచరీలు సాధించగా.. సంగక్కర భారత్‌పై సరిగ్గా ఆరు వన్డే సెంచరీలు నమోదు చేశాడు. తాజా మ్యాచ్‌తో వీరిద్దరిని డికాక్(7) అధిగమించాడు.అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్‌గా కుమార సంగక్కర రికార్డును డి కాక్ సమం చేశాడు. సంగక్కర తన వన్డే కెరీర్లో 23 సెంచరీలు చేయగా.. డికాక్ కూడా సరిగ్గా ఇప్పటివరకు 23 సెంచరీలు చేశాడు. మరో సెంచరీ చేస్తే సంగాను డికాక్ అధిగమిస్తాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాతి స్ధానంలో షాయ్ హోప్(19), గిల్‌క్రిస్ట్(19) ఉన్నారు.విదేశీగడ్డపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ప్లేయర్‌గా సచిన్ టెండూల్కర్, సయ్యద్ అన్వర్, ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మ రికార్డును డికాక్ సమం చేశాడు. వీరిందరూ 7 సెంచరీలు విదేశాల్లో చేశారు.భారత్‌పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్‌గా శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య(7) రికార్డును డికాక్ సమం చేశాడు.చదవండి: IND vs SA: అతడెందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! గంభీర్ నమ్మకమే నిజమైంది -
అతడెందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! గంభీర్ నమ్మకమే నిజమైంది
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రయోగం ఎట్టకేలకు విజయవంతమైంది. వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో భారత్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. అందరూ ఊహించినట్టుగానే ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై వేటు పడింది.కానీ తొలి రెండు వన్డేల్లో దారుణంగా విఫలమైన పేసర్ ప్రసిద్ద్ కృష్ణపై మాత్రం టీమ్ మెనెజ్‌మెంట్ నమ్మకం ఉంచింది. కానీ గంభీర్ నమ్మకాన్ని ఈ కర్ణాటక పేసర్ తొలి స్పెల్‌లో నిలబెట్టుకోలేకపోయాడు. మొదటి స్పెల్‌లో 2 ఓవర్లు వేసిన కృష్ణ ఏకంగా 13.5 ఏకానమీతో 27 పరుగులు ఇచ్చాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 9 ఓవర్లో తన తొలి స్పెల్‌ను వేసేందుకు వచ్చిన ప్రసిద్ద్ కృష్ణను క్వింటన్ డికాక్ ఓ ఆడుకున్నాడు. దీంతో గంభీర్‌తో పాటు కృష్ణను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. అతడు తప్ప ఇంకొక బౌలర్ మీకు దొరకలేదా అంటూ నెటిజన్లు మండిడ్డారు.సీన్ రివర్స్.. అయితే కాసేపటికే ప్రసిద్ద్, గంభీర్‌ను విమర్శించిన వారే శెభాష్ అంటూ ప్రశంసించారు. ప్రసిద్ద్ కృష్ణ తన సెకెండ్ స్పెల్‌లో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్యాడు. ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లను పడగొట్టి సఫారీలను దెబ్బతీశాడు. 29వ ఓవర్ వేసిన కృష్ణ రెండో బంతికి ఇన్ ఫామ్ బ్యాటర్ బ్రీట్జ్కేను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించిన కృష్ణ.. ఆఖరి బంతికి రాయ్‌పూర్ వన్డే హీరో మార్క్రమ్ను పెవిలియన్‌కు పంపాడు.ఆ తర్వాత డికాక్‌ను కూడా అద్భుత బంతతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రసిద్ద్ తన సూపర్ బౌలింగ్‌తో తిరిగి జట్టును గేమ్‌లోకి తెచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న సౌతాఫ్రికా 38 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్(106) సెంచరీతో మెరిశాడు.What a brilliant comeback by Prasidh Krishna 👏🏻 First 2 overs - 28 runs and 0 wickets 😆Next 5 overs - 25 runs and 3 wickets 🔥 pic.twitter.com/wPIluvIgVS— Richard Kettleborough (@RichKettle07) December 6, 2025 -
ఎట్టకేలకు టాస్ గెలిచిన టీమిండియా..
టీమిండియా ఎట్టకేలకు టాస్ గెలిచింది. సౌతాఫ్రికాతో మూడో వన్డే సందర్భంగా విశాఖపట్నంలో తమ దురదృష్టానికి స్వస్తి పలికింది. 21వ ప్రయత్నంలో వన్డేల్లో తొలిసారి టాస్ గెలిచి.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అందుకే తొలుత బౌలింగ్ఈ సందర్భంగా టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బౌలింగ్ చేస్తాం. నిన్న రాత్రి ఇక్కడ మేము ప్రాక్టీస్ చేశాము. రాంచి, రాయ్‌పూర్‌లో మాదిరి కాకుండా ఇక్కడ తేమ కాస్త ఆలస్యంగా ప్రభావం చూపుతోందని గ్రహించాము.వాషీపై వేటు.. జట్టులోకి తిలక్అందుకే లక్ష్య ఛేదననే మేము ఎంచుకున్నాము. ఈ వికెట్ బాగుందనిపిస్తోంది. గత రెండు మ్యాచ్‌లలో మా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాము. పరిస్థితులకు తగ్గట్లుగా ఇంకాస్త మెరుగుపడితే అనుకున్న ఫలితం రాబట్టవచ్చు. ఈ మ్యాచ్‌లో ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నాం. వాషింగ్టన్ సుందర్ స్థానంలో తిలక్ వర్మ (Tilak Varma) తుదిజట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.గాయాలతో వారిద్దరు దూరంమరోవైపు.. సౌతాఫ్రికా సారథి టెంబా బవుమా (Temba Bavuma) సైతం టాస్ గెలిస్తే తాము తొలుత బౌలింగే ఎంచుకునే వాళ్లమని పేర్కొన్నాడు. రాంచి, రాయ్‌పూర్ మాదిరి ఇక్కడ కూడా ఆఖరి వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగితే ప్రేక్షకులు సంతోషిస్తారన్న బవుమా.. బర్గర్, డి జోర్జి స్థానాల్లో ఒట్నీల్ బార్ట్‌మన్, ర్యాన్ రికెల్టన్ తుదిజట్టులోకి వచ్చారని తెలిపాడు. బర్గర్, డి జోర్జి గాయాల కారణంగా రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నట్లు వెల్లడించాడు.ఫలితం తేల్చే మ్యాచ్‌కాగా మూడు వన్డేలో సిరీస్‌లో భాగంగా రాంచిలో తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆదివారం పదిహేడు పరుగుల తేడాతో గెలిచింది. అనంతరం రాయ్‌పూర్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా 1-1తో సిరీస్ సమం కాగా.. శనివారం నాటి విశాఖపట్నం మ్యాచ్‌లో సిరీస్ విజేత ఎవరో తేలనుంది.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మూడో వన్డే తుదిజట్లుభారత్రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్, కెప్టెన్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ.సౌతాఫ్రికార్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్క్రమ్, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్‌మన్.చదవండి: భారత్‌తో మూడో వన్డే.. సౌతాఫ్రికాకు భారీ షాకులు -
భారత్‌తో మూడో వన్డే.. సౌతాఫ్రికాకు భారీ షాకులు
భారత్‌తో కీలక మూడో వన్డేకు ముందు సౌతాఫ్రికా జట్టుకు భారీ షాక్ తగిలింది. తొలి రెండు వన్డేల్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇద్దరు స్టార్ ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. పేసర్ నండ్రీ బర్గర్ (Nandre Burger), బ్యాటర్ టోనీ డీ జోర్జి (Tony de Zorzi) గాయాల కారణంగా విశాఖపట్నం మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. సౌతాఫ్రికా క్రికెట్ ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించింది. గాయాల కారణంగా..టీమిండియాతో రాయ్‌పూర్ వేదికగా రెండో వన్డే సందర్భంగా.. ఫాస్ట్ బౌలర్ నండ్రీ బర్గర్‌కు తొడ కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. మధ్యలోనే అతడు మైదానం నుంచి నిష్క్రమించాడు. మరోవైపు.. డి జోర్జి కూడా తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరనికి శుక్రవారం స్కానింగ్‌కు పంపగా.. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది.టీ20 సిరీస్ మొత్తానికి అతడు దూరంఫలితంగా బర్గర్, డి జోర్జికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సౌతాఫ్రికా క్రికెట్ వెల్లడించింది. డి జోర్జి భారత్‌తో ఆఖరి వన్డేతో పాటు.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ మొత్తానికి కూడా దూరమైనట్లు తెలిపింది. అతడు స్వదేశానికి తిరిగి వస్తున్నట్లు పేర్కొంది. అయితే, అతడి స్థానంలో వేరే ఆటగాడిని ఎంపిక చేయలేదని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఈ సందర్భంగా వెల్లడించింది.క్వెనా మఫాకా సైతం..అదే విధంగా.. యువ ఫాస్ట్ బౌలర్ క్వెనా మఫాకా కూడా తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు తెలిపిన ప్రొటిస్ బోర్డు.. అతడు పూర్తి స్థాయిలో కోలుకోలేదని తెలిపింది. కాబట్టి టీమిండియాతో టీ20 సిరీస్ ఆరంభ మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండటం లేదని పేర్కొంది. జట్టు నుంచి అతడు నిష్క్రమించాడని.. మఫాకా స్థానంలో లూథో సిపామ్లను టీ20 జట్టులోకి చేర్చినట్లు వెల్లడించింది.టెస్టులలో పైచేయి.. వన్డేలలో 1-1తో..కాగా టీమిండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా తొలుత ఆతిథ్య జట్టును టెస్టుల్లో 2-0తో వైట్‌వాష్ చేశారు సఫారీలు.ఇక వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ ఓడిన ప్రొటిస్ జట్టు.. రెండో వన్డేలో గెలిచి 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య సిరీస్ విజేతను తేల్చే ఆఖరిదైన శనివారం నాటి మూడో వన్డేకు విశాఖపట్నం వేదిక. ఆ తర్వాత డిసెంబరు 9 నుంచి ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్‌కు తెరలేస్తుంది.చదవండి: చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేసిన వెస్టిండీస్ -
వైజాగ్ అంటే 'కింగ్'కు పూనకాలే..!
వైజాగ్ వేదికగా భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్ 6) నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే సిరీస్ కైవసం చేసుకుంటుంది. తొలి వన్డేలో భారత్, రెండో వన్డేలో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే.వైజాగ్ వన్డే ప్రారంభానికి ముందు అందరి కళ్లు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిపైనే ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఇప్పటికే వరుసగా రెండు సెంచరీలు చేసి సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లి హ్యాట్రిక్ సెంచరీ చేస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.కోహ్లి ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే ఇది సాధ్యమయ్యేలానే కనిపిస్తుంది. వైజాగ్ పిచ్ కూడా కోహ్లికి అద్భుతంగా సహకరించే అవకాశం ఉంది. ఈ మైదానం అంటే కింగ్‌కు పూనకాలు వస్తాయి. ఇక్కడ అతనాడిన 7 మ్యాచ్‌ల్లో ఏకంగా 97.83 సగటున 587 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు, 2 అర్ద శతకాలు ఉన్నాయి.స్ట్రయిక్‌రేట్ కూడా 100కు పైబడే ఉంది. ఈ గణాంకాలు చూస్తే కోహ్లి హ్యాట్రిక్ సెంచరీ లోడింగ్ అనక తప్పదు. వైజాగ్‌లో మరిన్ని పరిస్థితులు కూడా కోహ్లి హ్యాట్రిక్ సెంచరీకి అనుకూలంగా ఉన్నాయి.పిచ్ స్వభాగం కోహ్లి బ్యాటింగ్ శైలికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బౌన్స్‌కు అవకాశమున్నా, బంతి బ్యాట్ వద్దకు సలువుగా వస్తుంది. ఈ పరిస్థితి కోహ్లిని రెచ్చిపోయేలా చేస్తుంది. బలంగా షాట్లు ఆడటం కంటే, టైమింగ్, బ్యాలెన్స్, ప్లేస్‌మెంట్‌ను నమ్ముకునే కోహ్లి బంతి బ్యాట్ వద్దకు వస్తే చెలరేగిపోతాడు.కోహ్లి హ్యాట్రిక్ సెంచరీ లోడింగ్ అనడానికి వైజాగ్‌లోని చిన్న బౌండరీలు మరో కారణం. పిచ్ ఎలాగూ సహకరిస్తుంది కాబట్టి, కోహ్లి తన సహజశైలిలో పంచ్ షాట్లు, డ్రైవ్‌లు ఆడితే సులువుగా బౌండరీలు వస్తాయి. కోహ్లికి పెద్దగా స్ట్రయిక్ రొటేట్ చేసే పని కూడా ఉండదు. పిచ్ స్వభావం, చిన్న బౌండరీలు ఉండటం చేత కోహ్లి వేగంగా పరుగులు చేయడంతో పాటు భారీ సెంచరీ చేసే ఆస్కారముంది.కోహ్లి హ్యాట్రిక్ సెంచరీ లోడింగ్ అనడానికి వీటన్నిటి కంటే ముఖ్యమైన పాయింట్ మరొకటి ఉంది. అదేంటంటే.. బలహీనమైన దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్. ఈ విభాగంలో దక్షిణాఫ్రికా ఎంత బలహీనంగా ఉందో గత మ్యాచ్‌లో స్పష్టమైంది. ప్రధాన పేసర్లు ఎంగిడి, జన్సెన్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. మరో ప్రధాన పేసర్ నండ్రే బర్గర్ గాయపడ్డాడు. ఒకవేళ నేటి మ్యాచ్‌లో ఈ ముగ్గురూ బరిలోకి దిగినా పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించకపోవచ్చు. స్పిన్నర్లను కోహ్లి ఎంత అలవోకగా ఎదుర్కోగలడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ అంశాలన్నిటిని పరిగణలోకి తీసుకుంటే కోహ్లి హ్యాట్రిక్ సెంచరీ లోడింగ్ అనక తప్పదు. -
అతడు ఇంకా నేర్చుకుంటున్నాడు.. క్లారిటీతో ఉన్నాము: టీమిండియా కోచ్
భారత జట్టులో వాషింగ్టన్ సుందర్ రోల్ ఏంటి? గత కొన్ని సిరీస్‌లగా క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న. ఎందుకంటే సుందర్ మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా ఉంటున్నాడు. కానీ ఓ మ్యాచ్‌లో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడితే..మరో మ్యాచ్‌లో స్పిన్నర్‌గా తన బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. బ్యాటింగ్‌లో కూడా ఒక స్దానంలో పంపడం లేదు. ఒక మ్యాచ్‌లో మూడో స్దానం, మరో మ్యాచ్‌లో ఆరో స్దానం అలా అతడి బ్యాటింగ్ ఆర్డర్ మారుతూనే ఉంది. బౌలింగ్‌లో కూడా సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు.ఈ నేపథ్యంలో టీమ్ మెనెజ్మెంట్పై తీవ్రస్దాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జట్టులో సుందర్ రోల్‌పై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్ క్లారిటీ ఇచ్చాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గానే వాషీని జట్టులోకి తీసుకున్నట్లు టెన్ డెష్కాట్ తెలిపాడు. కాగా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో సుందర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఇప్పటివరకు ఆడిన రెండు వన్డేలలోనూ బ్యాట్‌తో పాటు బంతితో కూడా విఫలమయ్యాడు. ఈ క్రమంలో అతడిని మూడో వన్డే నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మంచు ప్రభావం కారణంగా స్పిన్నర్లు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లభించడం లేదు. అందుకే సుందర్‌కు రాంచీలో 3 ఓవర్లు, రాయ్‌పూర్‌లో 4 ఓవర్లు మాత్రమే ఇచ్చాము. అతడు ఇంకా నేర్చుకుంటున్నాడు. గత ఏడాదిగా అద్భుతంగా రాణిస్తున్నాడు. తన బ్యాటింగ్ మెరుగుపరచుకోవడానికి కూడా సుందర్ కృషి చేస్తున్నాడు అని పోస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ర్యాన్ పేర్కొన్నాడు.చదవండి: కోహ్లి, రోహిత్ కాదు.. గూగుల్‌లో ఎక్కువ మంది వెతికింది అతడినే -
‘మా అన్నయ్య వల్లే ఇదంతా.. నా జీవితమే మారిపోయింది’
భారత మహిళా క్రికెట్ జట్టు తొలి వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీ గెలవడంలో దీప్తి శర్మది కీలక పాత్ర. ఈ మెగా ఈవెంట్ ఆసాంతం అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న ఈ ఆల్‌రౌండర్.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకుంది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 టోర్నీలో దీప్తి మొత్తంగా 215 పరుగులు చేయడంతో పాటు.. 22 వికెట్ల కూల్చింది.ముఖ్యంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో దీప్తి శర్మ.. అర్ధ శతకం బాదడంతో పాటు.. ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి జట్టు గెలవడంలో కీలకంగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో మహిళల ప్రీమియర్ లీగ్ -2026 మెగా వేలంలోనూ దీప్తికి భారీ ధర దక్కింది.వేలానికి ముందు ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను వదిలేసిన యూపీ వారియర్స్.. ఏకంగా రూ. 3.2 కోట్లు వెచ్చించి తిరిగి ఆమెను సొంతం చేసుకుంది. తద్వారా డబ్ల్యూపీఎల్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ప్లేయర్‌గా దీప్తి నిలిచింది.ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టుతో కలిసి దీప్తి శర్మ.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నిర్వహించే ప్రముఖ షో.. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’కి హాజరైంది. ఈ సందర్భంగా తాను క్రికెటర్‌గా మారడానికి తన అన్నయ్యే కారణమని వెల్లడించింది.‘‘నేను క్రికెట్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చాను. మా అన్నయ్య ప్రొఫెషనల్ క్రికెటర్. ఆయన వల్లే నేనూ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. నేను వేసిన ఒక్క త్రో నా జీవిత ప్రయాణాన్నే మార్చివేసింది.ఓరోజు మా అన్నయ్య ఆడుతున్న చోటికి వెళ్లాను. అక్కడే మెట్ల మీద కూర్చుని మ్యాచ్ చూస్తున్నా. ఇంతలో బంతి నా వైపు దూసుకువచ్చింది. వేగంగా స్పందించిన నేను.. దాదాపు 40- 50 మీటర్ల దూరం నుంచి దానిని నేరుగా స్టంప్స్‌నకు గిరాటేశాను. మా అన్నయ్య చాలా సంతోషించాడు.చుట్టూ ఉన్న వాళ్లు కూడా.. ‘ఈ అమ్మాయి క్రికెట్ ఆడితే బాగుంటుంది’ అని ఉత్సాహపరిచారు. ఆరోజు నుంచి క్రికెటర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన నేను ఇంత వరకు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు’’ అని దీప్తి శర్మ హర్షం వ్యక్తం చేసింది. కాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దీప్తి సేవలకు గానూ ఆమెను పోలీస్ శాఖలో డీఎస్పీగా నియమించింది. -
మనసు మార్చుకున్న గంభీర్..!
సౌతాఫ్రికా-భారత్ మధ్య మూడో వన్డేల సిరీస్‌లో కీలక పోరుకు సమయం అసన్నమైంది. శనివారం(డిసెంబర్ 6) వైజాగ్ వేదికగా సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తుంటే.. సౌతాఫ్రికా వన్డే సిరీస్‌ను కూడా సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ ఆఖరి పోరులో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.సుందర్‌పై వేటు..ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న వాషింగ్టన్ సుందర్ తొలి రెండు వన్డేలలోనూ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. మొదటి వన్డేలో 13, రాయ్‌పూర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. బౌలింగ్‌లో కూడా ఈ తమిళనాడు ప్లేయర్ తేలిపోయాడు.దీంతో అతడిపై వేటు వేయాలని గంభీర్ అండ్ కో సిద్దమైనట్లు సమాచారం. అతడి స్దానంలో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా రిషబ్ పంత్ లేదా తిలక్ వర్మను తీసుకోవాలని టీమ్ మెనెజ్‌మెంట్ భావిస్తుందంట. మరోవైపు తీవ్ర నిరాశపరుస్తున్న ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణను కూడా తప్పించనున్నట్లు తెలుస్తోంది. అతడి స్దానంలో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌కు అవకాశమివ్వనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. నితీశ్ జట్టులోకి వస్తే బ్యాటింగ్‌తో పాటు మీడియం పేస్‌తో బౌలింగ్ కూడా చేయగలడు. ఎలాగో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా జట్టులో ఉంటారు. అంతేకాకుండా యశస్వి జైశ్వాల్‌పై కూడా వేటు పడనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడతున్నాయి. జైశ్వాల్ రెండు వన్డేలలోనూ దారుణంగా విఫలమయ్యాడు. కాగా కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత జట్టు రాయ్‌పూర్ వన్డేలో ఘోర పరాజయం పాలైంది. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని మన బౌలర్లు కాపాడుకోలేకపోయారు.సౌతాఫ్రికాతో మూడో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ/ రిషబ్ పంత్ , రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్చదవండి: ‘తిలక్, పంత్ ఉన్నా.. అతడిని నమ్మినందుకు క్రెడిట్ ఇవ్వాల్సిందే’ -
‘తిలక్, పంత్ ఉన్నా.. అతడిని నమ్మారు.. క్రెడిట్ ఇవ్వాల్సిందే’
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో ఆడిన జట్టునే.. రెండో వన్డేలోనూ కొసాగించింది టీమిండియా యాజమాన్యం. ఫలితంగా మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌కు తనను తాను నిరూపించుకునేందుకు మరో అవకాశం లభించింది.సెంచరీతో అదరగొట్టాడుఈసారి రుతురాజ్ ఎలాంటి తప్పిదమూ చేయలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాయ్‌పూర్ మైదానంలో శతక్కొట్టిన తొలి అంతర్జాతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేవలం 77 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న రుతురాజ్ (Ruturaj Gaikwad)... మొత్తంగా 83 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 105 పరుగులు రాబట్టాడు.సాధారణంగా రుతురాజ్ ఓపెనింగ్ బ్యాటర్‌గా వస్తాడు. కానీ జట్టు కూర్పు దృష్ట్యా ఈసారి అతడు మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గైర్హాజరీ కారణంగా రుతుకు జట్టులో చోటు దక్కింది. మరోవైపు.. రిషభ్ పంత్ (Rishabh Pant) నుంచి గట్టి పోటీ ఉన్నా.. యాజమాన్యం అనూహ్య రీతిలో తుదిజట్టులోనూ అతడిని ఆడించింది.ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రుతురాజ్ విషయంలో మేనేజ్మెంట్కు తప్పక క్రెడిట్ ఇవ్వాలన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..తిలక్, పంత్ ఉన్నా.. ‘‘ఒక్క మ్యాచ్‌తో ఏ ఆటగాడు తనను తాను నిరూపించుకోలేడు. కాబట్టే రుతురాజ్‌కు మేనేజ్మెంట్ మరో అవకాశం ఇచ్చింది. ఇందుకు యాజమాన్యానికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. తిలక్ వర్మ , రిషభ్ పంత్ రిజర్వు ప్లేయర్లుగా ఉన్నా రుతుకు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. అతడిని నాలుగో స్థానంలో పంపినా సెంచరీ చేసి అదరగొట్టాడు. ఇక ముందు కూడా అతడిని జట్టులో కొనసాగిస్తే టాపార్డర్‌లో ఉంటాడా? లేదంటే నాలుగో స్థానంలో ఆడతాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.తనను ఏ స్థానంలో ఆడించినా పర్లేదనే సంకేతాన్ని రుతురాజ్ సెలక్టర్లకు ఇచ్చేశాడు. కాబట్టి మూడో వన్డేలోనూ అతడిని తప్పక కొనసాగిస్తారనే భావిస్తున్నా’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.దురదృష్టవశాత్తూకాగా రాంచి వేదికగా తొలి వన్డేలో రుతు 14 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులే చేశాడు. ఒట్నీల్ బార్ట్‌మన్ బౌలింగ్‌లో రుతు ఇచ్చిన క్యాచ్‌ను డెవాల్డ్ బ్రెవిస్ సంచలన రీతిలో ఒంటిచేత్తో అందుకుని.. అతడికి రీఎంట్రీలో చేదు అనుభవం మిగిల్చాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో గెలిచిన టీమిండియా.. రెండో వన్డేలో ఓడింది. ఫలితంగా ప్రస్తుతం 1-1తో ఇరుజట్లు సమానంగా ఉండగా.. విశాఖపట్నంలో శనివారం జరిగే మూడో వన్డేతో సిరీస్ విజేత ఎవరో తేలుతుంది. చదవండి: RO-KO హవా!.. ఈ హీరోని మర్చిపోతే ఎలా? కెప్టెన్‌గానూ సరైనోడు! -
భారత్‌పై అదరగొట్టాడు.. ఐసీసీ అవార్డు రేసులోకి వచ్చాడు
సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్ సైమన్ హార్మర్ పురుషుల విభాగంలో నవంబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. గత నెలలో భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో తన అద్భుత ప్రదర్శన కారణంగానే అతడు ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.అతడితో పాటు ఈ జాబితాలో బంగ్లా దేశ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం, పాకిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నవాజ్ ఉన్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో భారత నుంచి మెన్స్ క్రికెటర్ ఒక్కరూ కూడా లేకపోవడం గమనార్హం.దుమ్ములేపిన హార్మర్..సైమన్ హార్మర్ ఆలస్యంగా అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చినా.. జాతీయ జట్టు తరఫున ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. భారత్‌తో జరిగిన సిరీస్‌లో అతడు బంతితో మ్యాజిక్ చేశాడు. అతడి స్పిన్ వలలో చిక్కుకుని భారత బ్యాటర్లు విల్లవిల్లాడారు.హార్మర్ మొత్తంగా 17 వికెట్లు పడగొట్టి భారత్ గడ్డపై దక్షిణాఫ్రికా చారిత్రక సిరీస్ విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అంతకముందు పాక్‌తో సిరీస్‌లో కూడా హార్మర్ 13 వికెట్లు పడగొట్టాడు. ఇక మహిళల విభాగంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు భారత స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ నామినేట్ అయ్యింది. గత నెలలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లలో షెఫాలీ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఈ ఫైనల్లో పోరులో బ్యాటింగ్‌లో 87 పరుగులు చేసిన షెఫాలీ.. అనంతరం బౌలింగ్‌లో సునే లూస్, మరిజానే కాప్ వంటి కీలక వికెట్లను పడగొట్టింది. ఆమెతో పాటు ఈ లిస్ట్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన ఎడమచేతి స్పిన్నర్ తిపట్చా పుత్తావోంగ్, యూఏఈ కెప్టెన్ ఇషా ఓజా కూడా ఉన్నారు.చదవండి: ఇదేం పిచ్చి?.. టికెట్ల కోసం ప్రాణాలకు తెగిస్తారా? -
ఇదేం పిచ్చి?.. టికెట్ల కోసం ప్రాణాలకు తెగిస్తారా?
భారతదేశంలో క్రికెట్ ఓ మతం లాంటిది. అభిమాన క్రికెటర్ల ఆటను ప్రత్యక్షంగా చూసే అవకాశం వస్తే.. సగటు అభిమాని ఎగిరి గంతేయడం ఖాయం. అయితే, అందుకోసం టికెట్లు సంపాదించే ప్రయత్నంలో ప్రాణాలకు తెగించడం విచారకరం. ఒడిషాలోని కటక్‌లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే నెలకొంది.ఆల్ ఫార్మాట్ సిరీస్‌లతో బిజీటీమిండియా సొంతగడ్డపై సౌతాఫ్రికా (IND vs SA)తో ఆల్ ఫార్మాట్ సిరీస్‌లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తొలుత టెస్టు సిరీస్‌లో ప్రొటిస్ జట్టు చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. రాంచి వేదికగా తొలి వన్డేలో గెలిచింది. అయితే, రాయ్‌పూర్‌లో రెండో వన్డేలో ఓడటంతో సిరీస్ 1-1తో సమం కాగా.. విశాఖపట్నంలో జరిగే మూడో వన్డేతో సిరీస్ ఫలితం తేలనుంది. ఆఫ్‌లైన్ టికెట్ల కోసంఇక వన్డే సిరీస్ తర్వాత భారత్- సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. కటక్‌లోని బారాబతి స్టేడియంలో డిసెంబరు 9న జరిగే టీ20తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఈ వారం ఆరంభంలో ఆన్లైన్లో టికెట్ల అమ్మకం చేపట్టగా.. త్వరితగతిన సేల్ ముగిసిపోయింది.ఈ క్రమంలో ఆఫ్‌లైన్ టికెట్ల కోసం శుక్రవారం అభిమానులు పెద్ద ఎత్తున బారాబతి స్టేడియం వద్దకు చేరుకున్నారు. దీంతో తొక్కిసలాట జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం ఆరు గంటలకు టికెట్ల విక్రయం జరగాల్సి ఉండగా.. ముందురోజు రాత్రి 11. 30 నిమిషాలకే కొంతమంది స్టేడియం వద్దకు చేరుకోవడం గమనార్హం.ఏకంగా రూ. 11 వేలకు కూడా..స్థానిక ఒడిశా టీవీ కథనం ప్రకారం.. భారత్- సౌతాఫ్రికా టీ20 మ్యాచ్‌కు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో బ్లాకులో టికెట్లు అమ్మారనే ఆరోపణలు ఉన్నాయి. టికెట్ ధర రూ. 1100 ఉండగా.. దానిని సుమారుగా ఆరు వేల రూపాయలకు అమ్మినట్లు తెలుస్తోంది. ఇంకొన్ని చోట్ల ఏకంగా రూ. 11 వేలకు కూడా టికెట్ల విక్రయం జరిగినట్లు సమాచారం.ఇలా ఓవైపు బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతుంటే.. మరోవైపు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్న కొద్దిపాటి టికెట్ల కోసం అభిమానులు ప్రాణాలకు తెగించడం గమనార్హం. టికెట్ల కోసం స్టేడియం వద్ద పరుగులు తీస్తున్న అభిమానులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. ‘‘ఇదేం పిచ్చి?.. ప్రాణాలంటే కూడా లెక్కలేదా? మ్యాచ్ చూడటం వల్ల ఒరిగే లాభం ఏమిటి?’’ అని కొంతమంది నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.బీసీసీఐ ఏం చేస్తోంది?భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) విధానం ప్రకారం.. వంద శాతం టికెట్లను ఆన్లైన్లో అమ్మడానికి వీలులేదు. కొద్దిమేర టికెట్లు కచ్చితంగా ఆఫ్‌లైన్‌లో విక్రయించాల్సిన పరిస్థితుల్లో కొన్ని క్రికెట్ అసోసియేషన్లు ఇందుకు సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలమవుతున్నాయి. దీంతో తొక్కిసలాట జరిగే దుస్థితి వస్తోంది. ఈ నేపథ్యంలో వంద శాతం టికెట్లు ఆన్లైన్లో విక్రయించి.. టికెట్‌తో పాటు సరైన ఐడీ ప్రూఫ్ ఉన్న వారినే స్టేడియంలోకి అనుమతించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.చదవండి: RO-KO హవా!.. ఈ హీరోని మర్చిపోతే ఎలా? కెప్టెన్‌గానూ సరైనోడు!Massive turnout at Barabati Stadium today as fans line up for India–South Africa T20 tickets.One hopes @dcp_cuttack, @cpbbsrctc & @Satya0168 have ensured proper crowd-control arrangements, because the visuals below tell a different story--something essential is missing to keep… pic.twitter.com/heRx96QDFT— Soumyajit Pattnaik (@soumyajit) December 5, 2025 -
'ఒకప్పుడు వరల్డ్ నంబర్ వన్.. ఇప్పుడు జట్టులో నో ఛాన్స్'
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత బౌలర్లు పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన రెండో వన్డేల్లోనూ మన బౌలర్లు తేలిపోయారు. ముఖ్యంగా పేసర్లు అయితే గల్లీ బౌలర్ల కంటే దారుణంగా బౌలింగ్ చేస్తున్నారు.సీనియర్ ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. ఈ సిరీస్‌కు వర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రాకు విశ్రాంతి ఇవ్వగా.. మహ్మద్ షమీని ఫిట్నెస్ లోపం పేరిట జట్టులోకి తీసుకోవడం లేదు. మరి సిరాజ్‌ను ఎందుకు తీసుకోలేదో సెలక్టర్లు స్పష్టత ఇవ్వలేదు.ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో ఆడిన సిరాజ్.. సఫారీలతో వన్డేలకు మాత్రం దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది సిరాజ్ ఇప్పటివరకు ఒకే వన్డే సిరీస్ ఆడాడు. అతడిని ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సెలక్టర్లపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ప్రశ్నల వర్షం కురిపించాడు. సిరాజ్ కేవలం ఒక-ఫార్మాట్ ఆటగాడిగా మార్చడంపై నిరాశ వ్యక్తం చేశాడు. హైదరాబాదీ కేవలం టెస్ట్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కావడానికి గల కారణం తనకు అర్థం కావడం లేదని చోప్రా తెలిపాడు."మహ్మద్ సిరాజ్‌ను వన్డే జట్టు నుంచి ఎందుకు తప్పించారు? సెలక్టర్ల వ్యూహాలు ఏంటో ఆర్ధం కావడం లేదు. సిరాజ్ ఎప్పుడూ ఫిట్‌గా ఉంటాడు. అతడు ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నాడు. డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్న సిరాజ్.. వన్డేల్లో ఆడలేడా? ఇంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అతడిని ఎంపిక చేయకపోవడం మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. ఎందుకంటే అతడు కొన్నాళ్ల పాటు వన్డేల్లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగాడు. అటువంటి బౌలర్ ఇప్పుడు జట్టులోనే లేకుండా పోయాడు. హర్షిత్ రాణా, ప్రసిద్ద్ కృష్ణ లాంటి బౌలర్లకు తరుచూ జట్టులో చోటు దక్కుతుంది. కానీ సిరాజ్ మాత్రం వన్డే, టీ20 జట్టులో కన్పించడం లేదు. అలా ఎందుకు జరుగుతుందో నాకైతే తెలిదు. కానీ సిరాజ్ మాత్రం ఇప్పుడు సింగిల్ ఫార్మాట్ ప్లేయరయ్యాడు. కాగా దక్షిణాఫ్రికాతో టీ20లకు ప్రకటించిన భారత జట్టులోనూ సిరాజ్‌కు చోటు దక్కలేదు.చదవండి: RO-KO హవా!.. ఈ హీరోని మర్చిపోతే ఎలా? కెప్టెన్‌గానూ సరైనోడు! -
"బాత్రూంలో కూర్చొని ఏడ్చాను..": రియాన్ పరాగ్
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌కు (Riyan Parag) చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ అంశంపై రియాన్ తాజాగా స్పందించాడు. భారత జట్టులో స్థానం దక్కనందుకు నిరాశ చెందానని చెప్పుకొచ్చాడు.గతేడాది అక్టోబర్‌లో చివరిగా టీమిండియా తరఫున ఆడిన రియాన్ భుజం గాయం తనను జట్టుకు దూరం చేసిందని వాపోయాడు. ఫిట్‌గా ఉన్నప్పుడు తాను రెండు వైట్ బాల్ ఫార్మాట్లు ఆడగల సమర్దుడినని తెలిపాడు. త్వరలోనే భారత జట్టులో కనిపిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.రియాన్ మాటల్లో.. "నాకు నేను టీమిండియాకు ఆడగల అర్హుడినని అనుకుంటాను. ఇది నాపై నాకున్న నమ్మకమనుకోండి లేక ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి. భుజం గాయం వల్ల ప్రస్తుతం నేను టీమిండియాలో లేను. నేను టీమిండియాకు రెండు వైట్‌బాల్ ఫార్మాట్లలో ఆడగలను"ఫామ్ పెద్ద సమస్య కాదుప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాలీ టీ20 టోర్నీ ఆడుతున్న రియాన్ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క చెప్పుకోదగ్గ ప్రదర్శన కూడా చేయలేకపోయాడు. ఈ అంశంపై కూడా రియాన్ స్పందించాడు.ఫామ్ అనేది తన దృష్టిలో పెద్ద సమస్య కాదని, పూర్తి ఫిట్నెస్ సాధిస్తే అదంతటదే వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.బాత్రూంలో కూర్చొని ఏడ్చానుఇదే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో రెండు సీజన్లు 45-50 సగటులో పరుగులు చేశాను. అయితే ఆ వెంటనే జరిగిన ఐపీఎల్ సీజన్లో 14 మ్యాచ్‌ల్లో కలిపి 70 పరుగులు చేయలేకపోయాను. ఆ సమయంలో నేను బాత్రూంలో కూర్చొని ఏడ్చాను. ఎందుకు పరుగులు చేయలేకపోతున్నానని చాలా బాధపడ్డాను.ఈ ఫామ్‌తో ఐపీఎల్‌కు సంబంధం లేదుసయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఫామ్‌తో ఐపీఎల్ ఫామ్‌కు సంబంధం లేదు. ఇక్కడ పరుగులు సాధిస్తే సంతోషమే. పరుగులు చేయలేకపోతే ఐపీఎల్లో పరుగులు చేయలేనని కాదు. ఈ విషయంలో నాకు అనుభవం ఉందని రియాన్ అభిప్రాయపడ్డాడు.కాగా, 24 ఏళ్ల రియాన్ చివరిగా 2024 అక్టోబర్ 12న బంగ్లాదేశ్‌తో జరిగిన T20 సిరీస్‌లో భారత్ తరఫున ఆడాడు. ఆ సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఆ సిరీస్ అంతటిలో కేవలం 49 పరుగులే చేశాడు.సంజూ శాంసన్ ట్రేడింగ్ ద్వారా సీఎస్కేకు వెళ్లిపోయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ రేసులో రియాన్ పరాగ్ కూడా ఉన్నాడు. గత సీజన్లో అతను కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్సీ కూడా చేశాడు. టీమిండియా నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత కూడా రియాన్ ఐపీఎల్ 2025లో పర్వాలేదనిపించాడు. 32 సగటున 393 పరుగులు చేశాడు. -
IND vs SA: ఈ హీరోని మర్చిపోతే ఎలా?.. కెప్టెన్‌గానూ సరైనోడు!
జట్టులో తమకంటూ ప్రత్యేక బ్యాటింగ్ స్థానం లేకపోయినా టీమిండియాకు నిస్వార్థమైన సేవలు అందిస్తున్న క్రికెటర్లలో కేఎల్ రాహుల్ ముందు వరుసలో ఉంటాడు. 2014లో ఓపెనర్‌గా భారత జట్టు తరఫున ప్రస్థానం మొదలుపెట్టిన ఈ కర్ణాటక ఆటగాడు.. వికెట్ కీపర్‌గానూ సేవలు అందించాడు.తరచూ మార్పులుఅయితే, తర్వాతి కాలంలో రాహుల్ (KL Rahul) తన ఓపెనింగ్ స్థానాన్ని కోల్పోయాడు. ముఖ్యంగా టెస్టుల్లో ఓసారి ఐదో నంబర్ బ్యాటర్‌గా.. మరోసారి నాలుగో స్థానంలో.. ఆ తర్వాత మళ్లీ ఓపెనర్‌గా ఇలా వివిధ స్థానాల్లో రాహుల్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ నిలకడైన ఆటతో రాణిస్తూ తనను తాను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాడు రాహుల్. దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్ తర్వాత రాహుల్‌కు టెస్టుల్లో ఓపెనర్‌గా వరుస అవకాశాలు వస్తున్నాయి.కీపింగ్ బాధ్యతలు కూడా.. ఇదిలా ఉంటే.. వన్డేల్లోనూ రాహుల్ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. టీ20 జట్టులో స్థానం కోల్పోయిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. వన్డేల్లో మాత్రం మిడిలార్డర్ బ్యాటర్‌గా తన సేవలు అందిస్తున్నాడు. కీపింగ్ బాధ్యతలు కూడా తానే నిర్వర్తిస్తున్న రాహుల్.. తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్‌కు తాత్కాలిక కెప్టెన్‌గానూ వ్యవహరిస్తున్నాడు.సఫారీ జట్టుతో తొలి వన్డేలో ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్. కేవలం 56 బంతుల్లోనే 60 పరుగులు (రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) సాధించాడు. లెజెండరీ బ్యాటర్లు రోహిత్ శర్మ (57), విరాట్ కోహ్లి (135)తో రాహుల్ మెరుపు అర్ధ శతకంతో రాణించడంతో టీమిండియా 349 పరుగుల భారీ స్కోరు చేయగలిగిందిరాహుల్ విలువైన ఇన్నింగ్స్‌ఇక ఈ మ్యాచ్‌లో బౌలర్లు ఆరంభంలో తడబడినా ఆఖరి నిమిషంలో సత్తా చాటడంతో 17 పరుగుల తేడాతో భారత జట్టు గట్టెక్కింది. అదే విధంగా రెండో వన్డేలోనూ కోహ్లి శతక్కొట్టగా (102).. రుతురాజ్ గైక్వాడ్ (105) కూడా సెంచరీతో అలరించాడు. వీరిద్దరికి తోడుగా రాహుల్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈసారి ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 43 బంతుల్లోనే ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 66 పరుగులతో అజేయంగా నిలిచాడు.అయితే, ఈ మ్యాచ్‌లో 358 పరుగుల మేర భారీ స్కోరు సాధించినా టీమిండియా గెలవలేకపోయింది. బౌలర్ల వైఫల్యం కారణంగా నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్‌లోనూ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాహుల్ తనదైన ముద్ర వేయగలిగాడు. అయితే, రో-కోల హవాలో అతడి ఆటకు దక్కాల్సిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.కెప్టెన్‌గానూ రాహుల్‌కు మంచి రికార్డు నిజానికి టీమిండియా కెప్టెన్‌గానూ రాహుల్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు మొత్తంగా అతడు పద్దెనిమిదిసార్లు భారత జట్టును సారథిగా ముందుకు నడిపించాడు. ఇందులో ఏకంగా పన్నెండుసార్లు టీమిండియా గెలిచింది. రాహుల్ కెప్టెన్సీలో 14 వన్డేలకు గానూ తొమ్మిదింట విజయం సాధించిన టీమిండియా.. టెస్టుల్లో మూడింటికి రెండు, టీ20లలో ఒకటికి ఒకటి గెలిచింది.మరో విశేషం ఏమిటంటే.. రాహుల్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లి ఇప్పటికి ఏకంగా నాలుగు శతకాలు బాదడం విశేషం. ఓవరాల్‌గా రాహుల్ సారథ్యంలో కోహ్లి సాధించిన స్కోర్లు వరుసగా... 122,51,0,65,113,135,102. ఇందులో చివరి రెండు సెంచరీలు సౌతాఫ్రికాతో వన్డేల్లో బాదినవే.ఏదేమైనా.. టీమిండియా విజయాల్లో అనేకసార్లు కీలక పాత్ర పోషించిన రాహుల్.. తెరవెనుకే ఉండిపోతున్నాడనే అభిప్రాయం అతడి అభిమానుల్లో ఉంది. అంతేకాదు.. కెప్టెన్‌గానూ రాణించగల సత్తా ఉన్నా ఈ 33 ఏళ్ల ఆటగాడికి అదృష్టం కలిసి రావడం లేదని.. ప్రస్తుత పరిస్థితుల్లో వన్డే సారథిగా రాహులే సరైనోడు అన్న విషయాన్ని యాజమాన్యం గుర్తిస్తే బాగుండనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చదవండి: 5 ఏళ్లలో 23 సెంచరీలు.. టెస్ట్ క్రికెట్‌పై రూట్ పంజా -
రిషభ్ పంత్ చేసిన పనికి.. రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్
టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ స్వభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో బ్యాట్‌తో పరుగుల వరద పారించే హిట్‌మ్యాన్.. సారథిగా గంభీరంగా కనిపిస్తూనే.. పరిస్థితులకు తగ్గట్లు నవ్వులు పూయించడంలోనూ ముందే ఉంటాడు. ఇక మైదానం వెలుపల సహచర ఆటగాళ్లతో రోహిత్ ఫ్రెండ్లీగా ఉంటాడనే విషయం అతడి అభిమానులకు బాగా తెలుసు.తానొక లెజెండరీ బ్యాటర్, కెప్టెన్‌ని అనే గర్వం రోహిత్ శర్మ (Rohit Sharma)లో అస్సలు కనిపించదు. తోటి ఆటగాళ్లను ఆటపట్టించడంలో ముందుండే హిట్‌మ్యాన్.. తన పట్ల వారు కూడా అదే విధంగా ప్రవర్తించినా సరదాగానే ఉంటాడు. ఈ విషయాన్ని రుజువు చేసే ఘటన ఇటీవల చోటు చేసుకుంది.మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా..టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో సౌతాఫ్రికా (IND vs SA)తో వరుస సిరీస్‌లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టెస్టుల్లో సఫారీల చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా ఉంది. ఆఖరి ఓవర్ ఉత్కంఠగా సాగిన తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో గట్టెక్కిన టీమిండియా.. రెండో వన్డేలో మాత్రం 358 పరుగులు చేసినా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.రాలిపడ్డ కనురెప్పఈ రెండు వన్డేల్లో రోహిత్ శర్మ వరుసగా 57, 14 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. రాయ్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సహచర ఆటగాడు, బెంచ్‌కే పరిమితమైన రిషభ్ పంత్ (Rishabh Pant).. రోహిత్‌ను ఆటపట్టించాడు. రోహిత్ కంటి నుంచి రాలిపడిన రెప్పను పట్టుకున్న పంత్.. అతడి చెయ్యిపై ఉంచి.. ఓ కోరిక కోరుకోమన్నాడు.ఇంతకీ రోహిత్ ఏం కోరుకున్నాడు?ఇందుకు నవ్వులు చిందించిన రోహిత్ అలాగే చేశాడు. వీరిద్దరు ఇలా సరదాగా సంభాషిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో.. ‘ఇంతకీ రోహిత్ ఏం కోరుకున్నాడు?’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై రోహిత్ శర్మ సన్నిహితుడు అభిషేక్ నాయర్ స్టార్ స్పోర్ట్స్ వేదికగా స్పందించాడు.రెండే రెండు కోరికలు‘‘నాకు తెలిసి ప్రస్తుతం రోహిత్‌కు రెండే రెండు కోరికలు ఉండి ఉంటాయి. ఒకటేమో.. ‘నేను 2027 వన్డే వరల్డ్‌కప్‌ను నా చేతుల్లో పట్టుకోవాలి’ అని.. మరొకటి.. సౌతాఫ్రికాతో మూడో వన్డేలో సెంచరీ చేయాలని’’ అంటూ అభిషేక్ నాయర్.. రోహిత్ శర్మ మాటలను డీకోడ్ చేశాడు. ఇదిలా ఉంటే.. భారత్-సౌతాఫ్రికా మధ్య శనివారం విశాఖపట్నం వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డే నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. కాగా టీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 అందించిన రోహిత్ శర్మను.. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు బీసీసీఐ వన్డే కెప్టెన్సీ తొలగించిన విషయం తెలిసిందే. ఇక అంతకు ముందు రోహిత్.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌తో పాటు.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు.చదవండి: 5 ఏళ్లలో 23 సెంచరీలు.. టెస్ట్ క్రికెట్‌పై రూట్ పంజా -
విశాఖ చేరుకున్న భారత్, దక్షిణాఫ్రికా జట్లు క్రికెట్ ఫ్యాన్ సందడి (ఫొటోలు)
-
'అతడొక ఆల్ ఫార్మాట్ ప్లేయర్.. ఇకనైనా మారండి'
రాయ్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి పాలైనప్పటికి.. స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గైక్వాడ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు.నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర స్టార్.. ప్రత్యర్ధి బౌలర్లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో గైక్వాడ్ 77 బంతుల్లోనే తన తొలి వన్డే సెంచరీ మార్క్‌ను మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105 పరుగులు చేశాడు.ఈ నేపథ్యంలో భారత మాజీ చీఫ్ సెలెక్టర కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రుతురాజ్ తన సత్తా నిరూపించుకున్నాడని, అతడికి వన్డేల్లో మరిన్ని అవకాశాలు ఇవ్వాలని టీమ్ మెనెజ్‌మెంట్‌ను సూచించాడు. కాగా శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా సఫారీలతో వన్డే సిరీస్‌కు దూరం కావడంతో రుతురాజ్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. తొలి వన్డేలో విఫలమైనప్పటికి.. రెండో వన్డేలో మాత్రం కమ్ బ్యాక్ ఇచ్చాడు. సెంచరీతో పాటు విరాట్ కోహ్లీతో కలిసి 195 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు."జట్టు సెలక్షన్ విషయంలో ఇకపై పెద్దగా ప్రయోగాలు చేయరని ఆశిస్తున్నాను . రతురాజ్ అద్భుతమైన ఆటగాడు. అతడికి మూడు ఫార్మాట్లలోనూ రాణించే సత్తా ఉంది. కచ్చితంగా రుతురాజ్ ఆల్ ఫార్మాట్ జట్టులో ఉండటానికి అర్హుడు. అతడికి అవకాశాలు ఇవ్వండి. టెస్టుల్లో కూడా సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పటికే రంజీ ట్రోఫీలో తనను నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అయితే రుతురాజ్ అద్భుతంగా ఆడాడు. భారత జట్టులోకి వచ్చి రాగానే సెంచరీ సాధించడం చాలా సంతోషంగా ఉంది.అతడు తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సౌతాఫ్రికా వంటి బౌలింగ్ అటాక్‌పై సెంచరీ కొట్టడం గొప్ప విషయం "అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IND vs SA: సొంత తెలివితేటలు వద్దు.. చెబితే నీకు అర్ధం కావడం లేదా? -
సొంత తెలివితేటలు వద్దు.. చెబితే నీకు అర్ధం కావడం లేదా?
రాయ్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 359 పరుగుల లక్ష్యాన్ని భారత బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ముఖ్యంగా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ దారుణ ప్రదర్శన కనబరిచాడు.పదే పదే షార్ట్ పిచ్ బంతులను సంధిస్తూ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అతడి బౌలింగ్‌ను సఫారీ బ్యాటర్లు ఓ ఆట ఆడుకున్నారు. ఈ కర్ణాటక పేసర్ 8.2 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 85 పరుగులు ఇచ్చాడు. ప్రసిద్ద్ రెండు వికెట్లు పడగొట్టినప్పటికి భారీగా పరుగులివ్వడంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మ్యాచ్ మధ్యలో భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ సైతం ప్రసిద్ద్ కృష్ణపై అగ్రహం వ్యక్తం చేశాడు. మైదానంలో ఎంతో ప్రశాతంగా ఉండే రాహుల్.. ప్రసిద్ద్ కృష్ణ చెత్త బౌలింగ్ కారణంగా తన సహనాన్ని కోల్పోయాడు.ఏమి జరిగిందంటే?ఈ మ్యాచ్‌లో ప్రసిద్ద్ షార్ట్ పిచ్ బంతులు ఎక్కువగా సంధించి బ్యాటర్లకు టార్గెట్‌గా మారాడు. ఈ క్రమంలో ప్రోటీస్ ఇన్నింగ్స్ 42 ఓవర్ వేసిన ప్రసిద్ద్.. టోనీ డి జోర్జి హెడ్‌ను టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేశాడు. అలా బౌలింగ్ చేయవద్దని రాహుల్ అంతకుముందే అతడికి చెప్పాడు. కానీ ప్రసిద్ద్ మరోసారి అలానే బౌలింగ్ చేయడంతో కేఎల్ తన నోటికి పనిచెప్పాడు. ప్రసిద్ద్ నీ సొంత తెలివితేటలు ఉపయోగించవద్దు. నేను చెప్పినట్లు చెయ్యి. ఎలా బౌలింగ్ చేయాలో చెప్పాను కదా. అదే చేయ్యి అని రాహుల్ గట్టిగా అరుస్తూ ప్రసిద్ద్‌తో కన్నడలో అన్నాడు. అందుకు బదులుగా హెడ్‌ను టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేయాలా అని ప్రసిద్ద్ బదులిచ్చాడు.అరే షార్ట్ పిచ్ బంతులు వేయాల్సిన అవసరం లేదు. నీకు ఇప్పుడే చెప్పాను కదా. మళ్లీ అదే చేస్తున్నావు అని రాహల్ అన్నాడు. ఈ సంభాషణంతా స్టంప్ మైక్‌లో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో అవుతోంది. ఇక సిరీస్ డిసైడర్ మూడో వన్డే డిసెంబర్ 6న వైజాగ్ వేదికగా జరగనుంది.చదవండి: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్ಪಂದ್ಯದ ನಡುವೆ Prasidh Krishna ಅವರಿಗೆ KL Rahul ರವರ ವಿಶೇಷ ಕಿವಿಮಾತು!👏🏻🗣📺 ವೀಕ್ಷಿಸಿ | #INDvSA 👉 2nd ODI | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports 2 ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#TeamIndia pic.twitter.com/OkNN2aqkMc— Star Sports Kannada (@StarSportsKan) December 3, 2025 -
సౌతాఫ్రికా సిరీస్‌కు ముందు దుమ్మురేపుతున్న సంజూ శాంసన్
టీమిండియా డాషింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు గట్టిగా ప్రిపేర్ అవుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో వరుస మెరుపు ఇన్నింగ్స్‌లతో దుమ్మురేపుతున్నాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో 41 బంతుల్లో అజేయమైన 51 పరుగులు చేసిన అతడు.. ఆతర్వాతి మ్యాచ్‌లో 15 బంతుల్లో 43 పరుగులు బాదాడు. తాజాగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో సంజూ మరోసారి చెలరేగి ఆడాడు. 28 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో 46 పరుగులు చేశాడు.ఇదే ఫామ్‌ను సంజూ సౌతాఫ్రికా సిరీస్‌లోనూ కొనసాగిస్తే టీమిండియాకు చాలా ప్లస్ అవుతుంది. ఇప్పటికే భారత బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. ఒక్కో స్థానం కోసం ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. ఓ రకంగా చూస్తే.. ఆఖరి నిమిషం వరకు సంజూ స్థానానికి కూడా గ్యారెంటీ లేదు. జితేశ్ శర్మ రూపంలో అతడిని బలమైన పోటీ ఉంది.కాగా, నిన్ననే సౌతాఫ్రికా టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. ఈ జట్టులో సంజూ వికెట్‌కీపర్ బ్యాటర్ కోటాలో స్థానం దక్కించుకున్నాడు. గాయపడినా ఈ జట్టుకు ఎంపికైన శుభ్‌మన్ గిల్ సిరీస్ సమయానికి అందుబాటులోకి రాకపోతే సంజూ స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదు.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదేసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్- ఫిట్‌నెస్‌కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్తొలి టీ20: డిసెంబరు 9- కటక్, ఒడిశారెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్పూర్, చండీగఢ్మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్, గుజరాత్.ముంబైని ఓడించిన తొలి మొనగాడుప్రస్తుత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబైని ఓడించిన ఏకైక కెప్టెన్ సంజూ శాంసన్ మాత్రమే. ఈ టోర్నీలో కేరళకు సారధిగా వ్యవహరిస్తున్న సంజూ ఇవాళ ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్‌గా, వికెట్‌కీపర్‌గా, కెప్టెన్‌గా రాణించి ముంబైని ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాట్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సంజూ, ఆతర్వాత వికెట్‌కీపింగ్‌లోనూ సత్తా చాటి కీలక సమయంలో శివమ్ దూబేను స్టంపౌట్ చేశాడు. ఈ వికెటే మ్యాచ్‌ను మలుపు తిప్పి, కేరళను గెలిచేలా చేసింది.స్కోర్ల వివరాలు..కేరళ-178/5ముంబై-163 ఆలౌట్ -
రోహిత్ శర్మ కీలక నిర్ణయం
టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) ఆడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన దేశవాలీ జట్టు ముంబై తరఫున నాకౌట్ మ్యాచ్‌ల్లో ఆడేందుకు హిట్‌మ్యాన్ సమ్మతం వ్యక్తం చేశాడట. SMATలో ముంబై నాలుగు వరుస విజయాలతో దూసుకుపోతూ నాకౌట్స్‌కు చేరువైంది.ఇప్పటికే స్టార్ క్రికెటర్లతో పటిష్టంగా ఉన్న ముంబైకి హిట్‌మ్యాన్ తోడైతే వారిని ఆపడం దాదాపుగా అసాధ్యం. ఈ టోర్నీలో ముంబై డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో ఉంది. గత సీజన్లో శ్రేయస్ అయ్యర్ ముంబైకి టైటిల్ అందించాడు.ప్రస్తుత ముంబై జట్టులో భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా అజింక్య రహానే, ఆయుశ్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్ లాంటి టీమిండియా స్టార్లు ఉన్నారు. వీరికి రోహిత్ శర్మ కలిస్తే ఇంకేమైనా ఉందా..?ఈ సీజన్లో ముంబై ఆటగాళ్లంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. కుర్ర ఓపెనర్ మాత్రే వరుసగా రెండో సెంచరీలు బాది జోష్‌లో ఉండగా.. సర్ఫరాజ్ ఖాన్ కూడా తాజాగా ఓ మెరుపు సెంచరీ చేశాడు. ఇటీవలే శార్దూల్ ఠాకూర్ ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు.ఇదిలా ఉంటే, టెస్ట్‌లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ.. 38 ఏళ్ల లేటు వయసులోనూ ఈ ఫార్మాట్లో చెలరేగిపోతున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ, హాఫ్ సెంచరీతో దుమ్మురేపిన హిట్‌మ్యాన్.. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో ఓ హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికాతో మూడో వన్డే డిసెంబర్ 6 విశాఖ వేదికగా జరుగనుంది.సిరీస్ విషయానికొస్తే.. నిన్న జరిగిన రెండో వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసిన ఓటమిపాలైంది. రుతురాజ్, కోహ్లి సెంచరీలు వృధా అయ్యాయి. దక్షిణాఫ్రికా బ్యాటర్లు అసమానమైన పోరాటపటిమ కనబర్చి భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని ఊదేశారు. అంతకుముందు తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. -
మరో 20-30 పరుగులు చేసుంటే ఫలితం మారేదా..?
రాయ్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో నిన్న (డిసెంబర్ 3) జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి వారి జట్టును గెలిపించుకున్నారు. టీమిండియా ఓటమికి గల కారణాలు విశ్లేషించుకుంటే సవాలక్ష కనిపిస్తున్నాయి.టాస్‌తో మొదలుపెడితే.. ఈ మ్యాచ్‌లో టాస్ చాలా కీలకం. గెలిచిన జట్టు తప్పకుండా తొలుత బౌలింగ్ ఎంచుకుంటుంది. ఎందుకంటే మంచు ప్రభావం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. తడి బంతితో బ్యాటర్లను నియంత్రించడం దాదాపు అసాధ్యం. అందుకే అంతటి భారీ లక్ష్యాన్ని అయినా దక్షిణాఫ్రికా బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. టీమిండియా కెప్టెన్ రాహుల్ టాస్ కోల్పోయిన వెంటనే సగం మ్యాచ్‌ను కోల్పోయాడు. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం అతనే స్వయంగా అంగీకరించాడు.లోయర్ ఆర్డర్ వైఫల్యంటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా టీమిండియా భారీ స్కోరే చేయగలిగింది. వాస్తవానికి ఇంకాస్త భారీ స్కోర్ రావాల్సి ఉండింది. అయితే డెత్ ఓవర్లలో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా టీమిండియా పుట్టి ముంచారు. వీరిద్దరు చాలా నిదానంగా ఆడి అదనంగా రావాల్సిన 20-30 పరుగులకు అడ్డుకట్ట వేశారు. సుందర్ అయితే మరీ దారుణంగా ఆడి 8 బంతుల్లో కేవలం ఒకే ఒక పరుగు చేశాడు. జడ్డూ.. తానేమీ తక్కువ కాదన్నట్లు 27 బంతులు ఎదుర్కొని 24 పరుగులు మాత్రమే చేశాడు. వీరిద్దరు కాస్త వేగంగా ఆడుంటే స్కోర్ 380 దాటేది. ఈ స్కోర్ చేసుంటే టీమిండియా డిఫెండ్ చేసుకోగలిగేదేమో.మంచు ప్రభావంముందుగా అనుకున్నట్లుగానే రెండో ఇన్నింగ్స్ సమయంలో మంచు ప్రభావం చాలా తీవ్రంగా ఉండింది. ఆదిలో కాస్త తక్కువగా ఉన్నా చీకటి పడే కొద్ది దాని ప్రభావం అధికమైంది. దీంతో బౌలర్లు బంతిపై నియంత్రణ కోల్పోయారు. పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో సునాయాసంగా వచ్చాయి. ఫీల్డర్ల వైఫల్యాలు దీనికి అదనం. దేశంలోనే అగ్రశ్రేణి ఫీల్డర్లు కూడా మిస్ ఫీల్డ్ చేశారు. సెంచరీ వీరుడు మార్క్రమ్ క్యాచ్‌ను జైస్వాల్ నేలపాలు చేయడం భారత ఓటమిని ప్రభావితం చేసింది.బ్రెవిస్ డ్యామేజ్బ్రెవిస్ ప్రమోషన్ పొంది ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం కూడా టీమిండియా ఓటమికి ఓ కారణం. ఈ డాషింగ్ బ్యాటర్ వచ్చీరాగానే భారత బౌలర్లపై ఎదురుదాడికి దాగాడు. ఏ బౌలర్‌ను కుదురుకోనివ్వలేదు. విధ్వంసకర బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని కరిగించాడు. పైగా అతను క్రీజ్‌లోకి రాగానే కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓ తప్పిదం చేశాడు. తొలి వన్డేలో బ్రెవిస్‌ను ఔట్ చేశాడని హర్షిత్ రాణాను బరిలోకి దించాడు. అసలే హర్షిత్‌పై కసితో రగిలిపోతున్న బ్రెవిస్‌కు ఇది బాగా కలిసొచ్చింది. హర్షిత్‌తో పాటు మిగతా బౌలర్లపై కూడా విరుచుకుపడ్డాడు. తొలి వన్డేలో బ్రెవిస్‌ను ఔట్ చేసిన అనంతరం హర్షిత్ అతని పట్ల దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.మరో 20-30 పరుగులు చేసుంటే ఫలితం మారేదా..?టీమిండియా మరో 20-30 పరుగులు చేసుంటే గెలిచేదని కేఎల్ రాహుల్ సహా చాలా మంది అనుకుంటున్నారు. వాస్తవానికి సఫారీలు ఉన్న ఊపుకు 380 స్కోర్ కూడా చాలేది కాదు. వాళ్లు లక్ష్యాన్ని ఛేదించాలన్న టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగలేదు. మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మాత్రమే బరిలోకి దిగారు. ఒకవేళ భారత్ 380 పరుగులు చేసినా వారి లక్ష్యం మారేది కాదు. లక్ష్యాన్ని అమలు చేయడంలో భాగంగానే వారికి ఈ విజయం దక్కింది. అది 380 అయినా 420 అయినా వాళ్లు ఓటమినైతే ఒప్పుకునే వారు కాదు. వారి పోరాటాలు ఎలా ఉంటాయో జతమంతా చూసింది. -
ఆ వ్యూహం పని చేసింది.. అద్భుతంగా ఆడాం..!
రాయ్‌పూర్ వేదికగా నిన్న జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. రుతురాజ్, కోహ్లి సెంచరీల సాయంతో టీమిండియా భారీ స్కోర్ (358) చేసినా, మంచు ప్రభావం కారణంగా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది.సఫారీలు బౌలింగ్‌లో విఫలమైనా, బ్యాటింగ్‌లో అదరగొట్టి రికార్డు లక్ష్యాన్ని ఛేదించారు (4 బంతులు మిగిలుండగానే). మార్క్రమ్ సూపర్ సెంచరీతో.. బ్రెవిస్ మెరుపు విన్యాసాలతో.. బవుమా, బ్రీట్జ్కే, కార్బిన్ బాష్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లతో సౌతాఫ్రికాకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (Temba Bavuma) హర్షం వ్యక్తం చేశాడు. నమ్మశక్యంకాని మ్యాచ్‌గా అభివర్ణించాడు. రికార్డు ఛేదన అంటూ సహచరులను కొనియాడాడు. మార్క్రమ్, బ్రీట్జ్కే, బ్రెవిస్, బాష్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా బ్రెవిస్‌ను ఆకాశానికెత్తాడు.బ్రెవిస్‌ను బ్యాటింగ్ ఆర్డర్ ముందుకు పంపిన వ్యూహం పని చేసిందని చెప్పుకొచ్చాడు. కీలకమైన భాగస్వామ్యాలు గెలుపుకు కారణమయ్యాయని అభిప్రాయపడ్డాడు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఆటను చివరి వరకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పాడు.ఎంతటి భారీ లక్ష్యమైనా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి, లోయర్ ఆర్డర్ బ్యాటర్లపై నమ్మకముంచితే గెలుపు సాధ్యమని అభిప్రాయపడ్డాడు. కార్బిన్ బాష్ చివర్లో పరిపక్వత చూపాడని ప్రశంసించాడు. బౌలింగ్ ఇంకాస్త మెరుగుపర్చుకోవాల్సి ఉందని తెలిపాడు. బర్గర్, జోర్జి గాయాల అప్డేట్ ఏంటనే అంశంపై స్పందిస్తూ.. తానేమీ డాక్టర్‌ను కానని వ్యంగ్యంగా అన్నాడు.మొత్తంగా ఈ విజయం జట్టుకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ గెలుపుతో సిరీస్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చామని అన్నాడు. కాగా, గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన బవుమా ఈ మ్యాచ్‌తోనే తిరిగి బరిలోకి దిగాడు. వచ్చీ రాగానే తన జట్టును గెలిపించాడు. ఇటీవలికాలంలో బవుమా విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారాడు. అతనాడిన ప్రతి మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికా గెలుస్తుంది. టెస్ట్‌ల్లో అయితే అతనికి తిరుగేలేదు. వ్యక్తిగత ప్రదర్శన ఎలా ఉన్నా జట్టును మాత్రం విజయవంతంగా ముందుండి నడిపిస్తున్నాడు. -
రుతు, విరాట్ అద్భుతం.. ఆ రెండే కొంపముంచాయి: కేఎల్ రాహుల్
రాయ్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో నిన్న (డిసెంబర్ 3) జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి అద్భుత సెంచరీలతో చెలరేగి భారీ స్కోర్ అందించినా, టీమిండియా దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. సౌతాఫ్రికా బ్యాటర్లు అసమాన పోరాటపటిమ కనబర్చి 359 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని పెద్దగా కష్టపడకుండానే ఛేదించారు. మార్క్రమ్ బాధ్యతాయుతమైన సెంచరీ, బ్రెవిస్ మెరుపులు, భారత బౌలర్లు, ఫీలర్ల తప్పిదాలు సౌతాఫ్రికా గెలుపుకు కారణమయ్యాయి.గెలుస్తామనుకున్న మ్యాచ్‌లో ఓడటంపై టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) స్పందిస్తూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యాడు. అతడి మాటల్లోనే.."ఇలాంటి ఓటమిని జీర్జించుకోవడం కష్టం. వరుసగా రెండు టాస్‌లు కోల్పోవడం దురదృష్టకరం. ఈ విషయంలో నన్ను నేను నిందించుకుంటా. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం ఎంత కష్టమో, తడి బంతితో బౌలర్లకు ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయో మరోసారి బయటపడ్డాయి.అంపైర్లు బంతి మార్చినా, డ్యూ ప్రభావం తగ్గలేదు. మరో 20–25 పరుగులు చేసుంటే బౌలర్లకు కాస్త కుషన్ దొరికేది. వారు శక్తి మేరకు పోరాడినా, ఫీల్డింగ్‌లో కొన్ని తప్పిదాలు జరిగాయి. మొత్తంగా టాస్, డ్యూ కొంపముంచాయి. రుతురాజ్ ఆడిన ఇన్నింగ్స్ అందరినీ ఆకట్టుకుంది. అతడు స్పిన్నర్లను అద్భుతంగా ఎదుర్కొన్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత టెంపో పెంచి జట్టుకు అదనపు పరుగులు అందించాడు. విరాట్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. 53వ సారి తన పని తాను చేసుకుపోయాడు. లోయరార్డర్ బ్యాటర్లు ఇంకొంచెం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసి, రెండు మూడు బౌండరీలు కొట్టుంటే ఆ 20 పరుగులు కూడా వచ్చేవి. నేను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు (ఐదో స్థానం) రావడం సందర్భానుసారంగా తీసుకున్న నిర్ణయం. -
IND vs SA: టీమిండియాను చిత్తు చేసిన సౌతాఫ్రికా
రాయ్‌పూర్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో దక్షిణాఫ్రికా సమం చేసింది. 359 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 49.2 ఓవర్లలో చేధించింది.ప్రోటీస్ ఓపెనర్ ఐడైన్ మార్క్రమ్(98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 110) సూపర్ సెంచరీతో చెలరేగగా.. మాథ్యూ బ్రీట్జ్కే(64 బంతుల్లో 68), బ్రెవిస్(34 బంతుల్లో 54) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆఖరిలో కార్బిన్ బాష్(14 బంతుల్లో 25) మరోసారి కీలక నాక్ ఆడాడు.ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు తేలిపోయారు. భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. ఒక్క అర్ష్‌దీప్ మినహా మిగితా బౌలర్లందరూ దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. అంతకు తోడు చెత్త ఫీల్డింగ్ కూడా భారత్ కొంపముంచింది. మిస్ ఫీల్డ్‌ల రూపంలో టీమిండియా దాదాపు 30 పరుగులు సమర్పించుకుంది. అర్ష్‌దీప్, ప్రసిద్ద్ కృష్ణ తలా రెండు వికెట్లు సాధించారు.కోహ్లి, రుతు సెంచరీలు వృథా..అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి((93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102), రుతురాజ్ గైక్వాడ్(83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగగా.. రాహుల్(66) హాఫ్ సెంచరీతో మెరిశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు, ఎంగిడీ, బర్గర్ తలా వికెట్ సాధించారు. అయితే భారత్ ఓటమి పాలవ్వడంతో కోహ్లి, రుతురాజ్ సెంచరీలు వృథా అయిపోయాయి. ఇక సిరీస్ డిసైడర్ మూడో వన్డే శనివారం వైజాగ్ వేదికగా జరగనుంది. -
భారత జట్టు నుంచి ఫినిషర్ అవుట్.. కారణమెవరు?
టీమిండియా స్టార్ ప్లేయర్ రింకూ సింగ్‌ను టీ20 వరల్డ్‌కప్-2026కు పక్కన పెట్టనున్నారా? అంటే అవునానే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోనే సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టులో రింకూ సింగ్ పేరు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.రింకూ ఔట్.. హార్దిక్ ఇన్అతడి స్ధానంలో జట్టులోకి స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగొచ్చాడు. ఈ జట్టు సెలక్షన్‌ను బట్టి రింకూ పొట్టి ప్రపంచకప్ ప్రణాళికలలో లేనిట్లు తెలుస్తోంది. రింకూ చివరగా భారత్ తరపన ఆసియాకప్-2025లో ఆడాడు.పాక్‌తో జరిగిన ఫైనల్లో విన్నింగ్ రన్స్ అతడే కొట్టాడు.అయితే వాస్తవానికి హార్దిక్ పాండ్యాకు గాయం కాకపోయి ఉంటే రింకూకు తుది జట్టులో దక్కకపోయేది. ఇప్పుడు పాండ్యా గాయం నుంచి కోలుకోని తిరిగి రావడంతో రింకూను పూర్తిగా ప్రధాన జట్టు నుంచే తప్పించారు. బహుశా రింకూ తరుచుగా చెప్పే విధంగా దేవుని ప్లాన్ అయి వుంటుంంది.గంభీర్ కారణమా?రింకూ గత కొన్ని టీ20 సిరీస్‌లగా జట్టుతో పాటు ఉన్నప్పటికి తుది జట్టులో మాత్రం పెద్దగా చోటు దక్కలేదు. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఎక్కువగా ఆల్‌రౌండర్ల మొగ్గు చూపడంతో రింకూ చాలా మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమయ్యాడు. అతడికి బదులుగా వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబేలకు ప్లేయింగ్ ఎలెవన్‌లో టీమ్ మెనెజ్‌మెంట్ చోటు కల్పిస్తోంది.అతడు ఆస్ట్రేలియా పర్యటనలో జట్టులో ఉన్నప్పటికీ, ఒక్కసారి కూడా బ్యాటింగ్ చేయలేదు. మొన్నటివరకు ముఖ్యమైన 'ఫినిషర్'గా పరిగణించబడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఇప్పుడు ఏకంగా జట్టులోనే లేకుండా పోయాడు. అయితే టీ20 వరల్డ్‌కప్-2026 భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఉపఖండంలో మంచి స్పిన్నర్లు, స్పిన్‌ను ధీటుగా ఎదుర్కొనే బ్యాటర్లు కావాలి. వాషింగ్టన్, దూబేలు స్పినర్లకు బాగా ఆడగలరు. అంతేకాకుండా వాషింగ్టన్ బంతితో కూడా మ్యాజిక్ చేయగలడు. సుందర్, దూబే ప్రధాన జట్టులో ఉన్నప్పటికి ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం ఇద్దరిలో ఒకరికి చోటు దక్కే అవకాశముంది. ఎందుకంటే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రూపంలో ఇద్దరూ స్పిన్నర్లు ఎలాగానూ తుది జట్టులో ఉంటారు. బహుశా అందుకే రింకూను టీ20 ప్రపంచకప్ సెటాప్ నుంచి తప్పించండొచ్చు. అంతే తప్ప రింకూపై వేటు వెనక మరే ఏ ఇతర కారణం లేకపోవచ్చని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదేసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్- ఫిట్‌నెస్‌కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్🏏తొలి టీ20: డిసెంబరు 9- కటక్, ఒడిశా🏏రెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్పూర్, చండీగఢ్🏏మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్🏏నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్🏏ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్, గుజరాత్.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్ -
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డు
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టీమిండియాలో పునరాగమనం చేసిన రుతురాజ్ గైక్వాడ్‌కు తొలి ప్రయత్నంలో చేదు అనుభవం ఎదురైంది. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ మహారాష్ట్ర ఆటగాడు.. మొత్తంగా 14 బంతులు ఎదుర్కొని కేవలం ఎనిమిది పరుగులే చేసి నిష్క్రమించాడు.సంచలన రీతిలో ఒంటిచేత్తో క్యాచ్..సఫారీ పేసర్ ఒట్నీల్ బార్ట్‌మన్ బౌలింగ్‌లో రుతురాజ్ (Ruturaj Gaikwad) గాల్లోకి లేపిన బంతిని.. యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) అద్భుతంగా ఒడిసిపట్టాడు. సంచలన రీతిలో ఒంటిచేత్తో క్యాచ్ పట్టుకుని.. రుతురాజ్‌కు నిద్రలేని రాత్రిని మిగిల్చాడు. అసలే రాక రాక వచ్చిన అవకాశం.. కానీ ఇలా స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో రుతుతో పాటు అతడి అభిమానులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో రెండో వన్డేలో యాజమాన్యం రుతురాజ్‌పై వేటు వేసి.. రిషభ్ పంత్ (Rishabh Pant)ను తుదిజట్టులోకి తీసుకుంటుందనే ఊహాగానాలు వచ్చాయి. అయితే, మేనేజ్మెంట్ రుతుకు మరో అవకాశం ఇచ్చింది. రాయ్‌పూర్ వేదికగా రెండో వన్డేలో అతడిని ప్లేయింగ్ ఎలెవన్‌కు ఎంపిక చేసింది.77 బంతుల్లోనే సెంచరీఈసారి తనకు వచ్చిన అవకాశాన్ని రుతురాజ్ గైక్వాడ్ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. ఆది నుంచి దూకుడు ప్రదర్శించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 77 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డేల్లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. శతక్కొట్టిన తర్వాత కూడా జోరు కొనసాగించిన రుతురాజ్... మొత్తంగా 83 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 105 పరుగులు సాధించాడు.మరికొన్నాళ్లపాటు..సఫారీ పేసర్ మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో టోనీ డి జోర్జికి క్యాచ్ ఇవ్వడంతో రుతురాజ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. నిజానికి ఓపెనింగ్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే రుతురాజ్‌ను మేనేజ్మెంట్.. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బరిలోకి దింపింది. తొలి ప్రయత్నంలో దురదృష్టవశాత్తూ స్వల్ప స్కోరుకే వెనుదిరిగిన రుతు.. తాజా వన్డేలో శతకం సాధించి తనను తాను నిరూపించుకున్నాడు. మరికొన్నాళ్లపాటు జట్టులో కొనసాగే అర్హత సంపాదించాడు.Firsts are always special! 💪#RuturajGaikwad lights up Raipur with an epic knock to bring up his first ODI ton. 👏🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/uDZZ6h8ulN— Star Sports (@StarSportsIndia) December 3, 2025చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డుఇక వన్డేల్లో తన తొలి సెంచరీతోనే రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాయ్‌పూర్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ శతకం నమోదు చేసిన క్రికెటర్‌గా తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నాడు. కాగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో గల షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇప్పటి వరకు రెండు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది.ఆస్ట్రేలియాతో టీ20, న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్‌లు జరుగగా.. కివీస్‌తో వన్డేలో నాటి కెప్టెన్ రోహిత్ శర్మ 51 పరుగులు సాధించాడు. ఈ వేదికపై ఇప్పటి వరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉండగా.. తాజాగా సౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా రుతురాజ్ శతకం సాధించి.. రోహిత్ పేరును చెరిపేశాడు.మరో రెండు రికార్డులుఇక ఈ మ్యాచ్‌లో రుతురాజ్‌తో పాటు విరాట్ కోహ్లి కూడా శతకం (93 బంతుల్లో 102) సాధించాడు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇదిలా ఉంటే.. 77 బంతుల్లోనే శతక్కొట్టిన రుతురాజ్.. సౌతాఫ్రికాపై వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. అంతకు ముందు యూసఫ్ పఠాన్ 2011లో ప్రొటిస్ జట్టుతో 68 బంతుల్లోనే శతకం సాధించాడు. ఇక సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది.చదవండి: BCCI: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన -
BCCI: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియాలో మొత్తంగా పదిహేను మంది సభ్యులకు చోటిచ్చినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి బీసీసీఐ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.హార్దిక్ రీఎంట్రీ.. రింకూపై వేటుఇక వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) ఫిట్నెస్ ఆధారంగా అందుబాటులో ఉంటాడని బోర్డు ఈ సందర్భంగా వెల్లడించింది. అదే విధంగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) గాయం నుంచి కోలుకుని జట్టుతో చేరినట్లు తెలిపింది. అయితే, చాన్నాళ్లుగా టీ20 జట్టుతో కొనసాగుతున్న రింకూ సింగ్ (Rinku Singh)పై ఈసారి వేటుపడటం గమనార్హం. ఇవి తప్ప రెగ్యులర్ టీ20 జట్టులో పెద్దగా మార్పుల్లేకుండానే బీసీసీఐ జట్టును ప్రకటించింది.టెస్టులలో వైట్‌వాష్.. వన్డేలలో జోరుకాగా టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టెస్టు సిరీస్‌లో సఫారీల చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. తొలి వన్డేలో గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది.ఈ క్రమంలో డిసెంబరు 6న మూడో మ్యాచ్‌తో వన్డే సిరీస్ ముగియనుండగా.. డిసెంబరు 9- 19 వరకు టీ20 సిరీస్ నిర్వహిస్తారు. ఇక ప్రొటిస్ జట్టుతో తొలి టెస్టు సందర్భంగా మెడ నొప్పితో క్రీజును వీడిన టెస్టు సారథి గిల్.. రెండో టెస్టుతో పాటు వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్న గిల్.. టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదేసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్- ఫిట్‌నెస్‌కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్🏏తొలి టీ20: డిసెంబరు 9- కటక్, ఒడిశా🏏రెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్పూర్, చండీగఢ్🏏మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్🏏నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్🏏ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్, గుజరాత్.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి


