టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌లో లీగ్ దశ తుది అంకానికి చేరుకుంది. ఇరవై జట్లతో మొదలైన ఈ ఐసీసీ ఈవెంట్లో ఆస్ట్రేలియా మినహా అగ్రశ్రేణి జట్లన్నీ సూపర్-8కు చేరుకున్నాయి.
సూపర్-8 చేరిన జట్లు ఇవే
గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్... గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్-8 బెర్తులు ఖరారు చేసుకున్నాయి. కాగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ వరల్డ్‌కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 7న భారత్- శ్రీలంక వేదికగా మొదలైన టీ20 ప్రపంచకప్ పదో ఎడిషన్ లీగ్ దశ గురువారంతో ముగియనుంది.
ఎవరు ఎవరితో ఢీ?
అయితే, అంతకంటే ముందే అంటే బుధవారమే పాకిస్తాన్ నమీబియాపై గెలవడంతో సూపర్-8 బెర్తులు ఖరారైపోయాయి. గ్రూప్ దశలో నామమాత్రపు మ్యాచ్‌లలో వెస్టిండీస్- ఇటలీ.. శ్రీలంక- జింబాబ్వే.. అఫ్గనిస్తాన్- కెనడా గురువారం తలపడతాయి. మరి సూపర్-8 దశలో ఏ జట్టుకు ఏ జట్టుతో పోటీ? షెడ్యూల్, వేదికలు.. తదితర వివరాలు తెలుసుకుందామా?

8️⃣ TEAMS 4️⃣ SEMI-FINAL SPOTS
The race intensifies and the stakes are higher than ever as we enter the Super 8 phase! 🤩 🔥
Which four teams will move one step closer to their World Cup dream? Drop your predictions 👇
ICC Men's #T20WorldCup SUPER 8 👉 Starts SAT, 21st FEB pic.twitter.com/wsgnCWEXmx— Star Sports (@StarSportsIndia) February 19, 2026


