రుతుజా జోడీ ఓటమి | Rutuja Bhosle lost in Dubai Open WTA 1000 tournament | Sakshi
Sakshi News home page

రుతుజా జోడీ ఓటమి

Feb 19 2026 3:53 AM | Updated on Feb 19 2026 3:53 AM

Rutuja Bhosle lost in Dubai Open WTA 1000 tournament

దుబాయ్‌: భారత మహిళల టెన్నిస్‌ డబుల్స్‌ నంబర్‌వన్‌ రుతుజా భోస్లే దుబాయ్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ–1000 టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించింది. బుధవారం జరిగిన డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రుతుజా (భారత్‌)–పీంగ్‌టార్న్‌ ప్లిపుయెచ్‌ (థాయ్‌లాండ్‌) ద్వయం 3–6, 6–7 (4/7)తో నాలుగో సీడ్‌ అనా డానిలినా (కజకిస్తాన్‌)–అలెగ్జాండ్రా క్రునిక్‌ (సెర్బియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. 

తొలి రౌండ్‌లో రుతుజా–ప్లిపుయెచ్‌ 7–5, 6–2తో ఇరి హొజుమి (జపాన్‌)–ఫాంగ్‌ సియెన్‌ వు (చైనీస్‌ తైపీ)లపై గెలిచారు. ఈ విజయంతో సానియా మీర్జా (2022లో సిన్సినాటి ఓపెన్‌) తర్వాత డబ్ల్యూటీఏ–1000 లెవెల్‌ టోర్నీలో మ్యాచ్‌ గెలిచిన రెండో భారత ప్లేయర్‌గా రుతుజా గుర్తింపు పొందింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓడిన రుతుజా–ప్లిపుయెచ్‌లకు 17,200 డాలర్ల (రూ. 15 లక్షల 60 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 120 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.   

Advertisement
 
Advertisement
Advertisement