మాజీ ఎంపీ కూతురితో యువ హీరో నిశ్చితార్థం.. పెళ్లెప్పుడంటే? | Kannada Actor Dushyanth Engagement With Rachana, Set To Marry On February 26th, Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

గత నెలలో తొలి సినిమా రిలీజ్.. ఇప్పుడు పెళ్లికి రెడీ అయిన హీరో

Feb 16 2026 11:58 AM | Updated on Feb 16 2026 12:26 PM

Kannada Actor Dushyanth Engagement With Rachana

గత నెలలో 'గత వైభవం' అనే కన్నడ డబ్బింగ్ సినిమా రిలీజైంది. ఇదే మూవీతో హీరోగా పరిచయమైన దుష్యంత్ ఇప్పుడు శుభవార్త చెప్పేశాడు. రచనతో నిశ్చితార్థం చేసుకున్నాడు. తాజాగా ఈ వేడుక జరగ్గా.. ఈ నెల 26న గ్రాండ్‌గా పెళ్లి జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ పెళ్లి పిలుపులు.. ముఖ్యమంత్రికే తొలి ఆహ్వానం)

కర్ణాటకలోని గుబ్బి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న ఎస్ఆర్ శ్రీనివాస్ కుమారుడే దుష్యంత్. దాదాపు ఎనిమిదేళ్లుగా నటుడిగా శిక్షణ తీసుకున్నాడు. రీసెంట్‌గానే థియేటర్లలోకి 'గత వైభవ' అనే కన్నడ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. కన్నడలో ఇది పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నప్పటికీ తెలుగులో మాత్రం ఫ్లాప్ అయింది. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్.

ఇకపోతే ఎమ్మెల్యే కొడుకు అయిన దుష్యంత్.. తమ రాష్ట్రానికే చెందిన మాజీ ఎంపీ ఎస్పీ మద్దెహనుమగౌడ కుమార్తె రచనతో తాజాగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. మరో పదిరోజుల్లో వీళ్లిద్దరూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నెల 26నే టాలీవుడ్‌కి చెందిన విజయ్ దేవరకొండ-రష్మిక కూడా పెళ్లి చేసుకోనున్నారు. రాజస్థాన్ వేదికగా ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. కాకపోతే ఇప్పటివరకు ఈ విషయాన్ని అధికారికంగా అయితే ప్రకటించలేదు.

(ఇదీ చదవండి: బ్రిటీష్‌ వ్యక్తిని పెళ్లాడిన మలయాళ నటి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement