పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ? | Vijay Devarakonda Wedding Invites CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: ముఖ్యమంత్రిని కలిసిన విజయ్.. పెళ్లికి ఆహ్వానం?

Feb 15 2026 6:55 PM | Updated on Feb 16 2026 9:52 AM

Vijay Devarakonda Wedding Invites CM Revanth Reddy

హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఈ నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొన్నాళ్ల నుంచి ఈ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇద్దరిలో ఎవరూ కూడా దీన్ని ధ్రువీకరించడం లేదు. బహుశా పెళ్లి అయిపోయిన తర్వాత ఫొటోలు రిలీజ్ చేసి వెల్లడిస్తారేమో! సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు పెళ్లి పిలుపులు మొదలైపోయినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడమే దీనికి కారణం.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)

విజయ్ దేవరకొండ ఇప్పుడు కలిశాడంటే వేరే కారణాలేం లేవు. కచ్చితంగా పెళ్లికి ఆహ్వానించే విషయమై కలిసుంటారు. ఇందుకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది గానీ మిగతా వివరాలు అయితే రాలేదు. అసలు విషయానికొస్తే ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా విజయ్-రష్మిక డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. అందుకు తగ్గట్లే ఏ‍ర్పాట్లు చాలారోజులుగా జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 20నే ఇరు కుటుంబాలు రాజస్థాన్ వెళ్లనున్నారు.

ఈనెల 22వ తేదీ నుంచి పెళ్లి కార్యక్రమాలు అంటే హల్దీ, మెహందీ, సంగీత్ లాంటివి ఉండనున్నాయి. చివరగా 26వ తేదీన పెళ్లి. తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చేయనున్నారని తెలుస్తోంది. అయితే మార్చి తొలివారంలో టాలీవుడ్ సెలబ్రిటీల కోసం రిసెప్షన్ ఉండనుంది. దీని వివరాలు తెలియాల్సిఉంది. ఏదేమైనా వివాహ తేదీ దగ్గరపడినప్పటికీ విజయ్-రష్మిక.. పెళ్లి విషయాన్ని రహస్యం ఉంచుతూనే ఉన్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)

Advertisement
 
Advertisement
Advertisement