సోదరుడు లాంటి వ్యక్తి చనిపోయాడని రజనీకాంత్ సంతాపం | Baasha Producer Tamilazhagan No More | Sakshi
Sakshi News home page

ప్రముఖ నిర్మాత మృతి.. బాధని వ్యక్తం చేసిన సూపర్‌స్టార్

Feb 15 2026 4:05 PM | Updated on Feb 15 2026 4:45 PM

Baasha Producer Tamilazhagan No More

సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన సినిమాల్లో 'బాషా'కి ప్రత్యేక స్థానముంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ చిత్ర నిర్మాత మరణించారు. వృద్ధాప్య సమస్యలతో నిర్మాత తమిళగన్ తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే ఆయన మృతి పట్ల.. రజనీ సంతాపం వ్యక్తం చేశారు. బాధపడుతూ ట్వీట్ చేశారు.

(ఇదీ చదవండి: హీరో నిఖిల్ కౌంటర్ ఎవరికి? ఎందుకీ కామెంట్స్)

'సోదరుడు లాంటి అళగన్ మృతి నాకు అత్యంత బాధాకరమైన విషయం. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన కుటుంబానికి నా సానుభూతి' అని రజనీకాంత్ ట్వీట్ చేశారు. నేటి సాయంత్రం (ఫిబ్రవరి 15) తమిళగన్ అంత్యక్రియలు జరగనున్నాయి. రజనీ హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'బాషా' చిత్రాన్ని తమిళగన్, తన తల్ల రాజమ్మాళ్‌తో కలిసి నిర్మించారు. ఇతడి తండ్రి ఆర్ఎం వీరప్పన్ సమర్పకుడిగా వ్యవహరించారు. దీనితోపాటే మూండ్రు ముగం, పణక్కారన్, రాణువ వీరన్ కూడా తమిళగన్ నిర్మించారు. మందిరపున్నగై, నిలా పెన్నే చిత్రాలకు దర్శకుడిగానూ వ్యవహరించారు.

(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement