అది నా దురదృష్టం: రణ్‌బీర్‌ కపూర్‌ | Ranbir Kapoor about Taking Years to Finish a Movie: Its my Bad Luck | Sakshi
Sakshi News home page

Ranbir Kapoor: ఆ సినిమా కూడా వాయిదా.. అది నా బ్యాడ్‌ లక్‌!

Feb 15 2026 2:55 PM | Updated on Feb 15 2026 3:40 PM

Ranbir Kapoor about Taking Years to Finish a Movie: Its my Bad Luck

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌కు సొంతంగా బట్టల బిజినెస్‌ ఉంది. అదే ఆర్క్స్‌. గతేడాది ఫిబ్రవరి 14న ఈ బిజినెస్‌ మొదలుపెట్టాడు. ఈ వ్యాపారం మొదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆర్క్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో లైవ్‌లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించాడు. ప్రస్తుతం రణ్‌బీర్‌ లవ్‌ అండ్‌ వార్‌తో పాటు రామాయణ సినిమాలు చేస్తున్నాడు. అయితే లవ్‌ అండ్‌ వార్‌ రిలీజ్‌ పోస్ట్‌పోన్‌ అయినట్లు తెలిపాడు.

ఎదురుచూపులకు తగ్గ ఫలితం
అదేంటో మరి దురదృష్టం. నేనెప్పుడు సినిమా మొదలుపెట్టినా త్వరగా పూర్తవవు. అందరూ ఐదారు నెలల్లో సినిమా పూర్తి చేస్తారు. కానీ, నావి మాత్రం చాలా సమయం పడుతున్నాయి. అయితే అది రిలీజైనప్పుడు మాత్రం మీ ఎదురుచూపులకు తగ్గ ఫలితం లభించాలన్నదే నా కోరిక. రెండుమూడేళ్లుగా చాలా కష్టపడుతున్నాను. కొన్నింటికి సమయం తప్పదు. రామాయణ రిలీజ్‌ తర్వాతే లవ్‌ అండ్‌ వార్‌ వస్తుంది అని పేర్కొన్నాడు.

అనుకోకుండా అలా..
రామాయణ ఈ ఏడాది నవంబర్‌లో విడుదల కానుంది. తన కూతురు రాహా పుట్టిన నెల అయిన నవంబర్‌లోనే రామాయణ రిలీజ్‌ అవుతుండటం యాదృచ్ఛికమైనప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని పేర్కొన్నాడు. ప్రస్తుతం తన ఫేవరెట్‌ సినిమా ధురంధర్‌ అని చెప్పాడు. అందులో అందరూ అద్భుతంగా నటించారని రణ్‌బీర్‌ ప్రశంసించాడు.

చదవండి: తెరపై శివుడిగా మెప్పించిన హీరోలు

Advertisement
 
Advertisement
Advertisement