Ramayana movie
-
'రామాయణ' టీజర్‌పై విమర్శలు.. హృతిక్ రోషన్ కౌంటర్
రణ్‌బీర్ కపూర్ నటించిన ‘రామాయణ’ టీజర్‌పై షోషల్‌మీడియాలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా విడుదలైన టీజర్లో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఆశించినంత రేంజ్లో లేవని చిత్ర దర్శకుడు నితీశ్ తివారీపై కామెంట్లు చేస్తున్నారు. ఆన్లైన్లో మిశ్రమ స్పందనలను ఎదుర్కొంటున్న తరుణంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ స్పందించారు. విజువల్ ఎఫెక్ట్స్‌పై తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వివరణాత్మక నోట్‌ను పంచుకున్నారు. ఆయన ఏ సినిమా పేరు ప్రస్తావించనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు చేసిన సమయం మాత్రం ప్రస్తుతం జరుగుతున్న చర్చలో భాగంగానే నిలుస్తోంది.నాసిరకం విఎఫ్ఎక్స్ (VFX) ఉన్నాయని హృతిక్ అంగీకరించినప్పటికీ, విజువల్స్‌ను కేవలం వాస్తవికత ఆధారంగానే అంచనా వేయకూడదని స్పష్టం చేశారు. సినిమాలు, ముఖ్యంగా ఫాంటసీ, పౌరాణిక చిత్రాలు, వాస్తవికతను ప్రతిబింబించేలా మాత్రమే విజువల్స్ ఉంటాయని పేర్కొన్నారు. వీఎఫ్ఎక్స్ అంటే కేవలం వాస్తవానికి దగ్గరగా ఉండటమే కాదంటూనే.. ఒక్కో దర్శకుడు ఒక్కో శైలిని ఎంచుకుంటారని క్లారిటీ ఇచ్చారు. కొన్నిసార్లు అది ‘స్టోరీ బుక్’ తరహాలో కూడా ఉండవచ్చిని పేర్కొన్నారు.ఇలాంటి ప్రాజెక్టుల వెనుక ఉండే కృషి స్థాయిని కూడా హృతిక్ రోషన్ నొక్కిచెప్పారు. విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉండే చిత్రాల కోసం సంవత్సరాల తరబడి మేకర్స్ పనిచేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ప్రేక్షకుల అభిప్రాయాన్ని కొట్టిపారేయకుండా వారి అంచనాలకు మించి విఎఫ్ఎక్స్ ఉండాలని సూచించారు.కల్కి 2898 AD, బాహుబలి, రామాయణ వంటి భారీ సినిమాలు నిర్మించిన వారు అసలైన హీరోలని ప్రశంసించారు. గతంలో ఎవరూ చేయలేని సాహసాన్ని చేస్తున్నారని గుర్తుచేశారు. రామాయణ సినిమాలోని వీఎఫ్ఎక్స్ వీడియో గేమ్ లాగా ఉన్నాయన్న విమర్శలపై హృతిక్ టెక్నికల్‌గా సమాధానమిచ్చారు. -
రామాయణలో మరో పవర్ఫుల్ పాత్రలో రణ్‌బీర్
భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా చాలా సినిమాలు ఇప్పటికే అలరించాయి. ఈ క్రమంలో హిందీలో ‘రామాయణ’ చిత్రాన్ని నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. అయితే, ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తాజాగా ఈ మూవీ గురించి రణ్‌బీర్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఇందులో తను ద్విపాత్రాభినయం చేసినట్లు పేర్కొన్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ సంస్థ, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై భారీ బడ్జెట్‌తో నమిత్ మల్హోత్రా ఈ సినిమాను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.ఒక వేదికపై రణ్‌బీర్ మాట్లాడుతూ రామాయణ చిత్రంలో శ్రీరాముడి పాత్రతో పాటు పరశురాముడిగా కూడా నటిస్తున్నట్లు ప్రకటించారు. శ్రీ మహావిష్ణువు ఆరో అవతారం పరశురాముడిగా కూడా నటించే ఛాన్స్ తనకు రావడం నిజంగానే అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఒక నటుడిగా, హావభావాలతో పాటు ఆ పాత్రల వెనుక దాగిన ఆధ్యాత్మికతను, భావోద్వేగాలను లోతుగా అర్థం చేసుకున్నానని తెలిపారు. రామాయణం గురించి పూర్తిగా తెలుసుకునేందుకు సుమారు ఏడాది పాటు సమయం కేటాయించానని ఆయన అన్నారు. -
రామాయణతో ఓటీటీ బిగ్ డీల్.. నో చెప్పిన నిర్మాత!
రామాయణ మూవీ నుంచి రాముడి పాత్రను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ఒక వీడియోను షేర్ చేసింది. దీంతో సినిమాపై బజ్ పెరిగిపోయింది. ఓటీటీ నుంచి కూడా భారీ ఢీల్ వచ్చినట్లు సమాచారం. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్ ఆహార్యం ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. అయోధ్యలోకి ఆయన ఎంట్రీ సీన్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేలా ఉంది. ఇందులో సీతగా సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్-1 ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో నమిత్ మల్హోత్రా, కన్నడ నటుడు యష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలు కలిపి సుమారు రూ. 4వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుందని సమాచారం.రెండు భాగాలుగా విడుదల కానున్న ‘రామాయణ’ చిత్రానికి ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఏకంగా రూ. 1000 కోట్ల వరకు ఓటీటీ హక్కుల కోసం చెల్లించేందుకు ముందుకు వచ్చారట. అయితే ఈ భారీ ఆఫర్‌ను నిర్మాత నమిత్ మల్హోత్రా తిరస్కరించి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి దీర్ఘకాలిక విలువ, ప్రపంచవ్యాప్త సామర్థ్యంపై మల్హోత్రాకు గట్టి నమ్మకం ఉన్నందువల్లే ఆయన ఈ ఒప్పందాన్ని తిరస్కరించారని తెలుస్తోంది. రామాయణ సినిమాతో వెంటనే లభించే ఆర్థిక లాభం కోసం కాకుండా, ఈ ప్రాజెక్ట్ ఫ్రాంచైజీని ప్రపంచవ్యాప్త చలనచిత్ర దృశ్యంగా తీర్చిదిద్దడంపై ఆయన దృష్టి సారిస్తున్నారని చెబుతున్నారు. దీంతో అనేక దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసి మరింత లాభాన్ని పొందవచ్చు అనేది నిర్మాతల వ్యూహమని అంటున్నారు. వెయ్యి కోట్ల ఓటీటీ ఆఫర్‌ను కాదనడంతో సినీ వర్గాలను ఆశ్చర్యపరిచినప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌పై చిత్ర నిర్మాతలకు ఉన్న నమ్మకాన్ని కూడా ఇది ప్రతిబింబిస్తుంది. ఇంతటి భారీ అంచనాలు ఉండటం వల్లనే రామాయణ మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. -
వీరులు పుట్టకముందే.. రాముడు ఉన్నాడు.. రామాయణం టీజర్ చూస్తే గూస్ బంప్స్ పక్కా
-
రూ.4,000 కోట్ల బడ్జెట్.. ఇదెలా మర్చిపోయారు? వీడియో వైరల్
కొన్ని కథలు తెరపై ఎన్నిసార్లు చూపించినా చూడాలనిపిస్తుంది. తెలిసిన కథే అయినా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. అలాంటి ఇతిహాస కథే రామాయణం. రాముడి కథను మరోసారి సినీప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు సినిమా వస్తోంది.. అదే రామాయణ. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ కోసం దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్ కేటాయించారు.టీజర్లో ఇది గమనించారా?హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం (ఏప్రిల్ 2న) టీజర్ కూడా వదిలారు. ఇందులో రాముడు శివధనస్సు విరిచినప్పటినుంచి అరణ్యవాసం వరకు అనేక విషయాలకు సంబంధించిన గ్లింప్స్‌ను జత చేశారు. అయితే శ్రీరాముడు నగర వీధుల్లో నడుస్తుంటే జనం పూలతో స్వాగతం పలికే చిన్న క్లిప్‌లో ఓ పొరపాటు దొర్లింది. ఓ వ్యక్తి తలపాగా ఉన్నట్లుండి రంగు మారింది. మొదట నీలిరంగులో, తర్వాత వంకాయ కలర్లో.. ఆ తర్వాత మళ్లీ నీలిరంగులోకి మారింది. అలా వదిలేశారేంటి?34 సెకన్ల నుంచి 38 సెకన్ల నిడివి మధ్యలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్ మూవీలో ఈ చిన్న తప్పిదాన్ని అలాగే వదిలేశారేంటి? అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఇది వీఎఫ్ఎక్స్ సమస్య కాదని కలర్ గ్రేడింగ్ వల్ల అలా జరిగిందని, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదంటున్నారు.సినిమారామాయణ విషయానికి వస్తే.. నితీశ్ తివారి దర్శకత్వం వహించిన ఈ మూవీని నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. 8సార్లు ఆస్కార్ పొందిన డీఎన్ఈజీ సంస్థ ఈ మూవీకి వీఎఫ్ఎక్స్ చేసే బాధ్యతలను చేపట్టింది. హన్మ్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. Notice the blue turban guy next to the kid his turban colour changes to purple in between shots 😳😳₹4000 Cr Movie has new technology altogether it seems 🤩🤩#Ramayana pic.twitter.com/Bu48kWPhlq— Pan India Review (@PanIndiaReview) April 3, 2026 చదవండి: యుగానికి ఒక్కడు సీక్వెల్.. నేనైతే అస్సలు చేయను: ఆండ్రియా -
అప్పుడేమో విరక్తి.. ఇప్పుడేమో ప్రశంసలు కురిపించిన 'సీత'
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న చిత్రం రామాయణ. నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నమిత్ మల్హోత్రా వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. నిన్న (ఏప్రిల్ 2న) హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణ టీజర్ వదిలారు. టీజర్లో రాముడిని హైలైట్ చేసి చూపించారు. సీత, హనుమంతుడు, రావణాసురులను చూపించలేదు.టీజర్‌పై సీత ప్రశంసలుఈ టీజర్‌పై రామాయణ్ టీవీ సీరియల్లో సీతగా నటించిన దీపిక చికిల ప్రశంసలు కురిపించింది. టీజర్ చూశాను, చాలా బాగుంది. ఎంతో రిచ్‌గా, అద్భుతంగా తీశారు. ఒక అందమైన కావ్యంలా కనిపిస్తోంది, అందులో డౌటే లేదు. ఈ మూవీ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను అని చెప్పుకొచ్చింది. అయితే దీపిక గతంలో రామాయణ కథపై సినిమాలు తీయడాన్ని విమర్శించింది. అప్పుడేమో విరక్తి'రామాయణాన్ని పదేపదే తెరకెక్కించాలని చూస్తున్నవారిని చూస్తుంటే విరక్తిగా అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్లు తెరకెక్కించిన ప్రతిసారి ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తారు. కొత్త యాంగిల్, కొత్త లుక్.. ఇలా ఏదో ఒకటి డిఫరెంట్‌గా ఉండాలని ట్రై చేస్తారు. అలా వారు యదార్థ కథను నాశనం చేస్తున్నారు. కాబట్టి రామాయణంపై సినిమాలు తీయకపోవడమే మంచిది' అని దీపిక అభిప్రాయపడింది. ఇప్పుడు ఆమె తన మనసు మార్చుకుని రామాయణపై ప్రశంసలు కురిపించడం విశేషం!సీరియల్- సినిమాఇకపోతే దీపిక.. 1980లో దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణ సీరియల్లో సీతాదేవిగా నటించింది. ఇందులో అరుణ్ గోవిల్ రాముడిగా అరవింద్ త్రివేది రావణుడిగా, సునీల్ లహ్రి లక్ష్మణుడిగా, దారా సింగ్ హనుమంతుడిగా యాక్ట్ చేశారు. ఇక నితీశ్ తివారి రామాయణ విషయానికి వస్తే.. 8సార్లు ఆస్కార్ పొందిన డీఎన్ఈజీ అనే సంస్థ ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ అందిస్తోంది. యశ్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా కనిపించనున్నారు. ఈ మూవీ మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది.చదవండి: వెండితెరపై వీరుల పోరాటం -
'రామాయణ' టీజర్ రిలీజ్.. అయోధ్య నుంచి అరణ్యం వరకు!
చలనచిత్రపరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ 'రామాయణ'. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవిగా సీతగా నటిస్తున్న ఈ చిత్రానికి నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్నాడు. నేడు (ఏప్రిల్ 2) హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణ టీజర్ వదిలారు. అధర్మం వల్ల లోకం అస్తవ్యస్తమైనప్పుడు.. దాన్ని సరిచేసేందుకు ఎల్లప్పుడూ ఆయనే వస్తాడు. 5 వేల ఏళ్లుగా మన హృదయాల్లో కొలువై, మనల్ని రక్షిస్తున్న నాయకుడు, పురాణ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు రాముడు అంటూ టీజర్లో పేర్కొన్నారు. టీజర్ రిలీజ్ఈ వీడియోలో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. రాముడు శివధనస్సు విల్లు ఎత్తినట్లుగా, వనవాసం చేసినట్లు, యుద్ధం చేసినట్లుగా.. పలు ఘట్టాలను క్లుప్తంగా చూపించారు. అంటే అయోధ్య నుంచి అరణ్యం వైపు సాగిన ప్రయాణాన్ని, రాక్షసులతో జరిగిన యుద్ధాన్ని కూడా చూపించారు. ఇందులో కేవలం రాముడి పాత్రను మాత్రమే రివీల్ చేశారు. రావణుడు, సీతల పాత్రలను చూపించలేదు. కేవలం 2 నిమిషాల 28 సెకన్ల నిడివితో ఉన్న ఈ వీడియోలో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమాచివర్లో రావణుడి ఫేస్ రివీల్ కాకుండా ఆయన ఆహార్యాన్ని వెనక నుంచి చూపించారు. అది ఈ గ్లింప్స్‌కి హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి వీడియో అదిరిందని, తమ ఎదురుచూపులకు తగ్గ ఫలితం లభించిందని సినీప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. కాగా యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్న రామాయణ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం ఈ ఏడాది దీపావళిలో విడుదలవుతుండగా రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి రానుంది. నమిత్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. -
రామాయణలో శ్రీరాముడి పాత్ర చేయనన్నా..: రణ్‌బీర్ కపూర్
దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ కోసం దాదాపు రూ.4 వేల కోట్లు కేటాయించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సౌత్ సెన్సేషన్ హీరోయిన్ సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. రాఖీభాయ్ యష్ రావణుడిగా కనిపించనున్నాడు.రిజెక్ట్ చేశా..అయితే ఈ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు ఎగిరి గంతేయడానికి బదులుగా రిజెక్ట్ చేసేందుకే మొగ్గు చూపానంటున్నాడు రణ్‌బీర్ కపూర్. న్యూయార్క్‌లో రామాయణ దర్శకుడు నితీశ్ తివారి, నిర్మాత నమిత్ మల్హోత్రాతో కలిసి ఓ ఈవెంట్‌కు హాజరయ్యాడు రణ్‌బీర్. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితమే నితేశ్ తివారి నాకు రామాయణ సినిమా గురించి చెప్పాడు. ప్రధాన పాత్రలో నటించమని కోరగా నేను క్షణం ఆలోచించకుండా నో చెప్పాను.కీలకమైన మలుపునేను ఆ పాత్రకు సెట్ అవనేమో, బాగోనేమో అని నాపై నాకే అనుమానం వేసింది. రాముడి పాత్రకు నేను పూర్తి న్యాయం చేయలేనని తిరస్కరించాను. కానీ, ఆ భయం చాలా త్వరగానే కనుమరుగవగా అంత మంచి ఛాన్స్ వచ్చినందుకు సంతోషించాను. ఎందుకంటే ఇటువంటి అవకాశాలు నా జీవితానికి చాలా అవసరమయ్యాయి. ఆ సమయంలో నేను తండ్రినయ్యాను. నా పద్ధతుల్ని, జీవితాన్ని మార్చుకోవాల్సిన దశలో ఉన్నాను. శ్రీరాముడి పాత్ర పోషించడం, తొలిసారి తండ్రి కావడం యాదృచ్ఛికమే అయినప్పటికీ నా జీవితాన్ని కీలక మలుపు తిప్పిన అందమైన అనుభూతి అని చెప్పుకొచ్చాడు.సినిమాకాగా రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కొంతకాలం పాటు ప్రేమలో మునిగి తేలారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. వీరికి అదే ఏడాది నవంబర్‌లో కూతురు రాహా జన్మించింది. రామాయణ విషయానికి వస్తే.. ఏర్ రెహ్మాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది అక్టోబర్‌లో దీపావళికి విడుదలవుతుండగా రెండో భాగం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న రామాయణ సినిమా గ్లింప్స్ విడుదల కానుంది.చదవండి: గుడిలో గిన్నెలు కడిగిన ప్రియాంక చోప్రా -
రామాయణలో 'కుంభకర్ణ'గా ఆ నటుడు!
ఇండియన్ బిగ్స్క్రీన్పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. ఈ రెండు భాగాలకు కలిపి దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అంటే సినిమాను ఎంత విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నారో ఇక్కడే అర్థమైపోతోంది.రామాయణ సినిమాఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. అలాగే సన్నీడియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. తాజాగా రావణుడి సోదరుడు, కుంభకర్ణుడి పాత్ర గురించి ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. మొన్నటివరకు బాబీ డియోల్ కుంభకర్ణుడిగా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మరో నటుడి పేరు తెరపైకి వచ్చింది.కుంభకర్ణుడిగా..అతడే ఫైజల్ మాలిక్. పంచాయత్ వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఇతడిని కుంభకర్ణుడిగా ఎంపిక చేయగా, అతడిపై సీన్స్ చిత్రీకరించారని తెలుస్తోంది. అతడి అవతారం కుంభకర్ణుడి పాత్రకు సరిగ్గా సరిపోయిందని ఇన్సైడ్ వర్గాల టాక్! మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఇకపోతే మార్చి 27న శ్రీరామనవమిని పురస్కరించుకుని రామయణ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి భాగం ఈ ఏడాది దీపావళికి విడుదల చేస్తుండగా రెండో భాగాన్ని 2027 దీపావళికి రిలీజ్ చేయనున్నారు.సినిమాలు, సిరీస్లుఫైజల్ మాలిక్.. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమాలో కామెడీ పోలీస్‌గా నటించాడు. పంచాయత్ వెబ్ సిరీస్‌లో డిప్యూటీ ప్రధాన్ ప్రహ్లాద్చాగా అలరించాడు. ఆ తర్వాత కూడా పలు సినిమాలు, సిరీస్‌లు చేశాడు. చివరగా హారర్ కామెడీ మూవీ థామాలో పోలీస్‌గా కనిపించాడు.చదవండి: నాగార్జున వల్లే నా కూతురు సినిమాల్లోకి..: ప్రియదర్శన్ -
అది నా దురదృష్టం: రణ్‌బీర్ కపూర్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు సొంతంగా బట్టల బిజినెస్ ఉంది. అదే ఆర్క్స్. గతేడాది ఫిబ్రవరి 14న ఈ బిజినెస్ మొదలుపెట్టాడు. ఈ వ్యాపారం మొదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆర్క్స్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో లైవ్‌లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించాడు. ప్రస్తుతం రణ్‌బీర్ లవ్ అండ్ వార్తో పాటు రామాయణ సినిమాలు చేస్తున్నాడు. అయితే లవ్ అండ్ వార్ రిలీజ్ పోస్ట్‌పోన్ అయినట్లు తెలిపాడు.ఎదురుచూపులకు తగ్గ ఫలితంఅదేంటో మరి దురదృష్టం. నేనెప్పుడు సినిమా మొదలుపెట్టినా త్వరగా పూర్తవవు. అందరూ ఐదారు నెలల్లో సినిమా పూర్తి చేస్తారు. కానీ, నావి మాత్రం చాలా సమయం పడుతున్నాయి. అయితే అది రిలీజైనప్పుడు మాత్రం మీ ఎదురుచూపులకు తగ్గ ఫలితం లభించాలన్నదే నా కోరిక. రెండుమూడేళ్లుగా చాలా కష్టపడుతున్నాను. కొన్నింటికి సమయం తప్పదు. రామాయణ రిలీజ్ తర్వాతే లవ్ అండ్ వార్ వస్తుంది అని పేర్కొన్నాడు.అనుకోకుండా అలా..రామాయణ ఈ ఏడాది నవంబర్‌లో విడుదల కానుంది. తన కూతురు రాహా పుట్టిన నెల అయిన నవంబర్లోనే రామాయణ రిలీజ్ అవుతుండటం యాదృచ్ఛికమైనప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని పేర్కొన్నాడు. ప్రస్తుతం తన ఫేవరెట్ సినిమా ధురంధర్ అని చెప్పాడు. అందులో అందరూ అద్భుతంగా నటించారని రణ్‌బీర్ ప్రశంసించాడు.చదవండి: తెరపై శివుడిగా మెప్పించిన హీరోలు -
మద్యానికి, సిగరెట్‌కు గుడ్‌బై.. శాకాహారిగా మారిపోయిన రణ్‌బీర్!
ఉన్నది ఒక్కటే జిందగీ.. నాకు నచ్చినట్లు బతికేస్తా అని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కుదరదు. ఆరోగ్యాన్ని లెక్క చేయకపోతే వెంటనే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వయసుపైబడే కొద్దీ మరింత జాగ్రత్తగా ఉండాలి. సెలబ్రిటీలైతే నోరు చంపుకుని, వ్యసనాలు వదిలించుకుని ఫిట్‌నెస్‌పై మరింత ఫోకస్ పెంచాల్సి ఉంటుంది. అందులోనూ ఆధ్యాత్మిక సినిమాలు చేస్తున్నప్పుడు కొందరు చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా నిష్టగా ఉంటారు. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) కూడా అదే చేశాడు.శాఖాహారిగా మారిపోయాప్రస్తుతం ఇతడు దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణలో శ్రీరాముడిగా నటిస్తున్నాడు. సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు. రామాయణ (Ramayana Movie) ప్రారంభానికి ముందు రణ్‌బీర్ తన లైఫ్స్టైల్లో చాలా మార్పులుచేర్పులు చేసుకున్నాడు. సిగరెట్ తాగడం మానేశాడు, మద్యపానానికి గుడ్‌బై చెప్పాడు. పూర్తిగా శాకాహారిగా మారినట్లు తెలిపాడు. యోగా, ధ్యానం కూడా చేస్తున్నానని పేర్కొన్నాడు. రామాయణ మూవీ ప్రారంభానికల్లా చెడు అలవాట్లు శాశ్వతంగా మానేస్తానని తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. రణ్‌బీర్ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.సినిమారామాయణ సినిమాను నితీశ్ తివారి డైరెక్ట్ చేస్తున్నాడు. దాదాపు రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో రామాయణ రెండు భాగాలుగా తెరకెక్కించనున్నామని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించారు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీలో లక్ష్మణుడిగా రవిదూబే, హనుమంతుడిగా సన్నీడియోల్ నటిస్తున్నారు. రామాయణ పార్ట్ 1.. 2026 దీపావళికి, రామాయణ పార్ట్ 2.. 2027 దీపావళికి రిలీజ్ కానున్నాయి. రామాయణ్‌తో పాటు రణ్‌బీర్ మరో సినిమా చేస్తున్నాడు. భార్య, హీరోయిన్ ఆలియా భట్‌తో కలిసి లవ్ అండ్ వార్ మూవీ చేస్తున్నాడు. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2026 మార్చి 20న విడుదల కానుంది. 🚨 Ranbir Kapoor has given up smoking, drinking, and has even turned vegetarian — all in preparation for his role as Lord Ram in #Ramayana. A true embodiment of discipline and devotion. ✨🔥 pic.twitter.com/W5F3akrREK— Ramayana: The Epic (@RamayanaMovieHQ) September 7, 2025 చదవండి: నా కడుపులో తన్నాడు, ముఖంపై పిడిగుద్దులు..: బుల్లితెర నటి -
ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా హాలీవుడ్ రేంజ్ లో రామాయణం
-
హీరోయిన్లకు 'సీత' కష్టాలు
సీత లేనిదే రామాయణం లేదు. సీత లేకుండా రాముని జీవితాన్ని అసలు ఊహించలేం.. సీతలోని సుగుణాలు నేటి మహిళలకు ఎంతో ఆదర్శమని చెప్పవచ్చు. దయ.. ధైర్యం.. ఆత్మాభిమానం వంటి సకల గుణాల కలబోత.. మన సీతమ్మ తల్లి! అయితే, సినీ రంగంలో ఆమె పాత్రను ఎవరు పోషించినా ఆ నటిపై విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. వారు ట్రోలింగ్‌తో పలు కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఆ మధ్య శ్రీరామరాజ్యం చిత్రంలో సీతగా నటి నయనతార నటించడాన్ని కొందరు తీవ్రంగా విమర్శించారు. సాంగీక చిత్రాల్లో అందాలను విచ్చల విడిగా ఆరబోసిన ఈమె ఏంటీ సీతాదేవిగా నటించడమని విమర్శించారు. అయితే ఆ చిత్రం విడుదలయిన తరువాత సీతగా నయనతార ఒదిగిపోయారు అనే ప్రశంసలు కురిపించారు. అదే విధంగా ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్ చిత్రంలో సీతగా బాలీవుడ్ భామ కృతీసనన్ నటించినప్పుడూ ఆమె గురించి ట్రోలింగ్ చేశారు. ఆ చిత్రం ప్రేక్షకుల్లో పెద్దగా ప్రభావం చూపలేదు కాబట్టి ఆ విమర్శల్లో అర్థం ఉందనుకుందాం. కానీ, ఇప్పుడు నటి సాయిపల్లవిపై కూడా విమర్శలు చేయడమే చర్చనీయాంశంగా మారింది. ఆది నుంచి సహజత్వానికి ప్రాముఖ్యత నిస్తున్న నటి సాయిపల్లవి. పెదాలకు లిప్‌స్టిక్ వేసుకోవడానికి కూడా వద్దనే చెప్పే నటి ఈమె. ఇక నటిగా ఎలాంటి పాత్రనైనా ప్రాణం పెట్టి నటించే సాయిపల్లవి బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన తరువాత ట్రోలింగ్‌కు గురౌతున్నారనిపిస్తోంది. రామాయణం ఇతిహాసంతో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో సీత పాత్రలో నటి సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. సీతాదేవిగా ఆమె నటించడం రామాయణం కావ్యాన్నే అవమానపరిచినట్లు అని బాలీవుడ్లో విమర్శలు చేస్తున్నారు. అదే విధంగా ఆ చిత్రంలో శూర్పణక పాత్రలో నటిస్తున్న రకుల్‌ప్రీత్ సింగ్‌తో కలిసి నటి సాయిపల్లవిపైనా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా రామాయణ చిత్రంలో రాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్, యష్ రావణాసురుడిగా నటించిన కొన్ని సన్నివేశాలు విడుదలయిన తరువాత ట్రోలింగ్స్ అధికం అవుతున్నాయి. అయితే ఎలాంటి విమర్శలను పట్టించుకోకుండా నటి సాయిపల్లవి తన నటనపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు. కారణం చిత్రం విడుదలైన తరువాత తన నటనే అలాంటి వారికి సమాధానం చెబుతుందనే ఆమె ధైర్యం కావచ్చు. -
సీతగా 'సాయిపల్లవి'నే ఎందుకు.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
భారత సినీ పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా 'రామాయణ'.. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఏకంగా రూ. 4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి నితేశ్ తివారీ దర్శకుడు. ఇందులో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ టీమ్ మాట్లాడుతూ సీతగా సాయిపల్లవిని ఎందుకు ఎంపిక చేశారో పేర్కొంది.సీతా దేవి పాత్ర కోసం చాలామందిని అనుకున్నాం. కానీ, సాయిపల్లవిని ఫైనల్ చేయడానికి తమకు చాలా కారణాలు ఉన్నాయిని రామాయణ చిత్ర యూనిట్ పేర్కొంది. ఆమె గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండటమే కాకుండా తన అందం కోసం ఆమె ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని తెలిపింది. సహజ అందమే తమ సినిమాకు బాగుంటుందని అనుకున్నామని, అలా ఒక సందేశం ఇచ్చినట్లు ఉంటుందని టీమ్ రామాయణ ప్రకటించింది. సాయి పల్లవి మంచి నటి కూడా.. ఎలాంటి పాత్రనైనా సులువుగా చేయగలదు. సీత పాత్ర తనకు ఎంతో పేరు తప్పకుండా తెస్తుందని వారు తెలిపారు. రాముడిగా రణ్‌బీర్‌ను తీసుకోవడానికి కారణం ఆయన మొఖంలో చాలా ప్రశాంతత కనిపిస్తుందని చెప్పారు. తనలోని వ్యక్తిత్వమే కాకుండా గొప్పగా నటించే నైపుణ్యం తనలో ఉందని మేకర్స్ చెప్పారు. ఈ మూవీ మొదటి పార్ట్ 2026 దీపావళికి, రెండోది 2027 దీపావళికి విడుదల కానున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ హిట్ సినిమా'లార్డ్ ఆఫ్ ది రింగ్స్'కు పనిచేసిన స్టంట్ డైరెక్టర్ టెర్రీ ‘రామాయణ’ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారని మేకర్స్ ప్రకటించారు. వానరసేన, హనుమాన్‌లతో కనిపించే సన్నివేశాలకు సంబంధించి ఆయన క్రియేట్ చేసిన ప్రపంచానికి అందరూ ఫిదా అవుతారని తెలిపారు. 'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్'లో ఏ విధంగానైతే వీఎఫ్ఎక్స్ పనితీరు ఉంటుందో అదే విధంగా రామాయణ చిత్రంలోని వానరసేన అంతే సహజంగా ఉంటుందని టీమ్ తెలిపింది. -
శూర్పణఖగా 10th క్లాస్ అమ్మాయి.. ఆమె ఎవరంటే?
సినిమాను విజువల్ వండర్లా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఎంత ఖర్చయినా వెనక్కు తగ్గడం లేదు నిర్మాతలు. మామూలు సినిమాకు కూడా రూ.100 కోట్ల బడ్జెట్ అనేది సాధారణమైపోయింది. ఆర్ఆర్ఆర్, కల్కి 2898ఏడీ, ఆదిపురుష్.. ఇవన్నీ అయితే రూ.500 కోట్లపైనే పెట్టి తీశారు. అయితే భారతీయ సినీచరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రామాయణ చిత్రం (Ramayana Movie) తెరకెక్కుతోంది. నితీశ్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా నటిస్తున్నారు. బాల శూర్పణఖగా..రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. శూర్పణఖ పాత్ర కోసం ప్రియాంక చోప్రాను సంప్రదించగా ఆమె బిజీగా ఉండటంతో అవకాశాన్ని వదిలేసుకుందట. దీంతో ఈ రోల్ రకుల్‌కు వెళ్లిందని ప్రచారం జరిగింది. లేటెస్ట్ టాక్ ప్రకారం.. పదిహేనేళ్ల దిశిత సెగల్‌ను బాల శూర్పణఖగా వెండితెరపై చూపించాలని ప్రయత్నిస్తున్నారట! ఆడిషన్‌తో పాటు లుక్ టెస్ట్ కూడా అయిపోందని, తనపై కొన్ని సీన్లు కూడా చిత్రీకరించారని బీటౌన్‌లో ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.ఎవరీ దిశిత సెగల్?నాలుగేళ్లే వయసులోనే వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది దిశిత. బేబీ సినిమాలో అక్షయ్ కుమార్ కూతురిగా, డియర్ జిందగీలో చిన్నారి ఆలియా భట్లా యాక్ట్ చేసింది. వార్, హిందీ మీడియం చిత్రాల్లోనూ నటించింది. ఇటీవలే బెహాన్ డర్గయినా అనే ఓటీటీ షోలోనూ మెరిసింది. View this post on Instagram A post shared by Dishita Sehgal🧿 (@cutiepiedishita) చదవండి: జీవితంలో తొలిసారి పిడకలు చేశా.. ఆ మరునాడే..: నిత్యామీనన్ -
'రామాయణ' బడ్జెట్ రివీల్ చేసిన నిర్మాత.. మీ ఊహకు కూడా అందదు
రామాయణం మానవ జీవితానికి అవసరమైన విలువలను, మార్గదర్శకత్వాన్ని అందించే ఒక గొప్ప గ్రంథం. మన రాముడి గురించి 'రామాయణ' సినిమా ద్వారా ప్రపంచానికి బాలీవుడ్ చూపనుంది. తాజాగా విడుదలైన గ్లింప్స్ విజువల్స్ అద్బుతంగా ఉన్నాయంటూ గ్రాఫిక్స్ వర్క్‌పై ప్రశంసలు అందుతున్నాయి. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రాల బడ్జెట్ గురించి నమిత్ మల్హోత్రా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.రూ. 4 వేల కోట్ల బడ్జెట్ఇటీవల జరిగిన పాడ్‌కాస్ట్‌లో, నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. రామాయణంలోని రెండు భాగాలకు దాదాపు $500 మిలియన్లు, అంటే దాదాపు రూ. 4000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దీంతో రామాయణం అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు విడుదలైన భారతీయ చిత్రాల బడ్జెట్లు ఏవీ 1000 కోట్లు దాటలేదు. ఈ బడ్జెట్‌తో రామాయణం ప్రపంచ సినిమాల్లో అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీలలో ఒకటిగా కూడా మారనుంది. ఇప్పటివరకు ఈ చిత్రాల బడ్జెట్ రూ. 1500 కోట్ల వరకు ఉంటుందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు నిర్మాత చెప్పిన లెక్కలు చూస్తుంటే కళ్లు చెదిరేలా ఈ మూవీ ఉండబోతుందని అర్థం అవుతుంది."పార్ట్ 1, పార్ట్ 2 రెండు సినిమాలు కలిపి పూర్తయ్యే సమయానికి ఇది దాదాపు $500 మిలియన్లు అవుతుంది, అంటే దాదాపు రూ. 4000 కోట్లు. ప్రపంచం చూడవలసిన గొప్ప కథ రామాయణం. మేము ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నాము. అయితే, ఇది ఇప్పటికీ కొన్ని హాలీవుడ్ చిత్రాల బడ్జెట్ల కంటే తక్కువేనని నేను భావిస్తున్నాను. తక్కువ ఖర్చుతో పెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నామని నేను భావిస్తున్నాను. ఈ చిత్రం కేవలం డబ్బు కోసమే చేస్తుంది కాదు. ప్రపంచానికి మన రాముడి గురించి చెప్పాలని అనుకున్నాను.' అని నమిత్ అన్నారు. 20కి పైగా భాషలుహాలీవుడ్లోని ఇతర సినిమాల మాదిరిగానే రామాయణం కూడా ప్రపంచవ్యాప్తంగా సుమారు 20కి పైగా భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని DC కామిక్స్ హిట్ చిత్రాలు బ్యాట్మన్, సూపర్ మెన్, వండర్ వుమన్ వంటి వాటితో పాటు మార్వెల్ సినిమాలకు తగ్గకుండా రామాయణ ప్రాజెక్ట్ రూపొందించాలని మేకర్స్ యోచిస్తున్నారు. మొదటి భాగం 2026 దీపావళి సందర్భంగా విడుదల కానుంది. రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా తెరపైకి రానుంది. -
'రామాయణ' కోసం వారిద్దరికి భారీ రెమ్యునరేషన్
బాలీవుడ్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’ (Ramayana). దంగల్ మూవీ దర్శకుడు నితీశ్ తివారీ (Nitesh Tiwari) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రాముడిగా బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తుండగా.. సీతగా సాయిపల్లవి కనిపించనున్నారు. అయితే, వారిద్దరి రెమ్యునరేషన్ గురించి పలు వార్తలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం.. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.రామాయణ చిత్రం రెండు భాగాలు కలిపి సుమారు రూ. 1600 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కనుందని సమాచారం. విజువల్ వండర్‌గా రానున్న ఈ మూవీని రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమాగా 'రామాయణ' చరిత్ర సృష్టించింది. అయితే, ఈ సినిమాలో రాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్ రూ. 150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. రెండు భాగాలకు కలిపి ఈ మెత్తం తీసుకుంటున్నారని టాక్. సీతగా నటిస్తున్న సాయిపల్లవి రూ. 15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతుంది.రామాయణ సినిమాలో లంకాధిపతి రావణుడి పాత్రలో 'కేజీఎఫ్' ఫేమ్ యశ్ కనిపించనున్నారు. రవి దూబే (లక్ష్మణుడు), సన్నీ డియోల్ (ఆంజనేయుడు)గా కనిపించనున్నారు. వీరితో పాటు వివేక్ ఒబెరాయ్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా, కాజల్ అగర్వాల్, అరుణ్ గోవిల్, షీబా చద్దా వంటి సూపర్‌స్టార్స్ ఈ మూవీ కోసం పనిచేస్తున్నారు. దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తుండటంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. -
భారత్‌లో అత్యంత ఖరీదైన చిత్రం ఇదే.. ఆ తర్వాతే ప్రభాస్ 'కల్కి'
బాలీవుడ్లో తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమా గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ విజువల్స్ అద్బుతంగా ఉన్నాయంటూ గ్రాఫిక్స్ వర్క్‌పై ప్రశంసలు అందుతున్నాయి. ఈ మూవీ భారతదేశంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డ్ నెలకొల్పనుంది. మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. ఈ కావ్యాన్ని ఆధారం చేసుకుని ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. కానీ, గ్రాఫిక్స్ వర్క్ ప్రధాన బలంగా ఒక అద్భుతాన్ని దర్శకుడు నితేశ్ తివారీ వెండితెరపై చూపించనున్నాడు. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో 'రామాయణ' పేరుతో అత్యంత భారీ బడ్జెట్ పేరుతో సినిమా వస్తుంది.భారతీయ సినీ చరిత్రలో అత్యంత బడ్జెట్ చిత్రంగా 'రామయణ'అన్ని యుద్ధాల్ని అంతం చేసే యుద్ధం మొదలైందని తాజాగా విడుదలైన రామయణ గ్లింప్స్‌లో మేకర్స్ పేర్కొన్నారు. అదేవిధంగా ఈ చిత్రంతో బాక్సాఫీస్ రికార్డ్‌లు అన్నీ అంతం కావడమే కాకుండా కొత్త రికార్డ్ మొదలైంది. రామయణ పార్ట్-1 కోసం ఏకంగా రూ. 835 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమాగా 'రామాయణ' చరిత్ర సృష్టించింది. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఇప్పటివరకు అత్యధిక బడ్జెట్ చిత్రాలుగా నిలిచిన కల్కి 2898 ఏడీ (రూ. 600 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ. 550 కోట్లు), ఆదిపురుష్ (రూ. 550 కోట్లు) వంటి చిత్రాలను రామాయణ అధిగమించింది.భారీ తారాగణంరామాయణ సినిమాలో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. లంకాధిపతి రావణుడి పాత్రలో 'కేజీఎఫ్' ఫేమ్ యశ్ కనిపించనున్నారు. రవి దూబే (లక్ష్మణుడు), సన్నీ డియోల్ (ఆంజనేయుడు)గా కనిపించనున్నారు. వీరితో పాటు వివేక్ ఒబెరాయ్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా, కాజల్ అగర్వాల్, అరుణ్ గోవిల్, షీబా చద్దా వంటి సూపర్‌స్టార్స్ ఈ మూవీ కోసం పనిచేస్తున్నారు. దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో ఈ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది.ఎనిమిది ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న సంస్ధతో మ్యాజిక్ఈ మూవీ కోసం ఉత్కంఠభరితమైన విజువల్ ఎఫెక్ట్‌లను మేకర్స్ అందించనున్నారు. అందు కోసం కోట్ల రూపాయలే ఖర్చుచేస్తున్నారు. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన బ్రిటిష్-ఇండియన్ VFX కంపెనీ ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్‌కు గాను ఎనిమిది ఆస్కార్ అవార్డ్‌లను గెలుచుకుంది. ఆపై ఈ మూవీకి హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మెర్ పనిచేస్తున్నారు. ఆయన గ్లాడియేటర్, ఇంటర్ స్టెల్లర్, ది లయన్ కింగ్, డ్యూన్ వంటి టాప్ చిత్రాలకు సంగీతం అందించారు. ఆర్ రెహమాన్ కూడా రామయణ చిత్రానికి సంగీతంలో భాగం పంచుకోవడం విశేషం.


