
ఉన్నది ఒక్కటే జిందగీ.. నాకు నచ్చినట్లు బతికేస్తా అని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కుదరదు. ఆరోగ్యాన్ని లెక్క చేయకపోతే వెంటనే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వయసుపైబడే కొద్దీ మరింత జాగ్రత్తగా ఉండాలి. సెలబ్రిటీలైతే నోరు చంపుకుని, వ్యసనాలు వదిలించుకుని ఫిట్‌నెస్‌పై మరింత ఫోకస్ పెంచాల్సి ఉంటుంది. అందులోనూ ఆధ్యాత్మిక సినిమాలు చేస్తున్నప్పుడు కొందరు చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా నిష్టగా ఉంటారు. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) కూడా అదే చేశాడు.
శాఖాహారిగా మారిపోయా
ప్రస్తుతం ఇతడు దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణలో శ్రీరాముడిగా నటిస్తున్నాడు. సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు. రామాయణ (Ramayana Movie) ప్రారంభానికి ముందు రణ్‌బీర్ తన లైఫ్‌స్టైల్‌లో చాలా మార్పులుచేర్పులు చేసుకున్నాడు. సిగరెట్ తాగడం మానేశాడు, మద్యపానానికి గుడ్‌బై చెప్పాడు. పూర్తిగా శాకాహారిగా మారినట్లు తెలిపాడు. యోగా, ధ్యానం కూడా చేస్తున్నానని పేర్కొన్నాడు. రామాయణ మూవీ ప్రారంభానికల్లా చెడు అలవాట్లు శాశ్వతంగా మానేస్తానని తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. రణ్‌బీర్ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.
సినిమా
రామాయణ సినిమాను నితీశ్ తివారి డైరెక్ట్ చేస్తున్నాడు. దాదాపు రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో రామాయణ రెండు భాగాలుగా తెరకెక్కించనున్నామని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించారు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీలో లక్ష్మణుడిగా రవిదూబే, హనుమంతుడిగా సన్నీడియోల్ నటిస్తున్నారు. రామాయణ పార్ట్ 1.. 2026 దీపావళికి, రామాయణ పార్ట్ 2.. 2027 దీపావళికి రిలీజ్ కానున్నాయి. రామాయణ్‌తో పాటు రణ్‌బీర్ మరో సినిమా చేస్తున్నాడు. భార్య, హీరోయిన్ ఆలియా భట్‌తో కలిసి లవ్ అండ్ వార్ మూవీ చేస్తున్నాడు. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2026 మార్చి 20న విడుదల కానుంది.
🚨 Ranbir Kapoor has given up smoking, drinking, and has even turned vegetarian — all in preparation for his role as Lord Ram in #Ramayana. A true embodiment of discipline and devotion. ✨🔥 pic.twitter.com/W5F3akrREK
— Ramayana: The Epic (@RamayanaMovieHQ) September 7, 2025
చదవండి: నా కడుపులో తన్నాడు, ముఖంపై పిడిగుద్దులు..: బుల్లితెర నటి