ఓటీటీలు వచ్చాక సినిమాలు,వెబ్ సిరీస్లకు కొదవే లేదు. కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుంటాయి. ఏ భాషలో వచ్చినా సరే డబ్బింగ్ చేసి డిజిటల్‌గా స్ట్రీమింగ్ చేసేస్తున్నారు. ప్రతి ఏటా వందలకొద్ది చిత్రాలు, వెబ్ సిరీస్లు ఓటీటీ ప్రియులను అలరిస్తున్నాయి. ప్రతివారం సరికొత్త కంటెంట్తో సినీ ప్రియులను వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. అలా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రిలీజైన ఆదరణ దక్కించుకున్నవి చాలానే ఉన్నాయి.
కానీ ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనూ ప్రతి ఏటా సరికొత్త కంటెంట్తో వెబ్ సిరీస్లు వస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి వాటికి మాత్రమే ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. మర్డర్ మిస్టరీ లాంటి సిరీస్లకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. సినీ ప్రియుల అభిరుచితి తగ్గట్టుగానే చాలా వెబ్ సిరీస్‌లు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో సందడి చేస్తున్నాయి. అయితే కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటున్నాయి. చాలా వరకు మన దేశ ఆడియన్స్ ఆదరిస్తున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన కంటెంట్ సత్తా చాటలేకపోయింది.
ఓవరాల్ రేటింగ్ పరంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా టాప్-10లో మన ఇండియన్ వెబ్ సిరీస్ ఒక్కటీ కూడా లేకపోవడం గమనార్హం. ఐఎండీబీ ప్రకటించిన టాప్-25 వెబ్ సిరీస్లో ఇండియా నుంచి కేవలం నాలుగు మాత్రమే చోటు దక్కించుకున్నాయి. ఇందులో టాప్-15లో హర్షద్ మెహతా స్కామ్-1992 కాస్తా ఫర్వాలేదనిపించింది. ఈ లిస్ట్‌లో తొలిస్థానంలో బ్రేకింగ్ బ్యాడ్(9.5) అనే వెబ్ సిరీస్ నిలవగా.. బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్(9.4), ప్లానెట్ ఎర్చ్-2(9.4) రెండు, మూడు స్థానాల్లో రేటింగ్ దక్కించుకున్నాయి.
టాప్-10 విషాయానికొస్తే నాలుగు నుంచి వరుసగా.. ప్లానెట్ ఎర్త్, ది వైర్, చెర్నోబిల్, అవతార్- ది లాస్ట్ ఎయిర్బెండర్, బ్లూ, కాస్మోస్, బ్లూ ప్లానెట్-2 నిలిచాయి. ఇక 11 వ ప్లేస్‌లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ నిలవగా.. 12లో ది సోప్రానోస్ వెబ్ సిరీస్ నిలిచింది. ఇక ఇండియా నుంచి హర్షద్ మోహతా వెబ్ సిరీస్ స్కామ్-1992(9.2) ఈ లిస్ట్‌లో 13వ స్థానం దక్కంచుకుంది. ఆ తర్వాత ఆస్పిరెంట్స్, గుల్లక్, టీవీఎఫ్ పిచర్స్ వరుసగా 23, 24, 25 స్థానాల్లో నిలిచాయి. ఓవరాల్గా చూస్తే మనదేశం నుంచి ఒక్క వెబ్ సిరీస్ కూడా టాప్-10లో రేటింగ్ సాధించలేకపోయింది.


