టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్షమాపణలు కోరింది. నటుడు బండి సరోజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై సారీ చెబుతూ నోట్ రిలీజ్ చేసింది. నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరమని.. దీనికి బాధ్యత వహిస్తూ హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నట్లు నోట్లో పేర్కొంది.
మా నటుడు బండి సరోజ్ ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివరణ ఇచ్చింది. సెన్సార్ ప్రక్రియ పట్ల మాకు అత్యున్నత గౌరవం ఉందని తెలిపింది. బాధ్యత, సమగ్రతతో కంటెంట్‌ను నిర్వహించడంలో బోర్డు పాత్రను మేము గౌరవిస్తామని స్పష్టం చేసింది. సెన్సార్ బోర్డ్లో అత్యంత సమర్థులైన నిర్వాహకులు, సీనియర్ పరిశ్రమ నిపుణులు ఉన్నారు.. వారి మార్గదర్శకత్వాన్ని మేము ఎంతో విలువైందిగా భావిస్తామని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేర్కొంది. బండి సరోజ్ వ్యాఖ్యలను తాము వెంటనే ఉపసంహకరించుకుంటున్నామని తెలిపింది. సెన్సార్ బోర్డు వారి నిరంతర సహకారం, మద్దతు కోసం మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పోస్ట్ చేసింది.
బండి సరోజ్ ఏమన్నారంటే..
బండి సరోజ్ మాట్లాడుతూ..' మోగ్లీ సినిమాను ఫ్యామిలీతో చూడొచ్చు. సెన్సార్ బోర్డ్ వాళ్లు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇందులో ఎలాంటి అసభ్యత ఉండదు. ఈ సినిమా సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ భయపడి పోయారంటా. ఎవడ్రా వీడు.. వీడి ఫర్మామెన్స్ ఏంటి? రూత్‌లెస్ కాప్‌లా నటించలేదని భయపడి ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటా అని అన్నారు. ఈ కామెంట్స్ కాస్తా వివాదానికి దారి తీయడంతో మౌగ్లీ నిర్మాణ సంస్థ క్షమాపణలు చెబుతూ ట్విటర్లో పోస్ట్ చేసింది.
People Media Factory extends its sincere apologies to the Censor Board and the Censor Officer for the unfortunate incident yesterday.
An unintended remark was made by our actor, Bandi Saroj, regarding the Censor Board and the Officer’s reactions. We wish to clarify that we hold… pic.twitter.com/rXfqTjqPU3— People Media Factory (@peoplemediafcy) December 11, 2025


