breaking news
Mowgli
-
లాభాల బాటలో రోషన్ కనకాల 'మోగ్లీ'
యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'మోగ్లీ'. గత శనివారం థియేటర్లలో రిలీజైంది. తొలివారం గడిచిలోపే బ్రేక్ ఈవెన్ దాటి లాభాల బాటలోకి వచ్చింది. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ వసూళ్లన్నీ కలుపుకొని దాదాపు పది కోట్ల రూపాయలు సాధించిన 'మోగ్లీ'.. నిర్మాతలకు మంచి లాభాలని తెచ్చిపెట్టింది.చిన్న బడ్జెట్ సినిమాలు కూడా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయం సాధించగలవని 'మోగ్లీ' మరోసారి నిరూపించింది. ఈ మూవీలో రోషన్ నటన ఆకట్టుకుంది. విలన్ పాత్రలో బండి సరోజ్ కుమార్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. డైరెక్టర్ సందీప్ రాజ్ అనుకున్న బడ్జెట్లో సినిమా తీశాడు. రూ.8 కోట్లలో సినిమాని టాప్ క్యాలిటీతో పూర్తి చేశారు. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ కలుపుకొని రూ.10 కోట్లు వచ్చింది. -
‘మోగ్లీ 2025’ థ్యాంక్స్ మీట్..ముఖ్య అతిథిగా హీరో సాయిదుర్గా తేజ్ (ఫొటోలు)
-
హార్డ్‌వర్క్ మాత్రమే మాట్లాడుతుంది: సాయిదుర్గా తేజ్
రోషన్ కనకాల, సాక్షీ మడోల్కర్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మోగ్లీ 2025’. సందీప్ రాజ్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలైంది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన హీరో సాయిదుర్గా తేజ్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పట్నుంచి మోగ్లీ క్యారెక్టర్‌ను చూస్తూ పెరిగాను. ఈ రోజు ఆ టైటిల్‌తో సినిమా రావడం అనేది చాలా ఆనందాన్నిచ్చింది. ఇండస్ట్రీలో హార్డ్‌వర్క్ మాత్రమే మాట్లాడుతుంది.రోషన్ అద్భుతంగా నటించాడు. రోషన్ మరింత గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. బండి సరోజ్గారు బాగా యాక్ట్ చేశారు. సందీప్‌గారు ఈ సినిమాను అద్భుతంగా తీశారు’’ అని అన్నారు. ‘‘నాకు సినిమా అంటే ప్రాణం... పిచ్చి. సుమారాజీవ్ల కొడుకు కదా... తనకు అంతా ఈజీగా జరిగిపోతుంది అనే మాటలు విన్నాను. నిజానికి అందరు హీరోలూ, వారి అభిమానులు నాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. అయితే దీనికి మించి తలరాత ఉంటుంది. ఎవరి తలరాత వాళ్ల చేతుల్లోనే ఉంటుంది.దానిని నిర్వచించేది హార్డ్‌వర్క్, టాలెంట్, డిసిప్లెయిన్. ఈ మూడు మాత్రమే విజయాన్ని నిర్ణయిస్తాయి. నా హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ నేను పెట్టాను. ప్రాణం పెట్టి పని చేశాను. ‘మోగ్లీ 2025’ సినిమాను గెలిపించిన అందరికీ థ్యాంక్స్’’ అని అన్నారు. ‘‘మేం చిన్న సినిమా తీశాం. కానీ ఆడియన్స్ పెద్ద సక్సెస్ ఇచ్చారు’’ అని చెప్పారు టీజీ విశ్వప్రసాద్. హీరోయిన్ సాక్షి, దర్శకుడు హేమంత్ మధుకర్ మాట్లాడారు. -
రోషన్ కనకాల మౌగ్లీ.. తొలి రోజే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా వచ్చిన తాజా చిత్రం మోగ్లీ 2025. సందీప్ రాజ్ డైరెక్షన్లో వచ్చిన డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజే నుంచే ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.తొలి రోజే మౌగ్లీ కలెక్షన్ల పరంగా అదరగొట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ.1.22 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని మూవీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది. ప్రీమియర్స్‌తో కలిసి ఈ మొత్తం కలెక్షన్స్ సాధించిందని తెలిపింది. వైల్డ్ బ్లాక్‌బస్టర్ అంటూ పోస్టర్‌ను షేర్ చేసింది.అయితే మౌగ్లీ ముందు అనుకున్న ప్రకారం ఈనెల 12నే థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా బాలయ్య నటించిన అఖండ-2 బాక్సాఫీస్ బరిలో నిలిచింది. దీంతో ఒక్క రోజు ఆలస్యంగా మోగ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈనెల 13న థియేటర్లలో రిలీజైంది. కాగా.. ఈ చిత్రంలో బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు కీలక పాత్రలు పోషించారు.#Mowgli gets off to a phenomenal start at the box office 🏇❤️Wild Blockbuster #Mowgli2025 grosses ₹1.22 crore worldwide on Day 1, including premieres ❤️🔥❤️🔥🎟️ https://t.co/HHe863GdbEA @SandeepRaaaj CinemaA @Kaalabhairava7 musical 🎵🌟ing @RoshanKanakala, @SakkshiM09 &… pic.twitter.com/WfhjIIEMgY— People Media Factory (@peoplemediafcy) December 14, 2025 -
రూ. 99కే సినిమా.. కొత్త ప్రయోగం!
ఓటీటీ కారణంగా జనాలు థియేటర్స్ రావడం తగ్గించారు. దానికి తోడు సినిమా టికెట్ల రేట్లు కూడా భారీగా ఉండడంతో సామాన్యుడు థియేటర్స్‌కి దూరం అయ్యాడు. సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప..ప్రేక్షకులు థియేటర్స్‌కి రావడం లేదు. ఈ క్రమంలో కొంతమంది టాలీవుడ్ నిర్మాతలు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. టికెట్ ధరలను రూ. 99కే తగ్గించి, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాజు వెడ్స్ రాంబాయి' సినిమాతో మొదలైన ఈ ట్రెండ్, ఇప్పుడు 'మోగ్లీ 2025'తో మరింత బలపడుతోంది.రాంబాయికి కలిసొచ్చిన 99నవంబర్ 20న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి తొలి రోజు నుంచే టికెట్ ధరలను రూ. 99కి తగ్గించారు. మల్టీఫెక్స్‌లలోనూ రూ. 105కే సినిమాను ప్రదర్శించారు. దీంతో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా రూ. 20 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా..టికెట్ ధర తగ్గడంతో చాలా మంది సినిమా చూసేందుకు థియేటర్స్‌కి వెళ్లారు. ఫలితంగా సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి.రాంబాయి బాటలో మోగ్లీ..రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి టికెట్ల రేట్లు తగ్గించడంతో మంచి ఫలితం వచ్చింది. దీంతో మోగ్లీ చిత్ర నిర్మాతలు కూడా అదే ఫాలో అయ్యారు. సుమ కనకాల కొడుకు రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ రోజు (డిసెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలలోని సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలను 99 రూపాయలుగా నిర్ణయించారు. పేరుకు చిన్న సినిమానే కానీ బాగానే ఖర్చు చేశారు. అయినా కూడా టికెట్ రేట్‌ని 99 రూపాయలకే నిర్ణయించడం శుభపరిణామం. ఓ రకంగా చెప్పాలంటే టాలీవుడ్ సినిమాలకు ఇది ఓ కేస్ స్టడీ లాంటింది. పెద్ద సినిమాలకు ఎలాగో టికెట్ల రేట్లను భారీగా పెంచేస్తున్నారు.. కనీసం చిన్న సినిమాలకు అయినా తగ్గిస్తే..సామాన్యుడు థియేటర్‌కి వచ్చే అవకాశం ఉంటుంది.అందుకే పైరసీపై ఆసక్తి!కోవిడ్ తర్వాత ఓటీటీ వాడకం బాగా పెరిగిపోయింది. ఇంట్లోనే కూర్చొని సినిమా చూసేందుకు జనాలు అలవాటు పడ్డారు. డిజిటల్ సబ్స్క్రిప్షన్ రూ. 300-500 మధ్య ఉంటుంది. అందులో అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులో ఉంటాయి. అయినా కూడా ప్రేక్షకులు కొత్త సినిమాలను థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటారు. కానీ ధరలు భారీగా పెంచడంతో థియేటర్స్‌కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. సినిమా టికెట్ ధర మల్టీప్లెక్స్‌లలో రూ. 200-500 ఉంటుంది. ఫ్యామిలీతో ఒక్క సినిమాకు వెళ్తే రూ. 1000-2000 ఖర్చు అవుతుంది. ఇది సామ్యాడికి భారమే. అందుకే పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు. సీపీఐ నారాయణ చెప్పినట్లు టికెట్ల రేట్లు తగ్గించకపోతే ఐబొమ్మ రవిలాంటి వాళ్లు పుడుతూనే ఉంటారు. అప్పుడు విమర్శించి..ఇప్పుడు ఫాలో అవుతున్నారుఅందుబాటు ధరలకే టికెట్లను అందిస్తే.. సామాన్యులు కూడా థియేటర్స్‌కి వస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోనే వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో టికెట్ల రేట్లను తగ్గించారు. మల్టీప్లెక్స్‌లలో గరిష్టం రూ. 250, సింగిల్ స్క్రీన్లలో రూ. 20-100 మధ్య ఉండేలా ధరలను ఖరారు చేశారు. సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు దాటితే రూ. 50, రూ. 150 కోట్లు దాటితే రూ. 100 పెంచుకునేందుకు గతంలో జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పుడు కొంతమంది నిర్మాతలు జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇండస్ట్రీని నష్టం కగించే నిర్ణయం అంటూ ఆయనపై విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు మళ్లీ వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలనే అప్లై చేస్తున్నారు. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కూడా టికెట్ల రేట్లను తగ్గించే ప్రయత్నం చేసింది. టికెట్ ధరలు రూ. 200కి మాత్రమే పరిమితం చేయాలంటూ సెప్టెంబర్‌లో ఆదేశాలు జారీ చేస్తే.. మల్టీప్లెక్స్ అసోసియేషన్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాయి. -
‘మోగ్లీ’మూవీ రివ్యూ
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా నటించిన రెండో చిత్రం ‘మోగ్లీ’. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. సాక్షి మడోల్కర్ హీరోయిన్గా నటించగా.. బండి సరోజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. నేడు (డిసెంబర్ 13) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి..మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.మోగ్లీ (రోషన్ కనకాల) ఓ అనాథ. పార్వతీపురం గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలో ఉంటూ.. ఎప్పటికైనా పోలీసు కావాలనే ఆశతో బతికేస్తుంటాడు. బతుకుదెరువు కోసం తన ప్రాణ స్నేహితుడు బంటి(వైవా హర్ష)తో కలిసి సినిమా షూటింగ్స్‌కి జూనియర్ ఆర్టిస్టులను అందిస్తూ..రిస్కీ సీన్లకు హీరో డూప్‌గా నటిస్తుంటాడు. అలా ఓ సినిమా షూటింగ్లో సైడ్ డ్యాన్సర్‌గా వచ్చిన జాస్మిత్(సాక్షి మడోల్కర్)తో ప్రేమలో పడతాడు. ఆమెకు వినికిడి లోపంతో పాటు మాటలు కూడా రావు. జాస్మిత్ కూడా మోగ్లీని ఇష్టపడుతుంది. అదే సమయంలో ఎస్సై క్రిప్టోఫర్ నోలన్(బండి సరోజ్ కుమార్).. జాస్మిత్‌పై మోజు పడతాడు. ఆమెను వాడుకోవాలని చూస్తాడు. అమ్మాయిల పిచ్చి ఉన్న ఎస్సై నోలన్ బారీ నుంచి జాస్మిత్‌ని మోగ్లీ ఎలా కాపాడుకున్నాడు? నోలన్ నుంచి మోగ్లీకి ఎదురైన సవాళ్లు ఏంటి? కర్మ సిద్ధాంతానికి ఈ కథకి ఉన్న సంబంధం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. సందీప్ రాజ్ గతంలో తెరకెక్కించిన కలర్ ఫోటో సినిమా మాదిరే.. ఇది కూడా ప్యూర్ అండ్ ఇన్నోసెన్స్ లవ్‌స్టోరీ. సినిమా షూటింగ్ నేపథ్యంలో కథనం సాగుతుంది. అయితే కర్మ సిద్దాంతం టాపిక్‌ని ఈ ప్రేమకథకి యాడ్ చేయడం కొత్త ప్రయత్నం. ఇదొక్కటి తప్పితే.. మిగతా స్టోరీ అంతా రొటీనే. హీరో తొలి చూపులోనే హీరోయిన్‌తో ప్రేమలో పడడం.. విలన్ ఆమెపై మోజు పడడం.. చివరకు హీరో అతన్ని అంతం చేయడం.. ఇలా గతంలో చాలా ప్రేమ కథలు వచ్చాయి. మోగ్లీ కథనం కూడా అలాగే సాగుతుంది. సినిమా చూస్తున్నంత సేపు సందీప్ తెరకెక్కించిన కలర్ఫోటోతో పాటు జయం, వాన..లాంటి సినిమాలు గుర్తుకు వస్తుంటాయి. టేకింగ్ మాత్రం కొత్తగా అనిపిస్తుంది. బండి సరోజ్ కుమార్ పాత్రను భయంకరంగా చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఎస్సై నోలన్‌కు అమ్మాయిలంటే పిచ్చి అనేది ఒకే ఒక సీన్‌తో చూపించాడు. ఆ తర్వాత మోగ్లీగా హీరోగా పరిచయ సన్నివేశాలు కొత్తగా ఉంటాయి. అతని నేపథ్యం కాస్త ఎమోషనల్‌కు గురి చేస్తుంది. హీరో హీరోయిన్లు ఇద్దరు ప్రేమలో పడినప్పటి నుంచి కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. సినీ నిర్మాత..హీరోయిన్‌పై మోజు పడడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. కానీ ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు మాత్రం సాగదీతగా అనిపిస్తాయి. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఓ ట్విస్టు ఆకట్టుకుంటుంది. ఇక ద్వితియార్థం ప్రారంభంలో కథనం పరుగులు పెట్టినా.. కాసేపటికే మళ్లీ సాగదీత సన్నివేశాలతో నెమ్మదిగా సాగుతుంది. పోలీసు స్టేషన్ సీన్ ఒక్కటి బాగుంటుంది కానీ దాన్ని కూడా మరీ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో కర్మ సిద్దాంతాన్ని జోడిస్తూ.. సాగే సన్నివేశాలు బాగుంటాయి. ఎవరెలా చేశారంటే.. మోగ్లీ పాత్రకి రోషన్ న్యాయం చేశాడు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. తొలి సినిమాతో పోలిస్తే..ఇందులో నటన పరంగా చాలా మెచ్యూరిటీ కనిపించింది. సినిమా కోసం ఆయన పడిన కష్టమంతా తెరపై కనిపించింది. ఇక చెవిటి, మూగ అమ్మాయి జాస్మిత్లాగా సాక్షి మడోల్కర్ బాగా చేసింది. ఇక విలన్‌గా బండి సరోజ్ కుమార్ ఇరగదీశాడు. హీరో రేంజ్లో ఆయన పాత్రకు ఎలివేషన్స్ ఉన్నాయి. వైవా హర్ష నవ్వించడంతో పాటు కొన్ని చోట్ల ఎమోషనల్‌కు గురి చేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కాలభైరవ సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లను ప్రాణం పోశాడు. పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
'మోగ్లీ' మూవీ రిలీజ్..ట్రెండింగ్‌లో హీరోయిన్ సాక్షి మడోల్కర్ (ఫొటోలు)
-
మోగ్లీ అందరికీ కనెక్ట్ అవుతుంది: హీరో రోషన్ కనకాల
‘‘ఫలానా జానర్లోనే సినిమాలు చేయాలని అనుకోవడం లేదు. నటుడిగా అన్ని రకాల జానర్ సినిమాలూ చేయాలనుకుంటున్నాను’’ అని రోషన్ కనకాల చెప్పారు. రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మోగ్లీ 2025’. హర్ష చెముడు, బండి సరోజ్ కుమార్ కీలకపాత్రల్లో నటించారు. సందీప్ రాజ్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో రోషన్ కనకాల మాట్లాడుతూ– ‘‘మోగ్లీ 2025’ హానెస్ట్ లవ్‌స్టోరీ ఫిల్మ్. ప్రేక్షకులు ఏ మాత్రం బోర్ ఫీల్ కాకుండా సందీప్ రాజ్ రేసీ స్క్రీన్‌ప్లే డిజైన్ చేశారు. తన ప్రేమకోసం మోగ్లీ ఏం చేయడానికైనా రెడీగా ఉంటాడు. మరి... మోగ్లీ ప్రేమ కథకు వచ్చిన అడ్డంకులు ఏంటి? క్రిస్టోఫర్ నోలన్ (ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్పాత్ర పేరు) నుంచి మోగ్లీకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనే అంశాలతో ఈ సినిమా కథ ముందుకు వెళుతుంది.మోగ్లీ క్యారెక్టర్, ఈ సినిమా ప్రేక్షకులందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ కథలో కామెడీ, యాక్షన్... ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఇంటర్వెల్, ప్రీ ఇంటర్వెల్ ఎంగేజింగ్‌గా ఉంటాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ప్రస్తుతం ఒక రొమాంటిక్ లవ్‌స్టోరీ, ఒక ఇంటెన్స్ లవ్‌స్టోరీ సినిమాలు కమిట్ అయ్యాను’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నటన పరంగా మా అమ్మ (వ్యాఖ్యాత–నటి సుమ కనకాల), నాన్న (నటుడు రాజీవ్ కనకాల)ల సలహాలను అవసరమైనప్పుడు తీసుకుంటుంటాను’’ అని తెలిపారు. -
'మోగ్లీ' కోసం రోషన్ కష్టం.. మేకింగ్ వీడియో రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ’... డిసెంబర్ 13న ఈ చిత్రం విడుదల కానుంది. దర్శకుడు, నటుడు బండి సరోజ్‌కుమార్ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నటం విశేషం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించారు. కొన్ని గంటల్లో ఈ మూవీ థియేటర్స్‌లోకి రానున్న సందర్భంలో తాజాగా మోగ్లీ ఫైట్ సీన్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. బండి సరోజ్‌కుమార్, బండి సరోజ్, హర్ష చెముడు వంటి వారు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు కాలభైరవ సంగీతం అందించారు. -
అది నా కళ్లారా చూశా.. అందుకే క్షమాపణలు: మౌగ్లీ నటుడు
సెన్సార్ బోర్డుకు క్షమాపణలు చెప్పడంపై మౌగ్లీ నటుడు బండి సరోజ్ కుమార్ స్పందించారు. ఈ సినిమా కోసం నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భారీగా డబ్బులు ఖర్చు చేయడం నా కళ్లారా చూశానని అన్నారు. ఈ సినిమాను నా బాధ్యతగా తీసుకున్నానని తెలిపారు. ఈ చిత్రానికి ఆటంకం కలగకూడదనే సెన్సార్ బోర్డ్‌కు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ నేరవేర్చానని అన్నారు. నా వంతు కృషిగా నా సొంత సినిమా కంటే గట్టిగా బయటికొచ్చి ప్రమోషన్స్ చేశానని అన్నారు. మీరు సినిమా చూశాక నచ్చితే గట్టిగా ముందుకు తీసుకెళ్లండి ఆడియన్స్‌కు సూచించారు. కాగా.. మౌగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డ్‌ను ఉద్దేశించి మాట్లాడారు.బండి సరోజ్ ఏమన్నారంటే..బండి సరోజ్ మాట్లాడుతూ..' మోగ్లీ సినిమాను ఫ్యామిలీతో చూడొచ్చు. సెన్సార్ బోర్డ్ వాళ్లు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇందులో ఎలాంటి అసభ్యత ఉండదు. ఈ సినిమా సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ భయపడి పోయారంటా. ఎవడ్రా వీడు.. వీడి ఫర్మామెన్స్ ఏంటి? రూత్‌లెస్ కాప్‌లా నటించలేదని భయపడి ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటా అని అన్నారు. ఈ కామెంట్స్ కాస్తా వివాదానికి దారి తీయడంతో మౌగ్లీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్షమాపణలు చెబుతూ ట్విటర్లో పోస్ట్ చేసింది.#Mowgli సినిమా ని నా బాధ్యతగా తీసుకున్నాను. నిర్మాత నా కళ్ళ ముందే డబ్బును భారీగా ఖర్చుపెట్టడం చూసాను. దానికి నా వంతు కృషిగా నా సొంత సినిమా కంటే గట్టిగా, నా introvert behaviour నుండీ బయటకు వచ్చి ఆల్ ఔట్ ప్రమోషన్ చేశాను. Censor board వాళ్లు క్షమాపణ కావాలి అన్న డిమాండ్ ను సినిమాకు…— Saroj (@publicstar_bsk) December 11, 2025 -
మౌగ్లీ నటుడు కామెంట్స్.. టాలీవుడ్ నిర్మాణ సంస్థ క్షమాపణలు!
టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్షమాపణలు కోరింది. నటుడు బండి సరోజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై సారీ చెబుతూ నోట్ రిలీజ్ చేసింది. నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరమని.. దీనికి బాధ్యత వహిస్తూ హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నట్లు నోట్లో పేర్కొంది.మా నటుడు బండి సరోజ్ ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివరణ ఇచ్చింది. సెన్సార్ ప్రక్రియ పట్ల మాకు అత్యున్నత గౌరవం ఉందని తెలిపింది. బాధ్యత, సమగ్రతతో కంటెంట్‌ను నిర్వహించడంలో బోర్డు పాత్రను మేము గౌరవిస్తామని స్పష్టం చేసింది. సెన్సార్ బోర్డ్‌లో అత్యంత సమర్థులైన నిర్వాహకులు, సీనియర్ పరిశ్రమ నిపుణులు ఉన్నారు.. వారి మార్గదర్శకత్వాన్ని మేము ఎంతో విలువైందిగా భావిస్తామని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేర్కొంది. బండి సరోజ్ వ్యాఖ్యలను తాము వెంటనే ఉపసంహకరించుకుంటున్నామని తెలిపింది. సెన్సార్ బోర్డు వారి నిరంతర సహకారం, మద్దతు కోసం మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పోస్ట్ చేసింది.బండి సరోజ్ ఏమన్నారంటే..బండి సరోజ్ మాట్లాడుతూ..' మోగ్లీ సినిమాను ఫ్యామిలీతో చూడొచ్చు. సెన్సార్ బోర్డ్ వాళ్లు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇందులో ఎలాంటి అసభ్యత ఉండదు. ఈ సినిమా సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ భయపడి పోయారంటా. ఎవడ్రా వీడు.. వీడి ఫర్మామెన్స్ ఏంటి? రూత్‌లెస్ కాప్‌లా నటించలేదని భయపడి ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటా అని అన్నారు. ఈ కామెంట్స్ కాస్తా వివాదానికి దారి తీయడంతో మౌగ్లీ నిర్మాణ సంస్థ క్షమాపణలు చెబుతూ ట్విటర్లో పోస్ట్ చేసింది.People Media Factory extends its sincere apologies to the Censor Board and the Censor Officer for the unfortunate incident yesterday.An unintended remark was made by our actor, Bandi Saroj, regarding the Censor Board and the Officer’s reactions. We wish to clarify that we hold… pic.twitter.com/rXfqTjqPU3— People Media Factory (@peoplemediafcy) December 11, 2025 -
రోషన్‌ని చూస్తుంటే ‘చిరుత’లో చరణ్‌ని చూసినట్లుంది: రానా
‘‘మోగ్లీ 2025’ సినిమాలో రోషన్ ను చూస్తుంటే, ‘చిరుత’ సినిమాలో చరణ్‌ని చూసినట్లు నాకు అనిపించింది. రోషన్‌కి ఆల్ ది బెస్ట్. ‘కలర్‌ఫోటో’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత ‘మోగ్లీ 2025’ సినిమా తీయడానికి ఐదు సంవత్సరాలు పట్టిందని సందీప్ బాధపడుతున్నాడు. కానీ, సమయం గడిచిపోతుంది. సినిమాలు నిలిచిపోతాయి. ‘కలర్‌ఫోటో’లానే ‘మోగ్లీ 2025’ సినిమా కూడా నిలిచిపోతుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు హీరో రానా. రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా, హర్ష చెముడు, బండి సరోజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘మోగ్లీ 2025’(Mowgli Movie). సందీప్ రాజ్ దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రానా ఈ సినిమా టికెట్‌ను కొనుగోలు చేయగా, మరో అతిథిగా హాజరైన దర్శక–నిర్మాత మారుతి ‘మోగ్లీ 2025’ సినిమాలోని హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. రోషన్ మాట్లాడుతూ–‘‘ప్రతి మనిషిలో ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ప్రేమ కోసం ఈ మోగ్లీ చేసిన యుద్ధాన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ‘‘అమెరికా షెడ్యూల్లో మాకు కేటాయించిన థియేటర్స్ మళ్లీ మాకు దొరకవు కనుక, మరొక రిలీజ్ డేట్ లేకపోవడం వల్ల ఓ పెద్ద సినిమాతో పాటు వస్తున్నాం’’అని తెలిపారు టీజీ విశ్వప్రసాద్. ‘‘మా సినిమా దారి తప్పదు. ఒక్క శాతం కూడా మిస్ కాదు’’అని సందీప్ రాజ్ అన్నారు. నటులు బండి సరోజ్ కుమార్, హర్ష మాట్లాడారు. -
యాంకర్ సుమ కొడుకు 'మోగ్లీ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'అఖండ 2' ఎఫెక్ట్.. రోజు ఆలస్యంగా 'మోగ్లీ' రిలీజ్
గతవారం థియేటర్లలోకి రావాల్సిన 'అఖండ 2' సినిమా అకస్మాత్తుగా వాయిదా పడింది. దీనికి కారణం నిర్మాతల చేసిన కోట్ల రూపాయల అప్పు. ఎట్టకేలకు దాన్ని సెటిల్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ శుక్రవారం (డిసెంబరు 12) మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇలా జరగడంతో ఈ వారం థియేటర్లలోకి వద్దామనుకున్నా చిత్రాల పరిస్థితి తారుమారైంది. కొన్ని మూవీస్ వాయిదా పడ్డాయి.(ఇదీ చదవండి: ఏఎన్నార్ టైటిల్‌తో త్రివిక్రమ్-వెంకీ కొత్త సినిమా.. 'ఆ' సెంటిమెంట్)కానీ కార్తీ 'అన్నగారు వస్తారు'.. తెలుగు, తమిళంలో ఈ శుక్రవారమే రిలీజ్ కానుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు యాంకర్ సుమ కొడుకు లేటెస్ట్ మూవీ 'మోగ్లీ' విడుదల విషయంలో మాత్రం ప్లాన్ మారింది. లెక్క ప్రకారం శుక్రవారమే రావాల్సి ఉంది. కానీ అదే రోజున ప్రీమియర్లు పడతాయని, శనివారం (డిసెంబరు 13) రెగ్యులర్ రిలీజ్ ఉంటుందని నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. అంటే 'అఖండ 2' ఎఫెక్ట్ వల్ల ఓ రోజు ఆలస్యంగా 'మోగ్లీ' థియేటర్లలోకి రానున్నాడు.'కలర్ ఫోటో' తీసిన సందీప్ రాజ్.. 'మోగ్లీ'కి దర్శకత్వం వహించాడు. సుమ కొడుకు రోషన్ హీరోగా నటించాడు. సాక్షి అనే అమ్మాయి హీరోయిన్గా పరిచయమవుతోంది. బండి సరోజ్ కుమార్ విలన్‌గా చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. సాధారణంగా అయితే కాస్త బజ్ ఉండేది. మరి 'అఖండ 2'తో పోటీలో ఉంది కాబట్టి ఫలితం ఏమవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)The "LION" roars, and #Mowgli steps back to welcome the Jungle King 🦁#Mowgli2025 GRAND RELEASE WORLDWIDE on 13th DEC 2025 ❤🔥Premieres from DEC 12th 💥A @SandeepRaaaj CinemaA @Kaalabhairava7 musical 🎵🌟ing @RoshanKanakala @SakkshiM09 & @publicstar_bsk… pic.twitter.com/xSjflXnPbl— People Media Factory (@peoplemediafcy) December 10, 2025 -
ఆ కల నెరవేరదేమో! దర్శకుడి ఎమోషనల్ పోస్ట్
ఫస్ట్ సినిమాకే జాతీయ అవార్డు కొల్లగొట్టడం అంటే మామూలు విషయం కాదు. కలర్ ఫోటో చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు సందీప్ రాజ్. తర్వాత గుడ్ లక్ సఖి, ముఖచిత్రం వంటి మూవీస్‌కు రచయితగా పని చేశాడు. అలాగే కొన్ని చిత్రాల్లో నటుడిగానూ మెప్పించాడు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత దర్శకుడిగా రెండో సినిమా చేస్తున్నాడు సందీప్. అదే "మోగ్లీ".మోగ్లీ వాయిదా?యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా, సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్గా నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 12న విడుదల కానుంది. అయితే సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 12న అఖండ విడుదల చేస్తే మోగ్లీకి పెద్ద దెబ్బ పడటం ఖాయం! దీంతో ఈ మూవీని పోస్ట్‌పోన్ చేసుకోక తప్పేలా లేదు.మరో దర్శకుడు తీయాల్సిందిఈ క్రమంలో దర్శకుడు సందీప్ రాజ్ (Sandeep Raj) ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. కలర్ ఫోటో, మోగ్లీ సినిమాలు నేను కాకుండా మరో డైరెక్టర్ తీయాల్సింది. సినిమా అంటే పడిచచ్చేవాళ్లు, వృత్తిపై నిబద్ధత ఉన్నవారే ఈ రెండు సినిమాల్లో భాగమయ్యారు. ఈ రెండు చిత్రాల్లోని కామన్ పాయింట్స్ ఏంటో తెలుసా?దురదృష్టవంతుడిని1. అంతా బాగా జరుగుతుందనుకునే సమయంలో వాటి రిలీజ్ విషయంలో దురదృష్టాన్ని ఎదుర్కోవడం.. 2. ఆ దురదృష్టం నేనేనేమో! నాక్కూడా అలాగే అనిపిస్తోంది. దర్శకత్వం- సందీప్ రాజ్ అన్న టైటిల్‌ను థియేటర్లో చూసుకోవాలన్న నా కల రోజురోజుకీ మరింత కష్టమవుతోంది. వెండితెరకు నేనంటే ఇష్టం లేదేమో! ఎంతో చెమటోడ్చి, రక్తం చిందించి, ప్యాషన్‌తో మోగ్లీ సినిమా చేశాం. రోషన్, సరోజ్, సాక్షి, హర్ష, డీఓపీ మారుతి, భైరవ.. ఇలా అందరూ ఎంతగానో కష్టపడ్డాం. కనీసం వారికోసమైనా మోగ్లీకి మంచి జరగాలని ఆశిద్దాం అని సందీప్ రాజ్ రాసుకొచ్చాడు. Maybe Colour Photo and Mowgli deserved another DIRECTOR instead of me. These movies were made by a group of passionate people who can do anything for their profession.The common points between both films are:1. Facing bad luck with their release, just when everything seemed to…— Sandeep Raj (@SandeepRaaaj) December 9, 2025చదవండి: ప్రియుడితో బ్రేకప్.. పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్ -
గతవారం నిల్.. ఈసారి ఏకంగా థియేటర్లలోకి 15 సినిమాలు
టాలీవుడ్లో ఎప్పుడేం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లు ఉంటుంది. గతవారం చూసుకుంటే 'అఖండ 2' రిలీజ్ అవుతుందని ఒక్కరంటే ఒక్కరు కూడా వేరే మూవీని విడుదలకు ప్లాన్ చేసుకోలేదు. దీంతో వీకెండ్ పూర్తిగా వృథా అయిపోయింది. ఈ వారం ఏమో ఏకంగా 15 చిన్నా చితకా మూవీస్ థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యాయి. ఇంతకీ అవేంటి? వీటిలో చూడదగ్గవి ఏవి?పేరుకే ఈ వారం 15 సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ.. మూడు మాత్రమే కాస్త చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. వాటిలో కార్తి 'అన్నగారు వస్తారు' అనే డబ్బింగ్ చిత్రం ఒకటి కాగా.. యాంకర్ సుమ కొడుకు రోషన్ 'మోగ్లీ', నందు 'సైక్ సిద్ధార్థ్' ఉన్నంతలో చూడొచ్చేమో అనిపిస్తున్నాయి. వీటికి కూడా పెద్దగా గొప్ప హైప్ ఏం లేదు. హిట్ టాక్ వస్తే తప్ప వీటిపై ప్రేక్షకులు దృష్టిపెట్టరు.(ఇదీ చదవండి: హోటల్ గదిలో నాకు దెయ్యం కనిపించింది: కృతి శెట్టి)ఈ మూడు కాకుండా విడుదలయ్యే మిగతా సినిమాల విషయానికొస్తే సకుటుంబానాం, ఈషా, నా తెలుగోడు, పైసావాలా, ఫెయిల్యూర్ బాయ్స్, వన్ బై ఫోర్, ఘంటసాల, ఇట్స్ ఓకే గురు, కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్, డ్రైవ్, లాక్ డౌన్, ఎవడి సినిమాకు వాడే హీరో.. ఇలా బోలెడన్ని ఉన్నాయి. అసలు వీటిలో ఎన్ని మూవీస్.. ఈ వారం వస్తున్నాయని ప్రేక్షకులకు తెలుసో లేదో కూడా తెలియదు.ఇలా వస్తే వారంలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతాయి. లేదంటే ఒక్కటి కూడా రిలీజ్ కాకుండా ఖాళీగా ఉంటుంది. ఈ విషయమై టాలీవుడ్ నిర్మాతలు కూర్చుని మాట్లాడుకోకపోతే రాబోయే రోజుల్లో చిన్న సినిమాలకే నష్టం. ఇప్పటికే ఓటీటీల తీరు వల్ల చిన్న బడ్జెట్, మీడియం రేంజ్ హీరోల సినిమాలని థియేటర్లకు వెళ్లి జనాలు చూడటం చాలావరకు తగ్గించేశారు. ఇలా ఇన్నేసి సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్ధం చేస్తే జనాలయినా ఎందుకొస్తారు చెప్పండి? (ఇదీ చదవండి: మెడికల్ మాఫియాపై ఓటీటీ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
యాంకర్ సుమ కొడుకు కొత్త సినిమా.. ట్రైలర్ రిలీజ్
యాంకర్ సుమ కొడుకు రోషన్ ఇదివరకే 'బబుల్ గమ్' అనే సినిమా చేశాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. ఈ క్రమంలో కాస్త గ్యాప్ తీసుకుని రెండో మూవీతో వస్తున్నాడు. అదే 'మోగ్లీ'. ఈ నెల 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. 'కలర్ ఫోటో'తో మెప్పించిన సందీప్ రాజ్ దీనికి దర్శకత్వం వహించాడు. వచ్చే వారమే మూవీ రాబోతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.(ఇదీ చదవండి: నువ్వు ఇంటికెళ్లిపో.. తనూజ, సుమన్ శెట్టి ఇలా షాకిచ్చారేంటి?)టైటిల్‌కి తగ్గట్లే అడవి నేపథ్యంగా సాగే సన్నివేశాలు, కామెడీ ఆకట్టుకునేలా ఉన్నాయి. గతంలో పలు బోల్డ్ చిత్రాలతో మెప్పించిన బండి సరోజ్ ఇందులో విలన్‌గా చేస్తున్నాడు. సాక్షి అనే అమ్మాయి హీరోయిన్గా పరిచయమవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. (ఇదీ చదవండి: పక్క ఇల్లు కూల్చేయడం కరెక్ట్ కాదు.. పూనమ్ పోస్ట్ ఎవరి గురించి?) -
డిసెంబరులో వచ్చే సినిమాలేంటి? క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది?
2025 క్లైమాక్స్‌కి వచ్చేసింది. కొత్త ఏడాదికి మరో నెల మాత్రమే ఉంది. ఈ ఏడాది టాలీవుడ్‌కి ఉన్నంతలో బాగానే కలిసొచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం, తండేల్, డాకు మహారాజ్, మిరాయ్, హిట్ 3, కుబేర, ఓజీ చిత్రాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. కోట్లకు కోట్లు కలెక్షన్స్ కూడా సాధించాయి. మరి డిసెంబరులో రాబోతున్న సినిమాలేంటి? వీటిలో ఎవరు హిట్ అయ్యే అవకాశముంది?(ఇదీ చదవండి: 'భూత శుద్ది వివాహం' చేసుకున్న సమంత.. ఏంటి ఆచారం?)తొలివారంలో బాలకృష్ణ-బోయపాటి 'అఖండ 2' రాబోతుంది. దీనికి పోటీగా వేరే ఏ సినిమాలు లేవు. గతంలో దీని తొలి భాగం.. 2021 డిసెంబరులో వచ్చి హిట్ అయింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్‌తోనే సీక్వెల్‌ని కూడా ఇదే నెలలో రిలీజ్ చేస్తున్నారు. తొలి పార్ట్‌లో ఎక్కువగా యాక్షన్‌ని నమ్ముకోగా, ఈసారి యాక్షన్‌తో పాటు డివోషనల్ అంశాలు కూడా బాగానే ఉండబోతున్నాయని ట్రైలర్‌తో క్లారిటీ వచ్చింది. దీని ఫలితం ఏమొస్తుందో చూడాలి? దీనితో పాటు హిందీ చిత్రం 'ధురంధర్'.. 5వ తేదీనే రిలీజ్ కానుంది. కాకపోతే తెలుగు వరకు అయితే ఏ సమస్య ఉండదు.రెండో వారంలో యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా చేసిన 'మోగ్లీ' రిలీజ్ కానుంది. రోషన్ తొలి మూవీ 'బబుల్ గమ్' ఫ్లాప్ అయినప్పటికీ.. ఈసారి దర్శకుడు సందీప్ రాజ్ కావడం కాస్త ఆసక్తికరంగా అనిపించింది. గతంలో ఈ డైరెక్టర్.. 'కలర్ ఫోటో' మూవీ తీశాడు. కాకపోతే అది ఓటీటీ రిలీజ్. ఈసారి మాత్రం థియేటర్ రిలీజ్. ఏం చేస్తారో చూడాలి? దీంతో పాటు నందు 'సైక్ సిద్ధార్థ్', ఘంటసాల, సకుటుంబానాం అనే తెలుగు చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ వీటిపై ఏ మాత్రం బజ్ లేదు. ఇదే తేదీన కార్తీ డబ్బింగ్ సినిమా 'అన్నగారు వస్తారు' రిలీజయ్యే అవకాశముంది. ప్రస్తుతానికి డేట్ అధికారికంగా ప్రకటించలేదు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)మూడో వారం తెలుగు నుంచి 'దేవగుడి' అనే చిన్న సినిమా మాత్రమే రిలీజ్ కానుంది. అయితే ఆ వీకెండ్లో 'అవతార్' ఫ్రాంఛైజీలో మూడో భాగం 'ఫైర్ అండ్ యాష్' రిలీజ్ కానుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. అవతార్ తొలి పార్ట్ వేల కోట్ల వసూళ్లు సాధించి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రెండో పార్ట్ మాత్రం ఓకే ఓకే అనిపించుకుంది. మరి మూడో పార్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇదే వారంలో 'డ్యూడ్' ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ కొత్త మూవీ రిలీజ్ కానుంది. 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' పేరుతో దీన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళంలో ఇది విడుదల కానుంది.నాలుగో వారం బోలెడన్ని తెలుగు సినిమా లైన్లో ఉన్నాయి. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా చేసిన 'ఛాంపియన్', దండోరా, పతంగ్, శంబాల అనే చోటామోటా చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిలోనూ దేనిపై అస్సలు బజ్ లేదు. రిలీజ్ టైంకి వస్తుందోమో చూడాలి. వీటితో పాటు చివరి వారంలో అనకొండ (తెలుగు డబ్బింగ్), ఇక్కీస్ (హిందీ సినిమా), వృషభ (మలయాళ డబ్బింగ్) అనే మూవీస్ కూడా రాబోతున్నాయి. వీటిలో అఖండ 2, అవతార్ 3కి మాత్రమే ప్రస్తుతం ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా కనిపిస్తాయి. మిగిలిన వాటిలో కంటెంట్‌తో సర్ప్రైజ్ చేసి ఏమైనా హిట్ కొడితే క్లైమాక్స్ సుఖాంతం అయ్యే అవకాశముంది.(ఇదీ చదవండి: రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?) -
కథ కంటే స్క్రీన్‌ప్లేని నమ్ముతాను: సందీప్ రాజ్
‘‘నేను కథ కంటే స్క్రీన్‌ప్లేని నమ్ముతాను. కథను కాపీ కొట్టగలరేమో కానీ స్క్రీన్‌ప్లేని కాపీ కొట్టలేరు. కోటిన్నరతో చేసిన ‘కలర్ ఫోటో’ సినిమా జాతీయ అవార్డు అందుకుంది. ‘మోగ్లీ’ విషయంలోనూ నాకు ఇచ్చిన బడ్జెట్లోనే ఎంత గొప్పగా తీయగలను అన్నది చూసుకున్నాను. ఉన్న పేరుని చెడగొట్టుకోవద్దని అనుకున్న బడ్జెట్లోనే ఈ సినిమాని అద్భుతంగా తీశానని అనుకుంటున్నాను’’ అని డైరెక్టర్ సందీప్ రాజ్ తెలిపారు. రోషన్ కనకాల, సాక్షి సాగర్ మడోల్కర్ జంటగా నటించిన చిత్రం ‘మోగ్లీ 2025’. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 12న రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో చిత్రదర్శకుడు సందీప్ రాజ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘కలర్ ఫోటో’ తర్వాత ఓ స్టార్ హీరోతో సినిమా తీయాలని కథ రాసుకున్నా. అయితే ఆయన బిజీగా ఉండటంతో ఆ ్రపాజెక్ట్ ఆలస్యమవుతోందని ‘మోగ్లీ 2025’ తీశాను. జంగ్లీ బుక్‌లోని మోగ్లీకి మా మోగ్లీకి సంబంధం ఉండదు. యూత్, ఫ్యామిలీ, మాస్... ఇలా అందర్నీ మెప్పిస్తుంది. క్లైమాక్స్‌లో ఓ బలమైన ఫిలాసఫీని చూపించా. ‘బబుల్గమ్’ సినిమా చూశాక నా కథకి రోషన్ సరిపోతాడనిపించింది. ఈ మూవీ కోసం తను చాలా కష్టపడ్డాడు.డెఫ్ అండ్ డంబ్ పాత్రని సాక్షి అద్భుతంగాపోషించారు. మా చిత్రంలో బండి సరోజ్గారి పాత్రను చూసి అంతా షాక్ అవుతారు. ‘మోగ్లీ’ ఔట్‌పుట్‌పై విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్‌గార్లు సంతృప్తిగా ఉన్నారు. నటుడు కావాలనే నా ఆకాంక్షను ఇప్పుడు నెరవేర్చుకుంటున్నాను. నా దర్శకత్వంలో నేను నటించడం కంటే ఇతర డైరెక్టర్స్ సినిమాల్లో చేయడం ఇష్టం. నటుడిగా రెండు సినిమాలు చేస్తున్నాను. దర్శకుడిగా–నటుడిగా ‘ఎ.ఐ.ఆర్’ వెబ్ సిరీస్ 2 ఉంటుంది’’ అని చెప్పారు. -
వినోదాల కనువిందు
ఈ ప్రపంచమే నిశ్శబ్దండిసెంబరు తొలి వారంలో ముందుగా ‘అఖండ 2: తాండవం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. ‘‘కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి..’ అనే డైలాగ్‌తో మొదలైంది ‘అఖండ 2: తాండవం’ సినిమా ట్రైలర్. హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్‌గా ‘అఖండ 2: తాండవం’ చిత్రం రూపొందింది. సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా ఈ చిత్రంలోని ఇతర ప్రధానపాత్రల్లో నటించారు.ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 5న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్లో ‘‘ఎనిమిది కంఠాలు తెగాలి... రక్తం చిందాలి, నేను చని పోయిన రోజున వాడొచ్చి కొరివి పెడితేనే ఈ కట్టె మట్టిలో కలిసేది..., ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్లినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం... ఈ దేశంలో మీరు ఎటు చూసినా కనిపించేది ఒక ధర్మం... సనాతన హైంధవ ధర్మం..., దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు... దేవం జోలికి వస్తే మేం ఖండిస్తాం... మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్.., ఇప్పటివరకు ప్రపంచపటంలో నా దేశం రూపాన్ని చూసి ఉంటావ్... ఎప్పుడూ మా దేశ విశ్వరూపాన్ని చూసి ఉండవ్... మేం ఓసారి లేచి శబ్దం చేస్తే... ఈ ప్రపంచమే నిశ్శబ్దం’ అన్న డైలాగ్స్ ఈ ట్రైలర్లో ఉన్నాయి.సమయంతో పోరాడే కథ శర్వానంద్ హీరోగా నటించిన మల్టీ జనరేషనల్ ఫ్యామిలీ డ్రామా సినిమా ‘బైకర్’. 1990–2000 మధ్య కాలంలో సాగే ఈ చిత్రం మూడు తరాల నేపథ్యంలో ఉంటుంది. ఈ మోటోక్రాస్ రేసింగ్ ఫిల్మ్‌లో శర్వానంద్ బైకర్‌గా నటించారు. ఈ సినిమాలోని లుక్ కోసం శర్వానంద్ ప్రత్యేకమైన శిక్షణ తీసుకుని సన్నబడ్డారు. స్పోర్ట్స్ అంశానికి కుటుంబ భావోద్వేగాలు మిళితమైన ఈ సినిమా డిసెంబరు 6న విడుదల కానుంది.మాళవికా నాయర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. విక్రమ్ సమర్పణలో అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ–ప్రమోద్ నిర్మించిన చిత్రం ఇది. ‘బైకర్’ ఫస్ట్ల్యాప్ పేరిట ఈ సినిమా గ్లింప్స్‌ను ఇటీవల విడుదల చేశారు మేకర్స్. ‘‘ఇక్కడ ప్రతి బైకర్‌కి ఒక కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ. చావుకి ఎదురెళ్ళే కథ. ఏం జరిగినా పట్టువదలని మొండివాళ్ళ కథ, ఇక్కడ గెలవడం గొప్పకాదు. చివరి దాకా పోరాడటం గొప్ప’ అనే డైలాగ్స్ ఈ గ్లింప్స్‌లో ఉన్నాయి.ఫారెస్ట్ లవ్‌స్టోరీ రోషన్ కనకాల, సాక్షీ మడోల్కర్ హీరో హీరోయిన్లుగా నటించిన ప్రేమకథా చిత్రం ‘మోగ్లీ 2025’. ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఈ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకు సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బండి సరోజ్ కుమార్ విలన్‌గా నటించగా, వైవా హర్ష ఓ కీలకపాత్రలో నటించారు. ఓ అమ్మాయి ప్రేమకోసం ఓ అబ్బాయి ఫారెస్ట్‌లో ఎలాంటి సాహసాలు చేశాడు? తన ప్రేయసి కోసం ఎలాంటి త్యాగాలు చేశాడు? అన్నది ‘మోగ్లీ 2025’ సినిమాలో చూడొచ్చు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 12న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘మోగ్లీ 2025 వరల్డ్, మోగ్లీ 2025 టీజర్’లను రిలీజ్ చేశారు మేకర్స్. శంబాల ప్రపంచం క్రిస్మస్ ఫెస్టివల్‌కి ‘శంబాల’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఆది సాయికుమార్. ఈ మిస్టికల్ థ్రిల్లర్ సినిమాను యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్ హీరోయిన్గా నటించగా స్వశిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా డిసెంబరు 25న రిలీజ్ కానుంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.‘కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి, అసురుడికి మధ్య జరిగిన ఓ భీకర యుద్ధం ఈ కథకి మూలం, అగ్ని పురాణం ప్రకారం ఆకాశంలో సంగ్రామం జరిగినప్పుడు దుష్ట శక్తులు జంతువుల్ని సైతం ఆవహిస్తాయి, వాళ్లేమో చీమ కుట్టినా శివుడి ఆజ్ఞ అని నమ్ముతారు... విక్రమ్ ఏమో చావులో సైతం సైన్స్ ఉందనే రకం’.., ‘మీరు చెబుతున్న శాస్త్రం మితం... మీరు తెలుసుకోవాల్సిన మా శాస్త్రం అనంతం’... వంటి డైలాగ్స్ ఈ సినిమా ట్రైలర్లో ఉన్నాయి. ఈ చిత్రకథ ప్రధానంగా ఓ గ్రామం నేపథ్యంలో సాగుతుందని, దుష్టశక్తులు, దైవం, సైన్స్ వంటి అంశాల మేళవింపుతో కథనం సాగుతుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కథనం విభిన్న కాలమానాల్లో సాగుతుందని తెలిసింది.చాంపియన్ ప్రేమకథ రోషన్ మేకా (ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు) హీరోగా నటించిన తాజా చిత్రం ‘చాంపియన్’. ఈ చిత్రంతో అనస్వర రాజన్ హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో స్వాతంత్య్రానికి ముందు హైదరాబాద్‌లో నివసించే ఆర్మీ మ్యాన్, ఫుట్‌బాలర్ మైఖేల్ సి. విలియమ్స్‌గా రోషన్ కనకాల నటించారు. మైఖేల్ ఎంతటి ప్రతిభావంతుడైన ఫుట్‌బాల్ ప్లేయర్ అంటే అప్పట్లో ఇంగ్లండ్‌లో రాణి ఎలిజబెత్‌ను కలుసుకునే అవకాశం అతనికి లభిస్తుంది.కానీ అతని ధ్యాస అంతా తన ప్రేయసి చంద్రకళ (అనస్వర రాజన్పాత్ర పేరు) పైనే. మరి... చంద్రకళతో మైఖేల్ ప్రేమకథ ఏమైంది? అన్నది క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా డిసెంబరు 25న థియేటర్స్‌లో చూడాల్సిందే. జీ స్టూడియోస్ సమర్పణలో ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి. ‘‘హిస్టరీ, స్పోర్ట్స్ డ్రామా, లవ్ స్టోరీ, భావోద్వేగాలు, యుద్ధం వంటి అంశాలతో ‘చాంపియన్’ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది’’ అని ఇటీవల ఈ సినిమా గురించి యూనిట్ పేర్కొంది.యూత్‌ఫుల్ యుఫోరియా యూత్‌ఫుల్ ‘యుఫోరియా’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యారు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్. భూమిక చావ్లా, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృథ్వీరాజ్ ప్రధానపాత్రధారులుగా నటించిన సినిమా ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ, యుక్తా గుణ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ ఇటీవల ప్రకటించింది.నేటి యువతకి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఈ ‘యుఫోరియా’ సినిమాను తెరకెక్కించామని, ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉందని యూనిట్ పేర్కొంది. కల్పలత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాశ్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు ఈ చిత్రంలోని ఇతర కీలకపాత్రల్లో నటించారు. ఇక ‘ఒక్కడు’ (2003 – ఈ చిత్రంలో మహేశ్‌బాబు హీరో) చిత్రం తర్వాత భూమిక చావ్లాతో కలిసి దర్శకుడు గుణశేఖర్ రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ ‘యుఫోరియా’ సినిమాకు కలిసి పని చేయడం విశేషం. పతంగుల పోటీ పతంగుల పోటీ నేపథ్యంలో రూపొందిన కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’. వంశీ పూజిత్, ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, ‘జీ సరిగమప’ రన్నరప్ ప్రణవ్ కౌశిక్ ప్రధాన తారలుగా ప్రముఖ సింగర్ ఎస్పీ చరణ్ మరో కీలకపాత్రలో నటించిన చిత్రం ఇది. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం కూడా క్రిస్మస్ సందర్భంగానే డిసెంబరు 25 రిలీజ్ కానుంది. ఈ సినిమా కథే మెయిన్ హీరో అని, థియేటర్స్‌లో ఈ ‘పతంగ్’ సినిమా యూత్‌కి ఓ యూత్ ఫెస్టివల్‌గా ఉంటుందని చిత్రయూనిట్ పేర్కొంది. కులవ్యవస్థపై దండోరా అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్రవర్ణాలకు ఎవరైనా ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండలు జరుగుతాయనే అంశాల నేప థ్యంలో రూపొందిన సినిమా ‘దండోరా’. శివాజీ, నవదీప్, బిందు మాధవి, రవికృష్ణ, మోనికా రెడ్డి ఈ చిత్రంలోని ప్రధానపాత్రల్లో నటించారు. మురళీ కాంత్ దర్శకత్వంలో లౌక్య ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న రిలీజ్ కానుంది. ‘తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోని ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూ ‘దండోరా’ ను తెరకెక్కించామని, ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ డిసెంబరు నెలలో రిలీజ్ కానున్న సినిమాలు, రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. తెలుగు బాక్సాఫీస్ వద్ద ఈ డిసెంబరు నెలలో డబ్బింగ్ సినిమాలు కూడా గట్టిగానే సందడి చేయనున్నాయి. ఆ సినిమాలు ఏమిటో ఓ లుక్ వేద్దాం...⇒ కార్తీ పోలీసాఫీసర్‌గా నటించిన తాజా చిత్రం ‘వా వాత్తియార్’. ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్గా నటించగా, సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ ‘వా వాత్తియార్’ మూవీకి తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ యాక్షన్ కామెడీ కథకు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించగా, స్టూడియో గ్రీన్ పతాకంపై కె. ఇ. జ్ఞానవేల్ రాజా ఈ నిర్మించారు. కాగా, ఈ సినిమాను డిసెంబరులో రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ ఇటీవల ప్రకటించింది. గతంలో ఈ ‘వా వాత్తియార్’ సినిమాను డిసెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ రిలీజ్ డేట్లో మార్పు ఉంటుందని, డిసెంబరు 12న ఈ చిత్రం థియేటర్స్‌లోకి రావచ్చని కోలీవుడ్ టాక్. ⇒ ‘లవ్‌టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, డ్యూడ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గర అయ్యారు ప్రదీప్ రంగనాథన్. ఈ యువ కథానాయకుడు హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎల్.ఐ.కే’ (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ). ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా, నయనతారతో కలిసి లలిత్‌కుమార్ నిర్మించారు. కృతీ శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ఎస్జే సూర్య, యోగిబాబు, గౌరీ జీ కిషన్ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా డిసెంబరు 18న రిలీజ్ కానుంది. దీపావళి సందర్భంగా ఈ ‘ఎల్.ఐ.కే’ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ పండగ సందర్భంగానే ప్రదీప్ రంగనాథన్ నటించిన మరో సినిమా ‘డ్యూడ్’ కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో ‘ఎల్.ఐ.కే’ సినిమాను రిలీజ్ వాయిదా వేయక తప్పలేదు. ⇒ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ డైరెక్షన్‌లోని ‘అవతార్’ సిరీస్ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘అవతార్:ఫైర్ అండ్ యాష్’. ప్రపంచవ్యాప్త సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా డిసెంబరు 19న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. తెలుగులోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. సామ్ వర్తింగ్టన్, జోయ్ సల్దానా, సిగోర్నీ వీవర్, స్టీఫెన్‌లాంగ్, ఊనా చాప్లిన్, కేన్ విన్స్లెట్, క్లిఫ్ కర్టిస్, జాక్ చాంపియన్ వంటి హాలీవుడ్ నటులు ఈ ‘అవతార్ 3’ చిత్రంలో నటించారు. జేమ్స్ కామెరూన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతోపాటు ఓ నిర్మాతగా ఉన్నారు. జూన్ ల్యాండో ఈ సినిమాకు మరో నిర్మాత. ⇒ మోహన్‌లాల్ హీరోగా నటించిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘వృషభ’. రాగిణి ద్వివేది, సమర్జిత్ లంకేష్, నయన సారిక ఈ చిత్రంలోని ప్రధానపాత్రల్లో నటించారు. తొలుత ఈ సినిమాను దీపావళికి, ఆ తర్వాత నవంబరు 6న రిలీజ్ చేయాలని ΄్లాన్ చేశారు. కానీ వీలుపడలేదు. అయితే ఇటీవల ఈ చిత్రాన్ని డిసెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా ఈ సినిమాను నిర్మించారు. తండ్రీ కొడుకుల ఎమోషన్, మానవ అనుబంధాల మేళవింపుతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రయూనిట్ పేర్కొంది. వీటితోపాటు ఈ నెలలోనే మరికొన్ని ఇతర భాషల చిత్రాలు తెలుగులో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి. – ముసిమి శివాంజనేయులు -
'మగాడిగా పుట్టడమే పెద్ద దరిద్రం రా'.. మోగ్లీ టీజర్ అదుర్స్
యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా వస్తోన్న తాజా చిత్రం మోగ్లీ 2025(Mowgli Teaser). ఈ సినిమాకు కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. బబుల్ గమ్ మూవీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రోషన్.. ఈ సినిమాతో హిట్ కొట్టేందుకు ట్రై చేస్తున్నాడు. ఈ చిత్రంలో సాక్షి సాగర్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఈ టీజర్‌ను జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. తాజాగా రిలీజైన టీజర్ చూస్తే ఈ కథ అంతా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేమకథ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్లో సన్నివేశాలు, డైలాగ్స్ చూస్తే ఈ కథేంటో ప్రేక్షకులకు అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన డిసెంబరు 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి కాలభైరవ సంగీతమందించారు. -
'మౌగ్లీ' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సుమ తనయుడి కొత్త సినిమా.. క్రేజీ సాంగ్ వచ్చేసింది
యాంకర్ సుమ తనయుడు రోషన్ (Roshan Kanakala) హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'మోగ్లీ' (Mowgli). ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. బబుల్గమ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రోషన్.. ప్రస్తుతం సందీప్ రాజ్‌తో జతకట్టారు. ఈ చిత్రంలో రోషన్ సరసన సాక్షి మడోల్కర్ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీ నుంచి లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సయ్యారే అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. కాల భైరవ, ఐశ్వర్య దరూరి ఆలపించారు. ఈ సినిమాకు కాల భైరవ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫారెస్ట్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు కీలక పాత్రలు పోషించారు. కాగా.. మోగ్లీ డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. -
మోగ్లీ వస్తున్నాడు
రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ 2025’. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాకు సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది.ఈ సినిమాను డిసెంబరు 12న రిలీజ్ చేయనున్నట్లగా మేకర్స్ ప్రకటించారు. ‘‘ఓ ఎమోషనల్ క్యారెక్టర్లో రోషన్ నటించాడు. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ, బండి సరోజ్ విలనిజమ్ ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌గా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఇన్సెక్యూర్ నెపోటిజం.. అస్సలు సహించను: బండి సరోజ్ కుమార్
బండి సరోజ్ కుమార్.. ఈ తరం ఆడియెన్స్‌కి ఈ పేరు కాస్తోకూస్తో తెలుసు. అది కూడా ఇతడు హీరోగా చేస్తూ దర్శకత్వం వహించిన నిర్బంధం, నిర్బంధం 2 సినిమాలు వల్ల. వీటిని యూట్యూబ్‌లోనే రిలీజ్ చేశాడు. వాటికి వచ్చిన వ్యూస్ ద్వారానే ఇతడికి డబ్బులొచ్చాయి. సరోజ్ కుమార్ తొలిసారి నటించిన కమర్షియల్ మూవీ 'మోగ్లీ'. యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ హీరోగా చేశాడు. రీసెంట్‌గానే గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో సరోజ్ కుమార్ చేసిన విలన్ క్యారెక్టర్‌కి ప్రశంసలు చాలా వస్తున్నాయి. అయితే మూవీ టీమ్ మాత్రం వాటిని డిలీట్ చేస్తూ, తనకు అన్యాయం చేస్తోందని, తన కెరీర్, భవిష్యత్తు గురించి భయమేస్తోందని సరోజ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశాడు. మూవీ టీమ్‌తో వివాదం గురించి మొత్తం బయటపెట్టాడు.(ఇదీ చదవండి: నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా.. తెలుగు దర్శకుడి ఆవేదన)ఇంతకీ అసలేమైంది?'మోగ్లీ' గ్లింప్స్‌లో తనని మెచ్చుకుంటూ పెడుతున్న కామెంట్స్‌ని మూవీ టీమ్ డిలీట్ చేస్తోందని బండి సరోజ్ కుమార్.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్‌గా మారిపోయింది. 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అడ్మిన్స్ నా గురించి పెట్టిన 400కి పైగా కామెంట్స్ తొలగించారు. ఇంకా అదే పనిలో ఉన్నారు. నిర్మాత విశ్వప్రసాద్ దీన్ని తీవ్రంగా పరిశీలించాలని కోరుతున్నాను. ఇది కంటెంట్ ఫిల్మ్ అని, లాంచ్ ప్యాడ్ ఫిల్మ్ కాదని నాకు చెప్పారు. అందుకే నేను ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకొన్నాను. నా సర్వస్వం పెట్టాను. ఎలాంటి కండీషన్స్ లేకుండా పనిచేశాను. కానీ నాకు దక్కిన ఫలితం ఇదే. దీని వెనక ఓ సిండికేట్ ఉంది. ఇది ఆమోదయోగ్యమైనదేనా?' అని సరోజ్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.'కామెంట్స్ ఏ కదా.. లైట్ తీసుకోమని చెప్పేవాళ్లకి. నేను ఇప్పటివరకు బయట సినిమాలు ఒప్పుకోలేదు. సందీప్ రాజ్ ఒత్తిడితో కథ విన్నాక, నా పాత్ర నచ్చి అందులో ఎలాంటి మార్పులు ఉండకూడదు అనే అగ్రిమెంట్‌తో ఈ సినిమాలో పారితోషికం లేకుండా ప్రాణం పెట్టి నటించాను. 8 నెలలు నా సమయాన్ని ఇచ్చాను. నాకు వస్తున్న రిసెప్షన్ చూసి ముందు థంబ్ నెయిల్స్ మార్చారు. తర్వాత కామెంట్స్ ఆఫ్ చేశారు. నేను దర్శకుడితో మాట్లాడాక మళ్లీ ఆన్ చేశారు. ఒక మూడు కామెంట్లని 3 బాట్ లైక్స్‌తో బూస్ట్ చేసి, నా పాత్రకి వస్తున్న ఆదరణని మ్యాచ్ చేయడానికి చూశారు. కుదరలేదు. ఇప్పుడు నా టాప్ కామెంట్స్ డిలీట్ చేశారు. ఇంకా డిటైల్డ్ ప్రూఫ్స్‌తో ముందుకు వస్తాను''ఇప్పటికీ అక్కడున్న 1600 కామెంట్లలో 99 శాతం నాపైన ప్రేక్షకుడు పలికించిన ప్రేమే. నాకు పీఆర్లు లేరు. ప్రేక్షకుడి బలమే నా పీఆర్. ఆ సునామీని ఎవ్వడూ ఆపలేరు. వీళ్లు ఇప్పుడు ఇలా చేస్తే, రేపు సినిమాలో ఎన్ని చేస్తారు. ఎవరిని నమ్మాలి. నిర్మాత వరకు వెళ్లే అవకాశం నాకు లేదు. నేను ఇండస్ట్రీలో బ్రతికేయడానికి రాలేదు. గత 5 సంవత్సరాలుగా నా కళతో నేను ప్రేక్షకుల్ని సంపాదించుకున్నాను. ఇలాంటి ఇన్సెక్యూర్ నెపోటిజం, పాలిటిక్స్‌ని అస్సలు సహించను. నిర్మాత విశ్వప్రసాద్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలించాలని కోరుతున్నాను. ఇది మీ ప్రమేయం లేకుండా జరుగుతుందని అనుకుంటున్నాను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చౌకబారు నెపోటిజంకి అడ్డాగా మారకూడదు. దీని వల్ల నా బాధ, నా భవిష్యత్తు కెరీర్ పట్ల ఉన్న భయాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను' అని సరోజ్ కుమార్ ట్వీట్ చేశాడు.అయితే సరోజ్ కుమార్ ట్విటర్ అకౌంట్ ప్రస్తుతం కనిపించట్లేదు. కానీ ట్వీట్స్ స్క్రీన్ షాట్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇతడికి మద్ధతుగా చాలామంది పోస్టులు పెడుతున్నారు. అలానే ఇతడు చెప్పినట్లు గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు థంబ్ నెయిల్లో ఇతడి ఫొటో కనిపించింది. ఇప్పుడేమో హీరోహీరోయిన్ పెట్టి, అతడి ఫొటోని తొలగించారు. మరోవైపు సినిమా రిలీజ్‌కి ఇంకా చాలా సమయముంది. ఇప్పుడు ఈ గొడవ చూస్తుంటే.. ముందు ముందు ఇంకెంత రచ్చ అవతుందో అనే సందేహం కలుగుతోంది.(ఇదీ చదవండి: దీనస్థితిలో 'కేజీఎఫ్' నటుడు.. సాయం చేయాలని వేడుకోలు) -
'మోగ్లీ' గ్లింప్స్ లాంచ్ చేసిన రామ్ చరణ్
-
వాడి ప్రేమకథలో వేలు పెడితే ఇలాగే ఉంటుంది.. 'మోగ్లీ' గ్లింప్స్
రోషన్ (Roshan Kanakala) హీరోగా నటిస్తున్న చిత్రం 'మోగ్లీ' (Mowgli).. తాజాగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలైంది. రాజీవ్ కనకాల- సుమ వారసుడిగా చిత్రపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన రోషన్ 'మోగ్లీ' ప్రేమకథతో వస్తున్నాడు. తాజాగా విడుదలైన గ్లింప్స్ నాని వాయిస్‌తో మొదలౌతుంది. 25 సంవత్సరాలు నిండని ఓ కుర్రాడు 30 మందిని తిండి, నిద్ర లేకుండా పరిగెత్తించాడంటూ నాని వాయిస్‌తో డైలాగ్ ప్రారంభమౌతుంది. వాడు గ్యాంగ్ స్టర్ కాదు, క్రిమినల్ కాదంటూనే వాడి కథేంటో తెలుసుకోవాలంటే మోగ్లీ చూడాలని చెప్పాడు. ఇందులో హీరోయిన్గా సాక్షి సాగర్ నటించారు. కలర్‌ఫోటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. -
యాంకర్ సుమ తనయుడి రెండో చిత్రం.. 28న స్పెషల్ సర్ప్రైజ్!
యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల నటిస్తోన్న రెండో చిత్రం మోగ్లీ. ఈ సినిమాకు కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్గా ఆరంగేట్రం చేస్తోంది. బబుల్గమ్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రోషన్ ఈ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు.ఆగస్ట్ 28న ఈ మూవీ నుంచి ఓ స్పెషల్ సర్ప్రైజ్ను రిలీజ్ చేయబోతున్నట్లు డైరెక్టర్ సందీప్ రాజ్ రివీల్ చేశారు. ‘1850 రోజుల తర్వాత నా రెండో సినిమా మీ ముందుకు వస్తోంది.. ‘మోగ్లీ’ పేరుతో పాటు స్పెల్లింగ్‌ను గుర్తు పెట్టుకోండి’ అంటూ సందీప్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చాడు. కాగా.. ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నాడు. ఈ వినాయక చవితికి మోగ్లీ సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Sandeep Raj (@sandeepraaaj) -
రోషన్ కనకాల మోగ్లీ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోన్న సాక్షి మడోల్కర్ (ఫొటోలు)
-
ఒకప్పడు ‘అడవి’ మనిషి... ఇప్పడు రియల్ హీరో
జాతి వివక్షత, కుల వివక్ష.. పేద, ధనిక వంటి కారణంగా చాలామంది నిరాదరణకు గురవ్వడం చూసి ఉంటాం. కానీ రూపం కారణంగా నిరాదరణకు గురై దూరంగా అడవిలో జీవించాల్సి రావడం అంటే అది అత్యంత అమానుషమే. రువాండాకు చెందిన ఒక వ్యక్తి అసాధారణ రూపం కారణంగా నిరాదరణకు గురైనప్పటిక ఒక చానల్ సాయంతో మళ్లీ తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. అతనెవరో ఏంటో చూద్దాం రండి. (చదవండి: లక్కీ హ్యండ్! 20 లాటరీ టికెట్లు.. 20 సార్లూ అదృష్టం!) రువాండాకు చెందిన జాంజిమాన్ ఎల్లీని రియల్ లైఫ్‌లో మోగ్లీగా పిలిచేవారు. కారణం అతని రూపం. అయితే ఈ 22 ఏళ్ల జాంజిమాన్ ఎల్లీ మైక్రోసెఫాలీ అనే రుగ్మతతో బాధపడుతున్నాడు (శిశువు తల ఊహించిన దాని కంటే చాలా చిన్నదిగా ఉంటుంది). ఈ వ్యాధి అతన్ని ప్రజలకు దూరంగా అడవిలో నివశించేలా చేసింది. ఈ రూపం కారణంగా కర్కశత్వానికి, నిరాదరణకు గురయ్యాడు. దీనికి తోడు అతనికి వినికిడి, మాట్లాడలేని సమస్యలు కూడా ఉన్నాయి. పైగా ఎల్లీ తల్లికి అతను పుట్టక ముందే ఐదుగురు పిల్లలను కోల్పయింది. ఆమె దేవుడికి ఎన్నో ప్రార్థనలు చేయగా ఎల్లీ పుట్టాడు. అంతేకాదు ఈ ఒంటరి తల్లి ఎల్లిని పెంచలేక అడవికి వెళ్లి గడ్డి తినమని బలవంతం చేస్తుండేది. అయితే అఫ్రిమాక్స్ అనే ప్రాంతీయ టీవి చానల్ గో ఫండ్ అనే వెబ్సైట్ ద్వారా ప్రజలకు అతనికి మనమందరం సాయం చేద్దాం అంటూ ప్రచారం చేసింది. దీంతో ఇప్పుడూ ఎల్లీ రువాండాలోని గిసేనీలోని ఉబుమ్వే కమ్యూనిటీ సెంటర్లో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలో చేరాడు. పైగా అతని స్కూల్ యూనిఫాం అయిన కస్టమ్ మేడ్ సూట్ ధరించి కెమెరాకు ఫోజులిస్తున్నాడు. ఈ మేరకు ఎల్లి తల్లి మాట్లాడుతూ..."ఒకప్పుడూ నా కొడుకుని చూసి అందరూ ఎగతాళి చేసేవారు. ఇప్పుడూ మా జీవితాలు మారాయి. నా కొడుకు ఆనందంగా స్కూల్‌కి వెళ్తున్నాడు. మాకు ఉండటానికి ఒక ఇల్లు కూడా కట్టించి ఇచ్చారు. నా బాధలన్నింటిన మీరు ఒక్క నిమిషంలో దూరం చేశారు" అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. అయిలే ఎల్లి సూట్ ధరించి నవ్వుతూ ఫోజులిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు మనం అందరూ కృషి చేస్తే ఇలాంటి వాళ్ల ఎందరికో సాయం చేయగలం అంటూ రకరకలుగా ట్వీట్ చేశారు. (చదవండి: బాప్రే!.. ఆ జంట దొంగలించిన వైన్ బాటిల్స్ ఖరీదు రూ.3 కోట్లా!) The story of Zanziman Ellie Mowgli transformation is inspirational, Everyone this a happy life, We can all work to eliminate stigmatization in our respective societies. pic.twitter.com/bQhwIm02Tf — Sam Wamalwa🇰🇪 (@samsmoothke) October 28, 2021 -
వనమంత మానవత్వం
‘మన మధ్యే పెరగినా వాడికీ జీవితం ఉండాలి. మనుషుల మధ్య జీవించాలి’ అని అడవిలోని జంతువులన్నీ అనుకున్నాయి.‘మీలోనే మనుషులు కనపడుతున్నారు. నాకు మీరే జీవితం’ అని అడవిలోనే ఉండిపోయాడు మోగ్లీ.వనమంత మానవత్వాన్ని మన కళ్లకు కట్టింది ‘ది జంగిల్ బుక్’. మీరు 90ల కాలం నాటి పిల్లలా? అయితే, జంగల్ బుక్ అని పేరు వినగానే మీ చెవుల్లో ఓ పాట సందడి చేస్తుండాలి. ‘జంగిల్ జంగిల్ బాత్ చలీ హై పతా చలా హై... అరె చడ్డీ పెహన్‌కే ఫూల్ కిలాహై..’ అంటూ ఓ కుర్రాడు అటవీ జంతువులతో కలిసి చేసే విన్యాసాలూ కళ్ల ముందు మెదులుతూ ఉండాలి. ఆ విన్యాసాలను అప్పటి పిల్లలందరూ కళ్లప్పగించి చూశారు. ఇప్పటికీ కిడ్స్ చానెల్స్‌లో నాటి జంగిల్‌బుక్ వీరుడు మోగ్లీ అల్లరి చేస్తూనే ఉన్నాడు. 90 ల కాలంలో దూరదర్శన్‌లో ఏడాది పాటు వచ్చిన ఈ సీరియల్ అప్పటి పిల్లలకు ఓ మంచి ఫ్రెండ్ అయ్యింది. వన్యమృగాలున్న అడవిలో ఒంటరిగా ఒక పిల్లవాడు, ఆ పిల్లవాడు అక్కడి జంతువుల్లో ఒకడిగా పెరగడం.. అబ్బురంగా చూశారు. ఆ అటవీ ప్రపంచంలో తామూ తిరిగారు. వన్యప్రాణులతో దోస్తీ కట్టారు. ఆటలు ఆడారు. పాటలు పాడారు. నాటి–నేటి పిల్లల ప్రియనేస్తం మోగ్లీని మరో మారు పరిచయం చేసుకుందాం. మొట్టమొదటి యానిమేషన్ సీరియల్ అప్పట్లో పిల్లల కోసం ప్రత్యేక ఛానళ్లేవీ లేవు. పిల్లల కోసం ప్రత్యేకించి ప్రోగ్రాములూ లేవు. అప్పుడొచ్చింది జంగిల్‌బుక్. దూరదర్శన్‌లో సోప్ సీరియల్స్ స్టార్ట్ అయిన తొమ్మిదేళ్లకు ఎంటర్ అయ్యింది ఈ యానిమేషన్ సీరియల్. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు పిల్లలతో పాటు పెద్దలనూ తన ముందు కూచోబెట్టింది. మూలం రడ్ యార్డ్ ఆంగ్ల రచయిత్ రడ్ యార్డ్ కిప్లింగ్ జంగిల్‌బుక్ సృష్టికర్త. రడ్యార్డ్ ఇండియాలో పుట్టి, ఇంగ్లండ్‌లో పెరిగిన వ్యక్తి. 1894లో ‘ది జంగిల్ బుక్’ రాశాడు. ఈ పుస్తకం ఆధారంగా మోగ్లీ స్టోరీస్‌ను వాల్ట్ yì స్నీ అంతర్జాతీయంగా అన్ని దేశాలకూ పరిచయం చేసింది. 1989లో జపాన్‌లో మొదటిసారి వచ్చిన ఈ యానిమేషన్ సీరియల్ అదే సంవత్సరం హిందీ డబ్బింగ్‌తో మన దేశంలో ప్రసారమై ఎంతగానో ప్రాచుర్యం పొందింది. 52 ఎపిసోడ్లతో ఏడాది పాటు పెద్దలనూ, పిల్లలను అలరించింది ఈ సీరియల్. మోగ్లీ అనే పిల్లవాడి కథ చాలా చిన్నగా ఉన్నప్పుడు తల్లితండ్రి నుంచి తప్పిపోయి దట్టమైన అడవికి చేరుకుంటాడు మోగ్లీ. ఒకచోట పడి ఉన్న మోగ్లీని బగీరా అనే నల్ల పులి కనిపెడుతుంది. మోగ్లీని అకెలా, అలెగ్జాండర్ అనే తోడేళ్ల దగ్గరికి తీసుకెళ్తుంది బగీరా. అకేలాకి చిన్న చిన్నపిల్లలు ఉంటారు. తన పిల్లలతో పాటు మోగ్లీని కూడా పెంచుతుంటుంది. రోజూ తోడేలు పిల్లలతో ఆడుకుంటూ పెరుగుతుంటాడు మోగ్లీ. బగీరా అనే నల్ల పులి, బాలూ అనే ఎలుగుబంటి, కా అనే పైథాన్..లు మోగ్లీ స్నేహితులు. జంతువులతో ఆడుకుంటూ, జంతువుల మధ్య ఉండటంతో త్వరగానే అడవి జీవులతో కలిసిపోతాడు మోగ్లీ. ‘కా’ టీచర్‌గా మోగ్లీకి కొండలు, చెట్లు ఎక్కడం, ఊడలు పట్టుకొని ఊగడం.. వంటి ఎన్నో విషయాల్లో తర్ఫీదు ఇస్తుంది. ఒక రోజు అర్ధరాత్రి అడవిలోని జంతువులన్నీ గాఢనిద్రలోకి జారుకుంటాయి. రాత్రిపూట మనుషుల్ని తినే షేర్‌ఖాన్ అనే పులి అడవిలోకి చొరపడుతుంది. ముందుగానే పసిగట్టిన బగీరా మోగ్లీ గురించి ఆలోచిస్తుంది. అడవిలో ఉంచడం మంచిది కాదని, మనుషులున్న చోటుకు చేర్చాలని మోగ్లీని తీసుకొని బయల్దేరుతుంది. మోగ్లీని తినాలనే ప్రయత్నం చేస్తున్న షేర్‌ఖాన్ నుంచి బగీరా కాపాడుతుంది. ఒకానొక సమయంలో మోగ్లీకి అడవిలో గుర్తింపు సమస్య ఎదురవుతుంది. విలన్లయిన జంతువుల నుంచి ప్రమాదం ఉంటుందని, మనుషులు ఉన్న చోటుకి చేరుస్తామని మోగ్లీ స్నేహితులు చెబుతారు. ఎవరు ఎంత నచ్చజెప్పినా అడవిలోనే ఉంటానంటాడు మోగ్లీ. అడవి జంతువులతోనే జీవిస్తుంటాడు. ఆ తరం నుంచి ఈ తరం వరకు, హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూనే ఉంటుంది ది జంగిల్‌బుక్. మోగ్లీ వయసు సుమారు 6 నుంచి 10 ఏళ్ల మధ్యన ఉంటుంది. అడవిలో ఎన్నో సాహసవిన్యాసాలు చేస్తుంటాడు. మోగ్లీ పనులు ఒక్కోసారి ఆలోచించేలా, మరోసారి నవ్వు తెప్పించేలా ఉంటాయి. జంతువుల పట్ల ప్రేమగా ఉంటాడు. ఇవన్నీ ఆ వయసు పిల్లలను బాగా కట్టిపడేశాయి. పెద్దలను కూడా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. కల్మషం లేని ప్రేమకు ముగ్దులవనిది ఎవరు. ఒక్క మన దేశంలోనే కాదు, ‘ది జంగిల్ బుక్’ ప్రపంచ దేశాల్లోని పిల్లలందరికీ పరిచయమే. -
‘మోగ్లీ’ ట్రైలర్ విడుదల
-
జంగిల్ బుక్ కథతో మరో సినిమా
జంగిల్ బుక్ సినిమా ఇండియన్ స్క్రీన్‌పై సృష్టించిన ప్రభంజనం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కేవలం ఇండియాలోనే 250 కోట్ల వరుకు వసూళ్లు సాధించి సత్తా చాటింది ఈ సినిమా. గ్రాఫిక్స్, జంతువులు, చిన్న పిల్లాడు చేసే విన్యాసాలు ఈ సినిమా పట్ల ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగించాయి. దీంతో ఈ సినిమా మల్టిప్లెక్స్‌లో భారీ కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం జంగిల్‌బుక్ తరహాలోనే ‘మోగ్లీ’ సినిమా రాబోతోంది. టార్జన్ కాన్సెప్ట్‌తో ఇది వరకే ఎన్నో సినిమాలు వచ్చాయి. అడివినే ప్రపంచంగా బతికే బాలుడు జన సంచారంలోకి వస్తే ఏవిధమైన కష్టాలు పడాల్సి వస్తుంది. అరణ్యంలో జంతువులతో ఏర్పడే ప్రేమానురాగాలు, వీటన్నింటికి తోడు మరో అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లే గ్రాఫిక్స్ మాయాజాలంతో మన ముందుకు రాబోతోంది ‘మోగ్లీ’. వార్నర్ బ్రదర్స్ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఆండీ సెర్కిస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రోహణ్ చంద్ మోగ్లీగా నటిస్తుండగా జంతువుల పాత్రలకు క్రిస్టీన్ బాలే, కేట్ బ్లాంచెట్, నోమీ హేరిస్లు గాత్రధానం చేస్తున్నారు. స్లమ్‌డాగ్ మిలియనీర్ ఫేం ఫ్రిదా పింటో మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా జంగిల్ బుక్ ఆధారంగా తెరకెక్కించినా గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా మరింత సీరియస్‌గా ఉండనుందని దర్శక నిర్మాతలు వెల్లడించారు. -
మోగ్లీ గర్ల్ మచ్చికవుతోంది
జంగిల్ బుక్ ఎంత పాపులరో అందరికీ తెలుసు కదా! ఆ పుస్తకాన్ని, సినిమాను చదివి ఎంజాయ్ చెయ్యని చిన్నారులే కాదు, పెద్దలు కూడా ఉండరేమో బహుశా! అచ్చం ఆ పుస్తకంలోని మోగ్లీ బాయ్ క్యారక్టర్ లాగే ఇటీవలే కోతులతో ఆడుకుంటూ పోలీసుల కంట పడింది ఓ మోగ్లీ గర్ల్. దాదాపు ఏడెనిమిదేళ్ల వయసున్న ఆ బాలిక కోతుల గుంపుతో కలిసి జీవిస్తూ, వాటిలాగే ఆహారం తీసుకుంటూ ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిన్ అడవిలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల దృష్టిని ఆకర్షించింది. ఎస్సై సురేష్ యాదవ్ రెండు నెలల క్రితం మోతీపూర్ పరిధిలోని కర్ణిఘట్ అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహించారు. ఆ సమయంలో ఆ పాప కోతుల గుంపులో తాను కూడా కలిసిపోయి, వాటితో ఎంతో సహజంగా ఆడుకుంటూ కనిపించింది. సురేష్‌కుమార్‌కు ఆ పాపను ఎలాగైనా రక్షించాలనిపించింది. అతికష్టం మీద ఆ కోతుల గుంపును అక్కడినుంచి చెదరగొట్టి, ఆ పాపను వాటినుంచి వేరు చేసి జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. రెండునెలలుగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఈ కోతిపిల్లను మామూలు మనిషిగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో కొంత మేరకు సక్సెస్ అయ్యారు. దాంతో పత్రికలకు ఓ వారం క్రితమే ఈ పాపకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు. అచ్చం జంగిల్ బుక్ స్టోరీలోని మోగ్లీ అనే కుర్రాడితో పోలి ఉన్నందువల్ల ఆసుపత్రిలోని వారు ఈ పాపను ముద్దుగా మోగ్లీ గర్ల్ అని పిలుస్తూ, ఎంతో ఓపిగ్గా చికిత్స చేస్తున్నారు. చేతులతో కాకుండా నేరుగా నోటితో ఆహారం తీసుకోవడం, జంతువులానే నాలుగు కాళ్లతో నడవడం, తనకు కొంతకాలంగా అలవాటయిన వాళ్లు గాక కొత్తవాళ్లెవరయినా కంటపడితే చాలు బెదిరిపోయి, మంచం కింద దాక్కోవడం, ఎక్కడ ఉంటే అక్కడే మలమూత్ర విసర్జన చేయడం, కోతుల్లాగే పళ్లికిలించడం, తనకు నచ్చిన వస్తువులేమైనా ఎదుటి వారి చేతిలో కనిపిస్తే గభాల్న లాగేసుకోవడం వంటి కోతి చేష్టలను మాత్రం ఈ పాప ఇంకా మానుకోలేకపోతోంది. ఇప్పుడిప్పుడే నిల» డేందుకు ప్రయత్నం చేస్తోంది. అసలు ఈ పాప ఎక్కడినుంచి అడవిలోకి వచ్చింది, తప్పిపోయిందా లేక ముందరే లోపాలతో ఉన్న పాపను ఎలాగైనా వదిలించుకోవాలని తల్లిదండ్రులే ఆమెను సమీపంలోని అడవిలో కావాలనే వదిలిపెట్టారా... వంటి సమాధానాలు లేని సందేహాలు అందరి బుర్రలనూ తొలిచేస్తున్నాయి. కాగా, ఎంతోకాలంగా తమతో కలిసి ఉన్న తమ నేస్తాన్ని చూసేందుకు, ఆమెతో ఆటలాడుకునేందుకు మర్కట నేస్తాలు ఆసుపత్రి పరిసర ప్రాంతాలలో తచ్చాడుతున్నాయట. పాపం! చుట్టుపక్కల ఉన్నవారెవరైనా కనిపించకపోతేనో, ఉన్నట్టుండి మాయం అయిపోతేనో మనలా వదిలేసి ఊరుకోవవి, వాటి ప్రేమ స్వచ్ఛమైనది మరి! -
త్వరలో... జంగిల్‌బుక్-2
అమెరికాలో రిలీజ్ కాక ముందే సంచలనం మన దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు నాట ఇప్పుడు జనమంతా చెప్పుకుంటున్న సినిమా - ‘ది జంగిల్ బుక్’. అమెరికాలో ఈ 15న రిలీజ్ కానున్న ఈ హాలీవుడ్ చిత్రం ఇక్కడ మాత్రం అంత కన్నా ఒక వారం ముందే మొన్న ఉగాది నాడు రిలీజైంది. 1967లో వాల్ట్‌డిస్నీ సంస్థ నుంచి కార్టూన్ యానిమేషన్ చిత్రంగా వచ్చి, బుల్లి, వెండితెరలపై ఆకట్టుకున్న ఈ కథ ఇప్పుడు అధునాతన లైవ్ యాక్షన్ -యానిమేషన్ (కంప్యూటర్ గ్రాఫిక్స్ హైబ్రిడ్) రూపంలో పిల్లల్నీ, వారితో పాటు పెద్దల్నీ ఆకర్షిస్తోంది. ఇంగ్లీష్‌లోని ఈ హాలీవుడ్ చిత్రం తాలూకు హిందీ, తెలుగు, తమిళ తదితర భారతీయ భాషా డబ్బింగ్‌లకు భారతీయ ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. మన దేశంలో దాదాపు 1700 థియేటర్లలోవిడుదలైన ఈ చిత్రం ఇప్పుడు వసూళ్ళలో పెను సంచలనం. ఇప్పటికే రికార్డ్ కలెక్షన్స్! అమెరికాలో ఈ వారం రిలీజ్! చాలా ఏళ్ళ క్రితం రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన నవల - ‘ది జంగిల్ బుక్’. అడవిలోని పసిబాలుడు మోగ్లీని తోడేళ్ళు పెంచడం, ఎలుగుబంటి, కొండ చిలువ లాంటి రకరకాల అడవి జంతువులతో అతని స్నేహం మధ్య ఈ కథ తిరుగుతుంది. భారతీయ సంతతికి చెందిన నీల్‌సేథీ ఈ సినిమాలో మోగ్లీ పాత్ర పోషించగా, హైదరాబాద్‌కు చెందిన ఏడోతరగతి కుర్రాడు పదేళ్ళ సంకల్ప్ ఆ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పడం విశేషం. నిజానికి, పెద్ద నగరాల్లో ఇంగ్లీషే తప్ప ఈ ప్రాంతీయ భాషా వెర్షన్ల ప్రదర్శనలు తక్కువగా వేస్తున్నారు. దాంతో, ఉన్న ఒకటీ, అరా థియేటర్లలో రోజుకు ఒకటి, రెండు ఆటలతో టికెట్లు దొరక్క జనం అసంతృప్తితో వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి. అయితేనేం, త్రీడీలోనూ రిలీజైన ఈ సినిమాకు ఒక్క మన దేశంలో తొలి రోజే సుమారు రూ.10.09 కోట్ల వసూళ్ళు వచ్చాయి. రెండో రోజున వసూళ్ళ స్థాయి ఇంకా పెరిగి, రూ.13.5 కోట్లు వచ్చాయి. మూడో రోజు రూ. 16.6 కోట్లు వసూళ్ళయ్యాయి. అన్నీ కలిపి, రిలీజైన తొలి వారాంతానికే రూ. 40 కోట్ల పైగా ఆర్జించింది. గత ఏడాది రిలీజైన హాలీవుడ్ చిత్రం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7’ అప్పట్లో తొలి మూడు రోజులకే రూ. 48 కోట్లు వసూలు చేసింది. దాని తరువాత మన దేశంలో తొలి మూడు రోజులకే ఇంత భారీ వసూళ్ళు సాధించిన రెండో హాలీవుడ్ చిత్రం -‘ది జంగిల్ బుక్’! ఈ ఊపులో తొలివారంలోనే థియేటర్లలో రూ. 50 కోట్ల మార్కు దాటేయనుంది. ఈ ఏడాదిలో ఇప్పటి దాకా మన దేశంలో అతి పెద్ద బాక్సాఫీస్ హిట్ ఇదే! స్కూల్ పిల్లలకు సెలవులు కూడా వచ్చేస్తుండడంతో, ఈ సినిమా కొద్దిరోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కు సునాయాసంగా దాటేస్తుందని మార్కెట్ వర్గాల కథనం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆసియా, లాటిన్ అమెరికా మార్కెట్లు రెంటిలోనూ కలిపి ఇప్పటికే ఈ చిత్రం 3.17 కోట్ల డాలర్లు (మన లెక్కలో రూ. 200 కోట్ల పైగా) వసూలు చేసి, సంచలనం రేపుతోంది. వార్నర్ బ్రదర్స్ పోటీ ‘జంగిల్ బుక్’ వాయిదా! నిజానికి, డిస్నీ సంస్థతో పాటు వార్నర్ బ్రదర్స్ సంస్థ కూడా ఇదే ‘జంగిల్ బుక్’ కథతో ఒక సినిమా చేసే పనిలో ఉంది. మోషన్ క్యాప్చర్ విధానంలో ఆండీ సెర్కిస్ దర్శకత్వంలో ‘జంగిల్ బుక్ - ఆరిజిన్స్’ పేరిట తీయాలనుకున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ 6కు రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే, తాజాగా దాన్ని మరో ఏడాది పాటు వాయిదా వేశారు. 2018 అక్టోబర్ 19కి రిలీజ్ చేసేలా, నిర్మించాలని భావిస్తున్నారు. దాంతో, వాల్ట్‌డిస్నీ, వార్నర్ బ్రదర్స్ స్టూడియోల మధ్య పోటీలో ఒక రకంగా డిస్నీ సంస్థది ఇప్పుడు పైచేయి అయింది. రెండో పార్ట్‌కీ అదే టీమ్ మొత్తానికి, గతంలో తీసిన ‘అలైస్ ఇన్ వండర్ల్యాండ్’, ‘మ్యాలెఫిషెంట్’, ‘సిండెరెల్లా’ల ఫక్కీలో ఇప్పుడీ ‘ది జంగిల్ బుక్’ కూడా భారీ హిట్టవడంతో డిస్నీ సంస్థ ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఇంకా రిలీజైనా కాక ముందే వాల్ట్‌డిస్నీ సంస్థ ‘ది జంగిల్ బుక్’ చిత్రానికి సీక్వెల్ తీయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ తొలి భాగానికి దర్శకత్వం వహించిన ‘ఐరన్‌మ్యాన్’ చిత్ర ఫేమ్ జాన్ ఫావ్రీవ్ సారథ్యంలోనే ఈ రెండో భాగాన్ని కూడా రూపొందించనున్నారు. రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన అసలు కథను ఆధారంగా చేసుకొని ‘టాప్‌గన్2’ చిత్ర స్క్రీన్‌ప్లే రచయిత జస్టిన్ మార్క్స్ తాజా ‘జంగిల్ బుక్’కు సినీ రచన చేశారు. ఇప్పుడు త్వరలోనే నిర్మించాలనుకుంటున్న రెండోభాగానికి సైతం రచన చేయాల్సిందిగా ఆయనతో ప్రస్తుతం సంప్రతింపులు జరుగుతున్నాయి. నిజానికి, డిస్నీటూన్ స్టూడియోస్ సంస్థ గతంలో 2003లోనే ‘జంగిల్ బుక్-2’ అంటూ యానిమేషన్ చిత్రం తీసి, నేరుగా డి.వి.డి. విడుదల చేసింది. అయితే, ఇప్పుడు తీసిన సరికొత్త లైవ్ యాక్షన్ చిత్రం సీక్వెల్ కోసం ఆ యానిమేషన్ కథను వాడకపోవచ్చు. రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన ‘జంగిల్ బుక్’ కథలు, నవలల నుంచి బోలెడన్ని అంశాల్ని తవ్వితీసి, స్క్రిప్ట్ తయారు చేసే అవకాశం ఉంది. ‘అవతార్’తో పోలుస్తున్న విమర్శకులు అత్యధిక శాతం ఫోటో రియలిస్టిక్ సి.జి.లతో తయారైన ఈ ‘ది జంగిల్ బుక్’ పార్ట్1 సినిమాను లాస్ ఏంజెల్స్‌లో తీశారు. నీల్ సేథీ నటించిన మోగ్లీ పాత్ర మినహా మిగతా జంతువుల పాత్రలు, వాటి హావభావాలన్నీ కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో సృష్టించిన వర్కే! ఈ 3డి యానిమేషన్ చూసిన విమర్శకులు అదిరిపోయి, దీన్ని ‘అవతార్’ సినిమా తాలూకు సి.జి. వర్క్స్‌తో పోలుస్తున్నారు. అయితే, షేర్‌ఖాన్, బాలూ, బఘీరా లాంటి జంతువుల పాత్రలన్నిటికీ ప్రసిద్ధ డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు తమ గాత్రంతో ప్రాణం పోసి, కథాకథనంలోని భావోద్వేగాల్ని ప్రేక్షకులు అనుభవించేలా చేశారు. మొత్తానికి, ఒక హాలీవుడ్ సినిమా హాలీవుడ్లో రిలీజ్ కాకుండానే ఇన్ని కోట్ల వసూళ్ళు, ఇంత భారీ జనాదరణ పొందడం, అప్పుడే సీక్వెల్ ఆలోచనతో సిద్ధం కావడం విశేషమే కదూ! -
మౌగ్లీ ఎక్కడి అమ్మాయి?
మన ఊళ్లోనే పెరుగుతూ... తప్పిపోయి అడవుల్లో తిరుగాడుతున్నట్లు అనిపించే అమ్మాయి మౌగ్లీ. నిజానికి ఈ పాత్ర రూపొందింది అమెరికాలో. రడ్యార్డ్ కిప్లింగ్ పిల్లల కథలు రాసేవారు. ఆయన ‘జంగిల్‌బుక్’ పేరుతో సంకలనాలు విడుదల చేశారు. ఆ జంగిల్‌బుక్ కథల కోసం సృష్టించిన పాత్ర మౌగ్లి. ఈ పాత్ర ఆధారంగా టెలివిజన్‌లో అనేక కామిక్ స్టోరీలు వస్తున్నాయి. అడవిలో జంతువులతో కలిసి మౌగ్లీ చేసే సాహసాలు చూసి తీరాల్సిందే. వీటిని తెలుగులోకి అనువదించి కూడా ప్రసారం చేశారు. -
షాయరీ షహర్
గుల్జార్.. అక్షరానికి ఆత్మబంధువు! కవిత్వం ఆయన కలానికి క్లోజ్‌ఫ్రెండ్! మధ్యలో మనసు కొన్నాళ్లు సినిమాలెన్స్ను పెట్టుకున్నా రచనావ్యాసంగం దారిమళ్లలేదు!. రొమాంటిక్ కవితలను రాసి యువతను ఆకట్టుకున్నా చిన్నపిల్లలనెప్పుడూ చిన్నబుచ్చలేదు!. మోగ్లీతో మురిపించారు! ఇప్పటికీ వాళ్లకు ఆత్మీయ రచయితే! ఉర్దూ యూనివర్సిటీకి అతిథిగా.. హైదరాబాద్ యూనివర్సిటీ డాక్టరేట్‌ను అందుకోవడానికి నగరానికి వచ్చిన గుల్జార్ చెప్పిన సంగతులు కొన్ని.... హైదరాబాద్‌తో నా అనుబంధం ఈనాటిది కాదు. నేను ఉర్దూ నేర్చుకుంటున్నప్పటిది. ఎన్నిసార్లు వచ్చానో ఈ నగరానికి. ఇది కులీ కుతుబ్‌షాహీల నగరమైనా నేను మాత్రం కవిత్వానికి చిరునామాగా చూస్తాను. నా దృష్టిలో హైదరాబాద్ ప్రాముఖ్యాన్ని పెంచేది ఇక్కడి ఉర్దూ భాషే! ఆ ప్రేమతో ఎన్నో సార్లు ఈ ఊరికొచ్చాను. చిన్నపిల్లల సాహిత్యమంటే ఉన్న అభిమానంతో చిల్డ్రన్ ఫెస్టివల్ కోసమూ కొంత పనిచేశాను. జయాబచ్చన్ హయాంలో చిన్న పిల్లల సినిమా పండగకు ఓ శాశ్వత వేదికను ఏర్పాటు చేయాలనుకున్నాం. అది హైదరాబాద్ అయితే బాగుంటుందని ఈ ఊరునే ఖాయం చేశాం. అలా కిందటేడు ఈ సినిమా పండుగకు హైదరాబాద్ వచ్చాను. ఈ ఊరుతో నాకున్న అటాచ్మెంట్ అలాంటిది. నడిపించే శక్తి.. ప్రతి కళాకారుడికి, రచయితకు ముఖ్యంగా నాలాంటి వాడికి ప్రశంసల అవసరం ఉంటుంది. ఎందుకంటే మేంవెళ్తున్న దారి సరైనదేననే మా నమ్మకాన్ని మరింత బలపర్చడానికి. ఈ తరానికి నా దరఖాస్తు ఒక్కటే.. మీరు కొత్త కొమ్మలు. కొత్త ఆలోచనల సరికొత్త చిగుర్లు. మాలాంటి వాళ్ల చేయిపట్టుకొని నడిపించే శక్తిమంతులు. అందుకే మా వేలు పట్టుకుని నడిపించండని కోరుతుంటాను. కానీ ఈ తరాన్ని చూస్తే కలవరమూ కలుగుతోంది. ఈ తరానికి ఓపిక తక్కువైంది. పఠనాసక్తి పోయింది. సినిమాల మీదున్న మోజు చదవడం మీద చూపించట్లేదు. నేను తీసిన సినిమాల్లో ఓ అయిదింటి పేర్లు చెప్పమంటే టక్కున చెప్తారు కానీ నేను రాసిన పుస్తకాల్లో ఓ అయిదింటి పేర్లు చెప్పమంటే... జవాబు ఉండదు. సాహిత్యానికి దూరమైన ఈ తరాన్ని చూస్తుంటే జాలేస్తోంది. మంచి సినిమా వినోదాన్ని మాత్రమే ఇస్తుంది కానీ పఠనం విజ్ఞానాన్నిస్తుంది. విజ్ఞతను పెంచుతుంది. జీవించే తోవను చూపిస్తుంది. మూసిన అలమార తలుపుల వెనకున్న పుస్తకాలు నెలలకు నెలలుగా నిరీక్షిస్తున్నాయి.. మీ సాంగత్యం కోసం. ఇది వరకు సాయంకాలాలు పుస్తకాల పుటలమీదుగా జారిపోయేవి కానీ ఇప్పుడు మీ కనురెప్పలు కంప్యూటర్ వీక్షణతో బరువెక్కిపోతున్నాయి. అందుకే యువతరానికి నా విన్నపం.. పుస్తకాలు బాగా చదవండి ! ..:: సరస్వతి రమ


