యాంకర్ సుమ కొడుకు రోషన్ ఇదివరకే 'బబుల్ గమ్' అనే సినిమా చేశాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. ఈ క్రమంలో కాస్త గ్యాప్ తీసుకుని రెండో మూవీతో వస్తున్నాడు. అదే 'మోగ్లీ'. ఈ నెల 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. 'కలర్ ఫోటో'తో మెప్పించిన సందీప్ రాజ్ దీనికి దర్శకత్వం వహించాడు. వచ్చే వారమే మూవీ రాబోతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.
(ఇదీ చదవండి: నువ్వు ఇంటికెళ్లిపో.. తనూజ, సుమన్ శెట్టి ఇలా షాకిచ్చారేంటి?)
టైటిల్‌కి తగ్గట్లే అడవి నేపథ్యంగా సాగే సన్నివేశాలు, కామెడీ ఆకట్టుకునేలా ఉన్నాయి. గతంలో పలు బోల్డ్ చిత్రాలతో మెప్పించిన బండి సరోజ్ ఇందులో విలన్‌గా చేస్తున్నాడు. సాక్షి అనే అమ్మాయి హీరోయిన్‌గా పరిచయమవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.
(ఇదీ చదవండి: పక్క ఇల్లు కూల్చేయడం కరెక్ట్ కాదు.. పూనమ్ పోస్ట్ ఎవరి గురించి?)


