సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ వెంకటేశ్ ఇవాళ కన్నుమూశారు. గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న మలయాళ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా మలయాళ సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణించారు. ఆయన మృతిపట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం తెలిపారు. ఆయన మరణం కేరళ సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని అభివర్ణించారు
1980- 1990లలో మలయాళ సినిమాకు వెంకటేశ్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. మలయాళ సినిమా రంగంలో అత్యంత ప్రభావవంతమైన మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్‌పీ వెంకటేశ్ ఒకరు. మలయాళ సినీ ఇండస్ట్రీలో దశాబ్దాల పాటు కొనసాగారు. 1980వ దశకంలో అత్యంత ఫేమస్ అయ్యారు. తన సూపర్ హిట్ పాటలతో, సినిమాల భావోద్వేగ లోతును పెంచే శక్తివంతమైన నేపథ్య సంగీతానికి కేరాఫ్ అడ్రస్‌గా మారారు. రాజవింటే మకన్, జానీ వాకర్, పైతృకం, సోపానం, హైవే వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలకు వెంకటేశ్ సంగీతం అందించారు.


