నేరుగా ఓటీటీకి ఆనంద్ దేవరకొండ థ్రిల్లర్‌.. ఆసక్తిగా టీజర్ | Anand Deverakonda Latest Movie Takshakudu Teaser out now | Sakshi
Sakshi News home page

Takshakudu Teaser: డైరెక్ట్‌గా ఓటీటీకే తక్షకుడు.. అంచనాలు పెంచేసిన టీజర్

Feb 3 2026 7:42 PM | Updated on Feb 3 2026 8:08 PM

Anand Deverakonda Latest Movie Takshakudu Teaser out now

అనంద్ దేవరకొండ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ తక్షకుడు. ఈ సినిమాకు వినోద్‌ అనంతోజు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌ సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో ఈ క్రేజీ కాంబోపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది.

తాజాగా ఈ మూవీ టీజర్‌ రిలీజైంది. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. టీజర్ చూస్తుంటే ఆనంద్ దేవరకొండ మునుపెన్నడు చేయని డిఫరెంట్‌ రోల్‌ చేస్తున్నట్లు అర్థమవుతోంది. 'వాడు ఇక్కడే ఉన్నాడు.. నా కళ్లముందే ఉన్నాడు.. కానీ కనిపెట్టలేకపోతున్నాను..' అనే డైలాగ్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది.

కాగా..  ఈ మూవీలో లపతా లేడీస్‌ ఫేమ్‌ నీతాన్షీ గోయెల్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్‌ డేట్‌ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు.  

 

Advertisement
 
Advertisement
Advertisement