శర్వానంద్ బైకర్.. రిలీజ్ డేట్ ఫిక్స్ | Tollywood hero Sharwanand Latest Movie Biker Release date Locked | Sakshi
Sakshi News home page

Biker Release date: శర్వానంద్ బైకర్.. రిలీజ్ డేట్ ఫిక్స్

Feb 3 2026 6:46 PM | Updated on Feb 3 2026 7:55 PM

Tollywood hero Sharwanand Latest Movie Biker Release date Locked

టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) నటిస్తోన్న తాజా చిత్రం బైకర్. రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ ‍మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు.

ఈ సమ్మర్‌ కానుకగా బైకర్ థియేటర్లలో సందడి చేయనుందని నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ మూవీ ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుందని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అభిలాశ్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతమందిస్తున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement