నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. మెగాస్టార్‌పై స్టాలిన్ నటి ప్రశంసలు | Actress Khushboo Comments on Megastar Sankranthi cinema | Sakshi
Sakshi News home page

Khushboo: నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. చిరుపై ఖుష్బు ప్రశంసలు

Feb 3 2026 5:10 PM | Updated on Feb 3 2026 6:01 PM

Actress Khushboo Comments on Megastar Sankranthi cinema

మెగాస్టార్ మూవీపై నటి ఖుష్బు సుందర్ ప్రశంసలు కురిపించారు. లాజిక్ లేదు.. కేవలం మ్యాజిక్ మాత్రమేనంటూ కొనియాడారు. మనశంకర వరప్రసాద్‌గారు సినిమా చాలా అద్భుతంగా ఉందన్నారు. సూపర్ డూపర్ హిట్ అందించిన అనిల్ రావిపూడికి హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.

చిరంజీవి తాను ప్రేమించే అభిమానుల కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం చూసి గర్వపడుతున్నానని రాసుకొచ్చారు. మరింతకాలం  మమ్మల్ని అలరిస్తూ ఉండటానికి మీకు మరింత ఉత్సాహం, శక్తి, మంచి ఆరోగ్యం లభించాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేశారు. అమ్మ ఆశీస్సులు.. ఆ భగవంతుని దయ ఎల్లప్పుడూ మీతోనే ఉండాలి సార్ అంటూ ఖుష్బు ట్వీట్‌ చేశారు. ఈ మూవీలో నటించిన వెంకటేశ్‌ గురించి ఓకే మాటలో చెప్పాలంటే ఐ లవ్ యూ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఎప్పటిలాగే తన అందం, గాంభీర్యంతో అలరించిన నయనతార నటనకు ఫిదా అయ్యానంటూ ఖుష్బు పోస్ట్ చేసింది.

కాగా.. కోలీవుడ్ నటి ఖుష్బు సుందర్‌ తెలుగులోనూ పలు సినిమాలు చేశారు. మెగాస్టార్ హీరోగా నటించిన స్టాలిన్ చిత్రంలో నటించారు. ఈ సినిమాలో చిరంజీవికి అక్క పాత్రలో మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ త్రిష హీరోయిన్‌గా కనిపించింది. 

కాగా.. మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా మనశంకర వరప్రసాద్ గారు. జనవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement