సినిమా ప్రమోషనా.. బూతు కచేరీనా?.. ఇంత బరి తెగించాలా? | Hero Chandrahass Sung Vulgar Song at Tollywood Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

Chandrahass: సినిమానా.. బూతు పురాణమా?.. హీరోపై నెటిజన్స్‌ ఫైర్

Feb 3 2026 4:15 PM | Updated on Feb 3 2026 4:55 PM

Hero Chandrahass Sung Vulgar Song at Tollywood Movie Pre Release Event

ఈ రోజుల్లో సినిమాకు ప్రమోషన్స్ చేయడం చాలా ముఖ్యం. కథపై దర్శకుడికి నమ్మకమున్నా సరే మూవీ ప్రమోషన్స్ చేస్తే జనాల్లోకి వెళ్తుంది. అందుకే ట్రైలర్ లాంఛ్‌ ఈవెంట్స్‌తో పాటు ప్రీ రిలీజ్, సాంగ్ రిలీజ్‌ల పేరుతో ప్రమోషన్స్ నిర్వహిస్తుంటారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాలను ఆడియన్స్‌తో పంచుకుంటారు. దీనివల్ల సినిమాపై అభిమానుల్లో ఓ రకమైన క్యూరియాసిటీ పెరుగుతుంది. ‍అలా సినిమాలకు ప్రేక్షకులను తీసుకొచ్చేందుకు ప్రమోషన్స్‌ అనేది సినీ ఇండస్ట్రీలో తప్పనిసరి.

అయితే ప్రమోషన్స్ పేరిట ఆడియన్స్‌ను తమవైపు తిప్పుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అంతేకాకుండా అప్పుడప్పుడు కాంట్రవర్సీలు కూడా జరుగుతుంటాయి. తాజాగా టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరోసారి అలాంటిదే జరిగింది. బరాబర్ ప్రేమిస్తా అనే మూవీ ఈనెల 6వ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ యాక్టర్ చంద్రహాస్ నటించారు. రిలీజ్‌కు దగ్గరవుతున్న వేళ సోమవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్.

అంతా బాగానే ఉన్నా.. ఈవెంట్‌లో పాడిన ఓ సాంగ్ తీవ్ర వివాదానికి దారితీసింది. హీరో చంద్రహాస్ ఒక వివాదాస్పదమైన బూతు పాట పాడటం సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో సినీ ప్రియులే కాదు.. నెటిజన్స్‌ సైతం తీవ్రస్తాయిలో అతనిపై మండిపడుతున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం ఇంత బరితెగించాలా అంటూ గడ్డిపెడుతున్నారు. అసలు ఆ బూతు పాటలేంటని మండిపడుతున్నారు. కేవలం నెగెటివ్ పబ్లిసిటీ కోసమే ఇంతలా అసభ్యకర భాషను వాడతారా అని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పబ్లిసిటీ కోసం ఇంత దిగజారాలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement