'ధురంధర్ 2' టీజర్.. ఇలా మోసం చేశారేంటి? | End Credits In Dhurandhar 2 Teaser Fans Disappointed | Sakshi
Sakshi News home page

Dhurandhar 2 Teaser: టీజర్‌పై అసంతృప్తి.. కారణం అదా?

Feb 3 2026 3:12 PM | Updated on Feb 3 2026 3:27 PM

End Credits In Dhurandhar 2 Teaser Fans Disappointed

'ధురంధర్ 2' టీజర్ వచ్చింది. దీన్ని చూసి మూవీ లవర్స్ ఒక్కసారిగా షాకయ్యారు. మమ్మల్ని ఇలా మోసం చేశారేంటి? అని విమర్శిస్తున్నారు. తమకు కొత్త టీజర్ కావాల్సిందే అని కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడిదే విషయం హాట్ టాపిక్ అయింది. వచ్చిన టీజర్ కంటే మేకర్స్ చేసిన మోసం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే?

గత డిసెంబరులో 'ధురంధర్' సినిమా, థియేటర్లలో రిలీజైంది. దాదాపు 60 రోజుల కావొస్తున్నా, ఓటీటీలోకి వచ్చేసినా సరే బిగ్ స్క్రీన్‌పై ఇంకా ఆడుతోంది. ఈ మూవీ చివర్లో ఎండ్ క్రెడిట్స్ సీన్స్ కొన్ని వేశారు. సీక్వెల్‪ ఎలా ఉండబోతుంది అనేలా చిన్న గ్లింప్స్ చూపించారు. ఇప్పుడు అదే వీడియోని టీజర్‌లా విడుదల చేశారు. టీజర్ అనగానే కొత్త కంటెంట్ ఉండబోతుందని చాలామంది ఎగ్జైట్ అయ్యారు. కానీ థియేటర్లలో, ఓటీటీలో సినిమా చూసిన వాళ్లకు టీజర్ పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ విజువల్స్ అన్నీ చూసేశారు కాబట్టి. అయితే ఇలా చేయడానికి కారణముందని బాలీవుడ్ మీడియా అంటోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?)

'ధురంధర్ 2' కంటెంట్ ఇంకా పూర్తిస్థాయిలో రెడీ కాలేదట. ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని.. దర్శకుడు ఆదిత్య ధర్ ఆ పనుల్లో బిజీగా ఉన్నారట. మార్చి 19నే థియేటర్లలోకి మూవీ రానుందని మరోసారి క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ టీజర్ వదిలారని మాట్లాడుకుంటున్నారు. తొలి భాగం కేవలం హిందీలోనే రిలీజ్ కాగా.. సీక్వెల్ మాత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు కూడా.

'ధురంధర్' విషయానికొస్తే.. కాందహార్ హైజాక్, పార్లమెంట్‌పై ఉగ్రదాడి తర్వాత భారతదేశానికి చెందిన ఓ స్పై ఏజెంట్ హంజా అలీ అలియాస్ జస్క్రీత్ సింగ్.. పాకిస్థాన్‌లో అడుగుపెడతాడు. కరాచీ లయరీలోని రహమాన్ డకాయిట్ గ్యాంగ్‌లో చేరతాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ రహమాన్‌కి నమ్మకస్తుడిగా మారతాడు. చివరకు రహమాన్‌నే చంపేస్తాడు. అక్కడితో తొలి భాగాన్ని ముగించారు. రహమాన్ చనిపోవడంతో అతడి స్థానంలోకి హంజా ఎలా వెళ్లాడు? లయరీలో అతిపెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా అవతరించాడు? భారత్‌పై దాడి చేసిన మిగతా ఉగ్రవాదుల్ని ఎలా మట్టుబెట్టాడు? అనే అంశాలని సీక్వెల్‌లో చూపించబోతున్నారు.

(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ)

Advertisement
 
Advertisement
Advertisement