ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు? | Dhurandhar OTT Streaming And Telugu Version Reaction | Sakshi
Sakshi News home page

Dhurandhar OTT Telugu: టాలీవుడ్ ప్రేక్షకులకు 'ధురంధర్' నచ్చాడా? లేదా?

Feb 2 2026 1:33 PM | Updated on Feb 2 2026 3:04 PM

Dhurandhar OTT Streaming And Telugu Version Reaction

రెండు నెలలుగా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన 'ధురంధర్' సినిమా.. రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో కేవలం హిందీలో మాత్రమే రిలీజైంది. ఓటీటీలో మాత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ డబ్బింగ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి తెలుగు ఆడియెన్స్ నుంచి ఈ మూవీకి ఎలాంటి స్పందన వస్తోంది? ఎవరు ఏమంటున్నారు?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)

ఇప్పటివరకు స్పై థ్రిల్లర్ సినిమాలు అనగానే దాదాపు ఒకే టైపులో ఉండేది. దాన్ని 'ధురంధర్' బ్రేక్ చేసింది. చాలా రియలస్టిక్‌గా, పూర్తిగా పాకిస్థాన్ బ్యాక్‌డ్రాప్‌లో తీయడం చాలామందికి సరికొత్త అనుభూతి కలిగించింది. రణ్‌వీర్ సింగ్ పోషించిన హమ్జా పాత్రనే హీరో కానీ అక్షయ్ ఖన్నా చేసిన రహమాన్ డకాయిట్ పాత్ర ఈ మూవీలో ప్రతిఒక్కరినీ డామినేట్ చేసింది. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ పాత్రలు కూడా థియేటర్లలో చూసినప్పుడు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు ఓటీటీలో సినిమా చూసిన తెలుగు ప్రేక్షకుల్లో చాలామంది మాత్రం మిక్స్‌డ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. దీనికి చాలానే కారణాలు ఉన్నాయి.

దక్షిణాదిలో పుష్ప, కేజీఎఫ్ లాంటి మాస్ ఎలివేషన్స్ మూవీస్ చాన్నాళ్ల క్రితమే వచ్చాయి. అద్భుతమైన ఆదరణ దక్కించుకున్నాయి. వాటితో 'ధురంధర్'ని పోల్చలేం కాకపోతే ఈ చిత్రాన్ని చాలా రియలస్టిక్ యాక్షన్‌తో తీశారు. ఎక్కడా ఓవర్ డోస్ ఫైట్స్, ఎలివేషన్స్ లాంటివి ఉండవు. డ్రామా కూడా స్టోరీకి ఎంత అవసరమో అంతే ఉంటుంది. మూడున్నర గంటల మూవీ.. దాదాపు ఎనిమిది ఛాప్టర్లుగా తీశారు. కొందరికి ఈ నిడివి వల్ల ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. మరికొందరికి మాత్రం ఇందులో కొత్తగా ఏముంది? ఇలాంటి యాక్షన్ మూవీస్ ఇప్పటికే చాలా చూశాం కదా అని అంటున్నారు.

(ఇదీ చదవండి: ధనుష్ నాకు అన్నలాంటోడు.. మృణాల్ ఇలా అనేసిందా?)

దర్శకుడు ఆదిత్య ధర్.. కాందహార్ హైజాక్, పార్లమెంట్‌పై దాడి, ముంబై తాజ్ హోటల్‌పై ఉగ్రదాడి తదితర నిజజీవిత సంఘటనలని సినిమాలో భాగం చేసిన విధానం బాగుంది. కాకపోతే వీటి గురించి ఐడియా ఉంటే.. సినిమా నచ్చుతుంది. లేదంటే మాత్రం ఆ పోర్షన్స్ సరిగా అర్థం కాకపోయే అవకాశముంది. ఒకవేళ ఆ ఘటనల గురింతి తెలిస్తే మాత్రం 'ధురంధర్' మంచి కిక్ ఇస్తుంది.

'ధురంధర్' తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఎక్కడా కృత్రిమంగా అనిపించలేదు. పాటలు హిందీ వెర్షన్‌వి ఉంచేసి మంచి పనిచేశారు. ఒకవేళ వాటిని డబ్బింగ్ చేసుంటే మాత్రం మొత్తం ఫీల్ మారిపోయి ఉండేది. కలర్ గ్రేడింగ్ విషయంలోనూ తొలుత నెట్‌ఫ్లిక్స్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. థియేటర్ ప్రింట్‌తో పోలిస్తే ఓటీటీలో కలర్ తేడాగా ఉందని సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వచ్చాయి. ఇదే విషయం నెట్‌ఫ్లిక్స్ వరకు చేరడంతో.. మార్పులు చేసింది. కలర్ గ్రేడింగ్‌తోపాటు సౌండ్ క్వాలిటీ కూడా పెంచింది.

సినిమాలో సెట్ వర్క్ చూసి చాలామంది తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అసలు షూటింగ్ అంతా ఎక్కడా చేశారా అని మాట్లాడుకుంటున్నారు. అయితే థాయ్‌ల్యాండ్‌లోని కొన్ని ఎకరాల్లో కరాచీలోని లయరీ ఊరిని ఉన్నది ఉన్నట్లుగా దింపేశారు. సినిమాలో యాక్టింగ్, పాటలు, యాక్షన్ సీన్స్ ఎంత ప్లస్ అయ్యాయో.. లొకేషన్స్ కూడా అంతే ప్లస్ అ‍య్యాయి. ఇకపోతే 'ధురంధర్' తొలి పార్ట్ రిలీజైనప్పుడు హిందీ మాత్రమే వచ్చింది. కానీ మార్చి 19న విడుదలయ్యే సీక్వెల్ మాత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ థియేటర్లలోకి రానుంది.

(ఇదీ చదవండి: నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ)

Advertisement
 
Advertisement
Advertisement