breaking news
Akshaye Khanna
-
దృశ్యం 3లో ప్రకాశ్ రాజ్.. కానీ!
ఈ మధ్య ప్రకాశ్ రాజ్ గురించి అనేక రూమర్స్ వస్తున్నాయి. మొన్నటివరకు ఆయన ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'స్పిరిట్' సినిమా నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరిగింది. దీంతో అదంతా ఫేక్ న్యూస్ అని అతడు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇంతలో మరో రూమర్ నెట్టింట వైరలవుతోంది. హిందీ 'దృశ్యం 3' సినిమాలో అక్షయ్ ఖన్నా తప్పుకున్న విషయం తెలిసిందే! ప్రకాశ్‌రాజ్ క్లారిటీఆ స్థానంలో ప్రకాశ్ రాజ్ నటించనున్నాడన్నది లేటెస్ట్ టాక్. ఈ ఊహాగానాలపై ప్రకాశ్‌రాజ్ స్పందించాడు. తాను దృశ్యం 3లో నటిస్తున్నట్లు ప్రకటించాడు. కాకపోతే ఎవరి స్థానాన్ని భర్తీ చేయడం లేదన్నాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు. హిందీ మూవీ 'దృశ్యం 3'లో అద్భుతమైన పాత్ర పోషిస్తున్నాను. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. షూటింగ్ కూడా మొదలైంది. కాకపోతే నేను ఎవరినీ రీప్లేస్ చేయడంలేదు అని వెల్లడించాడు.సూపర్ హిట్ ఫ్రాంచైజీదృశ్యం విషయానికి వస్తే.. మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా పలు భాషల్లో రీమేకై అక్కడా విజయం సాధించింది. దీనికి సీక్వెల్‌గా వచ్చిన రెండో భాగం మరింత సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు దృశ్యం ఫ్రాంచైజీలో మూడో భాగం రాబోతోంది. మలయాళంలో ఇప్పటికే షూటింగ్ పూర్తవగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో 'దృశ్యం 3' తెరకెక్కుతోంది. ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది.దృశ్యం 3 నుంచి అక్షయ్ అవుట్'దృశ్యం 2'లో పోలీస్ అధికారి పాత్రలో యాక్ట్ చేశాడు అక్షయ్ ఖన్నా. ఈ లెక్కన మూడో భాగంలోనూ అతడు ఉండాల్సిన వ్యక్తి! కానీ 'ధురంధర్' సక్సెస్ తర్వాత గర్వం అతడి తలకెక్కిందని, గొంతెమ్మ కోర్కెలు కోరాడని ప్రచారం జరిగింది. నిర్మాత కుమార్ మంగట్ పాఠక్ కూడా అదే నిజమన్నాడు.గొంతెమ్మ కోర్కెలు'అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డాం. కానీ, విగ్ కావాలని డిమాండ్ చేశాడు. దృశ్యం 2లో బట్టతలతో కనిపించి ఇప్పుడు జుట్టుతో కనిపిస్తే బాగోదని నచ్చజెప్పాం. అప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చాం. పదిరోజుల్లో షూట్ ఉందనగా సినిమా నుంచి తప్పుకోవడంతో నోటీసులు ఇచ్చాం' అని పేర్కొన్నాడు. దీంతో అతడి స్థానంలో జైదీప్ అహ్లావత్‌ను తీసుకున్నట్లు కూడా తెలిపాడు. ఇంతలోనే ప్రకాశ్ రాజ్ తెరమీదకు రావడం, ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. Started shooting for this engaging franchise #Drishyam3 in hindi. With a wonderful team and a scintillating role to play . Im sure you will love it . ❤️❤️❤️( and yes im not replacing anyone..) 😛😛😛— Prakash Raj (@prakashraaj) February 10, 2026 చదవండి: ఏదైనా జరగరానిది జరిగితే.. శ్రీహాన్ మంచి మనసు -
అతన్ని పడేయాలని ట్రై చేశాను.. కానీ..,: కంగనా రనౌత్
ధురంధర్ సినిమా ఓటీటీలోకి రావడంతో మరోసారి ట్రెండ్ అవుతోంది. అందులో నటించిన అక్షయ్ ఖన్నా మళ్లీ వైరల్ అవుతున్నాడు. ఈ సందర్భంగా అక్షయ్ ఖన్నాపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఓ వీడియో క్లిప్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. హీరోయిన్గా బాలీవుడ్లో టాప్ రేంజ్లో కొనసాగిన కంగనా.. బీజేపీలో చేరి హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే.'ధురంధర్' (Dhurandhar)సినిమా చూసిన వారందరూ సోషల్‌మీడియాలో అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో కంగనా రనౌత్ పాత ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ క్లిప్ 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమానికి సంబంధించింది కావడం విశేషం. 2010లో విడుదలైన నో ప్రాబ్లమ్ మూవీ ప్రమోషన్ సమయంలో ఈ కార్యక్రమం జరిగింది. అందులో అనిల్ కపూర్, సంజయ్ దత్‌లతో పాటు అక్షయ్, కంగనా కూడా కలిసి నటించారు.అతడ్ని ట్రై చేశాను.. కానీ, పడలేదు: కంగనాఈ వీడియోలో కరణ్ జోహార్ మాట్లాడుతూ ఎవరితోనైనా సరసాలాడటానికి ప్రయత్నించారా అని కంగనాను అడగడంతో ఆమె ఏమాత్రం సంకోచించకుండా.., "అవును అంటూ అక్షయ్ ఖన్నా(Akshaye Khanna) పేరును చెప్పారు. 'నేను మొదట అక్షయ్‌తో మాట్లాడ్డానికి ప్రయత్నించాను. ఆ తర్వాత అతడ్ని నిజంగానే పడేయాలని ట్రై చేశాను. కానీ అతడు ఎప్పుడూ నాతో మాట్లాడలేదు. నాతోనే కాదు, అతడు ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు.' స్వయంగా కంగనా రనౌత్ ఆ షోలో అక్షయ్ ఖన్నా గురించి చెప్పిన ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా పోషించిన రెహ్మాన్ డెకాయిత్ పాత్ర సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రణ్‌బీర్ సింగ్‌కు ఎంత పేరొచ్చిందో, అక్షయ్ ఖన్నాకు కూడా అంతే పేరొచ్చింది. ఈ సినిమా పార్ట్-2 మార్చి 19న రిలీజ్ అవుతోంది.in Coffee with Karan #KanganaRanaut reveals she once tried flirting with #AkshayeKhanna, but he was completely in hi won world and he didn't even notice her. pic.twitter.com/BccEj0twm6— आदेश 🚩 (@ADfanatic_New) February 8, 2026 -
ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?
రెండు నెలలుగా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన 'ధురంధర్' సినిమా.. రీసెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో కేవలం హిందీలో మాత్రమే రిలీజైంది. ఓటీటీలో మాత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ డబ్బింగ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి తెలుగు ఆడియెన్స్ నుంచి ఈ మూవీకి ఎలాంటి స్పందన వస్తోంది? ఎవరు ఏమంటున్నారు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)ఇప్పటివరకు స్పై థ్రిల్లర్ సినిమాలు అనగానే దాదాపు ఒకే టైపులో ఉండేది. దాన్ని 'ధురంధర్' బ్రేక్ చేసింది. చాలా రియలస్టిక్‌గా, పూర్తిగా పాకిస్థాన్ బ్యాక్‌డ్రాప్‌లో తీయడం చాలామందికి సరికొత్త అనుభూతి కలిగించింది. రణ్వీర్ సింగ్ పోషించిన హమ్జా పాత్రనే హీరో కానీ అక్షయ్ ఖన్నా చేసిన రహమాన్ డకాయిట్ పాత్ర ఈ మూవీలో ప్రతిఒక్కరినీ డామినేట్ చేసింది. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ పాత్రలు కూడా థియేటర్లలో చూసినప్పుడు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు ఓటీటీలో సినిమా చూసిన తెలుగు ప్రేక్షకుల్లో చాలామంది మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. దీనికి చాలానే కారణాలు ఉన్నాయి.దక్షిణాదిలో పుష్ప, కేజీఎఫ్ లాంటి మాస్ ఎలివేషన్స్ మూవీస్ చాన్నాళ్ల క్రితమే వచ్చాయి. అద్భుతమైన ఆదరణ దక్కించుకున్నాయి. వాటితో 'ధురంధర్'ని పోల్చలేం కాకపోతే ఈ చిత్రాన్ని చాలా రియలస్టిక్ యాక్షన్‌తో తీశారు. ఎక్కడా ఓవర్ డోస్ ఫైట్స్, ఎలివేషన్స్ లాంటివి ఉండవు. డ్రామా కూడా స్టోరీకి ఎంత అవసరమో అంతే ఉంటుంది. మూడున్నర గంటల మూవీ.. దాదాపు ఎనిమిది ఛాప్టర్లుగా తీశారు. కొందరికి ఈ నిడివి వల్ల ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. మరికొందరికి మాత్రం ఇందులో కొత్తగా ఏముంది? ఇలాంటి యాక్షన్ మూవీస్ ఇప్పటికే చాలా చూశాం కదా అని అంటున్నారు.(ఇదీ చదవండి: ధనుష్ నాకు అన్నలాంటోడు.. మృణాల్ ఇలా అనేసిందా?)దర్శకుడు ఆదిత్య ధర్.. కాందహార్ హైజాక్, పార్లమెంట్‌పై దాడి, ముంబై తాజ్ హోటల్‌పై ఉగ్రదాడి తదితర నిజజీవిత సంఘటనలని సినిమాలో భాగం చేసిన విధానం బాగుంది. కాకపోతే వీటి గురించి ఐడియా ఉంటే.. సినిమా నచ్చుతుంది. లేదంటే మాత్రం ఆ పోర్షన్స్ సరిగా అర్థం కాకపోయే అవకాశముంది. ఒకవేళ ఆ ఘటనల గురింతి తెలిస్తే మాత్రం 'ధురంధర్' మంచి కిక్ ఇస్తుంది.'ధురంధర్' తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఎక్కడా కృత్రిమంగా అనిపించలేదు. పాటలు హిందీ వెర్షన్‌వి ఉంచేసి మంచి పనిచేశారు. ఒకవేళ వాటిని డబ్బింగ్ చేసుంటే మాత్రం మొత్తం ఫీల్ మారిపోయి ఉండేది. కలర్ గ్రేడింగ్ విషయంలోనూ తొలుత నెట్‌ఫ్లిక్స్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. థియేటర్ ప్రింట్‌తో పోలిస్తే ఓటీటీలో కలర్ తేడాగా ఉందని సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వచ్చాయి. ఇదే విషయం నెట్‌ఫ్లిక్స్ వరకు చేరడంతో.. మార్పులు చేసింది. కలర్ గ్రేడింగ్‌తోపాటు సౌండ్ క్వాలిటీ కూడా పెంచింది.సినిమాలో సెట్ వర్క్ చూసి చాలామంది తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అసలు షూటింగ్ అంతా ఎక్కడా చేశారా అని మాట్లాడుకుంటున్నారు. అయితే థాయ్‌ల్యాండ్‌లోని కొన్ని ఎకరాల్లో కరాచీలోని లయరీ ఊరిని ఉన్నది ఉన్నట్లుగా దింపేశారు. సినిమాలో యాక్టింగ్, పాటలు, యాక్షన్ సీన్స్ ఎంత ప్లస్ అయ్యాయో.. లొకేషన్స్ కూడా అంతే ప్లస్ అయ్యాయి. ఇకపోతే 'ధురంధర్' తొలి పార్ట్ రిలీజైనప్పుడు హిందీ మాత్రమే వచ్చింది. కానీ మార్చి 19న విడుదలయ్యే సీక్వెల్ మాత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ) -
గోల్డెన్ ఛాన్స్ వదులుకున్న నాగార్జున?
మనది అని రాసుంటే ఎప్పటికైనా అది మన దగ్గరకే వస్తుంది. మనది కాకపోతే చేతుల వరకు వచ్చినా సరే దక్కకుండా చేజారిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున.. ఓ అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకున్నారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒకవేళ ఆ ఛాన్స్ నాగ్ అందుకుని ఉంటే ఎలా ఉండేదా అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?రీసెంట్ టైంలో ఊహించని సక్సెస్ అందుకున్న సినిమా 'ధురంధర్'. థియేటర్లలోకి వచ్చేంతవరకు దీనిపై పెద్దగా బజ్ లేదు. పాన్ ఇండియా రిలీజ్ కూడా కాదు. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే విడుదల చేశారు. టికెట్ పెంపు లాంటివి అసలే లేవు. డిసెంబరు తొలివారంలో బిగ్ స్క్రీన్స్‌పైకి రాగా ఇప్పటికీ వసూళ్లు రాబడుతూనే ఉంది. ప్రస్తుతానికైతే రూ.1300 కోట్ల మేర వసూలు చేసింది. ఇందులో హీరో పాత్ర కంటే రహమాన్ డకాయిత్ అనే విలన్ పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.(ఇదీ చదవండి: మృణాల్ ఠాకుర్ రొమాంటిక్ సినిమా.. టీజర్ రిలీజ్)రహమాన్ డకాయిత్‌గా అక్షయ్ ఖన్నా అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే తొలుత ఈ పాత్ర కోసం నాగార్జునని అనుకున్నారట. స్క్రిప్ట్ కూడా నచ్చింది గానీ అదే సమయానికి కూలీ, కుబేర చిత్రాలతో నాగ్ బిజీగా ఉండటం వల్ల చేజేతులా ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందట. సినిమా చూసిన ప్రతిఒక్కరూ ఆ పాత్రలో అక్షయ్ తప్ప మరొకరిని ఊహించుకోలేరు. అంతలా అదరగొట్టేశారు. అలాంటి పాత్ర నాగార్జున చేసుంటే ఎలా ఉండేదో మరి?రణ్వీర్ సింగ్, సారా అర్జున్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఆదిత్య ధర్ దర్శకుడు. 1990ల్లో పాకిస్థాన్ కరాచీలోని లయరీ అనే ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ వార్స్, అక్కడికి వెళ్లిన ఓ భారత రహస్య ఏజెంట్.. తర్వాత ఏం జరిగింది? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు. జనవరి 30 నుంచి ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కావొచ్చనే ప్రచారం నడుస్తోంది. మరోవైపు 'ధురంధర్' సీక్వెల్.. ఈ మార్చి 19నే థియేటర్లలోకి రానుంది. తొలి పార్ట్ హిందీ వరకే రిలీజ్ చేయగా.. సీక్వెల్ మాత్రం తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయనున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు) -
వివాదంలో 'అక్షయ్ ఖన్నా'.. నిర్మాత నోటీసులు జారీ
బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ ఖన్నా వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఏడాదిలో ఛావా, ధురందర్ చిత్రాలతో ఆయనకు పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు దక్కింది. అయితే, బాలీవుడ్ సినిమా ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న మూడవ భాగం ‘దృశ్యం -3’ నుంచి ఆయన ఆకస్మికంగా తప్పుకోవడంతో అక్షయ్ ఖన్నాకు నిర్మాత మంగత్ పాఠక్ నోటిసులు పంపినట్లు తెలుస్తుంది. ఈ మూవీ వచ్చే ఏడాది అక్టోబర్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.హిందీ ‘దృశ్యం -2’లో అక్షయ్ ఖన్నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అందుకే పార్ట్-3లో కూడా ఆయనే నటించాలని ముందుగానే ఢీల్ సెట్ చేసుకున్నామని పాఠక్ చెప్పారు. ఆ మేరకు అక్షయ్ ఖన్నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చామన్నారు. అయితే, షూటింగ్ ప్రారంభం కావాల్సిన టైమ్‌లో అక్షయ్ ఖన్నా తమకు షాకింగ్ మెసేజ్ చేశాడని నిర్మాత పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను నటించడం లేదంటూ ఒక టెక్స్ట్ మెసేజ్ పంపినట్లు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తనను సంప్రదించాలని ప్రయత్నం చేసినప్పటికీ అక్షయ్ అందుబాటులోకి రాకపోవడంతో చేసేదేమీ లేక చట్టపరమైన చర్యలకు దిగాల్సి వచ్చిందని నిర్మాత చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మూవీ కోసం అక్షయ్ ఖన్నా రూ. 22 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.అక్షయ్ ఖన్నాకి సినిమా అవకాశాలు రానప్పుడు ‘సెక్షన్ 375’ మూవీతో మంగత్ పాఠక్ లైఫ్ ఇచ్చాడు. ఆ తర్వాతే అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘దృశ్యం 2’ భారీ విజయం అందుకోవడంతో ఛావా, ధురంధర్ వంటి సినిమాలు దక్కాయి. ఇదే విషయాలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. -
బట్టతలపై జుట్టుండాలట.. అడ్వాన్స్ తీసుకుని డ్రామాలా!
దృశ్యం ఫ్రాంచైజీలో తెరకెక్కుతున్న మూడో భాగం "దృశ్యం 3". మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తవగా త్వరలోనే హిందీలో షూటింగ్ మొదలుకానుంది. అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా తప్పుకున్నట్లు రూమర్స్ వచ్చాయి.సడన్‌గా విగ్ కావాలట!పారితోషికం పెంపుతోపాటు, విగ్ కావాలని కోరాడని.. ఈ విషయంలో నిర్మాతతో భేదాభిప్రాయాలు రావడంతో ఆయన సినిమా నుంచి వైదొలగాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఇవే నిజమంటున్నాడు నిర్మాత కుమార్ మంగట్ పాఠక్. ఆయన మాట్లాడుతూ.. దృశ్యం 3 కోసం అక్షయ్ ఖన్నా అగ్రిమెంట్‌పై సంతకం పెట్టాడు. ఆయన అడిగినంత డబ్బు ఇస్తామన్నాం. కానీ ఆయన విగ్ కావాలని డిమాండ్ చేశాడు. పక్కనున్న చెంచాల వల్లే..దృశ్యం 2లో అక్షయ్ విగ్ లేకుండా బట్టతలతోనే కనిపించాడు. అలాంటిదిప్పుడు విగ్ పెడితే బాగోదని దర్శకుడు అభిషేక్ పాఠక్ నచ్చజెప్పాడు. దాంతో ఆయన సరేనన్నాడు. అయితే ఆయన పక్కనున్న చెంచాలు విగ్ పెట్టుకుంటే స్మార్ట్‌గా కనిపిస్తావని లేనిపోనివి ఎక్కించారు. దాంతో ఆయన మళ్లీ విగ్ కావాలని అడిగాడు. దర్శకుడు ఆయన్ను సముదాయించాలని చూశాడు. అప్పుడేమో ఎగిరి గంతేసి..కానీ ఈసారి అతడు ఏకంగా సినిమా నుంచే తప్పుకున్నాడు. దృశ్యం 3 కథ చెప్పినప్పుడు.. ఇది రూ.500 కోట్ల సినిమా.. జీవితంలో ఇలాంటి కథ వినలేదంటూ టీమ్‌ను హత్తుకున్నాడు. రెమ్యునరేషన్ ఫైనల్ అయ్యాక అడ్వాన్స్ కూడా ఇచ్చాం. పదిరోజుల్లో షూట్ ఉందనగా సినిమా నుంచి తప్పుకున్నాడు. ఈ విషయంలో తనకు నోటీసులు పంపించాం.గుర్తింపు లేని సమయంలో ఛాన్స్అక్షయ్కు పేరు, గుర్తింపు లేని సమయంలో తనతో సెక్షన్ 375 మూవీ చేశాను. ఆయన గురించి చాలామంది ఎన్నో చెప్పారు. సెట్లో కూడా ఓవర్‌గా ప్రవర్తించేవాడు. సెక్షన్ 375 వల్ల అతడికి మంచి పేరు వచ్చింది. అలా అతడిని దృశ్యం 2కి తీసుకున్నాను. ఈ మూవీ తర్వాతే అతడికి పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇప్పుడేమో గర్వం తలకెక్కింది.అక్షయ్ కంటే మంచి నటుడుదృశ్యం.. అజయ్ దేవ్‌గణ్ మూవీ, ఛావా.. విక్కీ కౌశల్ మూవీ, అలాగే ధుంధర్ రణ్వీర్ సింగ్ సినిమా! ఒకవేళ అక్షయ్ ఖన్నా సోలోగా సినిమా చేస్తే దానికి రూ.50 కోట్లు కూడా రావు. తనవల్లే ధురంధర్ బాగా ఆడుతోందని మాతో అన్నాడు. ధురంధర్ విజయానికి అనేక కారణాలున్నాయి. దృశ్యం 3లో అక్షయ్ స్థానంలో జైదీప్ అహ్లావత్‌ను తీసుకున్నాం. అక్షయ్ కంటే ఇతడు మంచి నటుడు అని చెప్పుకొచ్చాడు.చదవండి: నా భర్తను ఎందుకు లాగుతున్నారు?: అనసూయ -
దృశ్యం 3 నుంచి 'ధురంధర్' నటుడు అవుట్?
థ్రిల్లర్ మూవీ 'దృశ్యం' సూపర్ డూపర్ హిట్టు. దర్శకుడు జీతూ జోసెఫ్, హీరో మోహన్‌లాల్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో రీమేక్ అయి అక్కడా ఘన విజయాన్ని అందుకుంది. దీంతో 'దృశ్యం' ఫ్రాంచైజీలో రెండవ భాగాన్ని తీసుకొచ్చారు. కాకపోతే 2021లో కరోనా వల్ల మలయాళ వర్షన్‌ను ఓటీటీలో రిలీజ్ చేశారు. సూపర్ హిట్ దృశ్యంఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ రావడటంతో తెలుగు, హిందీలో రీమేక్ చేశారు. వెంకటేశ్ 'దృశ్యం 2' కూడా అదే ఏడాది ఓటీటీలో విడుదలైంది. అయితే అజయ్ దేవ్‌గణ్ హిందీ 'దృశ్యం 2' మాత్రం 2022లో బాక్సాఫీస్ ముందుకు వచ్చింది. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడు' దృశ్యం' మూడో పార్ట్ రాబోతోంది. మూడో పార్ట్మోహన్లాల్- జీతూ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు హిందీలో అజయ్ దేవ్‌గణ్ 'దృశ్యం 3' షూటింగ్ ఇటీవలే మొదలైంది. టబు, శ్రియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్ పాఠక్ డైరెక్టర్. ఈ మూవీ 2026 అక్టోబర్ 2న విడుదల కానుంది. అయితే ఈ సినిమా నుంచి ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విషయంలో డిమాండ్ఈయన 'దృశ్యం 2'లో పోలీసాఫీసర్‌గా కనిపించారు. ఈ ఏడాది ఛావా, ధురంధర్ సినిమాలతో సెన్సేషన్ అయిన అక్షయ్.. మూడో పార్ట్ (Drishyam 3 Movie)లో నటించేందుకు కాస్త ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేశారట! అలాగే తన పాత్ర తెరపై కనిపించే తీరులో కొన్నిమార్పులు చేయమని సూచించాడట! నిజమెంత?ఈ విషయంలో నటుడికి, నిర్మాతలకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు భోగట్టా.. దీంతో ఆయనే స్వయంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైనప్పటికీ అక్షయ్ ఖన్నా డిమాండ్లకు తలొగ్గి మళ్లీ అతడిని సినిమాలో తీసుకునే అవకాశాలూ లేకపోలేదు.చదవండి: వితికా షెరుకు ప్రమోషన్ -
అక్షయ్ క్రేజ్‌పై అసూయ? మాధవన్ ఆన్సరిదే!
యానిమల్ సినిమాలో జమల్ కదు పాట ఎంత ఫేమస్ అయిందో ధురంధర్లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ సాంగ్ అంత ఫేమస్ అయింది. అతడి స్వాగ్, లుక్స్, స్టెప్పులు అన్నింటికీ జనం ఫిదా అయ్యారు. అలా అని అదేదో రిహార్సల్స్ చేసిన డ్యాన్స్ కూడా కాదు. అప్పటికప్పుడు తోచినట్లుగా స్టెప్పేశాడంతే! ఇప్పుడేమో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అక్షయ్ ఖన్నాయే ట్రెండ్ అవుతున్నాడు. సినిమాలో రణ్వీర్ సింగ్, ఆర్ మాధవన్ వంటి స్టార్స్ ఉన్నా సరే అక్షయ్‌నే ఎక్కువ కీర్తిస్తున్నారు.మాధవన్‌కు కుళ్లు?ఈ విషయంలో మాధవన్ కాస్త అప్సెట్ అయ్యాడట! ఓపక్క ధురంధర్ వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతున్నందుకు ఒకింత సంతోషంగా ఉన్నా.. అక్షయ్‌కే ఎక్కువ క్రెడిట్ రావడంతో హర్ట్ అయ్యాడంటూ సోషల్ మీడియాలో కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. వీటిపై తాజాగా మాధవన్ స్పందించాడు. బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. అక్షయ్‌కు మంచి గుర్తింపు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతే తప్ప బాధెందుకు ఉంటుంది? ఆయన ఎంతో ప్రతిభావంతమైన నటుడు, అలాగే ఎంతో నిరాడంబరంగా ఉంటాడు. తనకు కచ్చితంగా ఈ ప్రశంసలు దక్కి తీరాల్సిందే!నాకంటే గొప్పవాడుఆయన తల్చుకుంటే లక్షల ఇంటర్వ్యూలు ఇవ్వొచ్చు. కానీ తన కొత్తింట్లో తాపీగా కూర్చున్నాడు. విజయాన్ని నిశ్శబ్ధంగానే ఎంజాయ్ చేస్తున్నాడు. నేను పెద్దగా జనం అటెన్షన్ కోరుకునే వ్యక్తిని కాదు. ఈ విషయంలో అక్షయ్ ఖన్నా నాకంటే గొప్పవాడు. ఆయన అసలేదీ పట్టించుకోడు. జయాపజయాలన్నీ కూడా అతడి దృష్టిలో సమానమే అని మాధవన్ చెప్పుకొచ్చాడు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.730 కోట్లు వసూలు చేసింది. కేవలం భారత్‌లోనే రూ.483 కోట్లు రాబట్టింది.చదవండి: బిగ్‌బాస్ 9కి ప్రాణం పోసిన రియల్ గేమర్.. సంజనా -
19 ఏళ్లకే బట్టతల.. 50 ఏళ్లు దాటినా సింగిల్‌గా!
అందాన్ని కాపాడుకునేందుకు సెలబ్రిటీలు పడే పాట్లు అంతా ఇంతా కాదు. కడుపు మాడ్చుకుంటారు, క్రీములు వాడతారు, జిమ్కెళ్తారు. అందం, శరీర సౌష్టవం కోసం ఏదైనా చేస్తారు. కానీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయానికే జుట్టు రాలడం మొదలైతే ఇంకేమైనా ఉందా? అందులోనూ అబ్బాయిలు బట్టతలతో ఆడిషన్‌కు వెళ్తే ఎవరైనా తీసుకుంటారా? అక్షయ్ ఖన్నాకు కూడా ఇదే భయం. కానీ భయపడుతూ కూర్చుంటే ఏదీ మారదని అర్థమై ధైర్యంగా ముందడుగు వేశాడు. లుక్ కన్నా టాలెంట్ ముఖ్యమని నిరూపించాడు. ఈ ఏడాది ఛావా, ధురంధర్ సినిమాలతో సెన్సేషన్‌గా మారిన ఈ నటుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..19 ఏళ్లకే జుట్టు రాలడందివంగత నటుడు, రాజకీయ నాయకుడు వినోద్ ఖన్నా కుమారుడే అక్షయ్ ఖన్నా. స్కూల్, కాలేజీ డేస్‌లో చదువులో కన్నా ఆటల్లోనే ఎక్కువ రాణించేవాడు. కానీ చిన్నతనంలోనే హెయిర్ లాస్ సమస్యతో బాధపడ్డాడు. 19 ఏళ్లకే ఉన్న జుట్టంతా ఊడిపోతుంటే భరించలేకపోయాడు. తలపై ఎన్ని వెంట్రుకలు ఉంటే అన్ని ఆఫర్స్ వస్తాయనుకునేవాడు. తండ్రి సినిమాతో ఎంట్రీకానీ, జుట్టు రాలడాన్ని తగ్గించలేమన్న నిజాన్ని అర్థం చేసుకున్నాక తన టాలెంటే అవకాశాలు తెచ్చిపెడుతుందని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశాడు. తండ్రి హీరోగా నటించి, నిర్మించిన హిమాలయ పుత్ర (1997) మూవీతో తొలిసారి వెండితెరపై అడుగుపెట్టాడు. అయితే అక్షయ్ (Akshaye Khanna)కు మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం తన రెండో మూవీ 'బోర్డర్'. ఈ చిత్రం తర్వాత అక్షయ్ వెనుదిరిగి చూసుకోలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా తనదైన మార్క్ సృష్టించాడు. వైరల్దిల్ చహ్తా హై, హమ్రాజ్, దీవాంగే, రేస్, తీస్ మార్ ఖాన్, ఇత్తేఫఖ్, సెక్షన్ 375, దృశ్యం 2 ఇలా హిందీలో సినిమాలు చేసుకుంటూ పోయాడు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఛావాతో తిరిగొచ్చాడు. ఔరంగజేబుగా అద్భుతంగా నటించి మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ధురంధర్ చిత్రంలో తన యాక్టింగ్, డ్యాన్స్ క్లిప్‌తో మరోసారి వార్తల్లోకెక్కాడు. అయితే అక్షయ్‌కు అందరిలా పార్టీలు చేసుకుంటూ ఎప్పుడై లైమ్‌లైట్‌లో ఉండే అలవాటు లేదు. 50 ఏళ్లు దాటినా సింగిల్‌గానే..వచ్చామా? సినిమాలు చేసుకున్నామా? అయిపోయిందా? అంతే! అన్నట్లుగా ఉంటాడు. 50 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన ఈ హీరో గతంలో హీరోయిన్ కరిష్మా కపూర్‌తో ప్రేమలో పడ్డాడు. కానీ ఆ ప్రేమకథ పెళ్లిదాకా రాకముందే ఆగిపోయింది. 28 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న అక్షయ్ ఆస్తి రూ.167 కోట్లు ఉంటుందని అంచనా! #AkshayeKhanna How on earth are you aging backwards, sharpening your features instead of softening them.? Akshay, you insane, precision-crafted monster of talent, how are you this god-level? It’s illegal at this point.He’s grown into a kind of dangerous handsomeness, the kind… pic.twitter.com/dExZhHFddH— sweeti singh vikram (@SweetiSghVikram) December 7, 2025 -
ప్రశాంత్ వర్మ సినిమా.. శుక్రాచార్యుడిగా ప్రముఖ నటుడు
'హనుమాన్' సినిమా తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్'తో బిజీగా ఉన్నారు. అయితే, ఇదే చిత్రంతో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో అధీర, మహాకాళి మూవీస్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మహాకాళి చిత్రం నుంచి ఒక అప్డేట్ ఇచ్చారు. శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్న నటించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా మహాకాళి సినిమాని చాలారోజుల క్రితమే ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌కు ప్రశాంత్ వర్మ స్టోరీ మాత్రమే అందిస్తున్నారు. దర్శకురాలు పూజ కొల్లూరు తెరకెక్కిస్తున్నారు. అక్షయ్ ఖన్నా రీసెంట్గా వచ్చిన ఛావా సినిమాలో ఔరంగజేబు పాత్రలో మెప్పించిన విషయం తెలిసిందే. ఇండియాలోనే తొలి లేడీ సూపర్ హీరో మూవీగా మహాకాళి రానుందని ప్రచారం జరుగుతుంది.In the shadows of gods,rose the brightest flame of rebellion 🔥Presenting The Enigmatic #AkshayeKhanna as the eternal 'Asuraguru SHUKRACHARYA' from #Mahakali 🔱❤️🔥@PujaKolluru @RKDStudios #RKDuggal #RiwazRameshDuggal @ThePVCU pic.twitter.com/mclj39Q8z9— Prasanth Varma (@PrasanthVarma) September 30, 2025 -
ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో 'ఛావా' విలన్
'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం 'జై హనుమాన్' పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాదిలోనే దీని షూటింగ్ మొదలవొచ్చు. దీనితోపాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అధీర, మహాకాళి మూవీస్ కూడా చేస్తున్నాడు.(ఇదీ చదవండి: రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)అయితే మహాకాళి సినిమాని కొన్నాళ్ల క్రితం ప్రకటించారు. దీనికి ప్రశాంత్ వర్మ స్టోరీ అందించగా.. పూజ కొల్లూరు అనే మహిళా దర్శకురాలు స్తోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి 'ఛావా' విలన్ పాత్రధారి అక్షయ్ ఖన్నా వచ్చి చేరాడు. మన దేశంలో వస్తున్న తొలి లేడీ సూపర్ హీరో మూవీ ఇది అని అంటున్నారు. ఇందులోనూ అక్షయ్ ఖన్నా విలన్ పాత్రలోనే కనిపిస్తారా? మరేదైనా కీలక పాత్ర పోషిస్తారా అనేది తెలియాల్సి ఉంది. గతంలో హీరోగా చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో చాన్నాళ్లు నటించలేదు. ఛావా మూవీలో ఔరంగజేబుగా అదరగొట్టేయడంతో ఇప్పుడు వరస అవకాశాలు వస్తున్నాయి.(ఇదీ చదవండి: వంటలక్క రెమ్యునరేషన్.. ఒకరోజుకి ఎంతో తెలుసా?) -
19 ఏళ్ల వయసులో బట్టతల.. భరించలేకపోయా: ఛావా నటుడు
జుట్టు రాలిపోవడం ఎంత పెద్ద సమస్య అనేది అనుభవించినవారికే తెలుస్తుంది. అందులోనూ చిన్నవయసులోనే జుట్టు రాలిపోతుంటే దాన్ని అరికట్టలేక, కవర్ చేయలేక నానాతంటాలు పడేవారు చాలామంది ఉంటారు. ఈ ఇబ్బందులు తానూ పడ్డానంటున్నాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna). ఛావా సినిమా (Chhaava Movie)లో ఔరంగజేబుగా నటించి విశేష గుర్తింపు సంపాదించుకున్న ఇతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో హెయిర్ ఫాల్ గురించి మాట్లాడాడు. ఆ బాధ నాకు తెలుసు'చిన్న వయసులోనే తలపై వెంట్రుకలు ఊడిపోతే (Early Balding) ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. చేతి వేళ్లను కోల్పోయినంత బాధగా, కష్టంగా ఉండేది. నాకది పెద్ద సమస్యలాగే కనిపించేది. 19 ఏళ్ల వయసులోనే జుట్టు ఊడిపోతుంటే భరించలేకపోయాను. అది మానసికంగా, వృత్తిపరంగా నన్ను చాలా ఇబ్బందిపెట్టింది. నటుడిగా కొనసాగాలనుకునే వ్యక్తికి జుట్టు చాలా అవసరం. సడన్‌గా కంటిచూపు మందగిస్తే ఎలా ఉంటుంది?మనకు తలపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయన్నదాన్ని బట్టే ఎలాంటి ఆఫర్స్ వస్తాయనేవి ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా జుట్టు రాలడాన్ని మనం తగ్గించలేం అన్న నిజాన్ని జీర్ణించుకునేవరకు తిప్పలు తప్పవు. కానీ చిన్న వయసులో జుట్టు కోల్పోవడం వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అలాగే వయసు పెరిగేకొద్దీ కంటిచూపు సైతం మందగిస్తుంది. సడన్‌గా ఒక రోజు ఉదయం పేపర్ తిరగేద్దామంటే అక్షరాలు మసకబారినట్లు కనిపిస్తున్నాయనుకోండి. ఎలా ఉంటుంది? భయపడ్డా.. ఫోకస్ చేశాఅదేంటి నా కంటిచూపుకేమైంది? ఇకమీదట అద్దాలు పెట్టుకుంటే మాత్రమే కనిపిస్తాయా? అని ఆందోళన చెందుతాం కదా.. ఈ బట్టతల కూడా అలాంటిదే! దీనివల్ల నాకు సినిమా అవకాశాలు ఏమైనా తగ్గిపోతాయేమోనని భయపడ్డాను. కానీ తర్వాత నా లుక్స్ కంటే కూడా యాక్టింగ్ స్కిల్స్‌పైనే ఎక్కువ ఫోకస్ చేశాను. అందువల్లే ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను' అని అక్షయ్ ఖన్నా చెప్పుకొచ్చాడు.చదవండి: భార్యకు విడాకులిచ్చి హీరోయిన్‌తో ప్రేమాయణం?.. స్పందించిన హీరో -
రివ కిషన్ డాటర్ ఆఫ్ రవికిషన్
మద్దాలి శివారెడ్డిగా అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు భోజ్‌పురి నటుడు రవికిషన్. ఆ తర్వాత ఆయన ‘కిక్ 2, సుప్రీమ్, రాధ, లై’ వంటి సినిమాలు చేశారు. అటు హిందీలోనూ పలు చిత్రాలు చేశారాయన. ఇప్పుడు ఆయన కుమార్తె రివ కిషన్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. బాలీవుడ్లో నటి పద్మినీ కోల్హాపురి, నిర్మాత ప్రదీప్ శర్మల కుమారుడు ప్రియాంక్ ప్రదీప్ శర్మ ‘సబ్ కుశల్ మంగళ్’ అనే సినిమాతో హిందీ పరిశ్రమకు పరిచయం అవ్వబోతున్నారు. ఈ సినిమాలోనే హీరోయిన్గా ఎంపికయ్యారు రివ కిషన్. ‘‘నేను హిందీ సినిమా చేయబోతున్నందుకు నాన్నగారు సంతోషంగా ఉన్నారు. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు రివ కిషన్. ప్రస్తుతం ఈ సినిమా వర్క్‌షాప్స్‌లో పాల్గొంటున్నారు రివ అండ్ ప్రియాంక్. ఈ చిత్రం మార్చిలో జార్ఖండ్‌లో స్టార్ట్ కానుంది. కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాతో కరణ్ కశ్యప్ దర్శకునిగా పరిచయమవుతారు. ఇందులో నటుడు అక్షయ్ ఖన్నా ఓ కీలక పాత్ర చేయనున్నారు. -
మంచి చాన్స్ మిస్
మంచి సినిమాలో భాగమయ్యే అవకాశం చేజారినప్పుడు ఏ యాక్టర్ అయినా ఫీల్ అవుతారు. ఇప్పుడు అదే చేస్తున్నారు బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’ గతేడాది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో సంజయ్ పాత్రలో రణ్‌బీర్‌సింగ్, సంజయ్ తండ్రి సునీల్ దత్ పాత్రలో పరేష్ రావల్ నటించారు. కానీ సునీల్ దత్ పాత్రలో నటించే అవకాశం తొలుత అక్షయ్ ఖన్నాకు వచ్చింది. ‘‘సంజు సినిమాలో సునీల్ దత్ పాత్రకోసం లుక్ టెస్ట్ చేశారు. ఆ పాత్రకు నేను మిస్ ఫిట్ అని హిరానీ ఫీల్ అయ్యారు. ఇలా మంచి సినిమాలో భాగమయ్యే అవకాశం నాకు దక్కలేదు’’ అని పేర్కొన్నారు అక్షయ్ ఖన్నా. -
యువరానర్...
కొంతకాలంగా కోర్టుకు వెళ్తున్నారు బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా. కోర్టుమెట్లు ఎక్కేంత తప్పు ఆమె ఏం చేశారనేగా మీ డౌట్. అయితే ఆమె కోర్టుకెళుతున్నది ‘సెక్షన్ 375’ అనే సినిమా కోసమని బాలీవుడ్ ఖబర్. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 375 సెక్షన్ అనేది మానభంగానికి చెందిన సెక్షన్ అట. ఈ సినిమాలో లాయర్‌గా కనిపించనున్నారు రిచా. పాత్రకు న్యాయం చేయడానికి కోర్టు విధివిధానాలను పరిశీలించాలని ఆమె కోర్టుకు వెళ్తున్నారు. ‘‘నా స్నేహితురాలు ఒకరు కార్పొరేట్ కేసులను పరిష్కరించడంలో లాయర్‌గా నిపుణురాలు. కానీ, మా సినిమా ఆ సెక్షన్‌కు సంబంధించింది కాదు. డిఫరెంట్ జోనర్లో ఉంటుంది. కానీ, కోర్టులో నేను తెలుసుకునే కొత్త విషయాలు నేను చేయబోయే పాత్రకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. వీలైనప్పుడు లాయర్స్‌తో మాట్లాడుతున్నాను’’ అని పేర్కొన్నారు రిచా. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా కథానాయకుడిగా నటిస్తారట. పది నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందట. మనీష్ గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. షకీల బయోపిక్ ‘షకీల’ చిత్రంలో నటించారు రిచా. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. -
అక్షయ్ ఖన్నా తల్లి గీతాంజలి మృతి
ముంబై : వినోద్ ఖన్నా మాజీ భార్య, నటుడు అక్షయ్, రాహుల్ ఖన్నాల తల్లి గీతాంజలి ఖన్నా శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మంద్వాలోని తమ ఫామ్‌హౌస్‌లో కుమారుడు అక్షయ కుటుంబంతో ఉన్న సమయంలో గీతాంజలి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అలిబగ్ సివిల్ ఆస్పత్రికి హుటాహుటిన కుటుంబ సభ్యులు తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. శనివారం ఉదయం కుమారులు అక్షయ్, రాహుల్ ఖన్నాలతో కలిసి మాంద్వాలోని ఫామ్ హౌస్‌కు గీతాంజలి వెళ్లారు. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే తనకు ఆరోగ్యం బాగా లేదని ఆమె చెప్పడంతో స్ధానిక వైద్యుడి వద్దకు తీసుకువెళ్లగా కొన్ని మందులు ఇచ్చారు. ఫామ్‌హౌస్‌కు తిరిగి చేరుకోగానే విశ్రాంతి తీసుకోమని కుమారులు ఆమెకు సూచించారు. ఇక రాత్రి నిద్రిస్తున్న గీతాంజలిని పరామర్శించేందుకు అక్షయ్ వెళ్లగా ఆమె శరీర ఉష్ణోగ్రత పూర్తిగా తగ్గినట్టు గుర్తించారు. గీతాంజలిని వెంటనే సివిల్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. కుటుంబసభ్యుల సమక్షంలో ఆదివారం ఆమె అంత్యక్రియలను నిర్వహించారు. -
జూలై 7న విడుదల కానున్న మామ్..
ముంబై: ప్రముఖ నటి శ్రీదేవి నటిస్తోన్న డ్రామా, థ్రిల్లర్ మూవీ ‘మామ్’ జూలై 7న విడుదల కానుంది. ఐదు సంవత్సరాల తర్వాత నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. చివరిసారి ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ అనే చిత్రంలో శ్రీదేవి నటించారు. మామ్ మూవీ జూలై14న విడుదల చేయాలనుకున్నారు చిత్ర నిర్మాతలు .. కానీ వారం రోజులు ముందుగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ మూవీకి రవి ఉదయవార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను శ్రీదేవి భర్త బోనీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. -
అక్షయ్ ఖన్నాను 50 లక్షలు మోసగించిన కేసులో ఇద్దరు అరెస్ట్!
50 లక్షల రూపాయల చీటింగ్ చేశారని బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా దాఖలు చేసిన ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు ఓ ప్రైవేట్ కంపెనీ అధినేత, అతని భార్యను పోలీసులు విచారించారు. కమాడిటీ మార్కెట్ పెట్టుబడి పెడితే 45 రోజుల్లో రెండింతలు ఇస్తామని చెప్పి తన వద్ద 50 లక్షల రూపాయలు తీసుకుని మోసానికి పాల్పడ్డారని అక్షయ్ ఖన్నా ఫిర్యాదు చేశారని పోలీసుల అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇంటెక్ ఇమేజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని సత్యబ్రత చక్రవర్తి, అతని భార్యను సోనాను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే వారు కమాడిటి మార్కెట్ లో పెట్టుబడిపెట్టారని.. అయితే లాభాలు వచ్చాయా లేక నష్ణపోయారా అనే విషయాన్ని వెల్లడించడం లేదని పోలీసులు ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. వారి వద్దనుంచి సొమ్మును రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అక్టోబర్ 2010 అక్టోబర్ నెలలో అక్షయ్ ఖన్నా పెట్టుబడి పెట్టారని.. గత మూడు సంవత్సరాలుగా సొమ్ము చెల్పించమంటే తప్పించుకుతిరుగుతుండటంతో ముంబైలోని మలబార్ హిల్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రూ. 50 లక్షలకు అక్షయ్ ఖన్నాకు టోపీ
ముంబై: తక్కువ సమయంలోనే డబ్బును డబుల్ చేస్తామని నమ్మించి చేస్తున్న మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఉన్నతస్థాయి వ్యక్తులు కూడా ఇటువంటి మోసాల బారిన పడుతుండడం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ఉదంతమే ఇందుకు నిదర్శనం. రూ. 50 లక్షలు పెడితే 45 రోజుల్లో కోటి రూపాయల ఇస్తామన్న వాగ్దానాన్ని నమ్మి ఉన్నది పోగొట్టుకున్నారు. తాను ఇచ్చిన డబ్బును కమోడిటీ మార్కెట్లో పెట్టుబడి పెట్టి 45 రోజుల్లోనే రెండింతలు చేస్తామని నమ్మించి రూ.50 లక్షలకు ముంచారని అక్షయ్ వాపోయారు. ఇన్‌టెక్ ఇమేజ్‌లో 2010 అక్టోబర్‌లో రూ. 50 లక్షలు పెట్టుబడులు పెట్టి మోసపోయానని మలబార్ హిల్స్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇన్‌టెక్ ఇమేజ్ ప్రెసిడెంట్, డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నఅంధేరీ ప్రాంతానికి చెందిన సత్యబ్రత చక్రవర్తి, ఆయన భార్య సోనా ఈ మోసానికి పాల్పడ్డారని పేర్కొన్నాడు. గడువు ముగిసినా డబ్బు ఇవ్వకపోగా, సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతుండడంతో అక్షయ్ ఖన్నా పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి ఆర్థిక నేర నియంత్రణ విభాగానికి బదిలీ చేశామని మలబార్ హిల్స్ ఇన్స్పెక్టర్ వినయ్ బగాడే తెలిపారు.


