బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కి 'రహ్మాన్ డకాయత్' అడుగులు | Akshaye Khanna steps from Bollywood to entry Tollywood Movies | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కి 'రహ్మాన్ డకాయత్' అడుగులు

Apr 16 2026 11:20 PM | Updated on Apr 16 2026 11:55 PM

Akshaye Khanna steps from Bollywood to entry Tollywood Movies

‘ధురంధర్-1’లో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా పోషించిన రహ్మాన్ డకాయత్ పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పాత్రతో అక్షయ్‌కు ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చింది. దీంతో ఈ సీనియర్ నటుడు తన రెండో ఇన్నింగ్స్‌ను మరింత జోరుగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు.

తాజా సమాచారం ప్రకారం.. టాలీవుడ్ నుంచి అక్షయ్ ఖన్నాకు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. అది దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి వచ్చిన ఆఫర్ అని సినీ వర్గాల్లో ఓ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. విక్టరీ వెంకటేశ్‌తో తీస్తున్న సినిమా సెట్స్‌పై ఉంది. అలాగే జూ.ఎన్టీఆర్ హీరోగా ఓ మైథలాజికల్ కథను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రెండిటిలో ఏదో ఒక సినిమా కోసం అక్షయ్ ఖన్నా పేరు పరిశీలనలో ఉందని సమాచారం.

అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటిస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ.. టాలీవుడ్ ఎంట్రీ మాత్రం ఖచ్చితమని తెలుస్తోంది. ఎందుకంటే బాలీవుడ్ నటులు ఇప్పుడు టాలీవుడ్‌ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సంజయ్ దత్, ఇమ్రాన్ హష్మి వంటి పలువురు నటులు ఇప్పటికే తెలుగు ప్రాజెక్టుల్లో నటించారు. మరికొందరు బాలీవుడ్ నటులు కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి అక్షయ్ ఖన్నా లాంటి ప్రతిభావంతుడైన నటుడిని టాలీవుడ్ వదులుకోదు. ఆయనకు మంచి పాత్రలు దక్కడం ఖాయం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement