నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన తాజా చిత్రం ‘పెద్ది’ గ్రాండ్ రిలీజ్ సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆమె, గురువారం ఉదయం నటి మహేశ్వరితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
రామ్ చరణ్ సరసన ఆమె నటించిన 'పెద్ది' (Peddi Movie) సినిమా ఈరోజు (జూన్ 4) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.
సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ, ఆమె తిరుమల శ్రీవారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.


