ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాత్రికి సీజేపీ టీమ్ మొత్తాన్ని అరెస్ట్ చేయవచ్చు అని చెప్పుకొచ్చారు. తాము అరెస్ట్ అయినా ఉద్యమం శాంతియుతంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దీంతో, ఈరోజు ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.
జంతర్ మంతర్ వద్ద మీడియాతో మాట్లాడిన అభిజీత్ దీప్కే...‘ఈ రాత్రికి సీజేపీ టీమ్ మొత్తాన్ని అరెస్ట్ చేయవచ్చు. అరెస్ట్ చేసి మరో తప్పు చేయవద్దని ప్రభుత్వానికి చెబుతున్నా. అరెస్ట్‌తో ఆందోళన మరింత ఉధృతం అవుతుంది. మేము అరెస్ట్ అయినా ఉద్యమం శాంతియుతంగా సాగాలి. అలాగే, సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల నిరాహార దీక్షను విరమించడం శుభపరిణామం. ఎంతో సంతోషంగా ఉంది. ఆయన ఆరోగ్యం పట్ల మాకు ఆందోళన ఉండేది. 26 రోజులకు పైగా ఆయన తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఈ దేశానికి ఎంతో విలువైనది” అని వ్యాఖ్యలు చేశారు.
VIDEO | Delhi: “According to new input, CJP team members may be arrested tonight”, says CJP Founder Abhijeet Dipke, urging protesters to continue movement across nation even after arrest.
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/6AW7aACtxQ— Press Trust of India (@PTI_News) July 24, 2026
అయితే, తమ ఉద్యమం మాత్రం ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద తమ ధర్నా కొనసాగుతుందని ప్రకటించారు. ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మాకు మరే పరిష్కారం ఆమోదయోగ్యం కాదు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, పరీక్షా వ్యవస్థలో జవాబుదారీతనం వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది’ అని దీప్కే తేల్చి చెప్పారు.
కేంద్ర మంత్రులతో జరగనున్న సమావేశంపై స్పందిస్తూ... చర్చలు ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా తటస్థ వేదికలోనే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ ప్రధాన డిమాండ్ల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ వివాదం, పోటీ పరీక్షల్లో అవకతవకలు, విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించడం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది.
#WATCH | Delhi: Founding President of Cockroach Janta Party, Abhijeet Dipke says, "Our dharna at Jantar Mantar will continue until Dharmendra Pradhan resigns. We are very relieved that Sonam Wangchuk has broken his hunger strike as it had been more than 26 days. His life is… pic.twitter.com/SSyJANfcXA
— ANI (@ANI) July 24, 2026
మరోవైపు.. సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ ప్రధాన డిమాండ్ అని, అది నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జేపీ నడ్డా గారితో సమావేశం ఉంది. ఈ సమావేశానికి జితేంద్ర సింగ్ గారు కూడా హాజరయ్యే అవకాశం ఉందని మాకు సమాచారం. చర్చల్లో ఏం జరిగిందో మీడియాకు వెల్లడిస్తాం” అని తెలిపారు.
సోనమ్ గారి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటంతో దీక్ష విరమించాలని మేము నిరంతరం కోరుతున్నాం. మా రెండు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం హామీ ఇచ్చింది. శాంతియుత నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని, అలాగే బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చింది’ అని చెప్పుకొచ్చారు. అయితే, ఈ హామీలతో పోరాటం ముగిసినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియోపై కూడా ఆయన స్పందించారు. ప్రభుత్వంపై ప్రజల ఒత్తిడి పెరిగిందని వ్యాఖ్యానించారు. ‘మొదటిసారి ప్రధానమంత్రి అర్ధరాత్రి 12 గంటలకు సెల్ఫీ వీడియో విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీని ద్వారా పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. యువత భవిష్యత్తుపై ప్రభుత్వం నిజంగా సీరియస్‌గా ఉంటే, అత్యంత కఠినమైన చర్యగా ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలి’ అని రంకా అన్నారు.


