సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని శాలిని ఆత్మహత్య | Software employee Shalini Ends Life | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని శాలిని ఆత్మహత్య

Jul 24 2026 12:48 PM | Updated on Jul 24 2026 12:53 PM

Software employee Shalini Ends Life

తమిళనాడు: పూందమల్లిలో భర్తతో గొడవపడిన అనంతరం వీడియో పోస్ట్‌ చేసి ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. పూందమల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సెల్వన్‌ (36) భార్య శాలిని (33). వీరు ప్రేమించుకుని 8 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి 5 సంవత్సరాల కుమార్తె ఉంది. ఆమె భర్త ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదేవిధంగా, అతని భార్య కూడా ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తు వచ్చింది.

ఈ స్థితిలో, బుధవారం శాలిని బిడ్డను కొట్టింది. బిడ్డను ఎందుకు కొడుతున్నావని అడిగి, సెల్వన్‌ తన భార్య శాలినిపై విచ్చలవిడిగా దాడి చేసి జిమ్‌కు వెళ్లాడు. అతను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఇంటి తలుపు  లోపలి భాగం తాళం వేసి ఉంది. ఎంత తట్టిన చాలా సేపటి వరకు తలుపు తెరవకపోవడంతో, తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా శాలిని ఉరి వేసుకుని ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఈ విషయం గురించి పూందమల్లి పోలీసులకు సమాచారం అందించాడు.

 ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతురాలు శాలిని మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం చెన్నైలోని కిల్పాక్‌లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి పంపించారు. అంతేకాకుండా, పూందమల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో తేలిందేమిటంటే, ఆత్మహత్య చేసుకునే ముందు శాలిని, తన భర్త తనను కొట్టి, తిడుతు వేధిస్తున్నాడని వీడియోను రికార్డ్‌ చేసి, దానిని తన బంధువులకు, స్నేహితులకు పంపింది. దీంతో పోలీసులు భర్తను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన పూందమల్లి ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని కలిగించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement