యంగ్ డైరెక్ట‌ర్ మూవీలో విక్ర‌మ్‌? | - | Sakshi
Sakshi News home page

యంగ్ డైరెక్ట‌ర్ మూవీలో విక్ర‌మ్‌?

Jul 23 2026 1:54 AM | Updated on Jul 23 2026 2:10 PM

తమిళసినిమా: సియాన్‌ విక్రమ్‌ కథలు ఎంపిక చేసుకున్నారంటే అందులో కచ్చితంగా కొత్తదనం ఉంటుందనే నమ్మకం ఆయన అభిమానుల్లో నెలకొంటుంది. విక్రం నటించిన చిత్రాలు కొన్ని నిరాశపరిచి ఉండవచ్చు కానీ ఆయన నటన మాత్రం ఎప్పుడు విమర్శలను ఎదుర్కొనలేదు. అంతగా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి విక్రమ్‌ వీరధీర సూరన్‌ అంటే కమర్షియల్‌ హిట్‌ సాధించిన చిత్రం తర్వాత చిన్న బ్రేక్‌ తీసుకొని తాజాగా తన 63వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు వీరి కాంబినేషన్లో ఇంతకుముందు ఇరుముగన్‌ చిత్రం రూపొంది మంచి విజయాన్ని సాధించింది. కాగా తాజాగా విక్రమ్‌ తన కొత్త చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. యువ దర్శకుడు సుభాష్‌ కె రాజ్‌ చెప్పిన కథ విక్రమ్‌ కు బాగా నచ్చినట్లు సమాచారం. 

దర్శకుడు కథానాయకుడు ప్రదీప్‌ రంగనాథం శిష్యుడైన సుభాష్‌ కే రాజ్‌ ఇటీవల నటుడు అర్జున్‌ , అభిరామి ,ప్రీతి ముకుందన్‌ ప్రధాన పాత్రలు పోషించిన బ్లాస్ట్‌ చిత్రంతో దర్శకుడిగా పరిచయమ్యారు. ఏజీఎస్‌ ఎంటర్టైన్మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం సంచల విజయాన్ని సాధించింది. నిజానికి బ్లాస్ట్‌ చిత్రంలో అర్జున్‌ పాత్రను విక్రమ్‌ పోషిఝచాల్సిఉంది. అనివార్య కారణాలవల్ల ఆయన నటించలేదు.దీంతో దర్శకుడు సుభాష్‌ కె రాజ్‌ తన తాజా చిత్రంపై దష్టి పెట్టినట్లు తెలిసింది. ఇందులో విక్రమ్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.. ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి సంబంధించిన చర్చలు ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలిసింది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement