గురుగ్రామ్‌లో బైకర్ శివానీ చౌహాన్‌ను కారు ఢీకొట్టి పరారైన ఘటన వివాదం ఇంకా కొనసాగుతుండగానే, జైపూర్‌లో మరో హిట్ అండ్ రన్ ఘటన కలకలం రేపింది. జైపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ స్కూటర్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా వచ్చిన మహీంద్రా థార్ (Mahindra Thar) వాహనం ఢీకొనడంతో 57 ఏళ్ల నవల్ శర్మ మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రమాదం ఎలా జరిగింది?
జైపూర్‌లోని సాంగనేర్ ప్రాంతానికి చెందిన నవల్ శర్మ శనివారం ఉదయం తన స్కూటర్‌పై పని నిమిత్తం బయలుదేరారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన బ్లాక్ థార్ స్కూటర్‌ను బలంగా ఢీకొట్టింది. అనంతరం అక్కడినుంచి ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన నవల్ శర్మ ప్రాణాలు కోల్పోయారు. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Jaipur - A black Mahindra Thar rammed into a scooty in Sanganer and killed 57-year-old Naval Sharma, police said. The SUV driver fled the scene after the collision. The entire incident was captured on CCTV. The accident took place on September 19.Police have launched a search for… pic.twitter.com/NEmmVvRMpi
— NextMinute News (@nextminutenews7) September 21, 2026
ఇదీ చదవండి: లగ్జరీ హోటల్‌లో ‘ ‘రోచీ’: పరువుపోయింది, తుకారం ముండే కాస్త చూస్తారా?
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా థార్ వాహనాన్ని, అందులో ఉన్నవారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. బైకర్ ఘటన జరిగిన వారంలోపే జైపూర్‌లో ఈప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.ఆ కేసులో నిందితులను రాజస్థాన్‌లో అరెస్ట్ చేసిన సంగతి విదితమే.
ఇదీ చదవండి: అయోధ్య విరాళాల గోల్‌మాల్, సిట్ సంచలన నివేదిక


