ఆ ఒరంగుటాన్‌లు ఎక్కడివి? అనుమానాస్పదంగా మహీంద్ర బ్లాక్‌ థార్ | On Camera Black Thar Seen In Area Where Orangutans Were Found | Sakshi
Sakshi News home page

ఆ ఒరంగుటాన్‌లు ఎక్కడివి? అనుమానాస్పదంగా మహీంద్ర బ్లాక్‌ థార్

Sep 9 2026 4:05 PM | Updated on Sep 9 2026 4:56 PM

On Camera Black Thar Seen In Area Where Orangutans Were Found

5 Baby Orangutans అంతరించిపోతున్న అరుదైన ఐదు ఒరంగుటాన్‌లు (Orangutans)  ఒడిశాలోని బాలాసోర్ జిల్లా అడవుల్లో దర్శనమివ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారత్‌కు చెందని వీటిని బిచిత్రపూర్‌ అటవీ ప్రాంతంలో అంతర్జాతీయ స్మగ్లర్లు వదిలి వెళ్లినట్టుగా భావిస్తున్నారు. సాధారణంగా  ఇవి ప్రధానంగా ఆగ్నేయాసియా, ఇండోనేషియా, మలేసియా అడవుల్లో కనిపిస్తాయి. దీంతో అసలివి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు స్మగ్లింగ్ చేశారు అనే కోణంలో అధికారులు ముమ్మర విచారణ ప్రారంభించారు. ఈ కేసు విచారణలోని కీలక అంశాలు వెలుగు చూశాయి.

ఒరంగుటాన్‌లు లభించిన రాత్రి అడవి సమీపంలో తిరిగిన ఒక నల్లటి మహీంద్రా థార్ (Mahindra Thar) వాహనం సీసీటీవీ దృశ్యాలలో కనిపించింది. రాత్రి 11:25 గంటలకు వెళ్లి, తిరిగి 15 నిమిషాల తర్వాత ఆ వాహనం రావడంపై అధికారులు దృష్టి సారించారు.ఈ కేసు విచారణకు నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) రంగంలోకి దిగింది.

ఇదీ చదవండి: సీజేపీ ఉద్యమకారుడికి నోటీసులా? సీజేఐ సూర్యకాంత్‌ తీవ్ర ఆగ్రహం

 

మరోవైపు రక్షించిన ఒరంగుటాన్‌లను భువనేశ్వర్‌లోని నందన్‌కానన్ జూకి తరలించి క్వారంటైన్‌లో ఉంచారు. వీటి ఆరోగ్య పరిస్థితిని అటవీ శాఖ వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే జాతీయ వన్యప్రాణి నిపుణులను కూడా పిలిపించనున్నారు.

ఇదీ చదవండి: 'f' లెటర్‌ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్‌ఐఆర్‌ నోటీసు

అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక్కో ఒరంగుటాన్ విలువ సుమారు రూ. 20 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు ఉంటుందని ఒడిశా అటవీ శాఖ మంత్రి గణేష్ రామ్ సింగ్‌ఖుంటియా తెలిపారు. ఇవి విమాన, జల లేదా రైలు మార్గాల ద్వారా వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నామన్నారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, ఓడరేవుల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాలని వన్యప్రాణి నేరాల నిరోధక బ్యూరో (WCCB)ని మంత్రి కోరారు. <


ఇదీ చదవండి: ఆండ్రాయిడ్‌ డివైస్‌ ఆర్డర్‌ చేస్తే.. ఆవు పేడ వచ్చింది!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement