ఢిల్లీ మాజీ చీఫ్‌ సెక్రటరీ ఆత్మహత్మ, సూసైడ్‌ నోట్‌ | Ex Delhi Chief Secretary Rakesh Mehta Suicide At Noida Home | Sakshi
Sakshi News home page

ఢిల్లీ మాజీ చీఫ్‌ సెక్రటరీ ఆత్మహత్మ, సూసైడ్‌ నోట్‌

Sep 9 2026 12:14 PM | Updated on Sep 9 2026 12:19 PM

Ex Delhi Chief Secretary Rakesh Mehta Suicide At Noida Home

ఢిల్లీ మాజీ ప్రధాన కార్యదర్శి, 74 ఏళ్ల రాకేష్ మెహతా (Rakesh Mehta) నోయిడాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు.  1975 బ్యాచ్ IAS అధికారి అయిన మెహతా  దివంగత మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయాంలో పనిచేశారు. తన నిర్ణయానికి అనారోగ్యం ,మానసిక సమస్యలే కారణమని పేర్కొంటూ రాసిన ఒక లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 6న ఆయన మృతదేహం లభ్యమైంది. ఆదివారం నాడు ఆయన అంత్యక్రియలు జరిగాయి.

ఆయన ఢిల్లీ ప్రభుత్వంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కమిషనర్‌తో సహా వివిధ హోదాల్లో పనిచేశారు. 2007లో ఢిల్లీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, మూడేళ్లకు పైగా ఆ పదవిలో కొనసాగారు.   రాజధాని నగరంలో రవాణా, విద్యుత్ మరియు పౌర మౌలిక సదుపాయాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పదవీకాలంలోనే 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ విజయవంతంగా నిర్వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement