అయోధ్య తరహాలో మథుర-బృందావన్ రూపురేఖలను మార్చి అత్యంత రమణీయంగా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 1,051 కోట్ల ప్రణాళికను రూపొందిం. ఇందులో రూ. 540 కోట్ల విలువైన 62 ప్రాజెక్టులను ఇప్పటికే ప్రారంభించారు. మరో 167 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం విశేషం.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ. 1,051 కోట్ల విలువైన 229 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. కృష్ణాష్టమి పర్వదినాన శ్రీకృష్ణ జన్మభూమి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఈ భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.అయోధ్య, కాశీ తరహాలోనే మధుర-బృందావన్‌లో కూడా అత్యంత ఘనంగా ఆలయ సముదాయాలను నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మధుర 2.0:
మొత్తం రూ. 1,051 కోట్లలో ఇప్పటికే రూ. 540 కోట్ల విలువైన 62 ప్రాజెక్టులను ప్రారంభించగా, మరో రూ. 437 కోట్ల విలువైన 167 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా గృహ నిర్మాణ పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ. 72 కోట్లు నేరుగా బదిలీ చేశారు.ప్రాజెక్టుకేటాయించిన నిధులుప్రయోజనంబృందావన్‌కు 4-లేన్ల హైవేరూ. 251 కోట్లుయమునా ఎక్స్‌ప్రెస్ వే నుండి నేరుగా బృందావన్‌కు అనుసంధానం చేస్తారు. దీని వల్ల ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయని భావిస్తున్నారు.
యమునా నదిపై కొత్త వంతెన : 2-లేన్ల క్రాసింగ్ ద్వారా పాత వంతెనలపై భారం తగ్గింపు, గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా. 12 అంతస్తుల పర్యాటక హాస్టల్స్. 47 కోట్లు పండుగల సమయంలో (జన్మాష్టమి, హోలీ, రాధాష్టమి) వచ్చే భక్తుల కోసం వసతి సౌకర్యం.
ఛాతా మాస్టర్ ప్లాన్ రోడ్డు : రూ. 86 కోట్లు30 మీటర్ల వెడల్పుగల రోడ్డు ద్వారా భారీ వాహనాల మళ్లింపు, వాణిజ్య కార్యకలాపాల విస్తరణ.ఫ్లైఓవర్ & సౌందర్యీకరణరూ. 79 కోట్లుజాతీయ రహదారి (NH-19) నుండి బృందావన్ ప్రవేశ మార్గం ఆధునీకరణ (ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు, అండర్‌గ్రౌండ్ వైరింగ్).
12 అంతస్తుల పర్యాటక వసతి గృహం: నయారా పోలీస్ లైన్స్ క్యాంపస్‌లో రూ. 47 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇది, జన్మాష్టమి, హోలీ, రాధాష్టమి వంటి పండుగల సమయంలో నగరం యాత్రికులతో నిండిపోయే రద్దీని దృష్టిలో ఉంచుకుని నిర్మాణం.
బృందావన్‌లో ఒక పౌర శిక్షణా కేంద్రం: పరిశుభ్రత, స్మార్ట్ సేవలు , యాత్రికుల నిర్వహణపై మున్సిపల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చే ఈ కేంద్రం కోసం రూ. 31 కోట్లు కేటాయించారు.
ఇదీ చదవండి: సీజేపీ ఉద్యమకారుడికి నోటీసులా? సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం
దీంతో పాటు బృందావన్‌లో కొత్త రోప్‌వే , భారీ పార్కింగ్ ప్రాజెక్టులు.సూర్‌దాస్ బ్రజ్‌భాషా అకాడమీ , 400 ఎకరాల్లో విస్తరించే ఆసియాలోనే అతిపెద్ద సిటీ ఫారెస్ట్ సిద్ధం కానుంది. ఇంకా కొత్త హైవేలు, ఫ్లైఓవర్‌లు నిర్మానంకానున్నాయి. ఫలితంగా ఢిల్లీ, నోయిడా నుండి మధుర-బృందావన్‌లకు ప్రయాణ సమయం కేవలం రెండు గంటలకు తగ్గనుంది. ఆధ్యాత్మిక జీవన విధానాన్ని కోరుకునే వారికి, వారాంతపు పర్యాటకులకు బృందావన్ అత్యంత అనుకూలమైన కేంద్రంగా మారుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా రిటైర్మెంట్ హోమ్స్ నిర్మించనున్నారు.
ఇదీ చదవండి: 'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్‌ఐఆర్ నోటీసు
అయెధ్యలోరామమందిరి నిర్మాణంతో రామమందిరం సమీపంలో భూముల ధరలు భారీగా పెరిగాయి, పెట్టుబడిదారులు స్థలాలను దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారు.ఇప్పుడిక శ్రీకృష్ణుని జన్మభూమి అయిన ఈ ప్రాంతంలో కూడా అటువంటి మార్పునే తీసుకురావాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం, హోటళ్లు, సర్వీస్ అపార్ట్‌మెంట్లు, గెస్ట్ హౌస్‌లకు డిమాండ్ పెరుగుతుంది.
ఇదీ చదవండి: ఆ ఒరంగుటాన్‌లు ఎక్కడివి? అనుమానాస్పదంగా మహీంద్ర బ్లాక్ థార్


