పూనావాలా ‘అంకుల్’ నా జోలికి రావొద్దు.. రియా కౌంటర్‌ | Shehzad Poonawalla counters Riya Ahir uncle jibe | Sakshi
Sakshi News home page

పూనావాలా ‘అంకుల్’ నా జోలికి రావొద్దు.. రియా కౌంటర్‌

Sep 9 2026 5:42 PM | Updated on Sep 9 2026 7:26 PM

Shehzad Poonawalla counters Riya Ahir uncle jibe

న్యూఢిల్లీ: నీట్ లీకేజీ ఆందోళనల్లో వర్షంలో పోలీస్ వ్యాన్‌ను అరచేతితో అడ్డుకుని రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన రియా అహిర్, ఇటీవల ‘బిగ్ బాస్ 20’షోలోకి అడుగుపెట్టలేకపోవడం చర్చాంశనీయంగా మారింది. షో నిర్వాహకులు రియా అహిర్, పంజాబీ నటి లవ్ గిల్ మధ్య నిర్వహించిన ఆడియన్స్ పోలింగ్‌లో లవ్ గిల్ విజయం సాధించడంతో రియా అవకాశాన్ని కోల్పోయారు.

హీరో, విలన్ కొట్టుకుని కమెడియన్‌ను చంపేసినట్లు.. ఒకవైపు పూనావాలా, రాహుల్ గాంధీల మధ్య రాజకీయం నడుస్తుంటే, ఈ గొడవలో బిగ్ బాస్ ఛాన్స్ మిస్సయ్యి రియా అహిర్ బలైపోయారనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తోంది

ఈ పరిణామంపై మాజీ బీజేపీ నేత, రాజకీయ విశ్లేషకుడు షెహజాద్ పూనావాలా స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఆందోళనల ద్వారా రియా వైరల్ కావడం యాదృచ్ఛికం కాదని, దాని వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ, రాజ్ థాకరే వంటి నేతల మద్దతుతో మోదీ వ్యతిరేక ఎజెండాను బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకెళ్లాలని ఆమె ప్లాన్ చేశారు. అయితే, 99 ఎన్నికల్లో ఓడిపోయి కాంగ్రెస్‌కు విజయం అందించలేని రాహుల్ గాంధీ మీకు ఆన్‌లైన్ మద్దతు ఎలా ఇవ్వగలరు?’ అని పూనావాలా ఎద్దేవా చేశారు.

పూనావాలా విమర్శలపై రియా అహిర్ రెండు వీడియోల ద్వారా ఘాటుగా స్పందించారు. పూనావాలాను ‘అంకుల్’ అని సంబోధిస్తూ, తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హితవు పలికారు. చిన్న వయసున్న అమ్మాయిలను టార్గెట్ చేయడం మాని, తన ఈడువారితో రాజకీయాలు చేయాలని సవాల్ విసిరారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు వాడే పాత, డొల్ల స్క్రిప్ట్ లాంటివేనని ఎద్దేవా చేశారు.

తాను భారత సైన్యాన్ని కానీ, ఏ ఇతర వ్యవస్థను కానీ ఎప్పుడూ అవమానించలేదని స్పష్టం చేశారు. బిగ్ బాస్ లాంటి ఎంటర్‌టైన్‌మెంట్ షోలలోకి రాజకీయాలు, మతాలను లాగడం సరైనది కాదని హితవు పలికారు. ప్రస్తుతం ఈ పొలిటికల్, ఎంటర్‌టైన్‌మెంట్ వార్ నెట్టింట వైరల్ అవుతోంది.

👉ఇదీ చదవండి : మోదీ వీరాభిమాని ఆస్తులెంతో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement