గ్రేటర్ నోయిడాలో ఆన్‌లైన్ మోసానికి సంబంధించిన ఉదంతం ఒకటి వైరల్‌గా మారింది. ఆండ్రాయిడ్ ఫోన్ ఆర్డర్ చేస్తే పార్శిల్‌లో పేడ వచ్చిన దారుణమైన ఆన్‌లైన్ మోసం వెలుగులోకి వచ్చింది.
ఆకాష్ నగర్ అనే వ్యక్తి తన పని కోసం కొద్ది రోజుల క్రితం ఒక ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా రూ. 1,999 విలువైన ఆండ్రాయిడ్ పరికరాన్ని ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసే సమయంలోనే ఆన్‌లైన్ ద్వారా పూర్తి నగదు చెల్లింపు కూడా చేశారు. అయితే సోమవారం సాయంత్రం 5:00 గంటలకు కొరియర్ ద్వారా పార్శిల్ ఇంటికి చేరుకుంది. ఉత్సాహంగా ఆ బాక్స్‌ను తెరిచిన ఆకాష్‌కి ఒక్కసారిగా షాక్ తగిలింది. అందులో ఉండాల్సిన ఎలక్ట్రానిక్ పరికారానికి బదులుగా ఆవు పేడ (ఎరువు) ప్యాకెట్ కనిపించడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఇదీ చదవండి: 'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్‌ఐఆర్ నోటీసు
దీంతో మోసపోయానని గ్రహించిన ఆకాష్ వెంటనే స్థానిక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆర్డర్ చేసిన వెబ్‌సైట్ వివరాలు, పేమెంట్ ట్రాన్సాక్షన్ డేటా, కొరియర్ డెలివరీ చైన్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ग्रेटर नोएडा | गजब का फ्रॉड! ऑर्डर किया Android डिवाइस, पैकेट से निकला गोबर!
देखिए पूरा वीडियो - https://t.co/UTRPvCWML4#noida #onlinefraud #dainikbhaskarup #dainikbhaskar pic.twitter.com/mHEzmSuw3v— Dainik Bhaskar UP (@dainikbhas32934) September 9, 2026
ఆన్‌లైన్ షాపింగ్ పేరిట నమోదవుతున్న మోసాలకు సంబంధించి ఇదే మొదటి సంఘటన కాదు. అందుకే ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం అధికారిక, గుర్తింపు పొందిన వెబ్‌సైట్ల నుంచే వస్తువులను కొనుగోలు చేయాలని, ముఖ్యంగా థర్డ్ పార్టీ విక్రేతల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: రీల్స్‌తో పరువు తీస్తోందని కన్నతండ్రే కొడుకుతో కలిసి!


