ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం’.
ఈ సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ని తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.
మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్, నిర్మాతలు కేఎల్ దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ అతిథులుగా పాల్గొన్నారు.


