'f' లెటర్‌ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్‌ఐఆర్‌ నోటీసు | Bharat Ratna scientist Prof CNR Rao gets SIR notice over name mismatch | Sakshi
Sakshi News home page

'f' లెటర్‌ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్‌ఐఆర్‌ నోటీసు

Sep 9 2026 1:08 PM | Updated on Sep 9 2026 2:08 PM

Bharat Ratna scientist Prof CNR Rao gets SIR notice over name mismatch

నకిలీ ఓట్లను, చొరబాటుదారులను ఏరివేసి పేరుతో భారత ఎన్నికల కమిషన్‌ దేశవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR - ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియ రాజకీయంగా, న్యాయపరంగా తీవ్ర వివాదాలకు దారితీసింది. ఒక్కో రోజు ఒక్కో వింత సంఘటన వెలుగులోకి వస్తోంది. తాజాగా ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, భారత రత్న గ్రహీత ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు Chintamani Nagesa Ramachandra Rao (92)కు కర్ణాటక SIR నుంచి నోటీసు అందింది. ఓటర్ల జాబితాలో ఆయన పేరు వద్ద నమోదైన అక్షర దోషం (Spelling Discrepancy) కారణంగా ఈ నోటీసు జారీ కావడంపలువుర్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.  

"Self-name mismatch" (పేరు వ్యత్యాసం) కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి. గతంలో (2002) వివరాలకు, ప్రస్తుత ఓటర్ల జాబితా వివరాలకు వ్యత్యాసం ఉన్నప్పుడు ఈ నోటీసు జారీ చేస్తారు. పాత ఓటర్ల జాబితాలో ఆయన పేరు "Prof CNR Rao" అని ఉండగా, ప్రస్తుత ఓటర్ల జాబితాలో "Prof" స్థానంలో అదనంగా ఒక 'f' చేరి "Proff CNR Rao"గా నమోదైంది. తన గురింపును నిరూపించుకోవడానికి బెంగళూరులోని మల్లేశ్వరం వద్ద జరగనున్న విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సూచించారు.

ఇదీ చదవండి: రీల్స్‌తో పరువు తీస్తోందని కన్నతండ్రే కొడుకుతో కలిసి!

ఎవరి ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు 
భారత అత్యున్నత పౌర పురస్కారమైన 'భారత రత్న' పొందిన మూడో శాస్త్రవేత్త. అంతేకాదు ఆయనకు పద్మశ్రీ, పద్మవిభూషణ్, కర్ణాటక రత్న పురస్కారాలు కూడా అందుకున్నారు. సాలిడ్-స్టేట్ అండ్‌  స్ట్రక్చరల్ కెమిస్ట్రీలో సీఎన్‌ఆర్‌ రావు విశేష పరిశోధనలు చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) అధిపతిగా, జవాహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (JNCASR) వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవలందించారు. అలాగే రాజీవ్ గాంధీ, హెచ్.డి. దేవేగౌడ, ఐ.కె. గుజ్రాల్, మన్మోహన్ సింగ్‌ లాంటి మాజీ ప్రధాన మంత్రుల హయాంలో సైంటిఫిక్ అడ్వైజరీ కౌన్సిల్ అధ్యక్షుడిగా, సభ్యుడిగా దేశ సైన్స్ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.

ఇదీ చదవండి: ఢిల్లీ మాజీ చీఫ్‌ సెక్రటరీ ఆత్మహత్మ, సూసైడ్‌ నోట్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement