6 రోజుల్లొ 100 రెస్క్యూ ఆపరేషన్లు: ఎవరీ ప్రియా అధికారి? | Meet Priya Adhikari, Nepal First Female Rescue Helicopter Captain Who Became A Lifeline During Devastating Floods, Watch Video | Sakshi
Sakshi News home page

6 రోజుల్లొ 100 రెస్క్యూ ఆపరేషన్లు: ఎవరీ ప్రియా అధికారి?

Sep 1 2026 3:10 PM | Updated on Sep 1 2026 3:42 PM

Meet Priya Adhikari Nepal first woman helicopter captain

Priya Adhikari నేపాల్‌ దేశంలోనే తొలి మహిళా రెస్క్యూ హెలికాప్టర్ కెప్టెన్ ప్రియా అధికారి (40) నేపాల్‌ విలయంలో ఎంతోమంది పాలిట ఆపద్బాంధవురాలిగా నిలిచారు. దేశంలోనే  ఏకైక మహిళా రెస్క్యూ హెలికాప్టర్ పైలట్‌గా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ఆమె, నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భీకర వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యల్లో  సమయస్ఫూర్తితో వందలాదిమందికి ప్రాణ భిక్ష పెట్టి తన ప్రత్యేకతను  చాటుకున్నారు. దీంతో ప్రియా అధికారి పేరు ఇపుటు నెట్టింట మారు మోగిపోతోంది.

హిమాలయాలలో గాలింపు, సహాయక చర్యల్లో రోజుల తరబడి తలమునక లవుతూ తన నిబద్ధతను చాటుకున్నారు. వారం రోజుల్లో ప్రియా అధికారి దాదాపు 100 రెస్క్యూ మిషన్లు నిర్వహించి వందలాది మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీవ్ర అలసట ఉన్నప్పటికీ తామున్నది దీని కోసమే అంటూ ప్రమాదకర పరిస్థితులను కూడా లెక్క చేయకుండా బాధితుల కోసం ముందుకు సాగడం  విశేషం.

భయంకర పరిస్థితులు: రెస్క్యూ ఆపరేషన్లు
2015లో నేపాల్‌లో వచ్చిన భారీ భూకంపం కంటే ఈ వరదల తీవ్రత ఎక్కువగా ఉందని ప్రియా తెలిపారు. ఐదు జలవిద్యుత్ ప్రాజెక్టులు, అనేక గ్రామాలు కొట్టుకుపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రసువా జిల్లాలోని తిమురే (Timure) గ్రామంలో బురద ఎక్కువగా ఉండటంతో ఇంజిన్ ఆపకుండానే (రన్నింగ్ పవర్‌పై) హెలికాప్టర్లను ల్యాండ్ చేస్తూ అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఆమె బాధితులను రక్షించారు. ఈ విపత్తు తీవ్రత తన ఎత్తైన ప్రదేశాలలో సహాయక చర్యల అనుభవాన్ని సైతం పరీక్షించిందని ఆమె ఒక మీడియా ఇంటర్వ్యూలో  పేర్కొనడం ఈ వరద ముప్పు తీవ్రతకు అద్దం పడుతుంది. ఈ  ప్రమాదంలో ఇప్పటివరకు 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గల్లంతయ్యారు.

ఇదీ చదవండి: కుమార్తెల చదువు కోసం ఓ తల్లి తెగింపు...చెప్పుల్లేకుండానే!

 

ఎవరీ ప్రియా అధికారి?
ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ చదివి, ఐదేళ్లపాటు క్యాబిన్ క్రూగా పనిచేసిన ఆమె ఫిలిప్పీన్స్‌లో శిక్షణ పొంది 2017లో ఫుల్-టైమ్ పైలట్‌గా మారారు.  హిమాలయాలలో, మౌంట్ ఎవరెస్ట్‌పై గాయపడిన పర్వతారోహకులను రక్షించడంతో సహా అనేక సహాయక మిషన్లలో పాల్గొన్నారు.దాదాపు 6,200 మీటర్ల ఎత్తు వరకు వెళ్లి క్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం ఆమెకు ఉంది. మహిళలు హెలికాప్టర్ కెప్టెన్ కాలేరనే అపనమ్మకాలను పటాపంచలు చేస్తూ నేపాల్ మొదటి మహిళా హెలికాప్టర్ కెప్టెన్‌గా ఆమె రికార్డు సృష్టించారు.  హెలికాప్టర్‌లో ఆనందకరమైన ప్రయాణం చేసే అవకాశం లభించిందని ఒక సందర్భంలో వెల్లడించారు. ఆ టేకాఫ్ సమయంలో తాను పొందిన ఉత్సాహమే, దీన్ని వృత్తిగా ఎంచుకోవడానికి తనను ప్రోత్సహించిందని కూడా తెలిపారు. 

ఇదీ చదవండి: లక్షల్లో జీతం, హెచ్‌1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement