దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద బుధవారం ఉదయం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.
తన తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు.
ఈ ప్రార్థనల్లో వైఎస్సార్ సతీమణి విజయమ్మ, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్‌ను స్మరించుకుంటూ వైఎస్ జగన్ భావోద్వేగానికి లోనయ్యారు.


