లక్షల్లో జీతం, హెచ్‌1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు? | Woman With H-1B Visa 6 Figure Salary Leaves US To Return To Gurugram | Sakshi
Sakshi News home page

లక్షల్లో జీతం, హెచ్‌1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు?

Sep 1 2026 11:47 AM | Updated on Sep 1 2026 12:02 PM

Woman With H-1B Visa 6 Figure Salary Leaves US To Return To Gurugram

ఆరంకెల జీతం, హెచ్‌1-బీ వీసా కలలతో అమెరికాకు ఎగిరిపోయే భారతీయులకు ఈ కల సాకారమైనాక ఇక లైఫ్‌ సెట్‌ అనుకుంటారు. కానీ ఒక భారత సంతతి మహిళ అలా అనుకోలేదు. వాటన్నింటినీ వదులుకుని మాతృదేశానికి తిరిగి వచ్చేయాలని  నిర్ణయించుకుంది. ఎందుకో  తెలుసా?

'బిజినెస్ ఇన్‌సైడర్' అందించిన వివరాల ప్రకారం 28 ఏళ్ల దిశా లాంబా, 2021లో న్యూయార్క్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికాకు వెళ్లింది. అక్కడ విజయ వంతమైన కెరీర్‌ను నిర్మించుకుని, 2024లో CVS హెల్త్‌లో డేటా సైంటిస్ట్ ఉద్యోగాన్ని పొందింది. ఆరెంకల భారీ వేతనంతో కూడిన ఉద్యోగం. H-1B వీసా లాటరీ ప్రక్రియలోనూ విజయం సాధించింది. కానీ తన కుటుంబానికి దగ్గరగా ఉండటంతో పాటు,మారుతున్న పరిస్థితుల రీత్యా వాటన్నింటినీ వదులుకోవాలని నిర్ణయించుకుంది.

ఒంటరితనం, అమెరికా సమయానికి అనుగుణంగా ఇండియాలోని తల్లిదండ్రులతో మాట్లాడాల్సి రావడం ఆమెను మానసికంగా ఇబ్బందికి గురి చేసినట్టు  ఆమె వెల్లడించారు. H-1B వీసా పొందినప్పటికీ ఉద్యోగం మారడం, ఇతర ఆదాయ మార్గాలు (Side hustles) వెతుక్కోవడం, ప్రయాణాలు లేదా కెరీర్ గ్యాప్ తీసుకోవడం H-1B నిబంధనల వల్ల చాలా కష్టంతో కూడుకున్నవి కావడం కూడా ఆమె నిర్ణయానికి ఊతమిచ్చాయి.

ఇదీ చదవండి: రూ. 15 లక్షల కారు, 70 తులాల గోల్డ్‌ : అయినా కట్నదాహానికి టీచర్‌ భువనేశ్వరి ఆహుతి

2026 మేలో ఉద్యోగానికి రాజీనామా చేసి గురుగ్రామ్‌లోని తన తల్లిదండ్రుల వద్దకు తిరిగొచ్చేశారు. ప్రస్తుతం ఒక చిన్న కెరీర్ బ్రేక్ తీసుకుని, భారతదేశంలోనే కొత్త అవకాశాలు లేదా స్వంతంగా వ్యాపారం ప్రారంభించే యోచనలో ఉన్నారు.  

H-1B వీసాలపై కొత్త ప్రతిపాదనలప్రకారం, అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) H-1B వీసాలకు సంబంధించి కొన్ని కఠినమైన మార్పులను ప్రతిపాదించింది:   H-1B వీసా  ఫీజు పెంచే ప్రతిపాదనతోపాటు.  గ్రేస్ పీరియడ్ రద్దచేయాలని భావిస్తోంది. దీంతో  ఉద్యోగం కోల్పోయిన H-1B హోల్డర్లకు ఇచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగిస్తారు.అలాగే H-1B వీసాదారుల జీవిత భాగస్వాములకిచ్చే  (H-4 వీసా) ఇచ్చే పని అనుమతులను రద్దు చేసే ప్రతిపాదన కూడా ఉంది. ఈ నిబంధనలు ఎక్కువ మంది భారతీయ కుటుంబాలపై ప్రభావం చూపుతున్నాయి. 

ఇదీ చదవండి: 12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్‌బై చెప్పిన ‘నేషనల్‌ క్రష్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement